first signed
-
అధ్యక్షుడిగా బైడెన్ తొలి సంతకం.. కీలక నిర్ణయాలు
వాషింగ్టన్: అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్వేతసౌధంలోకి వెళ్లిన జో బైడెన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు జో బైడెన్ అధ్యక్షుడి హోదాలో సంతకం చేశారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయాలపై బైడెన్ ఎన్నికల్లో చెప్పినట్టు వాటిని వెనక్కి తీసుకున్నారు. ఈ విధంగా 15 కీలక కార్యనిర్వాహక ఆదేశాలపై బైడెన్ సంతకాలు చేశారు. బైడెన్ తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనవి ఇవే.. (చదవండి : చరిత్ర సృష్టించిన జో బైడెన్) బైడెన్ తొలి నిర్ణయం కరోనా నుంచి ప్రజలను బయటపడడమే. అందులో భాగంగా కోవిడ్-19 రెస్పాన్స్ కో ఆర్డినేటర్ పదవిని సృష్టిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు వంద రోజుల పాటు మాస్క్లు, భౌతిక దూరం పాటించాలని బైడెన్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి వైదొలగడాన్ని విరమించుకున్నారు. ట్రంప్ హయాంలో అమెరికా డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అమెరికా- పారిస్ వాతావరణ ఒప్పందంలో బైడెన్ నిర్ణయంతో అమెరికా మళ్లీ చేరింది. ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడాన్ని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది. మెక్సికో గోడ నిర్మాణంపై బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోడ నిర్మాణానికి నిధుల సమీకరణకు తీసుకొచ్చిన నేషనల్ ఎమర్జెన్సీ డిక్లరేషన్ను నిలిపివేశారు. గ్రీన్ కార్డు జారీలో దేశాలకు పరిమితిని బైడెన్ ఎత్తేశారు. ఈ నిర్ణయంతో భారతదేశంతో పాటు ఎన్నో దేశాల వారికి ఉపశమనం కలగనుంది. అమెరికా వీసాల జారీలో ఆంక్షలను క్రమేణ ఎత్తివేసేలా బైడెన్ వ్యూహం ఉంది. అమెరికా అభివృద్ధిలో కీలకంగా ఉన్న వలసదారులకు శాశ్వత పౌరసత్వం, నివాసం కల్పిస్తూ బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. వీటితో జాతి వివక్ష, ముస్లిం దేశాల రాకపోకలపై నిర్ణయాలు ఉన్నాయి. మొత్తానికి బైడెన్ గత అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలన్నింటినీ వెనక్కి తీసుకున్నారు. అమెరికా ప్రజలకు మేలు చేస్తూనే ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు పెంచుకునేలా బైడెన్ తీరు కనిపిస్తోంది. -
రుణమాఫీ ఇంకెప్పుడో..!
మహరాజశ్రీ సీఎం చంద్రబాబు గారికి.. జిల్లా రైతాంగం రాసుకున్న విన్నపమేమనగా.. అయ్యా.. ఎన్నికల ప్రచారంలో రుణాలన్నింటినీ మాఫీ చేస్తామంటే ఎగిరి గంతేశాం.. ఓట్లేశాం... అధికారంలోకి వచ్చారు.. ప్రమాణ స్వీకారం రోజున తొలి సంతకం మీకోసమే అంటే ఆనందపడ్డాం.. తీరా కమిటీ అంటే త్వరగా పూర్తి చేస్తారేమో అని మిన్నకుండిపోయాం.. పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పి ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షన్నరే అంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కదా అని మనసుకు సర్దిచెప్పుకున్నాం.. పోనీలే అది వచ్చినా ఎంతోకొంత బాగు పడతామని ఎదురు చూశాం. బ్యాంకుల్లో అడ్డమైన పత్రాలు ఇవ్వాలని చెప్పావు.. ఒక్కొక్కరం రెండు, మూడు దఫాలు బ్యాంకుల చుట్టూ తిరిగి పత్రాలు అందజేశాం. ఛార్జీలు, ఖర్చులు తడిసి మోపెడయ్యాయి.. కొందరైతే కూలి పనులు మానుకుని మరీ పత్రాలు ఇచ్చారు.. జిల్లాలో 4.95లక్షల మంది ఇలానే ఖర్చు భరించారు. రుణ మాఫీ పుణ్యమా అని ఒక్కొక్కరికి సుమారు 300 చొప్పున దాదాపు రూ.2 కోట్ల వరకు మా సొదరుల చేతి చమురు వదిలింది. అంతటితో ఆగారా.. సరిగా వివరాలు లేవంటూ 2.67లక్షల ఖాతాలను వెనక్కిపంపాదు. తిరిగి ఉరుకులు, పరుగుల మీద వెళ్లి వాటినీ అందజేశాం.ఇప్పుడేమో 3.08 లక్షల ఖాతాలను పరిశీలించాలంటూ రెవెన్యూ సిబ్బందికి పంపావు. పత్రాలు ఇవ్వకపోతే రుణమాఫీ రాదనే భయం వెంటాడుతోంది.. ఎందుకిలా మాతో ఆటలాడుకుంటున్నావు... మీ వంటి పెద్దలకు ఇది తగునా సామీ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొదట 20 శాతం ఈ నెల 5న వేస్తానన్నావు.. మళ్లీ 12 అన్నావు.. తిరిగి 15వ తేదీ చెప్పావు.. ఇప్పుడేమో 18వ తేదీ అంటున్నావు.. మాట మీద నిలబడే అలవాటు మీకు లేదని అందరూ అనే మాటను నిజం చేస్తున్నావే. 49 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయని మీకు నివేదికలు అందాయి.. అయినా కరుణించలేదు. మీరు రుణమాఫీ అమలు చేస్తారని బ్యాంకులకు అప్పులు చెల్లించలేదు. దీంతో వారు కొత్త రుణాల్విలేదు.. ప్రైవేట్ వ్యాపారుల వద్ద రూ.5 వడ్డీకి అప్పు తెచ్చి పంటలు సాగు చేశాం. రెన్యువల్స్ చేయకపోవడంతో బీమా కూడా దక్కలేదు. సరైన సమయంలో అప్పు చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగి గతం కంటే రూ.లక్షకు రూ.13వేలు చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు ఇస్తున్నారు. 20 శాతం ఖాతాల్లో వేస్తే బ్యాంకర్లు శాంతిస్తారనుకుంటే నువ్వు వాయిదాలు తప్ప నగదు జమ చేయడం లేదు. ఇప్పటికైనా మీరు మారండి.. మా ఉసురు ఉసురు పోసుకోవద్దని మనవి.