
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో అయిదుగురు మృతిచెందారు. ఇంటికి లోపలివైపు గడియపెట్టి ఉండి.. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిగా.. దంపతులతో పాటు వారి ముగ్గురి పిల్లలు మృతి చెందినట్లు గుర్తించారు.
నాలుగు, ఐదు రోజుల క్రితమే వారు మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి యజమాని శంబు అనే వ్యక్తి ఈ-రిక్షా నడిపే వాడని గుర్తించారు. 6 నెలల క్రితమే భార్య సునీత, ముగ్గురు పిల్లలతో కలిసి వారు ఆ ఇంట్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment