finance businessman
-
కోనసీమ జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం
సాక్షి, రావులపాలెం (కోనసీమ జిల్లా): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాల్పులు కలకలం రేగింది. రావులపాలేనికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి సత్యనారాయణరెడ్డి ఇంటికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. వారిని చిన్న కుమారుడు ఆదిత్యరెడ్డి చూసి ఎవరంటూ ప్రశ్నించారు. దీంతో ఆయనపై కాల్పులు జరిపి దుండగులు పరారయ్యారు. కాల్పుల్లో ఆదిత్యరెడ్డి చేతికి గాయాలయ్యాయి. ఆదిత్యరెడ్డి ఎదురు తిరగడంతో గన్, బ్యాగ్ వదిలి దుండగులు పరారయ్యారు. దుండగులు వదిలి వెళ్లిన బ్యాగ్‌లో నాటు బాంబులు లభ్యమయ్యాయి. చదవండి: ఆ వెబ్‌సైట్‌ను చూస్తుండగా వాట్సాప్‌కు వీడియో.. తీరా చూస్తే అందులో.. -
ఫైనాన్స్ వ్యాపారి బ్లాక్మెయిల్.. మహిళ న్యూడ్ వీడియో వెబ్సైట్లో పెట్టి..
కొనేరుసెంటర్(మచిలీపట్నం)కృష్ణా జిల్లా: ఓ మహిళ న్యూడ్ వీడియోతో వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం మచిలీపట్నం దిశ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రికి చెందిన ఓ మహిళ తన వ్యాపార అవసరాల కోసం ఫైనాన్స్ వ్యాపారి హన్సకుమార్ని కొంత నగదు అప్పు అడగ్గా.. అతను న్యూడ్ వీడియో కాల్ చేస్తే ఇస్తానని చెప్పాడు. దీంతో ఆ మహిళ తప్పని పరిస్థితుల్లో న్యూడ్ వీడియో చాట్ చేసింది. చదవండి: వివాహిత మిస్సింగ్.. కారణం ఆ ఇద్దరేనా?.. దీన్ని స్క్రీన్ రికార్డు చేసిన హన్సకుమార్ దాన్ని విజయవాడ కానూరులోని తన బంధువు చందుకు షేర్ చేయగా అతను ఆ వీడియోని ఫోర్న్ వెబ్సైట్లో పెట్టి బ్లాక్ మెయిల్‌కు దిగాడు. దీంతో బాధిత మహిళ మచిలీపట్నం దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్టు దిశ డీఎస్పీ రాజీవ్ కుమార్ మీడియాకు తెలిపారు. -
ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్య!
సాక్షి, గుంటూరు : పిడుగురాళ్లకు చెందిన ఓ ఫైనాన్స్ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో నగరంలో కలకలంరేగింది. ఒంటరిగా ఉన్న ఫైనాన్స్ వ్యాపారి సాంబశివరావును గుర్తుతెలియని దుండగులు హతమార్చారు. చోరీకి వచ్చిన దొంగలే..సాంబశివరావును హతమార్చుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తలపై మోదీ అత్యంత కిరాతకంగా హతమార్చిన దుండగలు.. బీరువాలోని ఆభరణాలను, నగదును మాయం చేశారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఫైనాన్స్ వ్యాపారి బలవన్మరణం
యాడికి: యాడికి మండలం నిట్టూరు కొత్తపల్లికి చెందిన మధుసూదన్‌నాయుడు(40) అనే ఫైనాన్స్ వ్యాపారి కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పిల్లల చదువుల కోసం నాయుడు కుటుంబం బళ్లారికి వెళ్లి అక్కడే స్థిరపడినట్లు వివరించారు. అక్కడ అతను ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడని చెప్పారు. అయితే అప్పుల బాధ ఎక్కువైన నేపథ్యంలో ఆయన ఉదయమే తన కార్యాలయానికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువు చాలించినట్లు పేర్కొన్నారు. బళ్లారి పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన నిట్టూరు కొత్తపల్లికి తీసుకువచ్చారు. మృతునికి భార్య, బీటెక్, ఇంటర్ చదివే ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యవసాయంలో కలసి రాకనే.. మధుసూదన్‌నాయుడుకు నిట్టూరు కొత్తపల్లిలో ఇటీవల 16 ఎకరాల పొలం కొన్నట్లు తెలిసింది. అందులో పంటల సాగుకు చేసిన అప్పులు తడిసిమోపెడవడంతో వాటిని తీర్చే మార్గం కానరాక ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటన గ్రామంలో తీరని విషాదం నింపింది.