సాక్షి, తిరుమల: సాధారణంగా ప్రభుత్వాలు మారితే రూ.5 వేల కోట్లు పెండింగ్ బిల్లులు ఉంటాయని..కాని టీడీపీ ప్రభుత్వం రూ.60 వేల కోట్లు పెండింగ్ పెట్టిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. పెండింగ్ బిల్లులను భర్తీ చేయడానికి కాస్త సమయం పడుతుందని వివరించారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేడు విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఆర్థిక సంఘం భేటీ కానుందని చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని కేంద్రాన్ని కోరమని ఆర్థిక సంఘానికి సీఎం సూచిస్తారని పేర్కొన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సాయానికి ఆర్థిక సంఘం సిఫారసు చేస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment