ఎన్టీపీసీ నాలుగో యూనిట్లో అంతరాయం
గోదావరిఖని : కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టులోని 500 మెగావాట్ల నాలుగవ యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. గురువారం యూనిట్లోని బాయిలర్ ట్యూబ్ లీకేజీ ఏర్పడటంతో అధికారులు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. బుధవారం 500 మెగావాట్ల ఐదవ యూనిట్ సైతం సాంకేతిక లోపం ఏర్పడి నిలిచిపోయింది.
రెండు యూనిట్లు నిలిచిపోవడంతో ఎన్టీపీసీలో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రెండు యూనిట్లలో మరమ్మతులు కొనసాగుతున్నాయి. మిగతా యూనిట్లలో సైతం లోడు తగ్గించడంతో ప్రస్తుతం 1,250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నట్లు సమాచారం.