Feels
-
అప్పుడు బాధపడతా
‘సంతోషం, నువ్వే నువ్వే, ఠాగూర్’ వంటి చిత్రాల్లో నటించి వెండి తెరపైకి వచ్చిన తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు హీరోయిన్ శ్రియ. ఆ తర్వాత ‘ఛత్రపతి, దేవదాసు, శివాజీ’ వంటి హిట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ హీరోయిన్గా దాదాపు 16ఏళ్ల కెరీర్‌ను కంప్లీట్ చేశారు. ఇన్నేళ్ల జర్నీలో ఫ్లాప్ అయిన సినిమాల గురించి మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అన్న ప్రశ్నను శ్రియ ముందు ఉంచితే– ‘‘నా సినిమాలు సరిగ్గా ఆడనప్పుడు నేను నిరుత్సాహపడలేదు అని చెబితే అది అబద్ధం అవుతుంది. ఫెయిల్ అయిన కొన్ని సినిమాలు కెరీర్‌పై కూడా బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకే ఫెయిల్యూర్ సినిమాకి చాలా ఫీలవుతాను. సినిమా ఫీల్డ్‌లో తప్పులను కరెక్ట్ చేసుకోవడం కష్టం. పుస్తకాలను ఎంచుకున్నంత బాగా నేను స్క్రిప్ట్స్‌ను సెలక్ట్ చేసుకోలేను. అలాగే నాకు బాగా కనెక్ట్ అయిన వారితోనే నేను ఎక్కువగా సినిమాలు చేస్తుంటాను’’ అని చెప్పుకొచ్చారు శ్రియా. ప్రస్తుతం ఆమె చే సిన సినిమాల విషయానికొస్తే సౌత్‌లో ఆమె నటించిన ‘నరగాసురన్, వీరభోగ వసంతరాయలు’, హిందీలో ‘తడ్కా’ మూవీస్ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ కొశ్చివ్‌తో శ్రియ ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. -
నాగ్ ఆ శుభవార్త చెప్పేశారు
ముంబై: టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున తన ఇద్దరు తనయుల పెళ్లి వార్తలపై స్పందించారు. త్వరలో కుటుంబంలో రెండు పెళ్లిళ్లు ఉంటాయంటూ హింట్ ఇచ్చారు. యంగ్ హీరోలు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ వారి జీవిత బాగస్వాములను ఎన్నుకోవడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే తమ ఇద్దరు కుమారుల పెళ్లి కబురు ఉండొచ్చునని నాగ్ తెలిపారు. వారిద్దరూ నచ్చిన జీవిత భాగస్వాములను నిర్ణయించుకోవడం తనకు, సతీమణి అమలకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన చేస్తామని ఆయన తెలిపారు. నాగార్జున ఈ ముచ్చట్లను తాజాగా ఓ వార్త సంస్థతో షేర్ చేసుకున్నారు. కాగా చిన్న కుమారుడు అఖిల్ నిశ్చితార్థం పుకార్లపై నాగ్ స్పందించారు. అఖిల్ కి ఇంకా నిశ్చితార్థం కాలేదని తేల్చి పారేశారు. తమ కుమారులు వాళ్ల జీవితాల్లోని ముఖ్యమైన ఘట్టాల గురించి వారు చెబితేనే సబబుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇద్దరూ వారి బాధ్యతల్లో బిజీగా వున్నారన్నారు. ఆ అపురూపమైన ఈవెంట్ ను వాళ్లిద్దరు ఎపుడు నిర్ణయించుకుంటే అపుడే ముహూర్తం ఖరారు అవుతుందని చెప్పారు. కాగా నాగ చైతన్య ఓ ప్రముఖ హీరోయిన్ ప్రేమించుకున్నారని, అందుకు చైతు ఇంట్లో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక అఖిల్ ... ఫ్యాషన్ డిజైనర్ శ్రీయా భూపాల్‌తో తనకున్న అనుబంధాన్ని ఇటీవలే రివీల్ చేశాడు. -
ఫేస్ బుక్ లో కాక పుట్టిస్తున్న'హాకా'!
ప్రపంచ దేశాల్లో పెళ్ళిళ్ళ సందర్భంలో అనేక సాంప్రదాయాలు కొనసాగుతూ ఉంటాయి. సుమారుగా ప్రతి సంప్రదాయ పద్ధతిలోనూ అక్కడి వేడుకలో ఉత్సాహాన్ని నింపడం కనిపిస్తుంటుంది. ఒక్కోసారి అక్కడి సన్నివేశాలు ఉద్వేగాన్ని కూడ నింపుతుంటాయి. అటువంటి వివాహ సందర్భంలో తీసిన వీడియో ఇప్పుడు ఫేజ్ బుక్ లో హల్ చల్ చేస్తోంది. రెండు రోజుల క్రితం పోస్టు చేసిన ఆ వీడియో ఇప్పటివరకూ సుమారు కోటీ అరవై లక్షలమందిని ఆకట్టుకుంది. న్యూజిల్యాండ్ లో వివాహ వేడుక సమయంలో ఉత్సాహంగా నిర్వహించే సంబరాల్లో సంప్రదాయ నృత్యం 'హాకా' ఒకటి. బంధు మిత్రులంతా కలసిన వేళ.. నిర్వహించిన ఆ వార్ డ్యాన్స్ సన్నివేశం ఇప్పుడు ఫేస్ బుక్ వినియోగదారులను లక్షలమందిని అమితంగా ఆకట్టుకుంది. ఎందరో హృదయాలను దోచిన ఆ హాకా డ్యాన్స్ వీడియో... బెన్, అలియా ఆమ్ స్ట్రాంగ్ ల పెళ్ళి సందర్భంలోనిది. వధూవరులు.. దంపతులైన వేళ న్యూజిల్యాండ్ సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులంతా కలసి ఉత్సాహంగా హాకా డ్యాన్స్ చేస్తారు. ఇలా నిర్వహించే సంప్రదాయ నృత్యాన్ని ఆ కుటుంబ గౌరవానికి చిహ్నంగా చెప్తారు. ఈ వేడుకలో పెళ్ళి కొడుకుతోపాటు అతని పెద్దన్న కార్యక్రమానికి నాయకత్వం వహించారు. పాటలకు లయబద్ధంగా అడుగులు కలుపుతూ సంప్రదాయ పద్ధతిలో చేసే ఆ నృత్యం.. అక్కడి వారిని భావోద్వేగానికి లోను చేసింది. హాకా డ్యాన్స్ సమయంలో సందర్భానుసారంగా పాడే పాటలు... విన్నవారు సైతం కన్నీరు పెట్టకున్నారు. ఉత్సాహంగా అంతా కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ఉద్వేగభరిత సన్నివేశం లక్షలమంది మనసులను దోచింది. వధూవరులిద్దరూ కూడ కన్నీటిని తుడుచుకొని ఆ వేడుకలో భాగం పంచుకోవడం అందరికీ ఆనందాన్ని నింపింది. ఇప్పుడు ఫేస్ బుక్ లో వీడియోను చూసిన వారంతా వధూవరులు సైతం డ్యాన్స్ చేసిన తీరును పొగడ్తలతో ముంచెత్తారు. అయితే తెలుగువారి వివాహ సంప్రదాయంలోని అప్పగింతల పాటలు కూడ ఇటువంటి సందర్భాన్ని స్ఫురింపజేస్తాయి. పెళ్ళి కుమార్తెను భర్తకు, వారి కుటుంబ సభ్యులకు అప్పగించే సమయంలో పాడే పాటలు, వాయించే మ్యూజిక్ అక్కడున్నవారిని కన్నీరు పెట్టించడం కనిపిస్తుంది. న్యూజిల్యాండ్ హాకా డ్యాన్స్ లో కూడ అటువంటి సందర్భమే మనకు కళ్ళకు కడుతుంది. -
ఆర్ధిక మంత్రి ఆనంకు సమైక్య సెగ
-
సీమాంధ్ర ప్రజల ఆందోళనను అర్ధం చేసుకోగలం:దిగ్విజయ్