Five State Elections 2026
-
హాట్ హాట్‌గా తమిళ పాలిటిక్స్..షణ్ముగంకి విజయ్ బంపరాఫర్!
సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో గందరగోళం మరింత పెరిగింది. టీవీకే నేతలు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలతో రహస్య చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సీనియర్ నేత సి.వి. షణ్ముగం (మరో ఏక్నాథ్ షిండేలా) అనుచరులైన 28 మంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలోని రిసార్టులో తిష్టవేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి దగ్గరగా ఉన్నప్పటికీ, ఇంకా ఐదు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో, ఏఐఏడీఎంకేలోని కొంతమంది ఎమ్మెల్యేలతో టీవీకే రహస్య చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.పుదుచ్చేరిలోని పూరంకుప్పం రిసార్టులో ఉన్న 28 మంది ఎమ్మెల్యేలు షణ్ముగం అనుచరులే. వీరిని టీవీకేకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం చేయడం కోసం వ్యూహాత్మకంగా తరలించినట్లు సమాచారం. చర్చల్లో షణ్ముగంకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, కీలక మంత్రిత్వ శాఖలు కేటాయించడం వంటి పవర్-షేరింగ్ ఫార్ములా చర్చలో ఉందని తెలుస్తోంది. మాజీ మంత్రి, టీవీకే అభ్యర్థి కె.ఏ. సెంగొట్టయన్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.అయితే, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి మాత్రం టీవీకేకు మద్దతు ఇవ్వడాన్ని అంగీకరించలేదని సమాచారం. దీంతో పార్టీ లోపలే విభేదాలు తలెత్తాయి. ఒకవైపు షణ్ముగం, ఓ.ఎస్. మణియన్ వంటి నేతలు టీవీకేకు మద్దతు ఇవ్వాలని భావిస్తుండగా, మరోవైపు పళనిస్వామి వర్గం దీనికి వ్యతిరేకంగా ఉంది.గురువారం సాయంత్రం 4 గంటలకు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌తో పళనిస్వామి భేటీ కావాల్సి ఉంది. కానీ ఆ సమావేశాన్ని ఆకస్మికంగా రద్దు చేసి, హుటాహుటిన పుదుచ్చేరి వెళ్లి రిసార్టుల్లో ఉన్న ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యేందుకు పయనమయ్యారు. ఈ క్రమంలో షణ్ముగంకు విజయ్ చేసిన ఆఫర్ వెలుగులోకి వచ్చింది.రిసార్టుల్లో ఉన్న ఎమ్మెల్యేల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, “చల్లటి గాలికోసం రిసార్ట్‌కు వచ్చాం” అని సమాధానం ఇచ్చారు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో “అసలైన రాజకీయ నాయకులు మీరే” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.2021లో 66 సీట్లు గెలిచిన ఏఐఏడీఎంకే, తాజా ఎన్నికల్లో కేవలం 47 సీట్లు మాత్రమే గెలుచుకుంది. డి. జయకుమార్, పి. థంగమణి వంటి సీనియర్ నేతలు ఓటమి పాలయ్యారు. కోయంబత్తూరు జిల్లాలో పార్టీ బలమైన కోటగా ఉన్నప్పటికీ, ఈసారి కేవలం ఒకే సీటు (థొండముతూర్) గెలిచింది. దీంతో పార్టీ బలం రాష్ట్రంలో మూడో స్థానానికి పరిమితమైంది.ఈ నేపథ్యంలో, గెలిచిన ఎమ్మెల్యేలు టీవీకేలో చేరేందుకు పావులు కదుపుతున్నారని సమాచారం. షణ్ముగంకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని మూడు రిసార్టులకు తరలించి, వ్యూహాత్మకంగా రిసార్టులు మారుస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని తెలుస్తోంది.ఏఐఏడీఎంకే సీనియర్ నేత కేపీ అన్బళగన్ మాట్లాడుతూ.. విజయ్‌కు మద్దతు ఇవ్వడానికి మేం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అర్హత లేదు. విజయ్ కేవలం సినిమా నటుడు మాత్రమే. సినిమాల ద్వారా వచ్చిన ఖ్యాతిని ఉపయోగించి ప్రజలను పాలించాలనుకోవడం సరైంది కాదు. ఏఐఏడీఎంకే ఎప్పటికీ విజయ్‌కు మద్దతు ఇవ్వదు. మా పార్టీ ఎమ్మెల్యేలు చెన్నైలో వేడి తట్టుకోలేక పుదుచ్చేరి రిసార్ట్‌లో ఉన్నారు. పార్టీ ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో నడుస్తోంది. తమిళనాడులో 47, పుదుచ్చేరిలో ఒకరు మొత్తం 48 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి వెంటే ఉన్నారు’ అని స్పష్టం చేశారు. -
మహిళా ఎమ్మెల్యేకు షాకిచ్చిన కాంగ్రెస్ నేత
తిరువనంతపురం: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) ప్రధాన కార్యాలయంలో ఓ షాకింగ్ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళా ఎమ్మెల్యేను కౌగిలించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రయత్నించారు. కొత్తగా ఎన్నికైన కొల్లాం ఎమ్మెల్యే అడ్వకేట్ బిందు కృష్ణ.. లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి వచ్చారు.అయితే, ఆమెకు ఇష్టం లేకపోయినప్పటికీ, సీనియర్ నాయకుడు చెరియన్ ఫిలిప్ ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆమె అసౌకర్యానికి గురవుతూ అడ్డుకున్నప్పటికీ.. ఆయన వెనక్కి తగ్గకపోవడం వివాదాస్పదమైంది. పార్టీ నాయకులు, మీడియా సమక్షంలోనే జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఆ పార్టీ నేత చెరియన్ ఫిలిప్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అసలేం జరిగింది?వైరల్ అవుతున్న వీడియోలో ఎమ్మెల్యే బిందు కృష్ణ సమావేశానికి చేరుకుని.. మీడియా ప్రతినిధులకు అభివాదం చేస్తూ పార్టీ కార్యాలయం వైపు వెళ్లడం కనిపిస్తోంది. తెలుపు, పసుపు రంగు చీర ధరించిన ఆమె.. మొదట ఒక పార్టీ కార్యకర్తకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత చెరియన్ ఫిలిప్ ఆమె వద్దకు వచ్చారు. బిందు కృష్ణ కరచాలనం చేయడానికి తన చేతిని చాచారు. కానీ ఫిలిప్ మాత్రం ఆమెను కౌగిలించుకోవడానికి ముందుకు కదిలారు. ఆయన ఆమె మెడపై ఒక చేయి వేసి, ఆమె చాచిన చేతిని కిందకు నొక్కడానికి ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.Intern: Shocking news. A newly elected young woman MLA was seen being forcibly hugged by a senior leader.Rajdeep: What is this party culture? What example are we setting? Netas don’t even know how to conduct themselves.Intern: Cherian Philip tried to forcibly hug Kollam MLA… pic.twitter.com/JqTvSKEIoI— Lala (@FabulasGuy) May 7, 2026ఒక్కసారిగా షాక్..బిందు కృష్ణ.. ఈ చర్యతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆమె ఆయనను పక్కకు నెట్టివేస్తూ ప్రతిఘటించారు. ఆమె వెనక్కి తగ్గినప్పటికీ.. ఫిలిప్ రెండోసారి కూడా ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చివరికి ఆమె చేతులు జోడించి నమస్కరిస్తూ అక్కడి నుండి ముందుకు సాగిపోయారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడున్న పలువురు జర్నలిస్టులు, పార్టీ కార్యకర్తలు నవ్వుతూ కనిపించడంపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఆమె ఒక ఎమ్మెల్యే..ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మహిళా ఎమ్మెల్యే ఇబ్బంది పడుతున్నా కూడా ఫిలిప్ పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. రాజకీయాల్లో సీనియారిటీ ఉన్నంత మాత్రాన వ్యక్తిగత సరిహద్దులను అతిక్రమించే హక్కు ఎవరికీ లేదని.. అయిష్టత వ్యక్తం చేసిన వెంటనే వెనక్కి తగ్గాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ఆమె ఒక ఎమ్మెల్యే.. ఈ వయసులో కూడా ఆయన ఇలా అసభ్యంగా ప్రవర్తించడం దారుణం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని రద్దు చేసిన గవర్నర్.. ఇకపై..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి రద్దు చేశారు. మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 9న పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. శుక్రవారం (మే 8న) బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది.కాగా, ఈవీఎంల మానిప్యులేషన్, హింస ద్వారా పశ్చిమ బెంగాల్లో ప్రజా తీర్పును మార్చారంటూ బీజేపీ, భారత ఎన్నికల కమిషన్‌పై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమ పార్టీ కోర్టును ఆశ్రయించనున్నట్టు ప్రకటించారు.బెనర్జీ తన నిర్ణయంపై వెనక్కి తగ్గకపోవడంతో, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిసి ఎన్నికల ఫలితాల గెజిట్ నోటిఫికేషన్‌ను సమర్పించారు. దీంతో ఘన విజయం సాధించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించే ప్రక్రియకు మార్గం సుగమమైంది. అగర్వాల్‌తో పాటు ప్రధాన కార్యదర్శి దుశ్యంత్ నరియాలాను కూడా గవర్నర్‌ను కలిశారు. అనంతరం అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. “భారత ఎన్నికల కమిషన్ గెలిచిన అభ్యర్థుల గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఇప్పుడు రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ అన్ని నిర్ణయాలు తీసుకుంటారు” అన్నారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 172ను ప్రస్తావిస్తూ, లోక్ భవన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో మే 6 అర్ధరాత్రి నుంచి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఆటోమేటిక్‌గా రద్దవుతుందని తెలిపారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు ప్రస్తుత మంత్రివర్గం తాత్కాలిక ప్రభుత్వంగా కొనసాగవచ్చని చెప్పారు. -
అందుకే నా పీఏను చంపారు.. బైక్ దొరికింది: సువేందు
కోల్‌కతా: ముందుగానే పథకం వేసి తన పీఏ చంద్రనాథ్ రాథ్‌ను హత్య చేశారని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. రాథ్ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి మధ్యమ్‌గ్రామ్‌లోని ఆయన ఇంటికి తీసుకొచ్చిన సమయంలో సువేందు అధికారి మీడియాతో మాట్లాడారు. “ఈ హత్యను ఎంతగా ఖండించినా సరిపోదు. ఆయన నా సహాయకుడు కావడం, నేను భవానీపూర్‌లో మమతా బెనర్జీని ఓడించడం వల్లే ఆయనను చంపారు. ఇదే హత్య వెనుక కారణం అయి ఉండొచ్చు” అని అన్నారు.హంతకులపై చర్యలు తీసుకోవాలని సువేందు డిమాండ్ చేశారు. “నేను ఆయన కుటుంబానికి అండగా ఉంటాను. ఈ హత్య చేసిన వారిని పట్టుకుని శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పోస్టుమార్టంలో ఆయనపై 4 బుల్లెట్లు కాల్చినట్టు బయటపడింది. ఈ హత్య ముందుగానే పథకం వేసి చేశారు” అని చెప్పారు.ఇది చంద్రనాథ్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడి అని, హత్యను కచ్చితమైన ప్రణాళికతో అమలు చేశారని సువేందు ఆరోపించారు. “ఇది పూర్తిగా పథకం ప్రకారం చేసిన ఆపరేషన్. కొన్ని రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. తర్వాత బాధితుడిని వెంబడించి దగ్గర నుంచి కాల్పులు జరిపారు” అని అన్నారు.చంద్రనాథ్‌కు దగ్గరలోనే నిలబడి దుండగులు అనేక బుల్లెట్లు కాల్చినట్టు పోస్టుమార్టంలో తేలిందని, వెంటనే మరణం సంభవించేలా దాడి చేశారని సువేందు చెప్పారు. ఈ హత్య యాదృచ్ఛికం కాదని సువేందు అధికారి స్పష్టం చేశారు. “ఇది సాధారణ నేరం కాదు. కిరాయి హంతకులతో చేయించిన హత్య” అని అన్నారు.రాథ్‌ను కేవలం తనతో పనిచేస్తున్న కారణంగానే లక్ష్యంగా చేసుకున్నారని సువేందు అధికారి ఆరోపించారు. “ఆయనకు నేర చరిత్ర లేదు. రాజకీయ శత్రుత్వం లేదు. ఆయనకు ఉన్న ఒక్క గుర్తింపు నాతో పనిచేయడమే” అని చెప్పారు. నిందితులను త్వరగా అరెస్టు చేసి, కఠిన శిక్షలు విధించాలని, దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారని సువేందు తెలిపారు.“ప్రస్తుతం తూర్పు మేదినీపూర్‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఆయన ఇంటి వద్ద ఉన్నారు. ఆయన కుమార్తె, భార్యను చూసుకోవడం నా బాధ్యత. ముఖ్యంగా హంతకులను వీలైనంత త్వరగా అరెస్టు చేసి, చార్జ్‌షీట్ దాఖలు చేసి, వారికి ఉరిశిక్ష పడేలా చూడాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దీనిని పర్యవేక్షించడం నా బాధ్యత. నా సహచరులంతా నాకు సాయం చేస్తారు” అని చెప్పారు.ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఘటనలో ఉపయోగించినట్లు భావిస్తున్న బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, అనేక మంది అనుమానితులను గుర్తించారని సువేందు తెలిపారు. ఈ కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోంది.“నా పార్టీకి చెందిన అనేక మంది నాయకులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నాకు, రాథ్ కుటుంబానికి అండగా నిలిచారు. రాజ్యసభ సభ్యుడు సమీర్ ఒరావోన్, ఎంపీలు జ్యోతిర్మయ్ సింగ్ మహతో, ఖగేన్ ముర్ము కూడా మద్దతుగా నిలిచారు” అని సువేందు చెప్పారు.ఆధారాలను పరిశీలిస్తున్న ఫోరెన్సిక్ టీమ్స్ ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఘటనాస్థలం నుంచి సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నాయి. రాష్ట్ర సీఐడీ స్థానిక సమాచారం ఆధారంగా విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సహా ఉన్నతాధికారులు మధ్యమ్‌గ్రామ్‌లోని ఘటనాస్థలాన్ని సందర్శించారు.ఇదే సమయంలో, ఈ ఘటనపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పూర్తి స్థాయి, పక్షపాతం లేకుండా విచారణ జరగాలని కోరింది. భారత వైమానిక దళంలో మాజీ సిబ్బందిగా పనిచేసిన రాథ్.. కొన్నాళ్లుగా సువేందు అధికారికి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నారు. బుధవారం మధ్యమ్‌గ్రామ్ సమీపంలో ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. -
ఎందుకిలా చేశారు?.. తమిళనాడు గవర్నర్ సీరియస్
చెన్నై: తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను సీఎస్, డీజీపీ కలిశారు. విజయ్‌కు కాన్వాయ్ ఎలా ఇచ్చారంటూ డీజీపీని గవర్నర్ ప్రశ్నించారు. ఏ బేస్ చేసుకుని కాన్వాయ్, భద్రత కేటాయించారంటూ గవర్నర్ సీరియస్ అయ్యారు. ప్రస్తుత శాంతి భద్రతలపై గవర్నర్‌కు డీజీపీ నివేదిక ఇచ్చారు.కాగా, తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కొనసాగుతుంది. సీఎం హోదాలో ఇచ్చే జెడ్‌ఫ్లస్ సెక్యూరిటీని విజయ్‌కు పోలీస్ శాఖ కేటాయించింది. ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని టీవీకే అధినేత విజయ్ కోరగా.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అందుకు విముఖత వ్యక్తం చేశారు. సరిపడా సంఖ్యా బలం లేదని.. అది చూపించాకే ముందుకు వెళ్లాలని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.తాజా పరిణామాలతో విజయ్ కాన్వాయ్‌ను తొలగించారు. మరో వైపు, రేపు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నాకు పిలుపునిచ్చింది. తమిళనాడు గవర్నర్, బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరనలు చేపట్టింది. తమిళనాడులో క్షణం క్షణం రాజకీయ పార్టీల వ్యూహాలు మారుతున్నాయి. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నో చెప్పడంతో పరిస్థితి మారిపోయింది.ఇవాళ పుదుచ్చేరిలోని రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలతో పళనిస్వామి భేటీ కానున్నారు. 30 మంది ఎమ్మెల్యేల కోసం అత్యంత విలాసమైన రిసార్ట్‌ను పళనిస్వామి బుక్ చేశారు. కొందరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.. టీవీకే వైపు చూస్తుండగా.. ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో పళనిస్వామి ఉన్నారు. మరోవైపు డీఎంకే ఎమ్మెల్యేలతో మాజీ సీఎం స్టాలిన్ కూడా సమావేశం కానున్నారు. -
'విజయ్ను గవర్నర్ అందుకే అడ్డుకుంటున్నారు'
చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కాకుండా అడ్డుపడుతున్న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌పై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ను ముఖ్యమంత్రి కాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబడుతున్నారు. రాజ్యాంగబద్దంగా నడుచుకోకుండా, బీజేపీ ఆడించినట్టు ఆడుతున్నారని మండిపడుతున్నారు. గవర్నర్ వైఖరి ఇలాగే కొనసాగితే ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ బీజేపీకి గులాంగిరీ చేస్తున్నారని తమిళనాడు కాంగ్రెస్ ఇన్చార్జ్ గిరీష్ చోడంకర్ ఆరోపించారు. గురువారం చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ, అమిత్ షాల ఒత్తిడికి గవర్నర్ తలొగ్గారని ధ్వజమెత్తారు. రాజ్‌భవన్‌లో మెజారిటీ నిరూపించుకోమనే అధికారం గవర్నర్‌కు లేదని అన్నారు. ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందిన టీవీకే విజయ్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెజారిటీ నిరూపించుకోవడానికి తగిన సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.''గవర్నర్ అర్లేకర్‌కు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. నరేంద్ర మోదీ, అమిత్ షాల ఒత్తిడి కారణంగా.. గవర్నర్ రాజ్యాంగానికి, తమిళనాడు ప్రజలకు కాకుండా బీజేపీకి తలొగ్గుతున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. రాజ్‌భవన్‌లో మెజారిటీని నిరూపించుకోమని అడిగే అవకాశం గవర్నర్‌కు రాజ్యాంగం ఇవ్వలేదు. తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పును గవర్నర్ తప్పక గౌరవించాలి. మెజారిటీని నిరూపించుకోవడానికి రాజ్యాంగం నిర్దేశించిన వేదిక శాసనసభ. గవర్నర్ ముందు మెజారిటీని ఎందుకు నిరూపించుకోవాలి?విజయ్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని ఆహ్వానించడం తప్ప గవర్నర్‌కు మరో మార్గం లేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బలనిరూపణకు సమయం ఇవ్వాలి. బీజేపీ ఒక్క ఎమ్మెల్యేతో తమిళనాడును పాలించడానికి ప్రయత్నిస్తోంది. తమిళనాడు ప్రజలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. గవర్నర్ దొడ్డిదారిన తన పాలనను రుద్దడానికి, రాష్ట్రాన్ని పాలించడానికి ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడతారు. లౌకిక పార్టీలన్నీ ముందుకు వచ్చి గవర్నర్ వ్యవహారశైలిని ఎండగట్టాలి. లౌకికవాదాన్ని విశ్వసించేవారు, తమిళనాడులో బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ పాలనను నిరోధించాలనుకునేవారు బయటకు వచ్చి ప్రజల తీర్పుకు మద్దతు ఇవ్వాల''ని గిరీష్ చోడంకర్ కోరారు. చదవండి: విజయ్ కోసం గళమెత్తిన కమల్, ప్రకాశ్రాజ్బీజేపీ కనుకసన్నల్లో గవర్నర్రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ వ్యవహరిస్తున్నారని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమర్శించారు. బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా గవర్నర్ నడుచుకుంటున్నారని ఆరోపించారు. సెల్వపెరుంతగై గురువారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. "ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అతిపెద్ద పార్టీని ఆహ్వానించాలి. ఆ తర్వాత బలపరీక్ష జరుగుతుంది. అయితే, ఆయన (గవర్నర్) భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండటానికి ఇష్టపడటం లేదు. బీజేపీ ప్రధాన కార్యాలయం నుండి అందిన ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారు. ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధం. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. మేము టీవీకేకి మద్దతు ఇస్తున్నామనే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నామ''ని చెప్పారు. -
టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ కొనసాగుతోంది. టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటులో స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీవీకేకు సంఖ్యాబలం తక్కువగా ఉండటం, ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యం కావడంతో ఆయన అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన మద్దతు కూడగట్టే ప్రయత్నాలను వేగవంతం చేశారు.ఇందులో భాగంగా విజయ్ వామపక్షాల మద్దతు కోసం.. పార్టీ జనరల్ జాయింట్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. రెండు రోజుల క్రితం వామపక్షాలకు లేఖ రాసి మద్దతు కోరిన టీవీకే, ఇప్పుడు నేరుగా నేతలతో సమావేశమై మద్దతు పొందే ప్రయత్నం చేస్తోంది.మరోవైపు, వామపక్షాలు ఇప్పటికే డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌తో భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో ‘ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశాన్ని వామపక్షాలే నిర్ణయించాలి’ అని స్టాలిన్ స్పష్టంగా చెప్పారు. దీంతో వామపక్షాల నిర్ణయం కీలకంగా మారింది. రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత టీవీకేకు మద్దతు ఇవ్వాలా లేదా అన్న అంశంపై స్పష్టత రానుంది. అప్పటి వరకు తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగనుంది.ఇక కాంగ్రెస్ ఇప్పటికే ఐదుమంది ఎమ్మెల్యేల మద్దతు ప్రకటించింది. సీపీఐ,సీపీఎం,వీసీకే వంటి వామపక్షాలు టీవీకేకు మద్దతు ఇస్తే సంఖ్య 118 దాటే అవకాశం ఉంది. అదే జరిగితే విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభిస్తుంది. కానీ ఏఐఏడీఎంకే మాత్రం మద్దతు ఇవ్వబోమని స్పష్టంగా ప్రకటించింది. టీవీకే మద్దతుదారులు లోక్‌భవన్ వద్ద నిరసనలు చేపడుతున్నారు. గవర్నర్ ఆలస్యంపై పలువురు ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. -
మిత్ర పక్షాలతో భేటీ.. స్టాలిన్ కీలక నిర్ణయం
చెన్నై: డీఎంకే మిత్రపక్షాల నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మిత్ర పక్షాలతో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ భేటీ అయ్యారు. సీపీఐ, సీపీఎం, వీసీకే నేతలతో సమావేశమైన స్టాలిన్.. టీవీకేకు మద్దతు అంశాన్ని మిత్రపక్షాలకే వదిలేశారు. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోమని మిత్రపక్షాలకు సూచించారు. కాగా, వామపక్షాలతో పాటు వీసీకే పార్టీ మద్దతు కోరిన టీవీకే అధినేత విజయ్.. లేఖ రాసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో స్టాలిన్‌తో మిత్రపక్షాల నేతలు భేటీ అయ్యారు. విడిగా పార్టీ సమావేశాలు కూడా నిర్వహించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, తమ నిర్ణయం ఏంటన్నది ఈ భేటీల తర్వాత ప్రకటించే చాన్స్ ఉందని తెలుస్తోంది. లోక్ భవన్లో గవర్నర్‌తో అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి కూడా భేటీ కానున్నారు.ఇదిలా ఉండగా.. గవర్నర్, విజయ్ భేటీపై లోక్‌భవన్ వివరణ ఇచ్చింది. మెజార్టీపై టీవీకే పూర్తి వివరాలు ఇవ్వలేదని.. సంఖ్యాబలం చూపించాలని విజయ్ను కోరామని లోక్ భవన్ తెలిపింది. మరో వైపు, లోక్‌సభ ఎదుట విజయ్ అభిమానుల ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.విజయ్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన సీపీఐ.. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. మద్దతు ఇవ్వమని ఇదివరకే వీసీకే ప్రకటించింది. కాగా, విజయ్ లేఖ నేపథ్యంలో వీసీకే పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
సీఎం కుర్చీపై సువేందు సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని భవానీపూర్‌లో 15 వేల ఓట్ల తేడాతో ఓడించి, నందిగ్రామ్‌లో ముచ్చటగా మూడోసారి అఖండ విజయం సాధించిన ఆయన.. ఈ రెండు స్థానాల్లో దేనిని వదులుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా నందిగ్రామ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.పార్టీ నిర్ణయమే శిరోధార్యంఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి నందిగ్రామ్‌లో అడుగుపెట్టిన సువేందు అధికారికి స్థానికులు బ్రహ్మరథం పట్టారు. ‘మీరు నందిగ్రామ్ ముద్దుబిడ్డ, మీరే మా సీఎం’ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ నినాదాలపై స్పందించిన సువేందు.. అది తాను తీసుకునే నిర్ణయం కాదని, పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ‘నేను క్రమశిక్షణ గల కార్యకర్తను, అవసరమైతే నా అభిప్రాయం చెబుతాను.. కానీ సొంత నిర్ణయాలు తీసుకోను. మరో పది రోజుల్లో ఒక స్థానాన్ని వదులుకోవాల్సిందే. కానీ భవానీపూర్, నందిగ్రామ్ ప్రజల పట్ల నా బాధ్యతను ఎప్పటికీ విస్మరించను’ అని ఆయన పేర్కొన్నారు.పాత కేసుల రీఓపెన్.. కఠిన చర్యలుగత రెండు దశాబ్దాలుగా భూసేకరణ ఉద్యమాల నుండి నందిగ్రామ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఆయన, తన కుటుంబం ఎదుర్కొన్న వేధింపులను సభలో ప్రస్తావించారు. ‘2011 మార్పులో నేను భాగమయ్యాను, ఇప్పుడు నిజమైన మార్పులో ఉన్నాను. మా 90 ఏళ్ల తండ్రిని సీఐడీ విచారణ పేరుతో వేధించారు. నా ఆఫీసుకు 150 మంది పోలీసులను పంపారు. గతంలో జరిగిన అకృత్యాలపై విచారణ కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసి, నేరస్థులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని సువేందు హెచ్చరించారు.ఆరు నెలల్లో నందిగ్రామ్ రూపురేఖలు మార్చేస్తానందిగ్రామ్ అభివృద్ధికి తాను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని సువేందు హామీ ఇచ్చారు. నందిగ్రామ్-I లో ఏడాదికి రెండు పంటలు పండేలా చూస్తానని, హల్దియా-నందిగ్రామ్ వంతెనను నిర్మిస్తానని తెలిపారు. గోకుల్‌నగర్‌లో పాఠశాల, సోనాచురాలో ఐటీఐ ఏర్పాటుతో పాటు వేరే ఆసుపత్రులకు రిఫర్ చేసే పరిస్థితి లేకుండా నందిగ్రామ్ ఆసుపత్రిని ఆధునికీకరిస్తామన్నారు. ఆరు నెలల్లో ప్రతి ఇంటికి నీటి కనెక్షన్ అందిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని, ప్రధాని మోదీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ, నూతన బెంగాల్‌ను నిర్మిస్తామని సువేందు అధికారి పేర్కొన్నారు. -
జస్ట్ మిస్ .. లేకుంటే టీవీకేకు సంపూర్ణ మెజారిటీ
తమిళనాడు: తమిళనాడులో 38 జిల్లాల ఉండగా, టీవీకే ప్రభంజనం మార్మోగింది. 108 స్థానాలలో గెలిచింది. గెలిచిన చోట్ల 10,20,30 అంటూ లక్ష ఓట్ల మెజారిటీతో మెజారిటీ శాతం అభ్యర్థులు గెలిచారు. అయితే, 12 స్థానాలలో జస్ట్ మిస్ కావడం ఆపార్టీవర్గాలను తాజాగా ఇరకాటంలో పెట్టింది. తమిళనాడు రాజధాని చెన్నైలో 16 స్థానాలు ఉండగా 14ను టీవీకే కైవసం చేసుకుంది. ఇదే విధంగా అనేక జిల్లాలను తన గుప్పెట్లోకి తెచ్చుకున్నప్పటికీ, కన్యాకుమారి, తెన్కాశి, విల్లుపురం, అరియలూర్, మైలాడుతురై, నాగపట్టణం, నీలగిరి, తిరువారూర్ జిల్లాలో టీవీకే ఒక్కటంటే ఒక్క స్థానం గెలవక పోవడం గమనార్హం. ఈ జిల్లాలు పూర్తిగా డీఎంకే, అన్నాడీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంక్ కలిగిన ప్రాంతాలే. ఈ జిల్లాల పరిధిలోని తిరుక్కోవిలూరులో 285 ఓట్లతో, విక్రవాండిలో 1000, దిండిగల్, పాపనాశం, కరూర్, కిల్లియూరు, పుదుకోట్టై, తిరుమయం వంటి ఆరు చోట్ల 2 వేల ఓట్ల తేడాతో ఓటమి అంటూ మొత్తంగా 12 స్థానాలు టీవీకేకు జస్ట్ మిస్ అయ్యాయి. వీటిలో విజయకేతనం ఎగుర వేసి ఉన్నా, పైన పేర్కొన్న మరికొన్ని జిల్లాలో కనీసం ఒకటి రెండు స్థానాలు చేజిక్కించుకుని ఉన్నా, సంపూర్ణ మెజారిటీతో టీవీకే అధికార పగ్గాలు చేజిక్కించుకుని ఉండేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
తమిళ రాజకీయాల్లో మహిళల జోష్.. అసెంబ్లీలో కొత్త చరిత్ర
రెండు దశబ్దాల అనంతరం తమిళనాడు అసెంబ్లీలో మహిళా శక్తి గళం జ్వలించనుంది. ఈ సారి ఏకంగా 23 మంది మహిళలు ఎమ్మెల్యేలు అయ్యారు. వీరిలో 13 మంది టీవీకే పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. సాక్షి, చెన్నై: 17వ తమిళనాడు శాసన సభకు ఎన్నికలు ముగిశాయి. సినీ నటుడు విజయ్ టీవీకే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. తమిళనాడులో 5.73 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇందులో సుమారు 3 కోట్ల మంది మహిళలే. అందుకే మహిళా ఓటు బ్యాంక్‌ను గురి పెట్టి ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ పారీ్టలు హామీల వరాలు కురిపించడం జరుగుతోంది. అయితే, చట్ట సభలలోకి అడుగు పెట్టే మహిళల సంఖ్య ఇది వరకు తక్కువగానే ఉంటూ వచ్చింది.1991లో 32 మంది మహిళలు సభలో అడుగు పెట్టారు. ఆ తదుపరి పది శాతంలోపే గెలిచే వారు. 2016లో దివంగత సీఎం జయలలితతో సహా 21 మంది మహిళలు అసెంబ్లీలో ఉన్నారు. రెండు దశాబ్దాల 1991,2016 తదుపరి తాజా ఎన్నికలలో 23 మంది మహిళలు గెలిచారు. వీరిలో అత్యధికంగా 13 మంది విజయ్ టీవీకే నుంచి గెలిచిన వారే. వీరితోపాటూ ధర్మపురి నుంచి పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు సతీమణి, టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు కృష్ణస్వామి కుమార్తె సౌమ్య అన్బుమణి, డీఎండీకే దివంగత అ«ధినేత, నటుడు విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్‌లు ప్రపథమంగా సభలో అడుగు పెట్టనున్నడంతో నారీ శక్తి గళం తమిళ అసెంబ్లీలో జ్వలించనుంది. ఇక, అన్నాడీఎంకే నుంచి కోటీశ్వరు రాలైన లాటరీ మారి్టన్ సతీమని లీమా రోజ్‌తో పాటుగా ఆరుగురు మహిళలు, సీపీఎం నుంచి డి. లత వంటి నారీ లోకం అసెంబ్లీకి ఎన్నిక కావడంతో తమిళ సభ కళకళ లాడనుంది. అయితే డీఎంకే నుంచి మహిళలు ఎవరు విజయం సాధించక పోవడం గమనార్హం. 25 మంది మైనారిటీ ఎమ్మెల్యేలు మహిళా శక్తే కాదు, మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వారు 25 మంది ఈసారి ఏకంగా ఎన్నికయ్యారు. ఇందులో డీఎంకే నుంచి మనోజ్ పాండియన్, ఆస్టిన్ ఉన్నారు. ఈ కూటమిలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుంచి ఇద్దరు, మనిదనేయ మక్కల్ కట్చి నుంచి మరో ఇద్దరు, మనిదనేయ జననాయగ కట్చి నుంచి మరొకరు గెలిచారు. వీరిలో 9 మంది ముస్లిం నేతలు ఉన్నారు. ఇందులోనూ టీవీకే నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలయ్యారు. ఇక, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల నుండి 49 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. పదేళ్ల అనంతరం బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమిళనాడు అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. వీరు టీవీకే నుంచి గెలిచిన మైలాపూర్ ఎమ్మెల్యే వెంకటరామన్, శ్రీరంగం నుంచి గెలిచిన రమేష్ ఉన్నారు. జస్ట్ మిస్ .. లేకుంటే టీవీకేకు సంపూర్ణ మెజారిటీ తమిళనాడులో 38 జిల్లాల ఉండగా, టీవీకే ప్రభంజనం మార్మోగింది. 108 స్థానాలలో గెలిచింది. గెలిచిన చోట్ల 10,20,30 అంటూ లక్ష ఓట్ల మెజారిటీతో మెజారిటీ శాతం అభ్యర్థులు గెలిచారు. అయితే, 12 స్థానాలలో జస్ట్ మిస్ కావడం ఆపార్టీవర్గాలను తాజాగా ఇరకాటంలో పెట్టింది. తమిళనాడు రాజధాని చెన్నైలో 16 స్థానాలు ఉండగా 14ను టీవీకే కైవసం చేసుకుంది. ఇదే విధంగా అనేక జిల్లాలను తన గుప్పెట్లోకి తెచ్చుకున్నప్పటికీ, కన్యాకుమారి, తెన్కాశి, విల్లుపురం, అరియలూర్, మైలాడుతురై, నాగపట్టణం, నీలగిరి, తిరువారూర్ జిల్లాలో టీవీకే ఒక్కటంటే ఒక్క స్థానం గెలవక పోవడం గమనార్హం. ఈ జిల్లాలు పూర్తిగా డీఎంకే, అన్నాడీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంక్ కలిగిన ప్రాంతాలే. ఈ జిల్లాల పరిధిలోని తిరుక్కోవిలూరులో 285 ఓట్లతో, విక్రవాండిలో 1000, దిండిగల్, పాపనాశం, కరూర్, కిల్లియూరు, పుదుకోట్టై, తిరుమయం వంటి ఆరు చోట్ల 2 వేల ఓట్ల తేడాతో ఓటమి అంటూ మొత్తంగా 12 స్థానాలు టీవీకేకు జస్ట్ మిస్ అయ్యాయి. వీటిలో విజయకేతనం ఎగుర వేసి ఉన్నా, పైన పేర్కొన్న మరికొన్ని జిల్లాలో కనీసం ఒకటి రెండు స్థానాలు చేజిక్కించుకుని ఉన్నా, సంపూర్ణ మెజారిటీతో టీవీకే అధికార పగ్గాలు చేజిక్కించుకుని ఉండేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
కాషాయ భారతం: 21 రాష్ట్రాలు.. రాజ్యసభలో 113 సీట్లు
తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక పెను ప్రకంపనలు సృష్టించాయి. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన చరిత్రాత్మక విజయం కేవలం ఒక రాష్ట్రానికే పరిమితమైనది కాదు.. అది దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రాంతీయ పార్టీల ఆధిపత్యానికి ముగింపు లాంటిది. 2014 నుండి విస్తరిస్తున్న బీజేపీ జాతీయ రాజకీయ యంత్రాంగం ఇప్పుడు తూర్పు భారతదేశంలోకి విజయవంతంగా ప్రవేశించి, తన లక్ష్యాలను పూర్తి చేసింది. దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 21 చోట్ల జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) అధికారంలో ఉంటూ అత్యధిక భౌగోళిక ప్రాంతంపై తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంటోంది.తూర్పు భారత్‌పై కాషాయ పట్టుఒకప్పుడు బీజేపీ సిద్ధాంతాలకు ఏమాత్రం చోటులేదని భావించిన రాష్ట్రాలలో ఇప్పుడు ఆ పార్టీ విజయదుందుభి మోగిస్తోంది. బిహార్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను కలుపుతూ పిలిచే ‘అంగ, వంగ, కళింగ’ ప్రాంతాన్ని కైవసం చేసుకోవడం ద్వారా బీజేపీ ఒక సరికొత్త మైలురాయిని చేరుకుంది. 2024లో ఒడిశాలో నవీన్ పట్నాయక్‌ను గద్దె దించడం ద్వారా మొదలైన ప్రయాణం, 2025లో బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ తప్పుకున్న తర్వాత సమ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టడం, ఇప్పుడు బెంగాల్‌ను హస్తగతం చేసుకోవడం ఆ పార్టీ పకడ్బందీ వ్యూహాలకు నిదర్శనం.మమతా బెనర్జీ శకానికి ముగింపుపశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యానికి దాదాపుగా తెరపడింది. ముఖ్యంగా మమతా బెనర్జీ కంచుకోట అయిన భవానీపూర్‌లో సువేందు అధికారి చేతిలో 15,000 పైగా ఓట్ల తేడాతో ఓడిపోవడం ప్రాంతీయ ఆధిపత్య పతనానికి ప్రతీకగా మిగిలింది. 2026 ఓట్ల లెక్కింపు టీఎంసీకి తుది వీడ్కోలు పలుకుతుందని హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో చేసిన జోస్యం అక్షరాలా వాస్తవరూపం దాల్చింది.హిందీ బెల్ట్ దాటి అప్రతిహత విస్తరణప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత చరిష్మా, అమిత్ షా సంస్థాగత వ్యూహాల కలయికతో బీజేపీ ఎన్నికల యంత్రాంగం అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి హిందీ రాష్ట్రాల్లో 45 శాతానికి పైగా ఓటు బ్యాంకుతో అజేయంగా నిలుస్తున్న ఆ పార్టీ, కొత్త ప్రాంతాలకు కూడా వేగంగా విస్తరిస్తోంది. 2022లో గుజరాత్లో 182కి 156 స్థానాలు గెలుచుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను నమ్మకమైన ఓటు బ్యాంకుగా మలచుకోవడం బీజేపీ బలపడేందుకు కారణమైంది.సంస్థాగత మార్పులు, పెరుగుతున్న ప్రభావంబీజేపీ ఎదుగుదల కేవలం ఓట్ల శాతానికే పరిమితం కాలేదు. ప్రభుత్వ వ్యవస్థల రూపురేఖలను సైతం మారుస్తోంది. రాష్ట్ర ఎన్నికల్లో వరుస విజయాలతో రాజ్యసభలో 2014లో 65గా ఉన్న సభ్యుల సంఖ్యను నేడు 113కి పెంచుకోగలిగింది. తద్వారా గతంలో ప్రతిపక్షాలు అడ్డుకున్న అనేక కీలక చట్టాలను సులభంగా ఆమోదించుకుంటోంది. న్యాయవ్యవస్థపై కూడా రాజకీయ ప్రభావం పెరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టులో ఆధార్ (Aadhaar) కేసులో జస్టిస్ చంద్రచూడ్ అసమ్మతి తెలిపినప్పటికీ, బిల్లును మనీ బిల్లుగా 4-1 మెజారిటీతో ఆమోదించడం, మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ రాజ్యసభకు నామినేట్ కావడం ఇందుకు ఉదాహరణలుగా చెబుతున్నారు.వ్యూహాత్మక ఎన్నికల విధానాలుచట్టపరమైన, ఎన్నికల యంత్రాంగాలను తమకు అనుకూలంగా వాడుకోవడంలో ప్రస్తుత పాలకులు ఎంతో నైపుణ్యం కనబరుస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు దగ్గరి నుంచి, అస్సాంలో ముస్లిం ప్రాబల్య నియోజకవర్గాలను 35 నుంచి 22కి తగ్గించిన డీలిమిటేషన్ ప్రక్రియ వరకు బీజేపీ తన మార్కును చూపించింది. 2026 బెంగాల్ ఎన్నికలలో కూడా ఎన్నికల సంఘం ముందుగా 96 లక్షల ఓట్లను తొలగించి, ఆ తర్వాత 25 లక్షలకు సర్దుబాటు చేయడం తుది ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపింది. బెంగాల్, అస్సాం ఎన్నికలను ఎన్నికల సంఘం మద్దతుతో హైజాక్ చేశారని రాహుల్ గాంధీ లాంటి ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.ఏక పార్టీ వ్యవస్థ దిశగా భారత్?భారత రాజకీయ ముఖచిత్రం పూర్తిగా కాషాయమయమవుతున్న తరుణంలో, దేశం ఏక-పార్టీ పాలన దిశగా పయనిస్తోందా అనే చర్చ ముమ్మరమైంది. రాజ్యాంగబద్ధంగా మనం చైనా లాగా ఏక-పార్టీ వ్యవస్థ కాకపోయినా, ప్రస్తుత అధికార కేంద్రీకరణ ఇందిరా గాంధీ కాలాన్ని గుర్తు చేస్తోంది. ప్రతిపక్షాల స్థానం బాగా కుంచించుకుపోతోందని, తమ పోరాటానికి మరింత సహనం అవసరమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అంగీకరిస్తున్నారు. దక్షిణాదిన తమిళనాడు, కేరళలో ఇంకా సవాళ్లు ఉన్నప్పటికీ, జాతీయ రాజకీయాలను ఇప్పుడు ఒకే ఒక శక్తి నిర్దేశిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇది కూడా చదవండి: ‘కమల’ వ్యూహం: బెంగాల్ రిపీట్.. పంజాబ్ డిలీట్! -
9న బెంగాల్లో బీజేపీ తొలి సర్కారు
పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ యవనికపై భారతీయ జనతా పార్టీ తన తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మే 9న కోల్‌కతాలోని చారిత్రక ‘బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్’వేదికగా, నవ శకానికి నాంది పలుకుతూ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మే 9న ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. బెంగాల్ సాంస్కృతిక అస్తిత్వానికి నిదర్శనమైన రవీంద్రనాథ్ టాగోర్ జయంతి (మే 9 – 25వ వైశాఖం) రోజు ప్రమాణ స్వీకారం జరగనుండటం విశేషం. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ ఇంకా వీడలేదు. సువేందు అధికారి పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, సమిక భట్టాచార్య, సుకాంత మజుందార్, స్వపన్ దాస్‌గుప్తాల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ‘భూమిపుత్రుడి’కే పట్టాభిషేకం చేయాలన్నది బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ‘రైటర్స్ బిల్డింగ్స్’కు పూర్వవైభవం సుమారు 250 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన, కోల్‌కతా నడి»ొడ్డున ఉన్న ‘రైటర్స్ బిల్డింగ్స్’తిరిగి రాష్ట్ర సచివాలయంగా రూపుదిద్దుకోనుంది. మమతా బెనర్జీ హయాంలో హూగ్లీ నది అవతలి ఒడ్డున నిర్మించిన ‘నబన్నా’నుంచి పరిపాలన సాగగా, ఇప్పుడు అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ ప్రభుత్వం, తిరిగి పాత సచివాలయం నుంచే పాలన అందించాలని నిర్ణయించింది. రైటర్స్ బిల్డింగ్స్‌లో మరమ్మతులు పూర్తయ్యే వరకు, కొత్త ముఖ్యమంత్రి అసెంబ్లీ ఆవరణలోని ‘అనెక్స్ బిల్డింగ్’నుంచి పాలనను నిర్వహించే అవకాశం ఉంది. -
కేరళ సీఎం పదవిరేసులో ముగ్గురు!
లెఫ్ట్ కూటమి పరిపాలనా కోటగోడలను బద్దలుకొడుతూ పదేళ్ల తర్వాత కేరళలో అధికారపీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి ఎట్టకేలకు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధంచేసుకుంది. అయితే రాష్ట్రపరిపాలనా రథాన్ని ముందుండి నడిపించే రథసారథి ఎవరనే చర్చ ఇప్పుడు మొదలైంది. గతంలో కేరళ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షనేతగా ఉండి సీఎం పినరయి విజయన్ ప్రభుత్వ వైఫల్యాలను విజయవంతంగా ఎండగట్టిన వీడీ సతీశన్‌కు సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అగ్రనాయకుడు రాహుల్‌గాందీకి అత్యంత సన్నిహిత నేతగా మెలుగుతున్న కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే ఆస్కారముందని కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేశ్ చెన్నితల సైతం సీఎం రేసులో ముందుకు దూసుకుపోతున్నారని కేరళ మీడియా కోడైకూస్తోంది. పార్టీ నేతలందర్నీ సమన్వయం చేసే సత్తా, పరిపాలనా అనుభవం, ఢిల్లీలో మాట నెగ్గించుకురాగల పరపతి ఉన్న నేతకే సీఎం పదవి దక్కే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిలో ఎవరిని సీఎం పదవి వరిస్తుందనేది కేరళలో చర్చనీయాంశమైంది. ఈ ముగ్గురు కీలకనేతల గురించి క్లుప్తంగా.. వీడీ సతీశన్ వీడీ సతీశన్ ఐదేళ్లుగా విపక్షనేతగా కొనసాగుతూ ప్రజసమస్యలపై అసెంబ్లీలో ప్రజావాణిని బలంగా విన్పించి ఓటర్లలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎంగా ఈయనకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పార్టీ మద్దతు కూడా ఉంది. సతీశన్ సీఎం అయితే మైనార్టీల బాగోగులనూ పట్టించుకుంటారని ఐయూఎంఎల్ అధ్యక్షుడు పనక్కడ్ సాదిఖ్అలీ తంగల్ అన్నారు. పినరయి విజయన్ ప్రభుత్వహయాంలో జరిగిన అవినీతి, బంధుప్రీతి, అసమర్థ పాలనపై సతీశన్ ప్రజాక్షేత్రంలో బలంగా ఎండగట్టారు. యువకుడిగా కేరళ స్టూడెంట్స్ యూనియన్‌లో సభ్యునిగా ఉన్నకాలం నుంచి లాయర్‌గా తర్వాత కాంగ్రెస్‌నేతగా పాతికేళ్లకుగాపైగా కేరళ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఎర్నాకులం ఈయనకు పెట్టని కోట. పార్టీ అధిష్టానం వద్ద సైతం సతీశన్‌కు మంచి పేరుంది. పరవూర్‌లో సీపీఐ నేత టైసన్ మాస్టర్‌పై భారీ మెజారీ్టతో గెలిచి ప్రజల్లో తనకున్న ఆదరణను మరోసారి నిరూపించుకున్నారు. రమేశ్ చెన్నితల 70 ఏళ్ల రమేశ్ చెన్నితల సొంత రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం గడించారు. పారీ్టకి గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా సేవలందించారు. గత యూడీఎఫ్ ప్రభుత్వంలో రాష్ట్ర హోం, విజిలెన్స్ శాఖమంత్రిగా పనిచేశారు. విద్యార్థి నేతగా ఉంటూ ఈస్థాయికి ఎదిగారు. 1982లోనే విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐకి ఆలిండియా అధ్యక్షునిగా పనిచేశారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్‌కు సైతం అధ్యక్షునిగా చేశారు. కేరళ అసెంబ్లీలో గతంలో విపక్షనేతగా ఉంటూ ప్రభుత్వవిధానాలపై ఉద్యమించారు. సతీశన్ కంటే ముందు విపక్షనేతగా పనిచేసిన కాలంలో యూడీఎఫ్ కూటమి మిత్రపక్షాల మధ్య ఐక్యత పెంచడంలో సపలమయ్యారు. జిల్లా నేతలను సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. తాజా ఎన్నికల్లో హరిపాద్ నియోజకవర్గంలో సీపీఐ నేత జిస్మన్పై భారీ మెజారీ్టతో నెగ్గారు. అలప్పుజ జిల్లాలో గెలిచిన ఏకైక యూడీఎఫ్ అభ్యర్థి ఈయనే. తద్వారా జిల్లాపై తనకు ఎంత పట్టు ఉందనేది నిరూపించుకున్నారు. కేసీ వేణుగోపాల్ అటు ఢిల్లీలో ఇటు కేరళలో నెగ్గుకురాగల విలక్షణమైన నేపథ్యమున్న నేతగా కేసీ వేణుగోపాల్ నిలిచారు. అలప్పుజ నుంచి గతంలో ఎంపీగా గెలిచారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం అత్యంత కీలకమైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(వ్యవస్థాగతం) హోదాలో కొనసాగుతూ అగ్రనాయకులు సోనియా గాం«దీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీలకు కుడిభుజంగా ఉన్నారు. కేఎస్‌యూ, యూత్ కాంగ్రెస్ విభాగాల్లో కష్టపడిపనిచేసి ఏఐసీసీ పదవి పొందేస్థాయికి ఎదిగారు. రాష్ట్ర నేతలకు, కేంద్ర నాయకత్వానికి మధ్య సంధాన కర్తగా ఉంటూ చాన్నాళ్లుగా చక్కటి సమన్వయం సాధించారు. అధినాయకత్వానికి దగ్గరగా ఉన్న కారణంగా ఈయనకు సీఎం పదవి దక్కినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని రాజకీయపండితులు విశ్లేషిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సంచలనం?
సాక్షి,చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా తలపడుతున్న డీఎంకే, అన్నా డీఎంకే మధ్య పొత్తు చర్చలు ప్రారంభమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 59, అన్నాడీఎంకే 47 సీట్లు కైవసం చేసుకుంది. మొత్తం 106సీట్లు. ఇతర చిన్న పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే డీఎంకే,అన్నా డీఎంకేల మధ్య జరిగిన చర్చల్లో చెరో రెండున్నరేళ్లు పాలించేలా ఒప్పందం కుదిరినట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమి అవసరం ఏర్పడింది. ఈ పరిస్థితిలో, డీఎంకే, అన్నా డీఎంకే మధ్య చర్చలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఎన్నో సార్లు పరస్పరం తీవ్రంగా విమర్శించుకున్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యం కోసం చేతులు కలపాలని ఆలోచిస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య విభేదాలు 1970ల నుండి కొనసాగుతున్నాయి. ఈ రెండు పార్టీలు తమిళనాడులో ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చి, రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా ఆధిపత్యం చెలాయించాయి. ఇప్పుడు హంగ్ అసెంబ్లీ పరిస్థితి కారణంగా, దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్న ఈ పార్టీలు ఒకే వేదికపై చేరే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి. ఈ పొత్తు జరిగితే, తమిళనాడు రాజకీయాల్లో ఇది చారిత్రక మలుపు అవుతుంది. అయితే, ఇరుపార్టీల కేడర్, నాయకత్వం ఈ నిర్ణయాన్ని ఎంతవరకు అంగీకరిస్తారన్నది చూడాలి. మరోవైపు, కొత్తగా ఎదుగుతున్న పార్టీలు కూడా ఈ సమీకరణల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. -
టీవీకేతో కాంగ్రెస్ పొత్తు.. డీఎంకే షాకింగ్ రియాక్షన్
చెన్నై: భవిష్యత్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదంటూ డీఎంకే తేల్చి చెప్పింది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతివ్వడాన్ని డీఎంకే తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ తన అసలు రూపాన్ని బయటపెట్టిందన్న డీఎంకే.. కాంగ్రెస్ కష్టాల్లో ఉంటే అండగా నిలిచాం. అందుకు తాము భారీ మూల్యాన్ని చెల్లించామంటూ డీఎంకే పేర్కొంది.సోనియా, మన్మోహన్ సింగ్‌లతో స్నేహంగా ఉన్నాం. రాహుల్ గాంధీని సోదరుడిగా గౌరవించాం. అయితే ఇప్పుడు డీఎంకేతో కాంగ్రెస్ సంబంధాలు తెంచుకోవడం.. మాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదు. కాంగ్రెస్‌ది నమ్మకద్రోహం, రాజకీయ అవకాశవాదం. మా కూటమిలో ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకుని.. సిగ్గులేకుండా ప్రత్యర్థి శిబిరానికి మళ్లించింది. ఇది ప్రజలను మోసం చేయడమే. బీజేపీకి, కాంగ్రెస్‌కు పెద్ద తేడా లేదు. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి కాంగ్రెస్ హైకమాండ్ సంకోచిస్తున్న టైంలో మొట్ట మొదటగా స్టాలిన్ అధికారికంగా రాహుల్ పేరును ప్రకటించారు. ఇండి కూటమి తరపున డీఎంకే అత్యధిక ఎంపీలను పంపింది. పార్లమెంట్ లోపల, బయట కాంగ్రెస్‌కు భుజం భుజం కలిసి నడిచాం. ఓటమి మాకు కొత్తేమి కాదు.. వెన్నుపోటు కొత్త కాదు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా సమాధానం చెబుతాం’’ అంటూ డీఎంకే హెచ్చరించింది. -
టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే విజయ్ గురువారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అది వాయిదా పడింది. తమిళనాడులోని 234 సభ్యుల సభలో టీవీకే 108 స్థానాలు గెలిచింది. మెజారిటీ మార్క్ (118)కి 10 సీట్లు తక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుతో 5 స్థానాలు పెరిగాయి. మొత్తం 113కి చేరింది. మెజారిటీ మార్క్ కోసం ఇంకా సీట్లు అవసరం. పీఎంకే, సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే వంటి చిన్న పక్షాలతో చర్చలు జరుగుతున్నాయి. విజయ్ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించే ముందు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ మెజారిటీ మద్దతు నిరూపించాలని కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటే ముందు మెజారిటీ మద్దతుకు పత్రాలరూపంలో ఆధారాలు సమర్పించాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పట్టుబట్టారు. ఈ పరిణామం వల్ల టీవీకే ప్రమాణ స్వీకార కార్యక్రమ ప్రణాళిక దెబ్బతింది. ప్రమాణ స్వీకారంలో విజయ్ సహా నలుగురు సీనియర్ నేతలు ప్రమాణం చేసి, సభలో మెజారిటీ నిరూపణకు రెండు వారాలు గడువు కోరాలని భావించారు.కాగా, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇచ్చింది. దీంతో తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్‌కు ఉన్న దీర్ఘకాల మైత్రి చెడిపోయింది. టీవీకే-కాంగ్రెస్ స్నేహబంధం ప్రభుత్వ ఏర్పాటు వరకు మాత్రమే కాకుండా.. స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్ సభ, రాజ్య సభ ఎన్నికలు సహా భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లోనూ కొనసాగుతుందని చెప్పాయి. టీవీకే తన ఎమ్మెల్యేలను మామల్లాపురంలోని ఓ ప్రైవేట్ లగ్జరీ రిసార్ట్‌కు తరలించింది.అనుమతి కోసం మరో ప్రయత్నంటీవీకే ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జునా ఇవాళ రాత్రి గవర్నర్‌ను మరోసారి కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుపై అనుమతి తీసుకోవడానికి మరో ప్రయత్నం చేశారు. సమయాన్ని ఇస్తే 118 సంపూర్ణ మద్దతు కూడగడుతామని హామీ ఇచ్చారు. మొదట ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని కోరారు. -
టీవీకేకు కాంగ్రెస్ మద్దతు.. స్టాలిన్ సంచలన నిర్ణయం
చైన్నై: తమిళనాడులో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. టీవీకేకు సరైన సంఖ్యాబలం లేదంటూ ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రకటించారు. కాగా ఇప్పుడు డీఎంకే సైతం కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసిందని భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉండదని తేల్చిచెప్పింది. ఈ మేరకు డీఎంకే అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.డీఎంకే అధికారిక ప్రకటనలో... కాంగ్రెస్ తన అసలు రూపాన్ని బయటపెట్టిందని కాంగ్రెస్ కష్టాల్లో ఉంటే అండగా నిలిస్తే దానికి తాము భారీ మూల్యాన్ని చెల్లించామని పేర్కొంది. సోనియా, మన్మోహన్ సింగ్‌లతో స్నేహంగా ఉన్నాం రాహుల్ గాంధీని సోదరుడిగా గౌరవించాం ఐతే ఇప్పుడు DMKతో కాంగ్రెస్ సంబంధాలు తెంచుకోవడం మాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదని తెలిపింది. కాంగ్రెస్‌ది నమ్మకద్రోహం, రాజకీయ అవకాశవాదం మా కూటమిలో ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకుని.. సిగ్గులేకుండా ప్రత్యర్థి శిబిరానికి మళ్లించింది ఇది ప్రజలను మోసం చేయడమేనని పేర్కొంది. బీజేపీకి, కాంగ్రెస్‌కు పెద్ద తేడా లేదని రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికికాంగ్రెస్ హైకమాండ్ సంకోచిస్తున్న టైంలో మొట్ట మొదటగా డీఎంకే అధినేత స్టాలిన్ అధికారికంగా రాహుల్ పేరును ప్రకటించారు. ఇండియా కూటమి తరపున డీఎంకే అత్యధిక ఎంపీలను పంపింది. పార్లమెంట్ లోపల, బయట కాంగ్రెస్‌కు భుజం భుజం కలిసి నడిచాం, ఓటమి మాకు కొత్తేమి కాదు..వెన్నుపోటు కొత్త కాదు సమయం వచ్చినప్పుడు కచ్చితంగా సమాధానం చెబుతామంది. భవిష్యత్తులో కాంగ్రెస్‌తో పొత్తుఉండదు. ఆపద వేళ కాంగ్రెస్‌ను ఆదుకుంటే వెన్నుపోటు పొడిచారు. కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు తెలిసింది. అధికార దాహంతోనే టీవీకేతో కాంగ్రెస్ జతకట్టింది". అని డీఎంకే ప్రకటన విడుదల చేసింది.టీవీకే మెజార్టీ మార్కుకు 10 సీట్ల దూరంలో నిలిచిపోవడంతో కాంగ్రెస్‌తో పాటు ఇతర చిన్నపార్టీల మద్దతు కోరింది. దీంతో టీవీకేకు సపోర్టు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో డీఎంకే సంచలన ప్రకటన విడుదల చేసింది. కాగా ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా డీఎంకే పార్టీ ఉంది. ఇండియా కూటమికి ఛైర్మన్‌గా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే వ్యవహరిస్తున్నారు. కాగా డీఎంకే ప్రకటన నేపథ్యంలో ఇప్పుడు డీఎంకే పార్టీ ఇండియా కూటమి నుంచి సైతం దాదాపుగా వైదోలిగినట్లేనని విశ్లేషకులు అంచనా.. -
ఎంకే స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. ఎందుకంటే..
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి తర్వాత.. ఎం.కే స్టాలిన్‌ను రజనీకాంత్ ఆయన నివాసంలో ఇవాళ(బుధవారం) కలిశారు. మర్యాద పూర్వకంగానే రజనీకాంత్.. స్టాలిన్‌తో భేటీ అయ్యారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. రజనీకాంత్.. స్టాలిన్ కలిసి కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నటుడు విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాలను గెలుచుకోగా, డీఎంకే 59 స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే.స్టాలిన్ తన కొలత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో సుమారు 8,700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. డీఎంకే, మిత్రపక్షాలు రెండో అతిపెద్ద కూటమిగా నిలిచినందున.. కొత్త అసెంబ్లీలో అవి ప్రతిపక్ష స్థానంలో కూర్చోనున్నాయి. స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం, చెపాక్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.గతంలో రజనీకాంత్.. డీఎంకేకు అందించిన మద్దతు దృష్ట్యా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 1995లో రాజకీయాల్లోకి వస్తారని భావించిన సమయంలో ఆయన డీఎంకే కూటమికి మద్దతు ఇచ్చి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. 1998 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆయన పార్టీకి అండగా నిలిచారు. ఆ తర్వాత 2017లో రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించినప్పటికీ, 2021లో అనారోగ్య కారణాలతో రజనీకాంత్ వెనక్కి తగ్గారు. విజయ్ విజయం తర్వాత.. ఆయనకు అభినందనలు తెలుపుతూ రజనీకాంత్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.కాగా, విజయ్ తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ రెండు స్థానాల్లోనూ గెలిచారు. ఆయన పెరంబూర్ స్థానాన్ని ఉంచుకుని, తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసే అవకాశం ఉంది. తద్వారా అక్కడ ఉప ఎన్నికలు జరగవచ్చు. మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయనకు ఇంకా 10 స్థానాల మద్దతు అవసరం. -
విజయ్.. ఇలాంటివి చేయకండి: గాంధీజీ మునిమనవడు
చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే అధినేత జోసెఫ్ విజయ్‌కు మహాత్మా గాంధీ మునిమనవడు, రచయిత గోపాలకృష్ణ గాంధీ బహిరంగ లేఖ రూపంలో వ్యక్తిగతంగా సూచనలు, సలహాలు ఇచ్చారు. కొన్ని పనలు చేయాలని, కొన్నింటిని చేయకూడదని సూచించారు.‘కాబోయే ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. తమిళనాడు ముఖ్యమంత్రిగా మీ పర్యాయం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాను. నేను రాష్ట్ర ఓటరును. కానీ, ఏప్రిల్ 23 రోజు మీకు ఓటు వేసిన దాదాపు 35 శాతం మందిలో నేను లేను. మీకు ఓటు వేయని 65 శాతం మందిలో నేనున్నాను. విజయ్ యువతను ఆకర్షిస్తున్నారని, కానీ అది సీట్లు తెచ్చిపెట్టదని అనుకున్నాను. ఓట్లు ఎప్పటిలాగే వెళ్లే చోటికే వెళ్తాయనే అభిప్రాయంతో నేను ఉన్నాను. కాబట్టి 4 మే రోజు ఫలితాలు వరుసగా వెలువడుతుండగా నాకు ఆశ్చర్యం కలిగింది. అదే సమయంలో ఒక ఆలోచన వచ్చింది. విజయ్ కొత్తవాడు, అంటే అనుభవం తక్కువ’ అన్నారు.ఫెడరల్, సెక్యులర్ వ్యవస్థను రక్షించాలి అదే సమయంలో ఆయన అవినీతిపరుల ప్రభావం లేకుండా ఉన్న వ్యక్తి. 5 సంవత్సరాల క్రితం కొత్తగా ఎన్నికైన ఎం.కె.స్టాలిన్ ముందు కొన్ని ఆలోచనలను ఉంచినట్లే, ఇప్పుడు మీ ముందూ అటువంటి వాటిని ఉంచాలనుకుంటున్నానని చెప్పారు. ‘మీరు ఎన్నికల్లో గెలిచారు. సభలో అత్యంత కీలకమైన ఫ్లోర్ టెస్ట్ ఇంకా గెలవాల్సి ఉంది. భారత ఫెడరల్, సెక్యులర్ వ్యవస్థ రక్షణను మొదటి ప్రాధాన్యంగా ఉంచాలి. మీ నాయకత్వంలో రాష్ట్రం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ గౌరవాన్ని నిలబెట్టాలి. పదవి కాపాడుకోవాలనే ఆందోళన దానిపై రాజీ పడేలా చేయకూడదు. మీ సిద్ధాంతం ఏమిటి అని అడగవచ్చు. అది మిమ్మల్ని కలవరపెట్టకూడదు. ‘నా సిద్ధాంతం.. సిద్ధాంతం లేదు’ అని చెప్పండి. అలాగే ‘నా మనసాక్షిని అనుసరించడం’ అని అనండి.మీరు కొత్త నాయకుడు. గత భారాలు లేకుండా కొత్తగా పాలనను ప్రారంభించే అవకాశం ఉంది. ఎం.కె.స్టాలిన్ వద్ద ఈ అవకాశం లేదు. అలాగే, ఆయనకు ఉండి మీకు లేనిది అనుభవం. ఆయన మీకు ముందున్న నాయకుడు, శత్రువు కాదు. మీరు ఆయన తరువాతి నాయకుడు, స్థానభ్రంశం చేసే వ్యక్తి కాదు. ఆయన రాజకీయాలపై విభేదాలు ఉన్నా, ఫెడరల్ స్వభావం, సెక్యులర్ సమానత్వం విషయంలో మీరు ఇద్దరూ ఒకే దిశలో ఉన్నారు. ఆ దిశలో ఆయన మాట వినండి’ అని చెప్పారు.ఉదయనిధితో పోటీ పడొద్దు ‘సభలో ఉదయనిధి స్టాలిన్ ఉనికి మీకు పోటీ కాకుండా మంచి జంటగా ఉండాలి. మీరు ఇద్దరూ యువకులు, ఆకర్షించే స్వభావం ఉన్నవారు. మీ 108 మంది ఎమ్మెల్యేల్లో కేవలం ముగ్గురికి మాత్రమే ఇంతకుముందు శాసనసభలో అనుభవం ఉంది. మిగతావారు ఆ ముగ్గురి దగ్గర నుంచి, ఎదుటి సీనియర్ సభ్యుల దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. కొత్త సభలో కేవలం ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కర్మయోగి పెరుంతలైవర్ కామరాజ్ నేతృత్వం వహించిన పార్టీకి చెందినవారని గుర్తుంచుకోండి. సెక్రటేరియట్లో అధికారులను మీ సహచరులుగా చూడండి, కిందివారిగా కాదు.చివరిగా, తమిళనాడులో మంచి, స్వచ్ఛమైన, సమర్థ పాలన కొనసాగించండి. పర్యావరణ రక్షణను ప్రధాన ప్రాధాన్యంగా ఉంచండి. రాష్ట్రం దాటి ద్వేషం లేని, భయం లేని, న్యాయమైన భారతానికి మార్గదర్శకంగా నిలవండి. ఒక వ్యక్తిగత వ్యాఖ్యతో ముగిస్తాను.. ఈ రాష్ట్రంలో ఒక క్రైస్తవుడు ప్రభుత్వం నడిపించడం ఇదే మొదటిసారి. ఆ విధిని తమిళనాడు సెక్యులర్ గుర్తింపుకు దైవ హస్తంగా భావించండి’ అని గోపాలకృష్ణ గాంధీ రాసుకొచ్చారు. -
మమతను పదవి నుంచి గెంటేయండి
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవి నుంచి మమతా బెనర్జీని గెంటేయాలని సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ వ్యాఖ్యానించారు. ఎన్డిటీవీకి చెందిన పద్మజా జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా మమతా బెనర్జీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మమత వైఖరి క్షమించరానిదని, ఆమె వ్యవహారశైలి మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాలుగా మారిందన్నారు. రాజీనామా చేయకపోతే గవర్నర్ తన అధికారాలను ఉపయోగించి పదవి నుంచి మమతను తొలగించాలని అన్నారు.''మమతా బెనర్జీ వ్యవహారశైలి అవమానకరంగా ఉంది. ఆమెకు కచ్చితంగా గుణపాఠం నేర్పాలి. ఆమె ఇలా చేసినందుకు నాకు సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే తనకు తాను రాజీనామా చేసివుంటే హుందాగా పదవి నుంచి తప్పుకునేవారు. రాజీనామా చేయకపోవడం వల్ల గవర్నరే ఆమెను తొలగించే పరిస్థితి వచ్చింది. ఆమె ఇప్పుడు గవర్నర్ దయ మీద ఆధారపడి పదవిలో ఉన్నారు కాబట్టి, వెంటనే గవర్నర్ ఆమెను అధికారికంగా తొలగించాలి. అప్పటికీ సీఎం కుర్చీ వదలను అంటే నిర్దాక్షిణ్యంగా ఆమెను గెంటేయాల''ని మహేష్ జెఠ్మలానీ అన్నారు.ఒకవేళ మమతా బెనర్జీ సీఎం కార్యాలయంలోనే తిష్ట వేస్తే, గవర్నర్ పోలీసులను పంపి ఆమెను ఖాళీ చేయించవచ్చని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును మమత గౌరవించాలని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ధ్రువీకరించిన క్షణం నుంచే ఓటర్ల తీర్పు అమల్లోకి వస్తుందని, ఇప్పుడు సీఎం కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తిగానే మమతను పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ఎన్నికల సంఘమే అసలైన విలన్: మమతముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని మమతా బెనర్జీ మంగళవారం ప్రకటించారు. ఎన్నికల ఫలితాలపై ఆమె కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాతీర్పుతో ఓడలేదని, కుట్ర కారణంగా ఓడిపోయామని చెప్పారు. తాము బీజేపీతో పోరాటం చేయలేదని, ఎన్నికల సంఘంతో పోరాడామని అన్నారు. ''నేను ఓడిపోలేదు. లోక్సభవన్కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించే ప్రసక్తే లేదు. మా ఓట్లను చోరీ చేశారు. చరిత్రలో ఇదో చీకటి అధ్యాయం. ఇందులో ఎన్నికల సంఘమే అసలైన విలన్'' అంటూ మమతా బెనర్జీ మండిపడ్డారు. చదవండి: తమిళనాడులో విజయ్ గెలుపు.. ట్రెండింగ్‌లో అన్నామలై!మమతను తొలగించాల్సిందే: హిమంత బిస్వశర్మమమతా బెనర్జీ వ్యవహారశైలిపై బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ స్పందించారు. ఆమెను పదవి నుంచి తొలగించాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఎన్డీటీవీతో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే, ఆమెను బలవంతంగా తొలగించాల్సి ఉంటుంది. దేశం ఆమె ఇష్టానుసారం నడవదు. గవర్నర్ కొంత కాలం వేచి చూస్తారు, ఆ తర్వాత ఆమెను తొలగిస్తారని అన్నారు. #TheBuckStopsHere with @PadmajaJoshi Mamata Banerjee should be taught a lesson, she's a disgrace to the very concept of democracy and rule of law: Mahesh Jethmalani (@JethmalaniM), Senior Advocate, Supreme Court pic.twitter.com/bMQXpBGcop— NDTV (@ndtv) May 5, 2026 -
టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో మరో ట్విస్ట్
చెన్నై: టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. రేపు(గురువారం) విజయ్ ప్రమాణ స్వీకారం అనుమానమే?. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి విజయ్‌కు గవర్నర్ అనుమతి లభించలేదు. మెజార్టీపై గవర్నర్‌ను విజయ్ ఒప్పించలేకపోయారు. విజయ్‌కు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలంటూ గవర్నర్ స్పష్టం చేశారు.మరో వైపు, విజయ్‌కు మద్దతిచ్చేందుకు వామపక్షాలు నిరాకరించారు. మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పి వామపక్ష పార్టీలు.. కూటమిలోనే ఉంటామని ప్రకటించాయి. ఇప్పటికే మద్దతు ఇవ్వబోమని ముస్లిం లీగ్ చెప్పేసింది. ఇదిలా ఉండగా, లోక్ భవన్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో రేపు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం జరుగుతుందా? లేదా? అన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను గవర్నర్ ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారానికి అడ్డేలేదని.. రేపే ప్రమాణ స్వీకారం, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను విజయ్ కోరారు.తక్కువ సమయం ఉన్నందున ఆహ్వానాలకు సమయం ఉందా? అంటూ ఆరా తీసిన గవర్నర్.. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలని, మెజార్టీ సంఖ్య చూపించాలంటూ గవర్నర్ తేల్చిచెప్పినట్లు సమాచారం. 112 మంది ఎమ్మెల్యేల పేర్లతో జాబితాను గవర్నర్‌కు విజయ్ అందించారు. గవర్నర్ నిర్ణయంపై టీవీకే నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పటికే విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.కాగా, ప్రభంజనంలా దూసుకొచ్చిన టీవీకే చీఫ్ విజయ్ తమిళనాట నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అడుగుదూరంలో ఆగిపోయారు. మరో పది మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భావసారూప్య పార్టీలతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను ఆహ్వానించాలని గవర్నర్‌కు టీవీకే పార్టీ అధికారికంగా ఈ–మెయిల్లో లేఖ పంపింది. తమకు ఇప్పటికే 108 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, రెండు వారాల గడువు ఇస్తే ఆలోపు మరో 12 మంది బయటి ఎమ్మెల్యేల మద్దతుతో శాసనసభలో బలనిరూపణకు సిద్ధమని ఆ లేఖలో పార్టీ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
విజయ్ తీసుకొచ్చిన విప్లవం ఇదే.. ఇక భవిష్యత్ అంతా ఇలానే..!
చెన్నై: అసలైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో నిరూపించాయి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు. అన్ని వర్గాలకు చెందిన వారూ ఎమ్మెల్యేలుగా గెలిచారు. సామాజిక న్యాయం దిశగా వెళ్లాలంటే ఇటువంటి ఫలితాలు అవసరమని విశ్లేషకులు అంటున్నారు. రాజకీయాల్లో అన్ని లెక్కలను సరి చేశారు టీవీకే విజయ్. ఎందరో ఉద్ధండులకూ సాధ్యం కానిది సాధించి చూపించారు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి వారూ చూపించని మార్పును చూపించారు. ఓటర్లలో మార్పు తీసుకొచ్చారు.వృత్తులను చూడలేదు వీధుల్లో ఆటో డ్రైవింగ్ చేసుకునే పని నుంచి అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా ప్రవేశం వరకు ఎదిగారు ఓ ఆటోడ్రైవర్. అలాగే, విజయ్ కారు డ్రైవర్ కుమారుడు కూడా గెలిచి అసెంబ్లీలోకి ప్రవేశించారు. రాయపురం ఆటో డ్రైవర్ కేవీ విజయ్ దామూ అదే నియోజక వర్గం నుంచి గెలిచారు. అలాగే, విజయ్ కారు డ్రైవర్ కుమారుడు కూడా గెలిచి అసెంబ్లీలోకి ప్రవేశించారు. విజయ్‌కు దీర్ఘకాలికంగా సహాయకుడిగా ఉంటున్నారు కారు డ్రైవర్ రాజేంద్రన్. ఆ డ్రైవర్ కుమారుడు ఆర్ శబరినాథన్ విరుగంబాక్కం అసెంబ్లీ స్థానంలో టీవీకే తరఫున గెలిచారు.ఇద్దరు సాధారణ వ్యక్తులు సాధించిన ఈ అతి పెద్ద విజయం.. గొప్ప సందేశాన్ని ఇచ్చింది. రాజకీయాలు ఇకపై కేవలం శక్తిమంతమైన కుటుంబాలకే పరిమితం కాదని నిరూపించింది. ఓటర్లు అన్ని వర్గాల వారినీ ఆదరిస్తారని చాటి చెప్పింది.కులాలను చూడలేదుఎవరికి ఓటు వేస్తావని అడిగితే ‘మా కులం వాళ్లకే ఓటు వేస్తా’మని అంటారు చాలామంది. తమిళనాడులోనూ కుల వ్యవస్థ బలంగా ఉంది. ఈ కుల అడ్డుగోడలను దాటి మరీ ఈ సారి ప్రజలు ఓట్లు వేశారని చెప్పుకోవచ్చు. ఇటువంటి వారి నుంచి టీవీకే సామాజికంగా భారీ మద్దతు సంపాదించింది. అసెంబ్లీలో బ్రాహ్మణ ప్రాతినిధ్యాన్ని మళ్లీ తీసుకువచ్చింది. ఇది ప్రధాన ద్రావిడ పార్టీల దృష్టికి ఎక్కువగా రాని అంశం, రాష్ట్ర ఎన్నికల విధానంలో మార్పును సూచిస్తోంది.టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ క్రిస్టియన్ మతాన్ని ఆచరించే వ్యక్తి. ఆయన నేతృత్వంలో పార్టీ సాంప్రదాయ కుల సమీకరణాలను దాటేసి.. అభ్యర్థుల ఎంపిక, స్థానికుల నుంచి నమ్మకాన్ని పెంపొందించడానికే ప్రాధాన్యం ఇచ్చింది.షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ గిరిజనుల (ఎస్టీ) నుంచి 20కి పైగా ఎమ్మెల్యేలు, మైలాపూర్, శ్రీరంగం నుంచి ఇద్దరు బ్రాహ్మణులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.మైలాపూర్‌లో పి.వెంకటరమణన్, శ్రీరంగంలో రమేశ్ గెలుపును రాజకీయంగా ప్రాధాన్యంగా భావిస్తున్నారు. బ్రాహ్మణ అభ్యర్థులను నిలబెట్టడానికి ప్రధాన ద్రావిడ పార్టీలు వెనకడుగు వేస్తాయి. వారి సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఓటింగ్‌లో ఆధిపత్య కులాల ప్రభావంతో ఓడిపోవచ్చు అనే భయం పార్టీల్లో ఉంటుంది. అయినప్పటికీ, టీవీకే వారిని అభ్యర్థులుగా నిలబెట్టింది. వారు గెలవడం ఇప్పటి వరకు ఉన్న ఎన్నికల విధానానికి భిన్నంగా జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 46 రిజర్వు స్థానాలు ఉన్నాయి. టీవీకే అభ్యర్థులు వాటిలో 24 స్థానాల్లో గెలిచారు. మిగిలిన 22 రిజర్వు స్థానాల్లో డీఎంకే కూటమి (13), ఏఐఏడీఎంకే (9) గెలిచాయి. సంప్రదాయ కూటములు కొన్ని ప్రాంతాల్లో బలాన్ని నిలబెట్టుకున్నా, టీవీకే భారీ ప్రభావాన్ని చూపించింది.టీవీకే అభ్యర్థి విరుధునగర్‌లో షెడ్యూల్డ్ కుల అభ్యర్థి పి.సెల్వం జనరల్ స్థానంలో పోటీ చేసి వి.విజయ్ ప్రభాహరణ్‌ను ఓడించారు. ఎస్సీ అభ్యర్థి జనరల్ స్థానంలో గెలవడం వల్ల ఈ ఎన్నికలో కుల లెక్కలు పనిచేయలేదని స్పష్టమవుతోంది.రిజర్వు, సాధారణ స్థానాల్లో రెండింట్లోనూ వెనుకబడిన వర్గాల అభ్యర్థులు టీవీకే తరఫున గెలిచారు. ఇది కుల, మత గీతలను దాటిన సమీకరణాన్ని సూచిస్తోంది. భవిష్యత్తు రాజకీయాల్లోనూ ఇదే ధోరణి కనపడితే మనం కోరుకుంటున్న సమసమాజం వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.టీవీకే నుంచి 13.. డీఎంకే నుంచి 0 తమిళనాడు శాసనసభకు 23 మంది మహిళా సభ్యులు ఎన్నికయ్యారు. గత శాసనసభలో కేవలం 12 మందే ఉండేవారు. తమిళనాడు చరిత్రలో 23 కంటే ఎక్కువ మంది మహిళలు ఎన్నికైన సందర్భాలు గతంలో కేవలం రెండుసార్లు మాత్రమే ఉన్నాయి. ఇటీవల వెల్లడైన ఫలితాల్లో టీవీకే నుంచి 13 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఏఐఏడీఎంకే నుంచి ఆరుగురు ఉన్నారు. డీఎంకే 19 మంది మహిళలను పోటీకి దింపినా ఒక్కరు కూడా గెలవలేదు. -
పతనాపురంలో పతనం: నటుడు గణేష్‌కు ఘోర పరాజయం
పతనాపురం: దక్షిణ కేరళ రాజకీయ ముఖచిత్రాన్ని కుదిపేస్తూ, ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పాతికేళ్ల పాటు పతనాపురం నియోజకవర్గంలో తిరుగులేని ఏకచత్రాధిపత్యం వహించిన కేరళ కాంగ్రెస్ (బీ) అగ్రనేత, వెటరన్ సినీ నటుడు కెబి గణేష్ కుమార్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి ఊమెన్ చాందీపై ప్రజల్లో వెల్లువెత్తిన అపారమైన సానుభూతి, సొంత పార్టీలో తలెత్తిన విభేదాలు కలిసి మొత్తంగా ఒక బలమైన నాయకుని రాజకీయ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చాయి.వెంటాడిన ‘సోలార్ వివాదంగణేష్ కుమార్ ఊహించని పతనానికి ప్రధాన కారణం ‘ఊమెన్ చాందీ ఫ్యాక్టర్’ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో ఊమెన్ చాందీని ‘సోలార్ స్కామ్’లో ఇరికించేందుకు భారీ కుట్ర జరిగిందని, అందులో భాగంగా ఒక లేఖలో నాలుగు కల్పిత పేజీలను గణేష్ కుమారే స్వయంగా చేర్పించారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో ఈ అంశం ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఊమెన్ చాందీ కుమారుడు చాంద ఊమెన్ రంగంలోకి దిగి, తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడంతో, పతనాపురం ఓటర్లు ఈ కుట్రలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు.చేజారిన మద్దతు.. కూలిన కోటఒకప్పుడు గణేష్ కుమార్ విజయాలకు బలమైన పునాదిగా నిలిచిన నాయర్ సర్వీస్ సొసైటీ (ఎన్ఎస్ఎస్) ఈసారి ఆయనకు మద్దతు ఉపసంహరించుకోవడం గట్టి దెబ్బతీసింది. స్థానిక వివాదాల కారణంగా ఎన్ఎస్ఎస్ తాలూకా యూనిట్ ఆయనకు దూరమైంది. అంతేకాకుండా, ఆర్. బాలకృష్ణ పిళ్లై మరణానంతరం కేరళ కాంగ్రెస్ (బీ) పార్టీ పగ్గాలు చేపట్టిన గణేష్ కుమార్, తన ఏకపక్ష పోకడలతో పార్టీలోని సీనియర్ నేతలను, విధేయులను దూరం చేసుకున్నారు. ఈ అంతర్గత విభేదాలు ఆయన ఓటమికి ఆజ్యం పోశాయి.ఉనికి కోల్పోయిన కేరళ కాంగ్రెస్ (బీ)ఈ ఘోర పరాజయం ఒక నాయకుడికి మాత్రమే పరిమితం కాలేదు. కేరళ కాంగ్రెస్ (బీ) పార్టీ ఉనికినే తీవ్ర ప్రశ్నార్థకం చేసింది. పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర శాసనసభలో కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి రావడం ఇదే తొలిసారి. చరిత్రాత్మకంగా కొట్టారక్కర, పతనాపురం నియోజకవర్గాలనే నమ్ముకున్న ఈ పార్టీ, ఇప్పుడు ఆ రెండు స్థానాలను కోల్పోయి, కేవలం కొద్దిమంది స్థానిక ప్రజాప్రతినిధులకే పరిమితమైంది. గణేష్ కుమార్ తన గత అభివృద్ధి పనులను ప్రచారంలోకి తెచ్చినా, ప్రజలు మాత్రం నైతికతకే పట్టం కట్టారు. -
టీఎంసీ కొంపముంచిన ఐదు కోట్ల డీల్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 15 ఏళ్ల టీఎంసీ (టీఎంసీ) పాలన అంతమై, బీజేపీ సంచలన విజయం సాధించిన వేళ, రాజకీయ వర్గాల్లో మరో పెను ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. టీఎంసీ మాజీ మంత్రి, టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ.. మమతా బెనర్జీ పార్టీ అవినీతి బండారాన్ని బట్టబయలు చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు.టికెట్ ధర అక్షరాలా రూ. 5 కోట్లు2026 ఎన్నికల్లో తాను ఎందుకు పోటీ చేయలేదో తివారీ స్పష్టం చేశారు. టీఎంసీ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం అక్షరాలా రూ. 5 కోట్లు డిమాండ్ చేసిందని, తాను నిరాకరించానని తెలిపారు. సుమారు 70 నుంచి 72 మంది అభ్యర్థులు కోట్లు కుమ్మరించి టికెట్లు కొనుక్కున్నారని ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే తాను పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన ఆయన.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బలవంతం మేరకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు.మంత్రి పదవి ఓ ‘లాలీపాప్’తనకు ఇచ్చిన క్రీడా శాఖ సహాయ మంత్రి పదవి కేవలం ఓ ‘లాలీపాప్’ లాంటిదని, పార్టీ మీటింగ్‌లలో తన మాటకు కనీస ప్రాధాన్యత ఉండేది కాదని తివారీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు చెప్పబోతే మమతా బెనర్జీ మధ్యలోనే అడ్డుకుని, తన దగ్గర సమయం లేదని తేల్చిచెప్పేవారని విమర్శించారు. తన నియోజకవర్గంలో డ్రైనేజీ పనుల కోసం తాను సొంత జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టానని, కానీ కొందరు నేతలు అభివృద్ధి పనులను సైతం అడుగడుగునా అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు.క్రీడల గురించి కనీస జ్ఞానం లేదుక్యాబినెట్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్కు క్రీడల గురించి ఏబీసీడీలు కూడా తెలియవని మనోజ్ తివారీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన ఫోటోలు పత్రికల్లో రావడం చూసి తట్టుకోలేక, క్రీడా కార్యక్రమాలకు తనను పిలవడం మానేశారని ఆరోపించారు. అవకతవకలు జరుగుతాయని ముందే ఊహించి, మెస్సీ పర్యటన లాంటి కార్యక్రమాలకు తాను ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉన్నానని చెప్పారు. రాజకీయాలకు స్వస్తి పలికిన తివారీ, ఇకపై బెంగాల్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.ఇది కూడా చదవండి: ‘వేరే దిక్కులేక ఓటేశారు’: ఎన్ఎస్ఎస్ సంచలన వ్యాఖ్యలు -
‘వేరే దిక్కులేక ఓటేశారు’: ఎన్ఎస్ఎస్ సంచలన వ్యాఖ్యలు
తిరువనంతపురం: కేరళ శాసనసభ ఎన్నికల ఫలితాలు పదేళ్ల వామపక్ష (ఎల్డీఎఫ్) పాలనకు తెరదించుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (యూడీఎఫ్) కూటమికి అధికారాన్ని కట్టబెట్టాయి. అయితే ఈ చారిత్రక విజయం కాంగ్రెస్ నేతల గొప్పదం వల్ల కానే కాదని, కేవలం మార్పు కోరుకున్న ప్రజలు విధిలేక కాంగ్రెస్‌కు ఓటేశారని నాయర్ సర్వీస్ సొసైటీ (ఎన్ఎస్ఎస్) జనరల్ సెక్రటరీ జి. సుకుమారన్ నాయర్ వ్యాఖ్యానించారు.పెరున్నలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాజా ఫలితాలను ‘ప్రజాస్వామ్య విజయం’గా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేరళ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ 63, దాని మిత్రపక్షం ఐయూఎంఎల్ 22 సీట్లు గెలుచుకుని పదేళ్ల ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని గద్దె దించాయి. అయితే, ఈ విజయం తమ సొంత ప్రతిభేనని కొందరు కాంగ్రెస్ నేతలు భ్రమ పడుతున్నారని, కానీ అందులో ఏమాత్రం నిజం లేదని సుకుమారన్ నాయర్ తేల్చి చెప్పారు.పదేళ్ల పాలనతో విసుగెత్తిపోయిన ప్రజలు, మార్పు కోరుకుంటూ ఓటు వేశారన్నారు. మరో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ఆ ఓట్లు కాంగ్రెస్, యూడీఎఫ్ పక్షాన పడ్డాయని ఆయన అన్నారు. మంత్రుల ఓటములకు కూడా ఈ ప్రజా వ్యతిరేకతే కారణమని ఆయన విశ్లేషించారు. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక పూర్తిగా కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని, సమర్థులైన, అనుభవజ్ఞులైన వారిని ఆ పార్టీ కేంద్ర నాయకత్వమే ఎంచుకుంటుందని సుకుమారన్ నాయర్ పేర్కొన్నారు. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ గురించి ప్రస్తావించగా.. అది కాంగ్రెస్ నిర్ణయమని, దాన్ని అంగీకరించాల్సిందేనని బదులిచ్చారు. ఎన్నికల్లో ఎన్ఎస్ఎస్ సమాన దూరమనే విధానాన్ని పాటించిందని చెప్పిన ఆయన, గతంలో సతీశన్‌తో వచ్చిన విబేధాలు ఇంకా అలాగే ఉన్నాయని, వాటిని సరిదిద్దుకోవాలని తాను అడగబోనన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో తమకు న్యాయబద్ధంగా దక్కాల్సిన హక్కులను ప్రభుత్వాన్ని అడుగుతామని, అనవసరమైన పదవులు, చట్టవిరుద్ధమైన ప్రయోజనాల కోసం తాము ఆశపడబోమని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఒహియోలో వివేక్ రామస్వామి సంచలనం -
సురేష్ గోపి ఎఫెక్ట్: లక్షల ఓట్లు ఆవిరి?
త్రిస్సూర్: కేరళ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ‘సురేష్ గోపి ఎఫెక్ట్’ రెండేళ్లకే కనుమరుగైంది. 2024లో త్రిస్సూర్‌లో బీజేపీకి చరిత్రాత్మక విజయాన్ని అందించిన ఆ స్టార్ డమ్, 2026 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏకంగా రెండు లక్షల ఓట్ల పతనానికి దారితీసింది. 2024 సాధారణ ఎన్నికల్లో త్రిస్సూర్‌లో బీజేపీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అంతకు ముందు యూడీఎఫ్ అభ్యర్థి టీఎన్ ప్రతాపన్‌కు ఉన్న 93 వేల ఓట్ల మెజారిటీని తలకిందులు చేసి, ఏకంగా 74 వేల పైచిలుకు మెజారిటీతో సురేష్ గోపి విజయం సాధించారు.రాష్ట్రంలో బీజేపీకి ఎదురైన ఎన్నో ఓటముల తర్వాత తన ఇమేజ్‌తో కేరళ రాజకీయాల్లో సురేష్ గోపి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకుని, ఎన్డీఏకు ఘన విజయాన్ని అందించారు. కానీ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ‘మంచి రోజులు’ ఎంతో కాలం నిలవలేదు. పదవిలోకి వచ్చిన కొద్ది కాలానికే సురేష్ గోపి ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఆయన నోటి దురుసు, ప్రజలతో వ్యవహరించే తీరు ఓటర్లతో పాటు సొంత పార్టీ వర్గాలను కూడా తీవ్రంగా నిరాశపరిచాయనే ఆరోపణలున్నాయి.గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునేందుకు చేపట్టిన ‘కాలుంక్ డిబేట్’లో సహాయం కోసం వచ్చిన ఓ వృద్ధుడిని ఆయన అవమానించారనే ఆరోపణలు పార్టీకి తీవ్ర నష్టం చేశాయి. అలాగే మధ్యతరగతి విద్యావంతులను ఆకర్షించేందుకు తెచ్చిన ‘ఎస్జీ కాఫీ టైమ్స్’ కార్యక్రమం కూడా పూర్తిగా విఫలమై, ప్రతిపక్షాల విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. తాజా ఎన్నికల గణాంకాలు ఎన్డీఏ పతనానికి అద్దం పడుతున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో 5,55,007 ఓట్లు (37.8%) సాధించి శిఖరాగ్రాన నిలిచిన బీజేపీ, 2025 స్థానిక సంస్థల ఎన్నికల నాటికి 3,96,808 ఓట్లకు పడిపోయింది. ఇక 2026 అసెంబ్లీ ఎన్నికలు ముగిసే సరికి ఆ ఓట్ బ్యాంక్ 3,55,757 కి దిగజారింది. అంటే కేవలం రెండేళ్ల వ్యవధిలో ఏకంగా రెండు లక్షల ఓట్లు గల్లంతయ్యాయి.ఇది కూడా చదవండి: బాంబు పేలుళ్లు.. దద్దరిల్లిన జలంధర్, అమృత్సర్ -
విజయ్, సువేందు సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. తమిళనాడులో దళపతి విజయ్ (టీవీకే), పశ్చిమ బెంగాల్లో బీజేపీ అగ్రనేత సువేందు అధికారి.. ఇద్దరూ చెరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించారు. అయితే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 14 రోజుల్లో వీరు ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉండటంతో, ఏ సీటును అంటిపెట్టుకోనున్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. వీరి భవిష్యత్ వ్యూహాలపై ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది.సువేందు సంచలనం.. సీఎం రేసులో..పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీని భవానీపూర్ నియోజకవర్గంలో ఏకంగా 15,105 ఓట్ల భారీ తేడాతో ఓడించి సువేందు అధికారి చరిత్ర సృష్టించారు. అదేవిధంగా నందిగ్రామ్‌లోనూ 9,665 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. అయితే, ఆయన భవానీపూర్‌ను వదులుకుని, తన సొంత జిల్లా తూర్పు మేదినీపూర్‌లోని నందిగ్రామ్ స్థానాన్నే అంటిపెట్టుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మమతను రెండుసార్లు ఓడించిన ఘనత దక్కించుకోవడంతో ఆయన తదుపరి సీఎం రేసులో ముందున్నారు. మే 9న జరగనున్న ప్రమాణస్వీకారానికి పరిశీలకునిగా అమిత్ షా వ్యవహరించనున్నారు.చెన్నైకే విజయ్ ఓటు.. పెరంబూర్ ఫిక్స్తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్.. పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ రెండు చోట్లా ఘన విజయం సాధించారు. డీఎంకే అభ్యర్థి ఆర్డి శేఖర్‌పై పెరంబూర్‌లో 53,715 ఓట్ల మెజారిటీతో నెగ్గగా, తిరుచిరాపల్లిలో 27,416 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే విజయ్ తన సొంత ప్రాంతమైన చెన్నైలోని పెరంబూర్ స్థానాన్ని అంటిపెట్టుకుని, తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.బైపోల్స్ కోసం దళపతి మాస్టర్ స్ట్రోక్మధ్య, దక్షిణ తమిళనాడులో పార్టీ ప్రభావాన్ని విస్తరించాలనే వ్యూహంతోనే విజయ్ తొలుత తిరుచిరాపల్లి నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ఆ స్థానానికి రాజీనామా చేయాల్సి వస్తుండటంతో, త్వరలో జరిగే ఉపఎన్నికలో అక్కడ మాజీ ఐఏఎస్ అధికారి యు సహాయంను బరిలోకి దించే అవకాశాన్ని టీవీకే అధిష్టానం పరిశీలిస్తోంది. టీవీకే ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది కొత్తవారు కావడంతో పరిపాలనా అనుభవం కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తుది నిర్ణయం విజయ్‌దేనని పార్టీ నేతలు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: ‘కమల’ వ్యూహం: బెంగాల్ రిపీట్.. పంజాబ్ డిలీట్! -
30 వేల మెజారిటీతో గెలుపు.. వెంటనే రాజీనామా..!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సీవీ షణ్ముగం సీనియర్ నేత. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. గత ఎన్నికలలో ఓటమి పాలు కావడంతో పార్టీ వద్ద పట్టుబట్టి మరీ రాజ్యసభ సీటును రాబట్టుకున్నారు. ఈ సారి ఆయన మైలం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. డీఎంకే, టీవీకే అభ్యర్థులతో సహా 21 మంది సీవీ షణ్ముగంను ఓడించే దిశగా ఇక్కడ పోటీచేశారు.అయితే, గత కొన్నేళ్లుగా సీవీ షణ్ముగం ఇక్కడి ప్రజలతో మమేకం కావడం విజయాన్ని వరించింది. 82,535 ఓట్లను ఆయన రాబట్టుకున్నారు. సుమారు 30 వేల ఓట్లమెజారిటీతో గెలిచిన సీవీ షణ్ముగం రాష్ట్ర రాజకీయాలే తనకు ముఖ్యం అన్న నిర్ణయానికి వచ్చారు. ఎమ్మెల్యేగా ధ్రువీకరణ పత్రం అందుకున్న సీవీ షణ్ముగం అదే చేతితో రాజ్య సభ పదవికి రాజీనామా చేయడం గమనార్హం. -
‘కమల’ వ్యూహం: బెంగాల్ రిపీట్.. పంజాబ్ డిలీట్!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన చరిత్రాత్మక విజయంతో ఉత్సాహంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఏమాత్రం సమయం వృథా చేయకుండా తన తదుపరి లక్ష్యాన్ని ఖరారు చేసేసింది. బెంగాల్లో గెలుపు సంబరాలు ముగియక ముందే, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలిత రాష్ట్రమైన పంజాబ్ పై గురిపెట్టింది. సోషల్ మీడియాలో ఆ పార్టీ చేసిన ఒక్క పోస్ట్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూ, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖారావాన్ని పూరించింది.సంచలనంగా మారిన ‘నెక్స్ట్ పంజాబ్’పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి, అఖండ విజయం సాధించిన కొన్ని గంటల వ్యవధిలోనే బీజేపీ తన తదుపరి కార్యాచరణను ప్రపంచానికి ప్రకటించింది. మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ వేదికగా బీజేపీ పంజాబ్ శాఖ ‘నెక్స్ట్ పంజాబ్’ (తదుపరి పంజాబ్) అని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌కు కమల పుష్పం ఎమోజీని కూడా జతచేసింది. వచ్చే ఏడాది మొదటి భాగంలో పంజాబ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఈ పోస్ట్ చేసినట్లు స్పష్టమవుతోంది.గత వ్యూహమే మళ్లీ అమలు..ఈ తరహా సంచలన ప్రకటన బీజేపీకి కొత్తేమీ కాదు. గత ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అద్భుత విజయం సాధించిన తర్వాత, నవంబర్ 14, 2025న బీజేపీ బెంగాల్ శాఖ కూడా అచ్చం ఇలాగే ట్వీట్ చేసింది. ఆనాడు ‘నెక్స్ట్ వెస్ట్ బెంగాల్’ అంటూ కమలం గుర్తుతో పోస్ట్ చేసి, అనంతరం బెంగాల్ ను కైవసం చేసుకుంది. అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ, వ్యూహాత్మకంగా ఇప్పుడు పంజాబ్ వైపు అడుగులు వేస్తోంది.యూపీ, పంజాబ్లపై బీజేపీ పూర్తి ఫోకస్ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తున్న బీజేపీ, అదే జోరును భవిష్యత్తులోనూ కొనసాగించాలని పట్టుదలగా ఉంది. పశ్చిమ బెంగాల్లో సాధించిన అద్భుత విజయంతో ఉత్సాహంలో ఉన్న కమలనాథులు, వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటికే తమ పూర్తి దృష్టిని కేంద్రీకరించారు. ఈ రాష్ట్రాల్లో గెలుపే ధ్యేయంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.అధికార ఆప్‌కు కోలుకోలేని భారీ దెబ్బపంజాబ్లో అధికారంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఏడాది ఏప్రిల్ లో ఊహించని భారీ షాక్ తగిలింది. ఆప్‌కు చెందిన ఏడుగురు కీలక రాజ్యసభ సభ్యులు అనూహ్యంగా ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ ఏడుగురిలో రాఘవ్ చద్దా సహా ఆరుగురు ఎంపీలు పంజాబ్ నుంచే ఎన్నికైన వారు కావడం గమనార్హం. ఈ పరిణామం పంజాబ్ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపుగా, ఆప్‌కు కోలుకోలేని రాజకీయ దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.పంజాబ్‌లో రసవత్తర పోరు ఖాయంఆప్ రాజ్యసభ సభ్యుల వలసతో పంజాబ్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ అవకాశాన్ని వాడుకుంటూ, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో బలోపేతం కావాలని, ఆప్ చేతిలో నుంచి అధికారాన్ని లాక్కోవాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాజ్యసభ ఎంపీల చేరికతో పంజాబ్‌లో బీజేపీకి అమాంతం బలం పెరిగిందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో రాబోయే ఎన్నికల సమరం ఇరు పార్టీల మధ్య హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.అప్రకటితంగా మొదలైన ఎన్నికల ప్రచారంసోషల్ మీడియాలో వచ్చిన తాజా పోస్ట్ చూస్తుంటే, పంజాబ్‌లో బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే సాధించిన రాజకీయ ఆకర్షణలను క్షేత్రస్థాయిలో ఓట్లుగా మలచుకునే వ్యూహాలకు ఆ పార్టీ పదును పెడుతోంది. పశ్చిమ బెంగాల్ భారీ విజయం ఇచ్చిన అమితమైన ఆత్మవిశ్వాసంతో, పంజాబ్‌లో జరగబోయే ఈ అత్యంత కీలకమైన పోరు కోసం కాషాయ దళం సర్వసన్నద్ధంగా బరిలోకి దిగుతోంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీ కోటను కూల్చివేసిన బీజేపీ.. ఇప్పుడు అతని పంజాబ్ కోటను పెకిలించివేయడానికి సిద్ధం అవుతోంది. మరి ఏం జరగబోతోందో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: ఇక టీఎంసీ నేతలు ‘గుండు’కు రెడీనా? -
‘విజయ్’భేరికి కకావికలం
తమిళనాట 2026 అసెంబ్లీ ఎన్నికలు సంచలనం సృష్టించాయి. అంచనాలను తలకిందులు చేశాయి. ‘విజయ్’భేరి ముందు దిగ్గజ పార్టీలు చిత్తయ్యాయి. రాజకీయాల్లో ఉద్దండులైన సీఎం స్టాలిన్ సహా 14 మంది మంత్రులు ఓటమిపాలయ్యారు. విజయ్ ప్రభంజనం ముందు మంత్రులే కాదు, కొన్ని పార్టీల కీలక నేతలు, హేమాహేమీలు నిలువలేకపోయారు. విజయ్ టీవీకే పార్టీ తరఫున దళితులు, దివ్యాంగులు, మహిళలు సత్తాచాటి ఎమ్మెల్యేలు కావడం గమనార్హం. సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని మార్పు చోటుచేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ప్రభంజనం సృష్టించి 108 స్థానాలతో అతిపెద్ద పార్టీ గా అవతరించింది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీ ల ఆధిపత్యానికి గండికొట్టింది. అభివృద్ధికి చిరునామా అయిన చెన్నై కొళత్తూరులో లేని వసతులు అంటూ లేవు. పదిహేనేళ్లుగా స్టాలిన్ ఈ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే, ఇక్కడి ఓటర్లు తాజాగా ఆయన్ని ఓడించి, టీవీకేకు చెందిన వీఎస్ బాబును అసెంబ్లీకి పంపించడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. కూలిన మంత్రుల కోటలు డీఎంకే ప్రభుత్వంలోని మొత్తం 34 మంది మంత్రులలో 14 మంది ఘోరంగా ఓడిపోయారు. ఏళ్ల తరబడి తమ బలాన్ని చాటుతూ కంచు కోటలుగా నియోజకవర్గాలను మలచుకున్న సీనియర్లు విజయ్ ప్రభంజనం ముందు నిలబడలేకపోయారు. సీనియర్ నాయకులు, మంత్రులు దురైమురుగన్(కాటా్పడి), సుబ్రమణియన్ (సైదాపేట), అన్బిల్ మహేశ్(తిరువెరంబూరు), పళణి వేల్ త్యాగరాజన్, మూర్తి, నాజర్, స్పీకర్ అప్పావు(రాధాపురం), డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి(కీల్ పెన్నాత్తూరు) తదితరులు టీవీకే అభ్యర్థుల చేతిలో ఓటమి చెందారు.వీరిలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఎం.సుబ్రమణియన్, విద్యా మంత్రిగా అన్బిల్ మహేశ్ నిత్యం ప్రజలలోనే ఉన్నారు. తమిళనాడులో వైద్యం, విద్య బలోపేతంలో వీరి పాత్ర కీలకంగా నిలిచినా, విజయ్ ధాటికి తలవంచకతప్పని పరిస్థితి నెలకొంది. ఇక రాజకీయ ఉద్దండులైన నామ్ తమిళర్ కట్చి కనీ్వనర్ సీమాన్, కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్, సినీ దర్శకుడు సుందర్ సీ వంటి వారు కూడా టీవీకే అభ్యర్థుల చేతిలో పరాజయం చవి చూశారు. ఒక్క ఓటుతో చేజారిన మంత్రి గెలుపు శివగంగ జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గంలో హోరాహోరీగా సాగిన పోరులో డీఎంకే సీనియర్ నేత, మంత్రి కేఆర్ పెరియకరుప్పన్ అనూహ్య రీతిలో పరాజయం పాలయ్యారు. టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి కేవలం ఒక్క ఓటు తేడాతో మంత్రిపై గెలిచి చరిత్ర సృష్టించారు. 212 ఓట్లతో ఆధిక్యం ప్రదర్శిస్తూ వచి్చన మంత్రికి చివరి రౌండ్ షాక్ ఇవ్వడంతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ కౌంటింగ్ సమయంలో మూడు ఈవీఎంలు మొరాయించడంతో చివరకు వాటికి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడంతో ఒక్క ఓటుతో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి గెలుపొందడం విశేషం. భారీ మెజార్టీ లూ టీవీకే కైవసం ఈసారి తమిళనాడు అసెంబ్లీలో సామాన్యుల గళం మోగనుంది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన టాప్–10 అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే, అందులో 9 మంది విజయ్ పార్టీ కి చెందిన వారే ఉండటం విశేషం. అత్యధిక మెజారిటితో గెలిచిన వారిలో తొలి స్థానంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి 98,110 ఓట్ల మెజారిటీతో నిలవగా మిగిలిన 9 మంది టీవీకేకు చెందిన వారే. ఆ తర్వాతి స్థానాల్లో షోళింగనల్లూర్ నుంచి శరవణన్ (96,780), మాధవరం నుంచి విజయ్ ప్రభు (94,985) భారీ మెజారిటీతో విక్టరీ కొట్టారు. పూందమల్లి, సేలం వెస్ట్, ఆవడి వంటి నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులు 70 వేలకుపైగా ఓట్ల మెజారిటీ సాధించారు.టీవీకే తరఫున సామాన్యులు రాజకీయ నేపథ్యం ఉన్నవారికే కాకుండా, సమాజంలోని అట్టడుగు వర్గాలకూ విజయ్ టికెట్లు కేటాయించారు. ఈ ఎన్నికల్లో ఓ ఆటో డ్రైవర్, ఓ డ్రైవర్ కుమారుడు, దివ్యాంగులు, మహిళలు గెలవడం విశేషం. టీవీకే తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో 35 ఏళ్లలోపు వారు 22 మందికి పైగా ఉన్నారు. గెలిచిన వారిలో 26 మంది దళిత సామాజిక వర్గానికి చెందినవారు. 13 మంది మహిళలూ ఈ సారి టీవీకే తరఫున అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఇక పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ టీవీకే అభ్యర్థులు తమ డిపాజిట్లను కాపాడుకున్నారు. టీవీకే అభ్యర్థులు 67 చోట్ల ఓడినా రెండో స్థానం దక్కించుకోవడం విశేషం. ఇక్కడ డీఎంకే, అన్నాడీఎంకేలు మూడో స్థానానికి పరిమితమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కొంగు మండలం, డెల్టా, ఉత్తర తమిళనాడుల్లో విజయ్ టీవీకే ప్రభంజనం సృష్టించినా, కేరళ– తమిళనాడు సరిహద్దుల్లోని కన్యాకుమారి జిల్లాలో ఆరు స్థానాలు ఉండగా ఒక్కచోట కూడా ఖాతా తెరవక పోవడం గమనార్హం. -
ఓట్ల తేడా 17.43 లక్షలే
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ మంగళవారం స్పందించారు. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన టీవీకేకు, డీఎంకేకి పోలైన ఓట్లలో తేడా 17.43 లక్షలు మాత్రమేనన్నారు. ఏప్రిల్ 23వ తేదీన జరిగిన ఎన్నికల్లో డీఎంకే కూటమి 74 సీట్లు గెలుచుకోగా, ఇందులో డీఎంకేకి 59 స్థానాలు దక్కాయి. సోమవారం వెలువడిన ఫలితాలపై మంగళవారం ఎంకే స్టాలిన్ ఒక ప్రకటన చేశారు. టీవీకే, డీఎంకే కూటమికి ఓట్ల తేడా కేవలం 3.52 శాతం మాత్రమేనన్నారు. డీఎంకే కూటమికి 1.54 కోట్ల మంది ఓటేశారని ఆ ప్రకటనలో వివరించారు. తమకు పడిన ప్రతి ఓటూ తమపై ఉంచిన అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా స్టాలిన్ పేర్కొన్నారు. డీఎంకే అనేక పర్యాయాలు అధికారం చేపట్టిందని గుర్తు చేస్తూ ఆయన, ‘మేం చూడని విజయం లేదు, ఎదుర్కోని ఓటమి లేదు’అని పేర్కొన్నారు. ‘గెలుపోటములను సమానంగా చూస్తూ, ఆశయ సాధన దిశగా ప్రయాణాన్ని కొనసాగించేవారే పార్టీ నిజమైన కార్యకర్తలు. ఈ ఉద్యమానికి ఆధారం, పునాదులు’అని పార్టీ శ్రేణులనుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. స్టాలిన్ రాజీనామా..ఆమోదం తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఇన్‌ఛార్జి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు పంపించారు. సీఎం స్టాలిన్, ఆయన మంత్రివర్గం రాజీనామాలను గవర్నర్ అర్లేకర్ ఆమోదించారని అనంతరం లోక్‌భవన్ తెలిపింది. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని స్టాలిన్‌ను గవర్నర్ కోరారని వివరించింది. ఓటర్లకు కృతజ్ఞతగా ర్యాలీ స్టాలిన్ మంగళవారం ఉదయం చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో కూటమి పార్టీలకు చెందిన వైగో, తదితరులతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ నేతలెవరూ ఈ భేటీకి రాకపోవడం గమనార్హం. సాయంత్రం ఆయన సొంత నియోజకవర్గం కొళత్తూరులో తనకు ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతగా రోడ్‌షో చేపట్టారు. ఈ సందర్భంగా డీఎంకే వర్గాలు, మద్దతుదారులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉదయ నిధి? 59 మంది సీట్లను గెల్చుకున్న డీఎంకే అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. డీఎంకే వారసుడు ఉదయనిధి స్టాలిన్ ప్రధాన ప్రతిపక్ష నేత బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై ఉదయనిధిని ప్రశ్నించగా, అధిష్టానం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని తెలిపారు. -
బెంగాల్ పీఠంపై కూర్చునేది ఎవరు?
కమ్యూనిస్టుల కంచుకోటలను బద్దలుకొట్టి 15ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా పశ్చిమబెంగాల్‌ను ఏలిన మమతాబెనర్జీని ఘోరంగా ఓడించి ఇంటికి సాగనంపిన కమలనాథుల్లో ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చిలో ఆసీనులవుతారనే ప్రశ్న తలెత్తింది. ఆ కుర్చీకి తామే అర్హులమంటూ రాష్ట్ర ముఖ్యనేతలు బీజేపీ అధిష్టానం వద్ద వాదనలు గట్టిగా విన్పిస్తున్నారు. వీరి వాదనల్లో ఎవరి వాదనకు అగ్రనేతలు మోదీ, అమిత్‌షా ద్వయం సమ్మతి తెలుపుతుందో త్వరలో తేలిపోనుంది.అయితే మమతను ఒంటిచేత్తో మట్టికరిపించిన రాష్ట్ర రాజకీయ దురం«ధరుడిగా ఘనత సాధించిన సువేందు అధికారికే సీఎం పీఠం దక్కే అవకాశముందని ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే గుజరాత్ మొదలు మధ్యప్రదేశ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్దాకా ప్రతిసారీ కొత్త ముఖాలకు అవకాశమిచి్చన బీజేపీ అధిష్టానం ఈసారి పశ్చిమబెంగాల్లోనూ కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే ఆస్కారముందనే వాదనా తెరమీదకొచి్చంది. ఈ నేపథ్యంలో ఐదారుమంది నేతల పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. వారి గురించి క్లుప్తంగా.. సువేందు అధికారి.. బెంగాల్లో అత్యధిక మందికి చిరపరిచితమైన నేత. గతంలో మమతాబెనర్జీకి కుడిభుజంగా ఉంటూ నందిగ్రామ్‌లో రైతు ఉద్యమాన్ని ముందుకు నడిపించిన నేత తర్వాత టీఎంసీకి తిలోదకాలిచ్చి కమలదళంలో చేరి కీలక నేతగా ఎదిగారు. గతంలో నందిగ్రామ్‌లో మమతను ఓడించి ఈసారి భవానీపూర్‌లోనూ మమతకు ఓటమి రుచిచూపించారు. క్షేత్రస్థాయిలోనూ పార్టీపై పట్టుసాధించిన సువేందుకు సీఎం అయ్యే అవకాశాలు మిగతావారికంటే మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నారదా స్టింగ్ ఆపరేషన్ ఉదంతంలో లంచం తీసుకుంటూ కెమెరా కంటికి చిక్కి పరువుపోగొట్టుకున్నారు. సమిక్ భట్టాచార్య ఆర్ఎస్ఎస్ మూలాలున్న భట్టాచార్య ఇటీవలే పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు ఆరంభించారు. ఎన్నికల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. అగ్రనేతల సుడిగాలి పర్యటనలను సమన్వయంచేసుకుంటూనే సొంతంగా పలు ప్రచారకార్యక్రమాల్లో పాల్గొని టీఎంసీపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించి ప్రజల్లో గుర్తింపుపొందారు. పార్టీలో నేతలను ఏకతాటి మీదకు తీసుకురావడంలో దిట్టగా పేరొందారు. కులమతాలకతీతంగా అన్ని వర్గాల్లోనూ పార్టీని విస్తరింపజేసే సత్తా ఈయనకు ఉందని అగ్రనాయకత్వంలోనూ ఈయన మంచిపేరు సంపాదించారు. ఈయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందనే మాటా విన్పిస్తోంది. అగ్నిమిత్ర పాల్ గతంలో వృత్తిరీత్యా ఈమె ఒక ఫ్యాషన్ డిజైనర్. బెంగాల్లో ముందంజలో ఉండి పార్టీని నడిపించే క్రియాశీలక మహిళా నేతల్లో ఈమె కూడా ఒకరు. బీజేపీ మహిళా మోర్చాకు గతంలో అధ్యక్షురాలిగా సేవలందించారు. తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షురాలి స్థాయికి ఎదిగారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అసన్సోల్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి గతంలో పట్టభద్రురాలైన ఈమె తరచూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రూపా గంగూలీ దిగ్గజ నిర్మాత, స్క్రీన్రచయిత బీఆర్ చోప్రా తెరకెక్కించిన అద్భుత సీరియల్ ‘మహాభారత్’లో ద్రౌపది పాత్రతో యావత్ భారతానికి చిరపరిచితమైన నటి రూపా గంగూలీ. బీజేపీ రాజ్యసభ సభ్యురాలిగా పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు. తర్వాత సోనానూర్ దక్షిణ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గంలో ఓటర్లకు అందుబాటులో ఉంటూ మంచి పేరుతెచ్చుకున్నారు. బెంగాల్ బీజేపీ మహిళా మోర్చాకు అధ్యక్షురాలిగా రెండేళ్లు సేవలందించారు. ఆకాలంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. దిలీప్ ఘోష్ బీజేపీ ఫైర్‌బ్రాండ్‌గా పేరొందారు. గతంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. 2021లో పార్టీ టీఎంసీకి గట్టిపోటీ ఇవ్వడంలో సఫలీకృతమయ్యారు. ఆనాడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమంటే వామపక్షలు, కాంగ్రెస్ కాదు అని బీజేపీయే ప్రజల పక్షాన పోరాడుతోందని నిరూపించే ప్రయత్నంచేశారు. తక్కువకాలంపాటే బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్‌గా కొనసాగినా వ్యవహారాలను చక్కబెట్టడంలో తనదైన ముద్రవేశారు. సీఎం రేసులో తానూ ముందంజలో ఉన్నానని నిరూపించుకున్నారు. గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. 12 సంవత్సరాల క్రితం బీజేపీలో చేరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కష్టపడిపనిచేసి త్వరగానే రాష్ట్ర చీఫ్ స్థాయికి ఎదిగారు. అయితే వాచాలత్వంతో తరచూ వివాదాస్పద వ్యాఖ్యానాలుచేస్తూ అప్రతిష్ట తెచ్చుకోవడం ఈయనకు రివాజుగా మారింది. అయినాసరే రాజకీయ చతురతతో నెగ్గుకురాగల సమర్థుడని ఆయనకుపేరుంది. సువేందుకు ఈయన ఒక్కరే గట్టిపోటీ ఇచ్చే అవకాశముంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విజయ్ పొత్తు ఎవరితో?
సాక్షి, చెన్నై: ద్రవిడ రాజకీయాలను మట్టికరిపిస్తూ జనం మద్దతుతో ప్రభంజనంలా దూసుకొచ్చిన యువనేత, టీవీకే చీఫ్ విజయ్ తమిళనాట నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అడుగుదూరంలో ఆగిపోయారు. మరో పది మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. భావసారూప్య పార్టీలతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఫోన్‌చేసి ప్రత్యేకంగా విజయ్ను అభినందించిన నేపథ్యంలో పొత్తుకు కాంగ్రెస్ ఆసక్తి కనబరుస్తోందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. వీటిని టీవీకే పార్టీ కొట్టిపారేయలేదు. దీంతో విజయ్ ఏ పార్టీతో పొత్తుకు సిద్ధమవుతున్నారనే ఉత్కంఠ మరింత ఎక్కువైంది.వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను ఆహ్వానించాలని గవర్నర్‌కు టీవీకే పార్టీ అధికారికంగా ఈ–మెయిల్లో లేఖ పంపింది. తమకు ఇప్పటికే 108 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, రెండు వారాల గడువు ఇస్తే ఆలోపు మరో 12 మంది బయటి ఎమ్మెల్యేల మద్దతుతో శాసనసభలో బలనిరూపణకు సిద్ధమని ఆ లేఖలో పార్టీ పేర్కొంది. లేఖపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీవీకే పార్టీకి గవర్నర్ రెండు ఆప్షన్లు ఇచ్చే వీలుంది.అసెంబ్లీ బలనిరూపణ చేసుకోవాలని టీవీకే చీఫ్‌కు గవర్నర్ సమన్లు జారీచేయొచ్చు లేదా భాగస్వామ్య పార్టీల తనకుందని నిరూపించుకుంటూ అధికారిక లేఖను సమర్పించాలని కోరవచ్చు. 118 సీట్లకంటే అధిక మెజారీటి తనకుందని విజయ్ నిరూపించునే పక్షంలో ప్రభుత్వ ఏర్పాటుకు తక్షణం విజయ్ను గవర్నర్ ఆహ్వానించే ఆస్కారముంది. ‘‘బయటి ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. మరో 6 నెలల తర్వాత కూడా విజయ్ తన బలాన్ని నిరూపించుకోవాల్సిరావొచ్చు’’అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. చిన్న పార్టీలు కలిసొస్తాయా? విజయ్ రెండు చోట్ల పోటీచేసిన కారణంగా ఒక స్థానంలో రాజీనామాచేయాల్సిందే. దాంతో ఇప్పుడున్న టీవీకే ఎమ్మెల్యేల సంఖ్య 108 నుంచి 107కు తగ్గుతుంది. టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గంసుగమం అయితే ఈ 107లోనే ఒకరు అసెంబ్లీ స్పీకర్ అవుతారు. అప్పుడు ఆయన బలనిరూపణ వేళ ఓటు వేయడం కుదరదు. దీంతో టీవీకే బలం 106కు తగ్గుతుంది. దీంతో బలనిరూపణ వేళ సాధారణ మెజారిటీ కోసం టీవీకేకు కనీసం మరో 12 మంది సభ్యుల మద్దతు అవసరం. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే), దేశీయ మూర్పొక్కు ద్రవిడ కళగం, బీజేపీ తలో స్థానంలో గెలిచాయి. సీపీఐ(ఎం), విదుథలై చిరుతైగల్ కట్చి, సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీలు తలో రెండు చోట్ల గెలిచాయి. పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) నాలుగు చోట్ల, కాంగ్రెస్ ఐదు చోట్ల గెలిచింది.ఈ తొమ్మిది పార్టీల్లో కొన్నింటితో కచ్చితంగా పొత్తు పెట్టుకుని అదనంగా 12 మంది సభ్యుల మద్దతును విజయ్ సాధించాల్సిందే. నేడు గవర్నర్ అర్లేకర్‌ను కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని టీవీకే చీఫ్ కోరనున్నారని తెలుస్తోంది. మద్దతుగా తన కొత్త ఎమ్మెల్యేలను వెంట తీసుకెళ్లనున్నారని సమాచారం. గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారు విషయంపై ఇంకా స్పష్టతరాలేదు. మరోవైపు పనయూర్లోని విజయ్ ఇంటి వద్ద తమిళపోలీసులు భద్రతను పెంచారు. తిరుచిరాపల్లి ఈస్ట్, పెరంబూర్‌లలో విజయ్ పోటీచేసి రెండుచోట్ల నెగ్గారు. అయితే తిరుచిరాపల్లి ఈస్ట్స్థానంలో విజయ్ రాజీనామా సమర్పించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. చెన్నైలోని పెరంబర్ నుంచే విజయ్ ఎమ్మెల్యే కొనసాగే ఛాన్సుంది. టీవీకే శాసన సభాపక్ష నేతగా విజయ్ విజయ్ మంగళవారం కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలతో పార్టీ కార్యాలయంలో సమావేశమై పార్టీ తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా విజయ్ను టీవీకే శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు. తర్వాత పార్టీ సైద్ధాంతిక నేతలకు విజయ్ నివాళులర్పించారు. పెరియార్ ఈవీ రామస్వామి, బీఆర్ అంబేడ్కర్, కె.కామరాజ్, వేళు నచియార్, అంజలాయ్ అమ్మళ్లకు విజయ్ నివాళులర్పించారు. ‘‘234 మంది సభ్యులుండే అసెంబ్లీలో 118 మంది మద్దతుతో మేం బలనిరూపణలో విజయం సాధించబోతున్నాం’’అని సమావేశం తర్వాత టీవీకే నేత నంజిల్ సంపత్ ధీమా వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేలను చెన్నై ఈసీఆర్‌లోని ఓ రిసార్టుకు తరలించారు. జీవితాంతం రుణపడి ఉంటా: విజయ్ సాక్షి, చెన్నై: ఎన్నికల్లో విజయం సాధించిన సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ మంగళవారం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడులోని చిన్నవారు, యువకులు, పెద్దలు అందరికీ జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఆయన ఎక్స్‌లో మంగళవారం ఈ మేరకు ట్వీట్ చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి తనను హేళన చేసిన వారు, చులకనగా చూసిన వారికి ప్రజలే గట్టిగా ఎన్నికల ఫలితాల రూపంలో బుద్ధి చెప్పారన్నారు. విమర్శలు, ఒడిదొడుకులు ఎన్నో ఎదురైనా, ముసుగేసుకుని కొందరు విమర్శలు చేసినా, ప్రజలు ఇచ్చిన భరోసా జీవితాంతం గుర్తుండి పోతుందని, అందుకే వారికి జీవిత కాలం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. విజయ్ మా మద్దతు కోరారు: కాంగ్రెస్న్యూఢిల్లీ: తమిళనాడు ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించినప్పటికీ సాధారణ మెజార్టీ కాస్తంత దూరంలో ఆగిపోయిన టీవీకే పార్టీ భావసారూప్య పార్టీల మద్దతు కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో టీవీకే చీఫ్ విజయ్ తమను సంప్రదించారని కాంగ్రెస్ పార్టీ మంగళవారం రాత్రి ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో మాట్లాడారు. ‘‘తమిళనాడులో ప్రభు త్వ ఏర్పాటుకు మద్దతు కోరుతూ విజయ్ మమ్మల్ని విజ్ఞప్తి చేశారు. బీజేపీ, దాని మిత్రపక్షాలు ఎట్టిపరిస్థితుల్లోనూ తమిళనాడులో అధికారం చేజిక్కించుకునేందుకు అవకాశం ఇవ్వబోం.విజయ్ అభ్యర్థన మేరకు, తమిళ ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ రాష్ట్ర విభాగానికి మేం దిశానిర్దేశం చేశాం. తమిళ ఓటర్ల సెంటిమెంట్‌కు విలువ ఇస్తూ స్వీయనిర్ణయం తీసుకోవాలని టీఎన్పీసీసీకి సలహాలు, సూచనలు ఇచ్చాం’’అని మీడియాతో కేసీ వేణుగోపాల్ చెప్పారు. 234 సీట్లున్న తమిళనాడులో విజయ్ పార్టీ 108 చోట్ల గెలిచింది. టీవీకేకు కనీసం 12 మంది ఎమ్మెల్యేల అదనపు మద్దతు అవసరం. రాష్ట్రంలో కాంగ్రెస్ ఐదు చోట్ల గెల్చింది. పట్టాలి మక్కల్ కట్చి మరో నాలుగోచోట్ల, సీపీఐ, సీపీఎం చెరో రెండు చోట్ల గెలిచాయి.ఈ నాలుగు పార్టీల మద్దతుతో అంటే ఈ పార్టీల 13 మంది ఎమ్మెల్యేల మద్దతులో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని వార్తలొచ్చాయి. -
రాజీనామా ప్రసక్తే లేదు: మమతా బెనర్జీ
కోల్‌కతా: పదిహేనేళ్ల తృణమూల్ పరిపాలనా కోటలను ప్రజాతీర్పుతో బద్దలుకొట్టామని బీజేపీ ప్రకటించుకుంటుంటే పూర్తిగా కుట్రతోనే తమను కూలదోశారని టీఎంసీ చీఫ్ మమతాబెనర్జీ నిప్పులుచెరిగారు. పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం తర్వాత మమత తొలిసారిగా మంగళవారం కోల్‌కతాలో మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘ఎన్నికల్లో మేం బీజేపీతో పోరాడలేదు. కాషాయపార్టీ కోసం కష్టపడిన ఎలక్షన్ కమిషన్‌తో మేం పోరాడాం. ప్రజాతీర్పుతో మేం ఓడిపోలేదు. కుట్ర చేసి మమ్మల్ని తక్కువ సీట్లకు పరిమితంచేశారు. అలాంటప్పుడు నేను రాజీనామా చేయాలనే ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుంది? నేను ఓడిపోలేదు. లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామాలేఖ సమర్పించే ప్రసక్తే లేదు.అసలు నేను రాజీనామా ఎందుకు చేయాలి? మా ఓట్లను చోరీచేశారు. ఓట్ల లెక్కింపులో భారీ అవకతవకలు జరిగాయి. దాదాపు 100 స్థానాల్లో మా గెలుపును అడ్డుకున్నారు. మా పార్టీ నైతికతను దెబ్బతీసేలా ఓట్ల లెక్కింపు ప్రక్రియను నత్తనడకన కొనసాగించారు. బెంగాల్లో జరిగిన లోపభూయిష్ట ఎన్నికలను నా రాజకీయజీవితంలో ఎన్నడూ చూడలేదు. గత 22 ఏళ్లలో ఇలాంటి దారుణాలు ఎప్పుడూ చూడలేదు. చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయం. ఈ అధ్యాయంలో ఎన్నికలసంఘమే అసలైన విలన్. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ, ఈసీ కలసికట్టుగా ఖూనీ చేశాయి. అక్రమంగా మమ్మల్ని ఓడించే ప్రయత్నంచేశారు. ఎన్నికల సంఘం ద్వారా మమ్మల్ని ఓడించారేమోగానీ వాస్తవానికి నైతిక విజయం మాదే. వీధి పోరాటాలకు మేం ఎప్పుడూ సిద్ధమే. బీజేపీ అరాచకాలను ఎండగడతా’’అని మమత అన్నారు. అంతటా దాడులు, బదిలీలు, పక్షపాతమే ‘‘ఎన్నికల ప్రక్రియ మొదలుకావడానికి ముందు నుంచే బెంగాల్ అంతటా కీలకమైన సమర్థులైన ఉన్నతాధికారులపై ఉద్దేశపూర్వకంగా ఈసీ బదిలీ వేటు వేసింది. వందలమందిని అప్రాధాన్య స్థానాలకు తరమేసింది. మా పార్టీ, మా పార్టీతో సంబంధమున్న సంస్థలపై ఈడీ అధికారులను దాడులతో ఉసిగొల్పింది. పక్షపాతధోరణితో రాజ్యాంగబద్ధ సంస్థల నిబద్ధత ప్రశ్నార్థకంగా మారింది. మాపై దాడులతో నిర్ఘాంతపోయి విపక్షాల ఇండియాకూటమి నేతలు మాకు ఫోన్లు చేసి సంఘీభావం తెలిపారు. సోనియాగాంధీ, రాహుల్‌గాం«దీ, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేశ్ యాదవ్, హేమంత్ సోరెన్ తదితర అగ్రనేతల నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఇకపై విపక్షాల ఇండియా కూటమి బలోపేతం కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తా’’అని మమత ప్రకటించారు. తదుపరి కార్యాచరణ వెల్లడిస్తా ‘‘నేను ఒంటరిదాన్ని కాదు. నాకు తోడుగా పార్టీ అండగా ఉంది. తదుపరి కార్యాచరణను త్వరలో వెల్లడిస్తాం. సమష్టిగా నిర్ణయించి ముందుకెళ్తాం. ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) బిల్లు అతిపెద్ద కుట్ర. ఎస్ఐఆర్తో ఏకంగా 90 లక్షల ఓట్లు తొలగించారు. తర్వాత పోరాటంచేసి 32 లక్షల ఓట్లు కలిపేలా చేశాం. తర్వాత కూడా 7 లక్షల ఓట్లను కలిపారు. కానీ ఇది ఎవరికీ తెలీదు. ఫలితాల వెల్లడి తర్వాత టీఎంసీ నేతలపై దాడులు జరిగాయి. 10 మంది సభ్యులతో నిజనిర్ధారణ కమిటీ వేస్తా. హింసాత్మక ప్రాంతాలను పర్యటిస్తా’’అని అన్నారు. నన్నూ గెంటేశారు ‘‘ఓట్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్రబలగాలు గూండాల్లా వ్యవహరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేందుకు వచ్చిన నన్ను కూడా నెట్టేశారు. పొట్టపై, వీపుపై నెడుతూ గెంటేశారు. మహిళగా నాతో వాళ్ల అనుచిత ప్రవర్తనతో ఎంతగానో బాధపడ్డా. ఎన్నిసార్లు అభ్యర్థించినా టీఎంసీ ఏజెంట్లను సీఆర్పీఎఫ్ జవాన్లు లోపలికి అనుమతించలేదు. ఫిర్యాదు తీసుకోవాల్సిన వాళ్లే ఇలా ప్రవర్తిస్తే ఎలా? జవాన్లంతా అమ్ముడుపోయారు’’అని మమత ఆరోపించారు. ‘‘పులిలా పోరాడతాం. పోరాటాన్నికొనసాగించి మళ్లీ నూతనోత్తేజంతో పైకిలేస్తాం. అధికార కుర్చిల గురించి మాకు పట్టింపులేదు. మాకు ప్రజలే ముఖ్యం. మా, మాటీ, మనుష్ కు మా వందనాలు. ప్రజాస్వామ్యద్రోహుల కారణంగా మాకు ఓటేయలేకపోయిన వారందరికీ నా క్షమాపణలు’’అని మమత అన్నారు. బెంగాల్‌కు అమిత్ షా.. అస్సాంకు నడ్డా సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ శాసనసభాపక్ష నేతల ఎంపిక ప్రక్రియను పార్టీ అధిష్టానం వేగవంతం చేసింది. ఈ ఎంపికను పర్యవేక్షించేందుకు కేంద్ర పరిశీలకులను నియమిస్తూ మంగళవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే బాధ్యతను హోం మంత్రి అమిత్ షాకు అప్పగించారు. ఆయనతో పాటు సహ పరిశీలకుడిగా ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీని నియమించారు. అదేవిధంగా, అస్సాం శాసనసభా పక్ష నేత ఎంపిక కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను పరిశీలకుడిగా అధిష్టానం ఖరారు చేసింది. -
టీవీకేకు మద్దతుపై కాంగ్రెస్ కీలక నిర్ణయం
తమిళనాడులో టీవీకే మద్దతు అంశంలో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఈ అంశమై కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తొలిసారిగా స్పందించారు. విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే అంశంలో తమిళనాడు కాంగ్రెస్ నిర్ణయమే ఫైనల్ అన్నారు. ఈ అంశంలో రాష్ట్ర పార్టీనే తుది నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ సమావేశమయ్యారు. ఐదు రాష్ట్రాల ఫలితాలపై అగ్రనాయకులు విశ్లేషణ జరిపారు.అయితే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కాంగ్రెస్‌ను ఇదివరకే పలుమార్లు విజయ్ కోరారు. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖసైతం రాశారు. ఈ నేపథ్యంలోనే విజయ్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. కాగా కాంగ్రెస్ విజయ్ పార్టీకి మద్ధతివ్వడం దాదాపుగా ఖరారైనట్లేనని తెలుస్తోంది . ఈ అంశమై ఇది వరకే హస్తం నేతలు టీవీకేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా టీవీకే 108 స్థానాల్లో నెగ్గగా ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్ అక్కడ ఐదు స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో హస్తం మద్దతు కీలకం కానుంది. -
స్టాలిన్ లేటెస్ట్ రోడ్ షో..
అది ఎన్నికల ప్రచారం కాదు.. విజయోత్సవ ర్యాలీ అంతకన్నా కాదు. తాను ప్రజల మనిషినే అని చెప్పుకునే ఎంకే స్టాలిన్ ర్యాలీ అది. ఆయన ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తమిళనాట ఎన్నికల్లో అటు అభ్యర్థిగానూ, ఇటు పార్టీని విజయపథంలో నడిపించడంలోనూ విఫలమయ్యారు స్టాలిన్. టీవీకే విజయ్ దెబ్బతో డీఎంకే, అన్నాడీఎంకేలు ఘోరంగా చతికిలబడ్డాయి. ఇది స్టాలిన్ కలలో కూడా ఊహించి ఉండరు. కచ్చితంగా గెలుస్తామని, అటు సర్వేలు కూడా డీఎంకేకు పట్టం కట్టిన వైనం. అయితే ‘ఛేంజ్’ చేసేశారు ప్రజలు. తమ ఓటుతో విజయ్‌కు జైకొట్టారు. ఇదిలా ఉంచితే,. ఎవరైనా ఓడిపోతే పూర్తిగా చతికిలబడిపోయి కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితం ఆవుతారు. కానీ స్టాలిన్ అలా చేయలేదు. ఓడిపోయిన రెండో రోజే రోడ్ షో పేరుతో ప్రజల ముందుకు వచ్చారు స్టాలిన్. తనను ఓడించిన కొళత్తూరు ప్రజల ముందుకే వచ్చి.. అభివాదం చేశారు. ఈరోజు(మంగళవారం, మే 5వ తేదీ) స్టాలిన్ తాను పరాజయం పాలైన కొళత్తూరులో పర్యటించారు. తాను ఓడిపోయిన చాయలు ముఖంలో కనిపిస్తున్నప్పటికీ స్టాలిన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తనను ఓడించిన ప్రజలను కలవాలని ఇలా రోడ్ షోలో పాల్గొన్నారా.. లేక తనకు ఓట్లు వేసిన జనానికి ఒకసారి రోడ్ షో రూపంలో థాంక్స్ చెబుదామనుకున్నారో కానీ ‘మీతోనే ఉంటానని, మీ వాడిగానే ఉంటాననేది’ ఆయన ముఖంలో మాత్రం కనిపించింది. கொளத்தூருக்கும் எனக்குமான உறவு தேர்தல் வெற்றி, தோல்விகளைக் கடந்த உறவு.15 ஆண்டுகாலம் எனக்கு ஆதரவு நல்கியவர்கள் கொளத்தூர் தொகுதி மக்கள். அதில், 10 ஆண்டுகள் எதிர்க்கட்சி வரிசையில் இருந்தும், 5 ஆண்டுகள் ஆளும்கட்சியாகவும் என்னால் இயன்ற அனைத்துத் திட்டங்களையும் கொளத்தூருக்குக் கொண்டு… pic.twitter.com/xtXB8p6ChR— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) May 5, 2026 #WATCH चेन्नई: डीएमके प्रमुख और तमिलनाडु के निवर्तमान सीएम एम.के. स्टालिन कोलाथुर विधानसभा क्षेत्र पहुंचे। राज्य के पूर्व मंत्री पीके सेकर बाबू भावुक हुए। pic.twitter.com/SB6vkKYbnh— ANI_HindiNews (@AHindinews) May 5, 2026 -
‘‘రాజీనామా చేయకపోతే మమతా బెనర్జీని ఇలా తొలగించొచ్చు’’
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఆమెను డిస్మిస్ చేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సూచించారు. బెంగాల్ ప్రజలు ఆమె తప్పిదాలు, చర్యలను చాలా కాలంపాటు సహించారని చెప్పారు."ఆమె రాజీనామా చేయకపోతే ఆమెను డిస్మిస్ చేస్తారు. దేశం ఆమె ఇష్ట ప్రకారం నడవదు. గవర్నర్ కొంతకాలం వేచి ఉంటారు. ఆ తర్వాత ఆమెను తొలగిస్తారు.. అంతే, ఈ ప్రక్రియ సులభం. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 100 సీట్లు మీ నుంచి దోచుకున్నారని అంటున్నారు? అయితే, నేను కూడా అస్సాంలో కాంగ్రెస్ గెలిచిన 19 సీట్లను నా నుంచి దోచుకున్నారని అనొచ్చు. నాకు 126 రావాలి అనొచ్చు. దేశం అలా పనిచేయదు" అని అన్నారు."మీరు సరిహద్దులో కంచె ఏర్పాటుకు అనుమతించరు. ఇప్పుడేమో సీట్లు దోచుకున్నారని అంటారు. ఈ ఫలితం చాలా కాలం క్రితమే రావాలి. బెంగాల్ ప్రజలు మీకు చాలా ఇచ్చారు. ఇప్పుడు వారు బీజేపీకి మద్దతు ఇచ్చారు. మీరు 'నేను రాజీనామా చేయను' అంటారు. సమాజం మీ నిర్ణయంతోనే నడుస్తుందా? ఎస్ఐఆర్ను ఉపయోగించి ఓటు దోపిడీ జరిగిందని, ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి పనిచేశాయని చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యం ఎక్కడ?" అని ప్రశ్నించారు.కాగా, గత 15 ఏళ్లుగా సీఎంగా కొనసాగిన మమతా బెనర్జీ బీజేపీ చేతిలో ఓడిపోయారు. ఇవాళ రాజీనామా ఇవ్వడానికి నిరాకరించారు. ఆమె తీరు వల్ల ఊహించని పరిస్థితి ఏర్పడింది. "నేను ఓడిపోలేదు, కాబట్టి రాజ్ భవన్‌కు వెళ్లను. రాజీనామా ఇవ్వను" అని మమతా బెనర్జీ మీడియాతో చెప్పారు.గవర్నర్ సాంకేతికంగా ముఖ్యమంత్రిని తొలగించొచ్చు. అయితే కొన్ని నియంత్రణలు ఉన్నాయి. గవర్నర్ అధికారాలను సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టంగా నిర్దేశించాయి. అసెంబ్లీకి ఉన్న గడువు మే 7. అది పూర్తయ్యేలోపే గెలిచిన పార్టీ ముందుకు వచ్చి “మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం” అని చెబితే.. గవర్నర్ వారిని ఆహ్వానించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తారు. అలా జరిగితే మమతా బెనర్జీని ప్రత్యేకంగా తొలగించే అవసరం ఉండదు. -
తృణముల్ చాప్టర్ ముగిసింది: మాజీ క్రికెటర్
తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ ఎమ్మెల్యే, టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి తృణముల్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ తనకు హౌరాలోని షిబ్‌పుర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపించాడు. ఇక రాజకీయంగా తృణముల్ కాంగ్రెస్‌తో తన అధ్యాయం ముగిసిందని మనోజ్ తివారి పేర్కొన్నాడు. సోమవారం వెలువడిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు చరమగీతం పాడిన బెంగాల్ ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బెంగాల్లో బీజేపీ గెలుపుపై మనోజ్ తివారి స్పందించాడు. ఈ సందర్భంగా తృణముల్ అవినీతి, పార్టీ చేసిన అరాచకాలను మనోజ్ తివారి ఎండగట్టాడు. ‘హౌరాలోని శిబ్పూర్ నియోజకవర్గం నుంచి నాకు టికెట్ ఇవ్వడానికి టీఎంసీ నిరాకరించింది. ఎమ్మెల్యే టికెట్ కావాలంటే రూ.5కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ సారి ఎన్నికల్లో సుమారు 70 నుంచి 72 మంది అభ్యర్థులు భారీగా డబ్బు చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారు. అందుకే పార్టీ ఘోర పరాజయం పాలైంది. అవినీతిమయమైన పార్టీకి పతనం తప్పదు. టీఎంసీతో నా అధ్యాయం ముగిసింది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో నేను క్రీడల శాఖ సహాయ మంత్రిగా పనిచేశాను. పేరుకే మంత్రి పదవి.. కానీ నాకు ఎటువంటి అధికారాలు ఉండేవి కాదు. కనీసం నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. నా సొంత నియోజకవర్గంలో డ్రైనేజీ, మురుగునీటి సమస్యల కోసం ఎంతో పోరాడాను.ప్రతి ఏడాది ఏదో ఒక మాస్టర్ ప్లాన్ అంటారు. కానీ అది మాటలకే పరిమితం అయ్యేది. క్రీడా మంత్రి బిస్వాస్‌కు క్రీడలపై కనీస అవగాహన లేదు. నా ఎదుగుదలను చూసి అసూయ పడేవారు. క్రీడా కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించకుండా అడ్డుకునేవారు. నాపై ఎన్నో అవినీతి ఆరోపణలు చేశారు. నేను ఐపీఎల్లో 10 ఏళ్లు, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 20 ఏళ్లు ఆడాను. నాకు డబ్బు అవసరం లేదు’ అని తివారీ స్పష్టం చేశారు.ఇక తన రాజకీయ జీవితం ముగిసిందని ప్రకటించిన మనోజ్ తివారి త్వరలో క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశాడు. అయితే ఈసారి ఆటగాడిగా కాకుండా కోచ్ పాత్రలో వస్తున్నట్లు తెలిపాడు. ఇప్పటికే బీసీసీఐ లెవెల్ 2 కోచ్ పరీక్షను కూడా పాసైనట్లు తెలిపాడు. ఇప్పటికే బెంగాల్ క్రికెట్ హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నాడు. బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మనోజ్ తివారి దేశవాలీ క్రికెట్లో బెంగాల్ తరఫున అత్యధిక పరుగులు (10,195 పరుగులు) చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇక టీమిండియా తరఫున 2008 నుంచి 2015 మధ్య ఆడిన మనోజ్ తివారి 12 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఐపీఎల్లో మనోజ్ తివారి కేకేఆర్, పంజాబ్, రైజింగ్ పూణే, ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: చిచ్చు రగిలింది.. చిక్కుల్లో రాజస్తాన్ రాయల్స్! -
మమత వ్యాఖ్యలపై సువేందు అధికారి స్పందన
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో తాము ఓడిపోలేదని, నైతికంగా తామే గెలిచామని, సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి స్పందించారు. సీఎం పదవికి మమత రాజీనామా చేయనంటే కుదరదని సువేందు అధికారి పేర్కొన్నారు. రాజ్యాంగంలో ప్రతీది రాసి ఉందని, ఓడిపోయాక రాజీనామా చేయనంటే సాధ్యమయ్యే పనినే అంటూ ప్రశ్నించారు. మమత వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని సువేందు అధికారి తెలిపారు. కాగా, బెంగాల్లో నైతిక విజయం తమదేనని అన్నారు మమతా బెనర్జీ. ఓట్లను, సీట్లను చోరీ చేసి బీజేపీ గెలిచిందని విమర్శించారు. అదే సమయంలో తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లోక్‌భవన్‌కు వెళ్లనని, అక్కడకు వెళ్లి రాజీనామా చే యాల్సిన అవసరం కూడా లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తాము ఓడిపోలేదని, బీజేపీ సీట్లు దొంగిలించిన కారణంగానే ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మమతా బెనర్జీ మరోసారి ఆరోపించారు. తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న మమతా, కోల్‌కతా నుంచి ప్రెస్మీట్లో మాట్లాడుతూ..‘ మేము ఎన్నికల్లో ఓడిపోలేదు. 100 సీట్లను బిజెపి దొంగిలించింది. ఇది బీజేపీ విక్టరీ కాదు.. లూటీ. బెంగాల్ ఎన్నికల్లో ఈసీ విలన్. ప్రతిపక్ష నేతలు వేధించడం బిజెపికి అలవాటు’ అంటూ ధ్వజమెత్తారు. -
విజయ్ VS ఉదయనిధి.. అసెంబ్లీ ఇలా దద్దరిల్లాల్సిందే..
తమిళనాడు రాజకీయాల్లో కొత్త దశ ప్రారంభమైంది. అసెంబ్లీలో ఇప్పుడు ప్రధానంగా కనిపించబోయే పోరు టీవీకే నేత విజయ్, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మధ్యనే సాగనుంది. ఒకరు కాబోయే సీఎం, మరొకరు కాబోయే ప్రతిపక్ష నేత. ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన విజయ్ ఒకవైపు, ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషించబోయే ఉదయనిధి మరోవైపు ఉండటంతో సభ చర్చలు మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉంది. ఉదయనిధికి ఉన్న పాలనా అనుభవం ముందు.. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ తన వ్యూహాలను ఎలా అమలు చేస్తారనేది కీలకం.అసెంబ్లీలో జరిగే వాగ్వివాదాలు ఈ ఇద్దరు నేతల మధ్య పోటీని మరింత ఆసక్తికరంగా మార్చవచ్చు. పాలన, సంక్షేమం, చట్టం, వ్యవస్థ, అభివృద్ధి వంటి అంశాలపై ముఖ్యంగా మాట్లాడాల్సింది ఈ ఇద్దరు నేతలే. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వం ఎంతవరకు విజయవంతం అవుతుంది? ప్రతిపక్షం ఎంత బలంగా నిలబడుతుంది? అన్నదే ముందున్న రాజకీయ దిశను నిర్ణయిస్తుంది. ఆ వ్యవహారాలే భవిష్యత్తులో విజయ్ను మరోసారి సీఎంగా నిలబెడతాయి. ఇక, ఉదయనిధి స్టాలిన్ బలంగా పనిచేస్తేనే విజయ్ను సీఎం పీఠం నుంచి దించి, మళ్లీ డీఎంకే అధికారంలోకి వస్తోంది. మొత్తంగా చూస్తే, విజయ్-ఉదయనిధి మధ్య ఈ రాజకీయ పోరు తమిళనాడు రాజకీయాలకు కొత్త శక్తిని తీసుకురానుంది. సభలో ప్రతి చర్చ ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఉండటం ఖాయం.తమిళనాట ఓ ఆశగా విజయ్బాలనటుడి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి వరకు ఎదిగారు టీవీకే విజయ్. త్వరలోనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీవీకే శాసనసభా పక్ష నేతగా ఇప్పటికే విజయ్ ఎన్నికయ్యారు. ఇక ప్రభుత్వ ఏర్పాటు, పొత్తులపై చర్చలు ఉండనున్నాయి. పాత పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు మారుతున్నాయి. ఈ రెండు పార్టీలే తప్ప మరో పార్టీ లేదా? అనుకుంటున్న సమయంలో తమిళనాట ఓ ఆశగా వెలిగారు విజయ్. ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదని కొందరు అంటున్న సమయంలో పార్టీని పెట్టి.. పోటీ చేసిన తొలిసారే అధికారంలోకి తీసుకొచ్చారు. డీఎంకే ఆశ అంతా ఉదయనిధిపైనే..మరోవైపు, తమిళనాడులో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఎమ్మెల్యేగా గెలవలేదు. దీంతో ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేత అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతగా తనను నియమించే నిర్ణయం పార్టీ నాయకత్వానిదేనని ఉదయనిధి స్టాలిన్ మంగళవారం తెలిపారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగానూ పనిచేసిన ఉదయనిధి స్టాలిన్.. ఈ ఎన్నికల్లో చెపాక్-తిరువల్లికేణి నియోజకవర్గంలో గెలిచారు. శాసనసభా పక్ష నేత విజయ్‌తో పోరాడాల్సిన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలినే.ఇద్దరిదీ ఒకే వయసు.. ఇరువురూ సినీనటులేఉదయనిధి స్టాలిన్ వయసు 49 సంవత్సరాలు. విజయ్ వయసు 51. దాదాపు ఒకటే ఏజ్. తమిళనాడు భవిష్యత్తు రాజకీయాలు అంతా వీరిద్దరి కేంద్రంగానే జరిగే అవకాశం ఉంది. ఒకరు సీఎంగా, మరొకరు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో మాటల తూటాలు పేల్చుకోవాల్సి ఉంటుంది. అప్పట్లో తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత వంటి వారు కూడా తమ సినీ పాపులారిటీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని ఏలారు. కాగా, దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ రాజకీయాల ముఖచిత్రం మారబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువ నాయకులుగా గుర్తింపు పొందిన విజయ్, ఉదయనిధి స్టాలిన్ మధ్య భవిష్యత్తులో జరగబోయే రాజకీయ పోరు అసెంబ్లీ వేదికగా రసవత్తరంగా మారే అవకాశం ఉంది. విజయ్, ఉదయనిధి ఇద్దరూ సినీనటులే. అయితే, విజయ్ సినిమాల్లో హిట్స్ అధికంగా ఉండడంతో ఆయనకు అభిమానులు విపరీతంగా ఉన్నారు. విజయ్ జననాయగన్ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెబుతానన్నారు. ఉదయనిధి కూడా సినిమాలకు గుడ్‌బై చెప్పి, నటనకు విరామం తీసుకుంటున్నట్లు 2023లోనే తెలిపారు.ఒకరు కొత్త.. మరొకరిది వారసత్వ రాజకీయంవిజయ్ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లో ఇంతగా రాణించడం ఓ అద్భుతం. ఉదయనిధి స్టాలిన్ రాజకీయాల్లోకి వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతోంది. డిప్యూటీ సీఎంగానూ పనిచేశారు. తాత, తండ్రి వారసత్వం నుంచే స్వతహాగా రాజకీయాలను నేర్చుకున్నారు. అధికార పక్షాన్ని ఎలా ఇరుకున పెట్టొచ్చో ఆయనకు తెలుసు. అయితే, విజయ్ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పటికీ ప్రజలను ఆకర్షించే తత్వం ఉంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు, ముఖ్యంగా యువతను ఆకట్టుకునే విధానాలు ఆయనకు మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. తన పాలనలో విజయ్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రతిపక్షం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అందులోని లోపాలు, లొసుగులను ఎత్తి చూపుతుంది. వీటన్నింటి ఆధారంగా విజయ్‌పై విమర్శలు చేసే పాత్ర పోషించాల్సింది ఉదయనిధి స్టాలినే. ఉదయనిధి స్టాలిన్‌కు ఇది కీలక దశ. అధికారంలో ఉన్న సమయంలో పొందిన అనుభవాన్ని ఉపయోగించి ప్రతిపక్ష నేతగా పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. సభలో ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం, ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించడం ఆయన ప్రధాన బాధ్యతగా మారనుంది. డీఎంకే వారసుడిగా, కరుణానిధి మనవడిగా, ఉదయనిధికి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉంది. ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు, పార్టీకి సంబంధించిన అనుభవం ఆయనకున్న ప్రధాన బలాలు. -
మమతా బెనర్జీ, స్టాలిన్ ఓడింది దానివల్లే..?
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులు ఓడిపోవడానికి కారణం కేంద్రం నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియే అన్నారు. వారి నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు తొలగించడం ద్వారే స్టాలిన్, మమతా బెనర్జీ ఓడిపోయారన్నారు.ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ "మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ల నియోజకవర్గాల్లో వరుసగా ఎస్ఐఆర్ నిర్వహించగా, ఇద్దరూ ఓడిపోయారు. పౌరసత్వాన్ని ఎస్ఐఆర్తో ముడిపెట్టడం తప్పు అని నేను పార్లమెంటులో కూడా ఇదే చెప్పాను. పౌరసత్వానికి హోం మంత్రిత్వ శాఖకు నియమాలు ఉన్నాయి; ఎన్ఆర్సి, ఎన్పిఆర్ నియమాలు కూడా ఉన్నాయి. ఇది కేవలం ఓటు వేయడం గురించే కాదు, మీ పౌరసత్వాన్ని కాపాడుకోవడం గురించి కూడా. తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాము. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి." అని అన్నారు.SIR ద్వారా ఓక వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉంటే వాటిని తొలగించడం. మరణించిన వారి వివరాలను ఓట్లర్ల జాబితా నుండి తీసివేయడం వలస వెళ్ళిన వారు శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారిని గుర్తించి ఓట్ల తొలగింపు చేస్తారు. అదే విధంగా 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్ల జాబితాలో చేర్చుతారు. వివాదం ఏంటంటే? పశ్చిమ బెంగాల్ (మమతా బెనర్జీ) మరియు తమిళనాడు (ఎం.కె. స్టాలిన్) ముఖ్యమంత్రులు ఈ SIR ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎస్ఐఆర్ పేరుతో తమకు మద్దతు ఇచ్చే వర్గాల ఓట్లను (ముఖ్యంగా మైనారిటీలు, వలస కార్మికులు) కావాలనే తొలగిస్తున్నారని వారు ఆరోపించారు. బెంగాల్లో సుమారు 90 లక్షల మంది ఓటర్లను ఈ ప్రక్రియ ద్వారా తొలగించారని, ఇది ఫలితాలను తారుమారు చేసిందని మమతా బెనర్జీ అన్నారు.ఎంఐఎంకు ఘోర ఓటమికాగా ఎంఐఎం పార్టీ ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన 12 మంది అభ్యర్థులను దింపగా ఘోర పరాజయం మూటగట్టుకుంది. 12 చోట్ల తమ అభ్యర్థులకు ఎక్కడా కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. మాల్దా, ముర్షీదాబాద్, బీర్బుమ్, పశ్చిమ్ బర్ధమాన్, ఉత్తర 24 పరగణాలు, ఉత్తర దినాజ్‌పూర్ ఏడు జిల్లాలోని 12 నియోజక వర్గాల్లోని మోథాబరి, సుజాపూర్, సుతి, రఘునాథ్గంజ్, కండి, నలహతి, మురారయ్, అసన్సోల్ నార్త్, హబ్రా, బరాసత్, బసిర్హట్ సౌత్, కరిందిఘిలో తన అభ్యర్థులను పోటీకి దింపింది. -
సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మమతా
కోల్‌కతా: బెంగాల్లో నైతిక విజయం తమదేనని అంటున్నారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. ఓట్లను, సీట్లను చోరీ చేసి బీజేపీ గెలిచిందని విమర్శించారు. అదే సమయంలో తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లోక్‌భవన్‌కు వెళ్లనని, అక్కడకు వెళ్లి రాజీనామా చే యాల్సిన అవసరం కూడా లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తాము ఓడిపోలేదని, బీజేపీ సీట్లు దొంగిలించిన కారణంగానే ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మమతా బెనర్జీ మరోసారి ఆరోపించారు. తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న మమతా, కోల్‌కతా నుంచి ప్రెస్మీట్లో మాట్లాడుతూ..‘ మేము ఎన్నికల్లో ఓడిపోలేదు. 100 సీట్లను బిజెపి దొంగిలించింది. ఇది బీజేపీ విక్టరీ కాదు.. లూటీ. బెంగాల్ ఎన్నికల్లో ఈసీ విలన్. ప్రతిపక్ష నేతలు వేధించడం బిజెపికి అలవాటు. మా నాయకులపై వేధింపులు మొదలయ్యాయి. ఇండియా బ్లాక్ కోసం మరింత గట్టిగా పని చేస్తా. ఈసీ బీజేపీ ఏజెంట్‌గా పనిచేసింది. ఎన్నికలకు రెండురోజుల ముందే టీఎంసీ నేతల్ని అరెస్ట్ చేశారు. బెంగాల్లో మాది ఓటమి కాదు. బీజేపీ చోరీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం మా పాలిట విలన్. మేం విలన్లపై పోరాటం చేశాం. కౌంటింగ్ సెంటర్లలో మా ఏజెంట్లను అనుమతించలేదు. SIR ప్రక్రియలో మోదీ, అమిత్ షా తలదూర్చారు. బీజేపీ ఓట్ల చోరీపై పోరాడుతాం. సీఆర్పీఎఫ్ బలగాలు మా పాలిట గూండాల్లా మారాయి. బీజేపీకి ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేయడం అలవాటే. మాకు ఇండియా బ్లాక్ మద్దతు ఉంది’ అని స్పష్టం చేశారు. కాగా, నిన్న(సోమవారం) వెలువడిన బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. 200పైగా సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. బీజేపీ ప్రభంజనంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 100 సీట్ల మార్కును కూడా దాటలేకపోయింది. -
tvk vijay : ఎల్లుండి సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం
సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ ఎల్లుండి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయ్‌తో పాటు 20మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కళగం) అతి పెద్ద పార్టీగా అవతరించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసించిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి, ప్రజల తీర్పుతో కొత్త శక్తిగా ఎదిగింది. అయితే స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల మద్దతు కీలకమైంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు విజయ్ను సంప్రదించాయి. అదే సమయంలో విజయ్ సైతం పలు పార్టీలతో సంప్రదింపులు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడం, మంత్రి వర్గంలో ఏ పార్టీకి చోటివ్వాలి. ప్రమాణ స్వీకారం తదిదర అంశాలపై స్పష్టత వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మిత్రపక్షాల ప్రతిపాదనలుసీపీఎం, సీపీఐ, పీఎంకే, వీసీకే పార్టీలు విజయ్‌కు తమ ప్రతిపాదనలు పంపాయి.పీఎంకే (పట్టాలి మక్కల్ కచ్చి) - నాలుగు స్థానాలు గెలుచుకున్న ఈ పార్టీకి ఒక మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం.సీపీఎం- భావజాల పరంగా టీవీకేకు దగ్గరగా ఉన్న ఈ పార్టీకి ఒక మంత్రి పదవి కేటాయించనున్నట్లు తెలుస్తోంది.సీపీఐ - మరో వామపక్ష పార్టీకి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని విజయ్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.వీసీకే (విదుతలై చిరుతైగల్ కచ్చి)- సామాజిక న్యాయం కోసం పోరాడే ఈ పార్టీకి కూడా ఒక మంత్రి పదవి ప్రతిపాదించారని సమాచారం.విజయ్ వ్యూహంకేవలం బయటి నుంచి మద్దతు కాకుండా, మిత్రపక్షాలను నేరుగా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం ద్వారా స్థిరమైన పాలన అందించాలనేది విజయ్ వ్యూహం. గత 60 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న డీఎంకే, ఏఐఏడీఎకే పార్టీల ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా విజయ్ ఒక కొత్త చరిత్రను సృష్టించబోతున్నారు.వినూత్న మంత్రివర్గంమిత్రపక్షాల సీనియారిటీతో పాటు, తన పార్టీలోని యువ నాయకులను కలిపి ఒక వినూత్నమైన మంత్రివర్గాన్ని విజయ్ రూపొందిస్తున్నారు. ప్రజలు కోరుకున్న ‘మార్పు’ తీర్పును గౌరవిస్తూ, పాత రాజకీయ శక్తులకు దూరంగా ఉండాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు.ముఖ్యమంత్రి పదవికి విజయ్అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ గురువారం (మే 7)న విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. -
డీఏంకేను వీడేది లేదు.. వీసీకే చీఫ్
సినీ స్టార్ విజయ్‌కు ఊహించని షాక్ తగిలింది. వీసీకే చీఫ్ తిరుమావళన్ డీఎంకేను వీడేది లేదని ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం లేకపోవడంతో విజయ్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు తీవ్ర ఉత్కంఠగా మారాయి. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 10 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కావడంతో టీవీకే ప్రధానంగా స్వతంత్ర అభ్యర్థులతో పాటు అక్కడి చిన్న పార్టీల అభ్యర్థుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "మేము టీవీకేతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం గురించి ఆలోచించడం లేదు. మేము ఇప్పటికీ డీఎంకేతోనే ఉన్నాము. మేము లౌకికవాదానికి కట్టుబడి ఉన్నాం. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం మేము ఈ పొత్తుతో ముందుకెళ్లాము. టీవీకే నుండి ఎలాంటి ఆహ్వానాన్ని ఆశించడం లేదు. తమిళనాడులో సంఘ్ పరివార్ నేతృత్వంలోని మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పుకు మేము చాలా కృతజ్ఞులం." అని అన్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో విదుతలై చిరుతైగల్ కట్చి పార్టీ రెండు స్థానాలు గెలిచింది. ఇది వరకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తమకు తగినంత సంఖ్యాబలం ఉందని రెండు వారాల గడువు ఇవ్వాలని తమిళనాడు గవర్నర్‌ని విజయ్ కోరారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్, వామపక్ష పార్టీలు టీవీకేకు మద్దతిచ్చేందుకు సిద్ధమేనని బహిరంగంగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఏం జరగనుందా అనే టెన్షన్ వాతావరణం నెలకొంది.#WATCH | Chennai | Viduthalai Chiruthaigal Katchi (VCK) Chief, Thol. Thirumavalavan, "We are not thinking about a coalition govt along with TVK. We are still with DMK. We are for secularism. We will proceed with this alliance for the welfare of the people of Tamil Nadu. We are… pic.twitter.com/WXpUBTWYPH— ANI (@ANI) May 5, 2026 -
విజయ్(య)ఢంకా : సవాళ్లు, హామీల భారం ఎంతో తెలుసా?
సాక్షి, చెన్నై: తమిళనాట నటుడు, టీవీకే అధినేత విజయ్ సంచలనం విజయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తన స్టార్ పవర్‌తోపాటు, ఆకర్షణీయమైన హామీలతో ప్రజలను ఆకట్టుకుని గెలుపు సాధించాడు. కానీ ఇంతకుముందు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని విజయ్ ముందు సవాళ్లు ఏంటి? పరిపాలన ఎంత విజయవంతంగా నిర్వహించగలడు? అనేది ప్రధాన చర్చ. అధికార పగ్గాలను చేపట్టిన తరువాత హామీలను నెరవేర్చడం తక్షణ ఆర్థిక సవాల్. విశ్లేషకుల అంచనాల ప్రకారం తొలి ఏడాదిలోనే అదనంగా రూ. 42,000 కోట్లు అవసరమవుతాయని అంచనాలు సూచిస్తున్నాయి.విజయ్ ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేయాలంటే మొదటి ఏడాదిలోనే సుమారు రూ. 42,000 కోట్ల అదనపు నిధులు అవసరమవుతాయని అంచనా. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక లోటు 2026-27 నాటికి రూ. 1.22 లక్షల కోట్లు (GSDPలో 3శాతం) ఉంటుందని అంచనా వేస్తున్న తరుణంలో ఇది పెద్ద సవాలుగా మారనుంది.రూ. 42,000 కోట్ల అదనపు భారంమహిళల సాయం, వృద్ధాప్య పెన్షన్లు, రైతు రుణమాఫీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, వెనుకబడిన వర్గాల చదువు లాంటి హామీలను విజయ్ తన మ్యానిఫెస్టోలో ప్రకటించారు. విజయ్ ప్రకటించిన హామీలు ప్రజలను ఆకట్టుకున్నప్పటికీ, వాటిని అమలు చేయడం అనేది కత్తి మీద సాము వంటిదే. ఈ హామీలను నెరవేర్చాలంటే రాష్ట్రం కొత్త ఆదాయ మార్గాలను వెతుకుతారా? లేదా అప్పులు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. గ్రాడ్యుయేట్లకు రూ. 4,000, డిప్లొమా హోల్డర్లకు రూ. 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే దీనికి కఠిన నిబంధనలు అమలు చేస్తే ఆర్థిక భారం తక్కువగానే ఉండవచ్చని కూడా భావిస్తున్నారు.మరీ ముఖ్యంగాప్రధానంగా మహిళలకు నెలవారీ సహాయాన్ని రూ. 1,000 నుండి రూ. 2,500కి పెంపు. దీని వల్ల ఏటా అదనంగా రూ. 21,617 కోట్లు ఖర్చవుతుంది. దీనివల్ల మొత్తం వ్యయం రూ. 36,029 కోట్లకు చేరుతుంది.వృద్ధాప్య పింఛన్‌ను రూ. 1,200 నుండి రూ. 3,000కి పెంచడం వల్ల రూ. 6,549 కోట్ల అదనపు భారం పడుతుంది. విడో పెన్షన్ల కోసం రూ. 1,829 కోట్లు, వికలాంగుల పెన్షన్ల కోసం రూ. 504 కోట్లు అదనంగా అవసరం. ఏడాదికి 6 ఉచిత LPG సిలిండర్ల హామీ వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 7,074 కోట్ల భారం పడుతుంది. ఇక రైతు భరోసా పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 15,000 సాయం కింద (కేంద్రం ఇచ్చే రూ. 6,000 కాకుండా) రాష్ట్రం అదనంగా రూ. 1,941 కోట్లు భరించాలి. అలాగు కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ కోసం మరో రూ. 382 కోట్లు అవసరం.పరిమిత ప్రభావంమరోవైపు కొన్ని పథకాల వల్ల ఆర్థిక భారం పరిమితంగా ఉండవచ్చని అంచనా. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న వివాహ పథకాల కింద సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 8 గ్రాముల బంగారం సహాయం అందిస్తోంది. అంటే విజయ్ ప్రకటించిన పెళ్లిచేసుకునే యువతులకు ప్రకటించిన 8 గ్రాముల బంగారం, పట్టుచీర వల్ల అదనపు ఖర్చుల భారం పెద్దగా ఉండక పోవచ్చు.ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకాప్రతిపాదిత నిరుద్యోగ భృతి,గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.4,000, డిప్లొమా హోల్డర్లకు రూ.3,000, కఠినమైన అర్హత నిబంధనలను కొనసాగిస్తే, ఆర్థిక వ్యవస్థపై పెద్దగా భారం పడకపోవచ్చు. కఠినమైన ఆదాయ పరిమితులతో ఉన్న ప్రస్తుత పథకానికి కేవలం రూ.2.37 కోట్ల వ్యయం మాత్రమే కాగా, దీనిని విస్తరించినా కూడా వ్యయం రూ.16 కోట్లలోపే ఉండవచ్చు.తమిళనాడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే దేశ సగటు సామాజిక వ్యయం 42 శాతంగా ఉంటే, తమిళనాడులో ఇది 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం 34 శాతానికి పడి పోయింది. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో ఖర్చు తగ్గుతూ వస్తోంది. రాష్ట్రం తన సొంత పన్ను రాబడి వ్యయాన్ని మెరుగు పరుచుకున్నప్పటికీ, దాని కట్టుదిట్టమైన వ్యయం (వేతనాలు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులు) 35 శాతంతో జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉంది. కాగా తమిళగ వెట్రి కజగం (టీవీకే) 2026 తమిళనాడు ఎన్నికలలో తొలిసారిగా ఘన విజయం సాధించింది. బూటకపు పార్టీ, పొలిటికల్ డ్రామా ఆడుతున్న సినిమా స్టార్ అన్న వెక్కిరింపులకు ధీటుగా రాష్ట్రంలోని 234 స్థానాలకు గాను 108 స్థానాలను కైవసం చేసుకుని విజయ ఢంకా మోగించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: మహిళా ఫ్రొఫెసర్ రహస్య ప్రేమ, వీకెండ్లో ఔటింగ్... కట్ చేస్తే! -
ఎమ్మెల్యేగా ఎన్నికైన టీమిండియా మాజీ క్రికెటర్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కీలక మార్పులకు దారితీశాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఘన విజయం సాధించి, 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి చరమగీతం పాడింది. బీజేపీ నుంచి ఎన్నికైన 200 మంది పైచిలుకు ఎమ్మెల్యేల్లో ఓ టీమిండియా మాజీ క్రికెటర్ కూడా ఉన్నాడు. అతని పేరు అశోక్ దిండా.దిండా పూర్వ మిడ్నాపూర్ ప్రాంతంలోని మోయ్నా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా మరోసారి ఎన్నికయ్యాడు. దిండా తన సమీప ప్రత్యర్ది, టీఎంసీ అభ్యర్ది చందన్ మొండల్‌పై 14000 పైచిలుకు మెజార్టీతో గెలిచాడు. గత ఎన్నికల్లో (2021) స్వల్ప తేడాతో విజయం సాధించిన దిండా, ఈసారి భారీ ఆధిక్యంతో గెలిచి తన ప్రజాదరణను మరింత పెంచుకున్నాడు.2021లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన దిండా, అదే సంవత్సరంలో బీజేపీలో చేరి తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు వరుసగా రెండోసారి గెలవడంతో, త్వరలో ఏర్పాటయ్యే బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా నియమితుడయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. గత టీఎంసీ ప్రభుత్వంలో ఓ టీమిండియా మాజీ క్రికెటర్ (మనోజ్ తివారి) మంత్రిగా ఉండటంతో దిండాకు కూడా ఈసారి మంత్రివర్గం ఛాన్స్ ఖాయమని అంతా చర్చించుకుంటున్నారు.42 ఏళ్ల దిండా 2009లో టీమిండియా అరంగేట్రం చేసి 13 వన్డేలు, 9 టీ20లు ఆడి 29 వికెట్లు తీశాడు. కుడి చేతి వాటం మీడియం పేసర్ అయిన దిండా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా అవకాశాలు దక్కించుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 78 మ్యాచ్‌లు ఆడిన దిండా 69 వికెట్లు తీశాడు. 2010లో టీమిండియా ఆసియా కప్ గెలిచిన జట్టులో దిండా సభ్యుడిగా ఉన్నాడు.దిండా అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ కాలం నిలవకపోయినా, దేశీయ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. బెంగాల్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 420 వికెట్లు, లిస్ట్-ఏ క్రికెట్లో 151 వికెట్లు పడగొట్టాడు. -
నమస్కారం తమిళనాడు: ప్రకాశ్ రాజ్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదిక తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలపై ఎక్కువ మంది స్పందిస్తున్నారు. బెంగాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించడం, తమిళనాడులో విజయ్ సంచలన విజయం నమోదు చేయడంతో ఈ రెండు రాష్ట్రాల ఫలితాలపై సోషల్ మీడియాలో స్పందన అధికంగా ఉంది. ప్రభుత్వాన్ని నడిపే సత్తా విజయ్‌కు ఉందా అని ఒకరు సందేహిస్తే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలు మంచి చేయాలని మరొకరు హితవు పలికారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, సీనియర్ జర్నలిస్టులు ప్రణయ్ రాయ్, రాజ్‌దీప్ సర్దేశాయితో పాటు పలువురు తమ అభిప్రాయాలను 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.‘అభిమాన’ సమాజంనమస్కారం తమిళనాడు. కామరాజర్ ఓడిపోయారు. ఎం.కె. స్టాలిన్ ఓడిపోయారు. సమాజం ‘అభిమాన గణం’గా మారిందే తప్ప, రాజకీయ చైతన్యం పొందలేదని నిరూపితమవుతోంది. రాజకీయ అవగాహన కల్పించే వారి పని ఎప్పుడూ ప్రతిపక్ష పాత్రే. మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. విజయం సాధించినవారు ప్రజలకు చేసే సేవ బాగుండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.– ప్రకాశ్ రాజ్, నటుడు‘టీవీకే’ నడపగలదా?బెంగాల్లో బీజేపీ విజయం కేవలం ప్రజాభిప్రాయంలో మార్పు మాత్రమే కాదు. ఓటర్ల జాబితా సవరణలతో ఆట మైదానాన్ని మార్చినప్పుడు, స్కోర్‌బోర్డు అసలైన ఆటకు ప్రతిబింబంగా ఉండదు. తమిళనాడులో యువత ఒక ‘కొత్త ముఖానికి’ ఓటు వేసినప్పటికీ, సినిమా ఆకర్షణ, సోషల్ మీడియా ప్రదర్శనలకు అతీతంగా టీవీకే దగ్గర ఏమైనా విషయం ఉందో లేదో చూడాల్సి ఉంది. కేరళ ఫలితాల్లో యూడీఎఫ్ విజయం అతి తక్కువ ఆశ్చర్యం కలిగించేదీ, అత్యంత నిజాయితీతో కూడినదీ అని నా భావన.– యోగేంద్ర యాదవ్, పొలిటికల్ సైంటిస్ట్పింగ్–పాంగ్బెంగాల్లో 15 ఏళ్ల పాలన నుండి కొత్త సైద్ధాంతిక పాలనకు జరిగే ఈ పరివర్తన... రాష్ట్ర పాలనా యంత్రాంగానికి అంతిమ పరీక్ష అవుతుంది. తమిళనాడు తన సంప్రదాయ ‘పింగ్–పాంగ్’ (రెండు పార్టీల మధ్యనే మారుతుండే) రాజకీయాల నుండి, అంచనా వేయలేని విధంగా మూడో ముఖం వైపు మళ్లింది. కేరళలో యూడీఎఫ్ ఆధిక్యత, అక్కడ చారిత్రకంగా నెలకొన్న ‘రివాల్వింగ్ డోర్’ విధానానికి తిరిగి వెళ్లటంగా మాత్రమే చూడాలి.– ప్రణయ్ రాయ్, ఎన్నికల డేటా విశ్లేషకులువిద్య... ఆరోగ్యంఅధికారంలో మార్పు వచ్చినా, బెంగాల్లో లోతుగా పాతుకుపోయిన సమ్మిళిత మేధో సంస్కృతి చెక్కుచెదరకుండా ఉంటుందని, ‘సంకుచిత వర్గవాదం’ దానిని కబళించదని ఆశిస్తున్నాను. తమిళనాడులో కొత్త ఆటగాళ్లు ఆవిర్భవించారు. ఆ మార్పు ప్రజాస్వామ్యానికి మంచిది. అది స్థిరపడిన పార్టీలను అప్రమత్తం చేస్తుంది. కేరళలో భావోద్వేగపూరితమైన మతపరమైన అంశాల కంటే.. పరిపాలన, విద్య, ఆరోగ్యమే ఎప్పటికీ ప్రధానాంశాలుగా ఉంటాయిని ఈ ఫలితాలు మరోసారి రుజువు చేశాయి.– జావేద్ అఖ్తర్, గీత రచయితవిసుగు ఫలితం!సరిహద్దు జిల్లాల్లో భారీగా హిందువుల ఏకీకరణ, టీఎంసీ స్థానిక నాయకత్వంపై నెలకొన్న విసుగు – వీటి ఫలితమే బెంగాల్లో తాజా పరిణామం. తమిళనాడులో, స్థిరపడిన ద్రవిడ భావజాలానికి వ్యతిరేకంగా యువత చేసిన తిరుగుబాటే టీవీకే విజృంభణ. కేరళలో ద్రవ్యోల్బణం, దాదాపు 30 శాతం వరకు ఉన్న నిరుద్యోగం వంటి సమస్యలు ఎల్.డి.ఎఫ్.పై ప్రభావం చూపాయి.– రాజ్‌దీప్ సర్దేశాయ్, సీనియర్ జర్నలిస్ట్మూడో శక్తిపశ్చిమ బెంగాల్ ఫలితాలు మార్పు కోరు కుంటున్న ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబం. కానీ అవి ఆ రాష్ట్ర మేధో చరిత్రను నిర్వచించిన ‘బహుళత్వం’, భావప్రకటనా స్వేచ్ఛ వంటి రాజ్యాంగ విలువలను నిలబెట్టేందుకు రానున్న కొత్త పరిపాలనపై ఒక పెద్ద భారాన్ని కూడా మోపుతాయి. రాజకీయ వారసత్వాలు శాశ్వతం కాదని తమిళ నాడులో ఆవిర్భవించిన మూడో శక్తి నిరూపించగా; కేరళ ఎప్పటిలా తన విశిష్టమైన ప్రజాస్వామ్య విజ్ఞతను ప్రదర్శించింది. – అరుణా రాయ్, ‘మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్’ సభ్యురాలుమార్పే బలంబెంగాల్లో ఎన్నికల అనంతర ఘర్షణల చరిత్రను దృష్టిలో ఉంచుకుని, ప్రజాస్వా మ్యంలోని అత్యంత బలహీన వర్గాల భద్రతను, ముఖ్యంగా మైనారిటీలకు, ప్రతిపక్షానికి ఓటు వేసిన వారికి రక్షణ కల్పించేందుకు కొత్త ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. తమిళనాడులో సంప్రదాయ ద్రవిడ పార్టీలకు ఎదురైన ఎదురు దెబ్బ... చారిత్రక వారసత్వంపై ఆధారపడకుండా క్షేత్రస్థాయి క్రియాశీలత వైపు తిరిగి రావడానికి నాయకులకు ఒక మేల్కొలుపుగా పని చేయాలి. ఇక కేరళలో ప్రభుత్వాలు తరచుగా మారడమే ఆ రాష్ట్రానికి అతి పెద్ద బలం. ఎందుకంటే ఇది ప్రతి నాయకుడిని ఎప్పుడూ అప్రమత్తంగా ఉంచుతుంది.– హర్ష్ మందర్, సామాజిక కార్యకర్త, రచయితకట్టుబడి లేరుటీఎంసీని ‘బుజ్జగింపు పార్టీ’గా చిత్రీకరించే ప్రయత్నంలో సఫలం అవటం వల్లే బీజేపీ విజయం సాధించింది. తమిళనాడులో జెన్ జడ్, మిలీనియల్ ఓటర్లు ఇకపై డీఎంకే– ఏఐఏడీఎంకేకి కట్టుబడి లేరని స్పష్టం అయింది. కేవలం ఒక సినిమా నటుడికి ఓటు వేయటం మాత్రమే కాదు, ‘ద్వంద్వ పాలనను తిరస్కరించడం’ కూడా అక్కడి ఫలితాలకు సంకేతాలు! కేరళలో గత ఎన్నికల్లో పాక్షికంగా ఎల్డిఎఫ్ వైపు మళ్లిన తమ సంప్రదాయ మైనారిటీ ఓటు బ్యాంకును తిరిగి ఆకర్షించుకోగలగడమే యూడీఎఫ్ విజయానికి ప్రధాన కారణం.– నీరజా చౌధరి, రాజకీయ విశ్లేషకురాలుఅందరూ దూరమే!గత నెలలో నేను మాట్లాడిన దాదాపు ప్రతి జర్నలిస్టు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కే అనుకూలమని చెప్పారు. కొందరైతే టీఎంసీ క్లీన్ స్వీప్ చేస్తుందని కూడా అంచనా వేశారు. కానీ, పశ్చిమ బెంగాల్‌పై పరిశోధన చేసిన విద్యావేత్తలు మాత్రం టీఎంసీ తీవ్ర ఇబ్బందుల్లో ఉందనీ, బీజేపీ గణనీయమైన మెజారిటీతో గెలిచే అవకాశం ఉందనీ అన్నారు. హిందువులు దూరమవ్వడం వల్లే మమతా బెనర్జీ ఓడిపోయారా? ముస్లింలు అధికంగా ఉన్న టాప్ 10 నియోజకవర్గాల్లో కూడా టీఎంసీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మార్పు కనిపించింది. టీఎంసీ నుంచి వచ్చిన హిందూ ఓట్ల కంటే, కాంగ్రెస్, లెఫ్ట్ నుంచి వచ్చిన హిందూ ఓట్లనే బీజేపీ ఎక్కువగా సాధించగలిగింది. మరోవైపు, టీఎంసీకి రావాల్సిన ముస్లిం ఓట్లలో పెద్ద భాగాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ దక్కించుకున్నాయి.– అనింద్యో చక్రవర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
సంతోషంగా ఉంది: ఎన్నికల ఫలితాలపై అన్నామలై
చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నాయకుడు అన్నామలై తనదైన శైలిలో స్పందించారు. ధన, వారసత్వ రాజకీయాలకు తమ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించారని.. మార్పునకు ఓటేశారని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చినందుకు తమిళనాడు ప్రజలకు నమస్కరించారు. ఎన్నికల ఫలితాలపై 'ఎక్స్'లో సోమవారం పోస్ట్ పెట్టారు. ఓటర్ల అభిమానం పొందిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌కు అభినందనలు తెలిపారు. ఓటమి పాలైన స్టాలిన్‌కు సానుభూతి ప్రకటించారు. మంచి రోజులు వస్తాయని బీజేపీ శ్రేణులకు భరోసాయిచ్చారు.''అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పుకు నమస్కరిస్తున్నాను. నా గడ్డపై ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి గళం విప్పడం సంతోషంగా ఉంది. డబ్బుతో ఓట్లు కొనడాన్ని వ్యతిరేకించారు. వంశపారంపర్య రాజకీయాలను వద్దన్నారు. రాజకీయాల్లో కొత్త మార్పునకు నాంది పలికారు. టీవీకే, విజయ్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తమిళనాడు రాజకీయాల్లో అద్భుతమైన ఆరంభానికి సిద్ధంగా ఉన్న మీకు దేవుడు తోడుగా ఉంటాడు.క్షేత్రస్థాయిలో ఎన్డీఏ అభ్యర్థులు హోరాహోరీ తలపడ్డారు. గెలిచిన వారందరికీ అభినందనలు. ఓడిన వారు డీలా పడకుండా పోరాటం కొనసాగించాలని కోరుకుంటున్నాను. పరాజయం పాలైన స్టాలిన్, సీమాన్‌లకు సానుభూతి తెల్పుతున్నాను. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన బీజేపీ కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు. మంచి రోజులు త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నానని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, ఎన్డీఏ అభ్యర్థుల తరపున రాష్ట్రవ్యాప్తంగా అన్నామలై పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేశారు. ఇందు కోసం ఎన్నికల్లో పోటీకి సైతం ఆయన దూరంగా ఉన్నారు. బీజేపీ అధిష్టానం పోటీ చేయమని సూచించినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. మరోవైపు డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశారు. చదవండి: అన్నాడీఎంకే మాజీ నేతకు టీవీకే ప్రభుత్వంలో కీలక పదవి! -
ఇక టీఎంసీ నేతలు ‘గుండు’కు రెడీనా?
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. కోల్‌కతా, దక్షిణ 24 పరగణాల్లో బీజేపీ ఒక్క స్థానం గెలిచినా తమ ఎంపీ ఒకరు గుండు కొట్టించుకుంటారని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నేత డెరెక్ ఓబ్రియన్ విసిరిన సవాలు ఇప్పుడు ఆ పార్టీకే రివర్స్ అయ్యింది. ఇప్పుడు టీఎంసీ నేతలు తమ సవాల్‌ను నిలబెట్టుకుంటారా లేదా అనే ఉత్కంఠ అందరిలోనూ కలుగుతోంది.గత నెలలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో డెరెక్ ఓబ్రియన్ మాట్లాడుతూ.. ‘మేము గొప్పలు చెప్పదలుచుకోలేదు, మే 4 లెక్కింపు రోజు వరకు వేచి చూస్తాం. కోల్‌కతాలో బీజేపీ ఒక్క సీటు గెలిచినా మా ఎంపీ ఒకరు గుండు కొట్టించుకుంటారు’ అని సవాల్ విసిరారు. దక్షిణ 24 పరగణాల్లోని 31 స్థానాలకు కూడా ఇదే రూల్ వర్తిస్తుందని ఆయన నాడు తెలిపారు. 2021 ఎన్నికల్లో సాధించిన 215 సీట్ల కంటే ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఎన్నికల సమయంలో ధీమా వ్యక్తం చేశారు. అయితే తుది ఫలితాలలో టీఎంసీ కనీసం 100 మార్కును కూడా దాటలేకపోయింది.ఇది కూడా చదవండి: బిగ్ బ్రేకింగ్: 9న బీజేపీ ప్రమాణ స్వీకారం -
బిగ్ బ్రేకింగ్: 9న బీజేపీ ప్రమాణ స్వీకారం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో నూతన ఘట్టం ఆవిష్కృతం కానుంది. దశాబ్దాల కమ్యూనిస్ట్, తృణమూల్ కాంగ్రెస్ పాలనకు తెరదించుతూ, రాష్ట్రంలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సాంస్కృతిక, రాజకీయ ప్రాముఖ్యతను మేళవిస్తూ.. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజైన మే 9న బీజేపీ కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయనుందని విశ్వసనీయ సమాచారం.మోదీ చెప్పినట్లే..మే 9న రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార మహోత్సవం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య తెలిపారు. బరాక్‌పూర్‌లో జరిగిన చివరి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత మే 4న తాను తిరిగి వస్తానని, బీజేపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి హాజరవుతానని ఆయన ప్రకటించారు. ఈ చారిత్రక విజయం తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ.. రవీంద్రనాథ్ ఠాగూర్ కలలుగన్న ‘భయమెరుగని, తల ఎత్తుకుని జీవించే సమాజాన్ని’ బెంగాల్లో నిర్మిస్తామని అన్నారు.అధికార మార్పిడి ప్రక్రియ ప్రారంభంబెంగాల్లో అధికార మార్పిడికి సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియలు వేగవంతమయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు ఎస్.బి.జోషి, సుజిత్ కుమార్ మిశ్రా ఈరోజు (మే 5) ఢిల్లీ నుంచి కోల్‌కతా చేరుకొని, ఎన్నికల ఫలితాల అధికారిక గెజిట్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) మనోజ్ కుమార్ అగర్వాల్‌కు అందజేయనున్నారు. అనంతరం మే 6న సీఈవో.. రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి లాంఛనంగా వివరాలు అందిస్తారు. ఆ వెంటనే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని మమతా బెనర్జీని గవర్నర్ ఆహ్వానిస్తారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని ఆమెను కోరనున్నారు.బెంగాలీల మనోభావాలకు పెద్దపీటమే 9వ తేదీని ఎంచుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. బెంగాలీలు అత్యంత ముఖ్యమైనదిగా భావించే ‘పొచిషే బోయిశాఖ్’ (రవీంద్ర జయంతి) రోజున ప్రమాణస్వీకారం చేయడం ద్వారా స్థానికుల మనోభావాలకు బీజేపీ పెద్దపీట వేసింది. ఠాగూర్ జయంతి బెంగాల్లో కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది వారి సంస్కృతిలో భాగం. నాలుగున్నర దశాబ్దాల వామపక్ష, టీఎంసీ పాలనకు ముగింపు పలుకుతూ రాబోతున్న ఈ పరిణామం బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నది. -
అటు మోదీ, ఇటు విజయ్.. ప్రపంచ మీడియా ఫిదా
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతూ భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. న్యూయార్క్ నుంచి లండన్ వరకు, ఇస్లామాబాద్ నుంచి ఢాకా వరకు అంతర్జాతీయ మీడియా పత్రికలన్నీ భారత్‌లో చోటుచేసుకున్న ఈ రాజకీయ పెనుమార్పులనే పతాక శీర్షికలుగా ప్రచురించాయి. తమిళనాడులో దళపతి విజయ్ పార్టీ ‘టీవీకే’ సృష్టించిన రాజకీయ సునామీ సైతం పాశ్చాత్య పత్రికల దృష్టిని ఆకర్షించింది.బెంగాల్లో కమల వికాసం.. బ్రిటన్ మీడియా ఆశ్చర్యంప్రతిపక్షాల కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్‌ను మోదీ నేతృత్వంలోని బీజేపీ కైవసం చేసుకోవడంపై బీబీసీ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మోదీ 12 ఏళ్ల పాలనలో తూర్పు భారతావనిలో సాధించిన అత్యంత అద్భుతమైన విజయాల్లో ఇది ఒకటని ఆ పత్రిక కొనియాడింది. మరోవైపు ‘ది గార్డియన్’ పత్రిక సైతం ఈ పరిణామం భారత రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని విశ్లేషించింది. ఇప్పటికే బలహీనపడిన ప్రతిపక్షాలకు ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బ అని పేర్కొంది.అమెరికా పత్రికల్లో మోదీ, విజయ్ సంచలనాలుఅమెరికాకు చెందిన ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక బీజేపీ బెంగాల్ గెలుపును ‘చరిత్రాత్మకం’గా అభివర్ణించింది. హిందూ జాతీయవాదులు ప్రతిపక్షాల ప్రధాన కోటను బద్దలు కొట్టారని పేర్కొంది. తమిళనాడులో రాజకీయ ఓనమాలు కూడా తెలియని సినీ నటుడు జోసెఫ్ విజయ్ (టీవీకే).. డీఎంకే లాంటి బలమైన పార్టీలను మట్టికరిపించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక మోదీ మూడో విడత పాలనలో ఈ ఘన విజయాలు ఆయన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని ‘వాషింగ్టన్ పోస్ట్’ తన కథనంలో విశ్లేషించింది.పాక్, బంగ్లాదేశ్ మీడియాలోనూ..భారత ఎన్నికల ఫలితాల ప్రకంపనలు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీడియాలోనూ కనిపించాయి. పాక్ పత్రిక ‘డాన్’.. ప్రతిపక్షాల కోటను జాతీయవాద పార్టీ కైవసం చేసుకుందని పేర్కొంది. ఈ గెలుపు 2029 ఎన్నికల నాటికి మోదీని మరింత శక్తివంతంగా మారుస్తుందని తెలిపింది. అటు బంగ్లాదేశ్ పత్రిక ‘ఢాకా ట్రిబ్యూన్’ సైతం బెంగాల్ ఫలితాలతో పాటు, తమిళనాడులో రాజకీయ ఉద్ధండుడు ఎంకే స్టాలిన్‌ను వెనక్కి నెట్టి, విజయ్ పార్టీ అఖండ విజయం సాధించడాన్ని రాజకీయ సంచలనంగా వర్ణించింది.ఇది కూడా చదవండి: లాటరీ కింగ్ ఇంట్లో ట్రిపుల్ ధమాకా: మూడు పార్టీల నుంచి.. -
గవర్నర్‌కు టీవీకే విజయ్ లేఖ
చెన్నై: తమిళనాడు గవర్నర్‌కు టీవీకే చీఫ్ విజయ్ లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. రెండు వారాల్లో మెజారిటీ నిరూపిస్తామని.. అవకాశం ఇవ్వాలంటూ విజయ్ కోరారు. లోక్‌భవన్‌కు ఈ-మెయిల్ ద్వారా ఆయన లేఖ పంపినట్లు సమాచారం. విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ (మెజారిటీ మార్క్) 118. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలను గెలుచుకుంది.స్వతంత్ర అభ్యర్థులు, ఒకట్రెండు సీట్లు గెలుచుకున్న చిన్న పార్టీలపై విజయ్ దృష్టి సారించారు. సంఖ్యా బలం పరంగా చూస్తే.. కేవలం 10 మంది ఎమ్మెల్యేలు అవసరమైనందున.. ఇతర పార్టీల నుంచి చీలిక తీసుకురావడం కంటే స్వతంత్రుల మద్దతు కూడగట్టడం సులభంగా టీవీకే భావిస్తోంది. వీరికి మంత్రి పదవులు, ప్రత్యేక నిధుల హామీ ఇవ్వడం ద్వారా మద్దతు పొందవచ్చని టీవీకే ప్లాన్ చేసినట్లు సమాచారం.ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయం అనే నినాదంతో విజయ్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించడంతో.. ప్రతిపక్ష కూటముల్లోని అసంతృప్త ఎమ్మెల్యేలు విజయ్ వైపు చూసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. విజయ్.. గవర్నర్‌కు లేఖ రాయగా.. రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంది. ఈ 14 రోజుల సమయం.. ఇతర పార్టీలతో చర్చలు జరపడానికి పొత్తులు కుదుర్చుకోవడానికి చాలా కీలకం. -
విజయ్ అప్పటి నుంచే మారిపోయాడు!
తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్ విజయ్ పూర్తి పేరు... జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. 1974 జూన్ 22న చెన్నైలో జన్మించారు. సినిమాల్లో రాణించి అగ్ర హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రజలు ఆయనకు పట్టం కట్టడంతో.. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారారు. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం, సోదరి గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.అన్నయ్య చేతుల్లోనే..తన చెల్లి విద్య చిన్న వయస్సులోనే మరణించడం విజయ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. 1980లో జన్మించిన విద్య సుమారు నాలుగేళ్ల వయసులో 1984 మే 20వ తేదీన ఆనారోగ్యంతో మరణించారు. విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ 'ఎనక్కుల్ నానే నీధిపతి' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. విద్యా విజయ్.. తన అన్నయ్య చేతుల్లోనే ప్రాణాలు విడిచారని.. ఆ సంఘటన విజయ్ను తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది.ఈ విషాదం జరగక ముందు..ఈ విషాదం జరగక ముందు.. దళపతి విజయ్ ఎంతో చురుకుగా.. అల్లరి చేస్తూ.. అతిగా మాట్లాడే బాలుడిగా ఉండేవారు. కానీ విద్యా విజయ్ మరణం తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారు. ఆయన అంతర్ముఖుడిగా మారిపోయారు. ఇప్పటికీ ఆయన బహిరంగ ప్రదేశాల్లో కనిపించే శాంత స్వభావానికి ఆనాటి ఆ ఘటనే కారణమని చెబుతుంటారు. స్కూలు నుంచి వచ్చాక విజయ్ ఎంతో ఆప్యాయంగా విద్యకు తనే స్నానం చేయించి అన్నం కూడా తినిపించేవాడు. చెల్లిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు.చెల్లెలు విద్య పేరుని గుర్తుకు తెచ్చేలా..గతంలో ఓ కార్యక్రమంలో తన చెల్లెలు విద్య గురించి విజయ్ మాట్లాడుతూ.. తన జీవితంలో చెల్లెలు మరణం.. దాన్నుంచి కోలుకోవడం చాలా కష్టమైందన్నారు.. కానీ ఆమెను దూరం చేసిన దేవుడు.. నాకు చాలామంది చెల్లెలను అభిమానుల రూపంలో తిరిగిచ్చాడంటూ.. వారందరిలో తన చెల్లెలు రూపాన్ని ఇప్పటికీ చూసుకుంటానని తెలిపారు. చెల్లెలు విద్య అకాల మరణంతో తీవ్ర మనో వేదనకు గురైన విజయ్.. తన కూతురికి చెల్లెలు విద్య పేరుని గుర్తుకు తెచ్చేలా దివ్య అని నామకరణం చేశారు.విజయ్ కార్ నంబర్ వెనుక రహస్యంవిజయ్ తన కార్లకు 0277 అనే ప్రత్యేక నంబర్‌ను వాడుతుంటారు. ఈ నంబర్ తన సోదరి విద్యాకు అంకితం చేశారు. 14-02-77 అనేది ఆమె పుట్టిన తేదీ. తన సోదరిపై ఉన్న ప్రేమతో విజయ్ ఇప్పటికీ ఆ నంబర్‌ను వాడుతూ ఆమె జ్ఞాపకాలను పదిలపరుచుకుంటున్నారు.తండ్రిపై విజయ్ కేసు..కాగా, గతంలో విజయ్ తన తల్లిదండ్రులు సహా 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో కేసు పెట్టిన సంగతి కూడా అభిమానులు గుర్తుకుచేసుకుంటున్నారు. 2020లో విజయ్ తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్.ఎ.చంద్రశేఖర్ ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్ పేరుతో ఓ రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీకి జనరల్ సెక్రటరీగా ఎస్.ఎ.చంద్రశేఖర్, ట్రెజరర్‌గా శోభా చంద్రశేఖర్ వ్యవహరించారు. అయిత.. తన తండ్రి ప్రారంభించిన రాజకీయ పార్టీకి, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తండ్రి స్థాపించిన ఆ పార్టీకి తన పేరుని ఉపయోగించుకుంటే. చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారు. ఈ ఘటన కూడా అప్పట్లో సంచలనంగా మారింది. -
లాటరీ కింగ్ ఇంట్లో ట్రిపుల్ ధమాకా: మూడు పార్టీల నుంచి..
న్యూఢిల్లీ: వ్యాపార సామ్రాజ్యంలోనే కాకుండా ఇప్పుడు రాజకీయ రణరంగంలో కూడా ‘లాటరీ కింగ్’ శాంటియాగో మార్టిన్ కుటుంబం సంచలనం సృష్టించింది. తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు, మూడు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. ఒకే ఇంట్లో మూడు వేర్వేరు రాజకీయ జెండాలు ఎగరడం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.అల్లుడి అదుర్స్.. టీవీకే నుంచి ఘన విజయంమార్టిన్ అల్లుడు (కూతురు డైసీ భర్త), నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీ సీనియర్ నేత అయిన ఆధవ్ అర్జున రెడ్డి విల్లివాక్కం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఎన్నికల బరిలో తన సమీప ప్రత్యర్థిపై 17,302 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన ఘన విజయం సాధించి, అందరి దృష్టిని ఆకర్షించారు.అన్నాడీఎంకే అభ్యర్థిగా లీమా రోజ్ గెలుపుమరోవైపు శాంటియాగో మార్టిన్ భార్య లీమా రోజ్ మార్టిన్ కూడా తమిళనాడులోని లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే టికెట్‌పై పోటీ చేశారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఆమె సుమారు 2,500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.పుదుచ్చేరిలో సత్తా చాటిన జోస్పుదుచ్చేరి ఎన్నికల్లో మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ కామరాజ్ నగర్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి 10,205 ఓట్ల తేడాతో జయకేతనం ఎగురవేశారు. ఆయన గతేడాది స్థాపించిన ‘లక్ష్య జననాయక కట్చి’ (ఎన్డీయే మిత్రపక్షం) తరపున పోటీ చేసి ఈ గెలుపును నమోదు చేశారు. దాదాపు రూ.15,000 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న మార్టిన్ గ్రూప్.. ఎన్నికల బాండ్ల రూపంలో వివిధ రాజకీయ పార్టీలకు సుమారు రూ.1,300 కోట్లు విరాళంగా ఇచ్చి, గతంలో ఈడీ విచారణను సైతం ఎదుర్కోవడం గమనార్హం.ఇది కూడా చదవండి: బెంగాల్ కొంపముంచిన ‘బంగ్లా’ సంక్షోభం -
బెంగాల్ కొంపముంచిన ‘బంగ్లా’ సంక్షోభం
కోల్‌కతా: మూడు దశాబ్దాల వామపక్ష పాలన, ఆ తర్వాత మమతా బెనర్జీ ఏకఛత్రాధిపత్యం.. ఇలాంటి పశ్చిమ బెంగాల్లో అనూహ్యంగా కాషాయ జెండా రెపరెపలాడింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు ఊహించని షాక్ ఇస్తూ, బీజేపీ సాధించిన విజయానికి ప్రధాన కారణం స్థానిక రాజకీయాలు కాదు.. సరిహద్దుల్లోని బంగ్లాదేశ్ సంక్షోభం! షేక్ హసీనా ప్రభుత్వ పతనం, బంగ్లాలో హిందువులపై దాడులు, అక్రమ చొరబాట్లపై రేగిన ఆందోళనలు బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి.షేక్ హసీనా పతనం తర్వాత..డిసెంబర్ 2025లో బంగ్లాదేశ్‌లో హిందూ వస్త్ర కార్మికుడు దీపు చంద్ర దాస్ దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి నిరసనగా కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ఎదుట హిందూ సన్యాసులు, సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులపై మమతా బెనర్జీ పోలీసులు లాఠీఛార్జ్ చేయడం పట్ల బీజేపీ తీవ్రంగా మండిపడింది. దీదీ ప్రభుత్వం కేవలం బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మాత్రమే కొమ్ముకాస్తోందని, బెంగాల్ హిందువుల పక్షాన నిలబడలేదనే వాదనను ఆ పార్టీ విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది.అక్రమ చొరబాటుదారులపై బీజేపీ అస్త్రంబంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాటుదారుల అంశం బీజేపీకి ప్రధాన ఎన్నికల అస్త్రంగా మారింది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో దాదాపు 1.25 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారని, దీదీ ఆశీస్సులతోనే ఇదంతా సాగుతోందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. పటిష్టంగా లేని సరిహద్దుల గుండా ముస్లింలు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి టీఎంసీ ఓటర్లుగా మారుతున్నారన్న బీజేపీ వాదన ఓటర్లను ఆలోచింపజేసింది. దశాబ్దాలుగా హిందూ-ముస్లిం రాజకీయాలకు దూరంగా ఉన్న బెంగాల్, ఈసారి ఆ ప్రభావానికి లోనైంది.గేమ్ ఛేంజర్‌గా ‘మతువా’ ఓటుబ్యాంక్ఈ ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర పోషించింది ‘మతువా’ సామాజిక వర్గం. 19వ శతాబ్దంలో తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ఆవిర్భవించిన ఈ వర్గానికి బెంగాల్‌లోని పలు నియోజకవర్గాల్లో బలమైన పట్టుంది. ఓటర్ల జాబితా నుండి తమ పేర్లు తొలగిస్తున్నారన్న ఆందోళనలు ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు స్థానికులను బీజేపీ వైపు నిలబడేలా చేశాయి. తాము మతపరమైన వేధింపులకు గురికాకూడదనే ఉద్దేశ్యంతో, బీజేపీ మాత్రమే తమకు పౌరసత్వం కల్పిస్తుందన్న ఆశతో వారు బీజేపీ పక్షాన నిలబడ్డారని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: దీదీ పతనం.. కాంగ్రెస్‌కు ఊపిరి -
అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విక్టరీ
గువాహటి: రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్న కమలదళానికి అస్సాం ఓటర్లు మరోసారి పట్టంకట్టారు. దశాబ్దకాలంగా సవ్యంగా పరిపాలన సాగిస్తున్న బీజేపీయే మరో సారి తమను పరిపాలించాలని అస్సాం ఓటర్లు ఖాయం చేసుకున్నారు. సోమవారం అస్సాం శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని తన అధికారాన్ని పదిలపర్చుకుంది. అస్సాంలో బీజేపీకి ఇది హ్యాట్రిక్ విజయం. కాంగ్రెస్‌ను వీడి కమలతీర్థం పుచ్చుకున్ననాటి నుంచి అహర్నిశలు పార్టీ కోసం, ప్రజల కోసం పాటుపడుతున్న బీజేపీ రాష్ట్ర దిగ్గజనేత హిమంత బిశ్వ శర్మకు అస్సామీలు మరోసారి జైకొట్టారు. అస్సాం అసెంబ్లీలోని 126 స్థానాలకు ఏప్రిల్ 9వ తేదీన ఒకే దఫాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 82 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 19 స్థానాలతో సరిపెట్టుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి పార్టీ అయిన బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్) 10 చోట్ల గెల్చింది. అసోం గణ పరిషద్ 10 చోట్ల విజయం సాధించింది. ఏఐయూడీఎఫ్, రాయ్జోర్ దళ్ పార్టీలు చెరో రెండు స్థానాల్లో గెలిచాయి. తృణమూల్ కాంగ్రెస్ ఒకే ఒక్క నియోజకవర్గంలో నెగ్గింది. మహిళా మంత్రి అజంతా నియోగ్ మొదలు పిజూశ్ హజారికా, రనోజ్ పెగూ దాకా హిమంత కేబినెట్ మంత్రుల్లో చాలా మంది గెలిచారు. జలుక్బారీ నియోజకవర్గంలో కాంగ్రెస్ మహిళా అభ్యర్థి బిదిషా నియోగ్ కంటే ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వేల ఓట్లు అధికంగా సాధించి గెలుపుబావుటా రెపరెపలాడించారు. జలుక్బారీ నుంచి హిమంత వరసగా ఆరో సారి విజయం సాధించడం విశేషం. పాతికేళ్లుగా జలుక్బారీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న హిమంత 2001లో ఇక్కడ తొలివిజయం రుచిచూశారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్‌కు బై చెప్పి కమలదళంలో చేరిన కాంగ్రెస్ సీనియర్ మాజీ మంత్రి ప్రద్యూత్ బోర్డోలాయ్ సైతం దిస్పూర్ నియోజకవర్గంలో విజయకేతనం ఎగరేశారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మీరా బోర్‌ఠాకూర్ గోస్వామి కంటే ప్రద్యూత్ 49,667 ఓట్లు ఎక్కువ సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్ జొర్హాట్ స్థానంలో ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గోస్వామి చేతిలో గొగోయ్ ఓడిపోయారు. జాగిరోడ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి íపీయూష్ హజారికా సమీప కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ బుబుల్ దాస్‌పై ఏకంగా 93,584 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జాగిరోడ్‌లో హజారికాకు ఇది వరసగా నాలుగోవిజయం. ఎన్డీ ఏ కూటమి పార్టీ అసోం గణ పరిషద్ అధ్యక్షుడు అతుల్ బోరా సోమవారం బోకాఖాట్లో రాయ్ జోర్ దళ్ అభ్యర్థి హరిప్రసాద్ సైకియాపై 60,537 ఓట్ల మెజారీ్టతో గెలిచారు. బిన్నాఖండీలో అస్సాం జాతీయ పరిషద్ అభ్యర్థి రీజౌల్ కరీం చౌదరి కంటే ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) నేత మొహమ్మద్ బద్రుద్దీన్ అజ్మల్ 35 వేల ఓట్ల మెజారీ్టతో విజయం సాధించారు. సంబరాల్లో మునిగిన శ్రేణులు పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించిందన్న వార్త తెల్సి రాష్ట్రంలో బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గువాహటిలో అస్సాం బీజేపీ రాష్ట్ర కార్యాలయం(వాజ్పేయీభవన్) వద్ద పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు చేరుకుని సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. బీజేపీ కార్యాలయం బయట వైష్ణవభక్తి ఉద్యమ కళాకారులు నగర సంకీర్తన చేశారు. కార్యకర్తలు హిమంతకు అనుకూలంగా నినాదాలుచేశారు. భారత్‌మాతాకీ జై అని నినదించారు. పార్టీ ఘనవిజయంపై అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా సంతోషం వ్యక్తంచేశారు. ఐదేళ్ల క్రితం పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిన కారణంగానే ఓటర్లు మళ్లీ తమకే అధికారం కట్టబెట్టారు. రాష్ట్రంలో 55 ఏళ్ల కాంగ్రెస్ అరాచక పాలనను మా పదేళ్ల అద్భుత పాలనతో పోల్చుకుని చివరకు మావైపే ఓటర్లు నిలబడ్డారు’’అని సైకియా విశ్లేíÙంచారు. ‘‘ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి హిమంత ప్రజలకు అనుకూలంగా చేపట్టిన పథకాలతో ఈ విజయం సాధ్యమైంది. ఈ గెలుపు ముమ్మాటికీ ప్రజలదే. ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. ఇవి నిజమైన ఆనందభాష్పాలు’’అని బీజేపీ అధికార ప్రతినిధి మిటానాథ్ బోరా ఏడుస్తూ చెప్పారు. -
కేరళలో యూడీఎఫ్.. తదుపరి సీఎం ఇతనే?
తిరువనంతపురం: దశాబ్దకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) కేరళలో అధికారపీఠాన్ని కైవసంచేసుకుంది. రాష్ట్ర శాసనసభలో మొత్తం 140 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి ఏకంగా 102 స్థానాల్లో ఘన విజయం సాధించింది. కేరళలో గెలిచి కాంగ్రెస్ దక్షిణాదిన మూడో రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టబోతోంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొలువుతీరిన విషయం తెల్సిందే. కేరళలో వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన వామపక్ష పారీ్టల సారథ్యంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) కూటమి ఈసారి అధికారానికి ఆమడదూరంలో ఆగిపోయింది. శబరిమల ఆలయ వివాదం మొదలు ముఖ్యమంత్రి కుటుంబసభ్యుల అవినీతి, ప్రభుత్వవ్యతిరేకత దాకా ఎన్నో అంశాలు అధికారకూటమి పుట్టిముంచాయి. దీంతో ఎల్డీఎఫ్ కూటమి కేవలం 35 చోట్ల గెలిచింది. కొన్ని జిల్లాల్లో ఎల్డీఎఫ్ పార్టీల అభ్యర్థులు ఒక్కరు కూడా గెలవలేదు. 50 ఏళ్ల తర్వాత దేశంలో..ప్రభుత్వ వ్యతిరేకత అనూహ్యంగా పెరిగిపోవడంతో ఆ ధాటికి ఐదేళ్లు మంత్రిపదవులు వెలగబెట్టిన వీణా జార్జ్, ఆర్ బిందు, కేబీ గణేశ్, వీఎన్ వాసనన్సహా 13 మంది నేతలు సోమవారంనాటి ఫలితాల్లో ఓటమిని చవిచూడకతప్పలేదు. 21 మంది కేబినెట్ మంత్రుల్లో ముఖ్యమంత్రి విజయన్, పీఏ మొహమ్మెద్ రియాస్, కె.రాజన్, జీఆర్ అనిల్, కేఎన్ బాలగోపాల్, పీ.ప్రసాద్, సాజి చెరియాన్ మాత్రం గెలిచారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధర్మదం స్థానంలో విజయం సాధించారు. సీపీఐ(ఎం) పార్టీలో అత్యధిక మంది అభ్యర్థులు ఓడిపోయారు. ముఖ్యంగా కేరళ కాంగ్రెస్(ఎం) పార్టీ అభ్యర్థులు ఒక్కరు కూడా గెలవలేదు. ఎల్డీఎఫ్ కనీ్వనర్ టీపీ రామకృష్ణన్ సైతం తన సిట్టింగ్ స్థానం పెరాంబ్రలో ఓడిపోయారు. కేరళలో ఓటమితో వామపక్ష పారీ్టలు తొలిసారిగా 50 ఏళ్ల తర్వాత దేశంలో మరే రాష్ట్రంలోనూ అధికారంలోలేకుండా పోయాయి. ద్విముఖ పోరుగా తయారైన కేరళలో హిందూత్వ బీజేపీ తొలిసారిగా మూడుచోట్ల విజయం సాధించి పార్టీ విస్తరణకు ఉపక్రమించింది. తిరువనంతపురం కార్పోరేషన్ పరిధిలోని నిమోమ్, కళాకూట్టం నియోజకవర్గాలతోపాటు కొల్లం జిల్లాలోని ఛథనూర్లలో బీజేపీ అభ్యర్థులు విజయబావుటా ఎగరేశారు. కేరళ శాసనసభలో విపక్ష నేత, కాంగ్రెస్ అభ్యర్థి వీడీ సతీశన్ పరవూర్ నియోజకవర్గంలో సీపీఐ నేత ఈటీ టైసన్ మాస్టర్‌పై 20,600 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తొలి 17 రౌండ్లలో వెనుకబడిన సతీశన్ తర్వాత పుంజుకుని జయకేతనం ఎగరేశారు. 2001 నుంచి వరసబెట్టి ఇక్కడి నుంచే సతీశన్ గెలుస్తున్నారు. ఈయనకు ఇది ఐదో విజయం. ఈసారి ఎన్నికల్లో అన్ని పారీ్టల నుంచి 11 మంది మహిళా అభ్యర్థులు గెలుపొందారు. ముఖ్యమంత్రి రేసులో కాంగ్రెస్ అగ్రనేత సతీశన్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగుపడ్డ ఓట్ల శాతం ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్ల శాతం బాగా మెరుగుపడింది. పోలైన ఓట్లలో కాంగ్రెస్ 28.79 శాతం ఓట్లను సాధించింది. తర్వాత సీపీఐ(ఎం) 21.77 శాతం ఓట్లను సాధించింది. తర్వాత కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమిలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) 11.01 శాతం ఓట్లు సాధించింది. అయితే స్థానిక ఎన్నికల్లో 15 శాతం ఓట్లను సాధించిన బీజేపీ తాజా ఫలితాల్లో కేవలం 11.42 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. సీపీఐ 6.64 శాతం ఓట్లు సాధించింది. సోమవారం ఓట్ల లెక్కింపు తర్వాత కూటమి ఓడిపోయిన వార్త తెలియగానే ముఖ్యమంత్రి పదవికి సీపీఎం అగ్రనేత పినరయి విజయన్ రాజీనామాచేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు అందజేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని విజయన్‌కు గవర్నర్ సూచించారు.ఇది కూడా చదవండి: దీదీ పతనం.. కాంగ్రెస్‌కు ఊపిరి -
అస్సాం: 3జీలను మించిన మామ
అస్సాంలో బ్రాహ్మణనేతను ఎలాగైనా ఓడించాల్సిందేనన్న ఏకైక నినాదంతో ఎన్నికల బరిలో దిగిన మూడు కీలక పార్టీలు చతికిలపడ్డాయి. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్(జీ), రాయ్జోర్ దళ్ నేత అఖిల్ గొగోయ్(జీ), అస్సాం జాతీయ పరిషద్ నేత లురిన్జ్యోతి గొగోయ్(జీ) ఇలా అహోం వర్గానికి చెందిన మూడు పార్టీల (జీ) అగ్రనేతల ఎన్నికల వ్యూహాలను బీజేపీ నాయకుడు హిమంత బిశ్వశర్మ మరోసారి పటాపంచలు చేశారు.ఎగువ అస్సాంలో భారీగా పెరిగిన మద్దతు అహోం వర్గీయులు ఎక్కువగా నివసించే ఎగువ అస్సాంలో కాంగ్రెస్ హవా కొనసాగేది. ఆ సంస్కృతికి ఈసారీ హిమంత చరమగీతంపాడారు. ఎగువ అస్సాంను హిమంత అభివృద్ధి పథంలో పరుగులుపెట్టించాడు. రాష్ట్రంలో కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండటం హిమంతకు బాగా కలిసొచి్చంది. ఎన్నో ప్రాజెక్టులను రాష్ట్రానికి ముఖ్యంగా ఎగువ అస్సాంలో అమలుపరిచి అభివృద్ధిఫలాలు స్థానికులకు అందేలాచేశారు. గువాహటి–దిబ్రూగఢ్ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంతో ఈ మార్గంలో ప్రయాణసమయంలో భారీగా తగ్గింది. పలు జాతీయరహదారుల ప్రాజెక్టులు, నాలుగు లేన్ల రోడ్లు, వంతెనలు పూర్తిచేశారు. దీంతో పొరుగున ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌తో అనుసంధానం పెరిగింది. అత్యవసర సమయాల్లో యుద్ధవిమానాలు దిగడానికి వీలుగా ల్యాండింగ్ స్ట్రిప్ నిర్మించారు.దిబ్రూగఢ్‌లో సర్వతోముఖాభివృద్ధికి కృషి.. రాష్ట్రంలో రెండో రాజధానిలా దిబ్రూగఢ్ నగరాన్ని హిమంత తీర్చిదిద్దారు. ఇక్కడే నూతనంగా శాసనసభ భవనం, ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మించారు. దీంతో కేవలం ఒక్క నగరంలో పరిపాలన కేంద్రీకృతంకాకుండా వికేంద్రీకరణ సిద్ధాంతాన్ని హిమంత విజయవంతంగా అమలుచేశారు. హిమంత మార్గదర్శకంలో డిస్పూర్, దిబ్రూగఢ్‌లలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువయ్యాయి. దిబ్రూగఢ్ విశ్వవిద్యాలయం కోసం అత్యధిక నిధులు వెచి్చంచారు. అస్సాం వైద్యకళాశాలను విస్తరించారు. మరో రెండేళ్లలో ఊహించనంత అభివృద్ధిచేసి చూపుతానని హిమంత గతంలోనే చేసిన ప్రకటన ఎన్నికల ఫలితాలపై బాగా ప్రభావం చూపింది. అందరూ మెచ్చిన మామ మేనమామతో ఉండే ఆతీ్మయానుబంధం అందరికీ చిరపరిచితమే. అంతే మమకారం ప్రజలపై హిమంత చూపారు. అందుకే అస్సాంలో ఆయనను అందరూ మామా అని ఆప్యాయంగా పిల్చుకుంటారు. నేనూ మీలో ఒకడిని, మనందరం ఒకే కుటుంబం అనేభావనను హిమంత విజయవంతంగా ప్రజల మనసుల్లో నాటారు. అందుకే ఎంతో మంది నేరుగా హిమంతకు తమ కష్టసుఖాలను చెప్పుకునేవారు. వాటిని తీరుస్తూ హిమంత ఓటర్లకు మరింత చేరువయ్యారు.మౌలికసదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టిరాష్ట్రంలో మౌలికసదుపాయాల కల్పనకు హిమంత అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. బ్రహ్మపుత్ర నదీ సొరంగం, కజిరంగా ఎలివేటెడ్ కారిడార్, సెమీకండక్టర్ ప్లాంట్ స్థాపన కోసం ఏకంగా 300 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం వంటివి హిమంత గెలుపునకు దోహదంచేశాయి. బీజేపీ–ఆర్ఎస్ఎస్ మూలాలున్న నేతకావడంతో పక్కా వ్యూహరచన, అమలులో బిశ్వశర్మది రాటుదేలారు. గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి అనుభవం, ఆ పార్టీలోని లోటుపాట్లపైనా హిమంతకు బాగా పట్టుంది.అహోం వర్గీయులను అక్కున చేర్చుకునేందుకు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్(జీ), రాయ్జోర్ దళ్ నేత అఖిల్ గొగోయ్(జీ), అస్సాం జాతీయ పరిషద్ నాయకుడు లురిన్జ్యోతి గొగోయ్(జీ) చేసిన ప్రయత్నాలను హిమంత వమ్ముచేశారు. బంగ్లాదేశీ చొరబాటుదారులతో యావత్ అస్సాంకు ముప్పువాటిల్లుతోందని హిమంత ఎన్నికల్లో చెప్పారు. మియా ముస్లిం వర్గీయులపై హిమంత తీసుకునే చర్యలను ఓటర్లు సమర్థించే పరిస్థితి తీసుకొచ్చారు.రాష్ట్రంలోని హిందువులను ఏకతాటి మీదకు తీసుకురావడంలో సఫలమయ్యారు. చొరబాటుదారులు స్థానికుల నుంచి భూములు లాక్కుంటున్నారన్న వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. తన ప్రభుత్వంలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఓటర్లు నమ్మేలాచేశారు. ముస్లిం మియాలు స్థానిక గిరిజనులను పెళ్లాడి వాళ్ల గిరిజనభూములను లాక్కుంటున్నారని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలకు ఈ ముగ్గురు గొగోయ్‌ల పార్టీల నుంచి దీటైన పరిష్కార స్పందన కరువైంది. అయోధ్య రామాలయం, ఉమ్మడి పౌరస్మృతి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ల నుంచి చొరబాట్ల అంశాలపై మాట్లాడుతూ జాతీయవాదిగా పేరు తెచ్చుకున్నారు. -
ముగిసిన విజయన్ శకం
తిరువనంతపురం: కేరళ రాజకీయ చరిత్రలో 2026 మే 4 తేదీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి ఓటమి చవిచూడగా.. రాష్ట్రంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరైన పినరయి విజయన్ కూడా ఒక మలుపుగా నిలుస్తుంది. వరుసగా 16 ఏళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన సీపీఎం కూటమికి, అలాగే, వరుసగా రెండు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయన్‌కు ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. 81 ఏళ్ల విజయన్, ఒక సామాన్య కార్మిక వర్గ నేపథ్యం నుంచి కేరళకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. సంవత్సరాలు గడిచేకొద్దీ, ఆయన తిరుగులేని అధికార కేంద్రంగా ఎదిగారు. గత దశాబ్ద కాలంగా పార్టీని, ప్రభుత్వాన్ని తిరుగులేకుండా నడిపించారు. ఆయన నేతృత్వంలో సీపీఎం కూడా తన పాత నాయకత్వ పద్ధతి నుంచి క్రమంగా వైదొలుగుతూ సామాజిక మార్పును సంతరించుకుంది.క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పేరుగాంచిన విజయన్.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తన సుదీర్ఘ పదవీకాలంలో కఠినమైన నిర్వాహకుడిగా పేరు సంపాదించారు. 2026లో, విజయన్ వరుసగా మూడోసారి అధికారం చేపట్టాలనే అరుదైన ప్రయత్నంలో, వామపక్షాలకు నాయకత్వం వహించి మరోసారి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. కానీ ఈసారి పరిస్థితి తారుమారైంది. ఆయన సొంత జిల్లా అయిన కన్నూర్‌లోని తమ సంప్రదాయ కంచుకోటతో సహా పలుచోట్ల సీపీఎం నేతృత్వంలోని కూటమి పట్టు కోల్పోయింది.ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని... ’దృఢమైన పరిపాలనా పట్టుకలిగిన కఠినమైన కమ్యూనిస్ట్’గా వర్ణించబడే విజయన్.. రాజకీయ సంప్రదాయాలను బద్దలు కొడుతూ, 16 ఏళ్లపాటు పారీ్టకి, వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్రానికి నాయకత్వం వహించి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నారు. చేనేత కార్మికుడిగా... విజయన్ 1944లో కన్నూర్ జిల్లాలోని పినరయిలో ముండయిల్ కోరన్, కళ్యాణి దంపతులకు జన్మించారు. థలస్సేరిలోని బ్రెన్నెన్ కాలేజీలో బీఏ (ఎకనామిక్స్) చదువుతున్న సమయంలో కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్‌కు కన్నూర్ జిల్లా కార్యదర్శిగా చేశారు. పాఠశాల విద్య పూర్తయ్యాక ఉన్నత విద్యకు వెళ్లేముందు ఏడాది పాటు చేనేత కార్మికుడిగా పనిచేశారు. తర్వాత కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. 1968వ సంవత్సరంలో 24 ఏళ్ల వయసులో విజయన్ సీపీఎం కన్నూర్ జిల్లా కమిటీ సభ్యుడిగా చేరారు. రెండేళ్ల తర్వాత కూత్తుపరంబ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి 26 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.1996 నుండి 1998 వరకు కేరళ విద్యుత్ శాఖ మంత్రిగా కొంతకాలం పనిచేశారు. అయితే, జల విద్యుత్ ప్రాజెక్టుల ఆధునీకరణ కోసం ఒక కెనడా కంపెనీకి కాంట్రాక్టులు అప్పగించడానికి సంబంధించిన ఎస్ఎన్సీ–లావలిన్ కేసు ఆరోపణలు చాలా సంవత్సరాలు ఆయనను వెంటాడాయి, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన సమయంలో విజయన్‌కు, ఆయన ప్రత్యర్థి వీఎస్ అచ్యుతానందన్ మధ్య అంతర్గత వివాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో 2007లో పార్టీ పొలిటికల్ బ్యూరో నుంచి సైతం కొంతకాలం ఇద్దరినీ సస్పెండ్ చేశారు. బంగారం స్మగ్లింగ్ కేసు, డాలర్ స్మగ్లింగ్ కేసు, స్ప్రింక్లర్ ఒప్పందం, తన మాజీ ముఖ్య కార్యదర్శి ఎం.శివశంకర్‌పై వచి్చన ఆరోపణలతో సహా పలు వివాదాలు ఆయన చుట్టూ ముసురుకున్నాయి. -
ఇది పెద్ద దెబ్బే.. ‘లెఫ్ట్’ కళ తప్పింది!
న్యూఢిల్లీ: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ). ఒకప్పుడు కీలకమైన, బలమైన పార్టీ. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1951–52లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన ప్రతిపక్షం. ఆ తర్వాత పశి్చమ బెంగాల్‌కు 23 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన సీపీఎం నేత జ్యోతిబసుకు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో 1996లో ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం సైతం వచ్చింది అయితే, పార్టీ పొలిట్‌బ్యూరో అందుకు వ్యతిరేకత తెలపడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా ఆ పార్టీయే ఒప్పుకుంది.తిరిగి 2008లో, మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వానికి 60 మంది సభ్యులున్న వామపక్ష కూటమి మద్దతు ఉపసంహరించుకుంది. భారత్– అమెరికా అణు ఒప్పందమే ఇందుకు కారణం. అప్పట్లో వామపక్షాలు కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపురల్లో అధికారంలో ఉన్నాయి. ఆ తర్వాత కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశంలో కమ్యూనిస్టుల ప్రాభవం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే స్థితికి చేరుకుంది. ఓటర్లు వామపక్ష భావనను వీడి క్రమక్రమంగా దూరంగా వెళ్లిపోతుండటమే ఇందుకు ప్రధాన కారణం. కేరళలో పినరయి విజయన్ సారథ్యంలోని లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ఓటమి కమ్యూనిస్టులకు తాజాగా పెద్ద దెబ్బ. దీంతో, 1970 తర్వాత దేశంలో కమ్యూనిస్ట్‌లు మొదటిసారిగా అధికారం కోల్పోవడం గమనార్హం. చారిత్రక విజయం.. దేశ రాజకీయ చరిత్రలో వామపక్షాలది విశిష్టమైన స్థానం. 1951–52లో దేశంలో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో, లోక్‌సభలోని ప్రతిపక్ష పార్టీలన్నింటిలోనూ అత్యధిక స్థానాలను గెలుచుకున్నది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) మాత్రమే. కేవలం ఐదేళ్ల తర్వాత, 1957లో కేరళ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రపంచంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వంగా నిలిచి వామపక్షాలు చరిత్ర సృష్టించాయి.కంచు కోటలు బెంగాల్, త్రిపుర 1977లో పశి్చమ బెంగాల్లో సీపీఎం అధికారాన్ని దక్కించుకుంది. దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ఒకే పార్టీ సుదీర్ఘకాలం పాటు పాలించిన రికార్డు సృష్టించింది. ఆ పార్టీ నేత జ్యోతి బసు ముఖ్యమంత్రిగా 23 ఏళ్లపాటు కొనసాగారు. ఆ తర్వాత 2000లో బుద్ధదేవ్ భట్టాచార్య బాధ్యతలు చేపట్టారు. మరో 11 ఏళ్ల పాటు అక్కడ వామపక్షాల పాలన సాగింది. కేరళలో అధికారం మారుతూ వచ్చినప్పటికీ, త్రిపురలో మాత్రం వామపక్షాలు సుస్థిర విజయాన్ని అందుకున్నాయి. 1993లో త్రిపురలో 60 స్థానాలకు గాను 44 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేశాయి. దశరథ్ దేబ్ 1998 వరకు, ఆపై మాణిక్ సర్కార్ వరుసగా 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. క్షీణత..ఆపై పతనం: వామపక్షాల క్షీణత ముందుగానే మొదలైనప్పటికీ, 2011లో అది పతనం దిశగా సాగింది. నందిగ్రామ్, సింగూర్ భూసేకరణ నిరసనలతోపాటు మార్పు నినాదంతో ముందుకు వచి్చన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో విజయం సాధించింది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో 2006లో వామపక్ష కూటమికి 235 సీట్లుండేవి. టీఎంసీ దెబ్బకు వామపక్ష కూటమి బలం 62 స్థానాలకు పడిపోయింది. ఆ తర్వాత త్రిపురలో కూడా కమ్యూనిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం దేశ రాజకీయాల్లో కీలక పరిణామం. అప్పట్లో దేశవ్యాప్తంగా వచి్చన కాషాయ అనుకూల పవనాల తాకిడికి వామపక్షాల కంచుకోట త్రిపుర కూడా కూలిపోయింది. అసెంబ్లీలోని 60 స్థానాల్లో బీజేపీ 36 గెలుచుకోగా, కమ్యూనిస్టుల బలం 50 నుంచి కేవలం 16కి పడిపోయింది. ఆ ఒక్కటీ పోయింది ఆ తర్వాత కాలంలో వామపక్షాలకు ఊరటగా నిలిచింది కేరళ మాత్రమే. 2016లో పినరయి విజయన్ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన లెఫ్ట్ ఫ్రంట్, 2021లో కూడా మళ్లీ గెలిచి కేరళలో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుందనే ఆనవాయితీని తిరగరాసింది. అయితే, తాజా ఎన్నికల్లో వామపక్షాలు దక్షిణాది రాష్ట్రాన్ని కూడా కోల్పోయాయి. మొత్తం 140 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మెజారిటీ సీట్లను గెల్చుకుంది. -
దీదీ పతనం.. కాంగ్రెస్‌కు ఊపిరి
పశ్చిమ బెంగాల్ తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారాయి. పైపైన చూస్తే ఇది అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై భారతీయ జనతా పార్టీ సాధించిన అద్భుత విజయంగా మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ ఫలితాల లోతుల్లోకి వెళితే ఒక ఆసక్తికరమైన రాజకీయ కోణం దాగి ఉంది. దశాబ్ద కాలంగా బెంగాల్లో నామమాత్రంగా మిగిలిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు మళ్లీ ప్రాణం పోశాయి. మమతా బెనర్జీ ఓటమి కాంగ్రెస్‌కు శుభవార్తగా మారిందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చగా మారింది.శూన్యం నుంచి.. మళ్లీ మొదలైన ప్రస్థానం2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ ఈ తాజా ఎన్నికల్లో కనీసం రెండు నియోజకవర్గాల్లోనైనా జెండా ఎగురవేయగలిగింది. ముర్షిదాబాద్ జిల్లాలోని ఫరక్కా, రాణినగర్ స్థానాల్లో కాంగ్రెస్ సాధించిన అనూహ్య విజయం కేవలం అంకెల పరమైన పెరుగుదల మాత్రమే కాదు. ఫరక్కాలో కాంగ్రెస్ అభ్యర్థి మోతాబ్ షేక్ 63,050 ఓట్లు సాధించి, తన సమీప బీజేపీ అభ్యర్థిపై 8,193 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ ఒకప్పటి బలమైన అధికార పార్టీ టీఎంసీ 47,256 ఓట్లతో ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది.ముక్కోణపు పోటీలో.. ఆశ్చర్యకరమైన ఫలితాలురాణినగర్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి జుల్ఫికర్ అలీ హోరాహోరీ పోరులో టీఎంసీపై 2,701 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ సీపీఐ(ఎం) మరింత వెనుకబడగా, బీజేపీ ఏకంగా నాలుగో స్థానానికి పరిమితమైంది. ముర్షిదాబాద్ జిల్లాలో ఒకప్పుడు కేవలం టీఎంసీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఉన్న ద్విముఖ పోరు.. ఇప్పుడు బహుముఖ పోటీగా మారిందని ఈ రెండు స్థానాల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మైనారిటీలు, గ్రామీణ ఓటర్లపై టీఎంసీకి ఉన్న పట్టు సడలడమే ఈ పరిణామాలకు ప్రధాన కారణం.ఓట్ల చీలికతో.. కాంగ్రెస్‌కు కలిసొచ్చిన కాలంటీఎంసీ ఓటు బ్యాంకు చీలిపోవడం కాంగ్రెస్‌కు పరోక్షంగా లాభించింది. అధికార పార్టీకి దూరమైన ఓట్లన్నీ నేరుగా బీజేపీకే వెళ్లిపోలేదు. ఆ ఓట్లు విడిపోయి, స్థానికంగా సంస్థాగత బలం ఉన్న చిన్న పార్టీలకు, ముఖ్యంగా కాంగ్రెస్‌కు మళ్లాయి. దీనిని కాంగ్రెస్ వైపు వీచిన గాలి అనడం కంటే, టీఎంసీ పతనంతో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేసే ప్రక్రియ అనడం వాస్తవం. అధికార పార్టీ బలహీనపడటం వల్ల బీజేపీ విస్తరణకు మార్గం సుగమం అయినప్పటికీ, ఏకకాలంలో కాంగ్రెస్‌కు కొన్ని చోట్ల అనుకూల వాతావరణం ఏర్పడింది.అధిర్ రంజన్ ఇలాకాలో.. అనూహ్య పరిణామంరాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటు శాతం కేవలం 3 శాతానికి అటూఇటుగా ఉన్నప్పటికీ, మైనారిటీ ప్రాబల్య ప్రాంతాల్లో ఆ పార్టీ ప్రభావం తీవ్రంగా కనిపించింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరికి కంచుకోటగా ఉన్న బహరంపూర్‌లో బీజేపీ నిర్ణయాత్మక విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా, టీఎంసీ మరింత బలహీనపడి కిందకు పడిపోయింది. చౌదరికి ఇది వ్యక్తిగతంగా పెద్ద ఎదురుదెబ్బ అయినప్పటికీ, అధికార వ్యతిరేక ఓటును ఆకర్షించడంలో కాంగ్రెస్ ద్వితీయ ప్రత్యామ్నాయంగా నిలిచిందని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.‘ఇండియా’ కూటమిలో.. మమతకు తగ్గిన పట్టుపశ్చిమ బెంగాల్లో టీఎంసీ పతనం కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాలేదు, ‘ఇండియా’ కూటమిలోని అంతర్గత సమీకరణలను కూడా సమూలంగా మార్చేసింది. బీజేపీని ధీటుగా ఎదుర్కోగలిగేది ప్రాంతీయ పార్టీలేనని, ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే సత్తా కాంగ్రెస్‌కు లేదని ఇన్నాళ్లూ మమతా బెనర్జీ బలంగా వాదిస్తూ వచ్చారు. అయితే తన సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీకి ఎదురైన పరాభవం కూటమిలో ఆమె ప్రభావాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.పునర్వైభవం కాదు.. మనుగడకు మార్గంమమత పరాజయంతో ఇండియా కూటమిలో నాయకత్వ పోరు తగ్గుముఖం పట్టి, కూటమి పగ్గాలపై కాంగ్రెస్‌కు పరోక్షంగా మరింత స్వేచ్ఛ లభించింది. అయితే, బెంగాల్ ఫలితాలను కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి పునర్వైభవంగా భావించడానికి వీల్లేదు. రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ పతనంతో లబ్ధి పొంది బీజేపీ ప్రధాన ప్రత్యామ్నాయంగా స్థిరపడింది. అయితే, ముర్షిదాబాద్‌లో లభించిన విజయాలు కాంగ్రెస్ ఉనికికి ఊపిరిపోశాయి. బెంగాల్ రాజకీయ చిత్రం నుంచి దాదాపు కనుమరుగైపోయిన ఒక జాతీయ పార్టీకి, ఫరక్కా, రాణినగర్ ఫలితాలు లబ్ధి చేకూర్చాయని నిపుణులు అంటున్నారు.ఇది కూడా చదవండి: కామ్రేడ్లకు భారీ షాక్.. చివరి కోట పతనం! -
ద్రవిడ అధికార శకానికి ముగింపు
సాక్షి, చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకే ద్రవిడ పార్టీల ఐదు దశాబ్ధాల పాలనా శకానికి టీవీకే ముగింపు పలికింది. తమిళనాడులో 1962లో ద్రవిడ పార్టీగా డీఎంకే ఎన్నికలకు వెళ్లగా 50 స్థానాలతో ప్రతిపక్షంలో కూర్చుంది. 1967 ఎన్నికల్లో అన్నాదురై నేతృత్వంలో డీఎంకే తొలిసారిగా అ«ధికార పగ్గాలు చేపట్టింది. ఆయన మరణం తర్వాత 1969లో కరుణానిధి డీఎంకే అధ్యక్షపగ్గాలతో పాటు తమిళనాడు సీఎం కురీ్చని కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో సినీ నటుడు ఎంజీఆర్, కరుణానిధి మధ్య నెలకొన్న వివాదంతో అన్నాడీఎంకే ఆవిర్భవించింది. 1977 ఎన్నికల్లో తొలిసారిగా ఎంజీఆర్ నేతృత్వంలోని అన్నాడీఎంకే అధికారాన్ని దక్కించుకుంది. మరణించే వరకు ఎంజీఆర్ సీఎంగా కొనసాగారు. తర్వాతి పరిణామాలతో 1989లో వచ్చిన ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి రెండు పార్టీల ప్రభుత్వాలు వరుసగా మారుతూ వచ్చాయి. 1991లో అన్నాడీఎంకే, 1996లో డీఎంకే, 2001లో అన్నాడీఎంకే, 2006లో డీఎంకే అధికారం చేపట్టాయి. 2011 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన దివంగత సీఎం జయలలిత తన రాజకీయ గురువు ఎంజీఆర్ రికార్డును తిరగరాస్తూ 2016లో మళ్లీ గెలిచారు. ఆమె మరణం తదుపరి పరిణామాలతో 2021 ఎన్నికల్లో డీఎంకే గద్దె నెక్కింది. డీఎంకే దివంగత అధినేత కరుణానిధి వారసుడైన స్టాలిన్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఇలా డీఎంకే, అన్నాడీఎంకే అంటూ అధికారం సాగుతూ వచ్చిన సమయంలో తమిళనాడులో మూడోశక్తిగా అవతరించిన విజయ్ రూపంలో ద్రవిడ పార్టీల అధికార శకానికి ముగింపు పలికినట్లయింది. -
49 ఏళ్ల రికార్డు బద్దలు
జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్, దళపతి విజయ్ పూర్తి పేరు. తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్రను నెలకొల్పారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే అధికారం చేతులు మారుతూ వస్తోంది. మూడో శక్తిగా ఎదిగేందుకు యత్నించిన ఎందరో సినీ దిగ్గజాలకు ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. 1970ల తర్వాత ఎంజీ రామచంద్రన్ సాధించిన అద్భుతమైన విజయాన్ని మళ్లీ ఎవరూ పునరావృతం చేయలేకపోయారు. ఇప్పుడు విజయ్ ఆ పాత రికార్డులను చెరిపి వేసి, కొత్త ప్రత్యామ్నాయంగా ఎదిగారు. నాడు.. నేడు నాటి ఎంజీ రామచంద్రన్‌కు, నేటి విజయ్‌కు కలిసొచ్చిన పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఎంజీఆర్ సినిమాలతో ప్రజాదరణ పొంది డీఎంకే నుంచి బయటకు వచ్చారు. పార్టీని ఏర్పాటు చేసిన ఆయనకు సొంత చరిష్మా, ప్రకటించిన సంక్షేమ పథకాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. అలా తిరుగులేని మెజారిటీ అధికారాన్ని దక్కించుకుని చరిత్ర సృష్టించారు. 1977లో సీఎం పదవిని చేపట్టిన ఆయన 1987లో మరణించే వరకు దశాబ్ద కాలంపాటు కొనసాగారు. తనపై ప్రజలకున్న అభిమానాన్ని ఒక పటిష్టమైన రాజకీయ భావోద్వేగంగా మార్చుకున్నారు. వ్యక్తిత్వం, రాజకీయం ఎలా కలిసి ఉండాలో ఆచరించి చూపారు. నేడు విజయ్‌కి అనుకూలించిన అంశాలు వేరేగా ఉన్నాయి. యువతలో ఆందోళనలు, ప్రస్తుత పాలనపై ప్రజల్లో ఉన్న విసుగు, స్వచ్ఛమైన రాజకీయ మార్పు కావాలనే బలమైన ఆకాంక్ష.. వీటినే విజయ్ తనవాణిగా మార్చుకున్నారు. తాజాగా ఎన్నికల్లో విజయం సాధించారు. గత 49 ఏళ్లలో ఏ సినీ నటుడు సాధించని అద్భుతాన్ని సుసాధ్యం చేశారు. 1977లో ఎంజీ రామచంద్రన్ తమిళనాడు రాజకీయాలను తిరగరాసిన తర్వాత, ఒక నటుడు నేరుగా ముఖ్యమంత్రి కావడం ఇదే మొదటిసారి. ఎంజీఆర్ తర్వాత సినీ గ్లామర్‌తో సెయింట్ జార్జి కోటలోని తమిళనాడు అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. జయలలిత ప్రస్థానం వేరు ఎంజీఆర్ తర్వాత ఎందరో నటులు భారీ అభిమాన గణంతో ఇలాంటి ప్రయత్నమే చేసినప్పటికీ ఆయన రికార్డును అధిగమించలేకపోయారు. జయలలిత కూడా గొప్ప సినీ నటి అయినప్పటికీ, సొంతంగా పార్టీని స్థాపించి అధికారంలోకి రాలేదు. ఆమె ఎంజీఆర్ నెలకొల్పిన అన్నాడీఎంకేను వారసత్వంగా పొంది, దానిని పటిష్టం చేసి అ«దీనంలోకి తెచ్చుకోవడం ద్వారానే ముఖ్యమంత్రి అయ్యారు. అట్టడుగు స్థాయి నుంచి నిర్మాణం కేవలం రెండేళ్ల క్రితం స్థాపించిన విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) 100 సీట్లకు పైగా గెలుచుకుంది. దీని వెనుక ముందుచూపు, పక్కా ప్రణాళిక, తీవ్రమైన కృషి ఉన్నాయి. విజయ్ తన అభిమాన సంఘాలను 2009 నుంచే ఒక క్రమబద్ధమైన వ్యవస్థగా మార్చడం మొదలుపెట్టారు. మక్కల్ ఇయక్కం (వీఎంఐ) పేరుతో సంఘాలన్నిటినీ ఒకే వేదికపైకి తెచ్చారు. మొదట్లో కేవలం సేవ, సంక్షేమ కార్యక్రమాలకే పరిమితమై పనిచేసినప్పటికీ, క్రమంగా వరదలు వంటి ప్రకృత్తి విపత్తుల వేళ ప్రజలకు సాయం అందించడం, పేద విద్యార్థులకు ఆసరాగా నిలవడం, స్థానిక సమస్యలపై స్పందించడం వంటి వాటి ద్వారా పోలింగ్ బూత్ స్థాయిలో జనానికి చేరువైంది. 2011లో ఏఐఏడీఎంకే నేతృత్వంలోని కూటమికి బహిరంగంగా మద్దతు తెలపడం ద్వారా విజయ్ మొదటిసారి తన రాజకీయ ఆకాంక్షను చాటారు. నటుడికి ఉన్న ఆకర్షణ ఓట్లుగా మారుతాయా లేదా అనేందుకు ఇదొక తొలి పరీక్ష అయ్యింది. సినిమాల నుంచి సిద్ధాంతాల దాకా 2010– 2020 మధ్య కాలంలో విజయ్ ప్రసంగాలను పరిశీలిస్తే రాజకీయ కోణం కని్పస్తుంది. 2019లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆయన చేసిన విమర్శలు, సినిమాకు మించిన అంశాలపై కూడా స్పందించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని నిరూపించాయి. ఆడియో లాంచ్‌లు, అభిమానుల సమావేశాలు, సేవా కార్యక్రమాల ద్వారా పరీక్షల ఒత్తిడి, నిరుద్యోగం, అవినీతి, పాలన వంటి అంశాలను ఆయన తరచూ ప్రస్తావించేవారు. ఇవి యువతను, నగరవాసులను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. స్థానిక ఎన్నికల్లోనూ సత్తా పార్టీని అధికారికంగా ప్రకటించకముందే విజయ్ తన వీఎంఐ సత్తా ఏపాటిదో నిరూపించుకున్నారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ’విజయ్ మక్కల్ ఇయక్కం’ అభ్యర్థులు పోటీ చేసిన మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. కేవలం జనాన్ని కూడగట్టడమే కాకుండా, తనకున్న పాపులారిటీని ఓట్లుగా మార్చగల శక్తి ఈ వ్యవస్థకు ఉందని ఆ ఎన్నికలు రుజువు చేశాయి. టీవీకే ఆవిర్భావం చివరికి 2024 ఫిబ్రవరిలో విజయ్ తమిళగ వెట్రి కళగం’(టీవీకే) పార్టీని అత్యంత స్పష్టమైన ప్రణాళికతో ప్రారంభించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎటువంటి ముందస్తు పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే–ఏడీఎంకేల ఏకచ్ఛత్రాధిపత్యానికి గండికొట్టి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తామని స్పష్టం చేశారు. సుమారు 70 చిత్రాలతో తన మూడు దశాబ్దాల సినీ ప్రస్థానానికి ముగింపు పలుకుతున్నట్లు కూడా ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారానే ప్రచారం గత రెండేళ్లుగా టీవీకే తన అభిమాన సంఘాలను ఒక క్రమబద్ధమైన పార్టీగా మార్చింది. జిల్లా కమిటీలు, నియోజకవర్గ విభాగాలు, బూత్ స్థాయి బృందాలను ఏర్పాటు చేసింది. విద్య, ఉపాధి, అవినీతి నిర్మూలన, జవాబుదారీతనంపై దృష్టి సారించింది. విజయ్ ఒక ఆవేశపూరిత వక్తగా కాకుండా, ప్రజల సమస్యలను వినే నాయకుడిగా తనను తాను మలుచుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలతో మమేకమవుతూ, పక్కా ప్రణాళికతో బహిరంగ సభలు నిర్వహించారు. మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూల వంటివేమీ లేకుండానే తనదైన శైలిలో ప్రచారం సాగించారు. 2025లో కరూర్‌లో టీవీకే నిర్వహించిన బహిరంగ సభ తొక్కిసలాటకు దారితీసింది. పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. విజయ్‌కు రాజకీయ నాయకుడిగా ఇది మొదటి పరీక్షగా నిలిచింది. ఆయన ఎంతో సంయమనంతో వ్యవహరించారు. తమిళనాట పెనుమార్పు 2026 ఎన్నికల ఫలితాలతో తమిళనాడు రాజకీయాల ఒరవడిని విజయ్ ఒక్కసారిగా మార్చేశారు. టీవీకే రాకతో తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే–అన్నాడీఎంకే ద్వంద్వ పోరు ఇప్పుడు ముక్కోణపు పోటీగా మారింది. ఎంజీఆర్ హయాం తర్వాత తమిళనాడులో ఇంతటి బలమైన ముక్కోణపు పోటీ మళ్లీ ఇప్పుడే కనిపిస్తోంది. ఇంతకాలం పెద్ద పార్టీల నీడలో ఉన్న చిన్న పార్టీలు ఇప్పుడు విజయ్ రూపంలో మూడో ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆంధ్రా సరిహద్దుల్లోనూ మార్మోగిన ‘విజిల్’
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లా సరిహద్దులోని తమిళనాడు అసెంబ్లీ స్థానాల్లోనూ విజయ్ పార్టీ సత్తా చాటింది. తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట, సత్యవేడు, నగరి, గంగాధరనెల్లూరు, కుప్పం సమీపంలో.. తమిళనాడు అసెంబ్లీ నియోజక వర్గాలు గుమ్మడిపూడి, తిరుత్తణి, అరక్కోణం, సోలింగరం, కంచి, కాటా్పడి, వేలూరు, తిరువళ్లూరు, క్రిష్ణగిరి, హోసూరు, తిరుపత్తూరు, బొడుగూరు, వేపనపల్లి ఉన్నాయి. ఓట్ల లెక్కింపులో గుమ్మడిపూడి, అరక్కోణం, కంచి, కాట్పాడి, తిరువళ్లూరు, క్రిష్ణగిరి, హోసూరు, తిరుపత్తూరు అసెంబ్లీ స్థానాల్లో విజయ్ టీవీకే పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు ఈ నియోజక వర్గాల్లో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఫలితాలపై జిల్లా వాసుల ఆసక్తి ⇒ తమిళనాడులో జరిగిన ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు ఆసక్తి చూపించారు. సరిహద్దు గ్రామాల ప్రజలతో పాటు చిత్తూరు, గంగాధరనెల్లూరు, సత్యవేడు, నగరి, సూళ్లూరుపేట, తిరుపతి వాసులు ఉదయం నుంచి టీవీలు, మొబైల్ ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు తమిళనాడు ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు ఆరాట పడ్డారు. విజయ్ పార్టీ విజయంపై స్వీట్లు పంచిపెట్టడం కనిపించింది. వ్యాపారులు, కొందరు రాజకీయ నాయకులు తమిళనాడు ఎన్నికలపై బెట్టింగ్‌లు కాయడం గమనార్హం. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు విజయ్ పార్టీ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచిపెట్టారు. -
దీదీ పతనానికి కారణాలెన్నో..
పశ్చిమ బెంగాల్ ప్రజలతో దీదీ(అక్క) అని ఆప్యాయంగా పిలిపించుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ రాజకీయంగా సంచలనాలకు మారుపేరు. కరడుగట్టిన కమ్యూనిస్టులకే చుక్కలు చూపించిన నాయకురాలిగా 15 ఏళ్లపాటు అప్రతిహతంగా పాలన సాగించారు. వరుసగా నాలుగోసారి విజయంపై కన్నేసినప్పటికీ ఆశలు నెరవేరలేదు. దీదీని బెంగాల్ ప్రజలు తిరస్కరించారు. మరోసారి ఆమె పాలనను కోరుకోవడం లేదని తేల్చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పట్టంగట్టారు. మమతా బెనర్జీ పార్టీ పరాజయానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి ప్రభుత్వంపై వెల్లువెత్తిన వ్యతిరేకత. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోవడం, కుంభకోణాలు, మహిళలపై అఘాయిత్యాలు, కట్ మనీ సంస్కృతి, అధికార పార్టీ నాయకుల అరాచకాలను ప్రజలు సహించలేకపోయారు. మరోవైపు హిందూ ఓటు బ్యాంకు దూరం కావడం దీదీ కొంప ముంచింది. 71 ఏళ్ల మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డి పోరాటం సాగించారు. అన్ని స్థానాలకూ తానే అభ్యర్థినని చెప్పుకోగా ప్రజలు అంగీకరించలేదు. ప్రభుత్వంలో, పార్టీలో మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మితిమీరిన పెత్తనం మేనత్త ఓటమికి మరో ముఖ్య కారణమైందని సొంత పార్టీ నేతలే ఆక్షేపిస్తున్నారు. భవానీపూర్‌లో సోమవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన అభిషేక్ బెనర్జీని చూసిన బీజేపీ కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేశారు. చోర్, చోర్(దొంగ, దొంగ) అంటూ నిందించారు. ప్రజల్లో ప్రబలిన అసంతృప్తి బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) పేరిట మమతా బెనర్జీకి అతిపెద్దసవాలు ఎదురైంది. ఎస్ఐఆర్ కింద రాష్ట్రంలో దాదాపు 90 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఎస్ఐఆర్ పేరిట ఓట్ల చోరీ జరుగుతోందని, తమ మద్దతుదార్ల ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారని మమతా బెనర్జీ గగ్గోలు పెట్టినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది. ఆఖరికి సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు. తొలగింపునకు గురైన ఓటర్లలో చాలామంది తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదార్లేనని తెలుస్తోంది. 2011 నుంచి నిరాటంకంగా అధికారంలో కొనసాగుతున్న దీదీపై సహజంగానే ప్రజా వ్యతిరేకత పెరిగింది. ఒకప్పుడు పారిశ్రామిక రాజధానిగా వెలుగొందిన బెంగాల్లో పరిశ్రమలు మూతపడడం, నిరుద్యోగం పెరిగిపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగించాయి. ప్రధానంగా యువత విరక్తి చెందింది. ఉద్యోగాలు, ఉపాధి కోసం పరాయి రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి రావడం వారిని కుంగదీసింది. దాంతో ఎన్నికల్లో టీఎంసీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. దెబ్బతీసిన మైనార్టీ సంతుష్టీకరణ 2011లో మమతా బెనర్జీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని గెలిచారు. ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కొద్దికాలానికే కాంగ్రెస్‌ను అణచివేసేందుకు ప్రయతి్నంచారు. తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచారు. దాంతో కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీకి దూరమై, కమ్యూనిస్టులకు దగ్గరయ్యింది. దీదీ పతనానికి అడుగులు అప్పుడే పడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు. మైనార్టీల సంతుష్టీకరణ రాజకీయాలను దీదీ నమ్ముకున్నారు. ఈ అంశాన్ని బీజేపీ అస్త్రంగా వాడుకుంది. దీదీ హిందువుల వ్యతిరేకి అంటూ ఉధృతంగా ప్రచారం చేసింది. చొరబాటుదార్లను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ముద్దు చేస్తోందని ఆరోపించింది. కేంద్రం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ, సీఏఏను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)ని అమలు చేయడాన్ని తప్పుపట్టారు. ఇవన్నీ ఆమెను హిందూ వ్యతిరేకిగా ముద్రవేశాయి. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బెంగాల్ టైగర్ బీజేపీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ‘పరివర్తన్’కే ప్రజ లు ఓటేశారు. మార్పునకు పట్టంగట్టారు. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు ఓటర్లు ముగింపు పలికారు. నిజమైన అభివృద్ధి జరగాలంటే ‘డబుల్ ఇంజన్’ప్రభుత్వం రావాలంటూ బీజేపీ ఇచ్చిన పిలుపును గౌరవించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకే విజయం కట్టబెట్టారు. చరిత్రాత్మక తీర్పు ఇచ్చా రు. అంగ, కళింగ రాజ్యాలను ఇప్పటికే కైవసం చేసుకున్న కాషాయ పార్టీ ఎట్టకేలకు తన లక్ష్యాన్ని చేరుకుంది. తూర్పు భారతదేశంలోని వంగ రా జ్యాన్ని సైతం జయించింది. మొట్టమొదటిసారిగా బెంగాల్లో జయకేతనం ఎగురవేసింది. దీదీ కోట ను బద్దలుకొట్టి బెంగాల్ టైగర్‌గా అవతరించింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు 293 స్థానాల్లో సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టగా, ఏకంగా 206 స్థానాల్లో విజయఢంకా మోగించింది. మూడింట రెండొంతుల మెజార్టీ సాధించింది. స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. టీఎంసీకి కోలుకోలేని నష్టం ప్రాంతాలు, జనాభా స్థితిగతులకు అతీతంగా అన్నిచోట్లా ప్రభంజనం సృష్టించింది. తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటల్లోకి సైతం బీజేపీ చొచ్చుకెళ్లింది. ప్రభుత్వ పాలన మాత్రమే కాకుండా బెంగాల్ రాజకీయ ముఖచిత్రంలో నిర్మాణాత్మక మార్పును ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ తన ప్రత్యరి్థ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మరోసారి పరాజయం పాలయ్యారు. ఈసారి అసెంబ్లీ స్థానం మాత్రమే మారింది, ఫలితంలో ఎలాంటి మార్పు లేదు. 2021లో ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడిపోగా, ప్రస్తుతం భవానీపూర్‌లో చేదు అనుభవం చవిచూశారు. తృణమూల్ కాంగ్రెస్‌కు కోలుకోలేని నష్టం జరిగింది. ఆ పార్టీ 81 స్థానాలకే పరిమితమైంది. 100కుపైగాసీట్లను లూటీ చేశారంటూ బీజేపీపై మమతా బెనర్జీ మండిపడ్డారు. కాంగ్రెస్ కేవలం 2 సీట్లతో సరిపెట్టుకుంది. సీపీఎం 1, ఇతరులు మరో మూడు సీట్లు గెల్చుకున్నారు. ఒక నియోజకవర్గంలో ఈనెల 21న రీపోలింగ్ జరుగనుంది. 54 ఏళ్ల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ బెంగాల్ చరిత్రలో 1972 తర్వాత తొలిసారిగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే రాష్ట్రాన్ని పరిపాలించబోతోంది. 54 ఏళ్ల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ రావడం గమనార్హం. బెంగాల్లో తమ పార్టీ విజయం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ప్రజా తీర్పును ప్రశంసించారు. రాష్ట్రంలో కమలం వికసించిందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి బీజేపీ కృషి చేస్తుందని ప్రకటించారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి మోదీయే కేంద్రబిందువుగా నిలిచారు. మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బూత్‌స్థాయి నెట్వర్క్, అభ్యర్థుల ఎంపిక, సామాజిక వర్గాలను సమన్వయం చేస్తూ ముఖ్య వ్యూహకర్తగా వ్యవహరించారు. బీజేపీ ఆధిక్యం ఉత్తర బెంగాల్ నుంచి జంగల్‌మహల్, దక్షిణ బెంగాల్ వరకు, సరిహద్దు జిల్లాల నుంచి పారిశ్రామిక ప్రాంతాల వరకూ విస్తరించింది.రాష్ట్రమంతటా ప్రభంజనం సృష్టించింది. నగరాలు, పట్టణాల్లోనే కాకుండా గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. 2021 నాటి ఎన్నికల్లో 38 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 45 శాతానికిపైగా ఓట్లు చేజిక్కించుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ఓట్ల శాతం 48 శాతం నుంచి 40.94 శాతానికి పడిపోయింది. బీజేపీకి ఉత్తర బెంగాల్లో గట్టి పట్టుంది. ప్రస్తుతం దక్షిణ ప్రాంతంలోనూ మంచి ఫలితాలు సాధించింది. రాజధాని కోల్‌కతా సహా హౌరా, హూగ్లీ జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించింది.బ్రాత్య బసు, మానస్ రంజన్ భూనియా, శశి పంజా, చంద్రిమా భట్టాచార్య సహా 20 మంది మంత్రులు ఓటమిపాలయ్యారు. ఈ తీర్పు బీజేపీకి ఒక కీలక మలుపు. 1990వ దశకం వరకు బెంగాల్లో నామమాత్రంగా ఉన్న ఆ పార్టీ అధికార పీఠం అధిరోహించే స్థాయికి చేరింది. తన చిరకాల స్వప్నం నెరవేర్చుకుంది. కాంగ్రెస్, కమ్యూనిస్టు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల పాలనను చూసిన ప్రజలు ఇకపై బీజేపీ పాలనకు ప్రత్యక్ష సాక్షులు కాబోతున్నారు. -
అట్టడుగు నుంచి అధికార పీఠానికి..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ అట్టడుగు స్థాయి నుంచి అధికార స్థానానికి ఎదిగిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకమే. బీజేపీ మాతృసంస్థ అయిన భారతీయ జనసంఘ్‌ను బెంగాలీ బాబూ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ స్థాపించారు. 1951లో భారతీయ జనసంఘ్ పురుడు పోసుకుంది. 1980 ఏప్రిల్ 6న బీజేపీ ఉనికిలోకి వచ్చింది. 1980వ దశకంలో బెంగాల్ ఎన్నికల్లో ఆ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో కాలం కలిసిరాలేదు. 1982 అసెంబ్లీ ఎన్నికల్లో 52 స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం 1.29 లక్షల ఓట్లు వచ్చాయి. సీట్లేవీ రాలేదు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో 9 స్థానాల్లో పోటీచేసి, 1.01 లక్షల ఓట్లు సాధించింది. 1987లో 57 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగింది. 1.34 లక్షల ఓట్లు దక్కించుకుంది. 1989 లోక్‌సభ ఎన్నికల్లో 19 సీట్లలో పోటీకి దిగి 5.29 లక్షల ఓట్లు కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో పరాజయాలు తప్పలేదు. బెంగాల్ అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న బీజేపీ కోరిక దశాబ్దాలపాటు నెరవేరలేదు. అప్పట్లో వామపక్షాలు అత్యంత బలంగా ఉండడం కాషాయ పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారింది. అయితే, ఓట్ల శాతం క్రమంగా పెరుగుతూ రావడం బీజేపీకి ఊరటనిచ్చింది. ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురవుతున్నప్పటికీ ఆ పార్టీ ఏనాడూ నిరాశ చెందలేదు. పట్టుదలతో పోరాడుతూ పైకి ఎదిగింది. ప్రతి ఎన్నికలోనూ పెరిగిన ఓట్ల శాతం 1990వ దశకంలో రామజన్మభూమి ఉద్యమం బెంగాల్లో ఆ పార్టీకి మంచి ఊపునిచ్చింది. 1998లో 14 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ తొలిసారిగా ఒక స్థానాన్ని గెల్చుకుంది. 37.24 వేల ఓట్లు లభించాయి. 1999లో తృణమూల్ కాంగ్రెస్‌తో జట్టుకట్టి 13 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి, రెండు స్థానాల్లో బీజేపీ జెండా ఎగురవేసింది. 39.28 లక్షల ఓట్లు వచ్చాయి. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో 266 స్థానాల్లో పోటికి దిగింది. సీట్లు రాకున్నా 19.01 లక్షల ఓట్లు సాధించింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 291 సీట్లలో పోటీచేసి, తొలిసారిగా మూడు స్థానాలు గెల్చుకొని పెను సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి బీజేపీకి ఎదుగుదలకు అడ్డే లేకుండాపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 293 సీట్లలో పోటీకి దిగి, 2.89 కోట్ల ఓట్లు సాధించి, 77 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. మొదటిసారిగా రెండో అతిపెద్ద పార్టీగా మారింది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఐదేళ్లలోనే ఏకంగా అధికార పీఠం దక్కించుకుంది. -
బెంగాల్లో సువర్ణాధ్యాయం మొదలు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో దశాబ్దాల నిరీక్షణ తర్వాత సువర్ణాధ్యాయం మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. హింస, భయం, బుజ్జగింపు రాజకీయాలకు స్వస్తి పలికి బెంగాల్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన చరిత్రాత్మక విజయాలను ఆయన అపూర్వం, అద్వితీయంగా అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సోమవారం ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో భారీ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి మోదీ పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టిన తొలి ఎన్నికల్లోనే కార్యకర్తలకు ఆయన ఇచ్చిన మార్గదర్శనం సత్తా చాటిందని మోదీ ప్రశంసించారు. ప్రజలే దేవుళ్లు.. బెంగాల్, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు మోదీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, త్రిపుర ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు పట్టం కట్టిన ప్రజలకు సైతం కృతజ్ఞతలు చెప్పారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా, ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’కి భారత్ ఎందుకు మాతృభూమిగా ఉందో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రపంచానికి చాటిచెప్పాయన్నారు. గతేడాది బిహార్ ఎన్నికల సమయంలో గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు ఎన్డీఏ ప్రభంజనం విస్తరిస్తుందని తాను చెప్పిన మాటలు నేడు నిజమయ్యాయని చెప్పారు. గంగామాతతోపాటు బ్రహ్మపుత్ర, కామాఖ్యా మాతల ఆశీర్వాదం తమపై మెండుగా ఉందన్నారు. అందుకే అస్సాం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీకి హ్యాట్రిక్ విజయం సాధ్యమైందన్నారు. పుదుచ్చేరిలో గత ఐదేళ్లలో ఎన్డీఏ అమలు చేసిన విజన్‌కు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇ చ్చారన్నారు. ప్రస్తుతం దేశంలో 23 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని, ‘నాగరిక్ దేవో భవ’(ప్రజలే దేవుళ్లు) అనే మంత్రంతో తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. శ్యామాప్రసాద్ కల సాకారం పశ్చిమ బెంగాల్‌ను భారత్‌లో అంతర్భాగంగా ఉంచేందుకు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని ధారపోశారని మోదీ గుర్తుచేశారు. 1951లో ‘దేశం కోసం జీవించాలి, దేశం కోసం మరణించాలి’అన్న ఆశయంతో ఆయన ప్రారంభించిన ప్రస్థానం, నేటి చారిత్రక విజయంతో ఆయన కల సాకారమైందన్నారు. బెంగాల్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని, నేటి నుంచి భయం నుంచి విముక్తి పొందిందని ‘బాంగ్లాయ్ పోరిబోర్తన్ హోయే గెచే’(బెంగాల్లో మార్పు వచ్చేసింది) అని నినదించారు. వందేమాతరం 150వ వసంతంలో భరతమాతకు, బంకించంద్ర ఛటర్జీకి, అరవిందుడికీ బెంగాల్ ఓటర్లు చారిత్రక నివాళి అర్పించారన్నారు. ఇకపై అభివృద్ధి, విశ్వాసం, కొత్త ఆశలు బెంగాల్లో అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తాయన్నారు. యువతకు ఉద్యోగాలు, మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో చొరబాటుదారుల ఆటకట్టిస్తామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం తొలి కేబినెట్లోనే పేదలకు ఉచిత వైద్యం అందించే ‘ఆయుష్మాన్ భారత్’పథకానికి పచ్చజెండా ఊపుతామని స్పష్టం చేశారు. అంగ్, బంగ్, కలింగ్...ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు యుద్ధ సైరన్లు మోగుతూ, అస్థిరత, అరాచకం రాజ్యమేలుతున్న తరుణంలో, పశ్చిమాసియా సంక్షోభం వెంటాడుతున్నా.. భారత ప్రజలు మాత్రం స్థిరత్వం కోసం ఓటు వేశారని మోదీ విశ్లేషించారు. వికసిత భారత్ లక్ష్యంగా దేశం ఏకతాటిపై నిలబడి సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటోందని చెప్పారు. ప్రాచీన భారతదేశంలో అంగ్ (బిహార్), బంగ్ (బెంగాల్), కలింగ్ (ఒడిశా) రాష్ట్రాలు ఆర్థిక, రాజకీయ, వాణిజ్య మూలస్తంభాలుగా ఉండేవని గుర్తుచేశారు. ఆసియా ఖండం మొత్తం కళింగ ఓడరేవుల ద్వారా వాణిజ్యం సాగేదని, బెంగాల్ సాంస్కృతిక కేంద్రంగా ఉండేదని గుర్తుచేశారు. బానిసత్వంలో ఆ స్తంభాలు బలహీనపడ్డాయని, ఇప్పుడు మళ్లీ ఆ మూడు ప్రాంతాల ప్రజలు బీజేపీని ఎంచుకోవడం ద్వారా వికసిత భారత్‌కు బాటలు వేస్తున్నారని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.మహిళా వ్యతిరేకులకు గుణపాఠంపార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించిన రాజకీయ పక్షాలు మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని తాను ముందే హెచ్చరించానని గుర్తుచేశారు. అన్నట్లుగానే కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే ఆ ఆగ్రహాన్ని రుచి చూశాయన్నారు. మహిళా విరోధిగా ముద్రపడిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి సైతం యూపీలో మహిళలు తగిన బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. కేరళలో కమ్యూనిస్టుల పదేళ్ల దుష్పరిపాలనను ప్రజలు తిరస్కరించారని, అయితే వచ్చే ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్‌కు కూడా మహిళలు తగిన సమాధానం ఇస్తారన్నారు. నేడు దేశంలో ఒక్క రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టు ప్రభుత్వం లేకపోవడం కేవలం రాజకీయ మార్పు కాదని, ప్రజల ఆలోచనా విధానంలో వచ్చిన భారీ మార్పు అని మోదీ విశ్లేషించారు. యావత్ ప్రపంచం, దేశం కమ్యూనిజాన్ని, అడవుల్లో అంతరించిపోతున్న మావోయిజాన్ని తిరస్కరించినప్పటికీ, కాంగ్రెస్ మాత్రం అదే భావజాలాన్ని అక్కున చేర్చుకుంటూ విపరీత దిశలో పయనిస్తోందని ధ్వజమెత్తారు. విపక్షాలవి కేవలం విభజన రాజకీయాలైతే, తమవి విశ్వాసం నింపే రాజకీయాలని వ్యాఖ్యానించారు. కుటుంబ, వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు.మోదీపై చెక్కుచెదరని విశ్వాసం: నితిన్ నబిన్12 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత కూడా ప్రధాని మోదీ నాయకత్వంపై, మోదీ గ్యారంటీపై ప్రజల్లో నమ్మకం ఏమాత్రం చెక్కుచెదరలేదనడానికి ఈ విజయాలే నిదర్శనమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అన్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ జన్మభూమి అయిన బెంగాల్‌ను మోదీ బీజేపీ మయం చేశారని కొనియాడారు. విజయోత్సవ సంబరాల అనంతరం మంగళవారం నుంచే బీజేపీ శ్రేణులు మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో ప్రజాసేవలో, దేశ నిర్మాణంలో నిమగ్నమవుతాయని చెప్పారు. సమావేశం ప్రారంభంలో మోదీకి పూలమాల వేసి సత్కరించేందుకు నబిన్ ముందుకు రాగా, ఆ మాలను మోదీ ఆప్యాయంగా తిరిగి నబిన్ మెడలోనే వేసి నాయకుల పట్ల తనకున్న గౌరవాన్ని, నిరాడంబరతను చాటుకున్నారు. -
బీజేపీ పంచతంత్రం
పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనను కమలం పార్టీ కూలదోసింది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పొరపాటని రుజువు చేస్తూ ఊహించని విజయం దక్కించుకుంది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలన్న ‘దీదీ’మమతా బెనర్జీ ఆశయం నెరవేరలేదు. ‘మా, మాటీ, మానుష్’నినాదాన్ని ఈసారి బెంగాలీలు విశ్వసించలేదు. 34 ఏళ్లపాటు అవిచ్ఛిన్నంగా సాగిన కమ్యూనిస్టుల పరిపాలనను అంతం చేసి 2011లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ 15 ఏళ్ల తర్వాత పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికల ఫలితాలను నిర్దేశించడంలో ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో మహిళలు, ముస్లింలు, వలసదార్లు, హిందూ మతస్థులైన మథువా సామాజికవర్గం, బీజేపీ యంత్రాంగం కీలక పాత్ర పోషించింది. రాష్ట్రంలో తమ పార్టీకి ప్రధాని మోదీ ఏకైక ఆకర్షణగా నిలిచారు. ప్రచారంలో అంతా తానై వ్యవహరించారు. పార్టీకి ఆయనే అతిపెద్ద ఆశాకిరణంగా మారారు. గెలుపు బాధ్యతను భుజాన వేసుకొని పనిచేశారు. పార్టీ యంత్రాంగాన్ని ముందుకు నడిపించారు. విజయంలో ఆయనకు సింహభాగం వాటా దక్కుతుందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. మరోవైపు స్ట్రీట్ ఫైటర్ అనే ఇమేజ్‌తో సీఎం మమతా బెనర్జీ దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే, ఈసారి తన రాజకీయ జీవితంలోనే అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం, ఎస్ఐఆర్ ద్వారా 90 లక్షల ఓట్లు తొలగింపునకు గురికావడం, హిందూ ఓటు బ్యాంకు బీజేపీ వెనుక సంఘటితం కావడం, శాంతి భద్రతలు దిగజారడం వంటివి తృణమూల్‌ను ఓడించాయి. మహిళలుబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఇన్నాళ్లూ మహిళలే వెన్నుముకగా నిలిచారు. ఆ పార్టీ వరుసగా మూడుసార్లు గెలిచిందంటే మహిళల ఆదరణే ప్రధాన కారణం. వారి సంక్షేమం కోసం మమతా బెనర్జీ ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. ఇందులో ముఖ్యమైనది ‘లక్ష్మీ భండార్’. ఈ పథకం కింద పేద మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేశారు. చదువుకొనే బాలికలను ప్రోత్సహించడానికి, బాల్య వివాహాలను అరికట్టడానికి కన్యాశ్రీ పథకాన్ని అమలు చేశారు. కానీ, కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిపై అత్యాచారం, హత్య ఘటన టీఎంసీ సర్కార్‌పై మాయని మచ్చగా మిగిలిపోయింది. రాష్ట్రంలో మహిళలపై వేధింపులు పెచ్చుమీరాయి. దీంతో ప్రభుత్వంపై మహిళల్లో వ్యతిరేకత పెరిగింది. పరిస్థితిని గమనించిన బీజేపీ మహిళలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేసింది. తాము అధికారంలోకి వస్తే ఆడబిడ్డలకు భద్రత కల్పిస్తామని, వారి సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో మహిళా సంక్షేమ పథకాలు ప్రకటించింది. అంతేకాకుండా ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనలో బలైపోయిన విద్యార్థిని తల్లిని బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దించారు. ఇవన్నీ బీజేపీ పట్ల మహిళల్లో సానుకూలత పెంచాయి. ముస్లింలుబెంగాల్ జనాభాలో ఏకంగా 27 శాతం ఉన్న ముస్లింలు ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారారు. వారంతా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గట్టి మద్దతుదార్లు. 30 శాతం నుంచి 90 శాతం దాకా ముస్లిం జనాభా ఉన్న నియోజవకర్గాలు 146 ఉండగా, 2021లో టీఎంకే 131 స్థానాలు గెల్చుకుంది. గత 15 ఏళ్లుగా మెజార్టీ సీట్లు దక్కించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ) వంటి ముస్లింలలో భయాన్ని పెంచాయి. బెంగాల్లో అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ పరిణామాల వల్ల ముస్లింలు ఈసారి కూడా అండగా నిలవడంతో దీదీ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు గెల్చినట్లు స్పష్టమవుతోంది. మైనార్టీల అండ లేకపోయినా హిందువులు తమకు అనుకూలంగా ఓట్లు సంఘటితం కావడం బీజేపీకి కలిసొచ్చింది. వలసదార్లుబెంగాల్లో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక స్థానికులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం పరిపాటి. ఈ వలసదార్లు అత్యంత ప్రభావవంతమైన వర్గంగా మారిపోయారు. చాలాస్థానాల్లో ఫలితా లను నిర్దేశించేది వారేనంటే అతిశయోక్తి కాదు. ఈసారి ఓటర్ల జాబితాలో పేర్లు ఉండటానికి, చట్టబద్ధమైన నివాసితులుగా గుర్తింపు పొందడానికి ఓటు వేయడం తప్పనిసరి అనే ప్రచారం జరిగింది. అందుకే ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెంగాలీ వలస కార్మికులు, ఇతర వృత్తి నిపుణులు ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చారు. స్థానికంగానే ఉద్యోగా లు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ బీజేపీ ఇవ్వ డం వలసదార్లను ఆకర్శించింది. అందుకే వారు ఆ పార్టీకి అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది.మథువాలుదళితులైన మథువాలు హిందువులే. వీరు రాష్ట్ర జనాభాలో 17% దాకా ఉంటారు. బీజేపీకి మద్దతుగా నిలిచారు. పొరుగుదేశాల్లో మత హింసకు గురై శరణార్థులుగా వచ్చిన మథువాలకు భారత పౌరసత్వం కల్పిస్తామని బీజేపీ ప్రకటించింది. బెంగాల్లో అట్టడుగున ఉన్న బీజేపీ గత ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానానికి చేరుకోవడానికి కారణం మథువాల మద్దతే. ప్రస్తుత ఎన్నికల్లోనూ వారు బీజేపీని బలపర్చారు. బీజేపీ యంత్రాంగంబెంగాల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాపకిందనీరులా చొచ్చుకొచ్చారు. గత రెండేళ్లుగా ఇంటింటి ప్రచారం, ప్రతి ఓటర్ను కలవడం వంటి కార్యక్రమాలతో పార్టీని బలోపేతం చేశారు. బూత్‌స్థాయిలో ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు సైతం తరలిరావడం గమనార్హం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
విప్లవాల నేల మీద వినూత్న తీర్పు
నాలుగు రాష్ట్రాలు (కేరళం, తమిళ నాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్), కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలకు జరిగిన వేసవి ఎన్నికల్లో తమిళ శాసనసభ ఫలితాలు చాలావరకు అనూహ్యంగా వచ్చాయి. సినీ నటుడు ‘దళపతి’ విజయ్ (జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్) పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) సాధారణ మెజారిటీకి సమీపంలోకి రావడం నిజంగా రాజకీయ పండితుల అంచనాలకు అందని విషయం. అలాగే, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పదిహేనేళ్లుగా పాతుకుపోయిన తృణమూల్ కాంగ్రెస్‌ను కేంద్రంలో పాలకపక్షం బీజేపీ ఓడించి 200కు పైగా సీట్లు సాధించి తొలిసారి అధికారంలోకి రావడం కూడా అత్యధిక ఎన్నికల విశ్లేషకుల లెక్కలకు చిక్కని వాస్తవం. 1989 జనవరి అసెంబ్లీ ఎన్నికల నుంచీ తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే (ఏఐడీఎంకే)లు ప్రతి ఐదేళ్లకూ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారింది. ఏఐఏడీఎంకే నాయకురాలు జయలలిత జీవించి ఉండగా జరిగిన 2016 ఎన్నికల్లో మాత్రం ఈ సాంప్రదాయం మారింది. 2011 శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఆమె పార్టీ వరుసగా రెండోసారి గెలిచింది. 2026 అసెంబ్లీ ఎన్నికలు ఊహించని సంచలనానికి దారితీశాయి. ప్రత్యేక రాజకీయ సిద్ధాంతం లేని మూడో పెద్ద రాజకీయ పక్షం టీవీకే 107 సీట్లు గెలుచుకుని తమిళ రాజకీయ రంగంలో కొత్త అధ్యాయానికి తెర తీసింది. పార్టీ నిర్మాణం, తెలివైన రాజకీయ వ్యూహం, రాజకీయ అనుభవం లేకుండానే విజయ్ పార్టీ అతిపెద్ద రాజకీయ పక్షంగా అవతరించడం తమిళ ప్రజల కొత్త ఆలోచనా ధోరణికి అద్దం పడు తోంది. జనాకర్షక పథకాలు, ప్రజలు ఉపయోగించే అనేక వస్తువు లను ఉచితంగా ఇవ్వడం, ఇంకా చాలా సౌకర్యాలు, పథకాల పేరిట సొమ్మును ఉచితంగా పంపిణీ చేస్తామనే హామీలు గుప్పించే తమిళ ఎన్నికల్లో ఇలాంటివి ఏవీ లేకుండా టీవీకే విజయం సాధించడం అంత తేలికగా బయటివారికి అర్థంకాని అంశమే.ద్రవిడ సిద్ధాంత పునాది లేకుండా గెలుపెలా?తమిళనాడులో (పాత పేరు మద్రాస్) 1952 ముందు నుంచీ సాగిన కాంగ్రెస్ ఆధిపత్యానికి ముగింపు పలికాయి 1967 శాసనసభ ఎన్నికలు. దశాబ్దాలుగా తమిళ నేలలో ప్రజలను ఆకట్టుకుని వేళ్లూ నిన ద్రవిడ సిద్ధాంతం పునాదిగా (బ్రాహ్మణేత వర్గాల సంక్షేమం, తమిళ భాషకు గౌరవం) ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) ఈ ఎన్నికల్లో తొలిసారి గెలిచిన ప్రాంతీయపక్షంగా రికార్డు నమోదు చేసుకుంది. సీఎం అణ్ణాదురై నాయకత్వంలో ఎం.కరుణానిధి వంటి పలువురు హేమాహేమీలైన నేతల ఉమ్మడి కృషితో నాడు డీఎంకే విజయం కాంగ్రెస్‌పై సాధ్యమైంది. అలాగే, డీఎంకే నాయకత్వంపై తిరుగుబాటు చేసిన తమిళ సూపర్ స్టార్ ఎంజీ రామచంద్రన్ 1977 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సినీ నటుల జనాకర్షక రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఎంజీఆర్ పార్టీ అన్నాడీఎంకే విజయానికి ఆయన ఆకర్షణేగాక, ద్రవిడ సిద్ధాంత బలం ఉన్న డీఎంకేతో ఆయన దశా బ్దాల అనుబంధం కూడా ఉపయోగపడింది. అయితే, విజయ్ పార్టీ టీవీకేకు ఎంజీఆర్ పార్టీకి ఉన్న నేపథ్యం లేదు. యువతలో విపరీ తమైన ‘క్రేజ్’ ఆయనకు ఉందిగానీ ఎంజీఆర్‌లా విస్తృత రాజకీయ అనుభవం లేదు. సిద్ధాంతాలు అసలు లేకపోలేదు...2024 అక్టోబర్‌లో విక్రవండిలో జరిగిన టీవీకే తొలి రాజకీయ మహాసభలో ‘‘బీజేపీ మితవాద పోకడల కారణంగా ఇది టీవీకేకు ‘సైద్ధాంతిక ప్రత్యర్ధి’; డీఎంకే అనుసరించే అవినీతి, వారసత్వ రాజకీయాల వల్ల అది మాకు ‘రాజకీయ శత్రువు’ అని విజయ్ తేల్చి చెప్పారు. ఈ లెక్కన మతతత్వ వ్యతిరేక ధోరణి, లౌకిక విశ్వాసాల కారణంగా బీజేపీని తన రాజకీయ శత్రువుగా ప్రకటించడం టీవీకే మౌలిక సిద్ధాంతాలపై స్పష్టత ఇవ్వడమే అవుతుంది. అందుకే, ఫలితాలు ప్రకటించిన రోజున డీఎంకే నేతృత్వంలోని తన ప్రత్యర్థి శిబిరంలో ఉన్న కాంగ్రెస్‌తో కొత్తగా కూటమి కట్టడానికి విజయ్ పార్టీ సిద్ధమని ప్రకటించింది. పూర్వ పాలకపక్షం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునే బదులు కేవలం ఐదారు సీట్లు ఉన్న కాంగ్రెస్‌తో దోస్తీ తన పార్టీకి క్షేమమేగాక, సైద్ధాంతిక అనుకూల అంశమని విజయ్ గుర్తించినట్టు కనిపిస్తోంది. అత్యధిక సర్వేలకు, రాజకీయ విశ్లేషకుల అంచనాలకు విరుద్ధంగా టీవీకే గెలుపునకు కారణాలు ఏమిటనే విషయమై ఇప్పుడు చర్చ జరుగుతోంది. 1977లో ఎంజీఆర్ మొదటిసారి సీఎం అయి నప్పటి నుంచీ తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేలదే రాజకీయ పెత్తనం. దాదాపు ఐదు దశాబ్దాల పాటు సాగిన ఈ రెండు పార్టీల వ్యవస్థ తమిళులకు విసుగు పుట్టించినట్టు కనిపిస్తోంది. పార్టీ పెట్టే ఆలోచన విరమించుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్, సొంత పార్టీ పెట్టి బోల్తాపడిన మరో స్టార్ హీరో కమల్‌హాసన్ అనుభవాలు గమ నించిన తమిళ ప్రజానీకం కొత్త తరం హీరో 51 ఏళ్ల విజయ్ పార్టీ టీవీకేను ఈసారి ఆదరించాలని నిర్ణయించుకున్నారు. జనాభాలో అధిక శాతం ఉన్న యువత, దళితులు పార్టీ పెట్టినప్పటి నుంచీ విజయ్‌కు అనుకూలంగా మారారు. యువతరంలో విజయ్‌పై ఉన్న మోజు గట్టి పునాదులు లేని ఆయన పార్టీకి ఏకంగా దాదాపు 110 సీట్లు వచ్చేలా చూడటం రాజకీయ విప్లవం కింద పరిగణించాలి. టీవీకే పుట్టినప్పటి నుంచీ దానికి జనంలో పెరిగిన ఆదరణ చూసిన కాంగ్రెస్ ఎన్నికలకు కొన్ని మాసాల ముందు దానితో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ, ఒంటరి పోరుకే సిద్ధం కావడంతో ‘దళపతి’తో ఎన్నికల స్నేహానికి హస్తం పార్టీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇప్పుడు ఫలితాలు వెలువడిన తర్వాత టీవీకేకు కొద్దిలో మెజారిటీ మార్క్ (మొత్తం 234 సీట్లకుగాను 118) దక్కకపోవడం, ‘సెక్యులరిజం’ అనే సిద్ధాంతం టీవీకేతో చేతులు కలిపే అవకాశం కాంగ్రెస్‌కు లభించింది. తమిళ ఓటర్లు టీవీకేను ఆదరించడం ద్వారా రెండు పాత ద్రవిడ పార్టీలు మాత్రమే పాలక పక్షాలుగా దిక్కయిన పరిస్థితి నుంచి బయట పడ్డారు.విజయ్ క్రైస్తవ కుటుంబంలో జన్మించడం (తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ పుట్టుకతో క్రిస్టియన్, తల్లి హిందువు) టీవీకేకు అనుకూల లేదా ప్రతికూల అంశం కాలేదు. రాష్టంలో కులం ప్రభావం అధికంగా ఉన్న కారణంగా తన కులం తమిళ్ అని ప్రకటించుకోవడం తమిళ జనానికి బాగా నచ్చినట్టుంది. కేవలం రెండు సంవత్సరాల క్రితం పుట్టిన విజయ్ పార్టీకి దాని కొత్తదనం, నాయకుడికి రాజకీయ నేపథ్యం లేకపోవడం సానుకూల అంశా లుగా మారాయి. దాదాపు 8 లక్షల మంది అభిమానులతో టీవీకే మొదటి రాజకీయ మహాసభ జరిగిందంటే జనంలో విజయ్‌పై ఉన్న తీవ్ర అభిమానం, మోజు మీడియాకు, ఎన్నికల విశ్లేషకులకు అర్థం కాలేదని అనుకోవాలి. నేటి తమిళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులకు ఉన్న పరిమితులను చెబుతున్నాయి. ఏమైనా విజయ్‌కు తమిళనాడు ‘దళపతి’ అయ్యే అవకాశం ఇవ్వడం ద్వారా తమిళ సోదరులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. స్వాతంత్య్ర పోరాటం నుంచి సామాజిక విప్లవాల వరకూ ఆధునిక భారతంలో ముందుండి నడిచిన బెంగాలీలు, తమిళులు ఎట్టకేలకు తమ పాలకపక్షాలను, పాలకులను మార్చేలా తీర్పు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం ఏ మాత్రం కాదు.కమ్యూనిస్టులకు 34, తృణమూల్‌కు 15 ఏళ్లు అవకాశం!పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీకి అధికారం వస్తుందని ఎక్కువ సర్వేలు సూచించలేదు. 200కు పైగా సీట్లను కైవసం చేసుకుని బీజేపీ పశ్చిమ బెంగాల్లో మొదటిసారి గద్దెనెక్కే అవకాశం దక్కించుకోవడం కూడా అత్యధిక మీడియా, రాజకీయ విశ్లేషకుల అంచనాలకు అందని వాస్తవం. 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లు గెల్చుకున్న బీజేపీ 2021లో తన బలాన్ని వంగ శాసనసభలో 77 స్థానాలు పెంచుకోవడం కొత్త రికార్డు. ఈ ఎన్నికల్లోనే బీజేపీకి మెజారిటీ సీట్లు (294 సీట్లున్న అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 148 అవసరం) వస్తాయని కొందరు ఎన్నికల పండితులు వేసిన అంచనాలు నిజం కాలేదు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ‘దీదీ’ మమతా బెనర్జీ వరుసగా మూడోసారి తన పార్టీని విజయపథంలో నడిపించారు. బెంగాల్ బెబ్బులిగా పొగడ్తలు అందుకున్నారు. గత 15 ఏళ్లుగా అవాంఛనీయ పోకడలనే తృణమూల్ అప్రకటిత పాలనా విధానంగా ఎంచుకోవడం ‘దీదీ’ పతనానికి దారితీసింది. సీపీఎం, సీపీఐ నాయకత్వంలోని కమ్యూనిస్టుల ఐక్య సంఘటన (లెఫ్ట్ ఫ్రంట్) సర్కారు 34 సంవత్సరాల పాలనలో బెంగాల్ ప్రజల జీవితాలను పాలక కూటమికి విధే యులైన అసాంఘిక శక్తులే ఒక పద్ధతి ప్రకారం నిర్ణయించడం తెలిసిన విషయమే. ‘పార్టీ సొసైటీ’గా పిలిచే అవాంఛనీయ ధోర ణిని దశాబ్దపున్నర పాటు తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అను సరించింది. అంతేగాక, బెంగాల్లో 30 శాతం వరకూ ఉన్న మైనారిటీలకు మమత పెద్ద పీట వేస్తున్నారనీ, మెజారిటీ మతస్తుల బాగోగులు ఆమెకు పట్ట వనే ప్రచారం బూటకం కాదు, నిజమనీ అత్యధిక బెంగాలీలు నమ్మారు. ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థిని రేప్, హత్య వంటి కొన్ని ఘటనలు మహిళా సీఎం పాలనలో స్త్రీలకు అసలు రక్షణ లేదనే బీజేపీ ప్రచారానికి బలం ఇచ్చాయి. ‘మార్క్సిస్టుల అరాచక పాలనకు స్వస్తి పలికి సుపరిపాలన అందిస్తాన’ని సీఎం పీఠమెక్కిన మమత ఏలుబడిలో పాలన బాగా దిగజారడం, నిరుద్యోగం, పేదరికం పెరిగిపోవడం బీజేపీ మూడింట రెండొంతుల మెజారిటీతో గెలవడానికి దోహదం చేశాయి. 2000 నవంబర్ నుంచి 2026 మే వరకూ పాతిక సంవ త్సరాలకు పైగా ఇద్దరే ఇద్దరు సీఎంలు మార్క్సిస్టు బుద్ధదేవ్ భట్టాచార్య, మమతా బెనర్జీలను చూసిన బెంగాలీ జనం పలు కారణాల వల్ల కొత్త ముఖం కావాలని కోరుకున్నారు. వారి ఈ ఆకాంక్ష సువేందు అధికారి నాయకత్వంలోని బీజేపీ తిరుగులేని మెజారిటీ ఈ ఎన్నికల్లో సాధించడానికి ఒక ప్రధాన కారణమైంది. నాంచారయ్య మెరుగుమాలవ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పశ్చిమ బెంగాల్ సీఎంగా మహిళ..?
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఆ పార్టీ నుంచి సీఎంగా బాధ్యతలు స్వీకరించేది ఎవరు? ముఖ్యమంత్రిగా బీజేపీ ఒక మహిళను ఎంపిక చేసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తన ప్రచారంలో పదేపదే, బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీ వ్యక్తినే ముఖ్యమంత్రిగా నియమిస్తామని చమత్కారంగా చెప్పారు. కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ మరింత ముందుకు వెళ్లి, తదుపరి ముఖ్యమంత్రి “నాన్-వెజిటేరియన్” అవుతారని చెప్పారు. దీన్ని, బీజేపీ అధికారంలోకి వస్తే చేపలు, మాంసం నిషేధిస్తుందని మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు బెంగాల్లో బీజేపీ గెలవడంతో మమత స్థానంలో ఎవరు వస్తారన్నది ప్రధాన చర్చగా మారింది.అగ్నిమిత్ర పాల్, రూపా గాంగూలీకి చాన్స్? ప్రాంతీయ పార్టీలకు భిన్నంగా బీజేపీ సాధారణంగా రాష్ట్ర ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించదు. బెంగాల్లో మోదీనే పార్టీ ప్రధాన ఆకర్షణ. ప్రధాన మంత్రి 20కి పైగా సభల్లో పాల్గొని, మమతా కోటను గెలుచుకోవడానికి విస్తృతంగా ప్రచారం చేశారు.గత నెలలో మోదీ బెంగాల్ సంస్కృతితో మమేకమయ్యారు.. జాల్మురి తిన్నారు, కాళీ ఆలయం సందర్శించారు (ఇక్కడ మాంసాహారం ప్రసాదంగా ఇస్తారు). ఫుట్‌బాల్ ఆడారు, బెంగాలీలో ఆడియో సందేశం విడుదల చేశారు. బెంగాల్ ప్రజలు “బ్రాండ్ మోదీ”పై నమ్మకం ఉంచినట్లు కనిపిస్తోంది.కానీ, ఇప్పుడు ఆ వారసత్వాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు? మహిళల భద్రతను ప్రచారంలో ప్రధాన అంశంగా తీసుకున్న బీజేపీ ఒక మహిళను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీకి మహిళా ముఖ్యమంత్రి ఉన్న ఏకైక రాష్ట్రం ఢిల్లీ (రేఖా గుప్తా). మహిళా రిజర్వేషన్ చట్టం చుట్టూ జరిగిన వివాదాల తరువాత, మహిళా అనుకూలతను బలోపేతం చేసేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.ప్రధాన మహిళా నాయకుల్లో అగ్నిమిత్ర పాల్, రూపా గాంగూలీ ఉన్నారు. రూపా గాంగూలీ బి.ఆర్. చోప్రా “మహాభారత్” సీరీస్‌లో ద్రౌపది పాత్రతో ప్రసిద్ధి చెందారు. ఇతర ప్రధాన అభ్యర్థుల్లో ప్రతిపక్ష నాయకుడు, మమతా ప్రత్యర్థి సువేందు అధికారి, రాష్ట్ర అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య, నిసిత్ ప్రమాణిక్, దిలీప్ ఘోష్ ఉన్నారు. సువేందు అధికారి సీఎం అవుతారన్న ప్రచారం కూడా ఉంది. -
భవానీపూర్‌లో సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమి
కోల్‌కతా: భవానీ పూర్లో సీఎం మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. బీజేపీ నేత సువేందు అధికారి విజయం సాధించారు. మమతాపై సువేందు అధికారి 10,994 ఓట్ల తేడాతో గెలుపొందారు.ఈ సందర్భంగా తన ఓటమిపై మమతా బెనర్జీ స్పందించారు. సర్పేరుతో బీజేపీ ఓట్లు దొంగిలిచ్చింది. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను నిలిపివేశారు. కౌంటింగ్ సెంటర్లలో టీఎంసీ ఏంజెట్లను కొడుతున్నారు. టీఎంసీ ఏంజెట్లలో ఎవరినీ కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వడం లేదు. పార్టీ ఏజెంట్లను అనుమతి ఇస్తామని డీవో హామీ ఇచ్చారు. పార్టీ ఏజెంట్లు వచ్చిన తర్వాత డీవో ఇక్కడ లేరు అని వాపోయారు.ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలైన రెండవ సీఎంగా మమతా బెనర్జీ అప్రతిష్టను మూటగట్టుకున్నారు. ఇటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం ఉన్నారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో సువేందు అధికారి మమతా బెనర్జీని ఓడించారు. తాజా ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గంలో మమతను ఓడించారు సువేందు అధికారు. దీదీ ఓటమితో టీఎంసీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నారు. -
బాలనటుడి నుంచి సీఎం వరకు.. విజయ్ ప్రస్థానం
తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లకే ప్రభంజనం సృష్టించారు. ఇతర పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన ప్రస్థానం గురించి తెలుసుకుందాం..విజయ్ 1974 జూన్ 22న మద్రాస్‌లో జన్మించారు. చెన్నైలోని లోయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్స్ చదువుతూ మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత సినిమాల్లో రాణించి దక్షిణ భారత సినీ రంగంలో అగ్ర హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయనకు యువతలో బాగా పాపులారిటీ ఉంది.అభిమానులు ఆయనను దళపతి (నాయకుడు) అని పిలుస్తారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ సినీ దర్శకుడు. విజయ్ తల్లి గాయని శోభా చంద్రశేఖర్. బాలనటుడిగా విజయ్ వెట్రి (1984) సినిమాలో నటించారు. ఈ సినిమాకు ఆయన తండ్రి దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రలో “నాళైయ థీర్పు” (1992) ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ చిత్రం కమర్షియల్‌గా విఫలమైనా, విజయ్ ప్రతిభను అందరూ గుర్తించారు. ఆ తర్వాత రసిగన్ (1994), దేవా (1995) వంటి సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. విజయ్ సినిమాల వేళ పూజలు, ప్రత్యేక ప్రదర్శనలు, డ్యాన్సులు వంటి వాటితో అభిమానులు హోరెత్తిస్తారు. ఎంజీఆర్‌ను గుర్తు చేసిన విజయ్ గతంలో తమిళనాడులో ఎంజీ రామచంద్రన్, జయలలిత వంటి ప్రముఖులు తమ సినీ పాపులారిటీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. విజయ్‌కు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు ఆయన సినిమాల ద్వారా కూడా బయటపడింది. అటువంటి సంకేతాలు సర్కార్ (2018) వంటి చిత్రాల్లో కనిపించాయి. 2024, ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కజగం (టీవీకే) రాజకీయ పార్టీ స్థాపించారు. విజయ్ రాజకీయ సభలో చోటుచేసుకున్న విషాద సంఘటన చోటుచేసుకుంది. 2025లో టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. మరో 80 మందికి పైగా గాయపడ్డారు. ఆ సమయంలో ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ తొక్కిసలాటతో విజయ్ ఇక రాజకీయాల్లో రాణించలేరని చాలా మంది అన్నారు. అయినప్పటికీ పడి లేచిన కెరటంలా ముందుకు సాగారు విజయ్. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆయన ఆస్తి విలువ సుమారు రూ.603 – రూ.625 కోట్లు.విజయ్ రాజకీయ ప్రయాణం ఒక్కసారిగా ప్రారంభం కాలేదు. అది విజయ్ మక్కల్ ఇయక్కం (వీఎంఐ) అనే అభిమానుల సామాజిక సేవా సంస్థపై నిర్మితమైంది. తరువాత తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీని స్థాపించారు. ఇది తమిళనాడు రాజకీయాల్లో మూడో శక్తిగా వేగంగా ఎదిగింది. 2025 చివర్లో ఈ పార్టీ 15 మిలియన్ సభ్యుల సంఖ్యను దాటింది. యువ ఓటర్లలో మార్పు వచ్చిందన్న సంకేతం కనిపించింది. పార్టీ ప్రాధాన్య సిద్ధాంతాలు అందరినీ ఆకర్షించాయి. తమిళనాడులో త్రిముఖ పోరు జరిగి, డీఎంకే, అన్నాడీఎంకేను టీవీకే ఓడించింది. ఇన్నాళ్లు డీఎంకే, అన్నాడీఎంకేకే అధికారాన్ని కట్టబెడుతూ వచ్చిన తమిళ ప్రజలు ఇప్పుడు భారీ మార్పుకు నాందిపలికారు. టీవీకే విజయ్ ఒక వ్యక్తి కాదు శక్తి అని నిరూపించుకున్నారు. -
అన్నాడీఎంకే మాజీ నేతకు.. టీవీకే ప్రభుత్వంలో కీలక పదవి!
కుల్లంపాళయం అర్థనారి సెంగొట్టయన్.. తమిళులకు సుపరిచితమైన పేరు. కేఏ సెంగొట్టయన్గా ప్రసిద్ధులు. తమిళనాడు రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మరోసారి వార్తల్లో నిలిచారు. గోబిచెట్టిపాలయం నియోజకవర్గం నుంచి 9వ సారి విజయం సాధించి చరిత్రకెక్కారు. 1977లో మొదటిసారిగా సత్యమంగళం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఇప్పటివరకు మొత్తం 10 పర్యాయాలు శాసనసభ్యుడిగా విజయాలు అందుకున్నారు. ఐదు దశాబ్దాల పాటు అన్నాడీఎంకేలో కొనసాగిన ఆయన ఈసారి ఎన్నికల్లో టీవీకే పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయ కేతనం ఎగరవేయడం విశేషం.తమిళనాడు రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన సెంగొట్టయన్ గతేడాది నవంబర్‌లో హీరో విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీలో చేరారు. విజయ్‌కు మద్దతుగా నిలబడిన మొదటి సీనియర్ నేత ఆయనే కావడం గమనార్హం. టీవీకేలో చేరిన వెంటనే ఆయనకు కీలక పదవి దక్కింది. ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నత-స్థాయి పరిపాలనా కమిటీకి ముఖ్య సమన్వయకర్తగా నియమించారు. దీంతో పాటుగా పశ్చిమ జిల్లాలైన కోయంబత్తూరు, ఈరోడ్, తిరుప్పూర్, నీలగిరిలకు ఆర్గనైజేషన్ సెక్రటరీగా కూడా బాధ్యతలు అప్పగించారు.అన్నాడీఎంకేలో అవమానంటీవీకే పార్టీలో చేరడానికి కొద్ది రోజుల ముందు అన్నాడీఎంకేలో సెంగొట్టయన్ తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నారు. అన్నాడీఎంకేని వీడిన మాజీ నాయకులను తిరిగి తీసుకొచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఆ పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామికి రుచించలేదు. పార్టీని వీడిన, బహిష్కరణకు గురైన నాయకులు తిరిగి సొంతగూటికి రావాలని పిలుపునివ్వడంతో సెంగొట్టయన్‌ను పళనిస్వామి టార్గెట్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఈరోడ్ రూరల్ పశ్చిమ జిల్లా కార్యదర్శి పదవి నుంచి ఆయనను తొలగించారు. సెంగొట్టయన్ మద్దతుదారుల పదవులు కూడా పీకేశారు. డీఎంకే కూటమిని ఓడించడానికే తాను మాజీ నేతలను తిరిగి రావాలని కోరినట్టు వివరించినా పళనిస్వామి పట్టించుకోలేదు. అక్కడితో ఆగకుండా పార్టీ నుంచి ఆయనను బహిష్కరించారు. దీంతో విజయ్‌తో ఆయన చేతులు కలిపారు.సరికొత్త చరిత్రఈరోడ్ జిల్లా గోబిచెట్టిపాళయం తాలుకాలోని కుల్లంపాళయంలో జన్మించిన 78 ఏళ్ల సెంగొట్టయన్ తమిళ రాజకీయాల్లో అంచెలు అంచెలుగా ఎదిగారు. 10వ పర్యాయం ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. తమిళనాడు శాసనసభలో అత్యధిక కాలం పాటు సభ్యుడిగా కొనసాగిన దురై మురుగన్ సరసన చేరారు. మురుగన్ ఇప్పటికే 10 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో తన కటప్పాడి నుంచి టీవీకే అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 1996 నుంచి ఇక్కడ గెలుస్తూ వస్తున్న ఆయనకు కొత్త పార్టీ చేతిలో చుక్కెదురైంది. 1984 నుంచి ఇప్పటివరకు మొత్తం 11 సార్లు ఇక్కడి నుంచి పోటీ చేయగా మూడు సార్లు మాత్రమే ఆయన ఓటమి చవిచూశారు.చదవండి: తమిళ సీఎం ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీసెంగొట్టయన్ తన నియోజకవర్గం గోబిచెట్టిపాళయంలో 10 పర్యాయాలు పోటీ చేయగా ఒకసారి మాత్రమే గెలవలేకపోయారు. ఒకే నియోజకవర్గం నుంచి ఏకంగా తొమ్మిదిసార్లు గెలిచి చరిత్రకెక్కారు. డీఎంకే వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం కరుణానిధి 13 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఏడు వేర్వేరు నియోజకవర్గాల నుంచి శాసనసభకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.కీలక పదవితమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే సిద్ధమవుతున్న నేపథ్యంలో సెంగొట్టయన్ కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు రాకపోవడంతో ఇతర పార్టీల మద్దతు కూడగట్టడానికి ఆయన అనుభవం అక్కరకు రావచ్చు. ఎందుకంటే అన్నాడీఎంకేతో ఆయనకు ఐదు దశాబ్దాల అనుబంధం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో పలుమార్లు మంత్రి పదవులు కూడా నిర్వహించారు. సెంగొట్టయన్‌కు ఉన్న అపార అనుభవం కారణంగా టీవీకే ప్రభుత్వంలో ఆయనకు కీలక పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఎన్నికల బరిలో గెలిచిన/ఓడిన దిగ్గజ నేతలు వీరే..
ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. ఐదు రాష్ట్రాల్లో ఏయే పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేయనున్నాయో తెలిసిపోయింది. తమిళనాడులో ఈ ఎన్నికలు పాత పార్టీలపై వ్యతిరేకత, కొత్త నాయకత్వం పుంజుకోవడాన్ని చూపిస్తున్నాయి. తమిళనాడులో విజయ్ ప్రభావం, బెంగాల్లో బీజేపీ ఎదుగుదల, కేరళలో పాలనా మార్పు కనపడింది. అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ గెలిచింది.ఈ ఎన్నికల బరిలో గెలిచిన/ఓడిన దిగ్గజ నేతలు వీరే..విజయ్ (తమిళనాడు, టీవీకే అధినేత)తమిళనాడులో రాజకీయాల్లో మొదటి అడుగులోనే భారీ విజయం సాధించారు. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గెలుపొందారు. పెరంబూర్, తిరుచ్చిలో గెలిచారు. ఆయన పార్టీ టీవీకే సంచలనం సృష్టించింది.హిమంత బిశ్వ శర్మ (అస్సాం సీఎం, బీజేపీ నేత)అస్సాంలో తన నాయకత్వాన్ని మరోసారి బలంగా నిలబెట్టుకున్నాడు. జలుక్బరిలో గెలుపొందారు.సువేందు అధికారి (పశ్చిమ బెంగాల్, బీజేపీ నేత)పశ్చిమ బెంగాల్లో బీజేపీ బలం పెరగడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన నందిగ్రామ్‌లో గెలుపొందారు.పినరయి విజయన్ (కేరళ సీఎం, సీపీఎం)ధర్మడం నియోజక వర్గం నుంచి పినరయి విజయన్ విజయం సాధించారు. అయితే, కేరళలో ఆయన అధికారాన్ని కోల్పోయారు.ఉదయనిధి స్టాలిన్ (తమిళనాడు, డీఎంకే నేత)తమిళనాడులోని చెపాక్ నుంచి పోటీ చేసిన ఉదయనిధి స్టాలిన్ గెలుపొందారు. వీడీ సతీశన్ (కాంగ్రెస్-కేరళ)వీడీ సతీశన్ పరవూర్ నియోజక వర్గం నుంచి గెలిచారు. కేరళలో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు తీసుకురావడంతో కృషి చేశారు. పళనిస్వామి (తమిళనాడు మాజీ సీఎం) పళనిస్వామి విజయం సాధించారు. ఎడప్పడి నియోజక వర్గం నుంచి ఆయన గెలుపొందారు.మమత, స్టాలిన్, గోగోయ్ ఓటమి మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి)పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారాన్ని కోల్పోయారు. ఎమ్మెల్యేగానూ గెలవలేదు. భవానీపూర్‌లో మమతా బెనర్జీపై సువేందు అధికారి గెలిచారు.ఎంకే స్టాలిన్ (తమిళనాడు సీఎం)తమిళనాడులో ఎంకే స్టాలిన్ ఎదురుదెబ్బ తిన్నారు. కొళత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పార్టీ కూడా వెనుకబడింది.గౌరవ్ గోగోయ్ (అస్సాం, కాంగ్రెస్)జోర్హాత్ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన గౌరవ్ గోగోయ్ ఓటమి పాలయ్యారు. -
కేరళం సీఎం రేసు కోసం తీవ్రమైన పోటీ..!
కేరళంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గెలుపుతో సీఎం రేసు హాట్ టాపిక్‌గా మారింది. దశాబ్ద కాలం తర్వాత కేరళంను కాంగ్రెస్ దక్కించుకోవడంతో అక్కడ కాస్త జోష్ వచ్చింది. ఓవరాల్‌గా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను చూస్తే కేరళంలో మాత్రమే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మాత్రమే ఆధిక్యాన్ని కనబర్చింది. కేరళంలో ఉన్న 140 అసెంబ్లీ సీట్లకు గాను 102 సీట్లను యూడీఎఫ్ దక్కించుకుని తిరుగులేని మెజార్టీ సాధించింది. మరి సీఎం ఎవరు?కాంగ్రెస్ ఎక్కడైనా అధికారంలోకి వచ్చిందంటే సీఎం రేసు కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇప్పుడు కేరళంలో అదే రిపీట్ అవుతుంది. ప్రస్తుతం కేరళంలో సీఎం పీఠం కోసం కాంగ్రెస్ ముఖ్యనేతల్లోనే పోరు తీవ్రంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం కేరళంలో సీఎం రేసులో ఉన్న వారిలో వీడీ సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్‌తో పాటు శశిథరూర్ కూడా ఉన్నారు. మాకు చాలా మందే ఉన్నారు..ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.ఇప్పటివరకూ ముగ్గురు మాత్రమే సీఎం రేసులో ఉన్నారనుకుంటే ఇప్పుడు శశిథరూర్ సైతం ఆ జాబితాలో చేరిపోయారు. వివాదాస్పద ఎంపీగా పేరున్న శశిథరూర్ తాజా వ్యాఖ్యలు తనను కూడా సీఎం అభ్యర్థికి అర్హుడుననే సంకేతాలిచ్చాయి. మరి ఆయనే స్వయంగా ఆ జాబితాలో చేరిపోయారా.. లేక కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతోనే ఇలా వ్యాఖ్యానించారా అనేది తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికి నలుగురు అభ్యర్థులు సీఎం రేసులో ఉండగా, ఇంకా ఎవరైనా వచ్చి ఆ జాబితాలో చేరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తుది నిర్ణయం హైకమాండ్‌దే అని శశిథరూర్ వ్యాఖ్యానించడం కూడా ఆసక్తికరంగా మారింది. హైకమాండ్ దగ్గర శశిథరూర్ మంచి మార్కులు ఉన్నాయా అంటే అది పూర్తిగా అవునని చెప్పలేం.సందర్భం వచ్చిన ప్రతీసారి ప్రధాని మోదీకి జై కొట్టే శశిథరూర్.. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ కోపానికి తరుచు గురవుతూ వస్తూనే ఉన్నారు. మరి అటువంటి సమయంలో శశిథరూర్‌ను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. సతీశన్‌ది కీలక పాత్రకేరళంలో కాంగ్రెస్ విజయం సాధించడంలో వీడీ సతీశన్‌ది కీలక పాత్ర. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఎమ్మెల్యేగా ఉన్నారాయన. యువతలో విపరీతమైన ఆదరణ ఉన్న సతీశన్‌కు సీఎం పీఠం దక్కుతుందని అంచనాలు ఉన్నప్పటికీ పోటీ గట్టిగా ఉండటంతో ఏమౌతుందో చివర వరకూ చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం సీఎం పీఠంపై సతీశన్ ఆశలు పెట్టుకున్నారు. మరి ఆ ఆశలు అనుభవంలోకి వస్తాయా.. లేక అడియాశలుగా మిగిలిపోతాయనేది అధిష్టానమే నిర్ణయించాలి. రమేశ్ చెన్నితలది అనుభవం..కేరళం కాంగ్రెస్‌లో సీనియర్‌గా పేరున్న రమేశ్ చెన్నితలకు విశేషమైన రాజకీయ అనుభవం ఉంది. అలాగే ఆర్గనైజేషన్‌లో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. కేరళ స్టూడెంట్స్ యూనియన్ ప్రారంభం; తరువాత నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎదిగారు. 1982లో హరిపాడ్ నుండి మొదటిసారి గెలుపొందారు. 1989–1998లో కోట్టాయం, మావేలికర నియోజకవర్గాల నుండి ఎంపీగా గెలిచి సేవలందించారు. 1986-87లొ గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశారు. 2005 నుంచి 2014 వరకు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. 2014 నుంచి 2016 వరకూ హోమ్ అండ్ విజిలెన్స్ మంత్రిగా పనిచేశారు. 2016 నుంచి 2021 వరకూ కేరళ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వంతో సన్నిహితంగా..కేరళలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్. ప్రస్తుతం ఆయన లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు మరియు 2026లో యూడీఎఫ్ ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థులలో ఒకరిగా పరిగణించబడుతున్నారు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. మూడుసార్లు ఎంపీగా కూడా గెలిచారు. ఈయనకి రాజకీయ అనుభవం విశేషంగానే ఉంది. 2019 నుండి కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.కాంగ్రెస్ అధినాయకత్వానికి అతి దగ్గరగా ఉండే వేణుగోపాల్ అంటే హైకమాండ్‌కు బాగా నమ్మకం ఎక్కువ. దాంతో కేసీ వేణుగోపాల్ కూడా సీఎం అభ్యర్థి కోసం చివరి వరకూ రేసులో ఉండటం ఖాయం.ఈ నలుగురితోనే సరా.. ఇంకా వస్తారా?ప్రస్తుతానికి ఈ నలుగురు మాత్రమే సీఎం రేసులో ఉన్నారు. మరి ఇంకే ఎవరైనా పోటీకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చాలా రాష్ట్రాల్లో పలు బుజ్జగింపుల తర్వాతే సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటిస్తూ రావడం చూస్తునే ఉన్నాం. ఇప్పుడు ఇంకా ఎవరైనా తాను కూడా సీఎం అభ్యర్థినేని పోటీ కొస్తే మాత్రం అధిష్టానికి తలనొప్పులు తప్పవు. ఏది ఏమైనా కేరళంలో కాంగ్రెస్ విజయం సాధించింది కాబట్టి ఆ పార్టీ ఇప్పుడు విజయోత్సవ మూడ్‌లో ఉంది. రేపట్నుంచి సీఎం కుర్చీ కోసం రేసు మొదలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకుల మాట. -
‘అన్నా.. గెలిచాం’.. కేకేఆర్ క్రికెటర్ పోస్టు వైరల్!
సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మెజార్టీకి కొద్ది దూరంలో ఆగిపోయినప్పటికీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ను అభినందిస్తూ సెలబ్రెటీలు పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు. గతంలోనూ పలు సందర్భాల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు విజయ్ అంటే తనకు ఎనలేని అభిమానమని పేర్కొన్నాడు. కాగా విజయ్‌కి వీరాభిమాని కావడంతో ఈ కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ విజయ్‌కి అభినందనలు తెలిపాడు. ఈ సందర్భంగా తన అభిమాన హీరోతో కలిసి దిగిన పాత ఫోటోను షేర్ చేసుకున్న వరుణ్ చక్రవర్తి ‘అన్నా.. గెలిచాం’ అంటూ ఎమోజీతో కూడిన సింబల్‌ను పంచుకున్నాడు.ఇక ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ్ చక్రవర్తి ఆదివారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇప్పటివరకు సీజన్లో ఏడు మ్యాచ్‌లాడిన వరుణ్ చక్రవర్తి 10 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో తొలి అంచె పోటీల్లో దారుణ ప్రదర్శన కనబరిచిన కేకేఆర్ రెండో అంచె పోటీల్లో మాత్రం వరుస విజయాలతో అదరగొడుతుంది. లేట్‌గా ఫామ్‌లోకి వచ్చిన రింకూ సింగ్ తన ఫినిషింగ్ టచ్‌తో కేకేఆర్‌కు రెండు విజయాలు సాధించి పెట్టాడు. ప్రస్తుతం కేకేఆర్ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 5 ఓటములు, ఒక మ్యాచ్ రద్దుతో పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. మరో 5 మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో అన్నింటా గెలిస్తే 17 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఒక్క మ్యాచ్ ఓడినా కేకేఆర్ ప్లేఆఫ్ అవకాశాలు సన్నగిల్లుతాయి. కేకేఆర్ తమ తర్వాతి మ్యాచ్‌ల్లో రెండుసార్లు ఢిల్లీ క్యాపిటల్స్‌తో, ఆర్సీబీతో, గుజరాత్‌తో, ముంబైతో ఆడాల్సి ఉంది.ఇక వరుణ్ చక్రవర్తి దేశవాలీ క్రికెట్లో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహిస్తుండడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. టీమిండియా తరఫున 4 వన్డేల్లో 10 వికెట్లు, 45 టీ20ల్లో 73 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో 91 మ్యాచ్‌లాడిన వరుణ్ చక్రవర్తి 110 వికెట్లు తీశాడు.చదవండి: విజయ్ గెలుపును ముందే ఊహించిన స్టార్ క్రికెటర్! -
బెంగాల్ ప్రజలకు విముక్తి.. విజయోత్సవ సభలో మోదీ
ఢిల్లీ: హింస రాజకీయాల నుంచి బెంగాల్ ప్రజలు విముక్తి కోరుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. హింస రాజకీయాలకు బెంగాల్ ప్రజలు స్వస్తి చెప్పారని పేర్కొన్నారుఢిల్లీలో నిర్వహించిన బీజేపీ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. భారత్ మదర్ ఆఫ్ డెమెక్రసీ అని ఈ ఎన్నికలు నిరూపించాయని ఐదురాష్ట్రాల ప్రజలు రాజ్యాంగాన్ని గెలిపించారన్నారు. గంగోత్రి నుండి గంగాసాగర్ వరకూ కమలం వికసించిందని బెంగాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరగడం ఎంతో గొప్ప విషయమన్నారు. దేశంలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు గుర్తించారన్నారు. ఈ రోజు భారత్‌కు, బీజేపీకి ఎంతో చారిత్రాత్మకమైన రోజని ప్రధాని మోదీ అన్నారు. పార్టీ విజయం కోసం ప్రయత్నించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలని తెలిపారు. బెంగాల్లో కమలం విజయం ఎంతో చారిత్రాత్మకమైనదన్నారు. బెంగాల్లో ప్రజాసామ్య విజయం సాధించామన్నారు. ఈ రోజు ప్రజలకు నిజమైన భరోసా కల్పించాల్సిన రోజని కొనియాడారు. ఐదు రాష్ట్రాల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారన్నారు. బీజేపీ విజయంలో అధ్యక్షుడు నితిన్ నబీన్ కీలక పాత్ర పోషించారని మోదీ తెలిపారు. బెంగాల్లో ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. తరతరాలుగా అసంఖ్యాక కార్యకర్తలు చేసిన కృషి, పోరాటాలు లేకుండా పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన రికార్డు విజయం సాధ్యమయ్యేది కాదని మోదీ ఉద్ఘాటించారు. వారందరికి మనస్ఫూర్తిగా వందనం చేస్తున్నానని ప్రధాని అన్నారు.మరోవైపు మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. అస్సాం ఎన్నికలలో బీజేపీ-ఎన్డీఏ విజయం, అభివృద్ధికి, ప్రజల జీవితాలలో సానుకూల మార్పు తీసుకురావడానికి మా కూటమి ఇస్తున్న ప్రాధాన్యతకు ప్రజల అచంచలమైన మద్దతుకు నిదర్శనమని.. బీజేపీ నేతలు అన్ని రకాల ప్రతికూలతలను అధిగమించి అభివృద్ధి అజెండా గురించి ప్రజలకు వివరించారన్నారు. ఐదురాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించింది. -
తమిళనాడులో నూతన ప్రభుత్వం.. విజయ్ ముందున్న దార్లు ఇవేనా?
సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ సంచలనం సృష్టించారు. 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించి, ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించారు. కేవలం రెండేళ్ల క్రితం ఏర్పడిన టీవీకే 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 106 స్థానాల్లో మెజారిటీని సాధించింది. మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు అవసరం. మ్యాజిక్ ఫిగర్‌కు మరో 12 సీట్ల దూరంలో ఉంది. ఈ క్రమంలో తమిళనాడు నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ ముందు నాలుగు మార్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిల్లో ఏఐఏడీఎంకేతో పొత్తు గతంలో టీవీకే–ఏఐఏడీఎంకే మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏఐఏడీఎంకే తన రాజకీయ భవిష్యత్తును నిలబెట్టుకోవడానికి టీవీకేతో కలిసే అవకాశం ఉంది. అయితే, విజయ్ బీజేపీని ఆదర్శ శత్రువుగా పేర్కొన్నందున, ఏఐఏడీఎంకే బీజేపీని వదిలేయమని అడగవచ్చు. ఇది పెద్ద సవాలుగా మారవచ్చు.చిన్న పార్టీలతో పొత్తు డీఎంకే లేదా ఏఐఏడీఎంకేతో పొత్తు లేకుండా, పీఎంకే, డీఎండీఎకే, వీసీకే, ఎంఎంఎంకే వంటి చిన్న పార్టీలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇలా చేస్తే, విజయ్ తన స్వంత రాజకీయ వారసత్వాన్ని నిర్మించుకునే అవకాశం ఉంటుంది.కాంగ్రెస్ మద్దతు స్థానిక పార్టీలను పక్కన పెట్టి, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. కాంగ్రెస్ ఇప్పటికే టీవీకేకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది.స్వతంత్రుల మద్దతు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు పొందడం ద్వారా కూడా విజయ్ మెజారిటీ సాధించే అవకాశం ఉంది. -
విజయ్ గెలుపును ముందే ఊహించిన స్టార్ క్రికెటర్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీహీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) సంచలనం సృష్టించింది. ఎవరూ ఊహించని విధంగా విజయ్ టీవీకే పార్టీ తమిళనాట వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 109 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. అయితే అత్యధిక స్థానాలు గెలిచిన విజయ్ కింగ్ మేకర్‌గా నిలిచారు. అయితే డీఎంకే లేదా అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకొని విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అన్నది చూడాలి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ తమిళనాట విజయ్ గెలుపు గురించి ముందే ఊహించాడంటూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చక్కర్లు కొడుతుంది. 2015 ఏప్రిల్ 25న ఆర్చర్ తన ‘ఎక్స్’ (అప్పటి ట్విటర్) వేదికగా ‘విజయ్ డబ్ల్యూటీఎఫ్’ అని పోస్టు పెట్టాడు. నిజానికి ఆర్చర్ ఆ ట్వీట్ పెట్టింది క్రికెటర్ మురళీ విజయ్ను ఉద్దేశించి అని తెలుస్తోంది. అంతకుముందు 2014, డిసెంబర్ 27న ‘లవ్ టు వాచ్ విజయ్’ అంటూ మరో ట్వీట్ చేశాడు. దానికి ముందు 2013, మార్చి 4న ‘M.Vijay 140*’ అంటూ ట్వీట్ చేశాడు జోఫ్రా ఆర్చర్. ఈ ట్వీట్స్ అన్నీ కూడా క్రికెటర్ మురళీ విజయ్‌కి సంబంధించినవి మాత్రమే. అయితే తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో విజయ్ విజయదుందుబి మోగించడంతో ఆయన అభిమానులు ఆర్చర్ ట్వీట్‌ను తమ హీరో విజయ్ కోసం చేసినట్లుగా రీట్వీట్ చేశారు. ‘మా విజయ్ ముందే గెలుస్తాడని ఊహించిన ఆర్చర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని కామెంట్లు కూడా పెడుతున్నారు.అయితే ఆర్చర్ నిజంగా ఆ ట్వీట్ చేశాడా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలని మరికొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. ఎందు కంటే గతంలో మురళీ విజయ్‌తో విభేదాల సమయంలో క్రికెటర్ దినేశ్ కార్తిక్ కూడా ఇలాంటి ట్వీట్ చేసినట్లు గుర్తు చేస్తున్నారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో జోఫ్రా ఆర్చర్ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన ఆర్చర్ 15 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. ఇక సీజన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ రాయల్స్ రెండో అంచె పోటీల్లో వరుస ఓటములు చవిచూస్తోంది. అయితే ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.pic.twitter.com/hoSIATmltw— Out Of Context Cricket (@GemsOfCricket) May 4, 2026 చదవండి: పాక్ పరువు గోవిందా.. అంత తక్కువ ప్రైజ్‌మనీనా! -
టీవీకే అద్భుత పెర్ఫార్మన్స్.. కంగ్రాట్స్: మోదీ
న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. బీజేపీ గెలిచిన మూడు రాష్ట్రాల ఫలితాలతో పాటు మిగతా రెండు రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలపై ఆయన ట్వీట్లు చేశారు.“పశ్చిమ బెంగాల్లో కమలం వికసించింది. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రజాశక్తి విజయం సాధించింది. బీజేపీ సుపరిపాలన రాజకీయాలు గెలిచాయి. పశ్చిమ బెంగాల్ ప్రజల ప్రతి ఒక్కరికీ నేను నమస్కరిస్తున్నాను. ప్రజలు బీజేపీకి అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు. వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు మా పార్టీ సాధ్యమైన ప్రతిదీ చేస్తుందని నేను హామీ ఇస్తున్నాను. సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలు, గౌరవం కల్పించే ప్రభుత్వాన్ని అందిస్తాము. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన ఈ చరిత్రాత్మక విజయం అనేక తరాలుగా కష్టపడి పనిచేసిన అనేక మంది కార్యకర్తల ప్రయత్నాలు, పోరాటాలు లేకుండా సాధ్యమయ్యేది కాదు. వారందరికీ నేను వందనం చేస్తున్నాను. ఏళ్ల తరబడి వారు కష్టపడి పని చేశారు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు, మా అభివృద్ధి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. వారు మా పార్టీకి అసలైన బలం’’ అని తెలిపారు.టీవీకేకు అభినందనలు ‘‘తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతు ఇచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలు. ప్రజల సమస్యల పరిష్కారం, వారి జీవన పరిస్థితుల మెరుగుదలలో మేము ఎప్పుడూ ముందుండి పని చేస్తాము. టీవీకే అద్భుత ప్రదర్శనకు అభినందనలు. కేంద్రం తమిళనాడు అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుతుంది’’ అని ప్రధాని మోదీ చెప్పారు.అస్సాంలో వారి కృషి వల్లే.. “అస్సాం మరోసారి బీజేపీ-ఎన్డీఏను ఆశీర్వదించింది. అస్సాం విధాన్ సభ ఎన్నికల్లో బీజేపీ-ఎన్డీఏ విజయం సాధించడం, మా కూటమి అభివృద్ధిపై పెట్టిన దృష్టి, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలన్న ప్రయత్నాలకు ఉన్న అచంచల విశ్వాసాన్ని చూపిస్తోంది. ఈ భారీ విజయం ఇచ్చినందుకు అస్సాంలోని నా సోదరులు, సోదరీమణులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.రాష్ట్రంలో మార్పు కోసం మేము నిరంతరం పనిచేస్తామని వారికి హామీ ఇస్తున్నాను. అస్సాం ప్రజల మధ్య నిరంతరం కృషి చేసిన బీజేపీ-ఎన్డీఏ కార్యకర్తలందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. గత దశాబ్దంలో మా పార్టీ కూటమి ఎంతగా ఎదిగిందో చూడటం ప్రశంసనీయమైన విషయం. వారి కృషి వల్లే మా సానుకూల అజెండా ప్రజల మనసులను తాకింది’’ అని అన్నారు. కేరళ గురించి..‘‘కేరళలో ఎన్డీయేకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. కేరళ పురోగతికి, వికసిత కేరళ లక్ష్యం సాధన కోసం కష్టపడతాము. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ విజయం సాధించినందుకు అభినందనలు’’ అని మోదీ చెప్పారు. ప్రభుత్వ పనితీరు ఆధారంగా తీర్పు ‘‘పుదుచ్చేరికి ధన్యవాదాలు. మంచి పాలనలో మా గత అనుభవం, ఎన్.రంగస్వామి నాయకత్వంలోని ప్రభుత్వ పని ఆధారంగా పుదుచ్చేరి ప్రజలు ఎన్డీయేకు మరోసారి అవకాశం ఇచ్చారు. ఈ ఆశీర్వాదం మా సుపరిపాలనను బలపరచే ప్రయత్నాలకు ఊతం ఇస్తుంది’’ అని చెప్పారు. -
విజయ్ గెలుస్తాడని చెప్తే దేశమంతా నవ్వారు..!
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఐదు రాష్ట్రాల ఫలితాలు రానే వచ్చాయి. ఫలితాలన్నే ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్‌కు అనుకూలంగానే ఉన్నాయి. ఒక్క తమిళనాడు తప్ప అక్కడ మాత్రం ఎవరు ఉహించని విధంగా సినీ స్టార్ పార్టీ టీవీకే ఘన విజయం సాధించి లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాగా ఈ ఫలితాల అంచనాను ముందే ఓ ఏజెన్సీ ఊహించింది. అయితే దాని అంచనా చూసి తొలుత అందరూ నవ్వుకున్నారని ఆ సంస్థ చీఫ్ ప్రదీప్ గుప్తా జాతీయ మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. బెంగాల్, అస్సాంలలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగురవేస్తుండగా కేరళలో విజయకేతనం ఎగురవేస్తుండగా యూడీఎఫ్ విజయదుదుంబి మోగించింది. అయితే్ ఈ ఎన్నికల్లో అందర్ని ఆశ్చర్యానికి గురి చేసిన ఫలితాలు మాత్రం తమిళనాడువే.. డీఎంకే, ఏఐడీఎంకే లాంటి సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీలను వెనక్కి నెట్టి ఫిలిం స్టార్ విజయ్ పార్టీ ఆ రాష్ట్రంలో అధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది. అయితే ఈ విజయాన్ని తొలుతగా అంచనా వేసింది మాత్రం ఆక్సిస్ ఇండియా మాత్రమే అయితే ఆ సమయంలో ఆసర్వేలను చూసి దేశమంతా నవ్వుకుందని ఆ సంస్థ అధినేత ప్రదీప్ గుప్తా అన్నారు.ప్రదీప్ గుప్తా వ్యాఖ్యలు డేటా సైన్స్ విజయం: "ఇది డేటా సైన్స్ సాధించిన విజయం. మిగతా సంస్థలు గ్రౌండ్ లెవల్లో ప్రజల నాడిని ఎందుకు పట్టుకోలేకపోయాయో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. మేము అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేసాం కానీ దీనిని ఎవరూ నమ్మలేదుఇదంతా ఒక గాలి వార్త అని కొట్టిపారేశారు. రాజకీయ విశ్లేషకులు, ఇతర సంస్థలు మమ్మల్ని చూసి నవ్వుకున్నాయి అన్నారు.విజయ్ టీవీకే పార్టీకి టీవీకేకు తాము చెప్పినట్టే 35 శాతం ఓట్లు లభిస్తున్నాయని డీఎంకేకు మాత్రం 35 శాతం ఓట్లు వస్తాయని తాము అంచనా వేయగా, ప్రస్తుతం 32 శాతంగా ఉందన్నారు. ఏఐఏడీఎంకే (AIADMK) కి 23 శాతం వస్తాయని చెబితే, ప్రస్తుతం 27 శాతంగా ఉందని చెప్పారు. అదే స్థానాల ప్రకారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే రెండో స్థానంలో, ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే మూడో స్థానంలో నిలుస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.టీవీకే విజయానికి కారణాలుప్రదీప్ గుప్తా విశ్లేషణ ..తమిళనాట 18 నుండి 39 ఏళ్ల మధ్య వయస్సు గల అధికంగా 42 శాతం మంది ఉన్నారని వీరంతా విజయ్ వైపు మెుగ్గు చూపారని తెలిపారు. 40 ఏళ్ల పైబడిన వారిలో 25 నుండి 30 శాతం మంది విజయ్‌కు మద్దతు ఇచ్చారు. అదే విధంగా డీఎంకే తరువాత అధికంగా మహిళా ఓటర్లు టీవీకేకే ఓటు వేసినట్లు తాము గుర్తించామని తెలిపారు. కాగా ప్రస్తుతం తమిళనాడులో టీవీకే 40 స్థానాల్లో గెలువగా మరో 60 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. -
తమిళనాడులో ఎవరెన్ని ఓట్లు సాధించారంటే..!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాల నడుమ విజయ్ టీవీకే పార్టీ ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందా.. లేదా అనే దానిపై విపరీతమైన ఆసక్తి చోటు చేసుకుంది. ప్రధానంగా టీవీకే ఎన్ని సీట్లు సాధిస్తుందనే దానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ వందకుపైగా స్థానాల్లో టీవీకే ఆధిక్యంలో కొనసాగుతుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు అవసరం. ఉదయం నుంచి 100 నుంచి 107 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం కొనసాగుతోంది. అదే సమయంలో విజయ్ పార్టీ చాలా చోట్ల స్వల్ప మెజార్టీతో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. 8 చోట్ల 500 ఓట్ల మెజార్టీతో, 12 స్థానాల్లో రెండు వేల మెజార్టీతో విజయ్ పార్టీ ఉంది. ఇది ఇలాగే కొనసాగితే విజయ్ వంద సీట్ల మార్క్‌కు ఏమీ ఢోకా ఉండదు.. కానీ ప్రభుత్వాన్ని సింగిల్‌గా ఏర్పాటు చేయడం మాత్రం కష్టమవడం ఖాయం. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు టీవీకేకు మద్దతు ఇచ్చినా అది ఎంతవరకూ సరిపోతుంది అనే దానిపై చర్చ నడుస్తోంది. దాంతో మరొక పెద్ద పార్టీతో టీవీకేకు పొత్తు అనివార్యమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదిలా ఉంచితే, తమిళనాడులో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే దానిపై ఒక స్పష్టత వచ్చింది. ఇప్పటివరకూ విడుదలైన ఫలితాల్ని బట్టి.. విజయ్ టీవీకే పార్టీ సాధించిన ఓట్లు 1.28 కోట్లు. దాంతో విజయ్ పార్టీ ఎక్కువ సీట్లలో ఆధిక్యంలో కొనసాగడానికి కారణమైంది. ఇక స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ కూడా విజయ్ పార్టీకి చాలా దగ్గరగానే వచ్చింది. డీఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.17 కోట్లు, కాగా డీఎంకే ఒంటరిగా సాధించిన ఓట్లు 83 లక్షలు. ఇక మూడో స్థానంలో కొనసాగుతున్న ఏఐఏడీఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.08 కోట్లు, కాగా ఒంటరిగా ఆ పార్టీ 77 లక్షలు సాధించింది. పుంజుకున్న డీఎంకే..!కౌంటింగ్ ఆరంభమైనప్పటినుంచీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ మూడో స్థానంలో కొనసాగిన డీఎంకే.. అటు తర్వాత మెల్లగా పుంజుకుంది. తొలుత 50 సీట్లనైనా డీఎంకే గెలుస్తుందా అనే దిశ నుంచి 77 సీట్ల ఆధిక్యంలోకి డీఎంకే వచ్చింది. అంటే డీఎంకే బాగా పుంజుకుని విజయ్ పార్టీ ఊపుకు కాస్త అడ్డుకట్ట వేసింది. ప్రస్తుతం ఇంకా కొంటింగ్ జరుగుతున్న క్రమంలో డీఎంకే మరిన్ని సీట్లను గెలుచుకుని విజయ్ ఆధిక్యాన్ని తగ్గించవచ్చే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుమారుగా డీఎంకే ఓట్ల షేర్ అంతా కూడా టీవీకే షిప్ట్ అవడమే విజయ్ అనూహ్య ఫలితాలకు కారణమైంది. విజయ్ టీవీకే పార్టీకి ఏకధాటి ఊపు ఇవ్వకుండా డీఎంకే ఎంతో కొంత మెరుగైన ఫలితాల దిశగానే ముందుకెళుతుందనే చెప్పాలి. విజయ్ పార్టీ ఒక సీటు ఆధిక్యం తగ్గుతుంటే అదే సమయంలో డీఎంకే ఆధిక్యం పెరుగుతూ వస్తోంది. ఇది కాస్త సస్పెన్స్‌ను కూడా క్రియేట్ చేస్తోంది. సీఎం స్టాలిన్ కొళత్తూర్ నుంచి ఓడి పోవడం ఆ పార్టీకి కాస్త ఎదురుదెబ్బ మినహా పుంజుకున్న తీరు.. టీవీకే ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటు చేయడాన్ని క్లిష్టం చేస్తోంది. -
‘నా కొడుకు సీఎం అవుతున్నాడు.. కాంగ్రెస్‌తో కలిసి..’
చెన్నై: తమిళనాడులో టీవీకే గెలుపుపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. తమిళ ప్రజలకు మేలు చేయాలనేదే విజయ్ లక్ష్యమని చెప్పారు. గెలుపుపై విజయ్ మొదటి నుంచి ధీమాగా ఉన్నారని తెలిపారు. ఒక్కో మెట్టు ఎక్కి ఇప్పుడు సీఎం అవుతున్నారని చెప్పారు. తాను విజయ్ తండ్రిగా గర్విస్తున్నానని తెలిపారు. ఏ కూటమిలోనూ చేరకుండానే టీవీకే విజయం సాధించడం ఆయన ధైర్యాన్ని చూపుతోందని అన్నారు. కాంగ్రెస్‌తో టీవీకే చేతులు కలపాలని బహిరంగ పిలుపునిచ్చారు.“కాంగ్రెస్‌కు చరిత్ర, సంప్రదాయం ఉన్నాయి. అలాంటి కాంగ్రెస్ ప్రభ ఎందుకు తగ్గిపోతుంది? అధికారం లేకపోవడం వల్లే తగ్గిపోతుంది. ఆ అధికారాన్ని మేమే ఇస్తాం. విజయ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ అధికారం వస్తే కాంగ్రెస్ తన చరిత్రను నిలబెట్టుకుంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. గత 30 సంవత్సరాలుగా సమాజం కోసం, తమిళ ప్రజల కోసం ఏదో చేయాలనే ఆలోచన విజయ్‌లో ఉంది. అది ఆయన మనసులో ఉండేది. తమిళ ప్రజలు విజయ్ను నాయకుడిగానే కాదు, ప్రతి మహిళ ఆయనను తన కుమారుడిగా భావిస్తుంది. యువత ఆయనను తమ అన్నగా చూస్తుంది. అందరూ ఆయనను అన్న అని పిలుస్తారు. వృద్ధ మహిళలు ఆయనను తమ కుమారుడిగా చూస్తారు. కొంతమంది 60 సంవత్సరాల మహిళలు ఆయనను తమ మనవడిగా భావిస్తారు. ప్రజలతో విజయ్ అలాంటి బంధాన్ని ఏర్పరచుకున్నాురు” అని తెలిపారు. రాష్ట్రంలో టీవీకే ముందంజలో ఉండడడంతో “నేను చాలా సంతోషంగా ఉన్నాను” అని టీవీకే అధినేత విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ అన్నారు. ఆ సమయంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. “ఆమె ఆయనను తల్లిగానే కాదు. ఆమె విజయ్ తొలి అభిమాని. ఆమె చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు. -
సీఎం స్టాలిన్ పరాజయం.. ఎవరా? టీవీకే గెలుపు గుర్రం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు బిగ్‌షాక్ తగిలింది. కొళత్తూరులో సీఎం స్టాలిన్ ఓటమి పాలయ్యారు. ఆయనపై పోటీ చేసిన టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు విజయం సాధించారు. తమిళనాడులోని అత్యంత కీలకమైన నియోజకవర్గాలలో కొళత్తూరు ఒకటి. ఇది సీఎం ఎంకే స్టాలిన్ కంచుకోటగా ప్రసిద్ధి చెందింది. వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో (2011, 2016, 2021) ఆయన ఇక్కడ గెలుపొందారు. ఈసారి మాత్రం అంచనాలు తలకిందులయ్యాయి. కొళత్తూరులో సీఎం స్టాలిన్ ఓటమి పాలయ్యారు. ఆయనపై పోటీ చేసిన టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు విజయం సాధించారు. ఈ ఫలితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోటీ చేసిన తొలిసారి ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించడం మరో విశేషం. మధ్యాహ్నం 4.15 గంటల వరకు టీవీకే 105 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో అధికార డీఎంకే 76 స్థానాల్లో, ఏడీఎంకే 53 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సంఖ్య 118.టీవీకే విజయానికి యువ ఓటర్ల మద్దతు, అధికార వ్యతిరేక భావజాలం, బలమైన గ్రామీణ స్థాయి ప్రచారం కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఫలితం తమిళనాడులో దీర్ఘకాలిక రాజకీయ దిశలో కీలక మార్పును సూచిస్తోంది. -
5 రాష్ట్రాల ఎన్నికలు : మోదీ మ్యాజిక్..ఆ పది కారణాలు!
2026 అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ దళం తన హవాను చాటుకుంది. రెండు అద్భుతమైన విజయాలు, ఉత్సాహభరితమైన కమ్ బ్యాక్ వెరసి ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 3-5 స్కోర్‌లైన్‌ను కైవసం చేసుకోనుంది. లేడీ టైగర్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ప్రజాముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న స్టాలిన్, మరీ ముఖ్యంగా కేరళలో పినరయి విజయ్న్తోపాటు ఇతర నేతలకు కూడా ఇవొక గుణ పాఠంగా చెప్పవచ్చు. రాజకీయ ఉద్ధండులు, సిట్టింగ్ సీఎంలుగా ఉన్న ఈ ముగ్గురి నేతృత్వంలోని ఓటమి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నప్పటికీ బీజేపీ ప్రభావం, హవా మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.వెస్ట్ బెంగాల్లో బీజేపీ పాగా, కనిపించని ‘మమత’ దాదాపు 50 ఏళ్లుగా టీఎంసీ లేదా వామపక్షాలు మాత్రమే పాలించిన పశ్చిమ బెంగాల్లో బీజేపీ పాగా వేసింది. బలమైన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను గద్దె దించి, తొలిసారి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. వామపక్ష రాష్ట్రం బెంగాల్లో, తమ ఉనికిని విస్తరించుకునే లక్ష్యంతో బయలుదేరిన బీజేపీకి పని చాలా కష్టతరమైంది. 2016 ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం మూడు సీట్లు మాత్రమే గెలుచుకుని, రాష్ట్రంలో ఒక నామమాత్రపు పార్టీగా మాత్రమే ఉండేది. ఒక దశాబ్ద కాలంలోనే, బీజేపీ భారత చరిత్రలోనే అత్యంత అద్భుతమైన వృద్ధి పథంలో ఒకటిగా నిలిచింది. బెంగాల్లో రాజకీయ రంగంలో తనకంటూ ఒక ముఖ్యమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరైన మమతా బెనర్జీకి గట్టి దెబ్బ కొట్టింది.చారిత్రాత్మక నాలుగోసారి అధికారం చేపట్టాలని కన్న మమత అభేద్యమైన కంచుకోట, బీజేపీ మాయాజాలం ముఖ్యంగా మోదీ మాయాజాలంతో కూలిపోయింది. అలుపెరుగని మోదీ ర్యాలీలు, ప్రచారం, మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంపై దృష్టి సారిస్తూ, మోదీ చొరబాటు ఆరోపణలపై టీఎంసీని లక్ష్యంగా చేసుకున్నారు. తనదైన శైలిలో దీదీ (మమత)ని ఎగతాళి చేశారు. దీనికి తోడు క్షీణిస్తున్న శాంతిభద్రతలు, ఆర్.జి. కార్, సందేశ్‌ఖాలి వంటి ఘటనలు, ఓటర్లలో నిరాశ, టీఎంసీ 'తోలాబాజీ'పై పెరుగుతున్న ఆగ్రహం వంటివి ఓటర్లు కొనసాగింపు కంటే "పరివర్తన్" (మార్పు)ను ఎంచుకునేలా చేశాయి. 2024లో ఒడిశాను జయించి, గత నెలలో బీహార్‌లో తమ సొంత ముఖ్యమంత్రిని నియమించుకున్న తర్వాత, తూర్పున బీజేపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.కేరళం మార్పుకే పట్టం! దెబ్బకొట్టిన కాంగ్రెస్కేరళంలో కురువృద్ధుడు,ప్రజాదరణనేతగా పాపులర్ పినరయ్ విజయన్‌కు ఈ సారి ప్రజలు భారీ షాకే ఇచ్చారు. తన ప్రత్యర్థి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF)కు వరుసగా రెండు పర్యాయాలు అధికారం ఇచ్చిన తర్వాత, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)పై తన విశ్వాసాన్ని ప్రకటించారు. దీంతో కేరళం ఇప్పుడు తిరిగి యూడీఎఫ్ చేతుల్లోకి వచ్చింది.అవినీతి ఆరోపణలు, వామపక్షాల స్వరూపమే మారుతోందన్న ఆరోపణలతో సతమతమవుతున్న సీపీఎం, మరో ఐదేళ్లపాటు పాలించే అధికారాన్ని కోల్పోయింది. రాష్ట్రంలోని 140 స్థానాలకు గాను 100 స్థానాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఆధిక్యంలో ఉంది. ఇది దక్షిణాదిలో తన ప్రాముఖ్యతను కాపాడుకోవాలని చూస్తున్న బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కాంగ్రెస్ ప్రచారంతోపాటు కేరళలో మార్పు పవనాలు వీచాయి. అస్సాం - పుదుచ్చేరిలో, NDA సునాయాస విజయాలు సాధించి, కీలకమైన ఈశాన్య, దక్షిణ కంచుకోటలలో తన పట్టును సుస్థిరం చేసుకుంది.డీఎంకేకి షాక్, అరంగేట్రంలోనే విజయ్ అదుర్స్ తమిళనాడులో, నటుడు-రాజకీయవేత్త విజయ్ టీవీకే పార్టీ, అరంగేట్రంలో బ్లాక్‌బస్టర్ అరంగేట్రంతో విప్లవాత్మక విజయం దూసుకుపోతున్నాడు. ఆరు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలకు వెన్నెముకగా ఉన్న డీఎంకే , ఏఐఏడీఎంకే అనే రెండు కూటముల ద్విముఖ ద్రావిడ ఆధిపత్యాన్ని బద్దలు చేసింది. విజయ్ స్టార్ పవర్ ,రెండు ద్రవిడ దిగ్గజాలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలపై ఓటర్లలో పెరుగుతున్న అసహనం కారణంగా తమిళనాడులో ఆశ్చర్యకరమైన ఆధిక్యాన్ని అందించాయి. 2026లో నిజమైన మార్పును కోరుకుంటూ, ఓటర్లు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలోని పాత మూస ధోరణుల నుండి బయటపడటానికి సిద్ధంగా ఉన్నారని కూడా స్పష్టమవుతోంది. తుదిఫలితాలు, తమిళనాడులో ఎన్నికల అనంతర పొత్తులు ఎలా ఉంటాయో చూడాల్సి ఉన్నప్పటికీ, ఈ ఎన్నికలకు అసలైన సూపర్‌స్టార్ విజయేనన్నది స్పష్టం.అస్సాంలో హిమంత హ్యాట్రిక్: రాష్ట్రంలోని 126 స్థానాలకు గాను దాదాపు 100 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత అనే చిన్నపాటి వాదనను కూడా పూర్తిగా తోసిపుచ్చుతూ, అస్సాంలో తన అత్యంత ఆధిపత్య ప్రదర్శనను కనబరచడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై బీజేపీ పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. రాష్ట్రంలో స్పష్టమైన మెజార్టీతో హిమంత మూడోసారి సీఎం పీఠాన్ని అధిష్టించబోతున్నారు.పుదుచ్చేరిలో కూడా అధికారి బీజేపీ కూటమి మళ్లీ అధికారాన్ని చేపట్టనుంది. అయిదోసారి ఎన్. రంగస్వామి ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు.ఇండియా కూటమికి కష్టాలేనా?2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కొద్దికాలం పాటు ప్రోత్సాహకరంగా పుంజుకున్న ప్రతిపక్ష ఇండియా కూటమికి ఈ ఎన్నికల ఫలితాలు మరిన్ని కష్టాలు తప్పవనే సంకేతాలనిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు కేవలం ఒక తాత్కాలిక పరిణామం మాత్రమేనని ఎన్డీఏ నిరూపించడంతో, ఇప్పుడు ప్రతిపక్షం మళ్లీ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎందుకంటే, బీజేపీ అన్ని ప్రత్యర్థి పార్టీలను పాతాళానికి తొక్కేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తోంది. అంతేకాకుండా, జాతీయ స్థాయిలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్లను పక్కన పెట్టడంతో, 2029 లోక్‌సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. -
అస్సాంలో కమలం హ్యాట్రిక్.. ?
అస్సాంలో బీజేపీ హావా కొనసాగుతుంది. రికార్డు స్థాయి విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతుంది. మైనార్టీల శాతం అధికంగా ఉన్న రాష్ట్రంలో బంపర్ మోజారిటీ దిశగా సాగుతుంది. అయితే బీజేపీకి ఇంత భారీ విజయం దక్కడం వెనుక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ రాజకీయ ఎత్తుగడలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.హిమంత మార్క్ పాలనఅసోంలో ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా మహిళలను బాగా ఆకర్షించాయి. 'అరుణోదోయ్' ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు ప్రభుత్వానికి పెద్దఎత్తున మైలేజ్ ఇచ్చాయి. ఈ పథకం మతాలకు అతీతంగా పేద మహిళల మద్దతును కూడగట్టుకునేలా చేసిందిదానితో పాటు స్థానిక అస్సామీలకు ప్రత్యేక గుర్తింపునిచ్చేలా "భూమిపుత్రులకు రక్షణ" అనే నినాదంతో ఆయన ప్రచారం సాగించారు. అక్రమ చొరబాటుదారుల అంశాన్ని బలంగా వినిపిస్తూ, స్థానిక అస్సామీ సంస్కృతిని కాపాడతామనే భరోసానివ్వడం స్థానికంగా ఎంతో కలిసివచ్చింది. అయితే సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రజలతో నేరుగా మమేకమయ్యే తీరు ఆ రాష్ట్రంలో యువతను బాగా ఆకర్షించింది.మైనార్టీల ఓట్లు అధికంగా ఉన్నప్పటికీ విజయం ఎలా సాధ్యమైంది?హిమంత బిశ్వశర్మ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ 2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అస్సాం రాజకీయాల్లో కీలక మార్పు తెచ్చింది. దీనివల్ల మైనార్టీ ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్న స్థానాల సంఖ్య తగ్గింది. ఫలితంగా, స్థానిక అస్సామీ జనాభా ప్రభావం ఉన్న స్థానాల్లో బీజేపీ బలం పెరిగింది. గతంలో కాంగ్రెస్, AIUDF (బద్రుద్దీన్ అజ్మల్ పార్టీ) కలిసి పోటీ చేసేవి. కానీ ఈసారి విడివిడిగా లేదా బలహీనమైన కూటములతో పోటీ చేయడం వల్ల మైనార్టీ ఓట్లు చీలిపోయి బీజేపీకి మేలు జరిగింది.దానితో పాటు తిరుగుబాటు దారుల సమస్య అధికంగా ఉండడంతో ఆ సమస్య ప్రధానంగా ఎన్నికల ప్రచారం సాగింది.రాష్ట్రంలోని వివిధ హిందూ వర్గాలను (అస్సామీ, బెంగాలీ, గిరిజనులు) బీజేపీ ఒకే తాటిపైకి తీసుకురాగలిగింది.హిమంత బిశ్వశర్మ నేపథ్యం2015 వరకూ జాతీయ కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగిన హిమంత బిశ్వశర్మ హస్తంతో విభేదాల కారణంగా బీజేపీలో చేరారు. చేరిన ఏడాదికే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాగా తన ఎత్తులతో 15 ఏళ్లుగా బీజేపీ కూటమిని అధికారంలోకి వచ్చేలా చేశారు. దీంతో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కోటకు బీటలు వారింది. అయితే ఆసమయంలో సర్బానంద సోనోవాలా ముఖ్యమంత్రి కాగా అతని క్యాబినెట్లో హిమంత మంత్రిగా పనిచేశారు.అనంతరం 2021లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ బీజేపీ వరుసగా రెండో సారి అధికారం చేజిక్కించుకుంది. అయితే ఈ సారి కమలనాథులు హిమంతకే ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న హిమంత అభివృద్ధే లక్షంగా సంక్షేమ పథకాలతో తనదైన శైలిలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందు నడిపారు. హిమంత నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి సైతం బీజేపీ భారీ మెజారీటీతో అధికారం దిశగా దూసుకుపోతుంది. -
హాట్‌టాపిక్‌గా నటి త్రిష తిరుపతి ఆలయ సందర్శన..!
త్రిష తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం.. సరిగ్గా అదే సమయానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న త్రిష.. తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌తో ఆమె సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అదీగాక ఇవాళ త్రిష పుట్టిన రోజు కూడా కావడం ఈ సందర్శన మరింత హాట్‌టాపిక్‌గా మారింది. ఇక్కడ నటి త్రిష కలియుగ దైవమైన ఆ తిరుపతి వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు వచ్చిన విధానం అందర్నీ అమితంగా ఆకర్షించింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. త్రిష అజా ఫ్యాషన్స్‌కు చెందిన వైట్‌సూట్‌తో అలరించింది. దీని ధర రూ. 12000 పైనే పలుకుతుందట. వినెక్‌తో కూడిన ఐవరీ కలర్ చేనేత వస్త్రం. ముఖ్యంగా ఈ వేసవి వేడికి ఆహ్లాదకరమైన హాయినిచ్చే కాటన్ కూడా ఇది. దీనికి తేలికపాటి ఫ్లోరల్ దుపట్టా ఈ డిజైనర్‌వేర్‌ని మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆలయాన్ని సందర్శించిన అనంతరం, త్రిష కృష్ణన్ చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా, తమిళనాడు,పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాల రోజు త్రిష ఆమె ఆలయ సందర్శన రెండూ ఏకకాలంలో జరగడం కూడా అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అదీగాక పోల్ ట్రెండ్స్ ప్రకారం, విజయ్ తమిళగ వెట్రి కజగం (టీవీకే) సంచలన విజయాన్ని నమోదు చేయడం విశేషం.తిరుమల ఆలయం విశిష్టత..ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో ఉన్న వెంకటేశ్వర ఆలయం, వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది అత్యంత సంపన్నమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. పైగా శేషాచలం కొండలపై ఉన్న అత్యంత ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం. కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన ప్రముఖ క్షేత్రం. ఏడు కొండలపైన కొలువైన శ్రీనివాసుడు, కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటూ, ప్రపంచంలోనే అత్యధిక భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రంగా అలరారుతోంది. ఇక్కడ మూలవిరాట్టు స్వయంభూగా వెలిశారని భక్తుల నమ్మకం.#WATCH | Andhra Pradesh: Actor Trisha Krishnan had the darshan of Lord Sri Venkateswara Swamy at Tirumala Tirupathi Devasthanam earlier this morning. pic.twitter.com/mhiaHMOu5l— ANI (@ANI) May 4, 2026 (చదవండి: 46 దేశాలు పర్యటించా..కానీ భారత్ పర్యటన..!) -
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు దిశగా టీవీకే విజయ్
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు దిశగా టీవీకే చీఫ్ విజయ్ అడుగులు వేస్తున్నారు. పార్టీ అభ్యర్థులకు విజయ్ కీలక ఆదేశాలు ఇచ్చారు. అభ్యర్థులంతా చెన్నై రావాలని పిలుపు ఇచ్చారు. ట్రెండ్ ప్రకారం మ్యాజిక్ ఫిగర్ 118కి చేరువలో టీవీకే ఆగిపోనుంది.సోమవారం రాత్రి 8 గంటల నాటికి 70 స్థానాల్లో గెలిచి మరో 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ మార్క్ రాకపోతే ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నదానిపై విజయ్ చర్చలు జరుపుతున్నారు. విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్, పీఎంకే సిద్ధంగా ఉన్నాయి. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా విజయ్ టీవీకే అవతరిస్తోంది. మరోవైపు, కాసేపట్లో తమిళనాడు సీఎం స్టాలిన్ గవర్నర్‌ను కలవనున్నారు. సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే విజయ్‌కు మద్దతు ఇస్తామన్న సంకేతాలు పంపింది. అలాగే టీవీకే పార్టీతో అధికారాన్ని పంచుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని విజయ్ తండ్రి చంద్రశేఖర్ సూచించారు. ఎన్నికల ముందు దశలో టీవీకే.. ఎఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ, డీఎంకే రెండింటితోనూ కూటములను పూర్తిగా తిరస్కరించింది.అయితే, మెజారిటీ మార్కు దాటేందుకు టీవీకేకు చిన్న ద్రావిడ పార్టీల మద్దతు అవసరం కావచ్చు. తమిళనాడుకు ఎంజీఆర్ వంటి సినీ తారలను నాయకులుగా ఎన్నుకున్న దీర్ఘ చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో విజయ్ కూడా చేరారు. -
టీవీకే చీఫ్ విజయ్‌కు వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి: తమిళనాడులో అనూహ్య ఫలితాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న టీవీకే చీఫ్ విజయ్‌కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. సోదరుడు విజయ్‌కు అభినందనలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రజాజీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న విజయ్‌కు మరింత మంచి జరగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.బెంగాల్లో బీజీపీకి వైఎస్ జగన్ అభినందనలుపశ్చిమబెంగాల్లో టీఎంసీ ఓటమి పట్ల వైఎస్ జగన్ సానుభూతి తెలియజేశారు. దీదీ(మమతా బెనర్జీ) ప్రభుత్వం ఓటమి పట్ల సానుభూతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. పశ్చిమ బెంగాల్ అతిపెద్దగా పార్టీగా అవతరించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన బీజేపీకి అభినందనలు తెలిపారు. అలాగే అక్కడ గెలిచిన ఇతర అభ్యర్థులకు వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you. My sympathies are with Didi.…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 4, 2026 -
విజయ్ విక్టరీ వెనుక ఆ ఒక్కడు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. పార్టీ పెట్టి రెండేళ్లే అవుతున్నా.. తమిళ రాజకీయాల్లో వేళ్లూనుకుపోయిన డీఎంకే, అన్నాడీఎంకే లాంటి పార్టీలను మట్టికరిపించింది. అయితే.. ఈ విజయ్ విజయం వెనుక ఉన్న వ్యక్తి గురించి ఇప్పుడు చర్చ మొదలైంది.2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్ విక్టరీ వెనుక ఉన్న కపిల్ సాహు. ఎన్నికల వ్యూహంలో ఆయనకు పదేళ్ల అనుభవం ఉంది. 2019 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్డీఎఫ్ ప్రచారానికి నాయకత్వం వహించారు. 2020 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌లో రాఘవ్ చద్దా నియోజకవర్గ స్థాయి ప్రచారాన్ని నిర్వహించారు. యూపీలో ఆప్ విస్తరణలో కీలక పాత పోషించారు. కాంగ్రెస్ పార్టీతోనూ జాతీయ స్థాయిలో పని చేసిన అనుభవం ఉంది ఈయనకు.గతంలో ఐప్యాక్(Indian Political Action Committee)లో పని చేసిన ఆయన.. ఆ అనుభవంతో 12 మంది బృందంతో సొంత టీం ఏర్పాటు చేసుకుని స్వతంత్ర కన్సల్టెంట్‌గా మారారు. ఆ తర్వాత విజయ్ టీవీకేకు వ్యూహాలు అందించారు. డీఎంకే, అన్నాడీఎంకేలను ఢీకొట్టే విధంగా టీవీకే వ్యూహాలు రచించారు. టీవీకేకు ప్రచార సందేశాలను రూపొందించడం.. గ్రామీణ స్థాయి కార్యకలాపాలను సమన్వయం చేయడం.. ఓటర్ల డేటాను విశ్లేషించి చేరువ వ్యూహాలను మెరుగుపరచడం చేశాడాయన. సాహు రూపొందించిన వ్యూహం పార్టీకి 100+ సీట్లలో ఆధిక్యం సాధించడానికి తోడ్పడింది. -
'తమిళనాడు సీఎం అవుతా.. విజయ్ ఆత్మవిశ్వాసం'
చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో హీరో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం(టీవీకే) సంచలన విజయం దిశగా దూసుకెళుతోంది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే ప్రస్తుతం 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ నాయకులు, కార్యకర్తలు, విజయ్ అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. తన కుమారుడు విజయంపై విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్పందించారు. చాలా గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు.ఎస్ఏ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా తన కుమారుడిలో ఆత్మవిశాసం రెట్టింపు అయిందని వెల్లడించారు. తాను కచ్చితంగా తమిళనాడు ముఖ్యమంత్రి అవుతానని విజయ్ బలంగా నమ్మాడని చెప్పారు. అతడు అనుకున్నట్టుగానే ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని తెలిపారు."ఒక తండ్రిగా నేను చాలా గర్వంగా, సంతోషంగా ఉన్నాను. నా కుమారుడికి శుభాకాంక్షలు. గత రెండేళ్లుగా అతడి ఆత్మవిశ్వాసం అద్భుతంగా ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా వస్తానన్న విజయ్ నమ్మకాన్ని నేను అభినందిస్తున్నాను. ఒక నాయకుడిగా, ఎలాంటి పొత్తు లేకుండా సొంత కాళ్లపై నిలబడతానన్నది అతడి ధైర్యం. విజయ్‌కి ఇది ఒక చారిత్రాత్మక విజయం అని నేను భావిస్తున్నాను" అని ఎస్ఏ చంద్రశేఖర్ అన్నారు.చదవండి: 'తమిళ సీఎం ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ'తమ కుమారుడి విజయం పట్ల తన భార్య శోభ కూడా సంతోషంగా ఉందని చంద్రశేఖర్ చెప్పారు. "ఆమె కేవలం అతడి తల్లి మాత్రమే కాదు. ఆమె విజయ్‌కి మొదటి అభిమాని. ఆమె చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.#WATCH | Chennai, Tamil Nadu: On TVK currently leading in 110 seats of the total 234 in the state, Director and TVK chief Vijay's father, SA Chandrasekhar, says, "As a father, I am very proud and happy. My wishes to my son. In the last two years, his confidence has been fantastic… pic.twitter.com/gsdLPatYbd— ANI (@ANI) May 4, 2026 -
తమిళనాడు ఫలితాలు.. పవన్ ఫీలవుతాడా?
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కేరళంలో యూడీఎఫ్ గెలుపు కాస్తా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మరింత గుర్తింపు తెచ్చేందుకు ఉపయోగపడవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్, మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్లు డీఎంకేని గెలిపించ లేకపోవడం తండ్రి కొడుకుల పాలనపై ప్రజల అసమ్మతికి నిదర్శనంగా అది ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌లకు ఆందోళన కలిగించే విషయం అవుతుంది. కాగా ప్రముఖ నటుడు విజయ్ రాజకీయ పార్టీని స్థాపించడమే కాకుండా, ఒంటరిగా పోటీచేసి అనూహ్యంగా విజయం వైపు దూసుకు వెళుతూండటం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కొంత ఇబ్బందికరం అవుతుంది. ఇకపై పవన్‌ను అందరూ విజయ్‌తో పోల్చడం.. అతడి విజయం.. ఈతడి ధోరణిపై ప్రశ్నలూ తలెత్తుతాయి. తమిళ ఎన్నికల ఫలితం వైఎస్సార్ కాంగ్రెస్‌కూ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎందుకంటే చంద్రబాబు తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసినా ఎన్డీయేని గెలిపించలేకపోయారని, అదే సమయంలో కొన్ని సభల్లో జగన్ ఫొటోను ప్రదర్శించిన టీవీకే పార్టీ నేత విజయ్ గెలుపు బాటలో ఉండటం వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందనడంలో సందేహం లేదు.జగన్ మాదిరిగా విజయ్ కూడా ఒంటరిగా పోటీలోకి దిగడం ఇంకో సారూప్యత. గట్టిగా కృషి చేస్తే పశ్చిమబెంగాల్లో మాదిరిగా తామూ గెలిచే అవకాశం ఉందన్న ఆశ ఈ ఎన్నికలు తెలంగాణ బీజేపీకి కలిగిస్తాయి. అదే టైమ్ లో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం ఉన్న బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల ద్వారా తన వ్యూహాలను పునఃసమీక్షించుకునే అవకాశం ఉంది. అసోంలో బీజేపీ గెలుపు అన్నది ఊహించిందే. పశ్చిమబెంగాల్ లో పై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆ స్థాయిలో కేంద్రీకృతం చేసిన తర్వాత, ఓట్ల జాబితా ప్రత్యేక సవరణ హడావుడి తర్వాత అక్కడ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నది బహిరంగ రహస్యమే.ఈ వ్యూహాలను గుర్తించి కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్ పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉందో లేదో తెలియదు. కాని ఆ వైపు ఆలోచించి ఉంటే ఎలా ఉండేదో! కేరళంలో ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు ఛాన్స్ ఉందని ఊహించిన పరిణామమే. కాగా అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీయే తిరిగి వస్తుందన్న అంచనాకు తగినట్లే జరిగింది. అన్నిటికన్నా సంచలనం తమిళనాడులో విజయ్ ఒంటరిగా పోటీచేసి డీఎంకే, అన్నాడీఎంకేలను వెనక్కు నెట్టేయడం. అందరి సలహాలను కాదని విజయ్ ఒంటరిగానే బరిలోకి దిగడం ఒక రకంగా సాహసమే.దేశ రాజకీయాలలో బీజేపీ హవా కొనసాగే విధంగానే ఈ ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. మోడీ, అమిత్ షా ల కాంబినేషన్ కు ఇప్పట్లో తిరుగులేదన్న అభిప్రాయం కలుగుతుంది. కేరళంలో కూడా బీజేపీ తన వంతు ప్రయత్నం చేసినా, వారికి ఓట్లశాతం పెరుగుతుందే తప్ప సీట్లు పెద్దగా రావని అందరికి తెలుసు. దేశంలో ఉన్న ఏకైక వామపక్ష రాష్ట్రం కేరళంలో ఈసారి సీపీఎం ఆధ్వర్యంలోని ఆధ్వర్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోవడం వామపక్షవాదులకు నిరాశ కలిగిస్తుంది. అక్కడ గెలిచిన యూడీఎఫ్ వల్ల కాంగ్రెస్ ఆశలు కొద్దిగా చిగురిస్తాయి. కాని తమిళనాడులో మిత్రపక్షం డీఎంకే పరాజయం చవిచూడడం ఇండియా కూటమికి పెద్ద దెబ్బ అవుతుంది.పశ్చిమబెంగాల్లో మూడు టర్మ్‌లుగా అధికారంలో ఎన్న టీఎంసీపై వ్యతిరేకత ఏర్పడటం సహజం. బీజేపీ అగ్ర నాయకత్వం కూడా ప.బెంగాల్లో ఎలాగైనా పాగా వేయాలన్న కృత నిశ్చయంతో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండటం, ఎన్నికల సంఘం తన వంతు పాత్ర పోషించడం వంటివి కూడా కలిసిరావడంతో బీజేపీ కల నిజమవుతోందని చెప్పాలి. ఎంత పోరాడినా మమత బెనర్జీ ఆమె పార్టీ చివరికి ఓడిపోక తప్పలేదు. ఏపీలో జనసేనను స్థాపించిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ సొంత అజెండా అనేది ఏదీ లేకుండా.. తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్న వైనం ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తుంది.విజయ్‌కు ఉన్న ధైర్యం పవన్‌కు లేకుండా పోయిందని, సీఎంను అవుతానంటూ కాపు సామాజికవర్గాన్ని ఊరించిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత చంద్రబాబుకు అతి విధేయుడుగా మారిపోవడం ఆ వర్గానికి అంతగా రుచించడం లేదు. పైగా ఇప్పుడు ఏకంగా 15 ఏళ్లు టీడీపీని భుజాన మోస్తానని చెబుతున్న వైనం మద్దతుదారులకు విసుగు తెప్పిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అంతగా నచ్చవు. పైకి బీజేపీని అభినందించినా, లోపల మనసులో మాత్రం బీజేపీ బెంగాల్ ఓడిపోయి ఉంటే,తమ ప్రాధాన్యత పెరిగి ఉండేదని టీడీపీ నేతలు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాను మరింతగా పొగడక తప్పదని లోలోపల మథన డుతూండవచ్చు. మరో కీలకమైన అంశం ఏమిటంటే తమిళనాడులో స్టాలిన్ ఉదయనిధిలు ఏపీలో మాదిరి రెడ్‌బుక్ అరాచకాలు చేయకపోయినా డీఎంకే ఓటమిపాలైంది. ఒక రకంగా ఆలోచిస్తే జనం కుటుంబ పాలనను వ్యతిరేకించారన్నమాట. ఇక ఏపీలో పవన్ కళ్యాణ్‌తో కలిసి చంద్రబాబు ఆకాశమే హద్దుగా ఇచ్చిన హామీలను అమలు చేయలేని స్థితిలో ఉన్నారు. పాలనా వైఫల్యంతో చంద్రబాబు ఉంటే, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ షాడో సీఎంగా వ్యవహరిస్తూ రెడ్ బుక్ అంటూ పోలీసులతో అరాచకాలు చేయిస్తున్నారు. అలాగే అత్యంత విలువైన విశాఖ భూములను తమ ఇష్టారీతిన 99 పైసలకే కట్టబెడుతున్న తీరుపై టీడీపీ వీర మద్దతుదారుగా పేరొందిన మాజీ పోలీసు అధికారి ఎ బి వెంకటేశ్వరరావు వంటివారు మండిపడుతున్నారు.అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీపై అంతా విస్తుపోతున్నారు. స్టాలిన్, ఉదయనిధిలు అరాచకాలు, విపక్షంపై వేధింపులు వంటివి చేయకపోయినా ఓటమిపాలయ్యారని, అలాంటిది ఏపీలో ఇంత దారుణమైన పరిస్తితులు ఉంటే జనం సహిస్తారా అన్నది చర్చగా ఉంది. అంతేకాక వచ్చే మూడేళ్లలో తెలుగుదేశంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవిస్తాయో చెప్పలేం. జూనియర్ ఎన్టీఆర్ వంటివారిని ఇంతకాలం దూరంగా ఉంచిన నేపథ్యంలో టీడీపీని మళ్లీ నందమూరి వంశం అధీనంలోకి తీసుకురావాలని ఒక వేళ ఆయన ఆలోచన చేస్తే రాజకీయాలు ఎటు మళ్లుతాయో ఇప్పటికిప్పుడు ఊహింలేం.కేరళం రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుతో రేవంత్‌కు ఉత్సాహం రావచ్చు.కాంగ్రెస్ జాతీయ నాయకత్వంలో ఆయన ప్రాధాన్యత పెరుగుతుంది. కాని బెంగాల్ లో విజయంతో బీజేపీ తెలంగాణలో ఏ గేమ్ ఆడుతుందో అన్న భయం ఉండవచ్చు. తమిళనాడు ఫలితాలు మాత్రం చంద్రబాబు, లోకేశ్ లకు నిద్ర లేకుండా చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరీ అంత సీరియస్ రాజకీయాలు చేయడం లేదు కనుక, సొంత వ్యక్తిత్వంతో రాజకీయ పార్టని నడపాలన్న లక్ష్యంతో లేరు కనుక ఆయన పెద్దగా ఫీల్ కాకపోవచ్చు. జగన్ కు మాత్రం తమిళనాడు ఎన్నికల ఫలితాలు మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపే అవకాశం ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
టీవీకే విజయ్ నివాసానికి నటి త్రిష
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. అసెంబ్లీ ఫలితాల్లో టీవీకే ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో టీవీకే చీఫ్ విజయ్ నివాసానికి చేరుకున్న నటి త్రిష.. ఎన్నికల్లో విజయంపై విజయ్‌కు త్రిష అభినందనలు తెలిపారు. ఇవాళ త్రిష బర్త్‌డే.. ఉదయం తిరుమలలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తిరుమల నుంచి నేరుగాచెన్నైకు వెళ్లిన త్రిష.. విజయ్‌కు విషెస్ చెప్పారు.త్రిష తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం.. సరిగ్గా అదే సమయానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న త్రిష.. తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌తో ఆమె సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.#WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan arrives at the residence of TVK chief Vijay, in Chennai. TVK is currently leading in 106 seats of the total 234 in the state. pic.twitter.com/Sezg1xgYDQ— ANI (@ANI) May 4, 2026ఆదివారం రాత్రి తన తిరుమల పర్యటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన త్రిష.. సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఎటువంటి హడావుడి లేకుండా, సామాన్య భక్తురాలిలా ఆమె శాంతియుతంగా పూజలు నిర్వహించారు. కాగా, చెన్నైలోని విజయ్ ఇంటికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. విజయ్ ఇంటి దగ్గర బాణాసంచా పేల్చి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చెన్నైలోని విజయ్ నివాసంలో కుటుంబసభ్యులు సంబరాలు చేసుకున్నారు. -
స్టాలిన్, పినరయికి షాక్... ఉత్కంఠ పోరులో దీదీ!
న్యూఢిల్లీ: తాజా ఎన్నికల ఫలితాల లెక్కింపులో ఎవరూ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉద్ధండులైన ముఖ్యమంత్రులు తమ సొంత కోటల్లోనే చతికిలబడుతున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళలో సీఎం పినరయి విజయన్ తమ నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉండగా, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీతో ఆధిక్యం దోబూచులాడుతోంది.కొళత్తూరులో స్టాలిన్‌కు షాక్తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ సృష్టించిన సునామీలో డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆరో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి కొళత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ 4,000కు పైగా ఓట్ల వెనుకంజలో ఉన్నారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 24,993 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతుండగా, స్టాలిన్‌కు కేవలం 20,982 ఓట్లు వచ్చాయి. ఇక అన్నాడీఎంకే అభ్యర్థి పి.సంతాన కృష్ణన్ 5,982 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా టీవీకే ఏకంగా 112 స్థానాల్లో దూసుకుపోతుండగా, అన్నాడీఎంకే కూటమి 72, డీఎంకే కేవలం 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.ధర్మదంలో తడబడుతున్న పినరయికేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సైతం తొలిసారి చేదు అనుభవం ఎదురవుతోంది. ధర్మదం నియోజకవర్గంలో ఆరో రౌండ్ కౌంటింగ్ తర్వాత ఆయన కాంగ్రెస్ అభ్యర్థి, అడ్వకేట్ వీపీ అబ్దుల్ రషీద్ చేతిలో 600 ఓట్ల తేడాతో వెనుకబడ్డారు. ఇప్పటివరకు పినరయికి 32,455 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కేవలం సీఎం మాత్రమే కాకుండా ఆయన కేబినెట్లోని పలువురు మంత్రులు కూడా వెనుకంజలో ఉండటం అధికార ఎల్డీఎఫ్ కూటమిని కుంగదీసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి వారికి గట్టి పోటీనిస్తోంది.భవానీపూర్‌లో దీదీ ఉత్కంఠ పోరుమరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొంటున్నారు. తొలి రౌండ్లలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కన్నా వెనుకబడిన ఆమె తరువాత క్రమంగా పుంజుకున్నారు. నాలుగో రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి మమత 17,244 ఓట్లు సాధించి, బీజేపీ అభ్యర్థిపై 8,000కు పైగా ఓట్ల ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నారు. క్షణక్షణానికి మారుతున్న ఈ ట్రెండ్స్ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. -
75 ఏళ్ల వయసులో ప్రభంజనం, ఎవరీ రంగస్వామి
మచ్చలేని తెల్లటి ధోవతి, పొడవాటి చొక్కా ఇదే ఆయన ఆహార్యం. 75 ఏళ్ల వయసు, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం. ఐదోసారి సీఎం పగ్గాలు చేపట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఆయన పేరే పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి. ఆయన రాజకీయ ప్రస్థానం, విజయాలపై కొన్ని అంశాలను పరిశీలిద్దాం. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగింది. ముఖ్యంగా ఏఐఎన్ఆర్సి వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి ప్రజల మద్దతు తమకే, అధికారం తమదే అన్నంత ప్రశాంతంగా పోలింగ్‌లో దూసుకుపోయారు. ఇంటింటికీ వెళ్తూ, తన విజయాలపై కరపత్రాలను స్వయంగా పంచుతూ చిరునవ్వుతో విజయంపై అడుగులు వేశారు.ఎవరీ రంగస్వామినాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, అవివాహితుడు . న్యాయశాస్త్ర పట్టభద్రుడు. ఆయన తట్టంచవాడి, మంగళం అనే రెండు నియోజకవర్గాల నుంచి ఐదోసారి ముఖ్యమంత్రి పదవికి పోటికి నిలిచారు. 2011లో అఖిల భారత ఎన్. ఆర్. కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సి) అనే తన సొంత పార్టీని స్థాపించి సంచలనంరేపారు. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఎదురులేని నాయకుడిగా ప్రజల అభిమానాన్ని దక్కించుకున్నారు.అందుకే ఆయన "వాళుం కామరాజర్" (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, జీవించి ఉన్న కామరాజు),"మక్కలిన్ ముత్తల్వార్" (ప్రజల ముఖ్యమంత్రి) అని కీర్తిస్తారు. అది గృహ కార్యక్రమం అయినా, వివాహం అయినా, ప్రజల ఆహ్వానాలకు ఆయన ఎల్లప్పుడూ స్పందిస్తారని, ప్రజా అభ్యర్థనలను కాదనరని జనం గర్వంగా చెప్పుకుంటారు."తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది మేమే. చింతించకండి. మీ సమస్యలను పరిష్కరిస్తాం." ప్రజలతో మాట్లాడేటప్పుడు గానీ, ఓట్లు అభ్యర్థించేటప్పుడు గానీ, రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేటప్పుడు గానీ, ఆయన ప్రశాంతంగా, మృదువైన, ఆదరణపూర్వకమైన స్వరంతో ఆయన ఇచ్చిన హామీ ఓట్లగా మారిపోయింది.గురువు అప్పా పైత్యం స్వామిప్రజాదరణ పొందిన నాయకుడైన ఆయన సుమారు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు మరియు చాలా మంది ఆయనను ఒక ఆధ్యాత్మిక అన్వేషిగా, సౌమ్యమైన క్రమశిక్షణావాదిగా భావిస్తారు. పూజ్య గురువు అయిన అప్పా పైత్యం స్వామిగారికి పరమ భక్తుడైన రంగస్వామి ఎల్లప్పుడూ తన నుదుటిపై పవిత్ర భస్మాన్ని ధరిస్తారు. ఆ ఆధ్యాత్మిక గురువు ఫోటో ఆయన ప్రచార వాహనాన్ని అలంకరించడమే కాకుండా, ఆయన ప్రచార సామగ్రిలో కూడా ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుంది.ఈ ఆలయంలో 'మౌన వ్రతం' పాటిస్తాడు, ఎప్పుడు అన్నదానం చేస్తారని స్థానికులు చెబుతుంటారు.ప్రజల నాడి ఆయనకు, ఆయన గురించి ప్రజలకు బాగా తెలుసుఅంతేకాదు ఆయన ఎపుడు ఎక్కడ ఉంటాడో ప్రజలకు బాగా తెలుసు. మధ్యాహ్నం సమయంలో ముఖ్యమంత్రిని కలవాలనుకుంటే, బజారులోని నెహ్రూ వీధికి వెళ్లాలి. అక్క ఆయన తన స్నేహితుడి ఇంట్లో ఉంటాని రంగస్వామి నివసించే వీధిలోనే ఉండే ఒక యువకుడు చెప్పిన మాటే ఇందుకు నిదర్శనం. ప్రభావవంతమైన వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన ఆయన, 2001లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2006 నుండి 2008 వరకు రెండోసారి పదవిలో ఉన్నారు. 2011లో మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా, 2021లో నాలుగోసారి పదవి చేపట్టారు. 1991, 1996, 2001, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. ఇక తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 1991లోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదీ చదవండి: పీకే అంచనాలు బ్రేక్ : విజయ్ విజయ దుందుభి! -
సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే.. విజయ్ బిగ్ ప్లాన్!
చెన్నై: తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించింది. తమిళనాడులో డీఎంకే సూర్యుడు అస్తమించడం ఖాయమని.. ఎవరి మద్దతు అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ టీవీకే చెబుతోంది. హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు గెలిచే స్థానాలే రాబోయే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నాయి.విజయ్ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుంటారు? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మొదట నుంచి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనే ప్రచారం జరగ్గా, గత కొన్ని నెలలుగా ఆ పార్టీతో టీవీకే మధ్య మాటల మంటలు, పరస్పర విమర్శల క్రమంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అంత ఈజీ కాదంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈ క్రమంలో తమిళనాట టీవీకే, కాంగ్రెస్, లెఫ్ట్ జట్టుకంటే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్‌కు 5 సీట్లు, సీపీఎం 2, సీపీఐకి 2 వచ్చే అవకాశం ఉంది. కాగా, అధికార డీఎంకే మూడో స్థానానికి పడిపోగా, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది.తాజా ట్రెండ్స్ ప్రకారం.. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన టీవీకే పార్టీ అనూహ్య విజయం దిశగా దూసుకెళ్తుంది. డీఎంకే, ఏఐఏడీఎంకేలకు గట్టి సవాలే విసురుతోంది. భారత ఎన్నికల సంఘం (ECI) వెల్లడించిన ప్రారంభ గణాంకాల ప్రకారం.. తమిళనాడులో అరుదైన త్రిముఖ పోటీ నెలకొంది. విజయ్ పార్టీ ఇప్పటికే మెజారిటీ మార్కును దాటి.. అధికార డీఎంకేను వెనక్కి నెట్టి ముందంజలో ఉంది. ఏఐఏడీఎంకే మూడవ స్థానానికి పరిమితమైంది. -
పుదుచ్చేరి : బోణీ కొట్టిన పార్టీ, సీఎం రంగస్వామి గెలుపు
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి (Puducherry)అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ (NDA) కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీజేపీ నేతృత్వంలోని కూటమి ఏకపక్ష ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం బీజేపీ కూటమి 22 స్థానాలు, కాంగ్రెస్ కూటమి 06, ఇతరులు ఒక స్థానంలో కొనసాగుతున్నారు.సీఎం ఎన్ రంగస్వామి (N Ranga Swamy) విజయంతో పార్టీ బోణీ కొట్టింది. తట్టంచావడి నియోజకవర్గం నుంచి సీఎం ఎన్.రంగస్వామి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, నేయం మక్కల్ కజగం అభ్యర్థి వినాయగం (Vinayagam)పై ఆయన స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు. మరో వైపు మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తద్వారా ఐదోసారి సీఎం పీఠాన్ని అధిరోహించేందుకు మార్గం సుగమమైనట్టే కనిపిస్తోంది.కాగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 16 కాగా, బీజేపీ కూటమి ఏకంగా 22 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ కూటమి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్ కూటమి కేవలం 6 స్థానాలకే పరిమితమైంది -
సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: టీవీకే
చెన్నై: తమిళనాట టీవీకే పార్టీ సంచలనం రేపుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలక్రిందులు చేస్తూ.. తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ దూసుకుపోతోంది. డీఎంకే, అన్నాడీఎంకే కూటములను వెనక్కు నెట్టి విజయ్ పార్టీ ముందంజలో ఉంది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఆ పార్టీ నేతలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఎవరి మద్దతు లేకుండా సొంతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని టీవీకే జాతీయ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ (Felix Gerald) చెప్పారు.తమిళనాడు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తామే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, ఇందులో ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేశారు. తమిళనాడులో డీఎంకే శకం ముగిసిందని అన్నారు. ఏఐఏడీఎంకే, డీఎంకే పార్టీలతో ప్రజలు విసిగిపోయారని, అందుకే మార్పు కోరుకున్నారని చెప్పారు. తమిళనాడు మొత్తం మార్పు కోరుకుందని ఫెలిక్స్ గెరాల్డ్ చెప్పారు. ముఖ్యంగా యువత, మహిళలు తమ పార్టీకి అండగా నిలిచారని అన్నారు. తమ నాయకుడు విజయ్‌పై ప్రజలు విశ్వాసం ఉంచారని, అందుకే ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించామన్నారు. దోపిడీ, అవినీతి, బంధుప్రీతి, కుటుంబ రాజకీయాలకు ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టారని అభిప్రాయపడ్డారు. వంశపారంపర్య పాలనకు ముగింపు పలికారని, ఇది డీఎంకేకు ముగింపు అన్నారు. తమకు అండగా నిలిచిన తమిళ ప్రజలకు తమ పార్టీ తరపున ఫెలిక్స్ గెరాల్డ్ ధన్యవాదాలుత తెలిపారు. చదవండి: తమిళ సీఎం ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ -
బీజేపీ కార్యాలయానికి ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో వెలువడుతున్న తొలి రౌండ్ల కౌంటింగ్ ట్రెండ్స్‌లో కమలం పార్టీ అద్భుతమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ చారిత్రక విజయాల నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.బెంగాల్లో టీఎంసీకి భారీ షాక్పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు కనిపిస్తోంది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ వెనుకబడగా, బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం బీజేపీ ఏకంగా 111 స్థానాల్లో ముందంజలో ఉండగా, టీఎంసీ కేవలం 69 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై తొలి రౌండ్ ముగిసేసరికి కేవలం 898 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. అదే సమయంలో ప్రతిష్టాత్మక నందిగ్రామ్‌లో సువేందు అధికారి.. టీఎంసీ అభ్యర్థిపై 3,100కు పైగా ఓట్ల ఆధిక్యంతో సంచలనం సృష్టిస్తున్నారు.అస్సాంలో మళ్లీ ఎన్డీఏ హవాఅస్సాం రాష్ట్రంలో అధికార ఎన్డీఏ కూటమి మరోసారి తన సత్తా చాటుతూ రెండోసారి అధికారం దిశగా పయనిస్తోంది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 98 చోట్ల లీడ్‌లో ఉండగా, కాంగ్రెస్ కేవలం 25 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ ఒంటరిగా 78 స్థానాల్లో, మిత్రపక్షాలైన ఏజీపీ, బీపీఎఫ్ చెరో 10 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. జాలుక్బారి నుంచి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భారీ ఆధిక్యంలో కొనసాగుతుండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గొగోయ్ జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చేతిలో వెనుకంజలో ఉండటం గమనార్హం.కీలక నేతల ఆధిక్యం.. ఉత్సాహంలో శ్రేణులుఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైన కౌంటింగ్.. అస్సాంలోని 35 జిల్లాల్లోని 40 కేంద్రాల్లో ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. బీజేపీకి చెందిన పలువురు కీలక మంత్రులు రణోజ్ పెగు, పీజుష్ హజారికా, అశోక్ సింఘాల్ తొలి రౌండ్ల నుంచే స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికల ముందు బీజేపీలో చేరిన ప్రద్యుత్ బొర్దొలోయ్, భూపెన్ బోరా కూడా తమ నియోజకవర్గాల్లో లీడ్‌లో ఉన్నారు. బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో కాషాయ గాలి బలంగా వీస్తుండటంతో బీజేపీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటుతున్నాయి. -
పీకే అంచనాలు బ్రేక్ : విజయ్ విజయ దుందుభి!
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనాలు నిజమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) అనూహ్య ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతోంది.మే 4 నాటి కౌంటింగ్ అప్డేట్స్ ప్రకారంప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐడీఎంకే కూటములను వెనక్కి నెట్టి మరీ విజయ్ పార్టీ ‘విజిల్ పోడు..పోడు’ అన్నట్టు ప్రభంజనం సృష్టిస్తోంది. టీవీకే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ అంచనా ఏంటి?గతంలో ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిషోర్ ఈ క్రింది ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఒంటరి గానే విజయ్ విజయ దుందుభి మోగిస్తారని జోస్యం చెప్పారు. విజయ్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తేనే గెలిచే అవకాశాలు ఎక్కువని చెప్పారు.ఒంటరిగానే పోరుపీకే అంచనా వేసినట్టుగా టీవీకే పార్టీ మేజిక్ ఫిగర్ అయిన 118 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా? అని ప్రశ్నించినపుడు "ఖచ్చితంగా సాధ్యమే, ఫలితాలు వచ్చాక ఈ వీడియోని మళ్ళీ ప్లే చేసి చూడండి" అంటూ ధీమా వ్యక్తం చేయడం విశేషం. ప్రస్తుతం ట్రెండ్స్ నేపథ్యంలో పీకే వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు విజయ్ తన రాజకీయ అరంగేట్రం కోసం ప్రశాంత్ కిషోర్‌ను సలహాదారుగా నియమించు కున్నట్లు సమాచారం. కిషోర్ అందించిన వ్యూహాలు, క్షేత్రస్థాయి విశ్లేషణలు ఈ విజయానికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.కాగా తమిళనాడులో దశాబ్దాలుగా సాగుతున్న DMK-AIADMK ద్వైపాక్షిక రాజకీయాలకు విజయ్ చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్ కొనసాగితే, విజయ్ కింగ్ మేకర్‌గా కాకుండా ఏకంగా కింగ్‌గా అవతరించే అవకాశం ఉంది. ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లే, ఏ కూటమితోనూ కలవకుండా ఒంటరిగా బరిలోకి దిగి విజయ్ సక్సెస్ అయ్యారు. ఇది ఇలా ఉంటే తుది ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదీ చదవండి: అస్సాం, బెంగాల్, పుదుచ్చేరి మావే : విజయోత్సాహంలో బీజేపీ -
టీవీకే దూకుడు.. విజయ్ నివాసంలో సంబరాలు
చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సంచలనం సృష్టిస్తుంది. వంద స్థానాలు దాటి టీవీకే దూసుకుపోతోంది. తమిళనాడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించింది. టీవీకే విజయ్ నివాసం దగ్గర భద్రత భారీగా పెంచారు. చెన్నైలోని విజయ్ ఇంటికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. విజయ్ ఇంటి దగ్గర బాణాసంచా పేల్చి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్ నివాసంలో కుటుంబసభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. తమిళనాడులో డీఎంకే సూర్యుడు అస్తమించడం ఖాయం అని టీవీకే అంటోంది. ఎవరి మద్దతు అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని టీవీకే ధీమా వ్యక్తం చేసింది.సుమారు ఐదు దశాబ్దాలుగా తమిళనాడును పాలిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల కంటే, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ వైపు యువ ఓటర్లు ఎక్కువగా ఆకర్షితులయ్యారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. యాక్సిస్ మై ఇండియా విజయ్ పార్టీకి 98 నుండి 120 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేల్చగా.. మాజీ ఐపీఎస్ పి. రవి టీమ్ సర్వేతో పాటూ యాక్సిస్ మై ఇండియా సర్వేలు విజయ్‌కు అనుకూలంగా వచ్చాయి.. ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు నిజమయ్యాయి.JUST IN 🔔 : விஜய் அண்னன் வீட்டில் கொண்டாட்டம் தொடங்கியது ! 😍🔥@TVKPartyHQ | #WhistlePodu pic.twitter.com/T07mR5ZXsJ— Prakash Vijay (@PrakazVijay_Of) May 4, 2026టీవీకే పార్టీకి యువత ఎక్కువగా మొగ్గు చూపారు. 18–19 ఏళ్ల వయసులో తొలిసారిగా ఓటేసిన యువ ఓటర్లలో 68 శాతం మంది టీవీకే పార్టీకే ఓటేసినట్లు పలు సర్వేల్లో వెల్లడైంది. 20–29 ఏళ్ల వయసు వారిలో 59 శాతం మంది విజయ్‌కే తమ మద్దతు అని చెప్పారు. 30–39 ఏళ్ల వయసు వారిలో 45 శాతం మంది టీవీకే పార్టీకే ఓటేశామని సర్వేలో తెలిపారు. -
రెండు బిల్లుల వ్యతిరేకతే వారికి శాపం: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాల వెలువడుతున్నాయి. ఐదింట మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం అందుకోనుంది. తమిళనాడులో ఫలితాలు హంగ్ దిశగా, కేరళలో యూడీఎఫ్ విజయం దిశగా వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకించిన పార్టీలకు గుణపాఠం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ..‘పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, అసోంలో బీజేపీ గెలుస్తోంది. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ఇక అధికారంలోకి రాదు. రాహుల్ గాంధీని రాజకీయ నాయకులుగా ఆ పార్టీ నాయకులే గుర్తించడం లేదు. దేశ ప్రజలంతా పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలవాలని కోరుకున్నారు. కేరళ, తమిళనాడులో ఆశించిన ఫలితాలే వస్తున్నాయి. ఈ ఫలితాలు కాంగ్రెస్‌తో పాటు, అనేక పార్టీలకు గుణపాఠం అని ఘాటు విమర్శలు చేశారు.మరోవైపు.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ..‘అసోంలో వచ్చిన తీర్పు బీజేపీ పాలనకు సజీవ సాక్ష్యం. బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు. తెలంగాణ ఆర్ఆర్ఆర్కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్రజలకు సందేశం ఇవ్వడానికి మోదీ రాబోతున్నారు. హైదరాబాద్‌లోని మూడు కార్పొరేషన్లలో తప్పకుండా బీజేపీ విజయం సాధిస్తుంది. సౌత్‌లో భవిష్యత్‌లో ఎగిరేది బీజేపీ జెండానే. తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు విరక్తి చెందారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
కేరళ సీఎం ఎవరు?.. శశి థరూర్ షాకింగ్ ఆన్సర్
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ‘ఎన్డీటీవీ’తో సంచలన విషయాలు పంచుకున్నారు. కేరళ ఓటర్లు స్పష్టమైన మార్పు కోరుకున్నారని, ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అస్తవ్యస్త పాలనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారని ఆయన పేర్కొన్నారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) సునాయాసంగా మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. కేరళకు కాబోయే తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఉత్కంఠ రేపుతున్న సీఎం రేసుతదుపరి ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారన్న ప్రశ్నకు థరూర్ చాలా ఆసక్తికరమైన రీతిలో బదులిచ్చారు. ‘నిజం చెప్పాలంటే ఆ విషయంపై నాకు ఎలాంటి క్లూ లేదు. మా పార్టీలో సీఎం ఎంపికకు ఒక పద్ధతి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు పంపే పరిశీలకులు.. ముందుగా గెలిచిన ఎమ్మెల్యేలతో చర్చిస్తారు. ఆ తర్వాతే కాంగ్రెస్ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుంది. మా వద్ద సమర్థులైన నేతలు చాలా మంది ఉండటం పార్టీకి శుభపరిణామం’ అని థరూర్ అన్నారు.అధికార పార్టీపై తీవ్ర ప్రజా వ్యతిరేకతపాలక పక్షంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని థరూర్ పేర్కొన్నారు. ‘కొందరు మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా జనాదరణ కలిగి ఉన్నప్పటికీ, ప్రజలు వారిని తిరస్కరించారు. మళ్లీ వారికి ఓటేస్తే పాత తప్పుడు పాలనే కొనసాగుతుందని ప్రజలు గ్రహించారు. ఇది ఓటర్ల పరిపక్వతకు నిదర్శనం. ఊహించిన దానికంటే ఎంతో మెరుగైన ఫలితాలు వచ్చాయి’ అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.99 సీట్లతో కాంగ్రెస్ చారిత్రక రికార్డ్కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మెజారిటీ దిశగా దూసుకుపోతోందని థరూర్ ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 99 స్థానాల్లో యూడీఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతోందని, చాలా కాలం తర్వాత కేరళలో ఈ స్థాయి భారీ విజయం దక్కడం ఒక ‘అద్భుతమైన ఫలితం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ విజయంపై అధికారిక ప్రకటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని థరూర్ పేర్కొన్నారు. -
అస్సాం, బెంగాల్, పుదుచ్చేరి మావే : విజయోత్సాహంలో బీజేపీ
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళి హోరో హోరీగా సాగుతోంది. పుదుచ్చేరి రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు సునీల్ శర్మ సోమవారం పార్టీ పనితీరుపై విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అనుకూలంగా బలమైన తీర్పును ప్రజల మద్దతు ప్రతిబింబిస్తోందని శర్మ అన్నారు."బీజేపీకి, ప్రధాని మోడీకి ప్రజలు చూపిస్తున్న ప్రేమ, మద్దతును బట్టి అస్సాం, పశ్చిమ బెంగాల్,పుదుచ్చేరిలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం స్పష్టమవుతోంది. తమిళనాడు, కేరళలో కూడా ఓట్ల వాటా గణనీయంగా పెరుగుతుందని తాము అంచనా వేస్తున్నా మన్నారు. ఆయన ఏఎన్ఐకి తెలిపారు.భారత ఎన్నికల సంఘం ప్రకారం, పుదుచ్చేరి తొలి ట్రెండ్స్ ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సి) 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు చూపిస్తున్నాయి. 3 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో ఉండగా, భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సి) 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, భారతీయ జనతా పార్టీ (బిజెపి), ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె) చెరొక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.భారత ఎన్నికల సంఘం వెల్లడించిన సమాచారం ప్రకారం, పుదుచ్చేరిలో ఉదయం 9.15 గంటల సమయానికి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె) ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. 30 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఆ పార్టీ రెండు స్థానాల్లో పోటికీ నిలబడింది.నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన 75 ఏళ్ల రంగస్వామి మరోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధపడుతుండటం విశేషం. పుదుచ్చేరి ట్రెండ్స్ప్రారంభ గణాంకాల ప్రకారం బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్కు 16. ఇది 2021లో NDA ప్రభుత్వం ఏర్పాటుకు సాధించిన సంఖ్యకు సమానం. అన్ని నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా ఈ తొలి ట్రెండ్ వెలువడింది. తదుపరి దశల్లో మరింత స్పష్టమైన చిత్రం వెలువడే అవకాశం ఉంది. -
విజయ్ జైత్రయాత్ర.. టెంట్లు పీకేసిన డీఎంకే
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.. అయితే, అందరి దృష్టి తమిళనాడుపైనే కేంద్రీకృతమైంది. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే సంచలన ఫలితాల దిశగా టీవీకే దూకుడు ప్రదర్శిస్తోంది. తమిళనాడులో 100 స్థానాల్లో టీవీకే ఆధిక్యంతో దూసుకుపోతుంది. ఈ క్రమంలో విజయ్ నివాసానికి నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో టీవీకే చీఫ్ విజయ్ ఇంటి దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. జెండాలు పట్టుకుని టీవీకే అభిమానులు సందడి చేస్తున్నారు. కేంద్ర బలగాలతో విజయ్ నివాసం దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. కాగా, చెన్నైలో డీఎంకే కార్యాలయం బోసిపోయింది. ఆఫీస్ దగ్గర డీఎంకే శ్రేణులు కనిపించడం లేదు. టెంట్లు తీసేసి కుర్చీలు తీసుకెళ్తున్న డీఎంకే కార్యకర్తలు.. ఎన్నికల ఫలితాల షాక్‌తో బోరున విలపిస్తున్నారు. టీవీకే ఆధిక్యం పెరుగుతుండటంతో విజయ్ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ఎక్కువ శాతం సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌లో డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తమిళనాడులో ఓటర్లు మార్పుకోరుకున్నారు. విజయ్‌కు యూత్, దళిత్ ఓటు బ్యాంకు కలిసొచ్చింది. హిందూవ్యతిరేక ముద్రతో డీఎంకే నష్టపోయిందని రాజకీయ వర్గాల అంచనా వేశాయి.#WATCH | Tamil Nadu Assembly Elections | Tents are being removed from Anna Arivalayam, the DMK headquarters in Chennai, as the early trends show DMK at a distant third position.TVK is leading on 45, AIADMK on 41 and DMK on 19 seats, as per early trends. pic.twitter.com/7xPojVMKcQ— ANI (@ANI) May 4, 2026డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో తమిళనాడు దశాబ్దాలుగా ద్విముఖ పోరుగా మారిన రాజకీయ చదరంగంలో విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చి అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోందని యాక్సిస్ మై ఇండియా సంచలన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ తాజా ఎన్నికల్లో ఏకంగా 98 నుంచి 120 స్థానాల్లో గెలిచే వీలుందని ఎగ్జిట్‌పోల్ పేర్కొంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీ సులభంగా సాధారణ మెజారిటీని సాధిస్తుందని యాక్సిస్ మై తెలిపింది. ఎన్నికల తర్వాత తమిళనాడులో ఎంజీఆర్‌లా, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌లా విజయ్ సినీరంగం నుంచి వచ్చి నేరుగా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోబోతున్నారని ఎగ్జిట్ పోల్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
మార్పునకు జై కొట్టిన తమిళ ప్రజలు.. ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ
చెన్నై: టీవీకే అధినేత ప్రజాదరణ గల నటుడు మాత్రమేనని, పెద్ద రాజకీయ నాయకుడు కాదని బీజేపీ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రభావం పెద్దగా ఉండబోదని చెప్పారు. ఎన్నికల ఫలితాలకు ముందు ఆమె పీటీఐతో మాట్లాడుతూ.. తమిళనాడు ప్రజలు మార్పునకు ఓటేశారని అన్నారు. డీఎంకే పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. తమిళనాడులో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని, పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. మైలాపూర్‌లో తాను కూడా గెలుస్తాననే నమ్మకం ఉందన్నారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ప్రభావం ఎలా ఉండబోతోందని తమిళిసై సౌందరరాజ్ను మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ''విజయ్ ప్రజాదరణ కలిగిన నటుడు, పాపులర్ పొలిటిషియన్ కాదు. ఆయన స్టార్ ఇమేజ్ కారణంగా ఎన్నికల్లో కొంత ప్రభావం కచ్చితంగా ఉంటుంది. పెద్దగా ప్రభావం ఉండదు. విజయ్ పార్టీ ఉన్నప్పటికీ విజయం మాత్రం ఎన్డీఏదేన''ని సమాధానం ఇచ్చారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతమిళనాడు ఎన్డీఏ కూటమి అధికారంలో వస్తుందని తమిళిసై సౌందరరాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మేము చేసిన ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. ప్రజలు మార్పు కోసమే ఓటు వేశారు. డీఎంకేకు ప్రజలు తగిన విధంగా సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా డీఎంకే ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. డీఎంకే నేతలు ప్రజలపై కాకుండా కేవలం తమ రాజకీయ లబ్ధిపైనే దృష్టి పెట్టారు. దీంతో ప్రజలు ఎన్నికల్లో డీఎంకేను వ్యతిరేకించి, ఎన్డీఏను ఆదరించారు. ఎడప్పాడి కె పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, ఈ కార్యక్రమానికి మన ప్రధానమంత్రి హాజరవుతారని తమిళిసై అన్నారు. కాగా, ప్రస్తుతం అందుతున్న ఫలితాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల కంటే టీవీకే ముందంజలో ఉంది. దీంతో టీఎంకే పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతారణం నెలకొంది.చదవండి: విజయ్ జైత్రయాత్ర.. టెంట్లు పీకేసీన డీఎంకే -
తమిళనాట తలకిందులైన లెక్కలు
తమిళనాడు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అనూహ్యంగా టీవీకే ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. డీఎంకేను దాటి దూసుపోతుంది. తమిళనాడులో టీవీకే ముందంజ ఉండగా, రెండో స్థానంలో డీఎంకే, మూడో స్థానానికి అన్నాడీఎంకే పరిమితమైంది. తమిళనాడులో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) తొలిసారిగా బరిలోకి దిగింది. లీడింగ్‌లో టీవీకే విజయ్ పార్టీ దూసుకుపోతుంది.విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి రాబోతున్నట్లు ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. టీవీకే విజయ్‌కు తమిళ ఓటర్లు జైకొట్టారు. హంగ్ వస్తే టీవీకే-అన్నాడీఎంకే జట్టు కట్టే సూచనలు కనిపిస్తున్నాయి.మరోవైపు, ముందస్తుగా అప్రమత్తమైన విజయ్ పార్టీ.. తమ కాబోయే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ‘రిసార్ట్ పాలిటిక్స్’కు తెరతీసిన సంగతి తెలిసిందే. మహాబలిపురం సమీపంలోని పూంజేరిలో ఉన్న ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో సుమారు 100 మందికి పైగా గెలిచిన అభ్యర్థులకు వసతి కల్పించేందుకు టీవీకే పార్టీ ఏర్పాట్లు చేసింది. ఫలితాలు ప్రకటించిన వెంటనే విజయం సాధించిన అభ్యర్థులంతా క్షణం కూడా ఆలస్యం చేయకుండా పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని విజయ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, ‘గెలిచిన తర్వాత ఎక్కడికీ వెళ్లొద్దు’ అని అభ్యర్థులతో జరిగిన సమావేశంలో ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. -
పుదుచ్చేరి : కాంగ్రెస్ కూటమికి ఓటమి షాక్, లీడ్‌లో ఏఐఎన్ఆర్సీ
తొలి ఫలితం : సీఎం ఎన్.రంగస్వామి (N Ranga Swamy) విజయకేతనంసీఎం ఎన్.రంగస్వామి తట్టంచావడి నుంచి ఘన విజయం సాధించారు.4,336 ఓట్ల ఆధిక్యంతో సీఎం రంగస్వామి లీడ్ కొనసాగుతోంది అధికారిక గణాంకాల ప్రకారం, AINRC అభ్యర్థులైన ఆర్. రవికుమార్, వైయాపురి మణికందన్, సి. అయ్యప్పన్, ఇ. మోహన్ దాస్, పి. రాజవేలు , పి.ఆర్.ఎన్. తిరుమురుగన్ వరుసగా విల్లియనూర్, ముత్యాలపేట, అరియంకుప్పం, ఎంబాలం, నెట్టపాక్కం , కారైకాల్ ఉత్తర నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నారు.తట్టంచావడి నియోజకవర్గంలో, INRC వ్యవస్థాపకుడు,ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి, కాంగ్రెస్ అభ్యర్థి వి. వైతిలింగం కంటే 3,591 ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 6 సీట్లలోనూ, కాంగ్రెస్ కూటమి 2, ఇతరులు 3 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. లీడ్‌లో ఏఐఎన్ఆర్సీఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగా ఏఐఎన్ఆర్సీ లీడ్‌లో కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలకుముందు పుదుచ్చేరి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి కోరిమేడులోని అప్ప పైత్యస్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పుదుచ్చేరి శాసనసభలోని మొత్తం 30 స్థానాలకు ఎన్నికలు, కేంద్ర పాలిత ప్రాంతం అంతటా ఏప్రిల్ 9న ఒకే దశలో జరిగాయి. ఈ ఎన్నికల్లో 89.87శాతం పోలింగ్ నమోదైంది. పుదుచ్చేరి చరిత్రలోనే అత్యధికం. కాంగ్రెస్ కూటమి కంటే AINRC నేతృత్వంలోని కూటమే విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానంగా రెండు కూటముల మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) - ఇందులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూడా భాగస్వామిగా ఉంది. రెండోది కాంగ్రెస్ నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) భాగస్వామిగా ఉంది.#WATCH | Puducherry Elections 2026 | Strong room opened at Women's Engineering College in Lawspet. Counting of votes to begin shortly. pic.twitter.com/gnkGgF3Buo— ANI (@ANI) May 4, 2026 -
ట్రెండింగ్: తమిళనాడు రిజల్ట్.. తిరుమలలో హీరోయిన్ త్రిష
ప్రముఖ హిరోయిన్ త్రిష తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం.. సరిగ్గా అదే సమయానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇవాళ ఆమె (మే 4, సోమవారం) ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న త్రిష.. తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌తో ఆమె సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.ఆదివారం రాత్రి తన తిరుమల పర్యటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన త్రిష.. సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఎటువంటి హడావుడి లేకుండా, సామాన్య భక్తురాలిలా ఆమె శాంతియుతంగా పూజలు నిర్వహించారు.తమిళనాడు ఎన్నికల ఫలితాల రోజే త్రిష తిరుమలకు వెళ్లడంతో.. ఆమె విజయ్ పార్టీ విజయం కోసమే ఈ మొక్కులు చెల్లించుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి కావడంతో.. ఆయన సన్నిహితురాలైన త్రిష పర్యటనపై అభిమానులు పలు కామెంట్లు చేస్తున్నారు. -
అస్సాం : ఘన విజయం దిశగా బీజేపీ కూటమి
బీజీపీకి నాలుగు సీట్లుట్రెండ్స్ ప్రకారం ఎన్డీఏ మూడింట రెండు వంతుల మార్కును దాటేసింది. అస్సాంలో ఇప్పటివరకు బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంది. ఎన్డీఏ 94 సీట్లలో ఆధిక్యంలో ఉంది.గౌహతి సెంట్రల్లో, అస్సాం జాతీయ పరిషత్ (ఏజేపీ)కి చెందిన జెన్ జెడ్ అభ్యర్థి కుంకీ చౌదరి, బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్ గుప్తాపై గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించే దిశగా హిమంత బిస్వా శర్మ ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం ఎన్డీఏ మూడింట రెండు వంతుల మార్కును దాటేసింది.జోర్హాట్ స్థానంలో గౌరవ్ గోగోయ్ ఓటమి, బీజేపీకి చెందిన హితేంద్ర నాథ్ గోస్వామి చేతిలో ఓడిపోయారు. మ్యాజిక్ ఫిగర్ దాటిన BJP నేతృత్వంలోని కూటమి80 స్థానాల్లో ఆధిక్యంతో, అసాంలో BJP నేతృత్వంలోని కూటమి 64 స్థానాల మెజారిటీ మార్కును అధిగమించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 19 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది.జలుక్బరీలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆధిక్యంలో ఉండగా, జోర్హాట్లో కాంగ్రెస్‌కు చెందిన గౌరవ్ గొగోయ్ ముందంజలో ఉన్నారు. దిస్పూర్లో ప్రద్యుత్ బోర్డోలోయ్ ముందంజలో ఉన్నారు బిహ్‌పురియాలో భూపేన్ బోరా ముందంజలో ఉన్నరుశివసాగర్లో అఖిల్ గొగోయ్ ముందంజలో ఉన్నారుఖోవాంగ్లో లూరింజ్యోతి గొగోయ్ ముందంజలో ఉన్నారు జాగీ రోడ్లో పిజూష్ హజారికా ముందంజలో ఉన్నారువిజయం మాదే : అఖిల్ గోగోయ్ శివసాగర్‌లో అఖిల్ గొగోయ్ ముందంజలో ఉన్నారు48 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి ముందంజజోర్హాట్లో కాంగ్రెస్ అభ్యర్థి గౌరవ్ గొగోయ్ ముందంజ, 14 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంకాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి మొత్తం 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ నేతృత్వంలోని కూటమికి స్పష్టమైన ఆధిక్యంబీజేపీ నేతృత్వంలోని కూటమికి స్పష్టమైన ఆధిక్యం కాంగ్రెస్ ఖాతా తెరిచిన కాంగ్రెస్ ప్రాథమిక సరళి ప్రకారం, బీజేపీ నేతృత్వంలోని కూటమి 21 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, AIUDF , కాంగ్రెస్ చెరో రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అస్సాంలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 722 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈశాన్య రాష్రం అస్సాంలో అధికారి పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీ మరోసారి ఉవ్విళ్లూరుతోంది. ఈ ఎన్నికలలో ప్రధాన పోటీదారులుగా, బీజేపీ, అసోం గణ పరిషత్ (AGP), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF) భాగస్వామ్యంతో ఏర్పడిన బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి, అలాగే INC, అసోం జాతీయ పరిషత్ (AJP), రైజోర్ దళ్, ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ (APHLC), CPI (M) మరియు CPI (ML) పార్టీలతో కూడిన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి నిలిచాయి.చాలా వరకు ఎగ్జిట్ పోల్స్, బీజేపీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. బీజేపీ కూటమి 88 నుండి 101 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ కూటమి 22 నుండి 36 స్థానాలను గెలుచుకోవచ్చని, కాగా AIUDF 2 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని అంచనా. -
గవర్నర్‌ను కలిసి రాజీనామా చేయనున్న స్టాలిన్
తమిళనాడు ప్రజా తీర్పు బయటకు వస్తోంది. మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు.. అధికారంలోకి ఎవరు వస్తారనేది ఉత్కంఠ నెలకొంది. దీంతో గత కొన్ని రోజుల నుంచి రాజకీయ పార్టీల అధినేతల నుంచి సామాన్య ప్రజల వరకు చూస్తున్న ఎదురుచూపులకు ఎండ్‌కార్డు పడనుంది. టీవీకేకు కంగ్రాట్స్: మోదీతమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై మోదీ స్పందనఎన్డీయేకు మద్దతు ఇచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలుప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాంటీవీకే అద్భుత ప్రదర్శనకు అభినందనలురెండు స్థానాల్లోనూ విజయ్ గెలుపుతమిళనాడులో టీవీకే విజయ్ సంచలనం పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గెలుపుపెరంబూర్, తిరుచ్చిలో గెలిచిన విజయ్ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు విజయ్ టీవీకే పార్టీ సాధించిన ఓట్లు 1.28 కోట్లుడీఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.17 కోట్లుఒంటరిగా డీఎంకే సాధించిన ఓట్లు 83 లక్షలుఏఐఏడీఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.08 కోట్లుఒంటరిగా ఏఐఏడీఎం సాధించిన ఓట్లు 77 లక్షలు రెండో స్థానంలోకి వచ్చిన డీఎంకేపుంజుకున్న డీఎంకే రెండో స్థానంలోకి వచ్చిన డీఎంకేటీవీకే 107 స్థానాల్లో ఆధిక్యండీఎంకే 59 స్థానాల్లో ఆధిక్యండీఎంకే 47 స్థానాల్లో ఆధిక్యం ప్రభుత్వ ఏర్పాటు దిశగా విజయ్ అడుగులుటీవీకే చీఫ్ విజయ్ కీలక ఆదేశాలుఅభ్యర్థులంతా చెన్నై రావాలని పిలుపుప్రభుత్వ ఏర్పాటు దిశగా విజయ్ అడుగులుస్టాలిన్ రాజీనామా!కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న స్టాలిన్సీఎం పదవికి రాజీనామా చేయనున్న స్టాలిన్ఒక్కో మెట్టు ఎక్కాడు: విజయ్ తండ్రిటీవీకే గెలుపుపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ హర్షంతమిళ ప్రజలకు మేలు చేయాలనేదే లక్ష్యంగెలుపుపై విజయ్ మొదటి నుంచి ధీమాగా ఉన్నాడుఒక్కో మెట్టు ఎక్కి ఇప్పుడు సీఎం అవుతున్నాడు👉తమిళనాట టీవీకే, కాంగ్రెస్, లెఫ్ట్ జట్టుకంటే అవకాశంకాంగ్రెస్కు 5 సీట్లు వచ్చే అవకాశంసీపీఎం 2, సీపీఐకి 2 వచ్చే సూచనలుతమిళనాడులో కేవల 2 స్థానాల్లోనే బీజేపీ లీడ్అన్నాడీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ 👉తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సంచలనంవంద స్థానాలు దాటి దూసుకుపోతున్న టీవీకేతమిళనాడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకేహంగ్ దిశగా తమిళనాడుటీవీకే విజయ్ నివాసం దగ్గర భద్రత పెంపుచెన్నైలోని విజయ్ ఇంటికి భారీగా చేరుకుంటున్న అభిమానులువిజయ్ ఇంటి దగ్గర బాణాసంచా పేల్చి అభిమానుల సంబరాలువిజయ్ తండ్రి నివాసంలో సంబరాలుతమిళనాడులో డీఎంకే సూర్యుడు అస్తమించడం ఖాయం: టీవీకేఎవరి మద్దతు అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు 👉ఓటమి దిశగా సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్సీఎం స్టాలిన్ పోటీ చేస్తున్నకొళతూర్ యోజకవర్గంలో టీవీకే ముందంజడిప్యూటీ సీఎం పోటీ చేస్తున్న చెపాక్-తిరువళ్లికేని నియోజకవర్గంలో సైతం టీవీకే ముందంజకొలతూర్ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు ముందంజచెపాక్-తిరువళ్లికేని నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి సెల్వం ముందంజ👉విరుంబాకంలో టీవీకే ఆధిక్యంవిజయ్ డ్రైవర్ కుమారుడు శబరినాథన్ లీడ్కొళత్తర్లో వెనుకంజలో సీఎం స్టాలిన్చెపాక్లో ఉదయనిధి స్టాలిన్ వెనుకంజ 👉చెన్నైలో బోసిపోయిన డీఎంకే కార్యాలయంఆఫీస్ దగ్గర కనిపించని డీఎంకే కార్యాలయంటెంట్లు తీసేసి కుర్చీలు తీసుకెళ్తున్న డీఎంకే కార్యకర్తలుఎన్నికల ఫలితాల షాక్‌తో బోరున విలపించిన డీఎంకే శ్రేణులు👉తమిళనాడులో 100 స్థానాల్లో టీవీకే ఆధిక్యంటీవీకే చీఫ్ విజయ్ ఇంటి దగ్గర భారీ భద్రతవిజయ్ నివాసానికి భారీగా చేరుకుంటున్న నేతలు, కార్యకర్తలుజెండాలు పట్టుకుని సందడి చేస్తున్న టీవీకే అభిమానులుకేంద్ర బలగాలతో విజయ్ నివాసం దగ్గర భద్రత కట్టుదిట్టం 👉ఆధిక్యం ఇలా.. విజయ్ టీవీకే పార్టీ 103అన్నాడీఎంకే 76డీఎంకే 53👉తమిళనాడులో సంచలన ఫలితాలుతమిళనాట వెలువడుతున్న సంచలన ఫలితాలు!లీడ్‌లో సెంచరీ కొట్టిన విజయ్ టీవీకేఎర్లీ ట్రెండ్స్‌లో.. 100 సీట్ల ఆధిక్యంటీవీకే దూకుడు దాటికి డీఎంకే విలవిలరెండో స్థానంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే మూడో స్థానానికి పరిమితమైన డీఎంకే కూటమిఐదు చోట్ల ఆధిక్యంలో డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్ డీఎంకే ఆఫీస్ ముందు టెంట్ల తొలగింపుతిరుచ్చి ఈస్ట్, పెరంబూర్‌లో ఆధిక్యంలో విజయ్విజయ్ నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు👉తమిళనాడులో ఒక్కసారిగా మారిన సీన్అనూహ్యంగా ఆధిక్యంలోకి దూసుకొచ్చిన టీవీకేడీఎంకేను దాటి దూసుపోతున్న టీవీకేతమిళనాడు ఫలితాలపై సర్వతా ఉత్కంఠతమిళనాడులో పోస్టల్ బ్యాలెట్లో టీవీకే ముందంజరెండో స్థానంలో డీఎంకేపోస్టల్ బ్యాలెట్ మూడో స్థానానికి పరిమితమైన అన్నాడీఎంకేతమిళనాడు పోస్టల్ బ్యాలెట్లో మొదటి స్థానానికి దూసుకొచ్చిన టీవీకే 👉తమిళనాడులో డీఎంకే ఆధిక్యంపలు స్థానాల్లో రన్నరప్‌గానే అన్నాడీఎంకేరెండో స్థానంలో అన్నాడీఎంకే, టీవీకే మధ్య హోరాహరీకొళత్తూర్లో డీఎంకే కన్నా టీవీకే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఆధిక్యం 👉చెన్నై సిటీలో డీఎంకే, టీవీకే హోరాహోరీకొళత్తూరులో సీఎం స్టాలిన్ ముందజచెపాక్లో ఉదయనిధి ఆధిక్యంతిరుచ్చి ఈస్ట్, పెరంబూర్‌లో విజయ్ వెనుకంజమైలాపూర్లో తమిళిసై వెనుకంజతిరుచ్చి వెస్ట్‌లో మంత్రి నెహ్రూ వెనుకంజఎడప్పాడిలో పళనిస్వామి ముందంజకోయంబత్తూరు సౌత్‌లో సెంథిల్ బాలాజీ ముందంజ 👉పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్డీఎంకే -22 స్థానాలుఏఐడిఎంకే -5 స్థానాలుటీవీకే 4 స్థానాల్లో ముందంజ👉పెరంబూర్‌లో విజయ్ ముందంజకొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుతమిళనాడు పోస్టల్ బ్యాలెట్లో డీఎంకే ఆధిక్యం #WATCH | Tamil Nadu Assembly Elections | Heavy security arrangements have been put in place at the counting centre set up at Loyola College in Chennai, where votes for several key Assembly constituencies will be counted today. pic.twitter.com/JEQmLTjLhh— ANI (@ANI) May 4, 2026👉తమిళనాడులో కౌంటింగ్ ప్రారంభంమొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు8.30 నుంచి ఈవీఎం ఓట్లను కౌంట్ చేయనున్న అధికారులురాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ విధుల్లో మొత్తం 3.6 లక్షల మంది సిబ్బందిచెన్నైలోని లయోలా కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లుపలు కీలక అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 👉మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు... అధికారంలోకి ఎవరు?నేడు తమిళనాడు ఎన్నికల ఓట్ల కౌంటింగ్ఉదయం 8 గంటల నుంచి ఓట్లని లెక్కించనున్న సిబ్బంది234 స్థానాల్లో ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికలు5.73 కోట్ల మంది ఓటర్లలో ఓటు హక్కు వినియోగించుకోగా.. తమిళనాడులో రికార్డ్ స్థాయిలో 85 శాతం పోలింగ్రాష్ట్రవ్యాప్తంగా 62 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘంమొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి 8.30 నుంచి ఈవీఎం ఓట్లను కౌంట్ చేయనున్న అధికారులుమ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు... అధికారంలోకి ఎవరు వస్తారనేది ఉత్కంఠడీఎంకే, ఏఐ డిఎంకె కూటమి, విజయ్ టీవీకే పార్టీల మధ్య ప్రధాన పోటీకౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, ప్రత్యేకించి కేంద్ర బలగాలతో పహారారాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ విధుల్లో మొత్తం 3.6 లక్షల మంది సిబ్బందిప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్ ఏర్పాటు, సీసీటీవీ పర్యవేక్షణలో కౌంటింగ్కొళత్తూరు నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్, ఎడప్పాడి నుంచి మాజీ సీఎం పళని స్వామి, చెపాక్-తిరువల్లికేని నుంచి ఉదయ్ నిధి స్టాలిన్ పోటీపెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేసిన టీవీకే అధినేత విజయ్కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి, తెంకాసి జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన ఎన్నికల సంఘంఅక్కడ భారీగా పోలీసు భద్రత ఏర్పాటుహంగ్ ఏర్పాటయ్యే అవకాశం అంటూ సర్వేలు వెల్లడిక్యాంప్ రాజకీయాలకు తెరలేపిన టీవీకేమహాబలిపురం వద్ద రిసార్ట్లు బుక్ చేసిన టీవీకే అధినేత విజయ్గెలిచిన అభ్యర్థులు వెంటనే రిసార్ట్‌కి రావాలని ఆదేశం..ఆసక్తిగా మారిన తమిళ రాజకీయాలు👉రాష్ట్రంలో ఈసారి ముక్కోణపు పోరు జరిగింది. అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకేతోపాటు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) తొలిసారిగా బరిలోకి దిగింది. వరుసగా రెండోసారి విజయంపై డీఎంకే అధినేత స్టాలిన్ చాలా ఆశలే పెట్టుకున్నారు. బీజేపీతో జతకట్టిన విపక్ష అన్నాడీఎంకే గెలుపు కోసం హోరాహోరీగా పోరాడింది. డీఎంకే మళ్లీ నెగ్గడం తథ్యమని మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేయగా, విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి రాబోతున్నట్లు ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది.👉తమిళనాట ఓట్ల లెక్కింపునకు సమగ్రమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలుండగా, కౌంటింగ్‌కు మొత్తం 62 కేంద్రాలు సిద్ధం చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగ్గా, 85.15 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. కౌంటింగ్ విధుల్లో 1.25 లక్షల మంది భద్రతా సిబ్బంది, అధికారులు, సూక్ష్మపరిశీలకులు పాలుపంచుకుంటున్నారు. ఎన్నికల సంఘం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లను నియమించింది. -
Kerala: యూడీఎఫ్ ఘన విజయం? ప్రకటనే తరువాయి..
కేరళ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అత్యంత ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ముందుగా అధికారులు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును ప్రారంభించారు. అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాజీవ్ చంద్రశేఖర్ (ఎన్డీఏ), పినరయి విజయన్ (ఎల్డీఎఫ్), వీడీ సతీశన్ (యూడీఎఫ్) తదితర హేమాహేమీల రాజకీయ భవితవ్యం ఈరోజు తేలిపోనుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. తొలి ట్రెండ్స్ ప్రకారం యూడీఎఫ్ మెజారిటీ మార్కును (71+ సీట్లు) దాటుతుందని, అలాగే 70-80కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉండే అవకాశం ఉందని సమాచారం.ఎల్డీఎఫ్ వెనుకబడి ఉంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సహా పలువురు మంత్రులు కూడా వెనుకబడి ఉన్నారు. అయితే ఎన్నికల సంఘం అధికారిక ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఇప్పటి వరకూ వెలువడుతున్న ఫలితాల నేపధ్యంలో 10 ఏళ్ల ఎల్డీఎఫ్ పాలనకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. కేరళం ముఖ్యమంత్రి అభ్యర్థిని హైకమాండ్ నిర్ణయించనున్నప్పటికీ, నాయకత్వంలో మార్పు వచ్చే అవకాశం ఉందని వినికిడి.రాష్ట్రంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)ఘన విజయం దిశగా పయనిస్తుండటంతో తిరువనంతపురంలోని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి.ఎన్నికల సంఘం అందించిన తాజా వివరాల ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మెజారిటీ మార్కును అధిగమించింది. కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు యూడీఎఫ్‌కు అనుకూలంగా ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. పలువురు ప్రముఖ ఎల్డీఎఫ్ అభ్యర్థులు వెనుకబడి ఉన్నారని థరూర్ పేర్కొన్నారు. కేరళ ఓటర్లలో మార్పు కోరుకుంటున్నారనే విషయాన్ని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. #WATCH | Keralam Elections 2026 | Congress-led UDF has crossed the majority mark, according to the latest Election Commission trends.When asked about factors behind LDF's poor performance, State Congress president Sunny Joseph says, "Anti-people policies.""That we will decide… pic.twitter.com/pEVBHSjLfK— ANI (@ANI) May 4, 2026 కన్నూరులోని ధర్మడోం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెనుకంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి గంటలో మంత్రులు వీణా జార్జ్, ఎంబి. రాజేష్, ఓఆర్ కేలు, ఆర్. బిందు, జె. చించురాణి, పిరాజీవ్, కెబి. గణేష్ కుమార్, రోషీ అగస్టిన్ తమ నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉన్నారు.కొడువల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో యూడీఎఫ్ అభ్యర్థి పీకే ఫిరోజ్ 4,875 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఎల్డీఎఫ్ అభ్యర్థి సలీం మాదవూర్ 4,083 ఓట్లతో వెనుకంజలో ఉండగా, బీజేపీ అభ్యర్థి గిరి పంబనల్ ఇప్పటివరకు 929 ఓట్లను సాధించారు. ఇరింజలకుడలో మొదటి రౌండ్ లెక్కింపు తర్వాత థామస్ ఉన్నియాడన్ (కేరళ కాంగ్రెస్) ముందంజలో ఉన్నారు. కడుతురుత్తిలో అడ్వకేట్ మాన్స్ జోసెఫ్ (కేరళ కాంగ్రెస్) 4,750 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. కేంద్ర మంత్రి సురేష్ గోపి నియోజకవర్గమైన త్రిశూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రాజన్ జె. పల్లన్ ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి పద్మజా వేణుగోపాల్ వెనుకంజలో ఉండగా, సీపీఐ మూడవ స్థానంలో ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 48 స్థానాలతో స్థిరమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తుండగా, అధికార లెఫ్ట్ కూటమి 13 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 10 స్థానాలతో మూడవ స్థానంలోఉంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ఆరంభ ఆధిక్యాన్ని సాధిస్తున్నది. ఇప్పటివరకు మొత్తం 140 నియోజకవర్గాల్లో 11 చోట్ల ఆధిక్యాలు వెలువడగా, సీపీఐ(ఎం), సీపీఐ సహా ఎల్డీఎఫ్ కూటమిలోని పార్టీలు ఈ స్థానాల్లో ముందంజలో ఉన్నాయని సమాచారం. 140 మంది సభ్యులు కలిగిన కేరళ అసెంబ్లీలో ప్రాథమిక ఫలితాల ప్రకారం కాంగ్రెస్ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ ఐదు స్థానాల్లోనూ, ఎల్డీఎఫ్ నాలుగు స్థానాల్లోనూ ముందంజలో ఉన్నాయి.కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సోషల్ మీడియా బయోను అప్డేట్ చేశారు. అందులో ఆయన తన ‘ముఖ్యమంత్రి’ హోదాను తొలగించి, తనను భారత కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పేర్కొన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్న నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు సంబరాలకు సన్నాహాలు ప్రారంభించారు.మలప్పురం జిల్లాలోని పండిక్కడ్‌లో తమ విజయం ఖాయమని భావిస్తూ కాంగ్రెస్,యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కార్యకర్తలు సుమారు 5,000 మందికి సరిపడా బిర్యానీని సిద్ధం చేస్తున్నారు. సంబరాలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.కొచ్చిలో సంబరాలకు బీజేపీ సిద్ధమయ్యింది. ఇప్పటికే భారీ మొత్తంలో లడ్డూలను ఆర్డర్ చేసింది. బీజేపీకి దాని మిత్రపక్షాలకు ప్రస్తుతం కేరళ అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. కానీ ఈసారి తాము ఖాతాను తెరుస్తామని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. Kerala CM Pinarayi Vijayan updates his social media bio, a day before the counting of votes for the Kerala Assembly elections, dropping the “Chief Minister” designation READ: https://t.co/BEqWeY1DFWhttps://t.co/BEqWeY1DFW— WION (@WIONews) May 4, 2026 VIDEO | Kerala Poll Results 2026: Party cadres arrive at KPCC office in Thiruvananthapuram ahead of counting.#KeralaPollResults2026 #Results2026WithPTI #AssemblyElectionResults2026(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/fnu5YsQrjL— Press Trust of India (@PTI_News) May 4, 2026ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ఈ లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. తరువాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు జరగనుంది.ఈ కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా 43 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి మే 6వ తేదీ వరకు అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 17,565 మంది ఎన్నికల సిబ్బందిని విధులలో నియమించారు. -
భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఓటమి
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి.. ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.. -
దీదీ నాలుగోసారి సీఎం అవుతారా?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరికాసేపట్లో కౌంటింగ్ షురూ కానుంది. మొత్తం 294 స్థానాలు ఉన్న బెంగాల్ అసెంబ్లీలో అధికారం కైవసం చేసుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148. ఒక్క ఫాల్తా తప్ప అన్ని ఫలితాలు ఇవాళ వెలువడతాయి. ఆ నియోజకవర్గంలో 24న ఉప ఎన్నిక జరగనుంది. మిగిలిన 293 స్థానాల ఓట్ల కౌంటింగ్ కోసం 77 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బెంగాల్ ఫలితాలను అటు ఢిల్లీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నుడూలేని విధంగా ఈసారి భారీగా పోలింగ్ నమోదు కావడం ఇందుకు మరో కారణం. టీఎంసీ, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. నాలుగోసారి మమతా బెనర్జీ సీఎం అవుతారా?.. బెంగాల్లో మమతకు బీజేపీ చెక్ పెడుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల తర్వాత ఈవీఎంలను లెక్కించనున్నారు. రెండు గంటల తర్వాత ట్రెండ్స్ వెలువడే చాన్స్ ఉంది. మరోవైపు కౌంటింగ్ హాల్లో సెల్ఫోన్లు నిషేధించారు. కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎస్ఐఆర్ తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఆసక్తి నెలకొంది. మరీ ముఖ్యంగా భవానీపూర్‌లో మమత వర్సెస్ అధికారి సువేందు మధ్య టఫ్ వార్ తప్పదనే అంచనాలు నెలకొన్నాయి. మొత్తంగా.. బెంగాల్ ఫలితాలు జాతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. కొద్ది గంటల్లోనే ఈ ఉత్కంఠకు తెర పడనుంది. -
బెంగాల్లో ‘స్వీట్ల’ రాజకీయం
‘మోదీశ్రీ’, ‘జాయ్ బంగ్లా’, ‘లాల్ సలాం’... నినాదాలను తలపిస్తున్నాయి కదా! కానీ ఇవన్నీ స్వీట్లు. ఎన్నికల ఫలితాల వేళ.. వివిధ పార్టీల అభ్యర్థుల కోసం బెంగాల్ స్వీట్ల తయారీదారులు పెట్టిన మిఠాయిల పేర్లు. ఓట్ల లెక్కింపు కోసం ఓటర్లు, అభ్యర్థులు ఎదురు చూస్తుంటే.. మిఠాయి తయారీదారులు మాత్రం రాజకీయ, సాంస్కృతిక మేళవింపుతో పార్టీలను ప్రతిబింబించే స్వీట్ల తయారీలో నిమగ్నమయ్యారు. ఆహారం చుట్టూరా ప్రచారం.. ఈసారి పశ్చిమబెంగాల్ ఎన్నికలు ఆహారం చుట్టూనే తిరిగాయి. నెల రోజులకు పైగా సాగిన ఎన్నికల పోరు చేపలు, జల్మురి వంటి ఆహారం చుట్టే తిరిగింది. చివరికి ఫలితాలు కూడా తినుబండారాలతోనే ముడిపడ్డాయి. అది కూడా బెంగాల్‌కే ప్రత్యేకమైన స్వీట్లతో. ‘మిఠాయిలు బెంగాల్ సంస్కృతిలో అంతర్భాగం. ప్రతి సందర్భానికీ తగిన మిఠాయిలు ఉంటాయి. అలాంటప్పుడు ఎన్నికలకు ఎందుకు చేయకూడదు?’అని ప్రశ్నిస్తున్నారు మిఠాయి వ్యాపార సంస్థల యజమానులు. స్వీట్లతో ఫలితాలను వేడుకగా మార్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో తాజా రసగుల్లాలు, సందేశ్‌ల సువాసనతో కోల్‌కతా అంతా ఘుమఘుమలాడుతోంది. ఇక, ఈ ఎన్నికల అసలు విశేషం ఏంటంటే ఆ మిఠాయిల రంగులు, పేర్లు. పార్టీల రంగు, నినాదాలు, నాయకుల పేర్లు.. పార్టీ రంగులు, చిహ్నాలు, నినాదాలు, నాయకుల పేర్లతో కూడిన ప్రత్యేక స్వీట్లను తయారు చేసే పనిలో పడ్డాయి సంస్థలు. కాషాయ రంగు స్వీట్‌కు ‘మోదీశ్రీ’అని, ఆకుపచ్చ రంగు మిఠాయిలకు ‘జాయ్ బంగ్లా’అని, గులాబీ, ఎరుపు రంగు వర్ణపు మిఠాయిలకు వామపక్షాల ‘లాల్ సలాం’అని పేర్లు పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోల్‌కతా వచి్చన ప్రధాని మోదీ కాషాయ రంగు కేసర్ ఫ్లేవర్ ‘సందేశ్’రుచి చూశారు. ఆ స్ఫూర్తితో కాషాయ రంగు సందేశ్‌కు ‘మోదీశ్రీ’అని పేరు పెట్టారు. ఇక, మరో సందేశ్‌ను నిమ్మకాయ ఫ్లేవర్‌తో, ఆకుపచ్చ రంగులో తయారు చేసి తృణమూల్ కాంగ్రెస్ నినాదమైన ‘జోయ్ బంగ్లా’పేరు పెట్టారు. తమ దుకాణాల్లో ప్రధానంగా రసగుల్లా, రాజ్¿ోగ్ రకాలను తయారు చేస్తామని ప్రఖ్యాత కేసీ దాస్, నోబిన్ చంద్ర దాస్ మిఠాయి దుకాణ సంస్థల డైరెక్టర్ ధీమన్ దాస్ అన్నారు. ‘ఆకుపచ్చ, నారింజ, ఎరుపు వెల్వెట్ రసగుల్లాలను తయారు చేస్తున్నాం. ఓట్ల లెక్కింపు రోజున డిమాండ్, ట్రెండ్‌ను బట్టి సరఫరా చేస్తాం’అని చెప్పారు. తెల్లరసగుల్లాలను రెడీ చేసుకుని.. రాష్ట్రంలో నెలకొన్న ‘ఫిఫ్టీ–ఫిఫ్టీ’ఛాన్సెస్‌కు అనుగుణంగానే కాషాయం, ఆకుపచ్చ రంగులో రసగుల్లాలు, సందేశ్‌లను తయారు చేస్తున్నారు. ఫలితాల తరువాతే మిఠాయిలు అవసరమవుతాయి. అప్పుడు వేగంగా స్వీట్లను అందించేందుకు తయారీ సంస్థలు ముందు భారీ సంఖ్యలో తెల్ల రసగుల్లాలను తయారు చేసి పెడుతున్నాయి. రంగు రంగుల చక్కెర సిరప్‌లను కూడా సిద్ధంగా ఉంచుతున్నాయి. ఓట్ల లెక్కింపు తరువాత గెలవబోయే అభ్యర్థి పార్టీ రంగును బట్టి అవసరమైన రంగులో రసగుల్లాలను ముంచి సరఫరా చేయనున్నారు. బీజేపీ, తృణమూల్ మధ్య హోరాహోరీ పోటీ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సందిగ్ధానికి ఇది అద్దం పడుతోంది. – కోల్‌కతా -
అసెంబ్లీ, క్యూ4 ఫలితాలపై ఫోకస్
ఐదు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, కార్పొరేట్ దిగ్గజాల గతేడాది చివరి త్రైమాసిక పనితీరు ప్రధానంగా ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు దారి చూపనున్నాయి. అంతేకాకుండా విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి పతనం, విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. నేడు(4న) ఐదు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెక్ పెట్టనున్నట్లు ముందస్తు అంచనాలు పేర్కొన్నాయి. మరోపక్క తమిళనాడు ఫలితాలపైనా ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠతకు తెరతీయడంతో స్టాక్ ఇన్వెస్టర్లు సైతం వీటి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు సైతం నేడు తెలియనున్నాయి. దిగ్గజాలు రెడీ ఇప్పటికే గతేడాది(2025–26) చివరి త్రైమాసిక ఫలితాల సీజన్ వేడెక్కింది. వారాంతాన కొటక్ మహీంద్రా బ్యాంక్‌సహా.. నాల్కో, సీడీఎస్ఎల్, స్టార్ హెల్త్, డీమార్ట్, ఏపీఎల్ అపోలో తదితరాలు క్యూ4(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించాయి. ఈ బాటలో మరికొన్ని దిగ్గజాలు సైతం పనితీరు వెల్లడిచనున్నాయి. తాజా జాబితాలో అంబుజా సిమెంట్స్, బీహెచ్ఈఎల్, గోద్రెజ్ ప్రాపర్టీస్, జిందాల్ స్టెయిన్లెస్, ఎల్అండ్టీ, ఎస్ఆర్ఎఫ్, మారికో, కోఫోర్జ్‌తోపాటు.. ఆటో రంగ దిగ్గజాలు ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, హీరో మోటో, గోద్రెజ్ కన్జూమర్, పాలీక్యాబ్, శ్రీ సిమెంట్, బీఎస్ఈ, పిడిలైట్, లుపిన్, థెర్మాక్స్, ఏబీబీ, బీవోబీ, ఎంసీఎక్స్, స్విగ్గీ, కల్యాణ్ జ్యువెలర్స్ తదితరాలు చేరాయి. గణాంకాలు ఏప్రిల్ నెలకు హెచ్ఎస్బీసీ తయారీ, సరీ్వసులు, కాంపోజిట్ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. ఇదేవిధంగా చైనా, యూఎస్ పీఎంఐ గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. ప్రధానంగా యూఎస్ ఉపాధి కల్పన, నిరుద్యోగ వివరాలు తెలియనున్నాయి. గత వారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడింది. ఫెడ్ చైర్మన్‌గా పదవీ విరమణ చేయనున్న పావెల్ అధ్యక్షతన ఎఫ్‌వోఎంసీ ఫండ్స్ రేట్లను 3.5–3.75 శాతం స్థాయిలో అమలు చేసేందుకు నిర్ణయించింది. చమురు మంట అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మండుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధమేఘాలు తొలగక పోవడం, హార్ముజ్ సంక్షోభం నేపథ్యంలో లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ గత వారం ఒక దశలో 126 డాలర్లను తాకింది. దీంతో డాలరుతో మారకంలో రూపాయి 95కు పతనమైంది. ఇది సరికొత్త కనిష్టంకాగా.. గతేడాదికి దేశీయంగా వాణిజ్య లోటు 333 బిలియన్ డాలర్లను దాటేసింది. 2024–25లో ఇది దాదాపు 284 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మండుతున్న చమురు ధరలు దిగుమతులు బిల్లును పెంచడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు. ఆటుపోట్లకు చాన్స్ హార్ముజ్‌పై అనిశ్చితి, బలపడుతున్న చమురు ధరలు తదితర అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లలో ఆటుపోట్లకు కారణంకానున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, ఎన్రిచ్ మనీ సీఈవో ఆర్.పొన్మూడి పేర్కొన్నారు. అసెంబ్లీ ఫలితాలకు ప్రాధాన్యమున్నప్పటికీ చమురు ధరలు సెంటిమెంటుకు కీలకంకానున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అభిప్రాయపడ్డారు. -
నేడే కౌంటింగ్.. అందరి చూపు బెంగాల్ పైనే!
దేశమంతటా తీవ్ర ఉత్కంఠ సృష్టిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. మరో కీలక రాష్ట్రం తమిళనాడులో ఎవరు గెలుస్తారన్న దానిపై ఆసక్తి పెరిగిపోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) నిక్షిప్తమైన ప్రజాతీర్పు సోమవారం బహిర్గతం కానుంది. సరిగ్గా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 8.30 గంటలకు ఈవీఎంలు తెరుచుకుంటాయి. సమయం గడిచేకొద్దీ అభ్యర్థుల జాతకాలు, పార్టీల బలాబలాలు తెలిసిపోతాయి. ఐదు రాష్ట్రాల్లో ప్రజల ఆశీస్సులతో కొత్తగా అధికారంలోకి వచ్చేది ఎవరో, ప్రజాతీర్పును శిరసావహించి కుర్చీ నుంచి దిగిపోయేది ఎవరో స్పష్టమైపోతుంది. ఫలితాల సరళిపై మధ్యాహ్నంకల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. అనధికార వ్యక్తులు కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించకుండా కౌంటింగ్ సిబ్బందికి తొలిసారిగా ఈసీఐనెట్ ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో గుర్తింపు కార్డులను అందజేసింది. అన్ని కేటగిరీల సిబ్బందికి ఈ కార్డులను తప్పనిసరి చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అత్యంత కీలకమైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో వెల్లడి కానున్న ప్రజాభిప్రాయం రాబోయే రోజుల్లో దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు గోవా, కర్ణాటక, నాగాలాండ్, గుజరాత్, మహారాష్ట్రలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, సోమవారమే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బెంగాల్లో రికార్డు స్థాయి ఓటింగ్ ఎవరికి లాభమో? పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలుండగా, ఒక స్థానంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించబోతున్నారు. మిగిలిన 293 స్థానాల ఓట్ల లెక్కింపు కోసం 77 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 432 మంది కౌంటింగ్ పరిశీలకులను నియమించింది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావడానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా శ్రమించింది. ఈసారి బెంగాల్లో కచ్చితంగా జెండా పాతాలన్న లక్ష్యంతో బీజేపీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడింది. ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా సహా ఆ పార్టీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించగా, రికార్డుస్థాయిలో 92.47 శాతం ఓటింగ్ నమోదయ్యింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో భారీగా ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి. దక్షిణ పరిగణాల జిల్లాలో 15 బూత్‌ల్లో శనివారం రీపోలింగ్ చేపట్టగా, 87 శాతం ఓటింగ్ నమోదయ్యింది. గెలుపు తమదేనని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార తృణమూల్ కాంగ్రెస్‌దే మళ్లీ విజయమని అంచనా వేయగా, మరికొన్ని బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించబోతున్నట్లు వెల్లడించాయి. బెంగాల్లో ఎన్నికలు ముగిసినప్పటికీ రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. అక్కడక్కడా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి హింసాకాండ చోటుచేసుకోకుండా 2.5 లక్షల మంది పారామిలటరీ జవాన్లను ఎన్నికల సంఘం మోహరించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ద్వారా 90 లక్షల ఓట్లను తొలగించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలే ఇవే కావడంతో ఫలితాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కౌంటింగ్ ప్రక్రియపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తంచేశారు. ఈవీఎంలను తారుమారు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కోల్‌కతాలో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్‌ను ముట్టడించేందుకు ప్రయతి్నంచారు. మమతా బెనర్జీ ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఈవీఎంల ట్యాపరింగ్‌కు అవకాశమే లేదని వివరణ ఇచ్చింది. తమిళనాడులో విజయం విజయ్‌దేనా?తమిళనాట ఓట్ల లెక్కింపునకు సమగ్రమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలుండగా, కౌంటింగ్‌కు మొత్తం 62 కేంద్రాలు సిద్ధం చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అర్చనా పటా్నయక్ తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగ్గా, 85.15 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. కౌంటింగ్ విధుల్లో 1.25 లక్షల మంది భద్రతా సిబ్బంది, అధికారులు, సూక్ష్మపరిశీలకులు పాలుపంచుకుంటున్నారు. ఎన్నికల సంఘం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లను నియమించింది. రాష్ట్రంలో ఈసారి ముక్కోణపు పోరు జరిగింది. అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకేతోపాటు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) తొలిసారిగా బరిలోకి దిగింది. వరుసగా రెండోసారి విజయంపై డీఎంకే అధినేత స్టాలిన్ చాలా ఆశలే పెట్టుకున్నారు. బీజేపీతో జతకట్టిన విపక్ష అన్నాడీఎంకే గెలుపు కోసం హోరాహోరీగా పోరాడింది. డీఎంకే మళ్లీ నెగ్గడం తథ్యమని మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ స్పష్టంచేయగా, విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి రాబోతున్నట్లు ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది. అస్సాంలో 258 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈశాన్య రాష్ట్రం అస్సాంలో విజయం పట్ల అధికార బీజేపీ ధీమాగా ఉంది. ఎగ్జిట్‌పోల్స్ సైతం ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలియజేశాయి. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో ఏప్రిల్ 9న ఎన్నికలు నిర్వహించగా, 85.96 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 35 జిల్లాల్లో మొత్తం 40 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 25 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలను రంగంలోకి దించారు. ఈసారి ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులతోపాటు 258 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీకి దిగడం గమనార్హం. అధికార ఎన్డీయేలో బీజేపీతోపాటు అస్సాం గణ పరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్ ఉన్నాయి. కాంగ్రెస్ కూటమిలో రాయ్జోర్ దళ్, ఏజేపీ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఏపీహెచ్ఎల్సీ తదితర పార్టీలు ఉన్నాయి. కేరళలో వామపక్షాలకు చేదు అనుభవమే! కమ్యూనిస్టులకు గట్టి పట్టున్న కేరళ అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలు ఉండగా, ఏప్రిల్ 9న జరిగిన పోలింగ్‌లో 79.63 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఈసారి వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హోరాహోరీగా తలపడ్డాయి. అధికార ఎల్డీఎఫ్పై యూడీఎఫ్ స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. కేరళలో తమ బలం పెరిగిందని, రెండంకెల్లో సీట్లు గెల్చుకోవడం ఖాయమని ఎన్డీయే విశ్వాసం వ్యక్తంచేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 43 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15 వేల మందికిపైగా భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులు కౌంటింగ్ విధుల్లో భాగస్వాములవుతున్నారు. ఒక బూత్‌లో నమోదైన ఓట్ల సంఖ్యకు, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఉన్న ఓట్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసాలు ఉన్న సందర్భాల్లో వీవీప్యాట్ స్లిప్‌లను కూడా లెక్కిస్తామని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. పుదుచ్చేరిలో మళ్లీ ఎన్డీయే! కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలుండగా ఆరు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆలిండియా ఎన్.ఆర్.కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ), బీజేపీ, అన్నాడీఎంకే, ఎల్జేకే పార్టీలతో కూడిన అధికార ఎన్డీయే మరోసారి విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. విపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్, డీఎంకే, వీసీకే పార్టీలున్నాయి. – సాక్షి, నేషనల్æడెస్క్2 -
రేపే కేరళ తీర్పు.. మధ్యాహ్నానికి స్పష్టత?
తిరువనంతపురం: కేరళ రాజకీయ ముఖచిత్రం రేపు తేలిపోనుంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ మధ్య జరిగిన ఉత్కంఠభరిత అసెంబ్లీ ఎన్నికల సమరానికి మే 4న తెరపడనుంది. రేపు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండటంతో కేరళ ప్రజలతో పాటు యావత్ దేశం ఈ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపుసోమవారం ఉదయం 8 గంటలకు 43 ప్రాంతాల్లోని 140 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అధికారులు ఇందుకోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు సహా సుమారు 15 వేల మంది సిబ్బందిని ఈ విధుల్లో నియమించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత రౌండ్ల వారీగా ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. మధ్యాహ్నానికల్లా విజేత ఎవరనే దానిపై స్పష్టమైన ట్రెండ్ వెలువడే అవకాశం ఉంది.భారీ పోలింగ్.. బరిలో 883 మందిఈ దఫా కేరళ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. మొత్తం 140 నియోజకవర్గాల్లో 79.63 శాతం భారీ పోలింగ్ నమోదైంది. సుమారు 2.71 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 883 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో రాష్ట్ర చరిత్రలోనే ఇదొక హోరాహోరీ పోరుగా మారింది. పోలింగ్ శాతం అంచనాలకు మించి నమోదు కావడంతో ఓటర్ల నాడిని పసిగట్టడం రాజకీయ విశ్లేషకులకు సైతం సవాలుగా మారింది.అగ్నిపరీక్షలో పార్టీలు.. ఈ ఫలితాలు మూడు ప్రధాన పార్టీలకు అత్యంత కీలకం. 2016 నుంచి ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, వరుసగా మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించాలని అధికార ఎల్డీఎఫ్ భావిస్తోంది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తన ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకోవాలని చూస్తోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం అత్యంత హోరాహోరీ పోరు తప్పదని, యూడీఎఫ్‌కు స్వల్ప ఆధిక్యం రావచ్చని అంచనా వేస్తున్నాయి.ఇది కూడా చదవండి: కాసేపట్లో నీట్ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ -
విజయ్ రిసార్ట్ వ్యూహం: గెలిస్తే అక్కడికే..
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు (మే 4)న వెలువడనున్న నేపథ్యంలో, రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మిశ్రమంగా ఉండటంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ముందస్తుగా అప్రమత్తమైన దళపతి విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’(టీవీకే) తమ కాబోయే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ‘రిసార్ట్ పాలిటిక్స్’కు తెరతీసింది.పూంజేరి రిసార్ట్‌లో భారీ ఏర్పాట్లుమహాబలిపురం సమీపంలోని పూంజేరిలో ఉన్న ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో సుమారు 100 మందికి పైగా గెలిచిన అభ్యర్థులకు వసతి కల్పించేందుకు టీవీకే పార్టీ ఏర్పాట్లు చేసింది. ఫలితాలు ప్రకటించిన వెంటనే విజయం సాధించిన అభ్యర్థులంతా క్షణం కూడా ఆలస్యం చేయకుండా పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని విజయ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, ‘గెలిచిన తర్వాత ఎక్కడికీ వెళ్లొద్దు’ అని అభ్యర్థులతో జరిగిన సమావేశంలో ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.ఎన్నికల సంఘానికి ఫిర్యాదుకౌంటింగ్ రోజున ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కోరుతూ భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) వినతిపత్రం సమర్పించాలని పార్టీ జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జునకు విజయ్ సూచించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తమ పార్టీ లీగల్ వింగ్‌ను ఆయన అప్రమత్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ డీఎంకే, ఏఐఏడీఎంకే మరియు టీవీకే కూటముల మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచనా వేయడంతో ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.విజయ్‌కు పాలిటిక్స్ ఒక హాబీ: డీఎంకేమరోవైపు, అధికార డీఎంకే పార్టీ మాత్రం తామే అత్యధిక స్థానాలు సాధించి మళ్లీ అధికార పీఠం దక్కించుకుంటామని అత్యంత ధీమాగా ఉంది. కౌంటింగ్ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని పార్టీ కార్యకర్తలను ఆదేశించింది. డీఎంకే అధికార ప్రతినిధి సేలం ధరణిధరన్ మాట్లాడుతూ.. రాబోయే దశాబ్దాల్లో డీఎంకేకు ప్రతిపక్షం ఎవరనేదే ఈ ఎన్నికల ప్రధానాంశమని వ్యాఖ్యానించారు. సర్వేల ప్రకారం 40% నుండి 55% మద్దతుతో స్టాలిన్ అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారని స్పష్టం చేశారు. విజయ్ ఏమాత్రం రాజకీయ నాయకుడు కాదని, రాజకీయాలు ఆయనకు కేవలం ఒక హాబీ మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. -
స్ట్రాంగ్‌రూమ్ పాలిటిక్స్‌తో బెంగాల్ హీట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకోవడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మే 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియం స్ట్రాంగ్‌రూమ్ వద్ద భారీ భద్రత మోహరించగా, ఓటర్ల తీర్పు ఎవరికి పట్టం కట్టనుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.ప్రశాంతంగా రీ-పోలింగ్.. ఫాల్తాలో మళ్లీ ఎన్నికదక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్, మగ్రాహత్ పశ్చిమ నియోజకవర్గాల్లోని 15 కేంద్రాల్లో శనివారం ప్రశాంతంగా రీ-పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 87 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు ఫాల్తా నియోజకవర్గంలోని మొత్తం 285 బూత్‌లలో మే 21న తిరిగి పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. దీని ఫలితాలు మే 24న వెలువడనున్నాయి. అంతకుముందు ఫాల్తాలో కొందరు టీఎంసీ కార్యకర్తలు ప్రాణహాని కలిగించేలా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ స్థానికులు ఆందోళనకు దిగడం తీవ్ర కలకలం రేపింది. #WATCH | TMC candidate from Beleghata Assembly, Kunal Ghosh, kept a watch with TMC leaders outside the strongroom at Netaji Indoor Stadium in Kolkata, West Bengal. https://t.co/OWiDOu4xg2 pic.twitter.com/oab2KphAA1— ANI (@ANI) May 2, 2026దీదీ ధీమా.. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద నిఘాఓట్ల లెక్కింపునకు ముందే టీఎంసీ తమ వ్యూహాలకు పదును పెట్టింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు కౌంటింగ్ ఏజెంట్లతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 200కు పైగా స్థానాలు గెలుస్తామని వారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు రాజ్యసభ ఎంపీ రాజీవ్ కుమార్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులను పరిశీలకులుగా నియమించారు. బెలేఘాటా అభ్యర్థి కునాల్ ఘోష్ వంటి నేతలు స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద స్వయంగా పహారా కాస్తూ అప్రమత్తంగా ఉన్నారు.టీఎంసీ ఓటమి ఖాయం: బీజేపీ ధీమాటీఎంసీ నేతలు ఓటమి భయంతో వణికిపోతున్నారని బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని, ఆమె ముఖంలో భయం కనిపిస్తోందని ఎన్జేపీ నాయకురాలు దేబశ్రీ చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సుమారు 90 శాతం రికార్డు స్థాయి పోలింగ్ జరగడం అధికార మార్పునకు స్పష్టమైన సంకేతమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. మే 4 కౌంటింగ్‌కు ముందు తమ అభ్యర్థులంతా దేవాలయాలను సందర్శిస్తారని, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మహిళా కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటారని బీజేపీ ప్రకటించింది.ఇది కూడా చదవండి: బెంగాల్ ‘ప్రస్థానం’లో నరాలు తెగే క్లైమాక్స్ -
బెంగాల్ ‘ప్రస్థానం’లో నరాలు తెగే క్లైమాక్స్
పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. దశాబ్దాల పాటు ఒకే పార్టీకి పట్టం కట్టడం, సుదీర్ఘకాలం పాటు వారికే అధికారం కట్టబెట్టడం ఇక్కడి ‘బాంగ్లార్ మానుష్’ (బెంగాల్ ప్రజల) నైజం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్, వామపక్షాలు, ఆ తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఇక్కడ ఒక్కొక్కటిగా తమ ప్రాభవాన్ని చాటాయి. అయితే, ప్రస్తుత 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక సరికొత్త హై-వోల్టేజ్ పోరుకు తెరలేపాయి. 15 ఏళ్లుగా ఎదురులేని శక్తిగా కొనసాగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇప్పుడు దూకుడు మీదున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రూపంలో అత్యంత క్లిష్టమైన సవాలు ఎదురవుతోంది. ‘బెంగాల్లో టీఎంసీకి సూర్యాస్తమయం ఖాయం’ అన్న బీజేపీ అధిష్టానం మాటల వెనుక ఉన్న కథేంటి? అసలు దశాబ్దాలుగా బెంగాల్ రాజకీయ ప్రస్తానం ఎలా మారుతూ వచ్చిందో ఈ విశ్లేషణలో చూద్దాం.కాంగ్రెస్ శకం: పునాదులు, పోరాటాలుస్వాతంత్య్రానంతరం బెంగాల్ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ బలమైన పునాదులు వేసింది. 1947 దేశ విభజన సంక్షోభం తర్వాత డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, విచ్ఛిన్నమైన సమాజాన్ని ఒక్కటి చేయడంతో పాటు ఆధునిక బెంగాల్‌కు ఆకృతినిచ్చారు. సాల్ట్ లేక్ సిటీ నిర్మాణం ఆయన దార్శనికతకు నిదర్శనం. అప్పట్లో కలకత్తా కేవలం రాజధాని మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువు. వందేమాతరం గీతాలాపన నుంచి స్వరాజ్య నినాదం వరకు కలకత్తా వేదికగానే జరిగాయి. అయితే, అంతర్గత విభేదాలు, బంగ్లా కాంగ్రెస్ ఆవిర్భావం, నెహ్రూ, శాస్త్రి వంటి జాతీయ దిగ్గజాల మరణంతో కాంగ్రెస్ పట్టు నెమ్మదిగా సడలుతూ వచ్చింది. 1967 ఎన్నికలు కాంగ్రెస్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేశాయి.ఎర్రకోట: వామపక్షాల సుదీర్ఘ ఆధిపత్యంజాతీయ స్థాయిలో ఇందిరా గాంధీ బలపడుతున్న సమయంలోనే బెంగాల్ భిన్నమైన మార్గం ఎంచుకుంది. 1977లో జ్యోతి బసు నేతృత్వంలోని వామపక్ష కూటమి (లెఫ్ట్ ఫ్రంట్) బలమైన సైద్ధాంతిక పునాదితో అధికారంలోకి వచ్చింది. ‘ఆపరేషన్ బర్గా’ ద్వారా కౌలుదారుల హక్కులు పరిరక్షించడం, 1978లో పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా వారు బలమైన ఓటు బ్యాంకును సృష్టించుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం (1977-2011) ప్రజాస్వామ్యబద్ధంగా పాలించిన కమ్యూనిస్ట్ ప్రభుత్వంగా రికార్డు సృష్టించారు. 2000లో బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రి అయ్యాక పారిశ్రామికీకరణపై దృష్టి పెట్టినా, క్షేత్రస్థాయిలో ప్రజల్లో పెరిగిన అసంతృప్తి ఒక కొత్త రాజకీయ శక్తికి మార్గం సుగమం చేసింది.మమతా ప్రభంజనం: దశాబ్దాల కంచుకోట బద్దలుసరిగ్గా అప్పుడే రాష్ట్రంలో ఉవ్వెత్తున ఎగసిన సరికొత్త నాయకురాలు మమతా బెనర్జీ. 2011 ఎన్నికల్లో వామపక్షాల దశాబ్దాల ఆధిపత్యానికి తెరదించుతూ, తన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీతో 184 స్థానాలు సాధించి సంచలనం సృష్టించారు. బెంగాల్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె చరిత్రకెక్కారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులను పక్కనపెట్టిన బెంగాల్ ప్రజలు మమతకు బ్రహ్మరథం పట్టారు. కేంద్రంలో వాజ్‌పేయి హయాంలో అధికారంలో ఉన్నప్పటికీ, అప్పట్లో బెంగాల్లో బీజేపీ పాత్ర నామమాత్రమే. 2016 నాటికి 200లకు పైగా సీట్లతో మమత మరింత బలపడ్డారు. ఆమె సంక్షేమ పథకాలు, ప్రజలతో ఉన్న బలమైన అనుబంధం టీఎంసీని అజేయమైన శక్తిగా మార్చాయి.బీజేపీ ఉప్పెన: బలమైన ప్రతిపక్షంగా..2021 అసెంబ్లీ ఎన్నికలతో బెంగాల్ రాజకీయ ముఖచిత్రం అనూహ్యంగా మారిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల నేతృత్వంలో బీజేపీ మునుపెన్నడూ లేని స్థాయిలో ప్రచారం నిర్వహించింది. దీదీ అధికారాన్ని నిలబెట్టుకున్నప్పటికీ, బీజేపీ ఏకంగా 77 స్థానాలు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. కాంగ్రెస్, వామపక్షాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఒకప్పుడు బెంగాల్లో ఉనికి కోసం పోరాడిన బీజేపీ, అధికార టీఎంసీకి ఏకైక ప్రత్యమ్నాయంగా ఎదగడం రాజకీయంగా, వ్యూహాత్మకంగా అతిపెద్ద మలుపు. ఈ పరిణామం దీదీకి భవిష్యత్ సవాళ్లపై స్పష్టమైన సంకేతం ఇచ్చింది.2026 కురుక్షేత్రం: అధికార మార్పిడి తథ్యమా?ప్రస్తుత 2026 ఎన్నికలు టీఎంసీ, బీజేపీ మధ్య ముఖాముఖీ సమరంగా మారాయి. మునుపెన్నడూ లేనివిధంగా భారీ పోలింగ్ నమోదు కావడం ఉత్కంఠ రేపుతోంది. భవానీపూర్ లాంటి టీఎంసీ కంచుకోటల్లో సైతం బీజేపీ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి, ఏ సీటునూ వదిలిపెట్టేది లేదన్న సంకేతాలిచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం బీజేపీకి మొగ్గు చూపుతుండటం దీదీకి కలవరపెట్టే అంశమే. 2021లో నందిగ్రామ్‌లో సువేందు అధికారి చేతిలో ఓటమి పాలైన మమత, ఈసారి మరింత కఠినమైన పోరును ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా ఒకే పార్టీని సుదీర్ఘకాలం ఆదరించిన బెంగాల్ ప్రజలు.. ఈసారి మార్పు కోరుకుంటూ కొత్త చరిత్ర లిఖిస్తారా లేక దీదీకే మళ్లీ జై కొడతారా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.ఇది కూడా చదవండి: దీదీకి షాకిచ్చిన బీజేపీ త్రయం -
తమిళనాట మరో సంచలన సర్వే
సాక్షి, చెన్నై: తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు విజయ్ మరో ఎంజీఆర్ అయ్యేనా అన్నది మరికొన్ని గంటల వ్యవధిలో తేలనుంది. ఈ నేపథ్యంలో మరో ఎగ్జిట్ పోల్‌లోనూ విజయ్‌కే అధికారం ఖాయం అని స్పష్టం కావడం చర్చనీయాంశమైంది. వివరాలు.. తమిళనాడులో మెజారిటీ సర్వే సంస్థలు అధికార డీఎంకేకు అనుకూలంగా ఫలితాల్ని ఇచ్చాయి.అయితే యాక్సిస్ మై ఇండియా, మరికొన్ని స్థానిక చిన్న సంస్థలు, సామాజిక మాధ్యమాలో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం వైపే ప్రజలు మొగ్గు చూపారని స్పష్టం చేస్తున్నాయి. ఈ సమయంలో శనివారం మాజీ ఐపీఎస్ అధికారి పి. రవి బృందం నిర్వహించిన నియోజకవర్గాల వారీగా ఎగ్జిట్ పోల్ సర్వే ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది. విజయ్ పార్టీకి 121 స్థానాలు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పి. రవి బృందం తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమగ్రంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వే అంచనా ప్రకారం, విజయ్ నాయకత్వంలోని టీవీకే ఏకంగా 41 శాతం ఓట్లను సాధించి, 121 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని వెల్లడించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా యువత, ముఖ్యంగా 18–40 ఏళ్ల వయస్సు గల ఓటర్లు టీవీకే వైపు బలంగా నిలిచారని ఈ నివేదిక పేర్కొన్నారు.ఐదు దశాబ్దాల ఆధిపత్యానికి బ్రేక్ సుమారు ఐదు దశాబ్దాలుగా తమిళనాడును పాలిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల కంటే, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ వైపు యువ ఓటర్లు ఎక్కువగా ఆకర్షితులయ్యారని ఈ సర్వే విశ్లేషించడం గమనార్హం. ఇక యాక్సిస్ మై ఇండియా విజయ్ పార్టీకి 98 నుండి 120 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే తెలిపింది. మాజీ ఐపీఎస్ పి. రవి టీమ్ సర్వేతో పాటూ యాక్సిస్ మై ఇండియా సర్వేలు విజయ్‌కు అనుకూలంగా రావడంతో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు అప్రమత్తమయ్యాయి. మే 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తమ ఏజెంట్లు, అభ్యర్థులకు సూచించాయి. -
విజయ్ (తమిళ్ స్టార్) రాయని డైరీ
‘‘సీఎం... సీఎం... సీఎం...!’’ ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని నీలాంగరై బీచ్ హౌస్ బయట నా అభిమానులు చేస్తున్న నినాదాలు పోటెత్తిన వేసవి సాయంత్రపు అలల్లా వచ్చి నన్ను ఢీకొని, చల్లటి చిలకరింపుగా నా ముఖాన్ని తాకుతున్నాయి. ఎంత హాయి! వారి వైపు చూస్తూ చేతులు జోడించాను. ‘‘అలా కాదు తలపతీ, ఇలా...’’ అంటూ వెయ్యి పిడికిళ్లు ఒక్కసారిగా పైకి లేచాయి! వెయ్యిన్నొక్క చెయ్యిగా వారితో నా పిడికిలి కలిపాను. చేతిని గాలిలో ఊపుతూ... ‘‘ఎన్ నెంజిల్ కుడియిరుక్కుమ్’’ అని నేను అంటుండగానే, ‘‘ఎన్ అన్బు రసిగర్గళుక్కు వణక్కమ్’’ అని ఎప్పటిలా వారు నా మాటను చటుక్కున పూర్తి చేశారు! అది నాకూ, వారికి మధ్య ఏర్పడిన పద–బంధం. ‘‘నా హృదయంలో కొలువై ఉన్న...’’ అంటానా, ‘‘నా ప్రియమైన అభిమానులకు నమస్కారాలు...’’ అని వారు అందుకుంటారు.యువ నావికుడికి దారి చూపటానికి చెన్నై నగరం నుంచి బీచ్ ఒడ్డుకు చేరుకున్న వెలుతురు నౌకలా ఉన్నారు వారంతా! ‘‘ధన్యవాదాలు స్నేహితులారా. ఇక చాలు. చీకటి పడుతోంది, క్షేమంగా ఇల్లు చేరండి. మన సోదరీమణులను జాగ్రత్తగా వాళ్ల ఇళ్ల దగ్గర దింపాకే మీరు వెళ్లండి’’ అని విజ్ఞప్తి చేసి లోపలికి వచ్చాను. లివింగ్ రూమ్‌లోకి రాగానే నిలువెత్తున వేలు నాచ్చియార్, అంజలై అమ్మాళ్!! ఈ వీరనారుల ధైర్య సాహసాలకు వారసులైన తమిళ మహిళలనేనా... ‘‘భద్రంగా ఇళ్ల దగ్గర దింపి వెళ్లండి’’ అని నేను నా యువసేనకు బాధ్యతలు అప్పగించింది! నాలో నేను నవ్వుకున్నాను. నాచ్చియార్ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన 18వ శతాబ్దపు రాణి! అంజలై అమ్మాళ్ దక్షిణ ఆర్కాట్ స్వాతంత్య్ర సమరయోధురాలు!వారి చిత్రపటాలనే చూస్తూ నిలబడి పోయాను. ఆ పక్కనే ఉన్న పెరియార్, అంబేడ్కర్, కామరాజ్ నవ్వుతూ నా వైపే చూస్తున్నట్లుగా ఉంది! ‘‘విజయ్, ఆల్ ద బెస్ట్ రా... సినిమాల అబ్బాయీ’’ అని నన్ను దీవిస్తున్నట్లుగానూ ఉంది. పెరియార్ ఎన్నడూ సినిమాలను ఇష్టపడలేదు. కానీ పెరియార్ సిద్ధాంతాలు సినిమాలుగా వచ్చాయి! ‘పరాశక్తి’, ‘వేలైక్కారి’, ‘నల్ల తంబి’ ఆయన సిద్ధాంతాల నుంచి తయారైన సినిమాలే. పెరియార్‌లా అంబేడ్కర్‌కు సినిమాలపై వ్యతిరేకత లేదు. జీవితాన్ని నవ్వుతూ స్వీకరించటం ఎలాగో సినిమా నేర్పిస్తుంది అనేవారట అంబేడ్కర్! కామరాజ్ కాంగ్రెస్ పార్టీలోని పెద్ద తరం నాయకులు. సినిమాలను, సినిమా వాళ్లను ఆయన చిన్నచూపు చూసేవారనీ, ‘‘ముఖాలకు రంగులు వేసుకునేవాళ్లు ప్రభుత్వాన్ని ఎలా నడపగలరు?’’ అనేవారనీ విన్నాను. కానీ నడిపారు! సినిమాలకు రాసి, పాడి, అభినయించిన వారు, రాజకీయ నాయకులకు దీటుగా తమిళనాడును నడిపారు. అన్నాదురై సీఎం కావటానికి ముందు నాటక రచయిత. నాటకాల్లో నటించారు; కళైజ్ఞర్ కరుణానిధి సీఎం కావటానికి ముందు స్క్రీన్ రైటర్, పాటల రచయిత; ఎంజీ రామచంద్రన్ సీఎం కావటానికి ముందు సూపర్‌స్టార్; జయలలిత అమ్మ సీఎం కావటానికి ముందు తమిళ సినిమా సామ్రాజ్ఞి; స్టాలిన్ సర్ కూడా సీఎం కావటానికి ముందు సినిమాల్లో నటించారు. తమిళనాడులో ప్రతి ముఖ్యమంత్రీ సినిమాలతో బంధమో, అనుబంధమో ఉన్నవాళ్లే. రంగుల లోకం నుంచి వచ్చి, ప్రజల జీవితాల్లో కాంతులు నింపినవాళ్లే. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు. ‘‘సీఎం... సీఎం... సీఎం...!’’ అంటూ, నడిరేయిలో లీలగా హోరు వినిపిస్తోంది. నా నీలాంగరై బీచ్ హౌస్‌ను తాకి వెళుతున్నది అలలా... తమిళ ప్రజల కలలా?! -
బెంగాల్లో ‘ఎగ్జిట్’ డెమోక్రసీ?
బెంగాల్‌ను గెలవడానికి బీజేపీ వాళ్లు సర్వశక్తుల్నీ ధారపోశారు. రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారని మమతా బెనర్జీ చేస్తున్న వాదన అరణ్య రోదనగా మారిపోయింది. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ఒక సూపర్వైజర్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని తప్పనిసరిగా నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఒక తాఖీదును పంపించింది. ఈ తాఖీదు బెంగాల్‌కు మాత్రమే వర్తిస్తుందట! తృణమూల్ వర్గాలు ఇస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే 2023లో ఇటువంటి నిబంధనను ఎన్నికల సంఘం అమల్లోకి తెచ్చింది. లెక్కింపు కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులుగా కేంద్ర ఉద్యోగుల్ని నియమించాలన్నది ఆ నిబంధన. ఇది దేశవ్యాప్తంగా అమల్లోనే ఉన్నది. దీనికి అదనంగా ఒక సూపర్వైజర్ను కూడా విధిగా కేంద్ర ఉద్యోగినే నియమించాలని బెంగాల్ కోసం మరో ఆదేశం జారీ అయింది.ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తృణమూల్ పార్టీ హైకోర్టు మెట్లెక్కింది. అక్కడ దానికి ఓదార్పు దొరకలేదు. సుప్రీంకోర్టుకు వెళ్లింది. శనివారం నాడు సుప్రీంకోర్టు కూడా పిటీషన్‌ను డిస్మిస్ చేసింది. ఎన్నికల సంఘం విధివిధానాల్లో జోక్యం చేసుకోకూడదన్న యాంత్రిక వైఖరికి అనుగుణంగా న్యాయవ్యవస్థ స్పందించింది. అంతే తప్ప పిటీషనర్ల ఆందోళనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదని భావించాలి. ఒక నిర్దిష్ట సమయంలో అప్పటి సమాజంలోని ఆధిపత్య శక్తుల భావజాలం ప్రభావం అన్ని వ్యవస్థల మీదా అంతో ఇంతో పడుతుందేమో. అటువంటి సందర్భాల్లో ఆయా వ్యవస్థల్లో సృజనశీలత స్థానాన్ని యాంత్రికత ఆక్రమించవచ్చు. ఆరాధనా మందిరం మారితే దళితుల ఎస్సీ హోదా పోతుందని ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇదే కోణంలో అర్థం చేసుకోవలసి ఉంటుంది. జస్టిస్ కృష్ణయ్యర్, ఓ. చిన్నపరెడ్డి, హెచ్ఆర్ ఖన్నా, పిఎన్ భగవతి వంటి న్యాయమూర్తులు ఇప్పుడు గుర్తుకొస్తున్నారు.ఇప్పుడు ప్రణయ్‌రాయ్ వంటి జర్నలిస్టులు, యోగేంద్ర యాదవ్ వంటి సెఫాలజిస్టులు కూడా గుర్తుకొస్తున్నారు. దేశ మీడియా రంగంలో టీవీ వార్తల శకం ప్రారంభమైన తర్వాత ఆ తొలితరం అందించిన ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎంత సూపర్ హిట్ అయ్యేవో చాలామందికి గుర్తుండే ఉంటుంది. వ్యవస్థలకు లొంగని నిక్కచ్చితనం, కచ్చితత్వం నాటి సెఫాలజీని ముందుకు నడిపించాయి. మీడియా రంగాన్ని ఆధిపత్య శక్తులు తమ ఉక్కు పిడికిట్లోకి తీసుకోవడం ప్రారంభించిన తర్వాత ప్రణయ్‌రాయ్ వంటి వాళ్లు తాము స్థాపించిన సంస్థల నుంచే నిస్సహాయంగా బయటకు నడవాల్సి వచ్చిన విషాద దృశ్యాలను చూడవలసి వచ్చింది. అయినా, ప్రణయ్రాయ్లోని పాత్రికేయుడు ఓడిపోలేదు. మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంలో డెబ్బయ్ ఆరేళ్ల ‘ఆ యువకుడు’ ఒక సాధారణ క్షేత్రస్థాయి రిపోర్టర్ మాదిరిగా సెల్‌ఫోన్ చేతిలో పట్టుకొని ప్రజలను ఇంటర్వ్యూ చేస్తున్న దృశ్యాలకు సోషల్ మీడియాలో వేలాదిమంది జేజేలు పలికారు.మీడియా రంగం విస్తరించింది. టెక్నాలజీ పెరిగింది. గతంతో పోలిస్తే ప్రజాభిప్రాయాన్ని మదింపు వేయడంలో మరింత కచ్చితత్వం ఉండే అవకాశాలు ఇప్పుడే ఎక్కువున్నాయి. కానీ ఆధిపత్య శక్తుల ఆదేశాల మేరకు మీడియా సంస్థలు రాజీపడుతున్నాయనే విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఫలితంగా ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో సక్సెస్ రేట్ కూడా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడున్న సర్వే సంస్థల్లో ‘యాక్సిస్ మై ఇండియా’కు సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువ. ఈ సంస్థ ‘ఇండియా టుడే’తో కలిసి తన సర్వే ఫలితాలను వెల్లడిస్తుందనే సంగతి తెలిసిందే. బెంగాల్ రెండో దశ పోలింగ్ పూర్తికాగానే అన్ని ఛానెళ్ళు, అన్ని సర్వే సంస్థలూ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించాయి. ఇండియా టుడే కూడా యాక్సిస్ మై ఇండియా చేసిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. దేశంలో ఇంకే సర్వే సంస్థ గానీ, మీడియా సంస్థగానీ ఊహించని విధంగా తమిళనాడులో టీవీకే పార్టీ గెలిచే అవకాశముందని ప్రకటించి యాక్సిస్ మై ఇండియా సంచలనం సృష్టించింది. ఒక్క బెంగాల్ ఎగ్జిట్ పోల్‌ను మాత్రం మరుసటి రోజుకు వాయిదా వేశారు.మరుసటి రోజు కూడా ఆశాభంగమే మిగిలింది. బెంగాల్ ఎగ్జిట్ ఫలితాలను ప్రకటించబోవడం లేదని సర్వే సంస్థ ఎమ్డీ ప్రదీప్ గుప్తా ప్రకటించారు. ఇదొక అనూహ్యమైన పరిణామం. బెంగాల్‌పై అస్త్రసన్యాసానికి ఆయన చెప్పిన కారణం నమ్మశక్యంగా లేదు. మెజారిటీ ప్రజలు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పకపోవడం వల్ల ఫలితాన్ని అంచనా వేయలేకపోతున్నామని ఆయన చెప్పారు. ఇదే అసలు కారణమైతే ముందురోజే ఈ సంగతిని చెప్పి ఉండవచ్చు. తొలిదశ ఎన్నికలు అంతకు వారం రోజుల ముందే జరిగాయి. తొలిదశ జరిగిన ప్రాంతంలో ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పి రెండో దశలో చెప్పకుండా ఉన్నారా? తాము క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మాట్లాడినందువల్ల ఎవరికీ చిక్కని విధంగా తమిళనాడు నాడి తమకు చిక్కిందని చెప్పుకున్న యాక్సిస్ మై ఇండియా, కీలకమైన బెంగాల్ నాడిని ఎందుకు పట్టుకోలేకపోయిందో వివరణ ఇవ్వాల్సి ఉన్నది. ఎవరి ఒత్తిడికో లొంగి ప్రదీప్ గుప్తా బెంగాల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించకుండా దాచారనే అభిప్రాయం బలపడుతున్నది. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న ఒక సంస్థ ఎగ్జిట్ ఫలితాలను ఆపేసినంత మాత్రాన ఆ ‘బలమైన’ పార్టీకి కలిగే లాభం ఏముంటుంది? ప్రజాభిప్రాయానికి భిన్నమైన ఫలితాలు కౌంటింగ్ రోజు వెలువడే అవకాశముంటుందా?.. ఉంటే, ఎలా సాధ్యం?ఒక్క బెంగాల్‌కు మాత్రమే కౌంటింగ్ సూపర్వైజర్లు కూడా కేంద్ర సిబ్బందే ఎందుకు కావాల్సి వచ్చిందో? ఒక్క బెంగాల్ ప్రజల నాడిని పసిగట్టడంలోనే తన అశక్తతను ఆఖరి నిమిషంలో మాత్రమే ప్రదీప్ గుప్తా ఎందుకు వ్యక్తం చేశారో? ఒక్క బెంగాల్లోనే ‘సర్’ కార్యక్రమంతో 91 లక్షల ఓట్లు ఎందుకు గల్లంతయ్యాయో? తమ పేరు తొలగింపును పునఃపరిశీలించాలని దరఖాస్తులు పెట్టుకున్న లక్షలాది మందిలో కేవలం వెయ్యిమందికి మాత్రమే ఊరట లభించడానికి కారణమేమిటో? ఎన్నికలు ముగిసిన తర్వాతనే మిగిలిన దరఖాస్తులు పరిశీలిస్తామని చెప్పడమేమిటో? ఇటువంటి పలు సందేహాలు తలెత్తడం సహజం. ఎట్టి పరిస్థితుల్లోనైనా బెంగాల్లో గెలిచి తీరాల్సిందేనని బీజేపీ చేస్తున్న విశ్వప్రయత్నాల్లో ఇవన్నీ భాగమని తృణమూల్ భావిస్తున్నది. బెంగాల్ గెలుపునకు బీజేపీ ఒక చారిత్రాత్మకమైన ప్రాధాన్యాన్ని ఆపాదించుకుంటున్నది. ఇటీవలనే అధికారం చేపట్టిన బిహార్‌కు తోడు బెంగాల్‌ను కూడా గెలుచుకుంటే ఆర్యావర్త కాషాయీకరణ పూర్తవుతుంది. బీజేపీ మాతృసంస్థ జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామాప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రం బెంగాల్ గెలుపుతో ఈ చారిత్రక పరిణామం పూర్తవుతుంది. ఇక మిగిలేది దక్షిణాపథమే.కొన్ని వర్తమాన కీలక పరిణామాలు చారిత్రక సందర్భాలను స్ఫురణకు తెస్తాయి. పోలికలు కనిపిస్తాయి. పద్దెనిమిదో శతాబ్దం ఉత్తరార్ధంలో బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలాపై బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ సేనలు ప్లాసీ యుద్ధంలో విజయం సాధించడంతో భారత్‌లో ఇంగ్లిష్ పాలనకు తొలి అడుగు పడింది. బెంగాల్లో గెలిస్తే ఆర్యావర్త కాషాయీకరణలో బీజేపీ తుది అడుగు పూర్తవుతుంది. బలీయమైన బెంగాల్ నవాబును ఓడించడానికి ఈస్టిండియా కంపెనీ సేనాని రాబర్ట్ క్లైవ్ మోసపూరితమైన ఎత్తుగడలు వేశాడనీ, అతని సుపీరియర్ ఆయుధ టెక్నాలజీ కూడా అందుకు తోడ్పడిందనీ చరిత్ర చెబుతున్నది. బెంగాల్లో గెలవడానికి బీజేపీ కూడా మోసపూరితమైన ఎత్తుగడలు వేస్తున్నదని తృణమూల్ ఆరోపిస్తున్నది. ఆరోపణల్లో ఎంతో కొంత నిజముండదని చెప్పలేము. అంతమాత్రాన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ పదిహేనేళ్లు బెంగాల్‌ను పవిత్రంగా పరిపాలించిందని కూడా చెప్పలేము. గూండా గ్యాంగులు, అరాచక శక్తులు పాలక పార్టీ నీడలో వ్యవస్థీకృత రూపం దాల్చాయనీ, ఎన్నికల సందర్భాల్లో అవి పార్టీ తరఫున పని చేస్తున్నాయన్న విమర్శల్లో నిజం లేకపోలేదు.అరాచక శక్తులు రాజకీయ సైన్యంగా పనిచేయడం మమతా బెనర్జీతోనే ప్రారంభం కాలేదు. నక్సల్బరీ అలజడి సద్దుమణుగుతున్న కాలంలో డెబ్బయ్యవ దశకం తొలి రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి సిద్ధార్ధ శంకర్ రే హయాంలోనే ఈ రౌడీ రాజకీయ ముఠాలు ప్రారంభమయ్యాయని చెబుతారు. అన్నిరకాల వామపక్ష శక్తుల మీద, ముఖ్యంగా సీపీఎం శ్రేణుల మీద దాడులకు ఈ ముఠాలను ప్రేరేపించేవారు. సీపీఎం అగ్రనాయకుడు జ్యోతిబసు మీద కూడా ఆ రోజుల్లో హత్యాప్రయత్నం జరిగింది. ముప్పయ్ నాలుగేళ్లపాటు నిరాటంకంగా సాగిన వామపక్ష కూటమి పాలనలో కూడా రౌడీ ముఠాలను రాజకీయ అవసరాలకు వాడుకున్నారనే విమర్శ ఉన్నది. కాకపోతే, సమర్ధవంతంగా భూసంస్కరణలు అమలు చేయడం, పాలనా వికేంద్రీకరణ, అవినీతి రాహిత్యం, నాయకత్వ నిరాడంబరత వంటి కారణాల వలన ఈ వ్యవహారం పెద్దగా వివాదాస్పదం కాలేదు. మమతా బెనర్జీ పాలన మళ్లీ సిద్ధార్ధ శంకర్ రే వారసత్వాన్ని స్వీకరించిందనే విమర్శలున్నాయి.మమతా బెనర్జీ పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి, ప్రభుత్వ వ్యతిరేకత కూడా జనంలో ఉన్నది. కాకపోతే బెంగాల్‌ను గెలవాలనే ‘చారిత్రక కర్తవ్యం’ ఊపులో బీజేపీ నాయకత్వం ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం, డజన్లకొద్దీ కేంద్ర మంత్రులూ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను మోహరించడం, బెంగాల్‌పై యుద్ధం మాదిరిగా ఎన్నికల ప్రచారాన్ని మార్చడం వల్ల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ‘బెంగాలీ అస్మిత’ (బెంగాల్ ఆత్మగౌరవం) ను ముందుకు తోసింది. బెంగాలీ అస్మితపై హిందూ పరిచయ్ (హిందూ భావజాలం)తో దాడి చేస్తున్నారని విస్తృతంగా ప్రచారం చేసింది. తమ భాషా సంస్కృతులకు బెంగాలీలు, తమిళులు ఎంత ప్రాధాన్యతనిస్తారో మనకు తెలిసిన విషయమే. తమ పార్టీ బెంగాలీ బెటాలియన్‌తోనే మమతపై ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ పోరాడి ఉంటే మమత ఖాయంగా ఓడిపోయేదేమో! కానీ వ్యవస్థల మాటున నిలబడి అప్రజాస్వామిక పద్ధతులతో, మోసపూరితమైన ఎత్తుగడలతో బెంగాలీ అస్మితను ఒకవేళ గెలిస్తే, ఇకముందు దేశ భవిష్యత్తు ఎటువంటి దారిలో పయనిస్తుందోనన్నదే ప్రజాస్వామ్య శక్తుల ఆందోళన!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఈసీ కీలక నిర్ణయం.. బెంగాల్‌లోని ఆ స్థానంలో రీపోలింగ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఫల్తా నియోజక వర్గంలో ఉన్న అన్ని 285 పోలింగ్ స్టేషన్లలో (సహాయక పోలింగ్ స్టేషన్లు కూడా కలిపి) రీపోలింగ్ నిర్వహించాలని భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఆదేశాలు జారీ చేసింది. 2026 మే 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మళ్లీ పోలింగ్ నిర్వహించాలని, ఓట్ల లెక్కింపు మే 24న జరుగుతుందని ఈసీఐ పేర్కొంది.ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో ఏప్రిల్ 29న జరిగిన ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల నేరాలు, ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీసే చర్యలు చోటుచేసుకున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ఆదేశాలు జారీ చేశామని ఈసీఐ చెప్పింది. కాగా, దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్తా ప్రాంతంలో స్థానికులు నిరసన చేపట్టారు, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ భద్రతపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తాము అధికార పార్టీకి ఓటు వేసినా తమపై దాడి జరిగిందని ఓ మహిళ ఆరోపించింది. “మేము టీఎంసీకి ఓటు వేసినా కూడా వారు మాపై దాడి చేశారు. వారిని అరెస్ట్ చేయాలి, మహిళలకు భద్రత కావాలి” అని ఆమె తెలిపింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని 15 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ ముగిసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. -
దీదీకి షాకిచ్చిన బీజేపీ త్రయం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మమతా బెనర్జీ కంచుకోటను బద్దలు కొడుతూ బీజేపీ అనూహ్య ఆధిక్యం దిశగా దూసుకుపోతుండటం వెనుక ఒక అదృశ్య శక్తి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్. సంస్థాగత నైపుణ్యాలకు మారుపేరైన బన్సాల్.. భూపేంద్ర యాదవ్, బిప్లబ్ దేబ్ వంటి హేమాహేమీలతో కలిసి తన సైలెంట్ ఆపరేషన్‌తో టీఎంసీ అధినేత్రిని ఉక్కిరిబిక్కిరి చేసిన తీరు చర్చనీయాంశంగా మారింది.క్షేత్రస్థాయిలో ప్రకంపనలు‘భయం వీడండి, నమ్మకం ఉంచండి’ అనే బలమైన నినాదంతో సునీల్ బన్సాల్ బెంగాల్ రణరంగాన్ని సిద్ధం చేశారు. భారీ బహిరంగ సభల కంటే చిన్నపాటి స్ట్రీట్ మీటింగ్స్పైనే ఆయన ఎక్కువ దృష్టి పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 53 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకంగా 12,000 వీధి సభలు నిర్వహించారు. అలాగే, ముఖ్యంగా మహిళలు, ఓటర్లతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు లక్షా 65 వేల చిన్న సమావేశాలు ఏర్పాటు చేశారు.ఎమ్మెల్యేలనే టార్గెట్ చేస్తూ..ఈ ఎన్నికల్లో బీజేపీ మాస్టర్ ప్లాన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. వ్యూహంలో భాగంగా ప్రారంభంలో నేరుగా మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకోకుండా, టీఎంసీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను వాడుకున్నారు. సుమారు 220 నియోజకవర్గాల్లో టీఎంసీ ఎమ్మెల్యేలపై ఛార్జ్ షీట్లు విడుదల చేస్తూ 80కి పైగా ప్రెస్ మీట్లు పెట్టారు. అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ వ్యూహాత్మక దాడితో ఏకంగా 77 మంది అభ్యర్థులను మార్చుకోవాల్సిన ఒత్తిడి టీఎంసీపై పడింది. ఆ తర్వాత మొదలైన 10 వేల కిలోమీటర్ల ‘పరివర్తన్ యాత్ర’ బీజేపీకి మరింత ఊపునిచ్చింది.బ్రిగేడ్ సభతో బూస్ట్.. భావోద్వేగాల అస్త్రం‘బ్రిగేడ్ మైదానాన్ని గెలిచిన వారే బెంగాల్‌ను గెలుస్తారు’ అన్న వాదనను నిజం చేస్తూ, ప్రధాని మోదీ సభకు 5 లక్షల మందికి పైగా హాజరుకావడం మమత శిబిరంలో గుబులు రేపింది. ‘మా-మాటి-మానుష్’ పేరుతో జరిగిన అకృత్యాలను గుర్తుచేస్తూ, ఆర్జీ కర్, సందేశ్ ఖాలీ బాధితుల కుటుంబాలకు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా బెంగాలీల సెంటిమెంట్‌ను బీజేపీ బలంగా తాకింది. యువత, మహిళల కోసం ‘యువ కార్డ్’, ‘మాతృశక్తి కార్డ్’ వంటి పథకాలతో నేరుగా వారిని ఆకర్షించారు. మొత్తంగా 640కి పైగా ర్యాలీలతో సునీల్ బన్సాల్ బృందం బెంగాల్‌ను ముట్టడించి, చరిత్ర సృష్టించే దిశగా బలమైన అడుగులు వేసిందని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: 44 జాతీయ పక్షులు మృతి.. కర్ణాటకలో హై అలర్ట్ -
షాక్ మీద షాక్: ఫలితాలను తిరగతోడిన సట్టా బజార్
ప్రస్తుత పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరిత, రసవత్తర పోటీకి వేదికగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రెండు దశల పోలింగ్‌లో నమోదైన రికార్డు స్థాయి ఓటింగ్ శాతం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది. ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతున్న వేళ ‘ఫలోడి సట్టా బజార్’ తన అంచనా ఫలితాలను మరోమారు తిరగతోడింది. ఈ నేపధ్యంలో ఊహకందని పలు షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి.తీవ్రమైన పోటీ తప్పదురాజస్థాన్లోని జోధ్‌పూర్ జిల్లాలో ఉన్న ‘ఫలోడి’ అనే పట్టణం దేశవ్యాప్తంగా అక్రమ బెట్టింగ్‌లకు ప్రధాన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. దీనిని భారతదేశపు ‘బెట్టింగ్ రాజధాని’ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ప్రధానంగా దేశంలో జరిగే ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లు జరుగుతాయి. వీరు ఇచ్చే అంచనాలు చాలా వరకు నిజమవుతాయని ఒక నమ్మకం ఉంది. అందుకే దేశీయ మీడియాతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా ఈ బజార్ లెక్కలను గమనిస్తుంటారు. ఇటు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, అటు ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ రెండూ కూడా గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొదట్లో వెలువడిన ప్రాథమిక అంచనాలు ఒక పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని సూచించినప్పటికీ, తాజాగా నవీకరించిన ‘ఫలోడి సట్టా బజార్’ అంచనాలు గెలుపు ఎవరిదైనా సరే తీవ్రమైన పోటీ తప్పదని తేల్చి చెబుతున్నాయి. తారుమారైన లెక్కలు పశ్చిమ బెంగాల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాత ఫలోడి సట్టా బజార్ తన పాత అంచనాలను భారీగా సవరించింది. ప్రారంభంలో వచ్చిన నివేదికల ప్రకారం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సునాయాసంగా గెలిచే అవకాశం ఉన్నట్లు కనిపించింది. కానీ తాజా మార్పుల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి స్వల్ప ఆధిక్యం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం బీజేపీ మ్యాజిక్ ఫిగర్ సాధించే దిశగా లేదా అంతకంటే కొద్దిగా ఎక్కువ సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా చాలా దగ్గరి పోటీ ఇస్తూ వెనుబడే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తం 294 స్థానాలున్న అసెంబ్లీలో మెజారిటీ కోసం 148 సీట్లు ఖచ్చితంగా అవసరం.ప్రభుత్వ వ్యతిరేక పవనాలు? పశ్చిమ బెంగాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ ఓటింగ్ శాతం నమోదు కావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రెండు దశల ఎన్నికల్లోనూ పోలింగ్ ఏకంగా 92 శాతం దాటడం విశేషం. ఈ భారీ ఓటింగ్ శాతాన్ని చూసిన తర్వాత ఫలోడి సట్టా బజార్ తన అంచనాలను వెంటనే మార్చుకుంది. ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు బయటకు రావడం అనేది బహుశా అధికార పార్టీపై ఉన్న తీవ్ర వ్యతిరేకతకు ప్రబల సంకేతం కావచ్చని, లేదా ఓటర్ల ఆలోచనా విధానంలో వస్తున్న పెను మార్పులకు ఒక ప్రత్యక్ష నిదర్శనం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి దశ పోలింగ్ ముగిసిన వెంటనే వచ్చిన అంచనాలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీదే పైచేయి అని స్పష్టంగా చెప్పాయి. కానీ రెండవ దశ పోలింగ్ ముగిశాక బెట్టింగ్ ధోరణుల్లో పెను మార్పులు వచ్చాయి. అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ బలపడిందని, రెండు పార్టీల మధ్య ఉన్న అంతరం బాగా తగ్గిపోయిందని చెబుతున్నారు.ఈ ఒక్క అంశమే కీలకంపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఒక అత్యంత కఠినమైన ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అసాధారణ స్థాయిలో బలపడి అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సవాలు విసురుతోంది. ఒకపక్క తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అట్టడుగు స్థాయిలో బలమైన సంస్థాగత నిర్మాణం, ప్రజల ఆదరణ ఇప్పటికీ స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, తాజాగా వస్తున్న ఎగ్జిట్ పోల్స్, అలాగే సట్టా మార్కెట్ ధోరణులు చూస్తుంటే, రెండు పార్టీల మధ్య నరాలు తెగే హోరాహోరీ పోరు తప్పదని స్పష్టమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే, పట్టణ ప్రాంతాల్లో విస్తరిస్తున్న బీజేపీని మమతా బెనర్జీ ఏ మేరకు అడ్డుకోగలరనేదే అంతిమ విజేతను నిర్ణయించే ప్రధానాంశం కానుందని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: బెంగాల్ పీఠంపై సస్పెన్స్.. ‘హంగ్’ వస్తే ఎవరికి ఛాన్స్? -
టీఎంసీ-బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల నియోజకవర్గంలో 15 బూత్‌లలో రీపోలింగ్ జరుగుతుండగా, టీఎంసీ, బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. సోమవారం జరగనున్న ఓట్ల లెక్కింపునకు ముందు, తృణమూల్ కార్యకర్తలు తమను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లాలోని ఫల్తాలో స్థానికులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి.ఇదిలా ఉంచితే, మధ్యాహ్నం 2 గంటలకు మగ్రాహత్ పశ్చిమ్‌లో 56.33 శాతం, డైమండ్ హార్బర్లో 54.9 శాతం ఓటింగ్ నమోదవ్వగా, మొత్తం పోలింగ్ శాతం 55.57 శాతంగా ఉంది.పశ్చిమ బెంగాల్ ఎన్నికల రెండో దశలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో, సౌత్ 24 పరగణాల జిల్లాలోని 15 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. రీ పోలింగ్ సజావుగా సాగుతోందని స్థానిక ఓటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పోలింగ్ ఉత్సాహంగా సాగుతున్నప్పటికీ, సాంకేతిక లోపాలు ఓటర్ల సహనానికి పరీక్ష పెట్టాయి. డైమండ్ హార్బర్లోని ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ గంటకు పైగా నిలిచిపోయింది. దీనితో ఓటర్లు గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. గత పోలింగ్ రోజున, అలాగే ఈ రోజు కూడా సెలవు పెట్టాల్సి రావడం వల్ల రెండు రోజుల వేతనం కోల్పోయాను అని నిషా మందా అనే మహిళా ఓటరు ఆవేదన వ్యక్తం చేశారు.ఏప్రిల్ 29న జరిగిన ఓటింగ్‌లో సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం, ఈవీఎంలను ఉద్దేశపూర్వకంగా ట్యాంపరింగ్ చేయడం లాంటి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఎన్నికల సంఘం పాత పోలింగ్‌ను రద్దు చేసింది. మగ్రాహట్ పశ్చిమ్, డైమండ్ హార్బర్ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రత్యేక ఈవీఎంలపై ఉన్న పార్టీ గుర్తులను టేపులతో దాచిపెట్టారనే ఆరోపణలు స్థానిక ఓటర్లను తీవ్ర గందరగోళానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే స్పెషల్ అబ్జర్వర్ల నివేదిక ఆధారంగా, పకడ్బందీ భద్రతా నడుమ శనివారం సాయంత్రం 6 గంటల వరకు మళ్లీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకుంది.రీపోలింగ్ వ్యవహారం అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రీపోలింగ్ నిర్ణయాన్ని బీజేపీ వర్గాలు స్వాగతిస్తూనే, మరింత ఎక్కువ బూత్‌లలో అక్రమాలు జరిగాయని, వెంటనే అక్కడ కూడా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని గట్టిగా డిమాండ్ చేసింది. మరోవైపు, టీఎంసీ నేతలు మాత్రం ఎన్నికల సంఘం తీసుకున్న అకస్మాత్తు నిర్ణయంపై, పనితీరుపై తీవ్ర అసంతృప్తి బహిరంగంగా వ్యక్తం చేశారు. ఎలాంటి కనీస పారదర్శకత లేకుండా, తమ పార్టీ ఏజెంట్లకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని వారు ఆరోపించారు. ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య చెలరేగిన పరస్పర ఆరోపణలతో బెంగాల్ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. #WATCH | West Bengal Elections | Voters queuing up outside the polling booth at Uttar Yearpur F.P. School in Magrahat Paschim Assembly Constituency in South 24 Parganas district.Re-polling at 11 booths in Magrahat Paschim and four booths in Diamond Harbour for the West Bengal… pic.twitter.com/pBY8NNz7ED— ANI (@ANI) May 2, 2026 -
జనంపై ‘ఎన్నికల బిల్లు’
న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల ధర పెంపుపట్ల కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అధికార పార్టీకి ఎన్నికల సమయంలో మాత్రమే సామాన్య ప్రజలు గుర్తుకు వస్తారని, ఆ తర్వాత వారి మానాన వారిని వదిలేస్తారని మండిపడింది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర పెంపు ఒక ‘ఎన్నికల బిల్లు’అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. తరువాతి బాదుడు పెట్రోల్, డీజిల్‌పై ఉంటుందన్నారు. ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణం వేడి తగులుతుందని తాను ముందే హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘ఈ రోజు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర రూ.993 పెరిగింది. అతిపెద్ద పెంపు ఇదే. ఇది ఒక ఎన్నికల బిల్లు. కేవలం మూడు నెలల్లో రూ.1,380 పెరిగింది, ఇది 81% పెరుగుదల. టీ స్టాళ్లు, ధాబాలు, హోటళ్లు, బేకరీలు, స్వీట్ షాపులు, రెస్టారెంట్లు ప్రతి వంటగదిపై భారం పెరిగింది. ఇది అనివార్యంగా సాధారణ ప్రజలపై ప్రభావం చూపుతుంది’అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ధరలు పెంచబోమని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోయారని ఎద్దేవా చేశారు. వాణిజ్య సిలిండర్లపై దాదాపు రూ.1000 భారీ పెంపు, జీవనాధారం కోసం చిన్న భోజనశాలలపై ఆధారపడే కోట్లాది మంది భారతీయులను ప్రభావితం చేస్తుందని, కోట్లాది మంది ఈ పెంపు భారాన్ని మోయవలసి వస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందన్నారు. ఏప్రిల్ 29న అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని రాహుల్ గాంధీ ముందే హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉండటాన్ని ప్రభుత్వం సొమ్ము చేసుకుందని, ధరలు పెరుగుతున్నందున ఇప్పుడు ఆ భారాన్ని ప్రజలపై మోపాలని చూస్తోందని ఆయన విమర్శించారు. ‘ఎన్నికల ఉపశమనం ముగిసింది. ద్రవ్యోల్బణం వేడి రాబోతోంది! ఏప్రిల్ 29 తర్వాత జాగ్రత్త – పెట్రోల్, డీజిల్, ప్రతీదీ ఖరీదైపోతుంది. ముడిచమురు చౌకగా ఉన్నప్పుడు మోదీ ప్రభుత్వం లాభాలను జేబులో వేసుకుంది. ఇప్పుడు అది ఖరీదై, ఆ భారాన్ని మీపై మోపుతుంది’అని రాహుల్ గాంధీ మంగళవారం ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. -
త్వరలో పెట్రో బాదుడు!
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అతి త్వరలో పెట్రోల్, డీజిల్‌తోపాటు గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపునకు కేంద్రం ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. పెట్రో ధరల పెరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. తద్వారా పెట్రో బాదుడు తప్పదని పరోక్షంగా సంకేతాలిచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.4 నుంచి రూ.5 చొప్పున పెరిగే అవకాశాలున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధర రూ.40 నుంచి రూ.50 దాకా పెరగనుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ దేశంలో గత నాలుగేళ్లుగా రిటైల్ ధరల్లో పెద్దగా మార్పులు జరగలేదు. ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ముడి చమురు ధరల మంట వల్ల తీవ్రంగా నష్టం వాటిల్లుతున్నట్లు దేశీయ చమురు కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నష్టాలను పూడ్చడానికి ధరల పెంపు తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అగ్గి రాజేసిన ముడి చమురు పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ముడిచమురు బ్యారెల్ ధర ఇటీవలే 126 డాలర్లకు చేరింది. ఇది నాలుగేళ్ల గరిష్టం కావడం గమనార్హం. ప్రస్తుతం 110 డాలర్లకు దిగొచ్చింది. అయినప్పటికీ అయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. యుద్ధం ప్రారంభం కాకముందు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 80 డాలర్లు పలికింది. హార్మూజ్ జలసంధి గుండా చమురు నౌకల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించింది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. రెండో దశ చర్చలు ఆగిపోయాయి. ముడి చమురు ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ముడి చమురు ధరల పెరుగుదల వల్ల దేశంలో ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు పెట్రోల్‌పై లీటర్‌కు రూ.20, డీజిల్‌పై లీటర్‌కు రూ.100 చొప్పున నష్టపోతున్నారని చమురు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి గతవారం తెలియజేశారు. 2022 ఏప్రిల్ ఆరంభం నుంచి భారత్‌లో రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు స్తంభించిపోయాయి. ఆ తర్వాత కొన్ని నెలల్లో చమురు ధరలు పెరగ్గా, మరికొన్ని సమయాల్లో తగ్గాయి. ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లాభాలు ఆర్జించాయి. ధరలు పెరిగినప్పుడు వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి ఆ లాభాలను ఉపయోగించుకున్నాయి. కానీ, ఇరాన్లో యుద్ధం మొదలైన తర్వాత ముడి చమురు రేట్లు్ల ఒక్కసారిగా భారీగా పెరిగిపోవడం దేశీయ చమురు కంపెనీలకు ఇబ్బంది కలిగిస్తోంది. ఎన్నికలతో సంబంధం లేదు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెంచితే రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ప్రత్యామ్నాయాలను అంచనా వేయడానికి, రిటైల్ ద్రవ్యోల్బణంపై ప్రభావాన్ని తగ్గించడానికి అంతర్గత చర్చలు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోవడానికి, పెట్రో ధరల పెంపునకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇస్తున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు, పశి్చమాసియాలో ఉద్రిక్తతలు, చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొంటున్న తీవ్ర నష్టాల కారణంగానే పెంపు నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే వారమే ఈ పెంపు అమల్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. చమురు పరిశ్రమ తరపున ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) శుక్రవారం ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా ధరలు ఎగిసినా దేశీయంగా పెట్రోల్, డీజిల్‌తోపాటు ఎల్పీజీ రేట్లు పెంచలేదని గుర్తుచేసింది. నష్టాల నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వాణిజ్య ఎల్పీజీ, పారిశ్రామిక డీజిల్, 5 కేజీల ఎల్పీజీ, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు విక్రయించే జెట్ ఇంధనం ధరలను పెంచాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.25 నుంచి రూ.28 వరకు పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, పెంపు ఆ స్థాయిలో ఉండకపోచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. -
సుప్రీంకోర్టుకు టీఎంసీ.. ఓట్ల కౌంటింగ్ టెన్షన్ షురూ..
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మే 4న ఓట్ల లెక్కింపులో కౌంటింగ్ సూపర్ వైజర్లు, సహాయకులుగా కేవలం కేంద్ర ప్రభుత్వం, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ ఉద్యోగులను మాత్రమే నియమించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేసి.. అత్యవసర విచారణ కోరింది. న్యాయమూర్తులు పీఎస్ నరసింహా, జోయ్‌మాల్య బాగ్చీతో కూడిన ప్రత్యేక ద్విసభ్య బెంచ్ శనివారం కేసును విచారించనుంది.రెండో దశ పోలింగ్ సమయంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో టీఎంసీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. బయటి నుంచి వచ్చిన పరిశీలకులు, బెంగాల్‌కు పరిచయంలేని పోలీసు సిబ్బంది అంతా టీఎంసీ కార్యకర్తలను లక్ష్యంగా పెట్టుకుని నియమితులైనవారేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తమైంది. రెండో దశ పోలింగ్ సమయంలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఆ ఉద్యోగిఇటీవల పశ్చిమ బెంగాల్ అదనపు ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) ఒక ప్రకటన జారీ చేశారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్ లేదా సహాయకుల్లో కనీసం ఒకరు కేంద్ర ప్రభుత్వం లేదా పీఎస్‌యూ ఉద్యోగి ఉండాలని పేర్కొన్నారు. ఈ ఆదేశాన్ని టీఎంసీ సవాలు చేసింది. ఇలాంటి ఆదేశం ఎన్నికల కమిషన్ మాత్రమే జారీ చేయగలదని, అదనపు సీఈఓకు ఆ అధికారం లేదని ‘లైవ్ లా’ వెబ్సైట్ నివేదించింది.ఎన్నికల కమిషన్ హ్యాండ్‌బుక్‌లో కౌంటింగ్ సూపర్వైజర్, సహాయకులుగా కేంద్ర సిబ్బంది తప్పనిసరి అని చెప్పలేదని పార్టీ వాదించింది. మైక్రో పరిశీలకులను సాధారణంగా కేంద్ర సేవల నుంచి తీసుకున్నప్పటికీ, అదే నిబంధనను కౌంటింగ్ సిబ్బందికి కూడా తీసుకురావడం పశ్చిమ బెంగాల్‌కు మాత్రమే ప్రత్యేకమా? అని టీఎంసీ అడిగింది.పక్షపాత ధోరణి కనబర్చే అవకాశం ఉందని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీ అధీనంలో ఉండటం వల్ల కేంద్ర ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, దాంతో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుందని పేర్కొంది.ముందు టీఎంసీ కలకత్తా హైకోర్టుకు వెళ్లగా ఆ పార్టీ చేసిన ఈ వాదనలను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఎన్నికల కమిషన్ హ్యాండ్‌బుక్ ప్రకారం కౌంటింగ్ సిబ్బందిని కేంద్ర లేదా రాష్ట్ర సేవల నుంచి నియమించవచ్చని పేర్కొంది. సిబ్బంది ఎంపిక ఎన్నికల అధికారుల స్వేచ్ఛాధికార పరిధిలోకి వస్తుందని ‘లైవ్ లా’ తెలిపింది.‘పక్షపాతం’ అంటూ చేసిన ఆరోపణలను కొట్టిపారేస్తూ, కౌంటింగ్ ప్రక్రియలో ఇప్పటికే అనేక రక్షణ చర్యలు ఉన్నాయని హైకోర్టు తెలిపింది. మైక్రో పరిశీలకులు, అభ్యర్థులు నియమించిన కౌంటింగ్ ఏజెంట్లు, సీసీటీవీ పర్యవేక్షణ వంటి వ్యవస్థలు ఉన్నాయని పేర్కొంది. టీఎంసీ వ్యక్తం చేసిన అనుమానాలకు ఆధారాలు లేవని చెప్పింది.ఇలాంటి ఎన్నికల సంబంధిత సవాళ్లపై గత విచారణలను హైకోర్టు ప్రస్తావించింది. కేవలం అనుమానం ఆధారంగా న్యాయ జోక్యం సాధ్యం కాదని హైకోర్టు పేర్కొని పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో టీఎంసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.రెండో దశ పోలింగ్ సమయంలో ఉద్రిక్తతలు పెరిగాయి. టీఎంసీ, బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. పలు నియోజకవర్గాల్లో ప్రత్యర్థి అనుచరుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల పెంపుపై అధికార పార్టీ విమర్శలు చేసింది. -
కేరళ నెక్ట్స్ సీఎం ఎవరు?
‘‘ఒకవేళ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు?’’... ఈ ప్రశ్న దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తలెత్తుతుంది. ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా ముఖ్యమంత్రి పదవి కోసం ఆ పార్టీలో నేతలు పోటీ పడుతున్నారన్న ప్రచారం కొన్ని రోజుల పాటు జరుగుతుంది. తాజాగా, జరిగిన కేరళ ఎన్నికల్లో యూడీఎఫ్ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. దీంతో ఇప్పుడు కాంగ్రెస్‌తో పాటు ప్రజల ముందున్న ప్రశ్న ‘ఎవరు ముఖ్యమంత్రి అవుతారు?’ అనేదే.. కేసీ వేణుగోపాల్ పేరు ఎందుకు బాగా వినిపిస్తోంది? ముఖ్యమంత్రి రేసులో ఇంకా ఎవరెవరు ఉండొచ్చు? కేరళలో ఓటింగ్ ముగిసింది.. అభ్యర్థుల భవితవ్యాలు ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అన్న అంచనాలు ఎగ్జిట్ పోల్స్ ద్వారా వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఇప్పుడు అందరి దృష్టి మే 4పై ఉంది. ఆ రోజు భారత ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపు చేసి కేరళతో పాటు మిగతా రాష్ట్రాల ఫలితాలను ప్రకటిస్తుంది.వేణుగోపాల్‌కే ముఖ్యమంత్రి పదవి? పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందా? హైకమాండ్ ఆయన వైపేగ్గు చూపుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తారిక్ అన్వర్ దీనిపై మాట్లాడుతూ... పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆసక్తి చూపితే ఆయన కేరళ తదుపరి ముఖ్యమంత్రి కావచ్చని చెప్పారు. కేరళలో యూడీఎఫ్ గెలుస్తుందని, ఇందులో ఎలాంటి సందేహమూ లేదని ధీమా వ్యక్తం చేశారు. అన్వర్ గతంలో కేరళలో పార్టీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. ఇప్పుడు ఆయన బిహార్‌లోని కటిహార్ నియోజకవర్గ ఎంపీ.హైకమాండ్ నిర్ణయమే కీలకంవేణుగోపాల్ పేరును సూచించినప్పటికీ.. చివరి నిర్ణయం పార్టీ హైకమాండ్ చేతుల్లోనే ఉంటుందని అన్వర్ చెప్పారు. హైకమాండ్ సరైన వ్యక్తిని ఎంపిక చేస్తుందని అన్నారు. ‘‘పార్టీ ఒక పరిశీలకుడిని నియమిస్తుంది. ఆయన పార్టీ శాసనసభ్యుల సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈచర్చల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారైతే, ఆ సమాచారం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి చేరుతుంది. చివరి నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుంది” అని ఆయన చెప్పారు.వేణుగోపాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ముఖ్యమంత్రి అవుతారా? అని అన్వర్‌ను అడిగితే, ఆసక్తి ఉంటే అవసరమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని చెప్పారు. “పార్టీ శాసనసభ్యులు హైకమాండ్‌కు తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఇస్తే అదే జరుగుతుంది” అని అన్నారు.సీఎం రేసులో ఇంకా ఎవరు?కేసీ వేణుగోపాల్ పార్టీ జాతీయ స్థాయిలో కీలక నాయకుడు. హైకమాండ్‌తో మంచి పరిచయాలు ఉన్నాయి. వేణుగోపాల్‌తో పాటు రమేశ్ రామకృష్ణన్ చెన్నితాల, వీడీ సతీశన్ కేరళ కాంగ్రెస్‌లో బలమున్న నాయకులు. రమేశ్ రామకృష్ణన్ చెన్నితాల మాజీ ప్రతిపక్ష నేత. పరిపాలనా అనుభవం, పార్టీ నిర్మాణంలో ప్రభావం ఉంది. వీడీ సతీశన్ కేరళలో ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు. యువతను ఆకర్షిస్తారు. అసెంబ్లీలో చురుకుగా ఉంటారు.ఎగ్జిట్ పోల్స్ అంచనాలుతాజా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తుంది. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ రెండో స్థానంలో ఉంటుంది. కేరళలో మొత్తం 140 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్క్ 71. యూడీఎఫ్ 70-90 సీట్లు, ఎల్డీఎఫ్ 49-65 సీట్లు గెలుస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.అయితే కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ఈ అంచనాలను కొట్టిపారేశారు. గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ తప్పు అయ్యాయని అన్నారు. ఎల్డీఎఫ్ మళ్లీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న జరిగాయి. ఫలితాలు మే 4న ప్రకటిస్తారు. -
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. రేపే పలు బూత్‌లలో రీపోలింగ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అతి పెద్ద జిల్లా దక్షిణ 24 పరగణాలకు చెందిన పలు బూత్‌లలో రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. కమలం గుర్తు కనిపించకుండా ఈవీఎంలకు ట్యాప్ అతికించారంటూ బీజేపీ ఫిర్యాదు చేసింది. దీంతో పాటు అవకతవకలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సౌత్ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్, మగ్రాహట్ పశ్చిమ్ నియోజకవర్గాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో శనివారం (మే 2, 2026) తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మగ్రాహట్ పశ్చిమ్‌లోని 11 పోలింగ్ కేంద్రాలు, డైమండ్ హార్బర్లోని 4 పోలింగ్ కేంద్రాల్లో తిరిగి పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ఉత్తర్వులో పేర్కొంది.142 మగ్రాహట్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం, 143 డైమండ్ హార్బర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 ఏప్రిల్ 2026న జరిగిన పోలింగ్‌కు సంబంధించి రిటర్నింగ్ అధికారులు,పరిశీలకుల నివేదికల ఆధారంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 58(2) ప్రకారం ఆ రోజు జరిగిన పోలింగ్ చెల్లదని కమిషన్ ప్రకటించింది.అందుకు అనుగుణంగా మే 2, 2026న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి ఉత్తర్వులో తెలిపారు. పోలింగ్ ప్రాంతంలో డప్పులు కొట్టి విస్తృతంగా ప్రచారం చేయాలని, అలాగే పోటీ అభ్యర్థులకు లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. -
కాఫీ-టీ కలుస్తాయా?.. తమిళనాడులో ఏం జరగనుంది?
అన్నాడీఎంకే(ఎన్డీయే కూటమి)- టీవీకే పొత్తు చర్చల వేళ.. బీజేపీ సీనియర్ నాయకుడు అన్నామలై గతంలో చేసిన వ్యాఖ్యలు.. మళ్ళీ చర్చనీయాంశంగా మారాయి. అన్నామలై.. విజయ్ పార్టీతో (TVK) పొత్తు అసాధ్యమని గతంలో స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. కాఫీ, టీ కలిసిపోవు.. మేము సిద్ధాంతపరంగా విరుద్ధమంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఎన్నికల ఫలితాలు హంగ్ అసెంబ్లీగా వస్తే, అన్నాడీఎంకే.. విజయ్ పార్టీతో పొత్తు గురించి ఆలోచించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.గతంలో ఓ వార్తా సంస్థతో జరిగిన ఇంటర్వ్యూలో ఒకవేళ అవసరమైతే విజయ్‌తో కలిసి పనిచేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంటుందా?" అని అడగ్గా.. అన్నామలై ఘాటుగా స్పందించారు. "కాఫీ, టీ ఒకదానితో ఒకటి కలవవని నేను చాలాసార్లు చెప్పానంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే, ఎడప్పాడి కె. పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే, విజయ్‌తో పొత్తు కోసం ప్రయత్నించవచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ (తమిళగ వెట్రి కళగం) ఘనవిజయం సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. కొన్ని సర్వేల ప్రకారం, టీవీకే 98 నుండి 120 స్థానాలను గెలుచుకుని.. అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని చెబుతున్నాయి.ఒక సర్వే టీవీకేకు సుమారు 35 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేసింది. ఇది అధికార డీఎంకేతో సమానంగా ఉందని.. అదే సమయంలో ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి 23 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేశారు. జేవీసీ (JVC) ఎగ్జిట్ పోల్ ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి స్పష్టమైన మెజారిటీని అంచనా వేయగా.. మెజారిటీ సర్వేలు మాత్రం పోరు హోరాహోరీగా ఉంటుందని సూచిస్తున్నాయి. వివిధ పోల్స్ సారాంశం ప్రకారం, డీఎంకే కూటమి 112 నుండి 129 స్థానాలను, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ 86 నుండి 103 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. తుది ఫలితాలు దగ్గరగా ఉంటే, టీవీకే 'కింగ్ మేకర్'గా మారే అవకాశముందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఒకవేళ బీజేపీ విముఖత చూపినా, అన్నామలై వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఏఐఏడీఎంకేపై ఈ పరిస్థితి తీవ్ర ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో జరిగాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. పాత ప్రత్యర్థులు, కొత్త శక్తులు తమ రాజకీయ వ్యూహాలను మార్చుకుంటారా? అన్నది ఆసక్తి కలిగిస్తోంది. -
బెంగాల్లో హైడ్రామా.. ముందుగానే దీదీ అలర్ట్!
ఢిల్లీ: పశ్చిమబెంగాల్లో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపణలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భవానీపురంలోని ఓ స్టాంగ్ రూమ్ వద్దకు చేరుకున్న సీఎం మమతా బెనర్జీ.. ఈవీఎంలను తారుమారు చేసే కుట్ర జరుగుతుందంటూ ఆరోపించారు.దాదాపు మూడు గంటల పాటు స్ట్రాంగ్ రూమ్ వద్దే ఉన్న మమతా.. ఈవీఎంలను తాకాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు. ఎన్నికల అధికారులు లేకుండా స్ట్రాంగ్ రూమ్‌లోకి వెళుతున్నారన్నారు. ‘‘మేము చట్టాని గౌరవిస్తున్నాము. నేను ఒక్క ఆదేశమిస్తే 10 వేల మంది కార్యకర్తలు వస్తారు’’ అంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు.రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మరో రెండు రోజులే సమయం ఉండగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గంటల తరబడి స్ట్రాంగ్‌రూమ్‌లోనే గడపడం, ఆమె పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టడం చర్చనీయాంశమైంది. రెండో, చివరి దశ పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే.. తమ పార్టీ ప్రతినిధుల సమక్షం లేకుండానే బ్యాలెట్ బాక్సులను తెరిచారని తృణమూల్ ఆరోపించింది. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలించేందుకు మమతా బెనర్జీ తన ఎన్నికల ఏజెంట్‌తో కలిసి కోల్‌కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్‌కు వెళ్లారు. అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపించారు.దాదాపు నాలుగు గంటల పాటు స్ట్రాంగ్‌రూమ్‌లో గడిపిన తర్వాత.. ఆమె రాత్రి 12:07 గంటలకు బయటకు వచ్చి తీవ్ర ఆరోపణలు చేశారు. "ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి అక్రమాలకు పాల్పడినా సహించేది లేదు. పారదర్శకత కోసం మీడియా కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించాను. ప్రజల ఓట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఫిర్యాదులు అందడంతోనే తాను అక్కడికి వచ్చానని మమతా బెనర్జీ అన్నారు.ఈ ఆరోపణలను ఎన్నికల కమిషన్ (EC) కొట్టివేసింది. అన్ని నిబంధనలను పాటిస్తూ స్ట్రాంగ్‌రూమ్‌లను సురక్షితంగా సీల్ చేశామని.. ఎటువంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేసింది. బీజేపీ సీనియర్ నేత తపస్ రాయ్ మాట్లాడుతూ ఓటమి భయంతోనే తృణమూల్.. అబద్ధపు ప్రచారాలు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని.. ఈ ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదన్నారు. -
226 స్థానాల్లో గెలుస్తాం
కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికల్లో తాము 226కు పైగా సీట్లలో విజయం సాధిస్తామని టీఎంసీ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. వివిధ సంస్థలు చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ వెనుక బీజేపీ హస్తముందని, వాటిని తాము విశ్వసించలేమని ఆమె తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో తమ కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కాషాయ పార్టీ ప్రయతి్నస్తోందని ఆరోపించారు. షేర్ మార్కెట్‌ను నిలకడగా ఉంచేందుకు బీజేపీ నేతలు చేసిన చిట్టచివరి ప్రయత్నం ఎగ్జిట్‌పోల్స్ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు గురువారం సీఎం మమత సోషల్‌మీడియాలో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. బీజేపీ కార్యాలయం నుంచి వచి్చన ఆదేశాల మేరకే టీవీ చానళ్లలో ఎన్నికల ఫలితాలపై ముందస్తు అంచనాలు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. బెంగాల్ అసెంబ్లీలోని 294 స్థానాల్లో బీజేపీ మెజారిటీ సాధించనుందంటూ బుధవారం వెలువడిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పడం తెల్సిందే. ‘బీజేపీ కార్యాలయం నుంచి 1.08 గంటలకు వచి్చన ఆదేశాల ప్రకారమే టీవీ చానళ్లు చూపించాయి. అదంతా ప్రసారమయ్యేలా వాళ్లకు డబ్బు అందింది. దీనిపై నా వద్ద కచి్చతమైన సమాచారముంది. తాము చెప్పినట్లే చూపించాలని బీజేపీ నేతలు చానళ్లపై ఒత్తిడి తెచ్చారు’అని మమత ఆరోపించారు. ‘226కు పైగా సీట్లను గెల్చుకుంటాం. 230 వరకు కూడా రావచ్చు. ప్రజల తిరుగులేని తీర్పు మాపక్షానే ఉంటుంది’ అని అన్నారు. -
ఈవీఎం స్ట్రాంగ్ రూంల వద్ద టీఎంసీ ధర్నా
కోల్‌కతా: ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూంల వద్ద అప్రమత్తంగా ఉండాలంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఆ పార్టీ అభ్యర్థులు కునాల్ ఘోష్, శశి పంజా గురువారం ధర్నాకు దిగారు. ఖుదీరాం అనుశీలన్ కేంద్రలోని స్ట్రాంగ్‌రూంలో అవకతవకలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఇక్కడ బుధవారం రెండో విడత పోలింగ్ ముగియడం తెల్సిందే. ‘స్ట్రాంగ్ రూం వద్ద బైటాయించిన తమను అధికారులు మధ్యాహ్నం అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. సాయంత్రం 4 గంటలకు స్ట్రాంగ్‌రూంలను తిరిగి తెరుస్తామంటూ ఆ తర్వాత మాకు సమాచారమిచ్చారు’అని కునాల్ ఘోష్ తెలిపారు. ‘దీంతో, మా కార్యకర్తలంతా వెళ్లిపోయారు. మళ్లీ తెరుస్తామని సమాచారమివ్వడంతో హడావుడిగా తిరిగి వచ్చేశాం. ఇప్పుడేమో మమ్మల్ని రానివ్వడం లేదు. బీజేపీ నేతలకు మాత్రం అనుమతిచ్చారు’అని ఆయన ఆరోపించారు. ‘బ్యాలెట్ పేపర్లను లోపలకు తీసుకెళ్లారు. లైవ్‌లో ఇదంతా కనిపిస్తూనే ఉంది. అయిన్పటికీ, ఏమీ జరగడం లేదని సీఈవో అంటున్నారు’అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. భవానీపూర్ స్ట్రాంగ్‌రూంలో మమత తన నియోజకవర్గం(భవానీపూర్) ఈవీఎంలను భద్రపరచిన షకావత్ స్కూల్ వద్దకు సీఎం మమత సాయంత్రానికల్లా చేరుకు న్నారు. అవకతవకలు జరిగే ఆస్కారముందన్న అనుమానంతో తన ఎన్నికల ఏజెంట్‌తోపాటు స్ట్రాంగ్‌రూంలోకి వెళ్లి అక్కడే కూర్చున్నారు. -
బెంగాల్ కిరీటం బీజేపీదే!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో రాజకీయ మార్పు నకు ప్రజలు పట్టం కట్టబోతున్నారని ‘టుడేస్ చాణక్య’ఎగ్జిట్‌పోల్ స్పష్టంచేసింది. బెంగాల్ అధికార కిరీటం ఈసారి బీజేపీకి దక్కడం ఖాయమని అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 294 ఉండగా మెజార్టీ మార్కు 147 స్థానాలు. బీజేపీ 192కిపైగా స్థానాలు గెల్చుకొని స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నట్లు స్పష్టంచేసింది. చాణక్య ఎగ్జిట్‌పోల్ ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 100 సీట్లు గెల్చుకొనేందుకు ఆస్కారం ఉన్నట్లు తేలింది. ఇతరులు కేవలం 2 స్థానాలకే పరిమితం అవుతారని చాణక్య తెలియజేసింది. ఈ ఫలితాలు వాస్తవ రూపం దాలిస్తే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అది అతిపెద్ద మార్పు అవుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. 15 ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యానికి తెరపడినట్లేనని అంటున్నారు. బీజేపీకి అనుకూలంగా ప్రజల మద్దతు బలంగా ఏకీకృతం అవుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది ఓటర్ల ప్రాధాన్యతలో నిర్ణయాత్మక మార్పును తెలియజేస్తోంది. బెంగాల్లో ఇప్పటికే మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. మరికొన్ని ఎగ్జిట్‌పోల్స్ తృణమూల్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపించాయి. మమతా బెనర్జీ పార్టీ వరుసగా నాలుగోసారి అధికారంలోకి రాబోతున్నట్లు వివరించాయి. మొత్తానికి ఈ ఎన్నికల్లో రెండు కీలకమైన పార్టీల మధ్య హోరాహోరీ పోరాటం సాగుతుందని పేర్కొన్నాయి. 2021 ఎన్నికల్లోనూ ఇలాంటి పరిణామాన్నే అంచనా వేసినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్‌కు విజయం దక్కింది. ఆ పార్టీ 215 సీట్లు గెల్చుకుంది. బీజేపీ 77 స్థానాలు మాత్రమే దక్కించుకొని ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. తమిళనాట రెండో స్థానంలో విజయ్ పార్టీ తమిళనాడులో దళపతి విజయ్ నిర్ణయాత్మక శక్తిగా అవతరించబోతున్నట్టు టుడేస్ చాణక్య స్పష్టంచేసింది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) ఈ ఎన్నికల్లో 30 శాతం ఓట్లతో దాదాపు 63 సీట్లు సాధించబోతున్నట్లు తెలియజేసింది. అధికార డీఎంకేకు 125 స్థానాలు, విపక్ష అన్నాడీఎంకేకు కేవలం 45 స్థానాలు దక్కే వీలున్నట్లు వివరించింది. విజయ్ పార్టీ రెండో స్థానంలో నిలవబోతున్నట్లు తెలిపింది. సామాజికవర్గాల పరంగా చూస్తే బీసీల్లో 29 శాతం మంది, అత్యంత వెనుకబడిన వర్గాల్లో 27 శాతం మంది, ఎస్సీలు, క్రైస్తవుల్లో 34 శాతం మంది విజయ్ పార్టీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. ముస్లింలు మాత్రం అధికార డీఎంకేకు మద్దతు పలికినట్లు స్పష్టమవుతోంది. యువతలో టీవీకేకు అమితాదరణ కనిపించింది. 30 ఏళ్లలోపు ఓటర్లు, ప్రధానంగా తొలిసారి ఓటు వేసినవారు, విద్యార్థులు నిరుద్యోగులు దళపతి పార్టీకి జైకొట్టారు. మరోవైపు మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ మళ్లీ డీఎంకే గెలుపు ఖాయమని తెలియజేశాయి. ‘యాక్సిస్ మై ఇండియా’మాత్రమే విజయ్ పార్టీ జయకేతనం ఎగురవేయబోతున్నట్లు తేల్చిచెప్పింది. కేరళలో యూడీఎఫ్‌కు విజయావకాశాలు కేరళలో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ మధ్యగట్టి పోటీ నెలకొన్నట్లు టుడేస్ చాణక్య ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు విజయావకాశాలు ఉన్నట్లు తెలిపింది. 140 సీట్లకు గాను యూడీఎఫ్‌కు దాదాపు 69 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. అస్సాంలో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని వెల్లడించింది. 126 సీట్లకు గాను బీజేపీ 50 శాతం ఓట్లతో ఏకంగా 102 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. బెంగాల్ ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించని ‘యాక్సిస్ మై ఇండియా’ పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్‌ను ‘యాక్సిస్ మై ఇండియా’ప్రకటించలేదు. బుధవారం ఇతర రాష్ట్రాల ఫలితాలను ప్రకటించినప్పటికీ బెంగాల్ విషయం ప్రస్తావించలేదు. గురువారం ప్రకటిస్తారని భావించగా.. అది సాధ్యం కాలేదు. బెంగాల్లో భయానక వాతావరణం నెలకొందని, ఇతరులతో మాట్లాడేందుకు ప్రజలు ఇష్టపడడం లేదని, శాంపిల్ సేకరించే పరిస్థితి కూడా లేదని ‘యాక్సిస్ మై ఇండియా’అధినేత ప్రదీప్ గుప్తా చెప్పారు. అసంపూర్ణమైన సమాచారంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించలేమని నిస్సహాయత వ్యక్తంచేశారు. -
‘క్యూఆర్’ గుర్తింపు కార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పారదర్శకతకు, భద్రతకు పెద్దపీట వేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ పలు కీలక చర్యలు చేపట్టింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనధికార వ్యక్తుల ప్రవేశానికి అడ్డుకట్ట వేసేందుకు క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో గుర్తింపు కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన మాడ్యూల్‌ను ఈసీఐనెట్ వేదికగా ప్రవేశపెట్టినట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. మే 4వ తేదీన అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలతో పాటు, 5 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్‌లోనూ ఈ విధానాన్ని తొలిసారిగా అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద గుర్తింపు కార్డుల వెరిఫికేషన్ కోసం ఈసీ ప్రత్యేకంగా మూడంచెల భద్రతా యంత్రాంగాన్ని ఖరారు చేసింది. మొదటి రెండంచెల్లో రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ) జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులను భద్రతా సిబ్బంది మాన్యువల్‌గా తనిఖీ చేస్తారు. మూడో అంచె, కౌంటింగ్ హాల్‌కు అతి సమీపంలో ఉండే ఈ కీలకమైన పాయింట్ వద్ద క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తారు. సాఫ్ట్వేర్ ద్వారా వెరిఫికేషన్ సక్సెస్ అయ్యాకే సంబంధిత వ్యక్తిని లోపలికి అనుమతిస్తారు. ఎన్నికల సంఘం అనుమతి పొందిన అన్ని విభాగాల వారికి అంటే.. రిటర్నింగ్ అధికారులు (ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్వో), కౌంటింగ్ సిబ్బంది, టెక్నికల్ టీమ్, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు ఈ కొత్త క్యూఆర్ కోడ్ కార్డులు తప్పనిసరి. కౌంటింగ్ కేంద్రాల వద్ద మీడియా సెంటర్ జర్నలిస్టుల కోసం కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా ‘మీడియా సెంటర్’ఏర్పాటు చేయనున్నారు. మీడియా ప్రతినిధుల ప్రవేశం మాత్రం ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారమే, ఈసీ జారీ చేసే అథారిటీ లెటర్ల ఆధారంగా కొనసాగుతుంది. కొత్త వ్యవస్థను పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులను ఈసీ ఆదేశించింది. భవిష్యత్తులో జరగబోయే అన్ని లోక్‌సభ, అసెంబ్లీ సాధారణ, ఉప ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని అనుసరించనున్నట్లు స్పష్టం చేసింది. ఏడాది కాలంగా చేపట్టిన 30కి పైగా సంస్కరణల్లో భాగంగానే క్యూఆర్ కోడ్ ఐడీ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. -
అర్ధరాత్రి హైడ్రామా.. మమతా బెనర్జీ సైతం ఎంట్రీ ఇచ్చి..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని భవానీపూర్ నియోజక వర్గానికి సంబంధించిన స్ట్రాంగ్‌రూమ్‌కు చేరుకున్నారు. ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌లో బ్యాలెట్ బాక్సులు తెరిచారని ఆమె ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు మమతా బెనర్జీ వచ్చారు. దక్షిణ కోల్‌కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్‌కు వచ్చారు. ఇది భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రం. అక్కడ ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎంల స్ట్రాంగ్‌రూమ్ ఉంది. ఆ కౌంటింగ్ కేంద్రాన్ని మమతా బెనర్జీ పరిశీలించి, అర్ధరాత్రి దాటాక మీడియాతో మాట్లాడారు. “అభ్యర్థి లేదా ఒక ఏజెంట్ మాత్రమే పై అంతస్తులో ఉండవచ్చు. మీడియా కోసం సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయాలని కూడా నేను సూచించాను. పారదర్శకతను కొనసాగించాలి. ఫిర్యాదులు రావడంతో నేను వెంటనే ఇక్కడికి వచ్చాను. కేంద్ర బలగాలు మొదట నన్ను లోపలికి అనుమతించలేదు. లెక్కింపు ప్రక్రియలో జోక్యం చేసుకుంటే మేము సహించం. ఇక్కడ ఈవీఎంల కోసం స్ట్రాంగ్‌రూమ్ ఉంది. చాలా చోట్ల మానిప్యులేషన్ జరుగుతోందని మేము గమనించాము. ఎన్నికల నియమాల ప్రకారం పార్టీ అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్‌కు సీల్ చేసిన గది వరకు వెళ్లే అనుమతి ఉంటుంది. మా ఏజెంట్‌ను అరెస్ట్ చేశారు. ఏకపక్ష వైఖరి కనిపిస్తోంది. తప్పుడు చర్యలకు పాల్పడితే ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడతాం” అని తెలిపారు.నేతాజీ ఇండోర్ స్టేడియంలోనూ అంతే.. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్ బయట కూడా అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. సంబంధిత పార్టీ ప్రతినిధులు లేకుండా బ్యాలెట్ బాక్సులను తెరుస్తున్నారని ఆరోపించారు. ఈ స్ట్రాంగ్‌రూమ్‌లో పలు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను ఉంచారు.బెంగాల్ మంత్రి శశి పాంజా, తృణమూల్ ప్రతినిధి కునాల్ ఘోష్ ఈవీఎంల భద్రతపై అనుమానం వచ్చి స్వయంగా అక్కడికి వచ్చి నిరసన చేపట్టారు. వారిద్దరు నేతాజీ ఇండోర్ స్టేడియం బయట ధర్నా ప్రారంభించారని తృణమూల్ ఓ ప్రకటనలో తెలిపింది.మరోవైపు, తృణమూల్ ఆరోపణలను బీజేపీ నేత తాపస్ రాయ్ పూర్తిగా ఖండించారు. “ఇవి అన్నీ తృణమూల్ ఇప్పుడు భయ వాతావరణాన్ని సృష్టించేందుకు వ్యాపింపజేస్తున్న వదంతులు. వాళ్లే భయపడుతున్నారు. నేనూ స్ట్రాంగ్‌రూమ్ పరిశీలించేందుకు వచ్చాను. తృణమూల్ అబద్ధాలు చెబుతోంది” అన్నారు. #WATCH | West Bengal Elections 2026 | Chief Minister Mamata Banerjee arrives at the Bhabanipur strong room in Kolkata. pic.twitter.com/29buaqzUCy— ANI (@ANI) April 30, 2026 -
టీవీకే విజయ్ కీలక సూచనలు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వచ్చే నెల 4వ తేదీన జరుగనున్న కౌంటింగ్‌కు సంబంధించి టీవీకే అధినేత విజయ్.. పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. ఆ రోజు జరిగే కౌంటింగ్‌కు సంబంధించి అభ్యర్థులు, ఏజెంట్లు ఉదయం ఆరుగంటల కల్లా ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలన్నారు. అలాగే ఒకసారి లోపలికి వెళ్లిన ఏజెంట్ కడవరకూ అక్కడే ఉండాలని, అత్యంత జాగ్రత్తగా కౌంటింగ్ పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఏమాత్రం ఏమరపాటుకు గురైనా అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, అందుకుని అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రధానంగా అభ్యర్థులు గెలిచిన తర్వాత తన వద్దకు నేరుగా రావాలన్నారు. గెలిచిన అభ్యర్థుల కోసం తాను నిరీక్షిస్తూ ఉంటానని, మధ్యలో ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ పార్టీ ఆఫీస్‌కే రావాలన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపులో కీలకమైన ఫారమ్ 17C(పోలింగ్ కేంద్రాల వారీగా నమోదైన ఓట్ల సంఖ్య, లెక్కింపులో చూపిన ఓట్లతో సరిపోతుందా లేదా అనే విషయాన్ని ధృవీకరించే పత్రం)ని అభ్యర్థులు కచ్చితంగా సరిపోల్చుకోవాలన్నారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ఉండి మభ్య పెట్టడానికి యత్నించే వారికి చెక్ పెట్టాలన్నారు. -
టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్.. బెంగాల్ వారిదే.. తమిళనాడులో..?
ఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థ టుడేస్ చాణుక్య విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ 192 సీట్లను కైవసం చేసుకుంటుందని, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి ఓటమి ఖాయమని పేర్కొంది.ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, బీజేపీకి 48 శాతం ఓటు షేర్‌తో 192 సీట్లు, టీఎంసీకి 38 శాతం ఓటు షేర్‌తో 100 సీట్లు, ఇతరులకు 14 శాతం ఓటు షేర్‌తో 2 సీట్లు లభిస్తాయని అంచనా వేసింది.అదే సమయంలో తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వస్తుందని టుడేస్ చాణుక్య అంచనా వేసింది. 234 అసెంబ్లీ స్థానాల్లో డీఎంకే 39 శాతం ఓటు షేర్‌తో 125 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. విజయ్ పార్టీ 30 శాతం ఓటు షేర్‌తో 63 స్థానాలు సాధిస్తుందని, మరో 10 స్థానాల్లో ఎడ్జ్‌లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే-బీజేపీ అలయన్స్ నిరాశ చెందుతుందని, 27 శాతం ఓటు షేర్‌తో 45 స్థానాలు మాత్రమే దక్కుతాయని సర్వేలో తేల్చింది. -
బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయని ‘యాక్సిస్ మై ఇండియా’
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసిన అనంతరం వివిధ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడించాయి. అయితే, ప్రముఖ సంస్థ యాక్సిస్ మై ఇండియా (Axis My India) మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేయబోమని ప్రకటించింది. బెంగాల్ ఎగ్జిట్ పోల్స్‌ను ఎందుకు విడుదల చేయలేదో చెప్పింది యాక్సిస్ మై ఇండియా.ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రదీప్ గుప్తా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. దాదాపు 60-70 శాతం మంది ఓటర్లు సర్వేలో తమ అభిప్రాయాన్ని చెప్పడానికి నిరాకరించారు. ప్రజలు తమ మనసులో ఏముందో వెల్లడించడానికి ఇష్టపడకపోవడంతో మౌనమే ప్రధాన అవరోధంగా మారిందంటూ చెప్పుకొచ్చారు. ఎందుకో బెంగాల్ ఓటర్లు మాత్రం గుంబనంగా ఉన్నారని తెలిపారు. కేవలం 20-30 శాతం మంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫలితాలను అంచనా వేయడం శాస్త్రీయంగా సరైనది కాదని.. అది సరైన ఫలితాన్ని ప్రతిబింబించదని సంస్థ భావించిందని ఆయన పేర్కొన్నారు.పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌పై బీజేపీ స్పల్ప ఆధిక్యత సాధిస్తుందని మాట్రిజ్, పి–మార్క్ ఫలితాలు తెలియజేశాయి. టీఎంసీకి 125–140 స్థానాలు వస్తాయని, బీజేపీకి 146–161 స్థానాలు లభిస్తాయని మాట్రిజ్ వెల్లడించింది. పి–మార్క్ అంచనా ప్రకారం బీజేపీకి 150–174 సీట్లు, టీఎంసీకి 118–138 సీట్లు లభిస్తాయి. బీజేపీకి 142–171, టీఎంసీకి 99–127 సీట్లు లభించేందుకు ఆస్కారం ఉన్నట్లు ‘పోల్ డైరీ’ఎగ్జిట్ పోల్ తేల్చింది.తృణమూల్ కాంగ్రెస్ తన సంక్షేమ పథకాలు మరియు సంస్థాగత బలంతో బీజేపీ సవాల్‌ను తట్టుకుంటుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. మరికొన్ని సర్వేలు బీజేపీ భారీ విజయంతో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అంచనా వేస్తున్నాయి. లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ కూటమి ఈసారి కూడా ఒక అంకె (సింగిల్ డిజిట్) స్థానాలకే పరిమితం కావచ్చని మెజారిటీ పోల్స్ అభిప్రాయపడ్డాయి. యాక్సిస్ మై ఇండియా వంటి అనుభవజ్ఞులైన సంస్థ కూడా అంచనా వేయలేకపోయిందంటే.. బెంగాల్ ఓటరు తీర్పు ఎంత ఉత్కంఠభరితంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. -
బెంగాల్ పీఠంపై సస్పెన్స్.. ‘హంగ్’ వస్తే ఎవరికి ఛాన్స్?
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసింది. మే 4న వెలువడనున్న ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొనడంతో, అక్కడ ‘హంగ్ అసెంబ్లీ’ ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని మెజారిటీ సర్వేలు అంచనా వేస్తున్నాయి. అసలు ఈ హంగ్ అసెంబ్లీ అంటే ఏమిటి? మెజారిటీ రాకపోతే బెంగాల్ రాజకీయాల్లో జరగబోయేది ఏమిటి?హోరాహోరీ పోరు: ఎగ్జిట్ పోల్స్ అంచనాలుఅస్సాం, పుదుచ్చేరిలలో బీజేపీ, తమిళనాడులో డీఎంకే, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అయితే, అందరి దృష్టీ పశ్చిమ బెంగాల్ పైనే పడింది. ఇక్కడ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి స్వల్ప ఆధిక్యం వస్తుందని అంచనా వేస్తుండగా, రెండు పార్టీల మధ్య నరాలు తెగే ఉత్కంఠ పోరు సాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తీవ్రమైన పోటీ కారణంగా, పశ్చిమ బెంగాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితి తలెత్తవచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.హంగ్ అసెంబ్లీ అంటే ఏమిటి?ఏదైనా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి లేదా ఎన్నికల ముందు ఏర్పడిన కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్పష్టమైన మెజారిటీ రాకపోవడాన్ని ‘హంగ్ అసెంబ్లీ’ అంటారు. నిబంధనల ప్రకారం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మొత్తం సీట్లలో సగానికంటే కనీసం ఒక్క సీటు అయినా అదనంగా (సింపుల్ మెజారిటీ) గెలుపొందాలి. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ సాధించి అధికార పీఠం దక్కించుకోవాలంటే ఏ పార్టీ అయినా కనీసం 148 సీట్లు కైవసం చేసుకోవాల్సి ఉంటుంది.ఎవరికీ మెజారిటీ రాకపోతే ఏమవుతుంది?హంగ్ అసెంబ్లీ ఏర్పడిన పక్షంలో రాష్ట్ర గవర్నర్ పాత్ర అత్యంత కీలకంగా మారుతుంది. అత్యధిక స్థానాలు గెలుపొందిన అతిపెద్ద పార్టీని లేదా కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించి, అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి 10 రోజుల గడువు ఇస్తారు. ఒకవేళ ఆ పార్టీ మెజారిటీ నిరూపించుకోలేకపోతే, అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. అయితే, గడువులోపే చిన్న పార్టీల మద్దతు కూడగట్టడం, పోస్ట్-పోల్ (ఎన్నికల అనంతర) పొత్తులు పెట్టుకోవడం వంటి వ్యూహాలకు పార్టీలు పదును పెడతాయి. బయటి మద్దతుతో ఏర్పడే ఇలాంటి మైనారిటీ ప్రభుత్వాలు చాలా అస్థిరంగా ఉంటాయి. అవి ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానం ద్వారా కూలిపోయే ప్రమాదం ఉంటుంది.ఇది కూడా చదవండి: Bihar: ఎన్‌కౌంటర్‌తో సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ -
బెంగాల్ రాజకీయాల్లో ‘అభిషేక్’ శకం షురూ!
రాజకీయాల్లో వారసత్వం సాధారణమే.. అయితే ఈ జాబితాలోని వారు సొంతంగా తమదైన ముద్రను దక్కించుకోవడం అనేది అంత ఈజీగా జరగదు. అయితే పశ్చిమ బెంగాల్లో దీనికి భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. ప్రస్తుత 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని వాడవాడలా అభిషేక్ బెనర్జీ పేరు మారుమోగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లునిగా రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ, కేవలం ఆ గుర్తింపునకే పరిమితం కాకుండా, పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదిగారు అభిషేక్ బెనర్జీ. మేనత్త నీడ నుంచి బయటపడి, బీజేపీకి దీటైన సవాల్ విసురుతూ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సేనాధిపతిగా మారిన అభిషేక్ ప్రయాణం అత్యంత ఆసక్తికరం.నెత్తురోడిన అత్తను చూసిన రెండేళ్ల చిన్నారిఅది 1990వ సంవత్సరం. సీపీఎం కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడి, తలకు కట్టుతో మంచంపై ఉన్న మమతా బెనర్జీని చూసి ఆ రెండేళ్ల బాలుడు చలించిపోయాడు. తన అత్తపై ఎందుకు దాడి జరిగిందని ఇంట్లో నినాదాలు చేస్తూ, అప్పటి నుంచే రాజకీయ పరిణతిని కనబరిచాడు. దశాబ్దాల తర్వాత అదే ఫోటోను ఓ సభలో మమత స్వయంగా అతనికి బహుకరించారు. ఆనాటి ఆ చిన్నారే నేటి తృణమూల్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ అభిషేక్ బెనర్జీ.23 ఏళ్లకే యూత్ ఐకాన్‌గా ఎంట్రీపశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ల వామపక్షాల కోటను బద్దలు కొట్టి, తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2011 సంవత్సరంలోనే అభిషేక్ రాజకీయ అరంగేట్రం జరిగింది. కేవలం 23 ఏళ్ల వయసులో ఆల్ ఇండియా తృణమూల్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. పాత తరం నేతల భావోద్వేగ, పోరాట పద్ధతులకు భిన్నంగా.. అట్టడుగు స్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని పటిష్టంగా తీర్చిదిద్దడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు.రికార్డు మెజారిటీలతో తిరుగులేని సత్తా2014లో లోక్‌సభ బరిలోకి దిగిన అభిషేక్, తన 26వ ఏట డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి గెలిచి, 16వ లోక్‌సభలో అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీగా చరిత్ర సృష్టించారు. ఆ ఎన్నికల్లో 71,000 ఓట్ల మెజారిటీ సాధించిన ఆయన, ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. 2019లో బీజేపీ హవాలోనూ తన మెజారిటీని 3.2 లక్షలకు పెంచుకున్నారు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా ఏడు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు.పార్టీ పగ్గాలు.. ఈడీ, సీబీఐ సవాళ్లుఅంచెలంచెలుగా ఎదిగిన అభిషేక్ ప్రభావం 2021 నాటికి పార్టీలో పూర్తిగా స్థిరపడింది. ఆయన తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. బెంగాల్లో దూసుకువస్తున్న బీజేపీని అడ్డుకోవడంలో, పార్టీ జాతీయ ఆశయాలకు ప్రధాన ముఖచిత్రంగా మారారు. అయితే దశాబ్ద కాలంపైగా సాగిన ఆయన రాజకీయ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. బొగ్గు కుంభకోణం, ఉపాధ్యాయ నియామకాల స్కామ్ వంటి అవినీతి ఆరోపణలతో ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థల (సీబీఐ, ఈడీ) విచారణలను సైతం ధైర్యంగా ఎదుర్కోవాల్సి వచ్చింది.ఓల్డ్ వర్సెస్ న్యూ.. సరికొత్త వ్యూహంగత కొంతకాలంగా తృణమూల్ కాంగ్రెస్‌లో సీనియర్లకు, అభిషేక్ నేతృత్వంలోని యువ నాయకత్వానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోందనే వార్తలు వచ్చాయి. కానీ, 2026 ఎన్నికల్లో ఈ విభేదాలన్నీ సమసిపోయినట్లు కనిపించింది. ఇప్పుడు పార్టీలో పక్కా వ్యూహం అమలవుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా కేంద్రంగా పరిపాలనను పర్యవేక్షిస్తూ, ఉత్తర బెంగాల్‌పై దృష్టి పెడితే.. అభిషేక్ గ్రామీణ ప్రాంతాల్లో, ప్రత్యేకించి దక్షిణ బెంగాల్లో పార్టీ ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు.2026 ఎన్నికలు.. అసలైన అగ్నిపరీక్షఅభిషేక్ బెనర్జీకి 2026 ఎన్నికలు అత్యంత కీలకం. ఇవి పార్టీలో తన స్థానాన్ని, నాయకత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఎదురైన అగ్నిపరీక్షలాంటివి. డేటా ఆధారిత, యువతను ఆకర్షించే సరికొత్త వ్యూహాలతో, కచ్చితమైన బూత్ స్థాయి మేనేజ్మెంట్తో ఆయన ముందుకు వెళ్లారు. తృణమూల్ కాంగ్రెస్‌ను కేవలం ఒక ప్రాంతీయ పార్టీగానే కాకుండా, బీజేపీ సంస్థాగత బలాన్ని దీటుగా ఢీకొట్టగల శక్తిగా మలచే ప్రయత్నం చేశారు. ఈ ఎన్నికలు అభిషేక్ బెనర్జీకి తనను తాను అత్యున్నత నేతగా నిరూపించుకునేందుకు దక్కిన అతిపెద్ద అవకాశంగా మారాయి.ఇది కూడా చదవండి: కేజ్రీవాల్ బాటలో దుర్గేష్.. న్యాయమూర్తికి షాకింగ్ లేఖ -
రెండో దశలోనూ రికార్డ్ స్థాయిలో
కోల్‌కతా: బీజేపీ, టీఎంసీ ముఖ్యనేతల హోరాహోరీ ప్రచారపర్వం తర్వాత బుధవారం పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బుధవారం రాత్రి 7.45 గంటలకు అందిన సమాచారం మేరకు రెండో దఫాలో రికార్డ్ స్థాయిలో 92.48 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సమయం ముగిసేనాటికి క్యూ వరసల్లో నిల్చున్న వాళ్లకు సైతం ఓటేసే అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్ శాతం పెరిగే వీలుంది. తొలి దశలో 93.19 శాతం పోలింగ్ నమోదైన విషయం తెల్సిందే. మొదటి, రెండో దశ పోలింగ్ శాతాలను కలుపుకుంటే సగటును 92.84 శాతం పోలింగ్ నమోదైంది. ఇది రాష్ట్రచరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతమని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో 2011లో 84.72 శాతం పోలింగ్ నమోదైంది. బుధవారం రెండో దశలో 142 స్థానాలకుగాను బుధవారం 40వేలకుపైగా పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు బారులు తీరి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూర్బ బర్ధమాన్ జిల్లాలో అత్యధికంగా 93.78 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో 88.59 శాతం పోలింగ్ నమోదైంది. భవానీపూర్ నుంచి పోటీచేస్తున్న 71 ఏళ్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఉదయం నియోజకవర్గంలోని చక్రబేరియా ప్రాంతంలోని 70వ నంబర్ వార్డ్‌లో పోలింగ్‌కేంద్రంలో ఓటేసి బయటికొచ్చి కూర్చున్నారు. అదే సమయానికి మమతపై పోటీకి దిగిన బీజేపీ రాష్ట్ర ముఖ్యనేత సువేంధు అధికారి అక్కడికి వచ్చారు. కానీ ఇద్దరి మధ్యా ఎలాంటి సంభాషణ జరగలేదు. ఈమెకు ఒక్కరు కూడా ఓటేయబోరు అని సువేంధు వ్యాఖ్యానించారు. పానీహటిలో బీజేపీ మహిళా అభ్యర్థి, ఆర్జీకర్ బోధనాస్పత్రిలో హత్యోదంతంలో బాధిత వైద్యురాలి తల్లి రత్నా దేభ్నాథ్ కారును టీఎంసీ కార్యకర్తలు అడ్డుకుని నిరసనతెలిపారు. బసంతిలో తమ కారును టీఎంసీ గూండాలు అడ్డుకుని డ్రైవర్‌ను కొట్టారని బీజేపీ అభ్యర్థి బికాశ్ సర్దార్ ఆరోపించారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద సీఆర్పీఎఫ్జవాన్లు గూండాల్లా ప్రవర్తిస్తూ మహిళా ఓటర్ల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని టీఎంసీ ఆరోపించింది. హౌరాలోని సథాఛియాలో నాలుగేళ్ల పిల్లాడిని, ఆమె తల్లిని క్యూవరసలో సరిగా నిల్చోలేదని సీఆర్పీఎఫ్ జవాన్లు విచక్షణారహితంగా కొట్టారని టీఎంసీ ఆరోపించింది. -
విజయ్.. మరో ఎంజీఆర్!
చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో తమిళనాడు దశాబ్దాలుగా ద్విముఖ పోరుగా మారిన రాజకీయ చదరంగంలో విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చి అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోందని యాక్సిస్ మై ఇండియా సంచలన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. బ్లాక్‌బస్టర్ సినిమాలతో సినీప్రియులను ఉర్రూతలూగించిన హీరో విజయ్ ఇకపై ముఖ్యమంత్రిగా తమిళనాడు పౌరులనూ పాలించబోతున్నారని బుధవారం ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడైంది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ తాజా ఎన్నికల్లో ఏకంగా 98 నుంచి 120 స్థానాల్లో గెలిచే వీలుందని ఎగ్జిట్‌పోల్ పేర్కొంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీ సులభంగా సాధారణ మెజారిటీని సాధిస్తుందని యాక్సిస్ మై ఇండియా ఛైర్పర్సన్ ప్రదీప్ గుప్తా చెప్పారు. ఎన్నికల తర్వాత తమిళనాడులో ఎంజీఆర్‌లా, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌లా విజయ్ సినీరంగం నుంచి వచ్చి నేరుగా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోబోతున్నారని ఎగ్జిట్ పోల్ అంచనావేసింది. అరంగేట్రం అదిరేలా.. స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే పార్టీ సాధారణ మెజార్టీ కంటే తక్కువగా 92 నుంచి 110 స్థానాలకు పరిమితంకావొచ్చు. ఎన్డీఏ కూటమి 22 నుంచి 32 సీట్లు సాధించొచ్చు. టీవీకే మాత్రం విజయదుందుభి మోగించే వీలుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం...ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీ 35 శాతం ఓట్లు సాధించనుంది. టీవీకే సైతం 35 శాతం ఓట్లు సాధించనుంది. అయితే సీట్లపరంగా చూస్తే డీఎంకే కంటే టీవీకే ఎక్కువ సీట్లను గెల్చుకోనుంది. అన్నాడీఎంకే 23 శాతం ఓట్లు సాధించి 22 నుంచి 32 చోట్ల గెలిచే ఆస్కారముంది. యువ ఓటర్ల ఓట్లే కీలకం.. ఎగ్జిట్ పోల్ గణాంకాల ప్రకారం చూస్తే టీవీకే పార్టీకి యువత మద్దతు ఎక్కువగా ఉంది. → 18–19 ఏళ్ల వయసులో తొలిసారిగాఓటేసిన యువ ఓటర్లలో 68 శాతం మంది టీవీకే పార్టీకే ఓటేశామని చెప్పారు → 20–29 ఏళ్ల వయసు వారిలో 59 శాతం మంది విజయ్‌కే తమ మద్దతు అని వెల్లడించారు → 30–39 ఏళ్ల వయసు వారిలో 45 శాతం మంది టీవీకే పార్టీకే ఓటేశామని తెలిపారు → విద్యార్థులు, నిరుద్యోగులు, పట్టణ ఓటర్లలో ఏ పార్టీకి ఇంతటి మద్దతులేకపోవడం విశేషం మార్పు... అసలైన మంత్రం పాలనలో మార్పును కోరుకుంటూ ఓటేశామని 35 శాతం మంది ఓటర్లు తెలిపారు. మరీ ముఖ్యంగా డీఎంకే, అన్నాడీఎంకే విధానాలతో విసిగిపోయి మార్పు కోసమే విజయ్ వైపునకు మళ్లామని 77 శాతం మంది ఆయన మద్దతుదారులు తెలిపారు. కేవలం విజయ్ హుందాతనం, ఛరిష్మాను చూసి ఓటేశామని మరికొందరు చెప్పారు. కొత్తతరహా రాజకీయం, ప్రభుత్వ వ్యతిరేకత సైతం విజయ్‌కి కలిసిరావొచ్చని ఎగ్జిట్ పోల్ పేర్కొంది. కులాలు, మతాలకతీతంగా.. కులాలు, మతాలకతీతంగా రాష్ట్రవ్యాప్తంగా విజయ్‌కు ఓట్లేశారని ఎగ్జిట్ పోల్ అంచనావేసింది. ఓబీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, గ్రామీణ,పట్టణ ప్రాంత ఓటర్లు అందరూ టీవీకేకు పట్టం కట్టబోతున్నారని ఎగ్జిట్‌పోల్ విశ్లేషించింది. ఉపకులాల వారీగా చూసినా ఇతర పార్టీలతో పోలిస్తే విజయ్‌కు మద్దతు ఎక్కువగా కన్పించింది. ప్రచారకాలంలో పట్టణ ప్రాంతాల్లో మాత్రమే విజయ్‌కు హవా ఉన్నట్లు ప్రచారసభలకు వచ్చిన జనాలను బట్టి తెలుస్తోంది. తీరా పోలింగ్ సమయం సమీపించేనాటికి టీవీకే పట్ల అభిమానం అంతకంతకూ పల్లెలకూపాకిందని ఎగ్జిట్‌పోల్ తెలిపింది. ముఖ్యమంత్రిగానూ.. రాష్ట్రంలో తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండొచ్చనే ప్రశ్నకు ఓటర్లు విజయ్ పేరే ఎక్కువగా చెప్పారు. విజయ్ సీఎం కావొచ్చని 37 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి సీఎం కావొచ్చని 35 శాతం మంది అంచనావేశారు. తొలి ఎన్నికల్లోనే ప్రస్తుత సీఎంకు గట్టిపోటీ ఇచ్చేస్థాయికి విజయ్‌కు ప్రజాదరణ దక్కడం విశేషమని యాక్సిస్ మై ఇండియా ఛైర్పర్సన్ ప్రదీప్ గుప్తా చెప్పారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో తేలిందేంటంటే.. → ద్విముఖ పోరుగా ఉన్న తమిళనాడు ఎన్నికల్లో హఠాత్తుగా టీవీకే వచ్చి కీలకశక్తిగా మారుతోంది→ డీఎంకేకు క్షేత్రస్థాయిలో ఇప్పటికీ గట్టిపట్టున్నా ఆ పునాదులను టీవీకే పెకళించే అవకాశాలు మెండుగా ఉన్నాయి→ జయలలిత మరణం, పన్నీర్‌సెల్వం, పళనిస్వామి మధ్య విభేదాలు, పన్నీర్‌సెల్వం ని్రష్కమణ, అంతర్గత విభేదాలతో అన్నాడీఎంకే ప్రభ కోల్పోయింది→ విజయ్ పార్టీ శాశ్వతంగా రాష్ట్రరాజకీయాల్లో కీలకభూమిక పోషించే అవకాశం → తాజా ఎగ్జిట్‌పోల్ అంచనాలు నిజమైతే టీవీకే పార్టీ తమిళనాట కీలకరాజకీయ శక్తిగా ఎదుగుతుంది. భవిష్యత్తు ఎన్నికల్లోనూ కింగ్‌మేకర్‌గా మారొచ్చు. -
ఐదింటిలో మేమే గెలుస్తాం!
వారణాసి/లక్నో: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించబోతోందని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. వచ్చే నెల 4న వెలువడే ఫలితాలు వికసిత్ భారత్ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయని, దేశ పురోగతి వేగానికి నూతన శక్తిని ఇస్తాయని అన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేయడం తథ్యమని స్పష్టంచేశారు. ప్రధాని బుధవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించి హర్డోయిలో జరిగిన సభలో ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్లో ప్రజలు ఈసారి నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని, గత ఏడు దశాబ్దాల్లో ఇది కనీసం కలలో కూడా ఊహించని పరిణామం అని చెప్పారు. ప్రజాస్వామ్య వేడుకలో నేడు ఒక ముఖ్యమైన రోజు అని ఉద్ఘాటించారు. పశ్చిమ బెంగాల్ ప్రజలకు కృతజ్ఞతలు బెంగాల్లో మొదటి దశ పోలింగ్‌లో జరిగినట్లుగానే రెండో దశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరుగుతోందని మోదీ తెలిపారు. పోలింగ్ బూత్‌ల ముందు ఓటర్లు బారులు తీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయని చెప్పారు. తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలనే ప్రజల ఉత్సాహాన్ని ఈ ఓటింగ్ ప్రతిబింబిస్తోందని స్పష్టంచేశారు. బెంగాల్లో ఈసారి భయానికి తావులేని వాతావరణంలో ప్రజలు ఓటు వేస్తున్నారని పేర్కొన్నారు. ఇది దేశ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య బలోపేతానికి ఒక శక్తివంతమైన చిహ్నమని వ్యాఖ్యానించారు. హక్కుల పట్ల అవగాహన కలిగి, పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్న పశ్చిమ బెంగాల్ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే చరిత్రాత్మక, నిర్ణయాత్మక విజయం సాధించిందని మోదీ గుర్తుచేశారు. తాజాగా గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అద్భుత విజయం సొంతం చేసుకుందని తెలిపారు. దాదాపు 85 శాతం మున్సిపాల్టీలు, పంచాయతీలు బీజేపీకే దక్కాయన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అఖండ విజయం తథ్యమని పునరుద్ఘాటించారు. విపక్ష సమాజ్‌వాదీ పార్టీపై మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలకు ఆ పార్టీ వ్యతిరేకమని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్ ప్రజలను దూషించే డీఎంకే వంటి పార్టీలతో చేతులు కలిపిందని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు వ్యతిరేకంగా సమాజ్‌వాదీ పార్టీ ఓటు వేసిందని ఆక్షేపించారు. గంగా ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభం ఉత్తరప్రదేశ్‌లో 594 కిలోమీటర్ల గంగా ఎక్స్‌ప్రెస్ రహదారిని ప్రదాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఆ ఆరు వరుసల అత్యాధునిక రహదారి మీరట్, ప్రయాగ్‌రాజ్‌లను అనుసంధానిస్తుంది. ఈ హైస్పీడ్ కారిడార్ ఉత్తరప్రదేశ్ అంతటా అనుసంధానాన్ని గణనీయంగా పెంచుతుందని, పారిశ్రామిక పెట్టుబడులు, లాజిస్టిక్స్, వ్యవసాయ మార్కెటింగ్, ప్రాంతీయ సమతుల్యతకు ఊతం ఇస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) మోడల్ కింద గంగా ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. ఇందులో 3.2 కిలోమీటర్ల ఎయిర్‌స్ట్రిప్ కూడా ఉంది. వాయుసేన విమానాలు అత్యవసర సమయాల్లో దిగేందుకు దీనిని నిర్మించారు.వారణాసిలో మోదీ రోడ్ షో ప్రధాని మోదీ బుధవారం ఉదయం తన సొంత నియోజకవర్గం వారణాసిలో భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు స్వాగతం పలికారు. అలాగే కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని మోదీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రాలు పఠించారు. మోదీకి స్థానిక నాయకులు త్రిశూలం, ఢమరుకం, సంప్రదాయ కండువా బహూకరించారు. బాబా విశ్వనాథ్ ఆలయంలో పూజలు చేయడం, శివ లింగాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశ పౌరుల సుఖ సంతోషాల కోసం విశ్వనాథుడిని ప్రార్థించానని తెలిపారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ వద్ద చిన్నారులతో మోదీ సంభాషించారు.


