నాగ్ ఆ శుభవార్త చెప్పేశారు | Nagarjuna feels blessed as both his sons found soulmates | Sakshi
Sakshi News home page

నాగ్ ఆ శుభవార్త చెప్పేశారు

Published Sat, Jul 2 2016 5:43 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నాగ్  ఆ శుభవార్త చెప్పేశారు - Sakshi

నాగ్ ఆ శుభవార్త చెప్పేశారు

ముంబై: టాలీవుడ్  మన్మధుడు అక్కినేని నాగార్జున తన ఇద్దరు తనయుల పెళ్లి వార్తలపై స్పందించారు. త్వరలో కుటుంబంలో  రెండు పెళ్లిళ్లు  ఉంటాయంటూ హింట్ ఇచ్చారు. యంగ్ హీరోలు అక్కినేని నాగ  చైతన్య, అఖిల్  ఇద్దరూ వారి  జీవిత బాగస్వాములను ఎన్నుకోవడం  తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. 

త్వరలోనే  తమ ఇద్దరు కుమారుల పెళ్లి కబురు ఉండొచ్చునని నాగ్ తెలిపారు. వారిద్దరూ నచ్చిన జీవిత భాగస్వాములను నిర్ణయించుకోవడం తనకు, సతీమణి అమలకు  చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే  అధికారికంగా ప్రకటన చేస్తామని ఆయన తెలిపారు. నాగార్జున ఈ ముచ్చట్లను తాజాగా ఓ వార్త సంస్థతో షేర్ చేసుకున్నారు.

కాగా  చిన్న కుమారుడు అఖిల్ నిశ్చితార్థం పుకార్లపై నాగ్  స్పందించారు. అఖిల్ కి ఇంకా నిశ్చితార్థం కాలేదని తేల్చి పారేశారు. తమ కుమారులు వాళ్ల  జీవితాల్లోని ముఖ్యమైన ఘట్టాల గురించి వారు చెబితేనే సబబుగా ఉంటుందని వ్యాఖ్యానించారు.  ప్రస్తుతం ఇద్దరూ  వారి బాధ్యతల్లో  బిజీగా వున్నారన్నారు. ఆ అపురూపమైన ఈవెంట్ ను వాళ్లిద్దరు ఎపుడు నిర్ణయించుకుంటే అపుడే  ముహూర్తం ఖరారు అవుతుందని చెప్పారు. కాగా నాగ చైతన్య ఓ ప్రముఖ హీరోయిన్ ప్రేమించుకున్నారని, అందుకు చైతు ఇంట్లో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక అఖిల్ ... ఫ్యాషన్ డిజైనర్ శ్రీయా భూపాల్తో తనకున్న అనుబంధాన్ని ఇటీవలే రివీల్  చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement