విలువలు పాటించిన వారినే ఎంపిక చేయాలి
ఆత్మకూరు(ఎం) : వత్తి ధర్మంలో విలువలు పాటించిన వారినే ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయాలని మాతసేవా సంస్థ అధ్యక్షుడు కందారపు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి గజరాజు కాశీనాథ్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. అంతేగాని ఉపాధ్యాయ వత్తిని చేపట్టి ఇటు విద్యాబోధన అటు పైరవీలు, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం నడుపుతూ సరిగ్గా బడికి రాని వారిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయవద్దని ఉన్నతాధికారులకు విన్నవించారు. ప్రకటన విడుదల చేసిన వారిలో సభ్యులు యాస గోవర్ధన్ రెడ్డి, కల్వల నరేష్, రంగ మల్లేశం, నికిల్, రాజు ఉన్నారు.