ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐపీవో..
తొలిరోజు 16% సబ్స్క్రిప్షన్
న్యూఢిల్లీ: ప్రముఖ ప్రైవేటు బీమా కంపెనీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్రారంభమైన సోమవారం 16 శాతం సబ్స్క్రయిబ్ అయ్యింది. దేశంలో పబ్లిక్ ఇష్యూ జారీచేసిన తొలి బీమా కంపెనీ ఇదే. రూ. 6,057 కోట్ల సమీకరణకు 13.24 కోట్ల షేర్లు ఈ మెగా ఐపీఓ ద్వారా జారీచేస్తుండగా, సోమవారం సాయంత్రానికి 2.09 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన కోటాలో 6 శాతం, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోటాలో 4 శాతం సబ్స్క్రయిబ్కాగా, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటివరకూ వారి కోటాలో 25 శాతం వాటాకు బిడ్స్ వచ్చాయి. ఈ ఐపీఓ బుధవారం ముగుస్తుంది. రూ. 300-334 ప్రైస్బ్యాండ్తో ఈ ఆఫర్ జారీఅయ్యింది.