festival moments
-
మెర్క్యూర్ హోటల్ లో కేక్ మిక్సింగ్ సందడి
-
'గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై'.. కలెక్టర్ సమీక్ష..!
పెద్దపల్లి: జిల్లా వ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని, అందుకనుగుణంగా సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం మండపాల నిర్వహణ, నిమజ్జనం ఏర్పాట్లపై అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, డీసీపీ వైభవ్‌గైక్వాడ్‌తో కలిసి సమీక్షించారు. అన్ని మండలాలు, గ్రామాల్లో ఏర్పాటు చేసే గణేశ్‌మండప నిర్వాహకులు అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పోలీసు, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు స్థానికంగా సమావేశమై ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. నిమజ్జనానికి అవసరమైన క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గణపతి ఉత్సవాల సందర్భంగా గట్టి నిఘా ఉంటుందని, వివాదాలు సృష్టిస్టేందుకు యత్నించే వారిపై చట్టపరమైన చర్యలుంటాయని డీసీపీ పేర్కొన్నారు. ఆర్డీఓలు మధుమోహన్, హనుమనాయక్, ఏఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మొదలైన మైలేర్ల సందడి.. మొదటి బహుమతిగా లారీలు, కార్లు
పలమనేరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు, కుప్పం ప్రాంతాలతోపాటు పొరుగునే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మైలేర్ల (ఎద్దుల పరుగుపందేల) సందడి మొదలైంది. సంక్రాంతంటే ఈ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రజలకు గుర్తొచ్చేది మైలేర్లే. కనుమ పండుగ నుంచి ఏప్రిల్ వరకు మైలేర్లు జరుగుతాయి. ఈప్రాంతంలో జరిగే మైలేరు పండుగల్లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.50 వేల నుంచి లక్ష దాకా ఉండేది. అదే తమిళనాడులో అయితే లారీలు, కార్లు మొదటి బహుమతిగా అందజేస్తున్నారు. మైలేరు అనే తమిళ పదానికి ఎద్దుల పరుగుపందెం అని అర్థం. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతంలో మైలేర్లు నిర్వహించడం ఆనవాయితీ. దశాబ్దాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. పలువురు తమ ఎడ్లను ఈ పందేలకు సిద్ధం చేస్తున్నారు. ఈ పోటీలో పాల్గొనే ఎద్దును సంరక్షిస్తున్న రైతును గౌరవంగా చూస్తారు. ఇక ఈ పోటీలో తమ గ్రామం ఎద్దు గెలిచిందంటే.. ఆ వూరి వారి ఉత్సాహాన్ని వర్ణించలేం. గెలిచిన ఎద్దుకు గ్రామంలో మెరవణి (ఊరేగింపు) ఉంటుంది. పండగెద్దులా మజాకా పండుగ నెల మొదలైనప్పటి నుంచి ఎద్దుకు మంచి మేత పెడతారు. వాటి కొమ్ములను జువ్వుతారు. ఎద్దు కొమ్ములు ఎంత బాగుంటే అంత క్రేజ్. ఇలా సిద్ధం చేసిన ఎడ్లను బాగా అలంకరించి పరుగుపందేలకు తీసుకెళతారు. కొమ్ములకు రంగులు వేసి ప్రభలతో అలంకరించి బెలూన్లు కడతారు. పోటీల్లో ఎద్దుపై యువకులు దెబ్బవేసేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి దానికి రక్షణగా బ్లేడులు కట్టిన పరదాలను అమరుస్తారు. కాళ్లకు గజ్జలు కట్టి, గిట్టలకు పసుపు రాసి పూజ చేస్తారు. ఈ ప్రాంతంలో 500 వరకు ఎడ్లను ఈ పందేలకు సిద్ధం చేస్తున్నారు. పలమనేరు ప్రాంతంలో నిర్వహించే మైలేరు (ఫైల్) పందెం ఎద్దు ధర రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షలు పోటీలు జరిగేచోట కిక్కిరిసిన జనం మధ్య అల్లిని (నిర్ణీత ప్రదేశాన్ని) ముందుగా ఎద్దుకు చూపెడతారు. అనంతరం ఆ ఎద్దును మూడుసార్లు పరిగెత్తిస్తారు. ఈ మూడుసార్లలో సరాసరి తక్కువ సెకన్లలో గమ్యం చేరిన ఎద్దు విజేతగా నిలుస్తుంది. ఒక్కో మైలేరులో 500 నుంచి వెయ్యి వరకు ఎద్దులు పాల్గొంటాయి. ఒక్కో ఎద్దుకు ప్రవేశ రుసుము రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ఉంది. మైలేరులో గెలుపొందిన ఎద్దు ధర అమాంతం పెరుగుతుంది. వీటిని లక్షలు పెట్టి కొనేందుకు పలువురు ముందుకొస్తారు. పలమనేరు ప్రాంతంలో మైలేరు విజేత ధర రూ.2 లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు ఉంది. మైలేర్లకు పేరొందిన ఊళ్లు.. ఈ ప్రాంతంలో మైలేరు పండుగను గొప్పగా జరుపుకొనే ఊళ్లు చాలా ఉన్నాయి. బైరెడ్డిపల్లె, బంగారుపాళ్యం, మండీపేట కోటూరు, చెత్తపెంట, కాబ్బల్లి, కెంచనబల్ల, రామకుప్పం, మిట్టూరు, శాంతిపురం, కెనమాకులపల్లె, మల్లానూరు, నాయినూరు, గొల్లచీమనపల్లె తదితర గ్రామాల్లో మైలేర్లు నిర్వహిస్తారు. సరిహద్దులోని తమిళనాడులో బొరుగూర్, పర్చూరు (ఇక్కడ మొదటి బహుమతి లారీ, బుల్లెట్) గుడియాత్తం, ఆంబూరు, నాట్రాంపల్లె, పేర్నంబట్, పల్లికొండ, వేలూరు, క్రిష్ణగిరి, సేలం, ధర్మపురి తదితర ప్రాంతాల్లో నిర్వహిస్తారు. కర్ణాటకలోని దూలపల్లెలో ఈ పోటీ పెద్ద ఎత్తున జరుగుతుంది. దూలపల్లెలో పోటీలను తిలకించేందుకు ఆ రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతుంటారు. -
కొమటిచెరువులో అదిరిపోయిన లేక్ ఫెస్టివల్ ఫోటోలు
-
ఉగాది సందర్భంగా ఘనంగా లేక్ ఫెస్టివల్ .. ఎక్కడంటే!
సాక్షి, సిద్దిపేటజోన్: ఉగాది పండుగను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటిచెరువు (మినీ ట్యాంక్‌బండ్)పై నేటి నుంచి ప్రారంభించనున్న లేక్ ఫెస్టివల్ (కోమటి చెరువు మహోత్సవం)కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 12 నుంచి 14 వరకు మున్సిపల్, పర్యాటకశాఖ, నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో ఈ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా 12న ఎకరం స్థలంలో ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద గ్లో గార్డెన్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఇందులో వన్యప్రాణుల ప్రతిమలు, వివిధ రకాల కృత్రిమ వృక్షాలను విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేశారు. గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం వద్దనున్న మ్యూజికల్ ఫౌంటైన్ తరహాలో కోమటి చెరువుపైన ఓ ఫౌంటైన్‌ను 13న ప్రారంభించనున్నారు. 14న తెలంగాణ కళాకారులు, కవులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మూడ్రోజుల పాటు సాగే ఈ లేక్ ఫెస్టివల్‌కు కోమటి చెరువుపైన ఉన్న నెక్లెస్‌రోడ్డు, నీటిపై తేలియాడే వంతెన, అడ్వెంచర్ పార్క్, రాక్గార్డెన్లతో పాటు చెరువును విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. -
స్వల్ప లాభాలతో సరి
కేంద్రం ఉద్యోగులకు ప్రకటించిన పండుగ ప్యాకేజీ మార్కెట్ వర్గాలను నిరుత్సాహపరచడంతో సూచీలు సోమవారం స్వల్పలాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 84 పాయింట్లు పెరిగి 40,593 వద్ద నిలిచింది. నిఫ్టీ 17 పాయింట్లు ఆర్జించి 11,931 వద్ద స్థిరపడింది. సూచీలకిది వరుసగా 8 రోజూ లాభాల ముగింపు. ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు బ్యాంకింగ్, మెటల్, అటో, ఫైనాన్స్ సర్వీస్, మీడియా, రియల్టీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యా యి. ఇంట్రాడేలో నిఫ్టీ 11,867 – 12,022 శ్రేణిలో కదలాడగా.. సెన్సెక్స్ 40,387 – 40,905 రేంజ్లో ఊగిసలాడింది. 12,000 స్థాయిని అందుకున్న నిఫ్టీ అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతతో మన సూచీలు లాభాలతో మొదలయ్యాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ఉదయం సెషన్లో సూచీల ర్యాలీ సాఫీగా సాగింది. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్స్ షేర్లకు అధిక డిమాండ్ నెలకొంది. ఈ క్రమంలో సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లను ఆర్జించి 40,905 స్థాయిని తాకింది. నిఫ్టీ 108 పాయింట్ల మేర లాభపడి 12,000 మార్కును అందుకుంది. ఇంట్రాడే 12,022 వద్ద గరిష్టాన్ని తాకింది. నిరాశపరిచిన పండుగ ప్యాకేజీ ప్రకటన వ్యవస్థలో వినిమయ డిమాండ్ కొరత తీర్చే చర్యల్లో భాగంగా కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక పండుగ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రతి ఉద్యోగికి రూ.10 వేల పండుగ అడ్వాన్స్‌తో పాటు ప్రయాణ ఓచర్లను ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపింది. ఉద్దీపన ప్యాకేజీని ఆశించిన మార్కెట్ వర్గాలకు ఈ పండుగ ప్యాకేజీ ప్రకటన తీవ్ర నిరాశను కలిగించింది. దీంతో ప్రధాన షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకోసుకుంది. ఫలితంగా సూచీలు ఉదయం ఆర్జించిన లాభాలన్నీ హరించుకుపోయాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. కలవరపెట్టిన కరెంట్ కోత దేశ ఆర్థిక రాజధాని, స్టాక్ ఎక్సే్చంజీలకు స్థావరమైన ముంబైలో విద్యుత్ అంతరాయం ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. దక్షిణ ముంబై ప్రాంతంలో పవర్ గ్రిడ్ వైఫల్యంతో ఉదయం 10 గంటలకు విద్యుత్తు సరఫరాలో భారీ అంతరాయమేర్పడింది. అయితే ఎలాంటి సమస్య వచ్చినా పూర్తిస్థాయి ముందస్తు చర్యలతో తాము సిద్ధంగా ఉన్నామని, మార్కెట్ కార్యకలాపాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తవని ఎన్ఎస్ఈ, సెన్సెక్స్ ఎక్సే్చంజీలు వివరణ ఇచ్చాయి. ‘‘కేంద్రం ప్రకటించిన పండుగ ప్యాకేజీ స్వల్పకాలిక ప్రయోజనమే. వ్యవస్థలో స్థిర వృద్ధిని నెలకొల్పే నిబద్ధత ప్యాకేజీలో కన్పించడం లేదు. కేంద్రం ప్యాకేజీ మార్కెట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సంతృప్తిపరచలేదు. అందుకే మార్కెట్లో అమ్మకాలు నెలకొన్నాయి’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ విభాగపు అధిపతి అర్జున్ యశ్ మహజన్ అభిప్రాయపడ్డారు. -
నేటి నుంచి మేడారంలో మినీ జాతర
-
ఉత్సవ ప్రియునికి నీరాజనం
– కల్పవక్ష, రాత్రి సర్వభూపాల వాహనాల్లో ఊరేగిన మలయప్ప – శ్రీవారికి కానుకగా అందిన శ్రీవిల్లిపుత్తూరు మాలలు, చెన్నయ్ గొడుగులు – కన్యాకుమారి వయోలిన్, కదిరిగోపాల్నాథ్ శాక్సోఫోన్ వాయిద్య నీరాజన కోలాహలం – మాడవీధుల్లో కళాకారుల సందడి సాక్షి,తిరుమల: తిరుమల పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవం కన్నులపండువగా సాగుతోంది. మలయప్ప ఉభయదేవేరులు శ్రీదేవి, భూదేవి సమేతంగా పూటకో వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తు కనువిందు చేస్తున్నారు. గురువారం ఉదయం కల్పవక్షం, రాత్రి సర్వ భూపాల వాహనాలపై దర్శనమిచ్చారు. దేవదేవుని దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు దివ్యానుభూతిని పొందారు. ఉత్సవాల ప్రారంభం తర్వాత మొదటి మూడు రోజులు భక్తుల రద్దీ కొంత తక్కువగా కనిపించినా నాలుగో రోజు సందడి పెరిగింది. ఉదయం కల్పవక్ష వాహన సేవలో భక్తులు అధిక సంఖ్యలో కనిపించారు. నాలుగు మాడ వీధుల్లో వాహనసేవలు తిలకించేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీలు నిండుగా కనిపించారు. రాత్రి సర్వభూపాల వాహన సేవలో అంతకంటే ఎక్కువ స్థాయిలో భక్తులు కనిపించారు. శ్రీవిల్లిపుత్తూరు నుండి పుష్పమాలలు, చెన్నయ్ నుండి గొడుగులు శ్రీవారికి కానుకగా అందటం నాల్గో రోజు ప్రత్యేకత. సాయంత్రం 6 గంటలకు కుమారి కన్యాకుమారి వయోలిన్, కదిరి గోపాల్నా«ద్ శాక్సోఫోన్ వాయిద్య కచేరి భక్తులను అలరించింది. ఆ తర్వాత ఉత్సవమూర్తులు సహస్రదీపాలంకార సేవలో స్వామి వేయి నేతిదీపాల వెలుగులో భక్తులకు దర్శనమిచ్చారు. పుష్ప ప్రదర్శన శాలకు భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌కు భక్తుల నుంచి విశేష ఆధరణ లభిస్తోంది. పెరిగిన రద్దీ వల్ల గురువారం సాయంత్రం 6గంటల వరకు సుమారు 52,985 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. అన్నదానం, క్యూలైన్లు, యాత్రికుల వసతి సముదాయాల వద్ద సుమారు 60 వేల మందికిపైగా అన్న ప్రసాదం అందజేశారు. కళాబందాల ప్రదర్శనల హోరు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కతిక శోభ భక్తులను కట్టిపడేస్తున్నాయి. వాహన సేవల ముందు భాగంలో సంగీత, సాంస్కతిక కళా బందాలు ప్రదర్శనలు అలరిస్తున్నాయి. కళాకారుల విభిన్న కళా ప్రదర్శనలు భక్తులను కట్టిపడేస్తున్నాయి. మహారాష్ట్ర, రాజస్తాన్, కర్నాటక నుంచి వచ్చిన హిందూస్తాని భజన బందాలు డప్పు వాయిద్యం భక్తులను ఉర్రూతులూగించాయి. భజన బందాల కళాకారులు నత్యాలు, డబ్బు వాయిద్యాలు, తాళం వేస్తూ ఒకరికొకరు పోటీ పడుతూ ఆధ్యాత్మికానందంలో ఓలలాడించారు.