fishery department
-
మంత్రి, ఎమ్మెల్యేకే ఫ్లెక్సీలు కడతారా?
కూసుమంచి: ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యాన ఆదివారం ఏర్పాటుచేసిన చేప పిల్లల విడుదల కార్యక్రమం ప్రొటోకాల్ వివాదానికి దారితీసింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రకు అధికారులు ఆహ్వానం అందించారు. కార్యక్రమం ఉదయం 10 గంటలకు మొదలుకావలసి ఉండగా, పదిన్నర సమయాన హైదరాబాద్ నుండి ఎమ్మెల్సీ, ఎంపీలు రిజర్వాయర్ వద్దకు వచ్చారు. అప్పటికింకా ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి చేరుకోలేదు. దీంతో ఎమ్మెల్సీ తాతా మధు.. ఎమ్మెల్యే ఎక్కడి వరకు వచ్చారంటూ ఆరాతీయగా మార్గమధ్యలో ఉన్నారని డీఎఫ్‌వో ఆంజనేయస్వామి బదులిచ్చారు. సమయపాలన లేకుంటే ఎలా? అంటూ ఎమ్మెల్సీ ఒకింత అసహనానికి గురవుతూనే, పక్కనే ఉన్న ఫ్లెక్సీలలో.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, కలెక్టర్ గౌతమ్ ఫొటోలతో మూడు ఫ్లెక్సీలను గమనించారు. దీంతో ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ‘మీరు ఆఫీసర్లు ఆఫీసర్లుగా ఉండాలి.. పనికిమాలిన పనులు చేయొద్దు. మీరు గవర్నమెంట్ అధికారి కాబట్టి ఎవరికీ ఊడిగం చేయొద్దు.. అందరికీ ఫ్లెక్సీలు ఎందుకు పెట్టలేదు? ఎమ్మెల్యే, మంత్రికే ఫ్లెక్సీలే ఎందుకు పెట్టారు.. గవర్నమెంట్ మీకు చెప్పిందా?’ అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడి నుండి ఎంపీలు, ఎమ్మెల్సీ ఖమ్మం వెళ్లిపోయారు. కాసేపటికి వచ్చిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి రిజర్వాయర్‌లో చేపపిల్లలను విడుదల చేశారు. అంతకుముందు జరిగిన ఘటనపై అధికారులను మందలించడమే కాక ప్రొటోకాల్ పాటించకపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు. కాగా, కార్యక్రమం ముగిశాక ఎంపీ, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని అధికారులు ఏర్పాటు చేయడం కొసమెరుపు. ఇదీ చదవండి: ఈడీ లేకుంటే బీజేపీనే లేదు -
మన చేప మన ఆరోగ్యం
-
మంత్రిసేవలో మత్స్యశాఖ ఉద్యోగి !
సాక్షి, కడప : ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏ పార్టీకి కొమ్ము కాయకూడదు. తటస్థంగా ఉండాలి. పార్టీల పట్ల తమ భావాలను వ్యక్తం చేయకూడదు. ఆఖరుకు సామాజిక మాధ్యమాల్లో కూడా. ప్రచారం చేయకూడదు. ఎన్నికలు ముగిసే వరకు ఎక్కడా ప్రచారాల్లో పాల్గొనకూడదు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగులందరూ ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటారు. వీరిపై ఎన్నికల కమిషన్ నిఘా ఉంటుంది. కానీ ఇవేమీ పట్టని కొందరు ‘పచ్చ’ఉద్యోగులు ప్రభుత్వ సేవకులమనే విషయం మరిచిపోతున్నారు. వ్యక్తులు, పార్టీలను ఆరాధిస్తూ తరిస్తున్నారు. మత్స్యశాఖ అధికారి నెల్లూరు రెడ్డయ్య వ్యవహార శైలి ఆది నుంచి వివాదాస్పదంగా ఉంటోంది. ఎన్నికల నియమావళి రావడంతో మంత్రులు సైతం సాధారణ పౌరులుగా ఉంటారు. ప్రొటోకాల్ కలిగిన ప్రజాప్రతినిధులు సైతం సొంత వాహనాల్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రాతినిథ్యం వహించిన మత్స్య శాఖలో అధికారిగా పనిచేసే నెల్లూరు రెడ్డయ్య మాత్రం ఇప్పటికీ మంత్రి సేవలోనే తరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. కడప నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో కడప ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆదినారాయణరెడ్డి కార్యాలయాన్ని ప్రారంభించారు. టీడీపీ ఎన్నికల కార్యాలయంలో ఓటర్ల పరిశీలన, ఓటర్లకు ఫోన్లు చేయడం, వారిని ప్రలోభాలకు గురిచేయడం, టీడీపీకి అనుకూలంగా పనిచేయాలంటూ కోరడం లాంటి విషయాల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న ఈ అధికారిపై ఎన్నికల అధికారులు ఏం చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు నిత్యం రాజకీయ పార్టీ ప్రచారంలో తరిస్తున్నారు. ముద్దనూరులో ఇరిగేషన్ ఏఈ కటిక మధుసూదనరెడ్డి, చింతకొమ్మదిన్నెలో ఏఈ ఖాశీంసాబ్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. తాజాగా మత్య్యశాఖ అధికారి వ్యవహారం వెలుగుచూసింది. నిబంధనల మేరకు చర్యలుంటే మరో అధికారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉండేందుకు కట్టడి చేయివచ్చు. -
చెరువులో చేపపిల్లలు.. పెద్ద స్కామ్: మల్లు
హైదరాబాద్: చెరువుల్లో చేప పిల్లలు వేయడంలో పెద్ద స్కామ్ జరుగుతోందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి అన్నారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తక్కువ చేప పిల్లలు వేస్తూ పెద్దమొత్తం లో చేప పిల్లలు వేస్తున్నట్లు కాంట్రాక్టర్లు, అధికారులు పెద్ద ఎత్తున తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ఈ వ్యవహారం పై తక్షణమే ప్రభుత్వం కమీషన్ వేసి స్కామ్ లో ఉన్నవారి పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.