finance problems
-
ఇంట్లోకి వెళ్లేందుకు బైబై చెబుతావు ఏంట్రా.. ఇంతలోనే షాకింగ్ ఘటన
మల్కాపురం(విశాఖపట్నం): తన తల్లిని టీ చేయమని అడిగాడు..తల్లి ఇచ్చిన టీ తాగాడు. సరే మమ్మీ బాయ్ అన్నాడు.. అంతలోనే తన గదిలోకి వెళ్లి తల్లి చీరతోనే ఊరి పోసుకుని మృతి చెందాడు. అంత వరకు సరదాగా గడిపిన కుమారుడు ఇంతటి ఘాతుకానికి పాల్పడడంతో ఆ తల్లి గుండె పగిలేలా రోదించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు .. జీవీఎంసీ 62వ వార్డు అల్లూరి సీతారామరాజుకాలనీ( ఏఎస్‌ఆర్‌కాలనీ) ప్రాంతంలో గట్ట రాజేష్ ( 25) తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. రాజేష్ తన స్నేహితుల కోసం తెలిసిన వారి వద్ద కొంత అప్పు చేశాడు. చదవండి: అనంతపురం: విషాదాన్ని మిగిల్చిన ‘గాడ్ ఫాదర్’ దీనికి తోడు తండ్రి సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా మారడంతో ఇంటి అవసరాల కోసం మరి కాస్తా అప్పు చేశాడు. అప్పులు ఇచ్చిన వారు పదే పదే డబ్బులు అడగడంతో వేరే దారి లేక చనిపోదామని రెండు వారాల కిందట నిర్ణయించుకున్నాడు. దీంతో రాజేష్ దిగాలుగా ఉంటున్నాడు. ఇది గుర్తించిన తల్లి స్థానికంగా ఓ పాస్టర్ వద్దకు తీసుకువెళ్లి ఆయన చేత ధైర్యం చెప్పించింది. ఇది ఇలా ఉంటే బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో తల్లిని టీ అడిగాడు. తల్లి చేతితో ఇచ్చిన టీ తాగిన రాజేష్ తన గదిలోకి వెళ్లేముందు బై బై మమ్మీ అని చెప్పాడు. ఇంట్లోకి వెళ్లేందుకు బైబై చెబుతావు ఏంట్రా అని ప్రశ్నించింది. దానికి నవ్వుతూ గదిలోకి వెళ్లి పోయిన రాజేష్ తల్లి చీరతో ఫ్యాన్ హుక్కుకు ఊరిపోసుకున్నాడు. ఆ సమయంలో తండ్రి విధుల నుంచి వచ్చి రాజేష్ ఏడి అని అడిగాడు. ఈ క్రమంలో గది వద్దకు వెళ్లగా వేలాడుతున్న కుమారుడిని చూసి కేకలు వేయడంతో తల్లి అక్కడకు చేరుకుంది. ఇద్దరూ కిందకు దించి కాపాడే ప్రయత్నం చేశారు.కానీ ఫలితం దక్కలేదు. దీంతో వారు మల్కాపురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి వచ్చి ఆరా తీశారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసును మల్కాపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని నలుగురు ఆత్మహత్య
మైసూరు: ఆర్థిక ఇబ్బందులతో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని చామరాజనగర తాలూకా హెచ్.మూకహళ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మహదేవస్వామి (45), భార్య మంగళమ్మ (40), పిల్లలు జ్యోతి (14), శృతి (12) ఉరి వేసుకుని మరణించారు. వీరికి ఒక ఎకరా పొలం ఉంది. తరచూ నష్టాలే వచ్చాయి. అలాగే అప్పులు పెరిగిపోయాయి. కరోనా సమయంలో కూలి పనులు కూడా దొరకక తీవ్ర అవస్థలు పడ్డారు. 20 రోజుల క్రితం నలుగురికీ కరోనా సోకి, ఇటీవలే కోలుకున్నారు. జీవితంలో కష్టాలు తీరే మార్గం లేదని ఆవేదన చెంది మంగళవారం రాత్రి భోజనం చేశాక అందరూ ఉరివేసుకున్నారు. బుధవారం ఉదయం ఎంతసేపైనా అలికిడి లేకపోవడంతో ఇరుగుపొరుగు వచ్చి చూడగా మృతదేహాలు కనిపించాయి. మొదట పిల్లలకు ఉరివేసి, తరువాత పెద్దవారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ గ్యాంగ్‌రేప్ నిందితుడు) -
గుడ్‌బై.. ఎయిరిండియా!!
న్యూఢిల్లీ: పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయ ప్రక్రియను ఈసారైనా కచ్చితంగా పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇన్వెస్టర్లకు అభ్యంతరకరంగా ఉన్న నిబంధనలను సవరించడంపై కసరత్తు చేస్తోంది. దీని ప్రకారం ఎయిరిండియా నుంచి కేంద్రం పూర్తిగా నిష్క్రమించే అవకాశం ఉంది. ఉద్యోగుల ఎసాప్స్ కోసం అయిదు శాతం వాటాలు మాత్రమే అట్టే పెట్టుకుని మిగతా 95 శాతాన్ని విక్రయించేసేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు క్యాబినెట్ సెక్రటరీ పి.కె. సిన్హా సారథ్యంలోని కార్యదర్శుల కమిటీ చేసిన సిఫార్సులకు సూత్రప్రాయంగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిరిండియా విక్రయం ఎప్పుడు చేపట్టాలి, ఎన్ని షేర్లు విక్రయించాలి, డీల్ ఎంత స్థాయిలో ఉండాలి అన్న అంశాలపై హోం మంత్రి అమిత్ షా సారథ్యంలోని మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నాయి. అక్టోబర్ తొలి వారంలోగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ)ను ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని వివరించాయి. ప్రతిపాదనలు ఇలా.. కొనుగోలుదారులపై భారీ రుణభారం పడకుండా చూడటం నుంచి ప్రైవేటీకరణ ప్రక్రియ నిబంధనల సడలింపు దాకా ఎయిరిండియాను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటోంది. గతంలో ఎయిరిండియా విక్రయానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడానికి గల కారణాలను విశ్లేషించుకుని, తగు మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు అధికార వర్గాలు వివరించాయి. ఎయిరిండియా ప్రైవేటీకరణ తర్వాత కూడా ప్రభుత్వం 24 శాతం వాటాలను తన దగ్గరే ఉంచుకుంటుందన్న నిబంధన కారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదని విక్రయ ప్రక్రియకు సలహాదారుగా వ్యవహరించిన ఈవై సంస్థ పేర్కొనడంతో ఏకంగా 95 శాతం వాటాలను అమ్మకానికి పెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇక, వాటాలు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు.. కంపెనీ నిర్వహణకు అవసరమైన నిధులను సమీకరించుకునేందుకు లాకిన్ వ్యవధి లేకుండా కొన్ని వాటాలను తక్షణం విక్రయించుకునే వెసులుబాటు కూడా కల్పించనుంది. గతంలో సెంటార్ హోటల్ విక్రయం విషయంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అక్షింతల కారణంగా ఎయిరిండియా వాటాల అమ్మకంలో మూడేళ్ల లాకిన్ వ్యవధి నిబంధనను గత ప్రతిపాదనల్లో పెట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో సెంటార్ హోటల్‌ను కొనుగోలు చేసిన టులిప్ హాస్పిటాలిటీ సర్వీసెస్.. దాన్ని నిర్వహించే ప్రయత్నాలేమీ చేయకుండా ఆ వెంటనే మరింత అధిక ధరకు దాన్ని అమ్మేసేయడాన్ని కాగ్ తప్పుపట్టింది. ఇలాంటివి మళ్లీ తలెత్తకుండా ఎయిరిండియా విక్రయ ప్రతిపాదనలో లాకిన్ వ్యవధిని చేర్చాల్సి వచ్చింది. అయితే, అసలే నష్టాలతో కుదేలైన ఎయిరిండియాను నడిపించడానికి అవసరమైన నిధులను సమీకరించుకోవడానికి ఈ నిబంధన సమస్యగా మారుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఎయిరిండియాకు రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రావు కాబట్టి కొత్త యజమాని తాను కొనుక్కున్న వాటాలను విక్రయించుకుంటే గానీ నిధులు సమకూర్చుకోవడం కుదరదు అని తెలిపాయి. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకుని లాకిన్ వ్యవధి నిబంధనను పక్కన పెట్టనున్నట్లు అధికార వర్గాలు వివరించాయి. అంతే కాకుండా కొనుగోలుదారు తన ప్రస్తుత వ్యాపారంలో ఎయిరిండియాను విలీనం చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించేలా నిర్దిష్ట నిబంధనను కూడా సడలించనున్నారు. ముచ్చటగా మూడోసారి.. ఎయిరిండియాను విక్రయించేందుకు గతంలో రెండు సార్లు ప్రయత్నాలు జరిగాయి. 2001లో ఒకసారి, మళ్లీ 2018లో మరోసారి కేంద్రం ప్రయత్నించింది. కానీ ఈ రెండూ విఫలం కావడంతో.. ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి ప్రయత్నిస్తోంది. ఆర్థిక సంక్షో భంలో ఉన్న ఎయిరిండియాను గట్టెక్కించేం దుకు కేంద్రం 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,465 కోట్లు, 2017–18లో రూ.1,800 కోట్లు, 2018–19లో రూ. 3,975 కోట్ల మేర నిధులు సమకూర్చింది. గోప్యంగా సమాలోచనలు... ప్రస్తుత విధానాలకు భిన్నంగా ఎయిరిండియాను కొనుగోలు చేసే అవకాశాలున్న సంస్థలతో ఒక చిన్నపాటి ప్రభుత్వాధికారుల బృందం నేరుగా సంప్రదింపులు జరుపుతోంది. కొనుగోలుకు ఆశక్తిగా ఉన్న ఇన్వెస్టర్ల అభిప్రాయాలను తెలుసుకుని ఎయిరిండియా విక్రయ ప్రతిపాదనకు తుది మెరుగులు దిద్దుతోంది. ఈ సమాలోచనలన్నీ గోప్యంగా జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సాధ్యమైనంత వరకూ విక్రయ ప్రక్రియపై ప్రభుత్వ వర్గాల ప్రభావమేదీ పడకుండా చూసేందుకే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. అయితే, పెద్ద మొత్తంలో బిడ్ చేస్తున్నప్పుడు సీఈవో లేదా సీఎఫ్వోల్లాంటివారు కాకుండా ప్రమోటరు స్థాయిలో ఉన్న వారే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రమోటర్లు నేరుగా విక్రేతతోనే సంప్రదింపులు జరిపేందుకు ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టే కీలకమైన కొంత మంది ప్రభుత్వ అధికారులను మాత్రమే ఈ చర్చల్లో భాగం చేసినట్లు అధికార వర్గాలు వివరించాయి. -
జెట్ విక్రయం టేకాఫ్!!
ముంబై, న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్వేస్ విక్రయ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి జెట్ ఎయిర్వేస్కు రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియం తరఫున బిడ్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సోమవారం బహిరంగ ప్రకటన ఇచ్చింది. వ్యూహాత్మక ఇన్వెస్టర్స్ (ఎస్ఐ), ఆర్థిక ఇన్వెస్టర్స్ (ఎఫ్ఐ) నుంచి బిడ్స్‌ను ఆహ్వానించింది. ఈ ప్రతిపాదన ప్రకారం .. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి కనిష్టంగా 3.54 కోట్ల షేర్లు (సుమారు 31.2 శాతం వాటాలు) నుంచి గరిష్టంగా 8.51 కోట్ల దాకా షేర్లను (75 శాతం వాటాలు) విక్రయించే అవకాశం ఉంది. బిడ్ల దాఖలుకు ఆఖరు తేది ఏప్రిల్ 10. అర్హత పొందిన బిడ్డర్లు ఏప్రిల్ 30లోగా తుది బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కాగా ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ సంస్థ ఈ బిడ్డింగ్ నిర్వహణలో తోడ్పాటు అందించనుంది. దాదాపు రూ. 8,000 కోట్ల పైచిలుకు రుణభారం పేరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ గత కొన్నాళ్లుగా రుణాల చెల్లింపుల్లో విఫలమవుతోంది. సిబ్బంది జీతభత్యాలు కూడా సకాలంలో చెల్లించలేక సతమతమవుతోంది. పలు విమానాలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా ఎయిర్‌లైన్ నియంత్రణను బ్యాంకులు తమ చేతుల్లోకి తీసుకున్నాయి. మార్చి 25న జెట్ ఎయిర్వేస్ బోర్డు ఆమోదించిన ప్రణాళిక ప్రకారం.. సంస్థలో మెజారిటీ వాటాలు బ్యాంకుల చేతికి వచ్చాయి. కంపెనీ వ్యవస్థాపకుడు, ప్రమోటరు నరేష్ గోయల్, ఆయన భార్య జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి నిష్క్రమించారు. సంస్థలో వారి వాటా గతంలో ఉన్న 51 శాతం నుంచి 25 శాతానికి తగ్గింది. ఇక, జెట్ కుప్పకూలకుండా యథాప్రకారం కార్యకలాపాలు కొనసాగించేందుకు బ్యాంకులు సుమారు రూ. 1,500 కోట్లు సమకూర్చనున్నాయి. ప్రకటన సారాంశం.. ఎస్బీఐ కన్సార్షియం ప్రకటన ప్రకారం.. జెట్ ఎయిర్వేస్ వివిధ బ్యాంకుల నుంచి రూ. 8,000 కోట్ల పైచిలుకు రుణాలను పొందింది. తర్వాత తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడంతో రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితిలోకి జారిపోయింది. ఈ నేపథ్యంలోనే సంస్థ విక్రయం చేపట్టడం జరిగింది. ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) రూపకల్పన, సమర్పణకు సంబంధించిన అన్ని వ్యయాలను బిడ్డర్సే భరించాల్సి ఉంటుందని ప్రకటన పేర్కొంది. దేశ, విదేశాల్లో ఇదే తరహా రంగాల్లో అనుభవమున్న కార్పొరేట్లు వ్యూహాత్మక ఇన్వెస్టర్స్ (ఎస్ఐ) కేటగిరీ కింద బిడ్స్ వేయొచ్చు. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ మొదలైన వాటిని ఎఫ్ఐల కేటగిరీ కింద వర్గీకరించారు. ఎస్ఐలకు ఏవియేషన్ వ్యాపారంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. కన్సార్షియంగా ఏర్పడి బిడ్స్ వేసిన పక్షంలో .. అందులో ముగ్గురు సభ్యులకు మించి ఉండకూడదు. కన్సార్షియంలో ఒక్కొక్కరి వాటా 15 శాతానికి పైబడే ఉండాలి. ఆరు అంతర్జాతీయ సంస్థల ఆసక్తి.. జెట్ ఎయిర్వేస్లో వాటాల కొనుగోలుపై ఆరు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ వంటి వ్యూహాత్మక ఇన్వెస్టర్లతో పాటు కేకేఆర్, బ్లాక్‌స్టోన్, టీపీజీ క్యాపిటల్ వంటి ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్బీఐ కన్సార్షియం ఇప్పటికే జెట్ ఎయిర్వేస్లో వాటాల విక్రయంపై టాటా గ్రూప్, టీపీజీ క్యాపిటల్ వంటి సంస్థలతో కూడా సంప్రదింపులు జరిపింది. సోమవారం బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేరు 3% పెరిగి రూ. 264.10 వద్ద క్లోజయ్యింది. -
అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య
సిరికొండ(బోథ్): అప్పులు పెరిగిపోవడం..రైతుబంధు సాయం రాకపోవడంతో మనస్థాపం చెందిన సిరికొండ మండల కేంద్రంలోని బోయవాడకాలనీకి చెందిన రైతు గోగుల నారాయణ (56) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. నారాయణ తనకున్న రెండెకరాల పరంపోగు భూమితోపాటు మరింత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. గతేడాది సక్రమంగా పంటలు పండకపోవడం, తనకున్న ముగ్గురు కూతుర్ల వివాహాలు చేయడంతో అప్పులు అధికమయ్యాయి. అవి ఎలా తీర్చాలోనని తీవ్ర మనస్థాపానికి గురయ్యేవాడు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి పెంచడం, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సహాయం చిల్లిగవ్వ రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెంది శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇంటి తలుపులు తీసి చూడగా నారాయణ మృతిచెంది ఉన్నాడు. నారాయణకు భార్య, ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. -
అప్పులధికమై.. బతుకు భారమై..
జీవితంలో స్థిరపడేందుకు ఓ యువకుడు వ్యాపార రంగాన్ని ఎంచుకున్నాడు... అప్పుచేసి పెట్టుబడి పెట్టాడు.. కొన్నాళ్లు సాఫిగానే సాగిన వ్యాపారంలో నష్టాలు వచ్చాయి...వాటిని పూడ్చుకునేందుకు మళ్లీ అప్పులు చేశాడు.. ఇటు వ్యాపారంలో నష్టాలు.. అటు తెచ్చిన అప్పులకు వడ్డీ భారం పెరిగిపోతుండడంతో కలత చెందాడు. అధికమవుతున్న అప్పులు.. భారంగా మారుతున్న బతుకును ముందుకు సాగించలేక.. ఇక చావే శరణ్యమనుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మునుగోడులో శనివారం ఈ విషాదకర ఘటన వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు : నియోజకవర్గ కేంద్రానికి చెందిన మేడం వెంకన్న, లక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు చొప్పున కుమారులు, కుమార్తెలు సంతానం. వీరిలో చిన్నకుమారుడు మేడం నవీన్ (38) డిగ్రీ వరకు చదివాడు. కంప్యూటర్ విద్యను నేర్చుకుని ప్రైవేట్ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తునే మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే ప్రైవేట్‌గాచాలీచాలని వేతనాలు ఇస్తుండడంతో కుటుంబ పోషణ నిమిత్తం వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. రెండేళ్ల క్రితం మండల కేంద్రంలోని కూల్‌డ్రింక్ దుకాణాన్ని ప్రారంభించాడు. ఏజెన్సీకి రూ.10 లక్షలు, పెట్టుబడికి మరో రూ. 5 లక్షలు అప్పు చేశాడు. తల్లిదండ్రిని పడుకోమని చెప్పి.. సదరు కంపెనీ రద్దుచేసుకున్న ఏజెన్సీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడంలో తాత్సారం చేయడం.. ఇటు అప్పుల వారి ఒత్తిడి పెరుగుతుండడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి 8 గంటల వరకు స్నేహితులతో గడిపిన నవీన్ అనంతరం తల్లిదండ్రి ఉంటున్న ఇంటికి వెళ్లాడు. రాత్రి తొమ్మిది గంటలకు వరకు వారితో ముచ్చటించి ఇక పడుకొండని చెప్పి బయటికి వెళ్లాడు. అనంతరం ఇంటిపైకి ఎక్కి ఎరువుల దుకాణంలో తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. రాత్రి 10 గంటలైనా భర్త ఇంటికి రాకపొవడంతో పలుమార్లు అతనికి భార్య మహేశ్వరి పోన్‌చేసినా లిఫ్ట్ చేయలేదు. ఉదయం వరకు కన్పించకపొవడంతో చుట్టు పక్కలవారు గమనించగా ఇంటిపైనే మృతిచెంది ఉ న్నాడు. సమాచారం మేరకు ఎస్ఐ రాములు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అప్పులబాధతో యువ వ్యాపారి మృతిచెందడంతో మునుగోడులో విషాదం అలుముకుం ది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. ఏజెన్సీని రద్దు చేసుకుని.. కొన్నాళ్లుగా బాగానే సాగిన వ్యాపారంలో క్రమ క్రమంగా నష్టాలు వచ్చాయి. బిజినెస్‌ను వృద్ధి చేయాలనే ఉద్దేశంతో మళ్లీ అప్పు చేశాడు. అయినా వ్యాపారం బాగా సాగలేదు. తీసుకున్న అప్పుల భారం సుమారు రూ.20 లక్షలు దాటడడంతో తీవ్ర మనోవేదనచెందాడు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం ఏజెన్సీని రద్దు చేసుకుని వచ్చే రూ. 10 లక్షలతో కొంతైనా అప్పు తీర్చాలని అనుకున్నాడు. -
అప్పులబాధతోనే అఘాయిత్యం!
-
అప్పులబాధతోనే అఘాయిత్యం!
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ నార్సింగ్ ఠాణా పరిధిలోని కొల్లూరు సమీపంలో చోటు చేసుకున్న ‘నాలుగు హత్యలు, ఒక ఆత్మహత్య’ కేసు మిస్టరీని ఛేదించడానికి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రాథమికంగా అప్పులభారం పెరగడంతోనే ప్రభాకర్‌రెడ్డి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. అయితే, పిన్ని లక్ష్మి, ఆమె కుమార్తెలకు విషం ఇవ్వడం వెనుక ఉన్న అసలు విషయం వెలుగులోకి రావాల్సి ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. షేర్ల వ్యాపారంలో ఉన్న ప్రభాకర్‌రెడ్డి ఇటీవల కాలంలో భారీగా నష్టపోయినట్లు తెలిసింది. దీంతో అనేకమంది నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకువచ్చినట్లు సమాచారం. గడిచిన నెల రోజులుగా ప్రభాకర్‌రెడ్డి షేర్ మార్కెట్లో భారీ మొత్తం వెచ్చించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నూటికి రూ.3 నుంచి రూ.5 వడ్డీకి కొందరి నుంచి తక్కువ కాలంలోనే మీ మొత్తం రెట్టింపు చేస్తానంటూ హామీ ఇచ్చి మరికొందరి నుంచి డబ్బు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా ప్రభాకర్‌రెడ్డికి డబ్బు ఇచ్చిన వాళ్ళు ఒక్కొక్కరుగా నార్సింగ్ పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి ఈ మొత్తం రూ.7 కోట్లుగా ఉన్నట్లు తేలిందని పోలీసులు చెప్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి పిన్ని లక్ష్మీ అతడికి ఎంత మొత్తం ఇచ్చారు? ఆ నగదు ఎక్కడ నుంచి తీసుకువచ్చారు? అనే అంశాలను పరిశీలిస్తున్నామని, దీనిపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంటున్నారు. ఈ ఉదంతం చోటు చేసుకోవడానికి అప్పు ఇవ్వడమే కారణమా? మరే ఇతర కారణం ఉందా? అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రభాకర్‌రెడ్డితో పాటు లక్ష్మీకి చెందిన సెల్‌ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్న పోలీసులు ఆఖరిసారిగా ఎవరితో సంప్రదింపులు జరిపారు? ఏం మాట్లాడారు? వారితో వీరికి ఉన్న లావాదేవీలు ఏంటి? అనేవి తెలుసుకుంటున్నారు. దీనికోసం ఆయా నంబర్లకు ఫోన్లు చేస్తున్న పోలీసులు వారితో మాట్లాడుతున్నారు. మరోపక్క ప్రభాకర్‌రెడ్డి ఇంటి నుంచి సేకరించిన ల్యాప్‌టాప్‌లోని అంశాలను విశ్లేషిస్తున్నారు. ఈ కేసు విషయమై సోమవారం నాటికి స్పష్టత వస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ప్రభాకర్‌రెడ్డికి అప్పులు ఇచ్చిన, అతడి వద్ద పెట్టుబడులు పెట్టిన వారు పదుల సంఖ్యలో ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. -
మట్టిలో మాణిక్యాలు
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
ఖమ్మం: అప్పుల బాధ తాళలేక రైతు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన శుక్రవారం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. గుండాల మండలం మిట్టపల్లిగుంపు గ్రామానికి చెందిన కోటయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సాగు కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో పాటు పంట దిగుబడి రాకపోవడంతో.. మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం మృతిచెందినట్లు గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. -
కౌలు రైతు బలవన్మరణం
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో అప్పుల బాధతో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గంగారం గ్రామానికి చెందిన సంతోషం బక్కమల్లు (48) అనే కౌలు రైతు నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. సాగు కోసం రూ.4 లక్షలు అప్పులు చేశాడు. పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో పాటు చేసిన అప్పులు తీర్చే దారిలేక మనస్తాపానికి గురైన బక్కమల్లు సోమవారం తెల్లవారుజామున పొలంలో పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.