fayaz
-
ఇంటి యజమాని కొడుకుతో వివాహేతర సంబంధం.. భర్తకు తెలిసి
సాక్షి, నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రం నిర్మల్‌లో గురువారం సంచలనం సృష్టించిన జుబేర్‌ఖాన్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని డీఎస్పీ ఉపేంద్రరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక పట్టణ పోలీసుస్టేషన్లో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని గాజులపేటకు చెందిన ముంతాజ్‌ఖాన్ నివాసంలో మహమ్మద్ ఫయాజ్(40) తన రెండో భార్యతో అద్దెకు ఉంటూ పాల వ్యాపారం చేస్తున్నాడు. వీరికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అద్దె ఇంటి యజమాని ముంతాజ్‌ఖాన్ పెద్ద కుమారుడు జుబేర్‌ఖాన్(22) ఫయాజ్ రెండో భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో ఫయాజ్ పలుమార్లు జుబేర్‌ను మందలించాడు. సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ఉపేంద్రరెడ్డి వారి ఇంటిని ఖాళీ చేసి సమీపంలోని గంజ్‌బక్ష్ ఏరియాలో అద్దెకు తీసుకున్నాడు. అయినా జుబేర్ ప్రవర్తనలో మార్పు రాలేదు. పలుమార్లు పెద్దలతో చెప్పించినా, ఆయన సిమ్‌కార్డు తీసుకున్నా.. అలాగే కొనసాగించాడు. భార్య, పిల్లలు తనకు దక్కరని ఫయాజ్ భావించాడు. జుబేర్‌ను చంపేందుకు నిర్ణయించుకున్నాడు. ఐదురోజుల క్రితమే భార్యాపిల్లలను హైదరాబాద్‌లో ఉంటున్న తన తల్లి వద్దకు పంపించాడు. తన భార్య టైలర్ కత్తెర తీసుకొని స్కూటీలో పెట్టుకున్నాడు. గురువారం సాయంత్రం స్థానిక బైల్‌బజార్ దాటిన తర్వాత పెట్రోల్‌బంక్ వద్ద జుబేర్‌ను చూశాడు. మాట్లాడేది ఉందంటూ పెట్రోల్ బంకు పక్కన గల రాయల్ ట్రాన్స్పోర్ట్ ముందుకు తీసుకెళ్లాడు. చదవండి: (Hyderabad: అపార్ట్మెంట్లో వ్యభిచారం.. పోలీసుల దాడి) తన భార్యతో సంబంధం వదులుకోవాలని ఎంత హెచ్చరించినా జుబేర్ వినలేదని, కోపోద్రిక్తుడైన ఫయాజ్ తన వెంట తెచ్చుకున్న కత్తెరతో ముందుగా జుబేర్ గొంతు కోశాడని డీఎస్పీ తెలిపారు. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే గుండెలో, కడుపులో విచక్షణారహితంగా పొడిచి చంపాడని, అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడని వివరించారు. సమావేశంలో పట్టణ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు ఉన్నారు. -
అంతర్జాతీయ స్మగ్లర్ ఫయాజ్ అరెస్ట్
కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఫయాజ్ షరీఫ్ అలియాస్ ఫయాజ్ అలియాస్ ఫయో (40)ను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో 61 కేసులు నమోదయ్యాయి. ఇన్నాళ్లూ పోలీసుల కళ్లుగప్పి యథేచ్ఛగా స్మగ్లింగ్ సాగించాడు. వీరపునాయునిపల్లె మండలం వేముల-పులివెందుల రహదారిలో ఈ నెల 12న పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి.. రూ.రెండు కోట్ల విలువైన నాలుగు టన్నుల బరువుగల 178 ఎర్రచందనం దుంగలు, ఐదు కార్లు, మూడు వ్యాన్లు, రూ. 12 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఘటన వివరాలను మంగళవారం జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్ గులాటీ మీడియాకు వివరించారు. ఆయన కథనం మేరకు.. ఢిల్లీకి చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ బద్రుల్ హసన్ అలియాస్ హసన్ భాయ్‌కి ఫయాజ్ ప్రధాన అనుచరుడు. ఇతని స్వస్థలం బెంగళూరు రూరల్ జిల్లా హోస్కోట తాలూకా కటిగెనహళ్లి. యుక్త వయసు నుంచే కటిగెనహళ్లికి చెందిన స్మగ్లర్ నజీర్‌కు సహాయకుడిగా ఉన్నాడు. కొంత కాలం తర్వాత అతనితో గొడవపడి ఇతర స్మగ్లర్లు ఫైరోజ్ ఖాన్, తబ్రేస్ ఖాన్‌లతో కలిసి స్మగ్లింగ్ మొదలుపెట్టాడు. ఇతనికి చైనా, దుబాయ్, సింగపూర్ తదితర ఆసియా దేశాల్లోని స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయి. పండ్లు, కూరగాయల మాటున కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ముంబయికి ఎర్రచందనం దుంగలను తరలించేవాడు. ఇతనికి బెంగళూరులో నాలుగు అపార్ట్మెంట్లు, కటిగెనహళ్లిలో 10 ఇళ్లు, 15 ఎకరాల భూమి ఉంది. రూ.20 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. ఇటీవల అరెస్ట్ అయిన స్మగ్లర్లు ఇచ్చిన సమాచారం మేరకు ఇతని కదలికలపై నిఘా ఉంచి ప్రత్యేక పోలీసు బృందం పట్టుకుంది. జిల్లా పోలీసులు ఫయాజ్ను అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. -
ప్రాణం తీసిన ఈత సరదా
హయత్‌నగర్ (రంగారెడ్డి జిల్లా): స్నేహితులతో కలిసి ఈతకెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పెద్దఅంబర్‌పేట గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఫయాజ్ (13) తన స్నేహితులతో కలిసి ఆదివారం ఈతకెళ్లాడు. అయితే, ఈతకెళ్లిన ఫయాజ్ ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి మృతి చెందాడు. ఈ సమాచారాన్ని స్నేహితులు తల్లిదండ్రులకు అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని డ్యాంలో నుంచి వెలికితీశారు. అనంతరం పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.