Gokulraj
-
దళిత ఇంజినీర్ హత్యకేసులో ఆరుగురి అరెస్ట్
చెన్నై : తమిళనాడులో గోకుల్ రాజ్ అనే దళిత ఇంజినీరింగ్ విద్యార్థి హత్య కేసులో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ హత్య కేసులో సంబంధం ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడన్న నెపంతో గోకుల్‌రాజ్‌ను గత నెల (29న) హతమార్చిన విషయం తెలిసిందే. అతన్ని హతమార్చిన అనంతరం శవాన్ని రైలు పట్టాలుపై పడేశారు. అప్పటి నుంచి సేలంలో ఉద్రిక్తతను కొనసాగుతోంది. గోకుల్ రాజ్ హత్య ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. మరోవైపు గోకుల్ రాజ్ స్నేహితులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తు అధికారి గోకుల్ శవ పరీక్ష నివేదికను రిజిస్ట్రార్ జనరల్‌కు సమర్పించాలని కోర్టు గత నెల 30న ఆదేశించింది. కాగా ప్రేమ వ్యవహారమే గోకుల్ రాజ్ హత్యకు దారితీసిందని డీఐజీ విద్యా కులకర్ణి తెలిపారు. -
ఉన్నత కులం అమ్మాయితో మాట్లాడాడని..
చెన్నై: ఉన్నత కులానికి చెందిన అమ్మాయితో మాట్లాడుతున్నాడనే కారణంతో ఓ దళిత కుటుంబానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని హతమార్చిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కిడ్నాప్ చేసి మరీ అతడిని హతమార్చి రైలుపట్టాలపై పడేసినట్లు మృతుడి తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. గోఖుల్ రాజ్ అనే 21 యువకుడు నమక్కల్ జిల్లాలోని ఓ గ్రామంలోని దళిత కుటుంబానికి చెందినవాడు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు తమ కూతురితో మాట్లాడుతున్నాడని స్థానిక నాయకుడైన యువరాజ్ అనే వ్యక్తి గోఖుల్ రాజ్‌ను కిడ్నాప్ చేశాడు. అనంతరం హత్య చేసి అక్కడే ఎవరికీ అనుమానం రాకుండా రైలుపట్టాలపై పడేశాడు. కానీ, ప్రేమ విఫలం వల్లే అతడు రైలుకింద చనిపోయాడని, అతడి జేబులో ఓ లేఖ ద్వారా ఈ విషయం తెలిసిందని కూడా పోలీసులే అంటున్నారు. ప్రస్తుతానికి యువరాజ్‌పై కేసు నమోదుచేయడమే కాకుండా అనుమానాస్పద మృతిగా కూడా కేసు నమోదుచేశారు. తమిళనాడులో ఇలాంటి హత్యలు తరుచుగా జరుగుతుంటాయి.