
బాబుతో తాడో పేడో తేల్చుకుందాం
అనంతపురం రూరల్ : ఎస్సీ వర్గీకరణ చేస్తానని మాదిగలను నిలువునా మోసంచేసిన సీఎం చంద్రబాబుతో తాడో పేడో తెల్చుకుందామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు నిచ్చారు. మంగళవారం నగరంలోని రామ్‌నరేష్ పంక‌్షన్‌హాల్‌లో మాదిగల కురుక్షేత్ర సన్నాహక సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆంధ్రప్రదేశ్‌లో మాలలే అధికంగా ఉన్నారనీ, మాదిగలు లేరనే భావనలో ప్రభుత్వం భ్రమ పడుతోందన్నారు. అందుకే రాష్ట్రంలో ఉన్న అన్ని పదవులను మాలలకే కట్టబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాదయాత్రలో మాదిగలకు ఇచ్చిన ఏ హామీని నేరవేర్చిన పాపన పోలేదని మండిపడ్డారు. జూలై 7న తలపెట్టిన మాదిగల కురుక్షేత్ర మహాసభను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.