fraudulent SMS
-
జియో యూజర్లకు అలర్ట్.. 42 కోట్ల వినియోగదారులకు మెసేజ్!
ఈ-కేవైసీ మోసాలు, నకిలీ ఎస్సెమ్మెస్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ రిలయన్స్ జియో తన వినియోగదారులను కోరింది. దేశంలోని అతిపెద్ద టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ జియో తన చందాదారులకు పంపిన ఒక మెసేజ్‌లో ఇటీవల దేశంలో ఎక్కువగా జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కొత్త ఏడాది, పండుగుల పేరుతో వచ్చే ఆఫర్స్ లింక్స్ మీద క్లిక్ చేయవద్దు అని తెలిపింది. ఇప్పటికే ఈ ఈ-కేవైసీ మోసాలు, నకిలీ ఎస్సెమ్మెస్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని భారతి ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా మెసేజ్‌లు పంపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ క్రింద పేర్కొన్న విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జియో తన యూజర్లకు సూచిస్తుంది. ► ఈ-కేవైసీ వెరిఫికేషన్ పేరుతో వచ్చే కాల్స్/సందేశాలకు స్పందించవద్దు అని సూచిస్తుంది. వెరిఫికేషన్ కోసం ఏదైనా నెంబరుకు కాల్ చేయమని మిమ్మల్ని అడిగే ఆ మోసపూరిత సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలుపుతుంది. ► కేవైసీ /ఆధార్ వివరాలను అప్డేట్ చేయడానికి జియో కస్టమర్లు ఎలాంటి యాప్ డౌన్లోడ్ చేసుకోవద్దని కోరింది. అటువంటి వాటి కోసం ఏదైనా థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేసుకోమని జియో మిమ్మల్ని ఎన్నడూ అడగదని పేర్కొంది. ఇలాంటి థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేయడం వల్ల మోసగాళ్ళు మీ ఫోన్లోని మొత్తం సమాచారాన్ని యాక్సెస్ చేసుకుంటారు అని పేర్కొంది. ► సైబర్ మోసానికి సంబంధించిన ఇటీవలి కొన్ని కేసుల్లో మోసగాళ్ళు తమను తాము జియో ప్రతినిధులుగా పేర్కొంటున్నారని తెలిపింది. అలాగే, చందాదారుల ఆధార్, బ్యాంకు ఖాతాలు మొదలైన వాటికి సంబంధించిన సమాచారాన్ని ఈ-కేవైసీ పేరుతో అడుగుతున్నారని, అలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఈ-కేవైసీ పేరుతో వచ్చే ఎస్ఎమ్ఎస్/కాల్స్ ను ఏవీ నమ్మవద్దని టెల్కో వినియోగదారులను కోరింది. ► ఈ-కేవైసీ పేరుతో వచ్చే ఎస్ఎమ్ఎస్‌లలో ఉన్న నెంబర్లను తిరిగి కాల్ చేయవద్దని కస్టమర్లకు పేర్కొంది. ► జియో ప్రతినిధి అని చెప్పుకునే కాలర్లు పంపే లింక్స్, అటాచ్ మెంట్లపై క్లిక్ చేయవద్దని జియో కస్టమర్లకు సూచిస్తుంది. ► మైజియో యాప్‌లో మీకు సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకోవచ్చు గనుక తృతీయపక్ష యాప్‌లను డౌన్లోడ్ చేసుకోమని వినియోగారులను ఎన్నడూ అడగాల్సిన అవసరం లేదని కంపెనీ పేర్కొంది. (చదవండి: చిక్కుల్లో సుందర్ పిచాయ్...! అదే జరిగితే..?) -
చిన్న తప్పుకు భారీ మూల్యం చెల్లించుకున్న వొడాఫోన్ ఐడియా
జైపూర్: డాక్యుమెంట్లను సరిగ్గా ధృవీకరించకుండా టెలికాం కంపెనీ వేరే వ్యక్తి మొబైల్ నంబర్‌ను మరో వ్యక్తికి జారీ చేయడంతో రూ.27,53,183 పరిహారం చెల్లించాలని రాజస్థాన్ ప్రభుత్వ ఐటీ శాఖ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ను ఆదేశించింది. అయితే, పాత వ్యక్తి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉన్న బ్యాంక్ ఖాతాకు ఈ నెంబర్ లింకు చేసింది. దీంతో కొత్త సిమ్ తీసుకున్న వ్యక్తి మొదటి కస్టమర్ ఖాతా నుంచి రూ.68 లక్షలు విత్ డ్రా చేశాడు. సరైన వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండా వొడాఫోన్ ఐడియా జారీ చేసిన డూప్లికేట్ సిమ్ కార్డు వల్ల ఇదంతా జరిగింది అని మొదటి వ్యక్తి ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో ఈ విషయం బయట పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మే 2017లో కృష్ణ లాల్ నైన్ అనే వొడాఫోన్ ఐడియా యూజర్ మొబైల్ నంబర్ అనుకోకుండా ఒక్కసారిగా పనిచేయడం ఆగిపోయింది. ఆ తర్వాత అతను హనుమాన్ ఘర్ లో ఫిర్యాదు చేశాడు. అయితే, అతనికి కొత్త సిమ్ అయితే వచ్చింది కానీ, అది యాక్టివ్ కాలేదు. మళ్లీ అతను ఈ విషయం గురించి జైపూర్ వొడాఫోన్ ఐడియా స్టోర్ కు వెళ్లి నంబర్ యాక్టివేట్ చేసుకున్నాడు. అప్పటికే ఐదు రోజులు గడిచాయి. ఈ మధ్య కాలంలో అదే నెంబర్ తో వేరే సిమ్ ఇంకొక కస్టమరుకు బదిలీ చేశారు. దీంతో ఆ కస్టమరు ఈ నెంబర్ సహాయంతో డబ్బును అక్రమంగా బదిలీ చేశారు. (చదవండి: బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ అలర్ట్!) అయితే, కృష్ణ లాల్ అనే వ్యక్తి తన మొబైల్ నెంబరు యాక్టివేట్ చేసినప్పుడు డబ్బు బదిలీ గురించి మెసేజ్ రావడంతో తర్వాత అతను ఎఫ్ఐఆర్ దాఖలు చేశాడు. పోలీసులు నిందితులను పట్టుకొని ఫిర్యాదుదారుడికి రూ.44 లక్షలు తిరిగి ఇప్పించారు. కానీ, మిగతా రూ.27.5 లక్షలు చెల్లించలేదు. దీంతో న్యాయనిర్ణేత అధికారి వొడాఫోన్ ఐడియాను దోషిగా నిర్ధారించారు. కృష్ణ లాల్ కు ఈ మొత్తాన్ని చెల్లించాలని సంస్థను ఆదేశించారు. "వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతాలో రూ.27,53,183ను ఒక నెలలోగా డిపాజిట్ చేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో వార్షికానికి 10 శాతం చక్రవడ్డీతో చెల్లించాలని" ఆర్డర్ పేర్కొంది. ఐటీ శాఖ న్యాయనిర్ణేత అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ అలోక్ గుప్తా సెప్టెంబర్ 6న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. చెల్లింపు చేసేందుకు టెల్కోలకు ఒక నెల సమయం ఇచ్చారు. అయితే, ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు బ్యాంక్ ఖాతాదారులను హెచ్చరిస్తున్నారు. -
పాకిస్తాన్ సంస్థ ద్వారా ఇన్వెస్టర్లకు టోపీ
గుట్టువిప్పిన సెబీ ముంబై: పాకిస్తాన్లో రిజిష్టర్ అయిన ఒక సంస్థ ఇచ్చిన మోసపూరిత ఎస్ఎంఎస్లతో భారత్ స్టాక్మార్కెట్లో ఇన్వెస్టర్లు దెబ్బతిన్న ఉదంతమిది. ఇది బట్టబయిలుకావడంతో మార్కెట్ నియంత్రణా సంస్థ ఇక్కడ లిస్టయిన ధాన్యా ఫిన్‌స్టాక్ కంపెనీతో పాటు మరో 75 మందిని మార్కెట్ కార్యకలాపాల నుంచి నిషేధించింది. బీఎస్ఈని తలపింపచేలా ‘బీఎస్ఈబుల్.ఇన్’ అనే పేరుపెట్టుకున్న పాక్ సంస్థ ధాన్యా ఫిన్స్టాక్ను కొనమంటూ ఇక్కడి ఇన్వెస్టర్లకు సిఫార్సు ఎస్ఎంఎస్లు ఇచ్చింది. స్వయంగా బీఎస్ఈ నుంచే ఈ మెసేజ్‌లు వచ్చాయన్న విశ్వాసంతో గతేడాది జూలై 27న పలువురు ఇన్వెస్టర్లు ధాన్యా ఫిన్స్టాక్ను కొనుగోలుచేశారు. అంతకుముందే ఆ కంపెనీ నుంచి ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా పొందిన షేర్లను ఆ కంపెనీ యాజమాన్యానికి చెందినవారు విక్రయించేశారు. దాదాపు రూ. 5 కోట్ల పెట్టుబడితో పొందిన షేర్లను రూ. 107 కోట్లకు విక్రయించారు. ఆ రోజు కొన్న ఇన్వెస్టర్లు మరునాడు ఆ షేర్లను తిరిగి అమ్మడానికి ప్రయత్నిస్తే దాని ధర పతనమైపోయింది.