found dead on railway tracks
-
ఆస్పత్రి నుంచి పారిపోయి.. శవమై తేలాడు
ముంబై : ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా రోగి మంగళవారం రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. ఈ ఘటన ముంబైలో స్థానికంగా కలకలం రేపడంతో దర్యాప్తు చేయాల్సిందిగా మేయర్ కిషోర్ ఫడ్నేకర్ అధికారులను ఆదేశించారు. కరోనా లక్షణాలతో 80 ఏళ్ల విఠల్ ములేని జూన్ 6న శతాబ్ది ఆసుపత్రిలో చేర్పించగా కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే ఆయన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించగా మిగతా కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేశారు. (మహిళ ప్రాణం తీసిన స్కార్ఫ్ ) అయితే రెండు రోజుల్లోనే హాస్పిటల్ నుంచి తప్పించుకున్న విఠల్ ములే బోరివాలి స్టేషన్ సమీపంలో రైల్వేట్రాక్‌పై శవమై కనిపించాడు. ఘటనపై విచారణ జరిపించాల్సిందిగా విఠల్ మనువడు ప్రవీణ్ రౌత్ స్థానిక బిజెపి కార్పొరేటర్ వినోద్ మిశ్రాకి ఫిర్యాదు చేశారు. కట్టుదిట్టమైన భద్రత, నిత్యం వైద్యుల పర్యవేక్షణ ఉన్నా రోగి తప్పించుకొని పోవడం ఏంటని వినోద్ మిశ్రా ప్రశ్నించారు. దీనికి సంబంధించి దర్యాప్తు జరిపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 'ప్రముఖ ఆసుపత్రి ఉండి కూడా సీసీటీవీ పనిచేయడం లేదు. దాదాపు 12 గంటల తర్వాత తాతయ్య తప్పిపోయినట్లు గుర్తించారు. అంతేకాకుండా ఇదేంటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించారు' అంటూ రౌత్ ఆస్పత్రి వర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (24 గంటల్లో 279 మంది మృతి ) -
ఉన్నత కులం అమ్మాయితో మాట్లాడాడని..
చెన్నై: ఉన్నత కులానికి చెందిన అమ్మాయితో మాట్లాడుతున్నాడనే కారణంతో ఓ దళిత కుటుంబానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని హతమార్చిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కిడ్నాప్ చేసి మరీ అతడిని హతమార్చి రైలుపట్టాలపై పడేసినట్లు మృతుడి తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. గోఖుల్ రాజ్ అనే 21 యువకుడు నమక్కల్ జిల్లాలోని ఓ గ్రామంలోని దళిత కుటుంబానికి చెందినవాడు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు తమ కూతురితో మాట్లాడుతున్నాడని స్థానిక నాయకుడైన యువరాజ్ అనే వ్యక్తి గోఖుల్ రాజ్‌ను కిడ్నాప్ చేశాడు. అనంతరం హత్య చేసి అక్కడే ఎవరికీ అనుమానం రాకుండా రైలుపట్టాలపై పడేశాడు. కానీ, ప్రేమ విఫలం వల్లే అతడు రైలుకింద చనిపోయాడని, అతడి జేబులో ఓ లేఖ ద్వారా ఈ విషయం తెలిసిందని కూడా పోలీసులే అంటున్నారు. ప్రస్తుతానికి యువరాజ్‌పై కేసు నమోదుచేయడమే కాకుండా అనుమానాస్పద మృతిగా కూడా కేసు నమోదుచేశారు. తమిళనాడులో ఇలాంటి హత్యలు తరుచుగా జరుగుతుంటాయి.