పెద్దపల్లి: జిల్లా వ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని, అందుకనుగుణంగా సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం మండపాల నిర్వహణ, నిమజ్జనం ఏర్పాట్లపై అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, డీసీపీ వైభవ్‌గైక్వాడ్‌తో కలిసి సమీక్షించారు.
అన్ని మండలాలు, గ్రామాల్లో ఏర్పాటు చేసే గణేశ్‌మండప నిర్వాహకులు అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పోలీసు, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు స్థానికంగా సమావేశమై ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. నిమజ్జనానికి అవసరమైన క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
గణపతి ఉత్సవాల సందర్భంగా గట్టి నిఘా ఉంటుందని, వివాదాలు సృష్టిస్టేందుకు యత్నించే వారిపై చట్టపరమైన చర్యలుంటాయని డీసీపీ పేర్కొన్నారు. ఆర్డీఓలు మధుమోహన్, హనుమనాయక్, ఏఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment