Fossil fuel
-
ప్రపంచానికి సవాలుగా మారుతున్న ఖనిజ లోహాల కొరత
పర్యావరణ పరిరక్షణకు అవసరమైన పరిశోధనలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. కొత్త టెక్నాలజీల వినియోగం ద్వారా పరిశుభ్రమైన ఇంధనాలతో ప్రపంచంలో కాలుష్యాన్ని, వాతావరణ విధ్వంసాన్ని అదుపు చేయగలుగుతున్నాం. అయితే పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన ఖనిజ లోహాల కొరత ప్రపంచానికి పొంచి ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బయిన్లు, సోలార్ ప్యానెల్స్ తదితర నూతన సాధనాలకు కీలకమైన ఖనిజ లోహాలు తగినంత స్థాయిలో ఇక ముందు లభ్యం కాకపోవచ్చని తాజా సమాచారం చెబుతోంది.శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గాలంటే కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ప్రత్యామ్నాయాలకు రాగి, లిథియం లోహాలు అవసరం. రాగి విద్యుత్ ఉత్పత్తికి, లిథియం బ్యాటరీలు పనిచేయడానికి కీలకమనే విషయం తెలిసిందే. 2035 నాటికి ప్రపంచానికి అవసరమైన రాగి డిమాండును 70 శాతం, లిథియం డిమాండును 50 శాతం మేరకే తీర్చగలిగే పరిస్థితులున్నాయని పారిస్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) తన తాజా నివేదికలో హెచ్చరించింది. కిందటేడాది లిథియం, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్ ధరలు తగ్గడం మంచి పరిణామామమేగాని, దీంతో ఈ లోహాల ఉత్పత్తిలో నిమగ్నమైన రంగాల్లో పెట్టుబడులు తగ్గడం వల్ల భవిష్యత్తులో ఈ ఖనిజ లోహాల కొరత ప్రపంచదేశాల ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతీహ్ బిరోల్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ కార్లు వంటి నూతన సాంకేతిక సాధనాలకు ప్రపంచంలో డిమాండు విపరీతంగా పెరుగుతోంది. వాటి తయారీకి అత్యంత కీలకమైన ఖనిజ లోహాల సరఫరా తగినంత స్థాయిలో లేకపోతే ఈ డిమాండును తట్టుకోవడం కష్టమవుతుంది’ అని ఐఈఏ వివరించింది.2040 వరకు 80వేల కోట్ల డాలర్లుమైనింగ్ ప్రాజెక్టుల్లో 2040 వరకు ఇన్వెస్టర్లు 80వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడితేనే ప్రపంచంలో ఉష్ణోగ్రతలను పారిశ్రామిక యుగం మునుపటి స్థాయికి అంటే 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయడం సాధ్యమౌతుందని అంచనా. మైనింగ్ రంగంలో పెట్టుబడులు మందగిస్తే ఖనిజ లోహాల సరఫరా గణనీయంగా పడిపోతుందని ఐఈఏ హెచ్చరించింది. ప్రపంచంలో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపకరించే సాధనాల తయారీకి కీలకమైన గ్రాఫైట్ వినియోగం 2040 నాటికి నాలుగు రెట్లు పెరుగుతుందని అంచనా. పైన పేర్కొన్న కీలకమైన కొన్ని ఖనిజ లోహాల ధరలు కొవిడ్ ముందునాటి స్థాయిలకు పడిపోయాయి. బ్యాటరీల తయారీకి అవసరమైన లోహాల ధరలు బాగా తగ్గిపోయాయి. అయినా భవిష్యత్తులో వాటి కొరత తప్పదని నిపుణులు భావిస్తున్నారు.ఇండియాలో బ్యాటరీల తయారీకి అవసరమైన లిథియం నిక్షేపాలు పెద్ద మొత్తాల్లో ఉన్నట్టు గతేడాది కనుగొన్నారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించడానికి, ప్రపంచ ఉష్ణోగ్రతలను అదుపు చేయడానికి అవసరమైన ఖనిజ లోహాల ఉత్పత్తి కేవలం కొన్ని దేశాకే పరిమితం కావడం మంచిది కాదు. దానివల్ల వాటి సరఫరా సాఫీగా సాగదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కీలక స్థానానికి చేరిన ఇండియా వంటి పెద్ద దేశాల్లో ఈ ఖనిజ లోహాల లభ్యత, విస్తృత స్థాయిలో ఉత్పత్తి ఎంతో అవసరమని అంతర్జాతీయ ఇంధన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.- విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
రూ.లక్ష కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్
సాక్షి, విశాఖపట్నం : తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏపీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులను ఎన్టీపీసీ ప్రారంభించేలా చర్యలు తీసుకుంది. సుమారు రూ.లక్ష కోట్లతో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు తొలి విడత పనులను 2026కు, మొత్తం 2030నాటికి పూర్తి చేసే దిశగా ఎన్టీపీసీ ప్రణాళికలు సిద్ధంచేసింది. 1,200 ఎకరాల్లో ఏర్పాటు... రాబోయే 20 ఏళ్లలో పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి సంప్రదాయ ఇంధన వనరులను క్రమంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఏపీ సిద్ధమవుతోంది. ఈ స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకురావడం ద్వారా భూతాపం, కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఇందులో భాగంగా దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ అయిన ఎన్టీపీసీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. హైడ్రోజన్, ఎనర్జీ స్టోరేజ్ పరిష్కృత ప్రాజెక్టు ఏర్పాటుపై జరిగిన ఒప్పందంలో భాగంగా పూడిమడక వద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు తొలి విడత పనులను ఇటీవల ఎన్టీపీసీ ప్రారంభించింది. తొలి విడతలో 1,500 టన్నుల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ హబ్‌లో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా సంబంధిత ఎక్వీప్మెంట్ ఉత్పత్తి, ఎగుమతులకు అవసరమైన మాన్యుఫ్యాక్చరింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏపీఐఐసీ 1,200 ఎకరాలను ఎన్టీపీసీకి కేటాయించింది. ఈ భూమిని చదును చేసే ప్రక్రియ మొదలైంది. మొదటి విడత ప్రాజెక్టు ప్రక్రియ పనులకు అవసరమైన మేర స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు ఎన్టీపీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 9,000 ఎండబ్ల్యూహెచ్ స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్లు వారంలో ఖరారు ఇప్పటికే ఏపీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు ఫేజ్–1 పనులు ప్రారంభించిన ఎన్టీపీసీ... 9,000 మెగావాట్‌హవర్ (ఎండబ్ల్యూహెచ్) స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్లని ఈ వారంలో ఖరారు చేయనుంది. మొదటి విడత పనులను 2026 నాటికి పూర్తి చేయనుంది. సుమారు రూ.లక్ష కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొత్తం పనులను 2030నాటికి పూర్తి చేసి దేశానికి అంకితమిచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎన్టీపీసీ డైరెక్టర్(ఫైనాన్స్) శ్రీనివాసన్ తెలిపారు. ప్రీ ఇంజినీరింగ్ బిల్డింగ్స్, షెడ్లను నిర్మించి వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్పత్తి పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. సోలార్ రూఫ్‌టాప్‌లు, ఎలక్ట్రోలైజర్స్, ఫ్యూయల్ సెల్స్, బ్యాటరీలు, సోలార్ వేపర్స్, సోలార్ మాడ్యూల్స్, విండ్ టర్బైన్ ఎక్విప్మెంట్, కార్బన్ క్యాప్చర్ సిస్టమ్స్ తదితర కొత్త టెక్నాలజీకి సంబంధించిన ఉత్పత్తులు ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లో తయారు కానున్నాయి. దక్షిణాసియా దేశాల మార్కెట్ కోసం రోజుకు 1,300 టన్నుల గ్రీన్ అమ్మోనియా, 1,200 టన్నుల గ్రీన్ ఇథనాల్ సహా గ్రీన్ హైడ్రోజన్, ఇతర ఉత్పత్తులు ఎగుమతి చేసే విధంగా ప్రాజెక్టును డిజైన్ చేశారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు ద్వారా 2030 నాటికి 13.4 గిగావాట్ల సోలార్, 20 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం, నిల్వ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్లు ఎన్టీపీసీ ప్రకటించింది. -
Cop27: ఉత్తమాటల ఊరేగింపు
ఆచరణలో ఆశించిన పురోగతి లేనప్పుడు మాటల ఆర్భాటాల వల్ల ఉపయోగం ఏముంటుంది! ఈజిప్టులోని రేవుపట్నమైన షర్మ్ ఎల్–షేక్‌లో ఐక్యరాజ్య సమితి (ఐరాస) సారథ్యంలోని ‘పర్యా వరణ సమస్యలపై భాగస్వామ్య పక్షాల 27వ సదస్సు’ (యుఎన్–కాప్–27) ఆదివారం ముగిశాక అదే భావన కలుగుతోంది. 2015 నాటి ప్యారిస్ ఒప్పందం కింద పెట్టుకున్న లక్ష్యాలపై వేగంగా ముందుకు నడిచేందుకు ప్రపంచ దేశాలు కలసి వస్తాయనుకుంటే అది జరగలేదు. అది ఈ ‘కాప్– 27’ వైఫల్యమే. శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమంగా తగ్గించడంపై స్పష్టమైన హామీ లభించక పోవడంతో సదస్సుతో అందివచ్చిన అవకాశం చేజారినట్టయింది. అలాగని అసలు శుభవార్తలేమీ లేవని కాదు. కాలుష్యకారక ధనిక దేశాల వల్ల పర్యావరణ మార్పులు తలెత్తి, ప్రకృతి వైపరీత్యాలకు బలవుతున్న అమాయకపు దేశాల కోసం ‘నష్టపరిహార నిధి’ విషయంలో గత ఏడాది ఓ అంగీకారం కుదిరింది. దానిపై ఈసారి ఒక అడుగు ముందుకు పడింది. అది ఈ సదస్సులో చెప్పుకోదగ్గ విజ యమే. వెరసి, కొద్దిగా తీపి, చాలావరకు చేదుల సమ్మిశ్రమంగా ముగిసిన సదస్సు ఇది. సదస్సు ఫలితాలపై ఐరాస ప్రధాన కార్యదర్శి తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది అందుకే! పుడమితల్లి ఇప్పటికీ ‘అత్యవసర గది’లోనే ఉంది. గ్రీన్హౌస్ వాయువులను తక్షణమే గణనీయంగా తగ్గించా ల్సిన అవసరాన్ని ‘కాప్ గుర్తించలేదు’ అన్నది ఆయన మాట. అదే భావన ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది. పారిశ్రామికీకరణ అనంతరం విపరీతంగా కర్బన ఉద్గారాలకు కారణమైన ధనిక దేశాలు ‘నష్టపరిహార నిధి’కి ఒప్పుకోవడం కూడా ఆషామాషీగా ఏమీ జరగలేదు. 134 వర్ధమాన దేశాల బృందమైన ‘జి–77’ ఈ అంశంపై కట్టుగా, గట్టిగా నిలబడడంతో అది సాధ్యమైంది. ఈ నిధి ఆలోచన కనీసం 3 దశాబ్దాల క్రితం నాటిది. ఇన్నాళ్ళకు అది పట్టాలెక్కుతోంది. దాన్నిబట్టి వాతావరణ మార్పులపై అర్థవంతమైన బాధ్యత తీసుకోవడానికి ధనిక దేశాలు ఇప్పటికీ అనిష్టంగానే ఉన్నాయని స్పష్టమవుతోంది. పైపెచ్చు, ‘వాతావరణ బాధ్యతల నాయకత్వం’ వర్ధమాన ప్రపంచమే చేపట్టాలన్న అభ్యర్థన దీనికి పరాకాష్ఠ. చిత్రమేమిటంటే – ఈ నష్టపరిహార నిధిని ఎలా ఆచరణలోకి తెస్తారన్న వివరాలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం! ఆ నిధిని ఎలా సమకూర్చాలి, ఎప్పటికి అమలులోకి తేవాలనేది పేర్కొనలేదు. వాటిని ఖరారు చేయడానికి ఒక కమిటీని వేస్తున్నట్టు సదస్సు తీర్మానంలో చెప్పారే తప్ప, దానికీ తుది గడువేదీ పెట్టకపోవడం విడ్డూరం. అంతేకాక, దీర్ఘకాలంగా తాము చేసిన వాతావరణ నష్టానికి బాధ్యత వహించడానికి ఇష్టపడని ధనిక దేశాలు వర్తమాన ఉద్గారాలపైనే దృష్టి పెట్టనున్నాయి. ఆ రకంగా వర్ధమాన దేశాలకు ఇది కూడా దెబ్బే. ఇక, పారిశ్రామికీకరణ ముందు నాటి కన్నా 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకే భూతాపోన్నతిని నియంత్రించాలని చాలాకాలంగా ‘కాప్’లో చెప్పుకుంటున్న సంకల్పం. ఈసారీ అదే లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే దశలవారీగా శిలాజ ఇంధన వినియోగాన్ని ఆపేయడం కీలకం. గ్లాస్గోలో జరిగిన గడచిన ‘కాప్–26’లోనే ఇష్టారాజ్యపు బొగ్గు వినియోగాన్ని దశలవారీగా ఆపేందుకు అంగీకరించారు. తీరా దానిపై ఇప్పటికీ ఎలాంటి ఒప్పందం కుదరనే లేదు. శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమంగా తగ్గించడంపై భారత్ తన వాణి బలంగా వినిపిస్తూ వచ్చింది. పునరుద్ధరణీయ ఇంధనాల వైపు వెళతామంటూ మన దేశం ఇప్పటికే గణనీయమైన హామీలిచ్చింది. కాకపోతే, ఒక్క బొగ్గే కాకుండా చమురు, సహజ వాయువులను సైతం శిలాజ ఇంధనాల్లో చేర్చాలని పట్టుబట్టింది. చివరకు మన డిమాండ్ గురించి ఎలాంటి ప్రస్తావనా లేకుండానే ముసాయిదా ఒప్పందం జారీ అయింది. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో ఇంధన సంక్షోభం తలెత్తడంతో, యూరోపియన్ దేశాలు మళ్ళీ బొగ్గుపైనే ఆధారపడే విధానాలకు తిరిగొచ్చాయి. శిలాజ ఇంధన వినియోగ లాబీదే పైచేయిగా మారింది. ఇది చాలదన్నట్టు వచ్చే ఏడాది జరిగే ‘కాప్’ సదస్సుకు చమురు దేశమైన యూఏఈ అధ్యక్షత వహించనుంది. కాబట్టి, భూతాపోన్నతిని నియత్రించేలా ఉద్గారాలను తగ్గించడమనే లక్ష్యం కాస్తా చర్చల్లో కొట్టుకుపోయింది. నవంబర్ 18కే ఈ సదస్సు ముగియాల్సి ఉంది. అయితే, పలు కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరక సదస్సును మరో రోజు పొడిగించారు. కానీ, సాధించినదేమిటంటే ‘నిధి’ ఏర్పాటు తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేని పరిస్థితి. ఆ మాటకొస్తే, ఒక్క కరోనా ఉద్ధృతి వేళ మినహా... 1995లో బెర్లిన్‌లోని ‘కాప్–1’ నుంచి ఈజిప్ట్‌లోని ఈ ఏటి ‘కాప్–27’ వరకు ఇన్నేళ్ళుగా కర్బన ఉద్గారాలు నిర్దయగా పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. మన నివాసాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఈ సదస్సులతో గణనీయ లాభాలుంటాయనే అత్యాశ లేకున్నా, తాజా ‘కాప్–27’ అంచనాలను అధఃపాతాళానికి తీసుకెళ్ళింది. నియంతృత్వ పాలనలోని దేశంలో, ప్రపంచంలోని అతి పెద్ద ప్లాస్టిక్ కాలుష్యకారక సంస్థ స్పాన్సర్‌గా, 600 మందికి పైగా శిలాజ ఇంధన సమర్థక ప్రతినిధులు హాజరైన సదస్సు – ఇలా ముగియడం ఆశ్చర్యమేమీ కాదు. ఇప్పటి వరకు జరిగిన సదస్సుల్లో ఇదే అతి పెద్ద ఫ్లాప్ షో అన్న మాట వినిపిస్తున్నది అందుకే. ఈ పరిస్థితి మారాలి. ఏటేటా పాడిందే పాడుతూ, వివిధ దేశాధినేతల గ్రూప్ ఫోటోల హంగామాగా ‘కాప్’ మిగిలిపోతే కష్టం. వట్టి ఊకదంపుడు మాటల జాతరగా మారిపోతే మన ధరిత్రికి తీరని నష్టం. -
భారత్‌లో 2 నిమిషాలకు ఒకరు దుర్మరణం.. మేల్కోపోతే వినాశనమే!
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతోనూ చాలా దేశాల్లో తిండి దొరకని పరిస్థితులు తెలెత్తాయి. అయితే, అంతుకు మించిన విపత్తు మనకు తెలియకుండానే ప్రాణాలను హరిస్తోంది. మనం చేసుకుంటున్న కర్మకు ఫలితేమేనంటూ శాస్త్రవేత్తలు బల్ల గుద్ది చెబుతున్నారు. పెరుగుతున్న కాలుష్యం కారణంగా భూతాపం(గ్లోబల్ వార్మింగ్) పెరిగిపోయి.. లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బొగ్గు, చమురు, గ్యాస్‌కు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ పెరిగి.. విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది ఓ పరిశోధన. శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఒక్క భారత్‌లోనే 2 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారని తాజాగా నివేదిక ‘ద లాన్సెట్ కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్’ హెచ్చరించింది. ఈ నివేదికను ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ వంటి 50 సంస్థలకు చెందిన 99 మంది నిపుణులు రూపొందించారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిస్తూ ఆరోగ్య కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు సూచించారు. శిలాజ ఇంధనాలకు రాయితీలు ఇస్తూ.. వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే.. ఆహార భద్రత, అంటు వ్యాధుల వ్యాప్తి, ఉష్ణోగ్రత వల్ల కలిగే వ్యాధులు, విద్యుత్తు సంక్షోభం, గాలి కాలుష్యం వల్ల మరణాలు వంటివి పెరిగిపోయి మహా విపత్తు తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు తక్షణం చర్యలు చేపట్టకపోతే జరిగేది వినాశనమేనని హెచ్చరించారు. ► శిలాజ ఇంధనాల వాడకంతో ఏర్పడే కాలుష్యం కారణంగా భారత్‌లో గత ఏడాది 2020లో ఏకంగా 3,30,000 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదిక వెల్లడించింది. అది ప్రతి 2 నిమిషాలకు 1.2 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు.. చైనాలో 3,80,000 మరణాలు సంభవించగా, ఐరోపాలో 1,17,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 32 వేల మంది మరణించారు. ► ప్రస్తుతం ప్రపంచ దేశాలు అవలంభిస్తున్న తీరుతో ఈ శతాబ్దం చివరి నాటికి భూతాపం 2.7 డిగ్రీల సెల్సియస్ పెరగనుంది. ప్రస్తుతం 1.1 డిగ్రీ సెల్సియస్ పెరిగినందుకే వడగాలులు, వరదలు, తుపాన్లతో ప్రపంచం అతలాకుతలమవుతోంది. మరి ఆ స్థాయి ఉష్ణోగ్రతకు చేరుకుంటే పరిస్థితి దారుణంగా ఉండనుంది. ► వాతావరణ మార్పులు, గాలి కాలుష్యం కారణంగా ఎక్కువ నష్టం జరుగుతోందని నివేదిక వెల్లడించింది. శిలాజ ఇంధానలను వాడటం వల్ల గ్రీన్‌హౌజ్ గ్యాస్ గాల్లో కలిసి ప్రాణాలను హరించివేస్తోందని పేర్కొంది. గాలి కాలుష్యం కారణంగా శరీరంలోని ప్రతి అవయవం దెబ్బతింటున్నట్లు స్పష్టం చేసింది. గాలి నాణ్యత పీఎం 2.5గా ఉన్న అమెరికాలోనే గత ఏడాది 32వేల మంది మరణించారని ఆందోళన వ్యక్తం చేసింది. ► ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు శిలాజ ఇంధనాలకు రాయితీలు ఇస్తున్నాయి. అందులో కొన్ని దేశాల్లో ఆరోగ్య రంగానికి మించి శిలాజ ఇంధానల కోసం ఖర్చు చేస్తున్నాయి. 2019లో 69 దేశాలు 400 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి. భారత్ 43 బిలియన్ డాలర్లు, చైనా 35 బిలియన్ డాలర్లు, ఐరోపాలోని 15 దేశాలు ఒక్కో దేశానికి ఒక్కో బిలియన్ డాలర్ల చొప్పును రాయితీలు కల్పిస్తున్నాయి. అమెరికా 20 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. దీంతో శిలాజ ఇంధనాల వాడకం పెరిగిపోతోంది. దీంతో కాలుష్యం పెరగటం, పర్యావరణ మార్పులు చోటు చేసుకుని వినాశనాన్ని కొనితెచ్చుకుంటున్నామని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: షాకింగ్.. బతికున్న మహిళను మింగిన 22 అడుగుల భారీ కొండచిలువ -
రూ.900 కోట్ల పెయింటింగ్‌పై పొటాటో సాస్ పోసి నిరసన.. అందుకేనటా!
బెర్లిన్: పర్యావరణ కాలుష్యంపై ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇద్దరు పర్యావరణ వేత్తలు సాహాసానికి పూనుకున్నారు. సుమారు రూ.900 కోట్లుకుపైగా విలువైన మోనెట్ పెయింటింగ్‌పై ఆలు, టమాటో సాస్ పోసి నిరసన వ్యక్తం చేశారు. శిలాజ ఇంధనాలను భూమి నుంచి తీసి వాడటానికి వ్యతిరేకంగా ఇలా చేసినట్లు చెప్పారు. ఈ సంఘటన జర్మనీలో జరిగింది. ఈ వీడియోను లాస్ట్ జనరేషన్ అనే ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. లాస్ట్ జనరేషన్ గ్రూప్‌కు చెందిన ఇద్దరు పర్యావరణ కార్యకర్తలు బార్బెరిని మ్యూజియంలో మోనెట్ లెస్ మెయూల్స్ పెయింటింగ్‌పై పొటాటో సాసు పోశారు. అనంతరం పెయింటింగ్ వద్ద కూర్చుని నిరసన తెలిపారు. ‘మీరు సమస్య వినడానికి ఈ పెయింటింగ్‌పై పొటాటో సాసు వేయటం ఉపయోగపడుతుందా? మనం ఆహారం కోసం గొడవపడాల్సి వస్తే.. ఈ పెయింట్‌కు విలువే ఉండదు. ప్రజలు చనిపోతున్నారు. మనం పర్యావరణ విపత్తులో ఉన్నాం. పెయింటింగ్‌పై టమాటో సూప్ పోయటం వల్ల భయపడుతున్నారు. కానీ మేము ఎందుకు భయపడుతున్నామో మీకు తెలుసా? 2050 నాటికి మనకు తినడానికి తిండి దొరకదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకు భయపడుతున్నాం. మీరు ఎప్పుడైతే వింటారో అప్పుడే ఇదంతా ఆగిపోతుంది.’ అని పేర్కొన్నారు. ఈ స్టంట్‌లో నలుగురు పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. పెయింటింగ్ మొత్తం గ్లాస్‌తో ఉండటం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని బర్బెరిని మ్యూజియమ్ తెలిపింది. ఈ సంఘటనతో దిగ్భ్రాంతికి గురైనట్లు మ్యూజియం డైరెక్టర్ ఓర్ట్రూడ్ వెస్తేయిడర్ పేర్కొన్నారు. పర్యావరణ విపత్తుపై వారి ఆందోళనలను అర్థం చేసుకున్నామని, అయితే, వారి డిమాండ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనుసరించిన విధానమే ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. దీనిపై పోలీసులు ఎలాంటి సమాచారం అందించలేదు. We make this #Monet the stage and the public the audience. If it takes a painting – with #MashedPotatoes or #TomatoSoup thrown at it – to make society remember that the fossil fuel course is killing us all: Then we'll give you #MashedPotatoes on a painting! pic.twitter.com/HBeZL69QTZ — Letzte Generation (@AufstandLastGen) October 23, 2022 ఇదీ చదవండి: ‘మహా’ పాలిటిక్స్.. షిండేకు పదవీ గండం.. బీజేపీలోకి 22 మంది ఎమ్మెల్యేలు! -
‘మహా’ మునక
భూమి లోపల ఉన్న శిలాజ ఇంధన నిల్వలను పూర్తిగా తోడేసినట్లయితే ఒక రోజున మనం అంటార్కిటికా హిమఖండానికి గుడ్‌బై చెప్పక తప్పదని తేలుతోంది. అదే జరిగినట్లయితే ప్రపంచ మహానగరాలు చాలావరకు మునిగిపోయే ప్రమాదం పొంచుకుని ఉంది. కోట్లాది సంవత్సరాల క్రమంలో భూ అంతర్భాగంలో పేరుకుపోయిన బొగ్గు, చమురు, గ్యాస్ నిల్వలను పూర్తిగా దహించివేసినట్లయితే అంటార్కిటికా హిమఖండ ం పూర్తిగా కరిగిపోయి సముద్ర మట్టం 50 నుంచి 60 మీటర్లు (160 నుంచి 200 అడుగులు) పెరుగుతుందని, దీంతో తీర ప్రాంతంలో ఉన్న విశ్వ మహానగరాలు మునిగిపోతాయని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ఇలా సముద్రంలో కలిసిపోనున్న మహానగరాల్లో టోక్యో, హాంగ్‌కాంగ్, షాంఘై, హాంబర్గ్, న్యూయార్క్‌తో పాటు మన కోల్‌కతా, చెన్నై, ముంబై కూడా ఉన్నాయని అంచనా. ఇప్పటికే సముద్ర మట్టానికి సమాన స్థాయిలో ఉంటున్న వందకోట్ల జనాభా కలిగిన తీరప్రాంత నగరాలు ఉనికిని కోల్పోనున్నాయి. అంటార్కిటికా ఆ స్థాయిలో కరిగిపోకూడదంటే శిలాజ ఇంధనం జోలికి వెళ్లకూడదని, వాతావరణంలోకి కార్బన్‌ను వదలకూడదని విజ్ఞుల ఉవాచ.