five deadbodies
-
ఆ ఇంట్లో అనుమానాస్పదంగా ఐదు శవాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో అయిదుగురు మృతిచెందారు. ఇంటికి లోపలివైపు గడియపెట్టి ఉండి.. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిగా.. దంపతులతో పాటు వారి ముగ్గురి పిల్లలు మృతి చెందినట్లు గుర్తించారు. నాలుగు, ఐదు రోజుల క్రితమే వారు మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి యజమాని శంబు అనే వ్యక్తి ఈ-రిక్షా నడిపే వాడని గుర్తించారు. 6 నెలల క్రితమే భార్య సునీత, ముగ్గురు పిల్లలతో కలిసి వారు ఆ ఇంట్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. వేరుశెనక్కాయల్లో డబ్బులే డబ్బులు -
అదృశ్యమై.. అస్థికలై తేలారు
కడపలో సంచలనం సాక్షి ప్రతినిధి, కడప: ఏడాదిన్నరగా కనిపించకుండా పోయిన ఓ కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాల అవశేషాలు వారి స్కూలు ఆవరణలోనే బయటపడ్డాయి. వైఎస్ఆర్ జిల్లా కడప పట్టణంలో ఈ దారుణం మంగళవారం వెలుగు చూసింది. పట్టణంలోని నబీకోటలో ఉన్న జియోన్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ డెరైక్టర్ కృపాకర్ ఐజాక్ (35) 2013 ఫిబ్రవరి 22న ముందుగా భార్య మౌనిక (30)ను, తర్వాత ఏప్రిల్ 19న తమ పిల్లలు ఏంజిల్ (8), రాజు (6), పవిత్ర (4)లను హత్య చేసి స్కూలు ఆవరణలోనే పాతిపెట్టాడు. అనంతరం ఉరేసుకుని చనిపోయాడని జిల్లా ఎస్పీ నవీన్ గులాటీ మీడియాకు చెప్పారు.