రాజోలు : స్థానిక ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచి ఏటీఎం నుంచి చిరిగిన వెయ్యి రూపాయల నోట్లు రావడంపై పలువురు ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజోలులో ఉపాధ్యాయుడు యెరుబండి ప్రసాద్ గురువారం రూ. 10 వేలు ఏటీఎం నుంచి తీసుకోగా వాటిలో తొమ్మిది నోట్లు నలిగిపోయి, మచ్చలతో ఉన్నాయి. దాంతో ఆయన బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే మరో ఇద్దరు ఖతాదారులకు పాడైపోయిన వెయ్యి రూపాయల నోట్లు వచ్చాయి. ఏటీఎంలో నగదును నింపేందుకు ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు ఇచ్చామని బ్యాంక్‌మేనేజరు రఘురామ్ తెలిపారు. ప్రస్తుతం నగదు కొరత కారణంగా చాలా చోట్ల ఏటీఎంలు మూసివేస్తున్నా, తాము ఏటీఎం సేవలు ఖాతాదారులకు అందిస్తున్నామన్నారు. ఏటీఎంలో చిరిగిన, మచ్చలు, పాడైపోయిన నోట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.