foreign terrorists
-
Iran explosions: రక్తమోడిన ర్యాలీ
దుబాయ్: అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ అత్యున్నత సైనిక జనరల్ సులేమానీ సంస్మరణ సభలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 188కి పైగా క్షతగాత్రులయ్యారు. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఇరాన్ ఖండిస్తున్న వేళ ఇరాన్‌పై దాడి ఖడ్గం ఝుళిపించింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. బుధవారం మధ్యాహ్నం మూడింటపుడు కెర్మాన్ నగరంలోని ఖాసిమ్ సులేమానీకి నివాళిగా ఆయన సమాధి దగ్గర నాలుగో సంస్మరణ ర్యాలీ జరుగుతుండగా సాహెబ్ అల్–జమాన్ మసీదు సమీపంలో రోడ్డుపై ఈ పేలుడు ఘటన జరిగింది. దారి పొడవునా వేలాది మంది సులేమానీ మద్దతుదారులతో ర్యాలీ కొనసాగుతుండగా సమాధికి 700 మీటర్లదూరంలో మొదటి పేలుడు సంభవించింది. గాయపడిన వారిని కాపాడేందుకు జనం, ఎమర్జెన్సీ విభాగ సభ్యులు భారీ సంఖ్యలో గుమికూడుతుండగా సమాధికి ఒక కిలోమీటర్ దూరంలో మరో భారీ పేలుడు సంభవించింది. దీంతో మృతుల సంఖ్య పెరిగింది. గాయపడి రక్తమోడుతున్న క్షతగాత్రులను వెంటనే హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారి ఆర్తనాదాలు, చెల్లాచెదురుగా పడిన మృతదేహాలతో ఘటనాస్థలి భీతావహంగా తయారైంది. ఇది ఉగ్రదాడేనని కెర్మాన్ నగర డెప్యూటీ గవర్నర్ రహ్మాన్ చెప్పారు. అయితే దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకూ ఎవరూ ప్రకటించుకోలేదు. ఎవరీ సులేమానీ? ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌లోని కీలక ఖుర్డ్స్ ఫోర్స్‌కు మేజర్ జనరల్ సులేమానీ నేతృత్వం వహిస్తుండేవారు. ఖుర్డ్స్ఫోర్స్ అనేది విదేశీ సైనిక వ్యవహారాల విభాగం. సైన్యం కోసం ఆయుధాలు, నిధుల సేకరణ, నిఘా, సరకుల రవాణా బాధ్యతలను ఈ దళమే చూసుకుంటుంది. ఇరాన్‌కు మద్దతు పలికే గాజా స్ట్రిప్‌లోని హమాస్ మిలిటెంట్ గ్రూప్‌కు, లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్‌కు, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకూ సాయపడుతుంది. దీనిని విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా గతంలో ప్రకటించింది. ఎందుకు చంపారు? 2020 జనవరిలో ఇరాక్‌లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంక్యూ9 రీపర్ డ్రోన్ సాయంతో అమెరికా సులేమానీని హతమార్చింది. ‘‘ 1998లో ఖుర్డ్స్ ఫోర్స్‌ను ఏర్పాటుచేసినప్పటి నుంచి ఇరాక్, సిరియాలో లక్షలాది మంది అమాయకుల మరణాలకు సులేమానీ కారకుడు. ప్రపంచ నంబర్‌వన్ ఉగ్రవాది అయినందుకే అతడిని అంతమొందించాం’ అని నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడి రోజున ప్రకటించారు. దీంతో ఆగ్రహంతో ఇరాన్ అప్పట్లో ప్రతీకార దాడులకు దిగడం తెల్సిందే. ఇరాన్ సైన్యాన్ని పటిష్టవంతం చేయడంలో సులేమానీది కీలక పాత్ర. అందుకే ఇరాన్ వ్యాప్తంగా సులేమానీకి అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. నేషనల్ ఐకాన్‌గా కీర్తింపబడ్డారు. 2011లో అరబ్ ఉద్యమం తర్వాత సిరియాలో బషర్ అస్సాద్ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడారు. కానీ ఈ ఘటనలో సిరియాలో అంతర్యుద్ధం రాజుకుని అది ఇప్పటికీ రగులుతూనే ఉంది. 2018లో ప్రపంచ ఆర్థిక శక్తులు కీలక ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలిగాక ఇరాన్ సైనిక నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు ట్రంప్ సర్కార్ ఇచి్చన ఆదేశాలతో సులేమానీపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో అప్పట్లో సంచలనమైంది. సులేమానీ హత్యేకాదు అంత్యక్రియల ఘటనా వార్తపత్రికల పతాకశీర్షికలకెక్కింది. 2020లో వేలాదిమంది పాల్గొన్న అంత్యక్రియల్లో తొక్కిసలాట జరిగి 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. -
చెరిగిపోని వారసత్వం
విదేశీ యాత్రికుడు ఫిలిప్ లాంకాస్టర్ జెరూసలేంను సందర్శిస్తూ ప్రార్థనా మందిరం తర్వాత అక్కడి ప్రాచీన దారులను, గోడలను వీక్షిస్తూ ముందుకు వెళుతున్నాడు. జాఫా గేట్ వద్ద సెయింట్ జార్జ్ స్ట్రీట్‌లో ఒక టాటూ షాప్ కనిపించింది. జెరూసలేం యాత్ర జీవితాంతం గుర్తుండిపోయేలా పచ్చబొట్టు వేయించుకోవాలనుకున్నాడు. రజౌక్ టాటూ షాప్ అని కనిపిస్తున్న ఆ దుకాణంలోకి వెళ్లి ఆ షాప్ నిర్వాహకుడితో తన చేతి మీద పచ్చబొట్టు వేయమని కోరాడు. మాటల్లో వారి విషయాలు తెలుసుకున్న ఫిలిప్ ఆశ్చర్యానందాలకు లోనయ్యాడు. రజౌక్ టాటూ షాప్ 1300వ సంవత్సరం నుండి అక్కడే ఉంది! 700 సంవత్సరాలుగా జెరూసలేం యాత్రికులు ఆ షాప్‌కి రావడానికి ముచ్చటపడుతూనే ఉన్నారు. ఆ విధంగా ప్రపంచంలోని అతి పురాతన టాటూ షాపులలో రజౌక్ షాప్ ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం 27వ తరానికి చెందిన వాసిమ్ రజౌక్ ఈ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. శతాబ్దాల క్రితం అతని పూర్వీకులు ఈజిప్ట్ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారట. నాటి సాధనాలు, పద్ధతులతో పచ్చబొట్టు వేసే వృత్తిని ఆ కుటుంబం చేపట్టింది. వాసిమ్ రజౌక్ ఉపయోగించే పచ్చబొట్టు ముద్రలు, నమూనాల ఎంపికకు సంబంధించినవన్నింటికీ వందల సంవత్సరాల వయసు ఉంది. వాసిమ్ బొట్టు వేయడానికి ఆధునాతనమైన, క్రిమిరహితం చేసిన పరికరాలనే ఉపయోగిస్తాడు. షాపులోని ఆలివ్ కలప నుండి చేతితో చెక్కబడిన గ్లాస్ డిస్ప్లే నమూనాలు చీకటిలో అద్భుతంగా మెరుస్తుంటాయి. మ్యూజియంలో ఉండే విలువైన పురాతన కళాఖండాలను పచ్చబొట్లుగా వాసిమ్ వేయడాన్ని వీక్షించాల్సిందే. ప్రాచీన జెరూసలేంలోని శిలువ నమూనాలు ఇప్పటికీ వాసిమ్ దగ్గర అత్యంత ప్రజాదరణ పొందిన డిజైన్లు. స్టెన్సిల్స్‌తో.. క్రీస్తు శిలువ నుండి పునరుత్థానం వరకు అన్ని వర్ణనలు ఈ పచ్చబొట్లలో ప్రతిఫలిస్తాయి. యాత్రికుడు ఒక స్టెన్సిల్‌ను ఎంచుకుంటాడు. వాసిమ్ దానిని ఒక ప్యాడ్‌లో వేసి, ఆ డిజైన్‌ను ఒంటిపైకి బదిలీ చేసి పచ్చబొట్టు పొడుస్తాడు. అతని పనితనం చాలా సునిశితంగా, సున్నితంగా ఉంటుంది. ‘‘జీవిత కాలం కొనసాగే స్మృతి చిహ్నం కోసం ఇలా రజౌక్ టాటూ షాప్‌లో ఒక రోజు గడపడం అంటే క్రైస్తవ ప్రపంచం కూడలి వద్ద కూర్చోవడంతో సమానంగా భావించవచ్చు’’ అని ఫిలిప్ లాంకాస్టర్ అంటారు. -
ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతం!
శ్రీనగర్: ఓవైపు ఆందోళనలు, మరో ఉగ్రవాదుల దాడులతో కశ్మీర్ అట్టుడుకుతూనే ఉంది. తాజాగా ఆదివారం కూడా ఉగ్రవాదులు చెలరేగిపోయారు. పూంచ్ ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎన్కౌంటర్లో ఓ పోలీసు అధికారి ప్రాణాలు విడిచాడు. మరోవైపు ఎల్వోసీకి సమీపంలో హంద్వారాలోని నౌగామ్ సెక్టర్లో విదేశీ ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు సరిహద్దుల మీదుగా చొరబడేందుకు ప్రయత్నించడంతో ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు నక్కి ఉన్నారా కనుగొనేందుకు భద్రతా దళాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇంకోవైపు కశ్మీర్ లోయలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పుల్వామాలో ఆందోళనకారులు చెలరేగిపోయారు. భద్రతా దళాలతో ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో 12మంది గాయపడ్డారు. -
ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతం!