Founders day
-
బంజారాహిల్స్ మెరీడియన్ స్కూల్లో ఘనంగా ఫౌండేషన్ డే వేడుకలు (ఫోటోలు)
-
Hain Tayyar Hum: మేమొస్తే కుల గణన
నాగపూర్: దేశంలో కీలకమైన రంగాల్లో ఓబీసీలు, దళితులు, గిరిజనులకు వారికి జనాభా తగ్గుట్టుగా తగిన ప్రాతినిధ్యం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ 139వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో గురువారం ‘హై తయ్యార్ హమ్’ పేరిట నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. రాజ్యాధికారాన్ని సామాన్య ప్రజల చేతికి అప్పగించాలన్నదే కాంగ్రెస్ ప్రధాన ఉద్దేశమని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోట్లాది మందిని పేదరికంలోకి నెట్టేసిందని ఆరోపించారు. పేదల ఇండియా, ధనికుల ఇండియా అనే రెండు దేశాలను తాము కోరుకోవడం లేదన్నారు. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచి్చందో చెప్పాలని నిలదీశారు. దేశంలో నిరుద్యోగం అత్యధిక స్థాయికి చేరిందని ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలి్పస్తామని పేర్కొన్నారు. మోదీ ఓబీసీనని ఎందుకు చెప్పుకుంటున్నారు ప్రధాని మోదీ తాను ఓబీసీనని పదేపదే చెప్పుకుంటున్నారని, ఇప్పుడు కుల గణన గురించి తాము ప్రశ్నిస్తే నోరు విప్పడం లేదని రాహుల్ విమర్శించారు. పేదలు అనే ఒకే కులం ఉందని అంటున్నారని ఆక్షేపించారు. నిజంగా ఒకే కులం ఉంటే ఓబీసీనని ఎందుకు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీలో అగ్రనేతల నుంచి ఆదేశాలు వస్తుంటాయని, కాంగ్రెస్‌లో మాత్రం సామాన్య కార్యకర్తలు సైతం నాయకత్వాన్ని ప్రశ్నించే వెసులుబాటు ఉందని అన్నారు. దేశంలో పాలనా పగ్గాలు సాధారణ ప్రజల చేతుల్లో ఉండాలని ఆకాంక్షించారు. దేశంలో హరిత విప్లవం, శ్వేత విప్లవం, సమాచార సాంకేతిక విప్లవానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పునాది వేశాయని, వీటితో రైతులు, మహిళలు, యువత లబ్ధి పొందారని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో అన్ని వ్యవస్థలను చెరపట్టిందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. బీజేపీలో బానిసత్వం: రాహుల్ అధికార బీజేపీలో బానిసత్వం కొనసాగుతోందని ఆ పార్టీ ఎంపీ ఒకరు తనతో చెప్పారని రాహుల్ గాంధీ అన్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆ ఎంపీ ఇటీవల తనను ప్రైవేట్‌గా కలిశాడని చెప్పారు. బీజేపీలో ఉన్నప్పటికీ తన హృదయం మాత్రం కాంగ్రెస్‌తోనే ఉందని వెల్లడించాడని పేర్కొన్నారు. బీజేపీ పెద్దల నుంచి వచ్చే ఆదేశాలను ఎవరైనా పాటించాల్సిందేనని, నోరెత్తడానికి వీల్లేదని, పార్టీ కార్యకర్తల గోడును ఎవరూ పట్టించుకోరని ఆ ఎంపీ ఆవేదన వ్యక్తం చేశాడని రాహుల్ తెలిపారు. ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారం చేపట్టిన తర్వాత పేదలు, మహిళల సంక్షేమం కోసం కనీస వేతన పథకాన్ని(న్యాయ్ స్కీమ్) అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ‘హై తయ్యార్ హమ్’ సభలో ఆయన ప్రసంగించారు. నాగపూర్ నగరం రెండు సిద్ధాంతాలకు కేంద్ర బిందువు అని చెప్పారు. ఒకటి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రవచించిన ప్రగతిశీల సిద్ధాంతమైతే, మరొకటి దేశాన్ని విచ్ఛన్నం చేసే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమని అన్నారు. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం అంతమైపోతుందని హెచ్చరించారు. సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ బద్ధ వ్యతిరేకి అని ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థ పెనుముప్పు ఎదుర్కొంటోందని అన్నారు. మోదీ పాలనలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఆకాశం అంచులకు చేరాయని విమర్శించారు. -
దేశంలో మార్పు దిశగా ఉద్యమించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్య పాలన వచ్చి 75 ఏళ్లయినా తాగునీరు, సాగునీరు, విద్యుత్ సమస్యలతో ప్రజలు బాధపడే పరిస్థితి ఉందని.. దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు పేర్కొన్నారు. తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ప్రతినిధుల సభ జరిగింది. ఇందులో కేటీఆర్ ‘దేశంలో గుణాత్మక మార్పు సాధించే దిశగా బీఆర్ఎస్ ఉద్యమ స్ఫూర్తితో పురోగమించాలి’అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ప్రసంగించారు. కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘మౌలిక వసతుల కొరతతో దేశ ప్రగతి మందగిస్తోంది. దేశాభివృద్ధికి చోదకశక్తిగా నిలవాల్సిన యువత ఉద్యోగ అవకాశాల్లేక నిరాశతో కొట్టుమిట్టాడుతోంది. సమాజంలో నేటికీ కుల, మత, లింగ వివక్ష కొనసాగుతున్నాయి. దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఉపాధి లేక మగ్గిపోతున్నారు. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజారుస్తున్న ఈ వైఖరి ఆమోదయోగ్యం కాదు. దేశంలో అపారమైన సహజ వనరులున్నా అందిపుచ్చుకోవడంలో పాలకుల వైఫల్యంతో ప్రజలు దుర్భర పేదరికాన్ని అనుభవిస్తున్నారు. నీటి కోసం ఇంకా కొట్లాటలే.. దేశంలో జల వనరుల లభ్యత ప్రజల అవసరాలకు మించి ఉంది. ఏటా లక్షా 40 వేల టీఎంసీల వర్షపాతం కురుస్తోంది. నదుల్లో 70 వేల టీఎంసీల నీరు ప్రవహిస్తోంది. కానీ దేశవ్యాప్తంగా వినియోగంలోకి తెచ్చుకున్న నీళ్లు 20 వేల టీఎంసీలే. మిగతా 50 వేల టీఎంసీలు వృథాగా సముద్రం పాలవుతున్నాయి. ఇందులో 20 వేల టీఎంసీలను వాడుకోగలిగితే.. దేశంలో సాగుయోగ్యమైన 41 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఇప్పటికీ నదుల నీళ్ల కోసం రాష్ట్రాల మధ్య తెగని పంచాయితీలు కొనసాగుతున్నాయి. భారీ ప్రాజెక్టులు లేవు.. విద్యుత్ లేదు.. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మాత్రమే దేశ నిర్మాణం కోసం బలమైన అడుగులు పడ్డాయి. భాక్రానంగల్, నాగార్జునసాగర్ వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. కానీ ఆ తర్వాతి ప్రభుత్వాల నిష్క్రియా పరత్వంతో దేశ ప్రజలు శాపగ్రస్త జీవితం గడుపుతున్నారు. భారత్ కన్నా విస్తీర్ణంలో, జనాభాలో చిన్నవైన దేశాలు కూడా వేల టీఎంసీల సామర్థ్యమున్న పెద్ద పెద్ద రిజర్వాయర్లు నిర్మించుకున్నాయి. తెలంగాణ మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు తాగునీరు, సాగునీరు, విద్యుత్ లేక బాధలు అనుభవిస్తున్నారు. మన దేశంలో అందుబాటులో ఉన్న 361 బిలియన్ టన్నుల బొగ్గును హైబ్రిడ్ పద్ధతిలో వాడినట్లయితే దేశ ప్రజలందరికీ, అన్నిరంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను 150 ఏళ్లపాటు ఇవ్వొచ్చు. వ్యవసాయ రంగంలో నెలకొన్న కరెంటు సంక్షోభాన్ని సునాయాసంగా పరిష్కరించుకోవచ్చు. మతోన్మాద శక్తులు విజృంభిస్తున్నాయి దేశంలో మతోన్మాదశక్తులు విజృంభిస్తే అంతర్గత ఐక్యత విచ్ఛిన్నమైపోతుంది. దేశం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పతనమవుతుంది. బీజేపీ ప్రభుత్వం అన్ని రంగా ల్లో విఫలమైంది. ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఉద్రిక్తతలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే దుర్మార్గ ఎత్తుగడ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో దేశంలో మతోన్మాదశక్తుల పాలన అంతం, తెలంగాణ మోడల్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ అప్రతిహతంగా పురోగమించాలి’’అని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోని రైతుకు బాసటగా.. తెలంగాణలో రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ.10 వేలు అందిస్తున్నాం. రైతు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఈ విధానం దేశమంతా కొనసాగాలి. ప్రస్తుతం దేశంలో రైతుల పరి స్థితి దయనీయంగా ఉంది. నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ దేశమంతటా విస్తరించి రైతు రాజ్యాన్ని నెలకొల్పేదిశగా పురోగమించాలని ప్రతినిధుల సభ తీర్మానిస్తోంది. తెలంగాణలో అమలవుతున్న దళితబంధు దేశవ్యాప్తంగా విస్తరిస్తే అస్పృశ్యత తొలగిపోతుంది. రోడ్లు, పోర్టులు, ఇతర వసతులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చెందాలి. ఇవి సాకారం కావాలంటే బీఆర్ఎస్ జాతీయస్థాయిలో పురోగమించాలి. -
విపక్షాల దుష్ర్పచారాన్ని తిప్పికొట్టండి
బీజేపీ శ్రేణులకు అమిత్ షా పిలుపు న్యూఢిల్లీ: విపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పదవుల కోసం కాకుండా దేశ నిర్మాణానికి పాటుపడాలని, త్యాగానికి సిద్ధం కావాలని కోరారు. సోమవారమిక్కడ ఘనంగా జరిగిన పార్టీ 35వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. భూసేకరణ బిల్లుపై విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఒకే దేశం, ఒకే కులం, ఒకే జాతి అనే భావనను బీజేపీ విశ్వసిస్తుందని, అయితే దీన్ని మతతత్వంగా విమర్శిస్తున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ నిత్యం అసత్య ప్రచారానికి పాల్పడుతోందని, అందుకు తన జీవితంలో ఓ ఉదాహరణ ఉందని చెప్పారు. ‘నేను బీజేపీలో చేరేటప్పుడు నన్ను గేలి చేశారు. ఓ కాంగ్రెస్ మంత్రి వద్దకు మా మామ నన్ను తీసుకెళ్లారు. ‘బీజేపీలోకి వెళ్తున్నావా? అది ఉత్తర భారత పార్టీ, బ్రాహ్మణుల పార్టీ. శాకాహార పార్టీ’ అని అన్నారు. నేనేమో మాంసాహారిని. పార్టీలో చేరాలా, వద్దా అని సందిగ్ధపడ్డాను. అయితే మా సంఘ్ ప్రచారక్‌ను అడిగితే ‘శాకాహారమైనా తినొచ్చు, మాంసాహారమైనా తినొచ్చు’ అని చెప్పారు’ అని చెప్పారు. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ, సీనియర్ నేత మురళీమనోహర్ జోషీలు రాకపోవడం గమనార్హం. వీరితోపాటు ఏ నేతలకూ ఆహ్వానం పంపలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. -
బీజేపీ నేతల్లో నైరాశ్యం..!
నామినేటెడ్ పదవులు దక్కని వైనం సొంత మంత్రుల శాఖల్లోనూ అవమానం అసంతృప్తిలో జిల్లా నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లే యత్నం నేడు బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం విజయవాడ : అటు కేంద్రంలో అధికారంలోనూ, ఇటు రాష్ట్రంలో అధికార పార్టీకి మిత్రపక్షంగా ఉన్నా తమకు న్యాయం జరగట్లేదని బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు దాటినా జిల్లాలో ఒక్క నామినేటెడ్ పదవైనా దక్కకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జెండాను మోయడానికే తమను ఉపయోగిస్తున్నారంటున్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం జరిగే పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి వస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు దృష్టికి సమస్య తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. మంత్రుల శాఖల్లోనూ అవమానం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు బీజేపీకి చెందినవారే. నూతనంగా ఏర్పడిన విజయవాడ ప్రభుత్వాస్పత్రి కమిటీలో గానీ, దసరా ఉత్సవాల సమయంలో దుర్గగుడి ఉత్సవ కమిటీలో గానీ బీజేపీ నేతలకు అవకాశం దక్కలేదు. పార్టీకి చెందిన మంత్రులు తమ సొంత శాఖల్లో కూడా బీజేపీ నేతలకు అవకాశం కల్పించకపోవడంపై పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసులను మాత్రమే మంత్రులు ఆమోదిస్తున్నారు తప్ప బీజేపీ సీనియర్ నేతలు చెప్పిన మాటల్ని లెక్కచేయడం లేదని బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. అండగా నిలబడరేం..? సత్యనారాయణపురం సీతారామ కల్యాణమండపం వివాదం విషయంలో కూడా తాము రోడ్డెక్కి టీడీపీ ఎమ్మెల్యే తీరును ఎండగట్టినా బీజేపీ మంత్రులు స్పందించకపోవడంపై వారు ఆగ్రహంతో ఉన్నారు. దుర్గగుడి చైర్మన్ పదవిని బీజేపీకి ఇస్తారంటూ గతంలో ప్రచారం జరిగిందే తప్ప ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. అలాగే, దేవాలయాల కమిటీల్లోనూ, మార్కెట్ యార్డుల కమిటీల్లోనూ తమకు అవకాశాలు కల్పించాలని బీజేపీ నేతలు కోరడమే తప్ప రాష్ర్ట ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనిపై మంత్రులు స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. మిత్రధర్మమంటూ నోరు మూసేస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. విపక్షాలతో కలిసి టీడీపీ నేతల్ని ఎండగట్టేందుకు స్థానిక బీజేపీ నేతలు సిద్ధమైనప్పుడల్లా మిత్రధర్మమంటూ సీనియర్లు నోరు నొక్కుతున్నారని, దీంతో తప్పని పరిస్థితుల్లో అవమానాలు దిగమింగి పనిచేయాల్సి వస్తోందని బీజేపీ కార్యకర్తలు కొందరు చెబుతున్నారు. సభ్యత్వ నమోదు, ప్రముఖులు వచ్చినప్పుడు సమావేశాలకు ఆహ్వానించడమే తప్ప ఇతర విషయాల్లో క్యాడర్‌కు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది మరికొందరి వాదన. దీంతో క్యాడర్ చేజారి పోతుందేమోనన్న భయం జిల్లా, నగర నేతల్లో వ్యక్తమవుతోంది. జిల్లా నేతలు పట్టించుకోకపోవడంతో రాష్ట్ర అధ్యక్షుడు సమస్య వివరించాలని, అక్కడి నుంచి కూడా సరైన స్పందన రాకపోతే జాతీయ పార్టీ దృష్టికి తీసుకువెళ్లాలని స్థానిక నాయకులు భావిస్తున్నారు. తాము మాత్రమే మిత్రధర్మం పాటిస్తే సరిపోదని, టీడీపీ నేతలు కూడా పాటించాలని, ఆ దిశగా రాష్ట్ర పార్టీ చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. -
విద్య, వైద్య సేవల్లో పీపీపీ విధానాలు: రంగరాజన్
స్థిరమైన ఆర్థిక వృద్ధితోనే ఉపాధి కల్పన సాక్షి, హైదరాబాద్: విద్య, వైద్యం వంటికనీస మౌలిక సేవలు ప్రభుత్వ విభాగాల ద్వారా మాత్రమే కాకుండా.. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానం(పీపీపీ)లోనూ అందాల్సిన అవసరం ఉందని ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ సి.రంగరాజన్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్’ (సెస్) వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన మాట్లాడారు. దేశ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నా.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉండేలా విధాన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. పేదరిక నిర్మూలన, పెరుగుతున్న యువతకు మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన కోసం స్థిరమైన, బలీయమైన వృద్ధిరేటు అవసరమన్నారు. 1970ల చివరి దశలో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించిన చైనా భారత్ కంటే వేగంగా ముందుకు దూసుకుపోయిందన్నారు. 1970నాటికి దేశ జీడీపీ నాలుగు శాతంలోపే ఉండగా.. 2005-06లో అది తొలిసారి 8శాతం దాటిందన్నారు. వృద్ధిరేటు పెరగటమే కాకుండా, సగటు ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడడం ఎంతో అసవరమన్నారు. అప్పుడే మానవాభివృద్ధి సూచీలో మన దేశం మెరుగైన స్థానాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పారు. 2013మానవాభివృద్ధి సూచీలో 187 దేశాల జాబితా లో.. భారత్ 136వ స్థానంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. గ్రామీణ వైద్య వసతులు, అక్షరాస్యత తదితర విషయాల్లో మనం ఇంకా బాగా వెనకబడి ఉన్నామని చెప్పారు. కొన్ని విషయాల్లో బంగ్లాదేశ్, శ్రీలంకలాంటి చిన్న దేశాలకంటే వెనకబడ్డామని.. అందుకే ఆర్థిక వృద్ధితోపాటు సామాజికాభివృద్ధి కూడా చాలా ముఖ్యమని గుర్తించాలని సూచించారు.