ఫ్యాషన్‌కి వయసు అడ్డంకి కాదంటే ఇదే..! లెజండరీ గ్రానీ స్టిల్స్ అదుర్స్..
ఇటీవల విశ్వ సుందరి పోటీల్లో అందానికి అర్థం మారుతుందన్నట్లుగా విజేతలను నిర్ణయించారు నిర్వాహకులు. అందులో పాల్లొన్న అందాల బామ్మలు కూడా మచ్చలేని శరీరమే సౌందర్యం కాదని ఆత్మవిశ్వాసమే అసలైన అందమని చాటిచెప్పేలా పాల్గొని అందర్ని ఆశ్చర్యపరిచారు. అలానే ప్రస్తుతం ఫ్యాషన్ అంటే కాలేజ్ యువత మాత్రమే ట్రెండ్ సెంట్ చేస్తారనుకుంటే పొరపాటే. క్రియేటివిటీ, అభిరుచి ఉంటే వయసు పెద్ద అడ్డంకి కాదని ప్రూవ్ చేసింది ఎనిమిపదుల గ్రానీ. రెస్ట్ తీసుకునే వయసులో సరికొత్త ట్రెండ్ సృష్టించి ఔరా..! అని ప్రశంలందుకుంటోంది ఈ బామ్మ. ఇంతకీ ఎవరామె అంటే..జాంబియాలోని ఓ గ్రామానికి చెందిన 85 ఏళ్ల మార్గరెట్ చోలా అనే బామ్మకు ఫ్యాషన్ ఐకానిక్‌గా స్టార్డమ్ తెచ్చుకుంది. అందుకు సోషల్ మీడియానే కారణం. సరదాగా గ్రానీ సిరీస్ 'లెజండరీ గ్లామా'లో నటించింది. అందులో ఆమె వివిధ రకాల ఫ్యాషన్ గెటప్‌లతో ప్రేక్షకులను అలరించింది. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు ప్రపంచమంతటా మారు మ్రేగిపోయింది. పైగా ఇన్‌స్టాగ్రామ్‌లో విపరితీమైన ఫాలోయింగ్ కూడా వచ్చేసింది. ఆమె మనవరాలు డయానా కౌంబానే దీనంతటికీ కారణం. ఈ బామ్మ తన హై ఫ్యాషన్ వార్డ్ రోబ్‌తో సోషల్ మీడియాలో దాదాపు లక్షకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. మొదట్లో ఇబ్బంది పడ్డ ఆ తర్వాత ఆ ఆధుని ఫ్యాషన్ డ్రెస్‌లకు అలవాటు పడిపోయింది బామ్మ చోలా. డ్రెస్సింగ్ నుంచి హెయిర్ స్టైల్ వరకు ప్రతిదాంట్లోనూ ప్రత్యేక కేర్ తీసుకుంటుంది మనవరాలు కౌంబా. ఆమె కారణంగానే ఇంత అందంగా కెమెరాకు ఫోజులిస్తోంది ఈ ఎనభై ఐదేళ్ల బామ్మ. అంతేకాదండోయ్..టీ షర్ట్స్, జీన్స్ వేసినప్పుడు చక్కటి లుక్ కోసం చేతి గోర్లు కూడా పెంచుతోందట. ఇంతకముందు తన జీవితం ఎలా సాగిందనేది అంత గుర్తు లేదు. కానీ ఇప్పుడు తన మనవరాలి పుణ్యమా అని.. సరొకొత్త రూపంతో మీ ముందుకు వస్తుంటే అసలు జీవితం అంటే ఇది కదా..! అనిపిస్తోంది. కొత్తదనంతో అందంగా మలుచుకోవడమే లైఫ్ అని అంటోంది ఈ బామ్మ. అంతేగాదు ఆమె నటించిన సిరీస్ కూడా.. "మాకు కూడా కొన్ని కోర్కెలు ఉంటాయి..మేము కూడా ప్యాషన్‌కి తీసిపోం అనిపించేలా సీనియర్ సిటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేగాదు ఆ సిరీస్‌లో.. నలుగురు మనవరాళ్లు తమ గ్రానీలను అందంగా తీర్చిదిద్దే పనిని ఈ స్టైలిష్ బామ్మకు అప్పగించితే.. ఆమె ఎలా ట్రెండ్ సెట్ చేస్తుందనేది ప్రధాన ఇతివృత్తం. ఏదీఏమైన ఈ ఏజ్‌లో ఇలా ఫ్యాషన్‌గా తయారవ్వడం అంటే మాటలు కాదు. పైగా తన సరికొత్త రూపంతో అందరికీ ప్రేరణ కలిగించి, ఆదర్శంగా నిలిచింది బామ్మ చోలా. View this post on Instagram A post shared by Dee (@thevintagepoint_) (చదవండి: వర్క్ లైఫ్ బ్యాలెన్స్: ఏ సంస్థ లేదా కార్యాలయం అలాంటి ఆఫర్ ఇవ్వదు..!)