free group calling
-
హైక్ ఉచిత గ్రూప్ కాలింగ్
న్యూఢిల్లీ: హైక్ మెసెంజర్ వినియోగదారులకు ఉచిత గ్రూప్ కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లలో 4జీ లేక వై-ఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించే వారికి మాత్రమే ఈ ఉచిత గ్రూప్ కాలింగ్ ఫీచర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. త్వరలోనే ఓఎస్, విండోస్ ఫోన్లకు కూడా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది. ఉచిత గ్రూప్ కాలింగ్‌లో ఒకే కాల్‌తో 100 మంది వరకు కనెక్ట్ కావచ్చని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో కవిన్ మిట్టల్ తెలిపారు. -
ఒకే కాల్లో వందమందితో..
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక వేదిక హైక్ మెస్సెంజర్ సరికొత్త అవకాశాన్ని మొబైల్ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటివరకు మెస్సేంజర్గా పనిచేసిన హైక్.. తాజాగా ఉచిత గ్రూప్ కాల్ కూడా చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించింది. ఒకే ఒక్క కాల్‌తో ఏకంగా ఒకే సారి వందమందితో ఉచితంగా మాట్లాడే అవకాశం కల్పిస్తూ సేవలు ప్రారంభించింది. హైక్ మెస్సేంజర్ యజమాని టెలికాం దిగ్గజం సునీల్ మిట్టల్ తనయుడు కెవిన్ మిట్టల్ శుక్రవారం ఈ కొత్త సదుపాయం ప్రారంభించారు. ప్రస్తుతానికి 4జీ, వైఫై ద్వారా ఈ సౌకర్యాన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకు అందిస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికల్లా ఐవోఎస్, విండోస్ ఫోన్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.