స్నేహితులతో కలిసి ఈతకెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి మృతి చెందాడు.
హయత్‌నగర్ (రంగారెడ్డి జిల్లా): స్నేహితులతో కలిసి ఈతకెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పెద్దఅంబర్‌పేట గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఫయాజ్ (13) తన స్నేహితులతో కలిసి ఆదివారం ఈతకెళ్లాడు.
అయితే, ఈతకెళ్లిన ఫయాజ్ ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి మృతి చెందాడు. ఈ సమాచారాన్ని స్నేహితులు తల్లిదండ్రులకు అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని డ్యాంలో నుంచి వెలికితీశారు. అనంతరం పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.