ఆ ఇంటిని మడత పెట్టి..! ధర ఎంతంటే..
అమెజాన్‌లో అమ్ముడుపోతున్న ఓ ఇంటి గురించి ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. లాస్ ఏంజెల్స్‌లో ఎక్కువ అమ్ముడుపోతున్న ఆ ఇంటికి ఓ ప్రత్యేకత ఉంది. అది మడతపెట్టేదిగా ఉండడమే. దీని ధర 26 వేల డాలర్లు(మన కరెన్సీలో 21 లక్షల రూపాయలు)గా ఉంది. చిన్న కిచెన్, లివింగ్ ఏరియా, బెడ్ రూంతో పాటు టాయిలెట్ సౌకర్యం ఉంది ఈ ఇంట్లో. టిక్‌టాక్ ద్వారా అక్కడ ట్రెండ్‌లోకి రాగా.. అక్కడి నుంచి సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. అయితే ఈ ఇంటిపై ఇంటర్నెట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Someone bought a "foldable" house from Amazon 😳!!
How would the future of homes be if you could buy them today from Amazon? pic.twitter.com/PAQGrILPIQ
— Tom Valentino (@TomValentinoo) February 4, 2024
Y'all better go head and get yourselves a Amazon foldable house ‼️ pic.twitter.com/m4748K9xNy
— Mesh🇧🇧 (@rahsh33m) January 30, 2024