Fish prasad distribution
-
చేప ప్రసాదం కోసం భారీ క్యూ
-
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. రేపు ఉదయం 8 వరకు కొనసాగనుంది. చేప ప్రసాదం కోసం రెండు లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఆర్అండ్బీ, వాటర్ బోర్డు, పోలీస్, మత్స్య, విద్యుత్ తదితర శాఖల ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడేళ్ల విరామానంతరం ప్రారంభం కానున్న చేప ప్రసాదానికి ఒక రోజు ముందుగానే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది గురువారమే తరలిరావడంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిక్కిరిసింది. వీరికి పలు స్వచ్ఛంద సంస్థలు భోజన వసతులు కల్పించాయి. వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇందుకోసం 32 కౌంటర్లను ఏర్పాటు చేశారు. బత్తిని కుటుంబాలకు చెందిన దాదాపు 250 మందితో పాటు పలు స్వచ్ఛంద సంస్థల వారు కౌంటర్ల ద్వారా చేప ప్రసాదాన్ని అందజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ 6 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. దాదాపు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం ఏర్పాటు.. ప్రజల సౌకర్యార్థం పోలీసులు ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వేలాది మంది జనం రావడంతో వారికి ఇబ్బంది కలగకుండా కంట్రోల్ రూంలు పోలీస్ శాఖ అంత సమాచారాన్ని ఇవ్వనున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు అశ్విన్ మార్గం ఆధ్వర్యంలో చేప ప్రసాదానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థలు సహకారాన్ని అందిస్తున్నాయి. చదవండి: మృగశిర ఎఫెక్ట్.. కొర్రమీను@ 650 ట్రాఫిక్ మళ్లింపు.. పాత బస్తీ నుంచి ఎంజే మార్కెట్ మీదుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు వచ్చే వాహనాలను ఇతర ప్రాంతాల మీదుగా శుక్రవారం దారిమళ్లించినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ కోటేశ్వర్రావు, ఇన్స్పెక్టర్ గురునాథ్‌లు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ దారిమళ్లింపుపై గురువారం పర్యవేక్షణ జరిపి పరిస్థితులను సమీక్షించారు. ఆర్టీసీ పలు ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. స్వచ్ఛంద సంస్థల చేయూత నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థలు చేయూత అందించనున్నాయి. చేప ప్రసాదానికి వచ్చే ప్రజలకు అల్పాహారాలు, భోజనాలు, తాగునీరు, మజ్జిగను పంపిణీ చేస్తున్నాయి. ఆరోగ్యశాఖ అధికారులు హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి హెల్త్ సమస్యలు ఉన్నా 4 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. -
Hyderabad: ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ లేదు
దూద్‌బౌలి (హైదరాబాద్): కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడం లేదని శనివారం బత్తిని హరినాథ్‌గౌడ్ తెలిపారు. 175 ఏళ్లుగా వంశపారపర్యంగా తమ కుటుంబం అందిస్తున్న చేప ప్రసాదాన్ని గతేడాది కూడా కరోనా కారణంగా పంపిణీ చేయలేదన్నారు. మృగశిరకార్తె ప్రవేశం రోజున ప్రతి ఏటా మాదిరిగానే జూన్ 7వ తేదీన దూద్‌బౌలిలోని తమ నివాసంలో సత్యనారాయణ వ్రతంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి 8వ తేదీన చేప ప్రసాదాన్ని తయారు చేసి ఉదయం 10 గంటలకు తమ కుటుంబ సభ్యులందరం తీసుకుంటామని.. అలాగే తమ దగ్గరి బంధువులకు పంపిణీ చేస్తామని తెలిపారు. కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా చేప ప్రసాదం పంపిణీని విరమించుకోవాల్సిందిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సూచించారని హరినాథ్‌గౌడ్ వెల్లడించారు. ఏటా దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది ఆస్తమా రోగులు చేప ప్రసాదాన్ని సేవించేందుకు ఇక్కడికి వచ్చేవారని.. రెండేళ్లుగా చేప ప్రసాదం అందకపోవడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో కూడా లాక్డౌన్ ఉండటంతో చేప ప్రసాదం కోసం రోగులు వచ్చేందుకు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ప్రభుత్వం చెప్పిందని, ఆ మేరకు ప్రసాదాన్ని ఇవ్వడం లేదని చెప్పారు. చదవండి: లాక్డౌన్ వేళ.. ఇంటింటా హింస.. ఇంతింతా కాదు! -
నిర్విఘ్నంగా చేప మందు పంపిణీ
* 60 వేల చేపపిల్లల విక్రయాలు * నేడు, రేపు పాతబస్తీ దూద్‌బౌలిలో చేప ప్రసాదం పంపిణీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్‌లో చేపప్రసాదం పంపిణీ రెండురోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. సోమవారం రాత్రి 11.45 గంటలకు మృగశిర కార్తె ప్రారంభమవగా... అదేసమయంలో బత్తిని సోదరులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభించిన చేప మందును మంగళవారం రాత్రి వరకు కొనసాగించారు. వివిధ రాష్ట్రాలతో పాటు దుబాయ్, లండన్, రష్యా, జపాన్ దేశాల నుంచీ పెద్ద ఎత్తున ఆస్తమా రోగులు చేప మందు కోసం తరలివచ్చారు. మంగళవారం ఉదయం రైళ్లు వచ్చిన సమయంలో జనంసంఖ్య పెరగడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేయడంతోపాటు, బత్తిని సోదరుల వద్దనున్న చేప మందును లాక్కొని ఆస్తమా రోగులకు వేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై బత్తిని సోదరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పవిత్రంగా వేయాల్సిన చేప ప్రసాదాన్ని పోలీసులు తీసుకొని వేయడం సరికాదని బత్తిని గౌరీ శంకర్‌గౌడ్ ఆవేదనతో పేర్కొన్నారు. గత రెండు రోజులుగా 40 కౌంటర్లలో చేపపిల్లలను, 32 కౌంటర్లలో చేప మందును పంపిణీ చేశారు. మంగళవారం రాత్రి వరకు 60 వేల చేపపిల్లలను విక్రయించినట్లు మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. కాగా బుధ, గురు వారాల్లో పాతబస్తీ దూద్‌బౌలిలోని సొంత గృహం వద్ద చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు బత్తిని సోదరులు తెలిపారు. -
చేప ప్రసాదం పంపిణీ నేడే
* నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పూర్తై ఏర్పాట్లు * పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన రోగులు * 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు హైదరాబాద్: ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేసే కార్యక్రమం సోమవారం రాత్రి 11 గంటల నుంచి హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభంకానుంది. మరుసటి రోజు (9వ తేదీ) రాత్రి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం మృగశిరకార్తె నాడు బత్తిని సోదరులు ఆస్తమా రోగులకు ఉచితంగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి నాలుగైదు రోజుల ముందు నుంచే హైదరాబాద్ జిల్లా కలెక్టర్, పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, వాటర్బోర్డ్, ఇతర శాఖల అధికారులు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆస్తమా రోగులు రెండురోజుల ముందుగానే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలివచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, బీహార్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు, వారి సహాయకులు చేప ప్రసాదం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఆదివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్ సందడిగా కనిపించింది. కాగా, చేప ప్రసాదం కోసం తరలివచ్చిన రోగులు, వారి సహాయకులకు పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా అల్పాహారాన్ని అందించాయి. చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి సోమవారం మధ్యాహ్నం లోపు చేప పిల్లలను అందుబాటులోకి తెస్తామని మత్స్యశాఖ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. దాదాపు 50 వేల చేపలు ముందుగా అందుబాటులో ఉంచుతామన్నారు. అవి అయిపోయే సమయంలో తిరిగి తెప్పిస్తామని పేర్కొన్నారు. అలాగే, చేప ప్రసాద పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సెంట్రల్‌జోన్‌తో పాటు నగరంలోని పలు జోన్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులను ఇక్కడ బందోబస్తు విధులకు కేటాయించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ నలుమూలలా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. రోగులకు సహకరించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. -
చేప ప్రసాదం రెడీ
-
8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: బత్తిని సోదరులు అందించే చేప ప్రసాదం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 8, 9 తేదీల్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఈ కార్యక్రమం సవ్యంగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయిచింది. ఈ మేరకు నిర్వహణ కమిటీతో పాటు సంబంధిత అధికారులతో రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. చేప పిల్లల నిల్వకు సరిపడే వాటర్ ట్యాంకులను అందుబాటులో ఉంచటంతో పాటు ప్రసాదం పంపిణీకి సరిపడే కౌంటర్లు ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వికాస్‌రాజ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్మల, పోలీస్ అడిషనల్ కమిషనర్ అంజనీ కుమార్, ఫిషరీస్ డెరైక్టర్ ఎం.జగదీశ్వర్ పాల్గొన్నారు.