కరీంనగర్ జిల్లాలో అప్పుల బాధతో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో అప్పుల బాధతో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గంగారం గ్రామానికి చెందిన సంతోషం బక్కమల్లు (48) అనే కౌలు రైతు నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. సాగు కోసం రూ.4 లక్షలు అప్పులు చేశాడు. పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో పాటు చేసిన అప్పులు తీర్చే దారిలేక మనస్తాపానికి గురైన బక్కమల్లు సోమవారం తెల్లవారుజామున పొలంలో పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.