కల్పవృక్షవాహనంపై ఊరేగుతున్న శ్రీవారు
ఉత్సవ ప్రియునికి నీరాజనం
Published Thu, Oct 6 2016 11:41 PM | Last Updated on Wed, Sep 18 2019 3:21 PM
– కల్పవక్ష, రాత్రి సర్వభూపాల వాహనాల్లో ఊరేగిన మలయప్ప
– శ్రీవారికి కానుకగా అందిన శ్రీవిల్లిపుత్తూరు మాలలు, చెన్నయ్ గొడుగులు
– కన్యాకుమారి వయోలిన్, కదిరిగోపాల్‌నాథ్ శాక్సోఫోన్
వాయిద్య నీరాజన కోలాహలం
– మాడవీధుల్లో కళాకారుల సందడి
సాక్షి,తిరుమల:
తిరుమల పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవం కన్నులపండువగా సాగుతోంది. మలయప్ప ఉభయదేవేరులు శ్రీదేవి, భూదేవి సమేతంగా పూటకో వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తు కనువిందు చేస్తున్నారు. గురువారం ఉదయం కల్పవక్షం, రాత్రి సర్వ భూపాల వాహనాలపై దర్శనమిచ్చారు. దేవదేవుని దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు దివ్యానుభూతిని పొందారు. ఉత్సవాల ప్రారంభం తర్వాత మొదటి మూడు రోజులు భక్తుల రద్దీ కొంత తక్కువగా కనిపించినా నాలుగో రోజు సందడి పెరిగింది. ఉదయం కల్పవక్ష వాహన సేవలో భక్తులు అధిక సంఖ్యలో కనిపించారు. నాలుగు మాడ వీధుల్లో వాహనసేవలు తిలకించేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీలు నిండుగా కనిపించారు. రాత్రి సర్వభూపాల వాహన సేవలో అంతకంటే ఎక్కువ స్థాయిలో భక్తులు కనిపించారు. శ్రీవిల్లిపుత్తూరు నుండి పుష్పమాలలు, చెన్నయ్ నుండి గొడుగులు శ్రీవారికి కానుకగా అందటం నాల్గో రోజు ప్రత్యేకత. సాయంత్రం 6 గంటలకు కుమారి కన్యాకుమారి వయోలిన్, కదిరి గోపాల్‌నా«ద్ శాక్సోఫోన్ వాయిద్య కచేరి భక్తులను అలరించింది. ఆ తర్వాత ఉత్సవమూర్తులు సహస్రదీపాలంకార సేవలో స్వామి వేయి నేతిదీపాల వెలుగులో భక్తులకు దర్శనమిచ్చారు. పుష్ప ప్రదర్శన శాలకు భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌కు భక్తుల నుంచి విశేష ఆధరణ లభిస్తోంది. పెరిగిన రద్దీ వల్ల గురువారం సాయంత్రం 6గంటల వరకు సుమారు 52,985 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. అన్నదానం, క్యూలైన్లు, యాత్రికుల వసతి సముదాయాల వద్ద సుమారు 60 వేల మందికిపైగా అన్న ప్రసాదం అందజేశారు.
కళాబందాల ప్రదర్శనల హోరు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కతిక శోభ భక్తులను కట్టిపడేస్తున్నాయి. వాహన సేవల ముందు భాగంలో సంగీత, సాంస్కతిక కళా బందాలు ప్రదర్శనలు అలరిస్తున్నాయి. కళాకారుల విభిన్న కళా ప్రదర్శనలు భక్తులను కట్టిపడేస్తున్నాయి. మహారాష్ట్ర, రాజస్తాన్, కర్నాటక నుంచి వచ్చిన హిందూస్తాని భజన బందాలు డప్పు వాయిద్యం భక్తులను ఉర్రూతులూగించాయి. భజన బందాల కళాకారులు నత్యాలు, డబ్బు వాయిద్యాలు, తాళం వేస్తూ ఒకరికొకరు పోటీ పడుతూ ఆధ్యాత్మికానందంలో ఓలలాడించారు.
Advertisement
Advertisement