First Aid boxes
-
అంతా నామమాత్రమే!
చిత్తూరు , తిరుపతి (అలిపిరి) : సార్వత్రిక ఎన్నికలు–2019కి జిల్లా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే 14 నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్ధం చేశారు. పోలింగ్ సమయంలో ఓటర్లు వడదెబ్బకు గురైనా, ఇతర కారణాలతో ఇబ్బందులు తలెత్తినా తక్షణం వైద్య సేవలందించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల ఏర్పాటుకు వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ విధులకు వైద్యులు, సిబ్బంది జాబితాను ఖరారు చేసింది. అల్లోపతి వైద్యుల స్థానంలో ఆయుష్ వైద్యులకు నియమించింది. అత్యవసర వైద్యం అందించేందుకు మెడికోలు, హౌస్‌సర్జన్ వైద్య విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని పేర్కొనడం విశేషం! ఈనెల 10, 11 తేదీల్లో వైద్యులకు సెలవులు ఉండబోవని వైద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 3,820 పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 11న ఎన్నికలు నిర్వహించనుండటం విదితమే.ఈ కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను ఏర్పాటు చేయడంలో భాగంగా వైద్యులు, సిబ్బందికి విధులు కేటాయించింది. పారామెడికల్, ఆయుష్, 104 సర్వీస్ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, మెడికోలు, హౌస్సర్జన్ల సేవలను ఇందుకు వినియోగించుకోనుంది. అయితే అల్లోపతి వైద్యులకు మాత్రం ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో విధులు నామమాత్రంగా కేటాయించినట్లు తెలుస్తోంది. అత్యవసర వైద్య సేవలకు దూరంగా ఉంటున్న ఆయుష్ వైద్యులను పోలింగ్ కేంద్రాల ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో విధులను కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. అల్లోపతి వైద్యుల్లో అసంతృప్తి ఎన్నికల విధులకు ఆయుష్ వైద్యులను నియమించడంపై అల్లోపతి వైద్యుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వైద్య విద్యను అభ్యసించే వారిని వినియోగించుకోవడం మినహా అల్లోపతి వైద్యులను ఫస్ట్ ఎయిడ్ సెంటర్లకు దూరం చేశారనే విమర్శలు వస్తున్నాత్తాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తీరుపై వారు పెదవి విరుస్తున్నారు. మెడికల్ ఆఫీసర్లదే బాధ్యత పోలింగ్ కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్లను సరఫరా చేసే బాధ్యతను ఆయా కేంద్రాల్లోని ప్రైమరీ హెల్త్ సెంటర్ల మెడికల్ ఆఫీసర్లు బాధ్యత వహించాల్సి ఉంది. జిల్లాలోని 121 ఆస్పత్రుల పరిధిలో ఈనెల 10న అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి. మెడికల్ ఆఫీసర్లు పోలింగ్ కేంద్రాల ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో మందుల అందుబాటులో ఉన్నాయా, లేవా? అన్నది సరి చూసుకోవాల్సిన ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫస్ట్ ఎయిడ్ సెంటర్లకు అవసరమైన మందుల కోసం సెంట్రల్, డిస్టిక్ డ్రగ్ స్టోర్లకు, వైద్య శాఖకు ఇప్పటికే ఇండెంట్ పెట్టారు. 10, 11న వైద్యులకు సెలవు లేదు ఈనెల 10, 11 తేదీల్లో వైద్యులకు సెలవులను నిరాకరించారు. వైద్యులకు కేటాయించిన కేంద్రాల వద్దకు చేరుకోవడానికి వైద్య శాఖ రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయలేదు. వైద్యులు, ఇతర సిబ్బంది వారి వారి సొంత ఖర్చులతో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవాల్సి ఉంది. వాళ్లంతా హై క్వాలిఫైడ్ వైద్యులు ఆయుష్ శాఖ వైద్యులు అత్యవసర వైద్యాన్ని అందించగలరు. వారు హై క్వాలిఫైడ్ డాక్టర్లు. ఇందులో అనుమానం లేదు. ఫస్ట్ ఎయిడ్ కేంద్రాల విధులను అత్యంత జాగ్రత్తగా కేటాయించాం. ప్రజలకు చిన్నపాటి ఇబ్బంది తలెత్తినా వైద్యులు అందుబాటులో ఉంటారు.– డాక్టర్ రామగిడ్డయ్య,జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, చిత్తూరు -
బాక్సులు ఫుల్.. మందులు నిల్
సాక్షి, భైంసా: ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ప్రయాణికుల సంఖ్య పెంచుకోవడమే ధ్యేయంగా వివిధ పథకాలను ప్రవేశపెడుతున్న ఆర్టీసీ అధికారులు కనీస వైద్య సదుపాయాలను కల్పించడంలో విఫలమవుతోంది. విధిగా బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. బాక్సులు ఉన్నా అందులో మందులు ఉండవు. భైంసా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుల్లో మందులు మచ్చుకైనా కనిపించవు. ఫస్ట్ ఎయిడ్ బాక్సు లు ఉన్నా నామమాత్రంగా కనిపిస్తున్నాయి. పేరుకే ఫస్ట్‌ఎయిడ్ బాక్సులు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్స చేసేందుకు వీటి అవసరం ఎంతైనా ఉంటుంది. కాని బస్సులలో ఫ స్ట్ఎయిడ్ బాక్సులు కనిపిస్తున్నప్పటికీ అందులో మందు లు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. దీన్ని చూసిన ప్రయాణీకులు పేరుకే ఫస్ట్‌ఎయిడ్ బాక్సులు ఉన్నాయని చర్చించుకుంటున్నారు. కొన్ని బస్సులలో ఫస్ట్‌ఎయిడ్ బాక్సులు కనిపించడం లేదు. ఆర్టీసీ కొత్త బస్సులను కొనుగోలు చేసినప్పుడు ఎఫ్‌సీ కోసం నామమాత్రంగా ఫస్ట్ ఎయిడ్ బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. రవాణా శాఖ అధికారులు సైతం బస్సు రిజస్ట్రేషన్ చేసే సమయంలో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉంటే చాలనుకుంటున్నారు. కాని అందులో మందులు ఉన్నాయా లేదో పట్టించుకోవడం లేదు. దీంతో ప్రమాదాలు సంభవించినప్పుడు బాధితులకు వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స అందడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్సులను ఏర్పాటు చేసి అందులో ప్రథమ చికిత్సకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
ప్రథమ చికిత్స.. అధమం
గుమ్మలక్ష్మీపురం (కురుపాం) : అత్యవసర సమయంలో వెంటనే చికిత్స అందిస్తే ప్రమాద తీవ్రత తగ్గుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం బస్సులు, పాఠశాలల్లో మందులు, బ్యాండేజీలతో కూడిన ప్రథమ చికిత్స పెట్టెలను బస్సులు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గాయాలైతే ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు ప్రథమ చికిత్స చేసి తీవ్రతను కొంతవరకు తగ్గించేందుకు ఈ ప్రథమ చికిత్స పెట్టెలు ఉపయోగపడేవి. కానీ ప్రస్తుతం అవి అలంకారప్రాయంగా మారిపోయాయి. రవాణా వాహనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఉపాధి హామీ పథకం పనులు జరిగే ప్రదేశాలు.. ఇలా జనసంచారం ఉండే ప్రతి ప్రదేశంలోనూ ప్రథమ చికిత్స సదుపాయం ఉండాలి. బస్సుల్లో ఖాళీ పెట్టెలు బస్సుల్లో పెట్టెలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉన్నతాధికారులు వీటి గురించి పట్టించుకోకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది. నిబంధనల ప్రకారం ఈ పెట్టెల్లో అత్యవసరమైన మందులు, గాయాలకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సయిడ్, అయొడిన్, దూది వంటివి ఉండాలి. కడుపు నొప్పి, జ్వరం, విరేచనాలు, ఇన్ఫెక్షన్లను నియంత్రించే అత్యవసర మందులు, ఇతర సామగ్రి ఉంచాలి. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాలు, ఇతర చిన్నపిల్లలు, విద్యార్థులుండే ప్రదేశాల్లో ప్రథమ చికిత్సకు అవసరమైన సామగ్రి సహా శిక్షణ పొందిన సహాయకులు ఉండాలి. కానీ పలు వసతి గృహాలకు ఇటీవలే తాత్కాలికంగా ఏఎన్ఎంలను నియమించడంతో హాస్టళ్లను మినహాయించి మరెక్కడా ప్రథమ చికిత్సలకు అవసరమైన పెట్టెలు కనిపించడం లేదు. పాఠశాలల్లో అయితే ఎప్పుడో సమీపంలోని పీహెచ్సీ నుంచి వచ్చే వైద్యాధికారులు నిర్వహించే ఆరోగ్య పరీక్షలప్పుడు విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు ముందు జాగ్రత్తగా కొన్ని రకాల మందులు తీసుకుంటున్నారే తప్పా, ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు పూర్తిస్థాయిలో ఉండటం లేదు. పట్టించుకోని ప్రభుత్వ శాఖలు అత్యవసర వైద్య సేవల గురించి ప్రభుత్వ శాఖలు పట్టించుకోవడం మానేశాయి. బస్సులు, ప్రయివేటు వాహనాలు,పాఠశాల బస్సులు, ప్రయివేటు పాఠశాలల్లో కూడా ఇలాంటి సదుపాయం ఉందా? లేదా? అనే విషయాన్ని రవాణా శాఖ, ఆర్టీసీ, విద్యాశాఖాధికారులు పర్యవేక్షించాలి. సిబ్బందిని చైతన్య పరచి, చిన్న చిన్న ప్రాథమిక చికిత్స చేసేలా అవగాహన కల్పించాలి. ఏర్పాటు చేయాలి జన సంచారం ఉండే ప్రదేశాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రథమ చికిత్సకు సంబంధించి ఎలాంటి సామగ్రి ఉంచకపోవడం విచారకరం. అత్యవసర సమయాల్లో ప్రథమ చికిత్స అందితే ప్రాణాలు దక్కించుకోవచ్చు. ప్రభుత్వం స్పందించి ప్రథమ చికిత్స పెట్టెల్ని ఏర్పాటు చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. – కుంబురుక దీనమయ్య, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గతేడాది నుంచి రాలేదు అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ప్రథమ చికిత్సకు ప్రథమ చికిత్స పెట్టెలు వచ్చేవి. రెండేళ్లుగా ప్రతిపాదనలు పంపిస్తున్నప్పటికీ ప్రథమ చికిత్సపెట్టెలు రావడం లేదు. వచ్చిన వెంటనే అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తాం. – జి.శోభారాణి, భద్రగిరి సీడీపీఓ -
ఫ(వే)స్ట్ ఎయిడ్ బాక్సులు..
‘అనగనగా నేనొక ‘పల్లె వెలుగు’ను.. అదేనండి ఆర్టీసీ బస్సును.. ఎన్నిరిపేర్లొచ్చినా.. ఇంజిన్ బాగాలేకున్నా.. కిందామీడా పడి.. నానా తిప్పలతోప్రయాణికులను గమ్యానికి చేరుస్తుంటాను.. కాని ఈ మధ్య ప్రమాదాలు జరిగితే.. బస్సుల్లో ఫస్ట్‌ఎయిడ్ బాక్సుల్లేవని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.. వెంటనే ఆ బాక్స్‌లను ఏర్పాటు చేసి నన్ను ప్రయాణికులు తిట్టకుండా ఆపండి’ అంటూ ఓ బస్సు ఇలా మొరపెట్టుకుంటోంది. - నిజామాబాద్ నాగారం - ప్రమాదాలు జరిగితే ప్రథమ చికిత్స లేనట్టే.. - పట్టని ఆర్టీసీ అధికారులు - బస్సుల్లోనూ నాణ్యతా ప్రమాణాలు కరువు ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చడంలో అతిపెద్ద రవాణాసంస్థగా గిన్నిస్‌బుక్‌లోనూ గుర్తింపు పొందిన మన ఆర్టీసీ ప్ర స్తుతం ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదనడానికి సాక్ష్యాలివి.. ముఖ్యంగా ప్రమాదాలు జరిగితే చిన్నపాటి గాయాలకు ప్రథమ చికిత్స చేసేందుకు కూడా బస్సుల్లో అవకాశం ఉండడం లేదు. దీంతో చిన్నగాయాలు కాస్తా ఆస్పత్రికి వచ్చేసరికి పెద్ద గాయాలవుతున్నాయి. ఇలా పల్లె వెలుగు నుంచి సూపర్ లగ్జరీ బస్సుల వరకు ఏ బస్సుల్లో కూడా ఫస్ట్‌ఎయిడ్ కిట్స్ ఉండడం లేదు. నిజామాబాద్ రీజియ న్ పరిధిలో 6 డిపోలు ఉన్నాయి. రీజియన్ మొత్తంలో 680 ఆర్టీసీ బస్సులున్నాయి. ఇందు లో పల్లెవెలుగు-368, ఎక్స్‌ప్రెస్-228, డీలక్స్-31, సూపర్‌లగ్జరీ-34, గరుడ-06, ఇంద్ర- 13 బస్సులు ఉన్నాయి. ఇవీ కాక ప్రేవేటు బ స్సులు సైతం ఉన్నాయి. అయితే సగానికిపైనే బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్బాక్సులు లేవు. బాక్సులున్నా అవి ఖాళీగానే కనిపిస్తున్నాయి. నిబంధనలివి.. ఆర్టీసీ డిపో మేనేజర్లు వారి పరిధిలో ఉన్న బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. బాక్సుల్లో ప్రథమ చికిత్స కిట్లు ఉన్నాయో లేదో పరీశీలించాలి. లేకుంటే వాటి ని పెట్టేంచే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రై వేటు బస్సుల్లో లేకుంటే చర్యలు తీసుకోవాలి. - త్వరలో ఏర్పాటు చేయిస్తాం బస్సుల్లో ఫస్ట్‌ఎయిడ్ బాక్సులు లేని మాట వాస్తవామే. అవి పాడైపోయినవి. వీటి బాధ్యత మొత్తం ఆయా డిపో మేనేజర్లదే ఉం టుంది. ఎవరైనా దాతలు ముందుకొస్తే కొత్త బాక్సులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాం.- గంగాధర్, డిప్యూటీ సీటీఎం -
నేడే నిమజ్జనం
సాక్షి, ముంబై: గణేశ్ నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పా ట్లు పూర్తయ్యాయి. నగర పాలక సంస్థ అధికారులు ఇందుకు సంబంధించి అంతా సిద్ధం చేశారు. 8,263 మంది బీఎంసీ ఇబ్బంది విధుల్లో నిర్వహిం చనున్నారు. అదేవిధంగా 100 నిమజ్జన ఘాట్లను ఏర్పాటు చేశారు. 404 మంది లైఫ్ గార్డులు, 67 ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, 55 అంబులెన్సులు, 71 కంట్రోల్ రూంలు, 55 మోటార్ బోట్లు, 172 డంబ ర్లు, 64 వాచ్ టవర్లు, 278 సీసీ టీవీ కెమెరాలను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు సబంధిత అధికారి ఒకరు తెలిపారు.మరోవైపు భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ట్రాఫిక్ పోలీస్ విభా గం సోమవారం 49 రహదార్లను మూసివేశారు. 55 మార్గాల్లో వన్‌వేకి అనుమతించారు. అదేవిధంగా భారీ వాహనాలను 13 మార్గాల్లో నిషేధించారు. 95 ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని కూడా నిషేధిం చారు. గిర్గావ్ చౌపాటి, శివాజీ పార్క్ చౌపాటి, బాం ద్రాలోని బడా మసీదు, జూహూ చౌపాటి, పొవైలలో ఐదు ట్రాఫిక్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు నగర వ్యాప్తంగా 37 నిఘా టవర్లను కూడా ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇక దక్షిణ ముంబైలో ముఖ్యమైన రహదార్లను మూసివేయనున్నారు. వీపీ రోడ్ (సీపీ ట్యాంక్ సర్కిల్ నుంచి బాల్ చంద్ర కంపెనీ వరకు), సీపీ ట్యాంక్ రోడ్ (మాధవ్ బాగ్ నుంచి సీపీ ట్యాంక్ సర్కిల్ వరకు), సెకండ్ కుంభార్‌వాడా రోడ్ , వీపీ రోడ్ (కవాస్జీ పటేల్ రోడ్ నుంచి ఎస్వీపీ రోడ్ జంక్షన్, ఈ జంక్షన్ నుంచి డాక్టర్ బద్‌కంకర్ మార్గ్ వరకు), ల్యామింగ్టన్ రోడ్, జగన్నాథ్ శంకర్‌శేఠ్ మార్గ్ (ప్రిన్సెస్ స్ట్రీట్ జంక్షన్‌నుంచి ఎస్వీపీ రోడ్ జంక్షన్-ఒపేరా హౌజ్ వరకు), డాక్టర్ బీఏ రోడ్ (భారత్ మాత ప్రాంతం నుంచి బావల్లా కంపౌండ్ వరకు)ను మూసిఉంచనున్నారు. మధ్యముంబైలోని శివాజీ పార్కు రోడ్డు, క్యాడెల్ రోడ్డుతోపాటు ఆ పరిసర ప్రాంతాల్లోని రహదారులను మూసిఉంచనున్నారు. తిలక్ వంతెననుకూడా ఇరువైపులా మూసివేస్తారు. -
ఫస్ట్ ఎయిడ్ బాక్స్.. నిర్వహణ తుస్
శ్రీకాకుళం అర్బన్: ప్రయాణికుల క్షేమమే ఆర్టీసీ లక్ష్యం ఇదే తమ నినాదమంటూ గొప్పలు చెప్పుకొనే ఆర్టీసీ యాజమాన్యం ఫస్ట్ ఎయిడ్ బాక్సుల నిర్వహణపై మాత్రం శ్రద్ధ వహించడంలేదు. రోడ్డు ప్రమాదంలో క్షత గాత్రులకు ప్రథమచికిత్స ఎంతో అవసరం. గాయపడిన వ్యక్తికి రక్తస్రావాన్ని నియంత్రించగలిగితే ఆ వ్యక్తి బతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మొదటి 15 నిమిషాలు ఎంతో విలువైనవి. క్షతగాత్రులను ప్రాణాలతో రక్షించాలంటే ఆ సమయంలో చేసే చికిత్సే కీలకం. దీని నిమిత్తం అన్ని వాహనాల్లోనూ ప్రథమ చికిత్స బాక్సులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. కానీ ఆర్టీసీ బస్సుల్లో మాత్రం అవి ఎక్కడా కనిపించట్లేదు. ఒక వేళ అడపాదడపా ఉన్నా వాటిలో ప్రథమ చికిత్సకు అవసరమైన మెడికల్ కిట్లు ఉండడంలేదు. ఫస్ట్‌ఎయిడ్ బాక్సుల నిర్వహించడం కష్టం కాకపోరుునా ఆర్టీసీ యాజమాన్యం మాత్రం వీటిపై శ్రద్ధ చూపడం లేదు. జిల్లాలోని ఐదు డిపోల పరిధిలో 482 బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల్లో ప్రథమ చికిత్స బాక్సులు మెడికల్ కిట్లు ఎక్కడా కనిపించడంలేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్‌లు, 108 వాహనాల కోసం ఎదురుచూడడం తప్ప మరో దారి లేదు. అమలు కాని చట్టం.. ప్రయాణీకులు వాహనాల్లో విధిగా ప్రథమ చికిత్స బాక్సులు ఏర్పాటు చేయాలని రవాణా వాహనాల చట్టం 1939 చెబుతోంది. దీనిని పటిష్టం చేస్తూ 1988లో మరిన్ని సవరణలు చేశారు. నిబంధనల ప్రకారం ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు, ఇతర వస్తువులను ప్రథమ చికిత్స బాక్సుల్లో ఉంచాలి. కనీసం కాటన్, స్పిరిట్, బ్యాండేజ్, డెటాల్, పెయిన్‌కిల్లర్ మాత్రలు ఉండా లి. వాటి నిర్వహణపై సంబంధిత యాజమాన్యం నిరంతరం పర్యవేక్షణ చేయూలి. ఆర్టీసీ బస్సులో మాత్రం ఈ చట్టం అమలుకు నోచుకోవడం లేదు. బస్సుల్లో బాక్సులు ఉన్నా మందులు ఉండడంలేదు. అవసరమైతే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించే వరకు క్షతగాత్రులకు నరకయాతన తప్పపడంలేదు. అధికారుల నిర్లక్ష్యం.. అనుమతుల కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లినప్పుడు మాత్రమే అలంకార ప్రాయంగా వీటిని ఏర్పాటు చేస్తుంటారు. ఆ తరువాత మళ్లీ కనిపించవు. ప్రతి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిస్పెన్షరీ ఉంది. ప్రథమ చికిత్స బాక్సుల్లో మందులు పెట్టాల్సి వస్తే ఇక్కడ ఇండెంట్ పెట్టి తీసుకోవాలి. యాజమాన్యమే వీటిని డిస్పెన్షరీల ద్వారా సరఫరా చేస్తోంది. అయితే నిర్వహణ భారంగా మారిందని ఆర్టీసీ యాజమాన్యం వీటిని గాలికి వదిలేసింది. దాతల కోసం చూస్తున్నాం ప్రథమ చికిత్స బాక్సులు లేకపోవడం వలన ప్రయాణీకులకు ప్రమాద సమయాల్లో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఏర్పాటు చేసేందుకు దాతలు, స్వచ్చంద సంస్థల కోసం ఎదురుచూస్తున్నాం. ఎవరూ స్పందించి ముందుకు రావడం లేదు. - ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం జి.సత్యనారాయణ -
అసౌకర్యాల ప్రయాణం
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పిస్తాం.. సురక్షితంగా గమ్యానికి చేరుస్తాం.. అంటూ నినదించే ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ అందుకు తగ్గట్లు చర్యలు తీసుకోవడం లేదు. డొక్కు బస్సులతో కాలం గడుపుతోంది. అభివృద్ధి చార్జీ పేరుతో ప్రయాణికుడిపై అదనపు భారం మోపుతున్నా సౌకర్యాల్లో మెరుగుదల కనిపించడం లేదు. జిల్లాలో ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు కొత్త బస్సులు రాకపోడంతో కాలం చెల్లిన, కండీషన్లో లేని వాటిని తిప్పుతున్నారు. కిటీకీలకు అద్దాలు లేకుండా, సీట్లు విరిగి పోయి.. బస్సులో పలు భాగాలు పగిలిపోయి కనిపిస్తున్నాయి. ప్రమాదాల సమయంలో ప్రథమ చికిత్స కోసం ఏర్పాటు చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ బాక్సులు చాలా బస్సులో కనిపించడం లేదు. మోటారు వాహన చట్టం (రవాణ శాఖ) ప్రకారం ప్రయాణికులను తీసుకెళ్లే ప్రతీ బస్సు, ఇతర వాహనంలోనూ ఫస్ట్ ఎయిడ్ బాక్సు ఏర్పాటు చేయాలి. అందులో మెడికల్ కిట్టు పెట్టాలి. కాటన్ (దూది), బ్యాండేజ్, సర్జికల్ స్పిరిట్, యాంటి సెప్టిక్ క్రీము, కాటన్ బ్యాండేజ్తోపాటు పెయిన్ కిల్లర్ ( నొప్పుల మాత్రలు) ఉండాలి. రిజిస్ట్రేషన్ తోపాటు పాసింగ్ కోసం వెళ్లినప్పుడు రవాణా శాఖ అధికారులు పరిశీలించిన తరువాత ఫిట్నెస్ పాసింగ్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంది. కాని ఆర్టీసీ ఈ చట్టాన్ని పక్కన పెట్టింది. ఇంద్ర బస్సుల్లో తప్ప ఇతర వాటిలో వీటి నిర్వాహణ లేదు. వినోదం కరువు: ఆర్టీసీ బస్సుల్లో దూర ప్రాంతాలకు వెళ్లేవారికి వినోదం కరువైంది. హైదరాబాదు, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో టీవీలు ఏర్పాటు చేయాలి. అత్యధికంగా డబ్బును చార్జీల రూపంలో వసూలు చేస్తున్నప్పటికీ ఆర్టీసీ తగిన వినోదాన్ని అందించలేకపోతోంది. అగ్నిమాపక పరికరాలు ఉండవు బస్సుల్లో అగ్ని మాపక పరికరాలు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ విఫలం చెందింది. ఇంద్ర బస్సుల్లో తప్ప మిగిలిన బస్సుల్లో కనబడవు. కనీసం దూర ప్రాంతాలకు తిరిగే సూపర్ లగ్జరీ (హైటెక్)లోనూ ఏర్పాటు చేయలేదు. దీంతో అగ్ని ప్రమాదాల సమయంలో ప్రయాణికుల భద్రత ఏమేరకు ఉందో చెప్పవచ్చు.