four weeks
-
మైక్రోసాప్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : మైక్రోసాప్ట్ ఇండియా తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. సంరక్షకుని సెలవు(కేర్‌గివర్ లీవ్) పేరిట నాలుగు వారాల పెయిడ్ లీవ్‌ను ప్రకటించింది. కుటుంబసభ్యులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న పరిస్థితుల్లో వెంటనే వారికి సంరక్షకునిగా ఉండేందుకు ఈ పెయిడ్ లీవ్‌ను ఉద్యోగులకు అందించనున్నట్టు మైక్రోసాప్ట్ పేర్కొంది. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, అత్తామామలు, తోబుట్టువులు, తాతయ్య,నాన్నమ్మలు, సంతానం వంటి వారిని ప్యామిలీ కేర్‌గివర్ లీవ్‌లో చేర్చింది. ఈ సెలవు కింద ఉద్యోగులకు వేతనం చెల్లించనుంది. గతేడాదే కంపెనీ ప్రసూతి సెలవు కింద 26 వారాలను తమ ఉద్యోగులకు అందించనున్నట్టు ప్రకటించింది. పురుష ఉద్యోగులు కూడా ఆరు వారాల పితృత్వ సెలవును పెట్టుకోవచ్చని తెలిపింది. దీనిలోనే సరోగసీ లేదా దత్తత కూడా ఉంటాయని చెప్పింది. కుటుంబసభ్యులకు వారి అవసరం మేరకు ఉద్యోగులు ఏం చేయాలనిపిస్తే అది చేసుకునే విధంగా తమ విధానాలను రూపొందిస్తున్నామని మైక్రోసాప్ట్ హెచ్ఆర్ అధినేత ఇరా గుప్తా తెలిపారు. సంరక్షకుని సెలవును విస్తరించుకోవచ్చు. ఏడాదంతంటా ఉద్యోగి ఏ రూపంలోనైనా దీన్ని వాడుకోవచ్చని పేర్కొన్నారు. భారత్ లో మైక్రోసాప్ట్ కు 8000 మంది ఉద్యోగులున్నారు. ముఖ్యంగా మహిళలు వర్క్ చేస్తున్న ప్రాంతాల్లో తీసుకున్న మంచి నిర్ణయం ఇదేనని కన్సల్టెంట్స్ చెబుతున్నాయి. -
నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలి
భీంబాయి మరణంపై స్పందించిన మహిళా కమిషన్ జిల్లా పాలనాధికారికి నోటీసు జారీ కదిలించిన ‘సాక్షి’ కథనం కెరమెరి : మండలంలోని శివగూడ గ్రామానికి చెందిన టేకం భీంబాయి రక్తహీనత కారణంగా ప్రసవంలోనే బిడ్డతో సహా మరణించిన ఘటనపై మహిళా కమిషన్ స్పందించింది. దీనిపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని జిల్లా పాలనాధికారికి శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఇదే విషయంలో ఈ నెల 10న లీగల్ సర్వీసెస్ వెల్ఫేర్ సొసైటీ నాయకులు శివగూడ గ్రామాన్ని సందర్శించారు. భీంబాయి మతికి గల కారణాలను కుటుంభ సభ్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం 13న లీగల్ సర్వీసెస్ వెల్ఫేర్ సొసైటీ నాయకులు ‘సాక్షి’ ప్రచురించిన ‘పురిట్లో విషాదం’ కథనాన్ని జోడించి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆదివాసీ యువతుల్లో తల్లి కావాలంటే భయపడే దుస్థితి నెలకొందని అందులో పేర్కొన్నారు. ఏజెన్సీలో జరుగుతున్న గిరిజన బాలింతల చావుకేకలను ఆపాలని కమిషన్‌ను కోరారు. దీంతో కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో.. నాలుగు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను కోరింది. ఈ విషయాన్ని లీగల్ సర్వీసెస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడు మాదాసు మధుకర్ శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. సాధారణంగా మహిళలు ఫిర్యాదు చేస్తేనే మహిళా కమిషన్ స్పందిస్తుంది. కానీ ఇది ఆదివాసీ మహిళలకు సంబంధించిన విషయం కావడం, ‘సాక్షి’లో ప్రచురించిన కథనం హదయాలను కదిలించేదిగా ఉండడంతో మహిళా కమిషన్ తక్షణమే స్పందించిందని మధుకర్ తెలిపారు. -
4 వారాలు
అణు వ్యతిరేక ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతలో జాప్యాన్ని మద్రాసు హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కేసులు ఎత్తివేయడానికి ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇస్తూ గురువారం మద్రాసు హైకోర్టు ప్రధాన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. సాక్షి, చెన్నై : తిరునల్వేలి జిల్లా కూడంకులంలో అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి వ్యతిరేకంగా మూడేళ్ల పాటు భారీఎత్తున ఉద్యమం సాగింది. నేటికీ కొసాగుతూనే ఉంది. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్రం ఉద్యమకారుల్ని టార్గెట్ చేశారుు. ఉద్యమాన్ని నీరుగార్చడం లక్ష్యంగా తీవ్ర సెక్షన్లతో కేసులు నమోదు చేశాయి. ఈ ఉద్యమంలో అత్యధికంగా సముద్ర తీరాల్లోని జాలర్ల గ్రామాల ప్రజలు పాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరిపై ఏదో ఒక కేసు నమోదు అయింది. ఉద్యమ నేతలపై పదుల సంఖ్యలో కేసులు పెట్టారు. ఎట్టకేలకు ఆ ఉద్యమాన్ని ప్రభుత్వం నీరుగార్చింది. తమ పంతాన్ని నెగ్గించుకునే రీతిలో కూడంకులంలో గత ఏడాది అణు విద్యుత్ ఉత్పత్తి ఆరంభం అయింది. ఉద్యమం చతికిల బడింది. కూడంకులంలో ఏదేని చిన్న పాటి శబ్దం వచ్చినా ఈ ఉద్యమ నేతలు తమ గళాన్ని విప్పడం ఆ తర్వాత మిన్నుకుండిపోవడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో తమ మీద పెట్టిన కేసుల్ని ఎత్తి వేయాలంటూ కోర్టును ఉద్యమకారులు ఆశ్రయించారు. తమతో సాగిన చర్చల్లో కేసుల ఎత్తివేత అంశం ఉందని, అయితే, ఇంత వరకు ఒక్కరిపై కూడా కేసులు ఎత్తి వేయలేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గడువు :కేసుల ఎత్తి వేత ఆదేశాలు వెలువడి నెలలు గడుస్తున్నా, ప్రభుత్వం మాత్రం అందుకు తగ్గ చర్యలు తీసుకోలేదు. దీంతో అణు వ్యతిరేక ఉద్యమకారుల తరపున మళ్లీ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కేసుల ఎత్తి వేతలో జాప్యం జరుగుతోందని, నిర్లక్ష్యం వహిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్ విచారణ గురువారం ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణల నేతృత్వంలోని ప్రధాన బెంచ్ ముందుకు వచ్చింది. వాదనల అనంతరం కేసుల ఎత్తివేత విషయమై నాలుగు వారాల్లోపు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని బెంచ్ ఆదేశించింది. ఇందుకు తగ్గ వివరాల్ని, ఉత్తర్వుల్ని బెంచ్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తదుపరి విచారణను డిసెంబర్ ఐదో తేదీకి వాయిదా వేశారు.