Four Kill
-
ఎట్టకేలకు దిగొచ్చిన చైనా
న్యూఢిల్లీ/బీజింగ్: తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో గతేడాది జూన్ 15న భారత సైన్యంతో జరిగిన భీకర ఘర్షణలో తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదంటూ ఇన్నాళ్లూ బొంకిన చైనా ప్రజా విముక్తి సైన్యం(పీఎల్ఏ) ఎట్టకేలకు మౌనం వీడింది. నాలుగు దశాబ్దాల తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన అతి పెద్ద ఘర్షణగా రికార్డుకెక్కిన ఈ ఘటనపై దాదాపు ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా స్పందించింది. భారత సైన్యం చేతిలో పెద్ద సంఖ్యలో చైనా సైనికులు హతమయ్యారని ప్రపంచమంతా నమ్ముతున్నప్పటికీ అర్ధసత్యాన్నే బయటపెట్టింది. ప్రజలకు వాస్తవాలు చెబుతున్నామంటూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. గల్వాన్ ఘర్షణలో తమ సైనికులు కేవలం నలుగురు ప్రాణాలు కోల్పోయారని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. వారి త్యాగాలను స్మరించుకుంటూ, సెంట్రల్ మిలటరీ కమిషన్ ఆఫ్ చైనా(సీఎంసీ) వారికి మరణానంతర శౌర్య పురస్కారాలను ప్రదానం చేసినట్లు పీఎల్ఏ తెలియజేసింది. కనీసం 45 మంది చైనా సైనికులు మృతి! గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో తమ సైనికులు 20 మంది మృతిచెందినట్లు భారత సైన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన కల్నల్ బి.సంతోష్‌బాబు కూడా ఉన్నారు. అయితే, ఈ ఘటనలో చైనా సైన్యం 30 మందిని కోల్పోయినట్లు అప్పట్లో భారత్ వెల్లడించింది. కనీసం 45 మంది చైనా సైనికులు మరణించి ఉంటారని రష్యా అధికారిక న్యూస్ ఏజెన్సీ టీఏఎస్ఎస్ అంచనా వేసింది. గల్వాన్ ఘటనలో చైనా సైన్యానికి సంభవించిన నష్టంపై రకరకరాల ప్రచారాలు సాగుతున్నాయని, వాటికి అడ్డుకట్ట వేసి, ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలన్నదే తమ ప్రయత్నమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ చెప్పారు. అందుకే మృతుల వివరాలు బయటపెట్టామని అన్నారు. తమ సైనికుల త్యాగాలను ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని చెప్పారు. నేడు భారత్–చైనా మధ్య చర్చలు పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి భారత్, చైనా సైనిక బలగాలను, ఆయుధాలను పూర్తిగా ఉపసంహరించుకున్నాయి. హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెస్పాంగ్ నుంచి బలగాలను వెనక్కి తీసుకోవడంపై చర్చించేందుకు భారత్, చైనా మధ్య ఉన్నతస్థాయి సైనిక చర్చలు జరుగనున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. కమాండర్ స్థాయి పదో దఫా చర్చలు ఎల్ఏసీ వద్ద చైనా భూభాగంలో మోల్డో బోర్డర్ పాయింట్లో శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని వెల్లడించాయి. పాంగాంగ్ సరస్సు నుంచి బలగాలను వెనక్కి తీసుకున్న తర్వాత జరిగే తొలి చర్చలు ఇవే. -
ఈశాన్య ఢిల్లీ అల్లర్లు.. మృతులు 45
న్యూఢిల్లీ: వారం క్రితం అల్లర్లు జరిగిన ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే, సోమవారం అల్లర్లు జరిగిన ప్రాంతంలో మరో నాలుగు మృతదేహాలు బయటపడటంతో మృతుల సంఖ్య 45కు చేరుకుందని అధికారులు తెలిపారు. అల్లర్ల కారణంగా వాయిదాపడిన సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలను సోమవారం పటిష్ట బందోబస్తు మధ్య నిర్వహించారు. 98 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాపింప జేస్తున్న 40 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంకిత్‌శర్మ కుటుంబానికి రూ.కోటి సాయం అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ కుటుంబానికి రూ.కోటి పరిహారంగా అందజేయనున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పిస్తామన్నారు. అల్లర్లపై రేపు సుప్రీం విచారణ ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన పిటిషన్లపై 4న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. రాజకీయ నాయకులు, ఇతరుల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల అల్లర్లు జరిగాయని, వారిపై ఎఫ్ఐఆర్లు నమోదుచేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు ఈ వ్యవహారాన్ని నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. దీనిపై పిటిషన్‌దారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘అల్లర్ల కారణంగా ప్రజలు చనిపోతుంటే వాయిదా ఎలా వేయగలరు ?’ అంటూ పిటిషన్‌దారుల తరఫున లాయర్ కోలిన్ గొంజాల్వెజ్ సుప్రీంకోర్టును అడిగారు. అయితే అల్లర్లను నియంత్రించడం తమ పని కాదని, దానికి కార్యనిర్వాహక వ్యవస్థ ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. బుధవారం విచారణ జరుపుతామని తెలిపింది. -
రన్‌వే పక్కన కూలిపోయిన విమానం
టోక్యో: జపాన్‌లో ఓ చిన్నపాటి విమానం కూలిన ఘటనలో నలుగురు మరణించారు. శనివారం కోబ్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఈ సింగిల్ ఇంజిన్ విమానం యావో నగరంలోని విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో రన్ వేకు సమీపంలో కూలిపోయింది. విమానంలో ప్రయాణిస్తున్న నలుగురూ మరణించినట్టు అధికారులు చెప్పారు. కాగా ప్రమాద జరిగిన సమయంలో ఘటన స్థలంలో ఎవరూ లేరని తెలిపారు. -
అనంతపురంలో రోడ్డు ప్రమాదం; నలుగురు మృతి
అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. నార్పల మండలం పప్పూరు వద్ద ఎదురెదురుగా వస్తున్న ఆటో, లారీ ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో నలుగురు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.