First look photo
-
ధనుష్ బర్త్‌డే: ఫ్యాన్స్‌కి ‘సార్’ టీం సర్ప్రైజ్!
అక్టోబర్‌లో ‘సార్’ థియేటర్స్‌కు వస్తారు. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళంలో ‘వాత్తి’). ఇందులో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్‌లతో కలిసి సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. గురువారం (జూలై 28) ధనుష్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘సార్’ సినిమాలో ధనుష్ ఫస్ట్‌లుక్‌ను బుధవారం చిత్రయూనిట్ విడుదల చేసింది. చదవండి: నాకు లైన్ వేయడం ఆపు అనన్య.. విజయ్ రిక్వెస్ట్ చిత్రదర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ‘‘విద్యా వ్యవస్థ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ధనుష్ లెక్చరర్‌గా కనిపిస్తారు. నేడు ఈ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేస్తున్నాం. ధనుష్‌తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మర్చిపోలేనిది’’ అన్నారు. ‘‘అక్టోబరులో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు నాగవంశీ. సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని, తోటపల్లి మధు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. #Vaathi #Sir pic.twitter.com/2NAo1ayEv2 — Dhanush (@dhanushkraja) July 27, 2022 -
‘తూనీగ’ ఫస్ట్‌లుక్ విడుదల
హైదరాబాద్ : తూనీగ చిత్రం ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకులు సతీశ్ వేగేశ్న ఫేస్బుక్ ద్వారా విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అంతా కొత్తవారే కలిసి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. దర్శకుడు ప్రేమ్ సుప్రీమ్ మరిన్ని మంచి చిత్రాల రూపకర్తగా పేరు తెచ్చుకోవాలన్నారు. ఈ చిత్ర ప్రచార సారథి, వర్థమాన రచయిత రత్నకిశోర్ శంభుమహంతితో ఆత్మీయ అనుబంధం ఉందని తెలిపారు. ఇప్పటికే విడుదలయిన ట్రైలర్, డిజిటల్ పోస్టర్స్ తననెంతో ఆకట్టుకున్నాయని, కొత్త వారికి బాసటగా నిలిచేందుకు తానెన్నడూ సిద్ధమేనన్నారు. ఇతిహాస ఆధారిత కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టు కుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దర్శకులు ప్రేమ్ సుప్రీమ్ మాట్లాడుతూ.. నిర్మాణాంతర పనులు సైతం శరవేగంగా జరు గుతున్నాయని అన్నారు. చిత్రం ఫస్ట్ లుక్ విడుదలయిన సందర్భంగా దర్శకుడికి శ్రీకాకుళం ఫిల్మ్ క్లబ్ నిర్వాహకులు రమేశ్ నారాయణ్, శ్రీకాకుళం జిల్లా ఫొటోగ్రఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ మెట్ట నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. వినీత్, దేవయానీ శర్మ జంటగా నటించిన ఈ సినిమాకు సంగీతం సిద్ధార్థ్ సదాశివుని అందించారు. -
ఫ్యాన్స్‌కు షాకిచ్చిన మెగాస్టార్
సాక్షి,ముంబై: బాలీవుడ్ మోగా స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ (76) మరోసారి తన ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. లేటు వయసులో కూడా విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న అమితాబ్ రాబోయే చిత్రం "గులాబో సితాబో" ఫస్ట్‌లుక్ విడుదలైంది. పొడవాటి గడ్డం, కళ్ళజోడు, వెరైటి తలపాగా, ప్రొస్థెటిక్ ముక్కుతో ఓల్డ్ మాన్ లుక్‌లో గుర్తుపట్టలేనంతగా బిగ్ బి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. ఆయుష్మాన్ హీరోగా సుజీత్ సిర్కార్ తెరకెక్కిస్తునన్న గులాబో సితాబొ అనే చిత్రంలో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. అందులో అమితాబ్‌కు చెందిన ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ విమర్శకుడు తరన్ ఆదర్శ్ ట్విటర్లో షేర్ చేశారు. పికూ రచయిత జుహీ చతుర్వేది కథను సమకూర్చగా.. లక్నో పరిసర ప్రాంతాలల్లో షూటింగ్ జరపుకుంటోంది. ఇదివరకెన్నడూ నటించని పాత్రలో విలక్షణంగా అమితాబ్ ఈ మూవీలో అలరించనున్నారట. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. Unveiling Amitabh Bachchan's quirky character look from #GulaboSitabo... Costars Ayushmann Khurrana... Directed by Shoojit Sircar... 24 April 2020 release. pic.twitter.com/Tg2V678xSu — taran adarsh (@taran_adarsh) June 21, 2019 -
మణికర్ణిక ఫస్ట్ లుక్.. అదిరింది!
టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం ‘మణికర్ణిక- ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది. 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిత్రయూనిట్ ఫస్ట్‌లుక్ పొస్టర్‌ను విడుదల చేసింది. యుద్ద సన్నివేశాల్లోని కంగనా గుర్రపు స్వారీ ఫోజ్ అచ్చం ఝాన్సీ లక్ష్మీ భాయ్లా ఉండటంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితకథ ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మిన్నంటాయి. పలు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మణికర్ణిక మూవీకి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ సమకూర్చారు. మార్చిలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను రిపబ్లిక్ డే సందర్భంగా 2019 జనవరి 25న రిలీజ్ చేయనున్నారు. గతేడాది మేలో షూటింగ్ ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. ఈ ఏడాది సమ్మర్లో రీలీజ్ కావాల్సి ఉంది. అయితే కొన్ని కీలక సన్నివేశాల అవుట్ పుట్‌పై అసంతృప్తితో ఉన్న క్రిష్. రీషూట్ చేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలోనే రిలీజ్ ఆలస్యం అయ్యింది. -
మణికర్ణికలో కంగనా లుక్..
సాక్షి, న్యూఢిల్లీ : కంగనా రనౌత్ ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రలో తెరకెక్కుతున్న మణికర్ణిక మూవీపై అంచనాలు మిన్నంటాయి. దక్షిణాది సినీ విశ్లేషకులు రమేష్ బాల కంగనా మణికర్ణిక సెట్స్‌లో ఉన్న ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేయగా సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతున్నాయి. ఝాన్సీ లక్ష్మీభాయ్గా ఆమె హుందాగా కనిపిస్తూ పాత్రలో ఒదిగిపోయారు. పలు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మణికర్ణిక మూవీకి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కధ సమకూర్చగా, క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. టీవీ నటి అంకితా లోఖండే తొలిసారిగా ఈ మూవీ ద్వారా బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్నారు. సినిమాలో తమ పాత్రకు అనుగుణంగా వీరిద్దరూ గుర్రపు స్వారీలో శిక్షణ పొందారు. -
పూజై ఫస్ట్‌లుక్‌కు విశేష ఆదరణ
పూజై చిత్ర ఫస్ట్‌లుక్ ఫొటోలకు విశేష ఆదరణ లభించింది. విశాల్, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న చిత్రం పూజై. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న మూడవ చిత్రం ఇది. దీనికి కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమైన ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ దేశంలోని ముఖ్యమైన సమస్యపై హీరో చేసే పోరాటమే ఈ చిత్ర ప్రధానాంశమన్నారు. దాన్ని కుటుంబ నేపథ్యంలో చక్కని ప్రేమ సన్నివేశాలను జోడించి చిత్రీకరిస్తున్నామని చెప్పారు. ముక్కోణపు ప్రేమ కథలా ఇది ముక్కోణపు యాక్షన్ కథా చిత్రమని తెలిపారు. గత చిత్రాల మాది రిగానే ఈ పూజైలోను జనరంజక అంశాలు ఉంటాయని వివరించారు. ఇంతకుముందు విశాల్ హీరోగా చేసిన తామరభరణి చిత్రం పూర్తిగా యాక్షన్ ఓరియంటెండ్ కథా చిత్రం కాదన్నారు. పూజై మాత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కథా చిత్రమన్నారు. ఈ చిత్ర కథ కోయంబత్తూరు నేపథ్యంలో సాగుతుందన్నారు. పూజై చిత్రానికి అందమైన హీరోయిన్ అవసరం అయ్యారని చెప్పారు. అలాంటి మోడ్రన్ లుక్, ఫ్రెష్‌నెస్ టచ్‌కు శ్రుతిహాసన్ కరెక్టుగా ఉంటుందని భావించి, ఆమెను ఎంపిక చేశామని చెప్పారు. చిత్రంలో శ్రుతిహాసన్ పాత్ర ఆరంభం నుంచి చివరి వరకు ఉంటుందని దర్శకుడు హరి పేర్కొన్నారు.