FM Jaitley
-
రాజ్యసభ సభ్యులందరూ రాజీనామా చేయాలి
న్యూఢిల్లీ : జీఎస్టీ బిల్లుపై ఇవాళ లోక్‌సభలో కొనసాగుతున్న చర్చలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వీరప్ప మొయిలీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జీఎస్టీ బిల్లు అమలు ఆలస్యం కావడం వల్ల దేశం సుమారు రూ.12 లక్షల కోట్లు నష్టపోయినట్లు ఆరోపించారు. దీనివల్ల దేశ ప్రజలు నష్టపోతున్నారని ఆయన విమర్శించారు. ఆర్థికమంత్రి జైట్లీ ప్రసంగం ముగిసిన వెంటనే మాట్లాడిన వీరప్ప మొయిలీ ప్రభుత్వంపై దాడికి దిగారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి తీరని అవమానమన్నారు. ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఇది గేమ్ చేంజర్ కాదనీ, పిల్లదశ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. రాజ్యసభలో కంటే ముందే లోక్‌సభలో ప్రవేశపెట్టడంపై ఆయన మండిపడ్డారు. దీనికి రాజ్యసభపై ఏ మాత్రం గౌరవం ఉన్నా బీజీపీ సభ్యులు రాజీనామా చేయాలని వీరప్ప మొయిలీ డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ప్రభుత్వం తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగకరమైన బిల్లు గురించి చర్చించాలన్న ఉద్దేశంతోనే సభలో జీఎస్టీ చర్చకు అంగీకరించామన్నారు. జీఎస్టీ తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేసిందని, కానీ అనేక అవరోధాలు ఎదురయ్యాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జీఎస్టీ ఐడియాను బీజేపీ తస్కరించిందన్నారు. జీఎస్టీ బిల్లుపై చర్చ జరగడం అసాధారణమైన అంశమని మొయిలీ పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లు బీజేపీ తీసుకువచ్చిన సంస్కరణ కాదని, ఇంకా దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. కాగా లోక్‌సభలో జీఎస్టీ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. దీనిపై ఏఐడీఎంకే టీజీ వెంకటేష్‌బాబు తదితరులు మాట్లాడారు. -
జీఎస్టీ -మారథాన్ చర్చ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ)కు చెందిన నాలుగు బిల్లులపై లోక్ సభలో చర్చ మొదలైంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన దీనిపై బుదవారం ఏడు గంటల పాటు నిర్విరామంగా చర్చ జరగేందుకు నిర్ణయించారు. జిఎస్టి కౌన్సిల్ 12 సమావేశాలు, చర్చల అనంతరం కౌన్సిల్ సిఫార్సులను ఆధారంగా వీటిని సభకుపరిచయం చేస్తున్నట్టు చెప్పారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం లేకుండా చట్టాన్ని రూపొందిస్తున్నాం. జీఎస్టీతో వివిధ పన్నులు రద్దవుతాయి అని జైట్లీ అన్నారు.ఎన్నో ఏళ్లుగా దేశమంతా ఒకే పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా జైట్లీ అన్నారు. ఇదో విప్లవాత్మక బిల్ అని, అందరికీ లబ్ధి చేకూరుస్తుందని జైట్లీ చెప్పారు. ఒకే వస్తువుపై అనేకసార్లు పన్నులను నిరోధించడానికి వీలుగా ఏకీకృత పన్నులు తీసుకొచ్చే యోచనలో జీఎస్టీ బిల్లును రూపొందించినట్టు చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్లో రాష్ట్రాలు, కేంద్రం, కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని కలిపి 32 మంది ఉన్నారని, 12 సమావేశాలు జరిగాయని జైట్లీ తెలిపారు. చాలా వరకు ఏకగ్రీవం కోసమే కౌన్సిల్లో ప్రయత్నించామని చెప్పారు. ఎస్జీఎస్టీ .. సీజీఎస్టీకి ప్రతిబింబమని, ఇది రాష్ట్రాల్లో అమలు చేస్తారని జైట్లీ వెల్లడించారు. జూలై 1నుంచి జీఎస్టీ అమలుకు ప్రతిపాదిస్తోందని తెలిపారు. -
పెట్టుబడులకు ఆకాశమే హద్దు
బీజింగ్ : భారతదేశంలో పెట్టుబడులకు ఆకాశమే హద్దు అని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. చైనాలో ఐదు రోజుల పర్యటనలో ఉన్న జైట్లీ బీజింగ్ లో చైనీస్ ప్రభుత్వం నిర్వహించే సీసీటీవీతో మాట్లాడారు. ఆర్థికవృద్ధి పరంగా భారతదేశం నిలకడగా ఉందని.. మౌలిక సదుపాయాలు, పట్టణీకరణ, హౌసింగ్, విద్యుత్, నీరు మరియు సామాజిక రంగాల్లో పెట్టుబడులకు భారీ అవకాశాలున్నాయని పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ పుంచుకుంటోందని చెప్పగలననీ, ప్రయివేట్ రంగ పెట్టుబడులు దీనికి ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నాయని తెలిపారు. తమ దేశంలో పెట్టుబడులకు ఆకాశమే పరిమితి... ఆస్థాయిలో పెట్టుబడులు తమకు అవసరమని ఆర్థిక మంత్రి చెప్పారు. వర్షపాతమే కీలక అంశంగా ఉన్న తమ దేశంలో గత రెండేళ్లుగా సాధారణ వర్షపాత పరిస్థితులు నమోదవుతున్నా ..గణనీయమైన వృద్ధిని సాధించామని తెలిపారు. ఈ ఏడాది దేశంలో మంచి వర్షాలు కురిస్తే గ్రామీణ ఆర్థిక అభివృద్ధి, గ్రామీణ కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. గత సంవత్సరం 7.6 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. ఆశాజనక వర్షాలు కురిస్తే ఈ పరిస్థితిలో కచ్చితంగా మెరుగుదల ఉంటుందని జైట్లీ ఉద్ఘాటించారు. 6.9 శాతం వృద్ధి రేటుతో వున్న చైనాను గత ఏడాది భారతదేశం అధిగమించిందన్నారు. అధిక జనాభా కలిగి భారత ఆర్థికవ్యవస్థలో ఉద్యోగ వృద్ధి రేటుచాలా ముఖ్యమన్నారు. ప్రపంచ ఆర్థిక మాంద్యం ఆందోళనలపై మాట్లాడిన జైట్లీ ఎంతకాలం ఇది (గ్లోబల్ మాంద్యం) కొనసాగుతుందో.. ప్రపంచంలో ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడుతుందో, ప్రపంచంలో వృద్ధి తిరిగి ఎలా వస్తుందో చూడాలనీ. ఇదొక అనివార్యమైన పరిస్థితి అని చెప్పారు. చైనా మద్దతిస్తున్న ఆసియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (ఎఐఐబీ) గవర్నర్ల బోర్డు సమావేశఃలో కూడా జైట్లీ పాల్గొన్నారు.