fixing scam
-
భారత సంతతి క్రికెటర్‌పై 14 ఏళ్ల నిషేధం
భారత సంతతికి చెందిన యూఏఈ క్రికెటర్ మెహర్ చాయ్కర్పై ఐసీసీ 14 ఏళ్ల నిషేధం విధించింది. ఫిక్సింగ్ ఆరోపణలతో పాటు అవినీతికి పాల్పడడం.. వీటితో పాటు ఐసీసీ నియమావళికి చెందిన ఏడు నిబంధనలు, కెనడా క్రికెట్ ఆంక్షలను ఉల్లఘించినందుకు గానూ మెహర్ చాయ్‌కర్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడకుండా నిషేధం విధిస్తున్నట్లు ఐసీసీ బుధవారం పేర్కొంది. విషయంలోకి వెళితే.. 2018లో జింబాబ్వే, యూఏఈల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌తో పాటు అదే ఏడాది కెనడాలో జరిగిన గ్లోబల్ టి20 టోర్నీల్లో మెహర్ చాయ్‌కర్ బుకీలను సంప్రదించి ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐసీసీ యాంటీ కరప్షన్ ట్రిబ్యునల్ మెహర్ చాయ్కర్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టింది. తమ విచారణలో మెహర్ చాయ్‌కర్ ఫిక్సింగ్‌కు పాల్పడింది నిజమేనని.. దీంతో పాటు క్రికెట్లో పలు నిబంధనలను గాలికొదిలేసినట్లు మా దృష్టికి వచ్చిందని యాంటీ ట్రిబ్యునల్ తెలిపింది. మెహర్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో అతనిపై 14 సంవత్సరాలు నిషేధం విధించినట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. ఐసిసి జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ మాట్లాడుతూ.. "2018లో అజ్మాన్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లో మెమర్ చాయ్‌కర్ తొలిసారి అవినీతికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బుకీలతో సంప్రదింపులు జరిపి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడడం వంటివి చేశాడు. వీటిన్నింటిని పరిగణలోకి తీసుకొని అతనిపై 14 సంవత్సరాల నిషేధం విధించాం. క్రికెట్‌ను భ్రష్టు పట్టించడానికి ప్రయత్నించే ఆటగాళ్ల పట్ల కనికరం చూపించం. అవినీతికి పాల్పడేవారిపై ఇలాంటి కఠిన చర్యలే తీసుకుంటాం'' అని హెచ్చరించాడు. మెమర్ చాయకర్ ఉల్లఘించిన క్రికెట్ నిబంధనలు ఇవే.. ►ఆర్టికల్ 2.1.1 ప్రకారం ఏ విధంగానైనా కుట్రకు పాల్పడడం లేదా తప్పుగా ప్రభావితం చేయడం.. ఫిక్సింగ్‌కు పాల్పడడం ద్వారా ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో ఉద్దేశపూర్వకంగా తక్కువ ప్రదర్శన చేయడం ►ఆర్టికల్ 2.1.4 ప్రకారం.. ఒక ఆటగాడిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అభ్యర్థించడం, ప్రేరేపించడం, ప్రలోభపెట్టడం, సూచించడం, ఒప్పించడం ►ఆర్టికల్ 2.4.6 ప్రకారం విచారణకు సహకరించకుండా సమాధానాలు దాటవేయడం, తప్పును కప్పిపుచ్చుకోవడం ►ఆర్టికల్ 2.4.7 – ఏదైనా డాక్యుమెంటేషన్‌ను దాచిపెట్టడం, తారుమారు చేయడం లేదా నాశనం చేయడం.. దర్యాప్తును అడ్డుకోవడం లేదా ఆలస్యం చేయడం అయితే యూఏఈ క్రికెట్లో ఆటగాళ్లపై నిషేధం కొత్త కాదు. ఇప్పటికే నలుగురు యూఏఈ క్రికెటర్లు ఐసీసీ బ్యాన్‌ను ఎదుర్కొంటున్నారు. తొలిసారి మార్చి 2021లో యూఏఈ మాజీ కెప్టెన్ మహ్మద్ నవీన్‌తో పాటు బ్యాటర్ షైమన్ అన్వర్‌లపై ఐసీసీ ఎనిమిదేళ్ల నిషేధం ఉంది. ఆ తర్వాతి నెలలో మరో ఆటగాడు ఖదీర్ అహ్మద్‌పై ఐదు సంవత్సరాల నిషేధం.. గతేడాది సెప్టెంబర్‌లో ఐసీసీ నిబంధనలు ఉల్లఘించినందుకుగానూ యూఏఈ వికెట్ కీపర్ గులామ్ షబ్బీర్‌పై నాలుగేళ్ల నిషేధం పడింది. తాజాగా వీరి సరసన భారత సంతతికి చెందిన మెహర్ చాయ్‌కర్ వీరితో చేరాడు. చదవండి: ఫిట్నెస్ టెస్టులో క్లియరెన్స్.. ఆస్ట్రేలియాకు షమీ అంపైర్‌ను బూతులు తిట్టిన ఆరోన్ ఫించ్.. వీడియో వైరల్ -
షెకావత్ బుకీలను పరిచయం చేసేవాడు
కర్ణాటక, బనశంకరి: కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) క్రికెట్ పోటీల్లో బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ కేసును విచారణ తీవ్రతరం చేసిన బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం బళ్లారి టస్కర్స్ జట్టు కెప్టెన్‌తో మరో క్రికెటర్‌ను అరెస్ట్ చేశారు. బళ్లారి జట్టు కెప్టెన్ సీఎం గౌతం, క్రికెటర్ అబ్రార్ ఖాజీని అరెస్ట్ చేసి విచారణ తీవ్రతరం చేశామని జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్‌పాటిల్ తెలిపారు. రూ.20 లక్షలకు స్పాట్ ఫిక్సింగ్ సందీప్ తెలిపిన మేరకు... పోలీసులకు పట్టుబడిన ఇద్దరు క్రికెటర్లు 2019 కేపీఎల్ టోర్నీ హుబ్లీ, బళ్లారి జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. మ్యాచ్‌లో నిదానంగా బ్యాటింగ్ చేయడానికి వీరు బుకీలనుంచి రూ.20 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. బెంగళూరు జట్టుపై ఆడిన మరో మ్యాచ్‌లోనూ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. ఈ ఇద్దరు క్రికెటర్లు పలు జాతీయస్థాయి టోర్నీల్లో ఆడినవారే కావడం గమనార్హం. మ్యాచ్ ఫిక్సింగ్‌తో సంబంధమున్న మరికొందరిని కనిపెట్టి పూర్తి ఆధారాలతో త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. షెకావత్ అరెస్టుతో కదిలిన డొంక రెండురోజుల క్రితం మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగస్వామిగా ఉన్న బెంగళూరు బ్లాస్టర్ జట్టులో బ్యాట్స్‌మెన్ నిశాంత్ సింగ్ షెఖావత్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టగా అతడు ప్రముఖ బుకీలతో సంప్రదింపులు జరిపినట్లు వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన షెఖావత్ కేపీఎల్ మొదటి సీజన్ నుంచి హుబ్లీ, మంగళూరు, శివమొగ్గ జట్లతరఫున ఆడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరు బ్లాస్టర్స్ జట్టులో తరపున ఆడుతూ పరారీలో ఉన్న ప్రముఖ బుకీలైన సయ్యాం, జతిన్, చండీఘడ్ బుకీ మనోజ్ కుమార్‌తో షెఖావత్ నిత్యం సంప్రదించేవాడు. ఇప్పటికే పోలీసులకు పట్టుబడిన బెంగళూరు బ్లాస్టర్స్ జట్టు బౌలింగ్‌కోచ్ విను ప్రసాద్, బ్యాట్స్‌మెన్ విశ్వనాథన్‌లకు బుకీలను పరిచయం చేసింది షెకావతే. మైసూరులో 2018 ఆగస్టు 31 హుబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ మధ్య మైసూరు శ్రీకంఠ దత్త నరసింహరాజు ఒడయార్ మైదానంలో క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించారు. ఈ మ్యాచ్‌కు కొద్దిరోజులకు ముందు మైసూరులో ఓ హోటల్ బుకీ మనోజ్ ను నిశాంత్‌సింగ్ షెకావత్ సంప్రదించాడు. అనంతరం వినుప్రసాద్, విశ్వనాథన్‌ను పిలిపిం చి మాట్లాడారు. అప్పుడు డబ్బు చేతులు మారి ఉండవచ్చని అనుమానం ఉంది. షెకావత్‌కు అన్ని జట్లలో కోచ్‌లు, ఆటగాళ్లతో పరిచయం ఉంది. ఇతడు బుకీలను ఆటగాళ్లకు పరిచయం చేసి దందాను విస్తరించేవాడు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సందీప్‌పాటిల్ తెలిపారు. ఢిల్లీ బుకీలైన జతిన్, సయ్యాం అరెస్ట్ కోసం లుక్‌అవుట్‌నోటీస్ విడుదల చేశామన్నారు. వారిద్దరూ విదేశాల్లో తలదాచుకున్నట్లు తెలిసిందన్నారు. ఈ కేసులో బెళగావి ప్యాంథర్స్ జట్టు యజమాని అష్పాక్ అలీతార్‌ను అరెస్ట్ చేయగా అతనిచ్చిన సమాచారం ఆధారంగా కేసు విచారణ తీవ్రతరం చేశామన్నారు. బళ్లారి టస్కర్స్ జట్టులో డ్రమ్మర్ భవేశ్‌ను కూడా ఫిక్సింగ్ కేసులో అరెస్టు చేశారు. ♦ ఏమిటీ: కొన్నేళ్ల క్రితం ఐపీఎల్ తరహాలో అట్టహాసంగా ఆరంభమైన కర్ణాటక ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఫిక్సింగ్, బెట్టింగ్ దందా ♦ ఎలా, ఎవరు: ఓ జట్టు యజమాని, కొందరు ఆటగాళ్లు, పలు రాష్ట్రాలకు చెందిన బుకీలు కుమ్మక్కై మ్యాచ్ ఫలితాలను ముందే నిర్దేశించడం. ♦ ఇప్పటివరకు అరెస్టయింది: బెళగావి ప్యాంథర్స్ జట్టు యజమాని అష్పాక్ అలీతార్, బెంగళూరు బ్లాస్టర్స్ జట్టు బౌలింగ్‌కోచ్ విను ప్రసాద్, బ్యాట్స్‌మెన్ విశ్వనాథన్, మరోఆటగాడు షెకావత్, డ్రమ్మర్ భవేశ్. పరారీలో ఉన్న ఢిల్లీ బుకీలు సయ్యాం, జతిన్ ♦ ఎలా మొదలైంది: ఆటగాడు షెకావత్ బుకీలను ఆటగాళ్లకు పరిచయం చేసేవాడు. -
శ్రీనివాసన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టరాదు: సుప్రీం
న్యూఢిల్లీ : ఐపీఎల్ బెట్టింగ్, ఫిక్సింగ్ స్కామ్ విచారణ నేపథ్యంలో శ్రీనివాసన్ బోర్డు ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టరాదంటూ సుప్రీంకోర్టు సోమవారం స్టే ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎల్ కార్యకలాపాలకు దూరంగా వుంటేనే బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలను శ్రీనివాసన్ చేపట్ట వచ్చని సుప్రీం కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ స్కామ్‌పై విచారణకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి ముద్గల్ అధ్యక్షతన అడ్వకేట్ నాగేశ్వరరావు, నీలయ్ దత్తాలతో కూడిన త్రి సభ్య కమిటీని సుప్రీం కోర్టు నియమించింది.