నేటి నుంచి రాజ్యసభ సమావేశాలు షురూ
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభ సమావేశాలు గురువారం నుంచి తిరిగి మొదలు కానున్నాయి. ఇవి మే నెల 13 వరకు కొనసాగుతాయి. మొత్తం మీద ఈసారి 13 రోజులపాటు సభ కార్యకలాపాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో రైల్వేలు, 2015-16 సాధారణ బడ్జెట్‌పై చర్చ జరుగనుంది.
అలాగే ద్రవ్య వినిమయ, ఆర్థిక బిల్లులను ఆమోదించాల్సి ఉంది. తొలి విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 20వ తేదీ వరకు కొనసాగడం విదితమే.