Finance committee
-
ఫైనాన్స్ కమిటీ చైర్మన్‌గా జై షా
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) లో ఎంతో ప్రాధాన్యత ఉన్న, బలమైన ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జై షా ఎంపికయ్యారు. అయితే ప్రస్తుతానికి జై షా ఎఫ్ అండ్ సీఏలో సభ్యుడిగా మాత్రమే ఉంటారు. మార్చి 2023 నుంచి రాస్ మెకల్లమ్ స్థానంలో ఆయన చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. ఐసీసీ చైర్మన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లే మరో రెండేళ్లపాటు చైర్మన్‌గా కొనసాగుతారు. -
అందుకే.. కాస్త సమయం పడుతుంది
సాక్షి, తిరుమల: సాధారణంగా ప్రభుత్వాలు మారితే రూ.5 వేల కోట్లు పెండింగ్ బిల్లులు ఉంటాయని..కాని టీడీపీ ప్రభుత్వం రూ.60 వేల కోట్లు పెండింగ్ పెట్టిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. పెండింగ్ బిల్లులను భర్తీ చేయడానికి కాస్త సమయం పడుతుందని వివరించారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేడు విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆర్థిక సంఘం భేటీ కానుందని చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని కేంద్రాన్ని కోరమని ఆర్థిక సంఘానికి సీఎం సూచిస్తారని పేర్కొన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సాయానికి ఆర్థిక సంఘం సిఫారసు చేస్తుందని తెలిపారు. -
‘గ్రామజ్యోతి’ పరుగులు..
‘గ్రామజ్యోతి’ పట్టాలెక్కనుంది. నిధుల కేటాయింపులు జరగడంతో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. అభివృద్ధి కోసం ఏర్పాటైన కమిటీలకు అవగాహన కల్పించనున్నారు. గ్రామ సభల్లో తీర్మానించిన పనులు చేపట్టేందుకు అడుగులు వేస్తున్నారు. పారదర్శకంగా పనులు సాగేలా చర్యలు చేపడుతున్నారు. ఇదే వేగాన్ని ప్రదర్శిస్తే పల్లెలు ప్రగతి బాట పట్టినట్టే... - నల్లగొండ రెండు రోజుల క్రితం జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర స్థాయిలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. గ్రామజ్యోతిలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలంటే ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కమిటీ సభ్యులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ శిక్షణ తరగతులు జిల్లా స్థాయిలో నిర్వహిస్తారు. గ్రామజ్యోతిలో భాగంగా ప్రధానంగా ఏడు అంశాలకు సంబంధించి కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ ఏడు కమిటీలకుగాను 14,865 లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ఒక్కో కమిటీ ఎంచుకున్న లక్ష్యాల ను ఏ విధంగా అమలు చేయాలి..? ఎలా ముందుకు వెళ్లాలి..? అనే దానిపై సంబంధిత శాఖల అధికారులతో అవగాహన కల్పిస్తారు. ఉదాహరణకు.. విద్యా కమిటీ అయితే ఆ గ్రామంలో వందశాతం విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలి. పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, బడి బయటి పిల్లలను బడిలో చేర్పించడం వంటి కార్యక్రమాలను ఏ విధంగా చేస్తే వందశాతం లక్ష్యాలను సాధిస్తామనే దానిపై డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓలతో అవగాహన కల్పిస్తారు. అక్షరాస్యులైన వారే విద్యాకమిటీ చైర్మన్లు ఉండాలని నిర్ణయించారు. ఈ విషయంలో విద్యావంతులే ఉండాలని మార్పు చేశారు. అభివృద్ధి పనులకు నిధులు.... 14వ ఆర్థిక సంఘం కింద పంచాయతీలకు రూ.36.19 కోట్లు మంజూరయ్యాయి. జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి పంచాయతీల ఖాతాలకు రెండు రోజుల్లో సర్దుబాటు చేయనున్నారు. ఈ నిధుల వాడకానికి సం బంధించి గతంలో మాదిరి బోర్ల మరమ్మతులు, కంటికి కనిపించని పనులు చేయడానికి వీల్లేదు. ఇప్పటివరకు వచ్చిన నిధుల్లో సర్పంచ్‌లు చాలావరకు దుర్వినియోగం చేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. గ్రామజ్యోతిలో భాగంగా గ్రామసభల్లో తీర్మానం చేసిన వివిధ రకాల అభివృద్ధి పనులకే ఈ నిధులు వినియోగించాలి. గ్రామసేవ కేంద్రాల ఏర్పాటు... మీ సేవ కేంద్రాల తరహాలో గ్రామాల్లో అన్ని రకాల సేవలను ప్రజలకు అందుబాటులో తె చ్చేందుకు వీలుగా పల్లె సమగ్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది తొలి విడత 75 పంచాయతీల్లో పల్లె సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పంచాయతీ భవనాలు, కంప్యూటర్లు, బీఎస్ఎన్ఎల్ బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్ కలిగిన గ్రామాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. వచ్చే ఏడాది రెండో విడత కింద మరిన్ని గ్రామాల్లో వీటిని విస్తరిస్తారు. ఈ కేంద్రాల ద్వారా ముందుగా పంచాయతీల పన్ను వసూలు, ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లింపు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు వంటి సేవలందిస్తారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2నుంచి పల్లె సమగ్ర సేవా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామజ్యోతి కమిటీల వివరాలు, నిర్దేశించిన లక్ష్యాలు జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీలు 1,176 గ్రామజ్యోతి కమిటీలు 8,190 నిర్దేశించిన లక్ష్యాల సంఖ్య 14,865 గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా.. ‘గ్రామజ్యోతి’లో తీర్మానం చేసిన అభివృద్ధి పనులు అమలు చేసేందుకు కమిటీలకు శిక్షణ త రగతులు నిర్వహించాలని నిర్ణయించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు గ్రామసభల్లో తీర్మా నం చేసిన పనులకే వెచ్చించాలి. దుర్వినియోగం చేయడానికి వీళ్లేదు. ఈ నిధుల వినియోగంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. - పి.ప్రభాకర్ రెడ్డి, డీపీఓ -
ఆర్థిక కమిటీల చైర్మన్లు ఎవరు?
* పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికివ్వడం ఆనవాయితీ * పీయూసీ, అంచనాల కమిటీల కోసం తెరపైకి సీనియర్ల పేర్లు * నేడు నామినేషన్ల దాఖలు... రేపు ఉపసంహరణ గడువు * ఏకగ్రీవం కాకపోతే 25న ఎన్నిక సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ఆర్థిక సంఘాల (ఫైనాన్స్ కమిటీలు) ఎన్నికకు సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రజా పద్దులు(పీఏసీ), అంచనాల కమిటీ (ఎస్టిమేట్స్), ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ)లకు శాసన సభ నుంచి 9 మంది, మండలి నుంచి నలుగురు చొప్పున సభ్యులను ఎన్నుకోనున్నారు. ఇందులో నుంచే ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను కమిటీల చైర్మన్లు, సభ్యుల ఎన్నికకు సోమవారం (23వ తేదీ) మూడు గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మూడు నుంచి ఐదు గంటల వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 24వ తేదీన మూడు గంటల వరకు ఉపసంహరణల గడువుగా నిర్ణయించారు. అయితే, ఏకగ్రీవం కాని పక్షంలో 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరుగుతుంది. ఇదిలాఉండగా, ఈ కమిటీలలో పీఏసీ చైర్మన్‌గా ప్రతిపక్షం నుంచి ఒకరిని ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇక మిగిలిన అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలకు చైర్మన్లు ఎవరు అవుతారనే దానిపై అధికార టీఆర్ఎస్లో చర్చ మొదలైంది. సాధారణంగా సీనియర్ సభ్యులను చైర్మన్లుగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అయితే, అధినేత మదిలో ఏముందో తెలియక, ఎవరికి అవకాశం దక్కుతుందో చెప్పలేకపోతున్నారు. కార్పొరేషన్ పదవులకు కత్తెరేనా! టీఆర్ఎస్ నుంచి పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశించి భంగపడ్డారు. సంఖ్యా పరిమితి కారణంగా కొందరికి అవకాశం రాలేదు. దీంతో వీరి దృష్టంతా ముఖ్యమైన ఆర్టీసీ, టీఎస్ఐఐసీ వంటి కార్పొరేషన్ పదవులపై ఉంది. ఇదే జాబితాలో వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్‌తో పాటు, ఇతర కొన్ని కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. ఈ పదవులు ఎపుడు భర్తీ అవుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇపుడు పీయూసీ, అంచనాల కమిటీల చైర్మన్ల పదవులు అంగీకరిస్తే, వీటిని చూపించి కార్పొరేషన్ చైర్మన్ల పదవులకు ఎక్కడ కత్తెర పెడతారో అన్న ఆందోళన వీరిలో వ్యక్తం అవుతోంది. ఈ పదవులను చూపించి తమ పేరును పరిగణనలోకి తీసుకోకుండా పోతారేమోనన్న అనుమానమూ వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ సభ్యులు ఏనుగు రవీందర్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, సోమారపు సత్యనారాయణ, దివాకర్‌రావు, రామలింగారెడ్డి వంటివారు పదవుల రేసులో ఉన్నవారే. బాజిరెడ్డి గోవర్ధ్దన్ సీనియర్ అయినా, ఆయన ఇప్పటికే వక్ఫ్‌బోర్డు సభా సంఘానికి చైర్మన్‌గా ఉన్నారు. మహిళల్లో కొండా సురేఖ మాత్రమే సీనియర్‌గా ఉన్నారు. దీంతో వీరిలో ఎవరినైనా ఎంచుకుంటారా..? లేదా జూనియర్ల నుంచే ఒకరిని ఎంపిక చేస్తారా? అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పీఏసీ చైర్మన్‌గా కిష్టారెడ్డి..! ప్రతిపక్షానికి దక్కనున్న శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే పి. కిష్టారెడ్డి నియామకం ఖరారైనట్లే. ఇందుకు సంబంధించి సోమవారం ఆ పార్టీ అధికారికంగా త న నిర్ణయాన్ని ప్రకటించనుంది. నాలుగుసార్లు గెలిచి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా ఇంతవరకు మంత్రిపదవి లభించని ఆయనకే ఈ పదవిని కట్టబెట్టాలని గతంలో పార్టీ నాయకులు నిర్ణయించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న సీనియర్లు గీతారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డీకే అరుణ మంత్రి పదవులను నిర్వహించిన విషయం తెలిసిందే. అందువల్ల కిష్టారెడ్డివైపే పార్టీ నాయకత్వం కూడా మొగ్గుచూపింది. అయితే ఈ పదవి కోసం మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఒకరిద్దరు నాయకులు పోటీపడుతున్నట్లు సమాచారం. దీంతో తొలిరెండేళ్లు కిష్టారెడ్డికి అవకాశమిచ్చి, చివరి రెండేళ్లు రాంరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వాలని పార్టీనాయకులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు రెండురోజుల క్రితం అసెంబ్లీలో జానారెడ్డి చాంబర్లో ఒక నిర్ణయానికి వచ్చినట్లు, సోమవారం దీనినే ప్రకటించనున్నట్లు తెలిసింది.