Flavia Pennetta
-
ముంబై మాస్టర్స్ కు పెనెట్టా
నవంబరు-డిసెంబరులో చాంపియన్స్ టెన్నిస్ లీగ్-2 ముంబై : యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్ ఫ్లావియా పెనెట్టా భారత్‌కు రానుంది. ఈ ఏడాది చివర్లో ఆటకు వీడ్కోలు పలుకుతానని యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించిన అనంతరం వ్యాఖ్యానించిన ఈ ఇటలీ స్టార్... భారత్‌లో జరిగే చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో బరిలోకి దిగనుంది. భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్ ఆధ్వర్యంలో జరిగే సీటీఎల్-2లో ప్రపంచ ఏడో ర్యాంకర్ ఫ్లావియా పెనెట్టా ముంబై మాస్టర్స్ జట్టు తరఫున పాల్గొంటుంది. సీటీఎల్-2కు సంబంధించిన వివరాలను బుధవారం జరిగిన మీడియా సమావేశంలో విజయ్ అమృత్‌రాజ్ వెల్లడించారు. ►ఈ ఏడాది సీటీఎల్-2 నవంబరు 23 నుంచి డిసెంబరు 6 వరకు జరుగుతుంది. భారత్‌లోని ఆరు నగరాల్లో ఈ లీగ్‌ను నిర్వహిస్తారు. ►ముంబై, హైదరాబాద్, చండీగఢ్, రాయ్‌పూర్, నాగ్‌పూర్ ఫ్రాంచైజీలు ఖరారు కాగా... పది రోజుల్లోపు ఆరో ఫ్రాంచైజీగా పుణే, చెన్నై, బెంగళూరులలో ఒకటిని ఎంపిక చేస్తారు. ►విజేత జట్టుకు రూ. కోటి... రన్నరప్ జట్టుకు రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీ అందజేస్తారు. ►పురుషుల టెన్నిస్‌లో అత్యంత పొడగరి ఆటగాడు ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా-6 అడుగుల 11 అంగుళాలు) హైదరాబాద్ ఏసెస్ జట్టు తరఫున బరిలోకి దిగుతాడు. ఇటీవల యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండీ ముర్రే (బ్రిటన్)ను ఓడించిన దక్షిణాఫ్రికా ప్లేయర్ కెవిన్ అండర్సన్ రాయ్‌పూర్ జట్టుకు ఆడతాడు. ►స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్ హైదరాబాద్ ఏసెస్ జట్టులోనే కొనసాగనుంది. హింగిస్‌తోపాటు జెలెనా జంకోవిచ్ (సెర్బియా), అలీజా కార్నె (ఫ్రాన్స్), ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్), హీతెర్ వాట్సన్ (బ్రిటన్) కూడా సీటీఎల్-2లో ఆడనున్నారు. ►{పతి జట్టులో భారత సీనియర్ క్రీడాకారుడితోపాటు ఇద్దరు జూనియర్ ఆటగాళ్లు ఉంటారు. సీనియర్ ఆటగాళ్లు సాకేత్ మైనేని, జీవన్ నెదున్‌చెజియాన్, శ్రీరామ్ బాలాజీ, దివిజ్ శరణ్, రామ్‌కుమార్ రామనాథన్, విష్ణువర్ధన్ ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారు. ►{పతి పోటీలో ఐదు మ్యాచ్‌లు ఉంటాయి. లెజెండ్స్, ఏటీపీ ప్లేయర్, డబ్ల్యూటీఏ ప్లేయర్ సింగిల్స్ మ్యాచ్‌లు... పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తారు. క్రితంసారి ఒక్కో సెట్లో ఆరు గేమ్‌లు ఉండగా.. ఈసారి దానిని ఐదుకు కుదించారు. ఒకవేళ స్కోరు 4-4 వద్ద సమమైతే టైబ్రేక్‌ను నిర్వహిస్తారు. గతేడాది తొలి చాంపియన్స్ టెన్నిస్ లీగ్ టైటిల్‌ను పుణే మరాఠాస్ జట్టు సొంతం చేసుకోగా... ఢిల్లీ డ్రీమ్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. -
పెనెట్టాకే పట్టం
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్ ఫ్లావియా పెనెట్టా ఫైనల్లో రొబెర్టా విన్సీపై విజయం రూ. 21 కోట్ల 86 లక్షల ప్రైజ్‌మనీ సొంతం కెరీర్ ఆసాంతం ఎందరినో అందని ద్రాక్షలా ఊరించే గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తొలి అవకాశంలోనే సాధిస్తే ఆ అనుభూతి అనిర్వచనీయం. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ వచ్చిన ఇటలీ ప్లేయర్ ఫ్లావియా పెనెట్టా ఆఖరి మెట్టునూ సగర్వంగా దాటింది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. పెద్ద వయస్సులో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన 33 ఏళ్ల పెనెట్టా ఈ ఏడాది చివర్లో ఆటకు వీడ్కోలు పలుకుతానని ప్రకటించింది. న్యూయార్క్: అందివచ్చిన ఏకైక అవకాశాన్ని వృథా చేసుకోకుండా ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) అనుకున్న ఫలితాన్ని సాధించింది. గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరుకున్న తొలిసారే విజేతగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో 26వ సీడ్ పెనెట్టా 7-6 (7/4), 6-2తో అన్‌సీడెడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ)పై విజయం సాధించింది. చాంపియన్‌గా నిలిచిన పెనెట్టాకు 33 లక్షల డాలర్లు (రూ. 21 కోట్ల 86 లక్షలు), రన్నరప్ విన్సీకి 16 లక్షల డాలర్లు (రూ. 10 కోట్ల 59 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ► జూనియర్ స్థాయి నుంచి విన్సీతో కలిసి ఆడిన అనుభవం ఉన్న పెనెట్టా ఫైనల్లో నిలకడగా రాణించింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ అంతిమ సమరంలో తొలి సెట్లో ఇద్దరూ ఒక్కోసారి తమ సర్వీస్‌లను కోల్పోయారు. దాంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో పెనెట్టా పైచేయి సాధించింది. ఇక రెండో సెట్లో పెనెట్టా ఆరంభం నుంచే జోరు పెంచింది. రెండుసార్లు విన్సీ సర్వీస్‌ను బ్రేక్ చేసి 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత అదే జోరును కొనసాగించి విజయాన్ని దక్కించుకుంది. ► మ్యాచ్ మొత్తంలో పెనెట్టా నాలుగు ఏస్‌లు సంధించి, 28 విన్నర్స్ కొట్టింది. విన్సీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను రెండుసార్లు చేజార్చుకుంది. నెట్ వద్దకు 20 సార్లు దూసుకొచ్చి 16 సార్లు పాయింట్లు సంపాదించింది. ► సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా)ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించిన విన్సీ ఫైనల్లో మాత్రం అదే ఆటతీరును పునరావృతం చేయలేకపోయింది. తొలి సెట్లో గట్టిపోటీనిచ్చినా, రెండో సెట్కొచ్చేసరికి విన్సీ డీలా పడింది. ఒక్క ఏస్ కూడా సంధించలేకపోయిన ఆమె 30 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ► ఫ్రాన్సెస్కా షియవోని (2010 ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత ఇటలీ తరఫున మహిళల సింగిల్స్ విభాగంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన రెండో క్రీడాకారిణిగా పెనెట్టా నిలిచింది. ఫైనల్‌కు చేరిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కురాలిగా కూడా పెనెట్టా (33 ఏళ్లు) గుర్తింపు పొందింది. 29 ఏళ్లతో షియవోని పేరిట ఉన్న రికార్డు తెరమరుగైంది. ► ఓపెన్ శకంలో (1968 తర్వాత) ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫైనల్లో ఇటలీకి చెందిన ఇద్దరు క్రీడాకారిణులు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. ఫైనల్‌కు ప్రత్యక్షంగా వీక్షించేందుకు హాజరైన 23,771 మంది ప్రేక్షకుల్లో ఇటలీ ప్రధానమంత్రి మటెవో రెంజితో సహా పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ► తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గేందుకు అత్యధిక గ్రాండ్‌స్లామ్ టోర్నీలు (49) తీసుకున్న ప్లేయర్‌గా కూడా పెనెట్టా నిలిచింది. 47 గ్రాండ్‌స్లామ్ టోర్నీలతో మరియన్ బర్తోలీ (ఫ్రాన్స్-2013 వింబుల్డన్) పేరిట ఉన్న ఈ రికార్డును పెనెట్టా సవరించింది. ► ఓపెన్ శకంలో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతోన్న పెద్ద వయస్కులుగా పెనెట్టా, విన్సీ (ఇద్దరిది కలిపితే 66 ఏళ్ల 19 రోజులు) గుర్తిం పు పొందారు. దాంతో 63 ఏళ్ల 11 నెలలతో వర్జినియా వేడ్, బెట్టీ స్టవ్‌ల పేరిట (1977 వింబుల్డన్) ఉన్న రికార్డు తెరమరుగైంది. ► {పపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-25లో లేని క్రీడాకారిణి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గడం ఇది ఏడోసారి మాత్రమే. గతంలో వీనస్ విలియమ్స్ (ర్యాంక్ 31; 2007 వింబుల్డన్), బార్బరా (ర్యాంక్ 68; 1979 ఆస్ట్రేలియన్ ఓపెన్), సెరెనా (ర్యాంక్ 81; 2007 ఆస్ట్రేలియన్ ఓపెన్), క్రిస్ ఓనీల్ (ర్యాంక్ 111; 1978 ఆస్ట్రేలియన్ ఓపెన్), గూలాగాంగ్ (ర్యాంక్ లేదు; 1977 ఆస్ట్రేలియన్ ఓపెన్), క్లియ్‌స్టర్స్ (ర్యాంక్ లేదు; 2009 యూఎస్ ఓపెన్) ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం 26వ ర్యాంక్‌లో ఉన్న పెనెట్టా తాజా ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి ఎగబాకుతుంది. కల నిజం కావడమంటే ఇదేనేమో. జూనియర్ స్థాయిలో ఉన్నపుడు ఏనాటికైనా నంబర్‌వన్ కావాలని, కనీసం ఒకసారైనా గ్రాండ్‌స్లామ్ చాంపియన్ కావాలని కలలు కన్నాను. ఈరోజు అది నిజమైంది. ప్రస్తుతం నేనెంతో సంతోషంగా ఉన్నాను. యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగకముందే ఈ ఏడాది చివర్లో ఆట నుంచి వీడ్కోలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ ఏడాది మరో రెండు టోర్నీలు మాత్రమే ఆడతాను. విజయం సాధించాలంటే నిరంతరం పోరాడాలి. దానికి ఎంతో శక్తి కావాలి. ఒక్కోసారి నాలో ఆ శక్తి లేదనిపిస్తోంది. అందుకే ఈ ఏడాది చివర్లో రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. -పెనెట్టా సెరెనాను ఓడించాక 24 గంటలు నాలో ఎన్నో ఆలోచనలు కలిగాయి. కాస్త అలసిపోయాను కూడా. ఫైనల్లో ఓడిపోయినా ఆనందంగానే ఉన్నాను. సుదీర్ఘ కాలం నుంచి పరిచయమున్న క్రీడాకారిణితో ఆడటం సులువేంకాదు. పెనెట్టా విజేతగా నిలిచినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. -రొబెర్టా విన్సీ -
యూఎస్ ఓపెన్ క్వీన్ పెన్నెట్టా
-
ఆశ్చర్యంలో ముంచెత్తిన పెనెట్టా
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను ఇటలీ క్రీడాకారిణి ఫ్లానియా పెనెట్టా గెల్చుకుంది. తమ దేశానికే చెందిన రొబెర్ట్ విన్సీతో జరిగిన తుదిపోరులో వరుస సెట్లలో విజయం సాధించి విజేతగా నిలిచింది. 7-6, (7-4), 6-2 తేడాతో విన్సీని ఓడించింది. 26 సీడెడ్ పెనెట్టా మొదటి సెట్ లో కాస్త శ్రమించినా రెండో సెట్ ను సునాయంగా గెల్చుకుంది. గ్రాండ్ స్లామ్ లో ఇటలీ ప్లేయర్స్ సింగిల్స్ ఫైనల్స్ లో తలపడడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సెరెనా విలియమ్స్ ను ఓడించి సంచలనం సృష్టించిన 43వ సీడెడ్ విన్సీ 24 గంటలు గడవకముందే తమ దేశానికే చెందిన పెనెట్టా చేతిలో పరాజయం పాలైంది. 33 ఏళ్ల పెనెట్టా టైటిల్ గెలిచిన వెంటనే క్రీడాజీవితాన్ని వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తాను రిటైర్ కావడానికి ఇదే సరైన సమయమని తెలిపింది. ఘన విజయంతో టెన్నిస్ గుడ్ బై చెప్పాలనుకున్నట్టు వెల్లడించింది. -
యూఎస్ ఓపెన్‌లో పెన్నెట్టా సంచలన విజయం
-
ఒక రికార్డు మిస్సైంది.. మరో రికార్డు బ్రేక్ చేస్తుందా..!
యూఎస్ ఓపెన్ టోర్నీ ప్రారంభంలో ఈ రికార్డు గురించి ఎవ్వరూ ఆలోచించి ఉండరు. టెన్సిస్ ఓనమాలు తెలియని.. న్యూయార్కర్ల నుంచి క్రీడాపండితుల వరకూ అంతా సెరెనా.. క్యాలెండర్ స్లామ్ గురించే మాట్లాడారు. ఇటాలియన్ భామ రొబెర్ట్ విన్సీ ఓడి పోడంతో.. అమెరికన్ లు అంతా.. మహిళల సింగిల్స్ గురించి చర్చించుకోవడం మానేశారు. అయితే.. న్యూయార్క్ కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం జరిగే.. ఆల్ ఇటాలియన్ ఉమెన్స్ ఫైనల్ లో మరో రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో పెన్నెట్టా గెలిస్తే.. గ్రాండ్స్ స్లామ్ మహిళల ఛాంపియన్ షిప్ చరిత్రలో.. అత్యధిక ప్రయత్నాల తర్వాత టైటిల్ గెలిచిన రికార్డు సాధిస్తుంది. 49 గ్రాండ్ స్లామ్ టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న పెన్నెటా.. తొలిసారి ఒక గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్ కు చేరింది. గతంలో ఈ రికార్డు ఫ్రెంచ్ ప్లేయర్ మారియన్ బర్టోలీ(47) పేరిట ఉంది. కాగా.. మారియన్ కంటే.. పెన్నెటా రెండు టోర్నీ(49)లు అధికంగా తీసుకుంది. హెడ్ టు హెడ్ రికార్డులు కూడా పెన్నెటా కి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటి వరకూ తొమ్మిది సార్లు పెన్నెటా, విన్సీలు ముఖా ముఖి తలపడగా.. 5 సార్లు పెన్నెటా గెలుపొందింది. మరి యూఎస్ ఓపెన్ లో పెన్నెటా రికార్డు సృష్టిస్తుందో.. విన్సీ లెక్క సరిచేసి.. చరిత్ర సృష్టిస్తుందో మరికాసేపట్లో తేలనుంది.