చెన్నై : తమిళనాడులో గోకుల్ రాజ్ అనే దళిత ఇంజినీరింగ్ విద్యార్థి హత్య కేసులో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ హత్య కేసులో సంబంధం ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడన్న నెపంతో గోకుల్‌రాజ్‌ను గత నెల (29న) హతమార్చిన విషయం తెలిసిందే. అతన్ని హతమార్చిన అనంతరం శవాన్ని రైలు పట్టాలుపై పడేశారు. అప్పటి నుంచి సేలంలో ఉద్రిక్తతను కొనసాగుతోంది.
గోకుల్ రాజ్ హత్య ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. మరోవైపు గోకుల్ రాజ్ స్నేహితులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తు అధికారి గోకుల్ శవ పరీక్ష నివేదికను రిజిస్ట్రార్ జనరల్కు సమర్పించాలని కోర్టు గత నెల 30న ఆదేశించింది. కాగా ప్రేమ వ్యవహారమే గోకుల్ రాజ్ హత్యకు దారితీసిందని డీఐజీ విద్యా కులకర్ణి తెలిపారు.
దళిత ఇంజినీర్ హత్యకేసులో ఆరుగురి అరెస్ట్
Published Thu, Jul 2 2015 11:47 AM | Last Updated on Tue, Nov 6 2018 4:37 PM
Advertisement
Advertisement