fires chandrababu
-
ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలపై సోము వీర్రాజు ఫైర్
-
కాంగ్రెస్ ,బీజేపీ లకు డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పండి: అంబటి రాంబాబు
బద్వేలు (వైఎస్సార్ కడప): బద్వేలు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాసరి సుధ విజయం ఖాయమని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఏ ప్రలోభాలకు గురికాకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. గెలిచే ఎన్నిక అయినా.. భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంపై అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు ఎందుకు ఓటువేయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చీల్చింది.. అంతరించిపోతుంది. అదే విధంగా.. బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది.. ప్రస్తుతం దాని ఉనికే లేదని విమర్శించారు. కాంగ్రెస్ , బీజేపీ లకు డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పండని తీవ్ర స్థాయిలో విమర్శించారు. టీడీపీ, జనసేనలు పోటీలో నిలవకుండా లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నాయని అంబటి రాంబాబు విమర్శించారు. పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరిపై తక్షణం క్లారిటీ ఇవ్వాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. బద్వేలు బరిలో మొత్తం 15 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ నెల 30న బద్వేలుకు ఉప ఎన్నిక జరగనుంది. చదవండి: ‘ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం బలవంతం పెట్టలేదు’ -
జత కట్టినప్పుడు గుర్తుకు రాలేదా బాబూ!
మధురపూడి (రాజానగరం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లతో ముఖ్యమంత్రి చంద్రబాబు జతకట్టినప్పుడు గుర్తుకురాలేదా, ఇప్పుడు విమర్శిస్తున్నారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి దుయ్యబట్టారు. కోరుకొండ మండలంలో శనివారం సుడిగాలి పర్యటన చేవారు. బుచ్చెంపేటలో జక్కంపూడి గణేశ్ నిర్వహిస్తున్న పాదయాత్ర వద్దకు చేరుకుని, యాత్రలో పాల్గొన్న యువతను అభినందించారు. ఈ సందర్భంగా జక్కంపూడి విలేకర్లతో మాట్లాడుతూ అమరావతి రాజధాని శంకుస్థాపనకు గంగానది నీరు. మట్టి తీసుకొచ్చినప్పుడు పొగిడిన చంద్రబాబు, ఇప్పుడు విమర్శించడం ఎంత వరకూ సబబన్నారు. అప్పుడెందుకు చెలిమికట్టారు, ఇప్పుడెందుకు విమర్శిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో బాబు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. యువనేస్తం పథకాన్ని కన్నీటితుడుపుగా నిర్వహించారన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనం మద్దతు ఉందని, పొత్తుల కోసం ఆరాటపడే నాయకుడు కాదని జక్కంపూడి అన్నారు. అలాగే జక్కంపూడి కుటుంబం ప్రజల సంక్షేమానికి అలుపెరగకుండా పొరాటం చేస్తుందన్నారు. అనంతరం గాదరాడలో ఇటీవల మృతి చెందిన పార్టీ నాయకుడు కుటుంబాన్ని పరామర్శించి, సానుభూతిని వ్యక్తం చేశారు. -
చంద్రబాబు అవకాశవాది: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అవకాశాన్ని బట్టి మాట్లాడే వ్యక్తి అని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం కాదని తెలిసినా ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారని, హోదా వచ్చిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఎన్ని కంపెనీలు స్థాపించారు.. ఎన్ని ఉద్యోగాలొచ్చాయో చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు గత వారం రోజులుగా ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని విజయసాయి రెడ్డి ఆదివారం సందర్శించారు. అనంతరం విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఆ విషయాన్ని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. బంద్‌ల వల్ల ప్రయోజనం లేదని సీఎం అంటున్నారని, అధికారంలో లేని రోజుల్లో టీడీపీ ఎన్నిసార్లు బంద్‌కు పిలుపునిచ్చిందో గుర్తు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదా కోసం తమతో కలిసివచ్చే ప్రతి పార్టీకి వైఎస్సార్సీపీ మద్ధతుగా నిలుస్తుందని వెల్లడించారు. మీ ఎంపీలు కేవలం కేంద్ర మంత్రి పదవులకే రాజీనామా చేశారని, మీకు హోదాపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎంపీ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబుకు ముద్రగడ ఘాటు లేఖ
కాకినాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరోసారి ఘాటు లేఖ సంధించారు. ‘ మీరు మేధావి అని అందరూ భావించారు. కానీ మీ మేధావితనంతో మీకు కావాల్సిన వారికి, మీ కుటుంబానికి కోట్ల రూపాయలు దోచిపెట్టారని అర్ధమైంది. మా జాతికి ఇచ్చిన హమీలను అమలు చేయమని అడిగితే అన్నదమ్ముల్లాంటి మా సోదరులతో తిట్టించి పబ్బం గడుపుకుంటున్నారు. మా జాతిలో కొందరి ఆర్ధిక మూలలను దెబ్బతీశారు. కొందరిపై తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్లు తెరిపించారు.’ అని లేఖ ద్వారా విమర్శించారు. ‘ కామన్ వెల్త్ ఆటల్లో రెండు సార్లు స్వర్ణం సాధించిన కాపు క్రీడాకారుడు వెంకట రాహుల్‌కు ఎందుకు అభినందనలు చెప్పలేదో లోకానికి చెప్పండి. మీ సంతానం తెలుగు నేర్చుకోవడానికి ప్రజల ఆస్తి కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సిగ్గుగా లేదా. హమీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టాడానికి మీరు చేస్తున్న గోబెల్స్ ప్రచారం రాష్ర్టానికే కాదు..దేశానికే ప్రమాదం. మీ మోసం కన్నా క్యాన్సర్ వ్యాధే మంచిది. మీ మోసానికి మందులు కూడా ఉండవు. ఇలా మోసం చేసే పార్టీని ప్రజలు భూస్ధాపితం చేస్తే మంచిది. ఏపీలో రైళ్ళని ఆపితే ప్రత్యేక హోదా ఎందుకు రాదు? ’ అని లేఖలో పేర్కొన్నారు. విలేకరులతో విడిగా మాట్లాడుతూ.. జనసేన కోశాధికారి రాఘవయ్య ఇటీవల మా ఇంటికి వచ్చినప్పుడు సూచనలు ఇచ్చానే తప్ప పార్టీలో చేరతాననలేదని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సినిమాలను వీడి పూర్తి గా రాజకీయాల్లో ఉంటేనే రాణిస్తారు అని రాఘవయ్యకు సూచించానని ముద్రగడ తెలిపారు. -
బాబుతో తాడో పేడో తేల్చుకుందాం
అనంతపురం రూరల్ : ఎస్సీ వర్గీకరణ చేస్తానని మాదిగలను నిలువునా మోసంచేసిన సీఎం చంద్రబాబుతో తాడో పేడో తెల్చుకుందామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు నిచ్చారు. మంగళవారం నగరంలోని రామ్‌నరేష్ పంక్షన్హాల్లో మాదిగల కురుక్షేత్ర సన్నాహక సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆంధ్రప్రదేశ్‌లో మాలలే అధికంగా ఉన్నారనీ, మాదిగలు లేరనే భావనలో ప్రభుత్వం భ్రమ పడుతోందన్నారు. అందుకే రాష్ట్రంలో ఉన్న అన్ని పదవులను మాలలకే కట్టబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాదయాత్రలో మాదిగలకు ఇచ్చిన ఏ హామీని నేరవేర్చిన పాపన పోలేదని మండిపడ్డారు. జూలై 7న తలపెట్టిన మాదిగల కురుక్షేత్ర మహాసభను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. -
హైకోర్టు తీర్పుతో బాబు ఉక్కిరిబిక్కిరి