free medical tests
-
హైదరాబాదీలకు గుడ్ న్యూస్; అందుబాటులోకి ఉచిత వైద్య పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పేదలకు ఉచిత వైద్య పరీక్షలు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో టీ డయాగ్నస్టిక్స్ మినీ హబ్‌ల పేరిట రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నెలకొల్పుతున్న వైద్య పరీక్షల కేంద్రాలు నగరంలో మరో 10 ఏర్పాటయ్యాయి. ఇప్పటికే సేవలందిస్తున్న 8 మినీ హబ్‌లు కొన్ని ప్రాంతాలకే అందుబాటులో ఉండడం వల్ల మరో 10 కొత్తగా నెలకొల్పారు. ఇప్పటికే 319 బస్తీ దవాఖానాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో, ఏరియా ఆస్పత్రుల్లో, జిల్లా ఆస్పత్రుల వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి సేవలు అందిస్తుండగా కొత్తగా ఏర్పాటైన వాటిని 151 పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, ఉపకేంద్రాలు, బస్తీ దవాఖానాల పరిధిలో రోగులు వినియోగించుకోనున్నారు. ఎక్కడికక్కడే.. వైద్య పరీక్షల అవసరాల కోసం కొందరు ప్రైవేట్ ల్యాబ్‌ల మీదా మరికొందరు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రి వంటి పెద్దాస్పత్రుల మీద ఆధారపడే పరిస్థితిని నివారించడానికి ఇవి అందుబాటులోకి తెచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన రోగులను అవసరాన్ని బట్టి వైద్య పరీక్షల కోసం ఈ మినీ హబ్‌లకు సిఫారసు చేస్తారు. ఇక్కడ అల్ట్రాసోనోగ్రఫీ, రేడియోలజీ, రక్తపోటు అనాలసిస్, ఎక్స్‌రే, ఎమ్ఆర్ఐ, సీటీ స్కాన్లు, ఈసీజీ, రేడియాలజీ తదితర సౌకర్యాలు ఉచితంగా వినియోగించుకోవచ్చు. (క్లిక్: 3 నెలల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి) కొత్త మినీ హబ్స్ అమీర్‌పేట్, శేరిలింగంపల్లి, అల్వాల్, కుషాయిగూడ, పటాన్ చెరు, మలక్‌పేట్, హయత్‌నగర్, రాజేంద్ర నగర్, గోల్కొండ, నార్సింగి ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. వీటిలో నార్సింగ్‌లో మినీహబ్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు లాంఛనంగా బుధవారం ప్రారంభించగా, మిగిలిన వాటిని వేర్వేరు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. (క్లిక్: వాహనదారులపై భారీగా పెరిగిన జీవిత కాలం పన్ను) -
వైద్యులకు మెడల్‌పై కత్తి?
విజయనగరంఫోర్ట్: ప్రైవేటు సంస్థకు లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వం వైద్యులపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వం ఇటీవల ఎన్టీఆర్ ఉచిత వైద్య పరీక్షలు పథకాన్ని చేపట్టింది. ఈపథకం నిర్వహణను మెడాల్ సంస్థకు అప్పగిచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రు లకు వచ్చే రోగులకు ఉచిత వైద్య పరీక్షలు చేయాలన్నది పథక ఉద్దేశ్యం. జిల్లా ఆస్పత్రిలో 44 రకాలు, సీహెచ్‌సీలో 22 రకాలు, పీహెచ్సీలో 15 రకాలు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఒక రోగికి రూ.236 చెల్లిస్తున్న ప్రభుత్వం ఒక రోగికి వైద్య పరీక్షలు చేయడానికి మెడాల్ సంస్థకు ప్రభుత్వం రూ.236 చెల్లిస్తుంది. అది ఒక టెస్టు అయినా, 10 టెస్టులకు అయినా రూ.236 చెల్లించాల్సిందే. మెడాల్‌కే అధిక పరీక్షలు రాయాలని ఒత్తిడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అవసరమైన వైద్యపరీక్షలు చాలా వరకు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రాస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రిల్లో అయితే మెడాల్ సంస్థ చేస్తున్న టెస్టుల్లో ఒకటి రెండు మినహా అన్ని వైద్య పరీక్షలు ఉన్నాయి. దీంతో వైద్యులు ప్రభుత్వ ల్యాబొరేటరీకి వైద్య పరీక్షలు రాస్తున్నారు. ఇది రుచించని మెడాల్ సంస్థ నిర్వాహకులు వైద్య విధాన్ పరిషత్, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఉన్నతాధికారులు మెడాల్ సంస్థకు వైద్య పరీక్షలు రాయాలని ఒత్తిడి చేస్తున్నట్లు భోగట్టా.అసవరం లేకుండా పరీక్షలు ఏవిధంగా రాయగలమని కొంతమంది వైద్యులు ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. అదంతా తెలియదు వైద్య పరీక్షలు ఆ సంస్థకు రాయాల్సిందేనని వైద్యులను గట్టిగా హెచ్చరించినట్టు భోగట్టా. దీంతో తమకు ఎందుకొచ్చిన తంటా అని వైద్యులు వైద్య పరీక్షలు రాసేద్దామని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని వైద్యులు భయపడుతున్నారు. ప్రచారమే తప్ప ప్రయోజనం చూడని ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య పరీక్షలు పథకాన్ని ప్రవేశపెట్టాం. రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నామని ప్రచారం చేసుకోవడం తప్ప, ప్రైవేటు సంస్థకు అప్పగించడం వల్ల ఎంత ప్రయోజనం చేకూరుతుందనేది ప్రభుత్వం అలోచించడం లేదు. మెడాల్ సంస్థ చేస్తున్న వైద్య పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేసే సిబ్బంది, పరికరాలు కూడా ఉన్నాయి. ల్యాబొరేటరీలను ఒకరిద్దరు సిబ్బందిని నియమించుకుంటే సరిపోతుంది. కానీ ఇటువంటి ప్రయోజనాలను గుర్తించకుండా ప్రైవేటు సంస్థలకు లబ్ధిచేకూర్చేవిధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోం దనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెడాల్‌కు వైద్య పరీక్షలు రాయాలని ఒత్తిడి తెస్తున్నారట కదా అని డీసీహెచ్ఎస్ కె.సీతారామరాజు వద్ద సాక్షి ప్రస్తావించగా నో కామెంట్ అని బదులివ్వడం విశేషం. -
ఉద్యోగులకు ఉచిత వైద్యపరీక్షలు
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం.. త్వరలో జీవో సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. నిమ్స్ సహా రాష్ట్రంలోని ప్రభుత్వ, బోధనాసుపత్రులన్నింటిలోనూ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన జీవో త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 3.97 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు మేలు కలుగుతుంది. ప్రస్తుతం ఉద్యోగులకు ప్రభుత్వ, బోధనాసుపత్రుల్లో ఔట్ పేషెంటు(ఓపీ) ఫీజు వసూలు చేయడంలేదు. నిమ్స్‌లో మాత్రం రూ.60 వసూలు చేస్తున్నారు. ఇక నుంచి నిమ్స్‌లో కూడా ఓపీ ఫీజును ఎత్తివేయాలని సర్కారు నిర్ణయించింది. జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులు, నిమ్స్, ఉస్మానియా, నీలోఫర్ తదితర ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించడానికి వెసులుబాటు కల్పిస్తోంది. ఉద్యోగులందరికీ ఆరోగ్యకార్డులు ఇచ్చినా ముఖ్యమైన కార్పొరేట్ ఆసుపత్రులు ప్రస్తుతం ఉన్న ప్యాకేజీపై శస్త్రచికిత్సలు చేయడానికి నిరాకరిస్తున్నాయి. పైగా అక్కడ వైద్య పరీక్షలకు డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తే ఉద్యోగులను ప్రభుత్వ ఆసుపత్రుల వైపు ఆకర్షించవచ్చని సర్కారు ఆలోచన. ప్రస్తుతం కార్పొరేట్‌స్థాయిలో ఉన్న నిమ్స్ తరహాలోనే గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులను తీర్చిదిద్దేందుకు అత్యాధునిక ల్యాబ్, వైద్య పరీక్షలకు సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. -
శుభ పరిణామం
నల్లగొండ టౌన్ :జిల్లాలో గత ఐదేళ్లలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. ఎయిడ్స్ నివారణ కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎయిడ్స్ నివారణ సంస చేపట్టిన శుభంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏటా హెచ్ఐవీ పరీక్షల సంఖ్య పెరుగుతున్నా పాజిటివ్ కేసుల సంఖ్య ఏటేటా తగ్గుతూ రావడం శుభపరిణామంగా వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా పీపీటీసీటీలు 5, ఐసీటీసీలు 14, ఎఫ్ఐఐసీటీసీలు 37, పీపీపీలు 11, మొబైల్ ఐసీటీసీ 1సెంటర్‌తో పాటు మొత్తం 68 సెంటర్లలో హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని హెడ్‌క్వార్టర్ ఆస్పత్రిలో ఏఆర్టీ సెంటర్, అదే విధంగా భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేట ఏరియా ఆస్పత్రుల్లో మూడు లింక్డ్ ఏఆర్టీ సెంటర్లు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా హెచ్ఐవీ పాజిటివ్ బాధితులకు ఉచితంగా వైద్య పరీక్షలు , గ్రూప్, వ్యక్తిగత కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు అందజేస్తున్నారు. దీంతో పాటు ఏఆర్టీ సెంటర్లో సీడీ-4 కౌంట్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. పరీక్షలు ఇలా.. జిల్లాలోని 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఫిసిలిటీ ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్అండ్ టెస్టింగ్ సెంటర్(ఎఫ్‌ఐసీటీసీ)లు, జిల్లాలోని 11 ప్రైవేటు ఆస్పత్రులలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సెంటర్(పీపీపీ)లు ఉన్నాయి. ఈ కేంద్రాలలో గర్భిణులు, సామాన్య ప్రజ లు, ప్రమాదకర ప్రవర్తన కలిగిన వ్యక్తులకు ఉచితంగా హెచ్ఐవీ పరీక్షలు పరీక్ష లు నిర్వహిస్తున్నారు. అలాగే హెచ్ఐవీ పాజిటీవ్ కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. అవగాహన కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ప్రస్తుతం హెచ్ఐవీ పాజి టివ్ కేసుల నమోదు సంఖ్య తగ్గింది. ఐసీటీసీలతో పాటు మిగతా సెంటర్లలో ఉచితంగా హెచ్ఐవీ పరీక్షలను నిర్వహించి పాజిటివ్ అని తేలితే వారిని జిల్లా కేంద్రంలోని ఏఆర్టీ సెంటర్‌కు పంపిస్తారు. ఏఆర్టీ సెంటర్లోని వైద్యాధికారులు వారికి ఉచితంగా సీడీ-4 కౌంట్ పరీక్షలతో పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అలాగే అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని ఏఆర్టీ సెంటర్లో సీడీ-4 కౌంట్ పరీక్షలను నిర్వహించి 250 కంటే సీడీ-4 కణాలు తక్కువ ఉన్నవారికి ఎన్ఎన్ఆర్టీఐ, ఎన్ఆర్టీఐ మందులను అందజేస్తూ వారిని పరిశీలన, సంరక్షణ, కౌన్సెలింగ్ కోసం జిల్లాలోని మూడు ఆదరణ సంరక్షణ కేంద్రాలకు పంపిస్తున్నారు. ఏఆర్టీ మందులను క్రమం తప్పకుండా ఆరు నెలల పాటు మందులు వాడుతున్న వ్యక్తులకు వారి దగ్గరలోని లింక్డ్ ఏఆర్టీ సెంటర్లకు పంపించి మందులను ఉచితంగా అందజేస్తున్నారు. ఏఆర్టీ సెంటర్లలో క్రమతప్పకుండా వాడిన వేలాది మంది హెచ్ఐవీ పాజిటివ్ బాధితుల్లో సీడీ-4, బరువులో పెరుగుదల లేని వారిని వైద్యులు , కౌన్సిలర్లు పరీక్షించి సెకండ్‌లైన్ మందుల కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పిత్రికి పంపిస్తారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా నల్లగొండ యూత్ పాజిటివ్ సొసైటీ, ఇతర స్వచ్ఛంద సంస్థలు, జిల్లా ఎయిడ్స్ నివారణ సంస్థ ఆధ్వర్యంలో విరివిగా అవగాహన కల్పించడంతో హెచ్ఐవీ పాజిటివ్ కేసుల నమోదు తగ్గుతూ వస్తుంది. జిల్లాలో హెచ్ఐవీ పాజిటివ్ కేసుల నమోదు వివరాలు సంవత్సరం పరీక్షల సంఖ్య పాజిటివ్ కేసులు శాతం 2002-03 4066 386 9.05 2003-04 8919 689 7.73 2004-05 14875 1017 6.84 2005-06 19571 1473 7.53 2006-07 32557 2164 6.65 2007-08 39003 2519 6.46 2008-09 48925 2821 5.77 2009-10 59345 2670 4.50 2010 -11 77042 2537 3.29 2011-12 101930 2300 2.26 2012-13 106221 2013 1.90 2013-14మార్చి వరకు 91368 1682 1.90