female judge
-
కోర్టు హాల్లో మహిళా జడ్జిపై దాడి
నెవడా: ఓ కేసు విచారణకు సందర్భంగా నిందితుడు అనూహ్యంగా మహిళా జడ్జిపైకి దాడికి పాల్పడ్డాడు. అనంతరం కోర్టు సిబ్బంది, ఇతరులు కలిసి పిడిగుద్దులతో అతడికి దేహశుద్ధి చేశారు. లాస్ వెగాస్‌లోని రీజినల్ జస్టిస్ సెంటర్లో బుధవారం ఉదయం ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఏడాది క్రితం బేస్‌బాల్ బ్యాట్‌తో ఓ వ్యక్తిపై దాడి చేశాడన్న ఆరోపణ లెదుర్కొంటున్న డియోబ్రా డెలోన్ రెడెన్(30)అనే వ్యక్తిని పోలీసులు క్లార్క్ కౌంటీ డిస్ట్రిక్ట్ జడ్జి మేరీ కే హొల్థుస్ ఎదుట ప్రవేశపెట్టారు. కేసు వాదనలు పూర్తి కాగా, జడ్జి తీర్పు ప్రకటించారు. తీర్పువిన్న రెడెన్ తీవ్ర ఆగ్రహంతో దుర్భాష లాడుతూ ఒక్కసారిగా దుమికి, జడ్జి టేబుల్‌పైకి చేరుకున్నాడు. జడ్జి హొల్థుస్ వెనక్కి నెట్టేశాడు. దీంతో, ఆమె కుర్చీలో నుంచి వెనక్కి పడిపోయి, గోడకు గుద్దుకున్నారు. అడ్డుకోబోయిన కోర్టు మార్షల్‌కు గాయాలయ్యాయి. కోర్టు సిబ్బంది, ఇతరులు కలిసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు హాలు కొద్దిసేపు రణరంగాన్ని తలపించింది. కోర్టు హాలుకు వచ్చిన సమయంలో అతడి చేతులకు బేడీలు లేవు. ఘటన జడ్జి ఆదేశాల మేరకు రెడెన్ చేతులకు బేడీలు వేసి, క్లార్క్ కౌంటీ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. -
అమెరికాలో.. న్యాయ పీఠంపై తొలి సిక్కు మహిళ
ఆస్టిన్: భారత సంతతికి చెందిన మన్‌ప్రీత్ మోనికా సింగ్ అరుదైన ఘనత సాధించారు. హ్యారిస్ కౌంటీ(టెక్సాస్) జడ్జిగా ఆమె ప్రమాణం చేశారు. తద్వారా అమెరికాలో ఈ ఘనత సాధించిన తొలి సిక్కు మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. 70వ దశకంలో తొలినాళ్లలో మోనికా సింగ్ తండ్రి అమెరికాకు వలస వెళ్లారు. హ్యూస్టన్‌లో పుట్టి పెరిగిన ఆమె.. ప్రస్తుతం బెల్లయిరేలో నివాసం ఉంటున్నారు. ఆమె వివాహిత. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శుక్రవారం టెక్సాస్‌లోని హ్యారిస్ కౌంటీ సివిల్ కోర్టులో(లా నెంబర్ 4) ఆమె జడ్జిగా ప్రమాణం చేశారు. హ్యూస్టన్లోనే ట్రయల్ లాయర్‌గా 20 ఏళ్లపాటు పని చేసిన ఆమె.. పౌర హక్కులకు సంబంధించిన పిటిషన్లతో పాటు, జాతీయ స్థాయిలో వ్యవహారాలకు సంబంధించిన కేసుల్ని సైతం వాదించారు. తనకు దక్కిన గౌరవంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరు పిల్లలతో మోనికా సింగ్ సిక్కు వర్గానికి ఇవి మరిచిపోలేవని క్షణాలని ఇండో-అమెరికన్ న్యాయమూర్తి రవి సందిల్ పేర్కొన్నారు. మోనికా సింగ్ ప్రమాణ కార్యక్రమానికి హాజరైన ఆయన.. టెక్సాస్‌కు జడ్జిగా ఎన్నికైక తొలి సౌత్ ఏషియా వ్యక్తిగా ఘనత దక్కించుకున్నారు. అమెరికాలో దాదాపు ఐదు లక్షల మంది సిక్కు జనాభా ఉందని ఒక అంచనా.. అందులో 20వేల మంది హ్యూస్టన్‌లో ప్రాంతంలోనే స్థిరపడినట్లు గణాంకాలు చెప్తున్నాయి. -
సుప్రీం ‘కొలీజియం’లో జస్టిస్ భానుమతి
న్యూఢిల్లీ: దాదాపు పదేళ్ల తర్వాత సుప్రీంకోర్టు కొలీజియంలో ఓ మహిళా జడ్జి నియమితులయ్యారు. ఇప్పటి వరకూ కొలీజియంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ గొగోయ్ ఆదివారం పదవీ విరమణ చేయడంతో తమిళనాడుకు చెందిన జస్టిస్ ఆర్. భానుమతి ఎంపికయ్యారు. 2014 ఆగస్టు 13 నుంచి ఆమె సుప్రీంకోర్టులో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె మద్రాసు హైకోర్టు, జార్ఖండ్ హైకోర్టులలో పనిచేశారు. ప్రస్తుతం కొలీజియంలో జస్టిస్ భానుమతితో పాటు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ సభ్యులుగా ఉన్నారు. -
మొదటి ముస్లిం మహిళా జడ్జి అనుమానాస్పద మృతి
న్యూయార్క్: అమెరికాలో మొట్టమొదటి ముస్లిం మహిళా జడ్జి షీలా అబ్దుస్ సలాం (65) అనుమానాస్పద స్థితిలో మరణించారు. న్యూయార్క్‌లోని హడ్సన్ నదిలో శవమై కనిపించడం కలకలం రేపింది. న్యూ యార్క్స్ అత్యున్నత కోర్టులో పనిచేసిన మొట్టమొదటి ఆఫ్రికన్-అమెరికన్ మహిళా ముస్లిం న్యాయమూర్తిగా ఆమె కీర్తి గడించారు. న్యూయార్క్ పోలీసుల సమాచారం ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఆమె అపస్మారక స్థితిలో పడివుండగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. న్యూయార్క్ స్టేట్ అత్యున్నత న్యాయస్థానంలో అసోసియేట్ జడ్జి గా ఉన్న ఆమె హార్లిం ప్రాంతంలో ఉంటున్నారు. ఆమెపై దాడి జరిగినట్టు తాము భావించడం లేదని, ఆమె దుస్తులు చెక్కు చెదరకుండా ఉన్నాయని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. 2013 నుంచి న్యాయమూర్తి గా ఉన్న షీలా అబ్దుస్ సలాం గతంలో 15 ఏళ్ళు మన్ హటన్ కోర్టులో ఫస్ట్ అప్పిలేట్ డివిజనల్ గా పని చేశారని న్యూయార్క్ డైలీ న్యూస్ నివేదించింది. అయితే సలాంను హత్య చేసి మృతదేహాన్ని నదిలో పడేశారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అన్న విషయమై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే మంగళవారం నుంచి ఆమె కనిపించకుండా పోయినట్టు తెలుస్తోంది సలాం మరణంపై న్యూయార్క్ మేయర్ సహా , పలువురు న్యాయవాదులు, నిపుణులు ట్విట్టర్ ద్వారా తీవ్ర సంతాపాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆమె రచనలు, ఆమె జ్ఞానం , అపార నైతిక నిబద్ధతో ప్రముఖంగా నిలిచారని మరో ప్రముఖ జడ్జి జానెట్ డిఫియోర్ సంతాపం ప్రకటించారు. వ్యక్తిగతంగా తనకు ఇది తీరని లోటన్నారు. రాజీలేని ఆమె తత్వం, న్యాయశాస్త్రం పరిణతమకు ప్రేరణగా నిలిచిందని ఆమె చెప్పారు. కాగా వాషింగటన్ లో జన్మించిన సలాం ఆరుగురు తోబుట్టువులు ఉన్నారు. 1991 లో న్యాయవాద వృత్తిలో ప్రవేశించిన ఆమెన ఈస్ట్ బ్రూక్లిన్‌లో లీగల్ సేవలు అందించారు. అనంతరం 2009లో న్యూయార్క్ న్యాయవాద శాఖకు చెందిన సివిల్ హక్కులు, రియల్ ఎ స్టేట్ ఫైనాన్సింగ్ బ్యూరోకి అసిస్టెంట్ అటార్నీ జనరల్ గా ఎంపికయ్యారు. -
రేప్ బాధితురాలికి ఘోరమైన ప్రశ్నలు!
- మహిళా జడ్జి అడిగిన ప్రశ్నలపై సర్వత్రా నిరసన మాడ్రిడ్: ఓ రేప్ బాధితురాలు తనపై జరిగిన దారుణాన్ని వివరిస్తుండగా.. మహిళా జడ్జి ఆమెను అడుగకూడని ప్రశ్నలు అడిగింది. మానవత్వం తలదించుకునేలా రేప్ బాధితురాలిపై న్యాయమూర్తి ప్రశ్నలు సంధించింది. తనపై జరిగిన లైంగిక దాడి గురించి బాధితురాలు వివరిస్తుండగా.. న్యాయమూర్తి అడ్డుపడి 'నువ్వు ఆ సమయంలో కాళ్లు దగ్గరగా ముడుచుకున్నావా? నీ స్త్రీ అంగాలను ముడుచుకున్నావా' అంటూ అవమానకరరీతిలో ప్రశ్నించింది. ఈ ఘటన గత ఫిబ్రవరిలో స్పెయిన్‌లో జరిగింది. రేప్ బాధితురాలిని అవమానించేలా ప్రశ్నలు అడిగిన జడ్జి మారియా డెల్ కార్మెన్ మొలినాపై చర్యలు తీసుకోవాలంటూ స్పెయిన్‌లోని మహిళా హక్కులు సంఘాలు ఆందోళన బాట పట్టాయి. సదరు న్యాయమూర్తిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ జాతీయ జ్యుడీషియల్ కౌన్సిల్ (సీజీపీజె)కు ఫిర్యాదు చేశాయి. మహిళలపై నేరాల కేసును విచారించే ప్రత్యేక కోర్టులో ఈ విచారణ జరిగింది. ఉత్తర స్పెయిన్‌లోని విక్టోరియాకు చెందిన రేప్ బాధితురాలు ఐదు నెలల గర్భవతి. తన పార్ట్నర్ తనపై లైంగిక దాడులు జరుపడమే కాదు శారీరకంగా హింసిస్తున్నాడని, అతడి నుంచి విముక్తి కల్పించాలని బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంలో మహిళా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలతో బాధితురాలు దిగ్భ్రాంతి చెందింది. ఇలాంటి ప్రశ్నలు న్యాయమూర్తి అడుగటం విచారణకు అనవసరమే కాకుండా బాధితురాలి గౌరవ, ఆత్మాభిమానాలకు భంగకరమని మహిళా హక్కుల సంఘం క్లారా కాంపొమర్ అసోసియేషన్ పేర్కొంది. జడ్జి అడిగిన ప్రశ్నలు అవమానకరం, అగౌరవకరం, మానవత్వానికి మచ్చ అని పేర్కొన్నారు. రేప్ బాధితురాలి వాంగ్మూలాన్ని విశ్వసించని న్యాయమూర్తి ఇలా అభ్యంతరకరమైన ప్రశ్నలతో తరచూ అడ్డుపడిందని, ఏ విచారణలోనైనా ఇలాంటి ప్రశ్నలు అడగకూడదని ఆ సంఘం స్పష్టం చేసింది.