ఉన్నత కులం అమ్మాయితో మాట్లాడాడని.. | Gokulraj, an engineer, was found dead on railway tracks in Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఉన్నత కులం అమ్మాయితో మాట్లాడాడని..

Published Fri, Jun 26 2015 2:15 PM | Last Updated on Mon, Apr 8 2019 7:51 PM

ఉన్నత కులం అమ్మాయితో మాట్లాడాడని.. - Sakshi

ఉన్నత కులం అమ్మాయితో మాట్లాడాడని..

చెన్నై: ఉన్నత కులానికి చెందిన అమ్మాయితో మాట్లాడుతున్నాడనే కారణంతో ఓ దళిత కుటుంబానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని హతమార్చిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కిడ్నాప్ చేసి మరీ అతడిని హతమార్చి రైలుపట్టాలపై పడేసినట్లు మృతుడి తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. గోఖుల్ రాజ్ అనే 21 యువకుడు నమక్కల్ జిల్లాలోని ఓ గ్రామంలోని దళిత కుటుంబానికి చెందినవాడు.

పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు తమ కూతురితో మాట్లాడుతున్నాడని స్థానిక నాయకుడైన యువరాజ్ అనే వ్యక్తి గోఖుల్ రాజ్ను కిడ్నాప్ చేశాడు. అనంతరం హత్య చేసి అక్కడే ఎవరికీ అనుమానం రాకుండా రైలుపట్టాలపై పడేశాడు. కానీ, ప్రేమ విఫలం వల్లే అతడు రైలుకింద చనిపోయాడని, అతడి జేబులో ఓ లేఖ ద్వారా ఈ విషయం తెలిసిందని కూడా పోలీసులే అంటున్నారు. ప్రస్తుతానికి యువరాజ్పై కేసు నమోదుచేయడమే కాకుండా అనుమానాస్పద మృతిగా కూడా కేసు నమోదుచేశారు. తమిళనాడులో ఇలాంటి హత్యలు తరుచుగా జరుగుతుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement