సాక్షి, ముంబై: గణేశ్ నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పా ట్లు పూర్తయ్యాయి. నగర పాలక సంస్థ అధికారులు ఇందుకు సంబంధించి అంతా సిద్ధం చేశారు. 8,263 మంది బీఎంసీ ఇబ్బంది విధుల్లో నిర్వహిం చనున్నారు. అదేవిధంగా 100 నిమజ్జన ఘాట్‌లను ఏర్పాటు చేశారు. 404 మంది లైఫ్ గార్డులు, 67 ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, 55 అంబులెన్సులు, 71 కంట్రోల్ రూంలు, 55 మోటార్ బోట్లు, 172 డంబ ర్లు, 64 వాచ్ టవర్లు, 278 సీసీ టీవీ కెమెరాలను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు సబంధిత అధికారి ఒకరు తెలిపారు.మరోవైపు భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ట్రాఫిక్ పోలీస్ విభా గం సోమవారం 49 రహదార్లను మూసివేశారు. 55 మార్గాల్లో వన్‌వేకి అనుమతించారు.
అదేవిధంగా భారీ వాహనాలను 13 మార్గాల్లో నిషేధించారు. 95 ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని కూడా నిషేధిం చారు. గిర్గావ్ చౌపాటి, శివాజీ పార్క్ చౌపాటి, బాం ద్రాలోని బడా మసీదు, జూహూ చౌపాటి, పొవైలలో ఐదు ట్రాఫిక్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు నగర వ్యాప్తంగా 37 నిఘా టవర్లను కూడా ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇక దక్షిణ ముంబైలో ముఖ్యమైన రహదార్లను మూసివేయనున్నారు.
వీపీ రోడ్ (సీపీ ట్యాంక్ సర్కిల్ నుంచి బాల్ చంద్ర కంపెనీ వరకు), సీపీ ట్యాంక్ రోడ్ (మాధవ్ బాగ్ నుంచి సీపీ ట్యాంక్ సర్కిల్ వరకు), సెకండ్ కుంభార్‌వాడా రోడ్ , వీపీ రోడ్ (కవాస్జీ పటేల్ రోడ్ నుంచి ఎస్‌వీపీ రోడ్ జంక్షన్, ఈ జంక్షన్ నుంచి డాక్టర్ బద్‌కంకర్ మార్గ్ వరకు), ల్యామింగ్‌టన్ రోడ్, జగన్నాథ్ శంకర్‌శేఠ్ మార్గ్ (ప్రిన్సెస్ స్ట్రీట్ జంక్షన్‌నుంచి ఎస్‌వీపీ రోడ్ జంక్షన్-ఒపేరా హౌజ్ వరకు), డాక్టర్ బీఏ రోడ్ (భారత్ మాత ప్రాంతం నుంచి బావల్లా కంపౌండ్ వరకు)ను మూసిఉంచనున్నారు. మధ్యముంబైలోని శివాజీ పార్కు రోడ్డు, క్యాడెల్ రోడ్డుతోపాటు ఆ పరిసర ప్రాంతాల్లోని రహదారులను మూసిఉంచనున్నారు. తిలక్ వంతెననుకూడా ఇరువైపులా మూసివేస్తారు.
నేడే నిమజ్జనం
Published Sun, Sep 7 2014 10:15 PM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM
Advertisement