క్షుద్రపూజల పేరుతో బాలికను బలిచ్చే యత్నం
రాజమండ్రి: మూఢ నమ్మకాల ముసుగులో ఓ ఐదేళ్ల బాలికను కొందరు అన్యాయంగా బలి తీసుకునే ప్రయత్నం చేశారు. రాజమండ్రి సైక్లోన్ కాలనీలో శనివారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత ఆరుగురు వ్యక్తులు క్షుద్రపూజలు చేస్తూ బాలికను బలిచ్చేందుకు సిద్ధమయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలికను కాపాడి నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.