Free tests
-
మహిళలను వెంటాడుతున్న రొమ్ము క్యాన్సర్
మహిళలను రొమ్ము క్యాన్సర్ వెంటాడుతోంది.. ఒకప్పుడు 45 ఏళ్లు నిండిన వారిపైనే అధికంగా ఈ మహమ్మారి దాడి చేసేంది. ఇప్పుడు యుక్త వయసులోని అతివలను సైతం భయకంపితులను చేస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలనే కబళిస్తోంది. ఈ క్రమంలో ఆడపడుచుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కార్యాచరణ అమలు చేస్తోంది. అవగాహనతోనే నివారణ సాధ్యమనే నినాదంతో సదస్సులు నిర్వహిస్తోంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద క్షేత్రస్థాయిలో అనుమానితులను గుర్తిస్తోంది. ఏరియా ఆస్పత్రుల్లో ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తోంది. రోగులకు సకాలంలో అత్యుత్తమ చికిత్సలు అందిస్తోంది. చిత్తూరు రూరల్ : బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. అలాగే జిల్లాలోని అన్ని ఏరియా ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ పరీక్ష కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉచితంగా పరీక్షలు, చికిత్సలు చేయిస్తోంది. త్వరలో అన్ని సీహెచ్‌సీలో సైతం సీ్క్రనింగ్ టెస్ట్ సెంటర్లను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా.. గతంలో 45ఏళ్లు దాటిన వారిలోనే బ్రెస్ట్ క్యాన్సర్ కనిపించేంది. ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా సోకుతోంది. పాశ్చాత్య దేశాల్ల 50 ఏళ్లు నిండి తర్వాతే పలువురు క్యాన్సర్ బారిన పడుతుండగా, మన దేవంలో 40 ఏళ్లు దాటిన వారిలో సైతం అధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కోసారి 30ఏళ్ల వారిలోనూ, కొందరు పురుషుల్లో సైతం క్యాన్సర్ బయటపడుతోంది. జిల్లాలో సుమారు 2,211 మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్‌ను సెల్ఫ్ చెక్ చేసుకోవడం ద్వారా కూడా కనిపెట్టవచ్చని తెలియజేస్తున్నారు. తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే చికిత్స సులువుగా ఉంటుందని వివరిస్తున్నారు. ముందుగా క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించుకుంటే గుర్తించడం సులభతరంగా మారుతుందని, తద్వారా నివారణకు అవకాశముంటుందని వివరిస్తున్నారు. ఎక్కువ మంది మహిళలకు దీనిపై అవగాహన లేకపోవడం వల్లే రెండు, మూడు దశల వరకు క్యాన్సర్ గుర్తించలేకపోతున్నారని చెబుతున్నారు. సకాలంలో వ్యాధిని కనిపెడితే వెంటనే చికిత్స ప్రారంభించి ప్రాణాలను కాపాడవచ్చని వెల్లడిస్తున్నారు. ‘ఫ్యామిలీ డాక్టర్’తో మేలు గ్రామీణ ప్రాంత మహిళలకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వరంలా మారింది. ప్రతి 15 రోజులకు ఒకసారి గ్రామానికే వైద్యులు వెళ్లడం, జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా స్పెషలిస్టు డాక్టర్లు సైతం అందుబాటులోకి వస్తుండడంతో గ్రామీణ మహిళలు హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు. ఆయా శిబిరాల్లో మహిళలకు ప్రత్యేక పరీక్షలు చేస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ లక్ష ణాలు ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే మమోగ్రామ్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పెద్దసంఖ్యలో మహిళలకు ప్రాథమిక దశలోనే క్యాన్సర్ గుర్తించారు. అంతేకాదు శస్త్ర చికిత్స తర్వాత కూడా వారికి వైద్య పరీక్షలు చేస్తూ మందులు అందజేస్తున్నారు. సెల్ఫ్ చెక్ ఇలా ► రుతుస్రావం వచ్చి, ఆగిన ఐదు రోజుల తర్వాత బ్రెస్ట్ చెక్ చేసుకోవాలి ► రొమ్ముపై గింజంత సైజులో కణితులు ఏమైనా వచ్చాయా, చర్మం రంగు మారిందేమో పరిశీలించుకోవాలి ► చంకల్లో గడ్డలు ఏర్పడ్డాయా అనే విషయాలను గమనించాలి ► రొమ్ము టైట్ అవుతోందా, అల్సర్స్ వచ్చాయా, చనుమొనల నుంచి రక్తం కారుతోందా వంటి అంశాలను చెక్ చేసుకోవాలి ► నొప్పిలేని కణితులను క్యాన్సర్‌గా భావించి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలి. కారణాలు అనేకం మహిళలల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చేందుకు అనేక కారణాలు ఉన్నాయి. లేట వయసులో పిల్లలు పుట్టినవారు, బిడ్డకు పాలివ్వని తల్లులు, వంశపారంపర్యంగా కొందరికి, పన్నెండేళ్లోపు రజస్వల అయినవారు, రెడ్‌మీట్ అధికంగా తినేవారు, ఎక్కువ సమయంల కూర్చుని పనిచేసేవారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఊబ కాయంతో ఉన్న మహిళలు, మెనోపాజ్ చేరే సమయంలో వచ్చే దుష్ఫలితాలకు వాడే మందులు కారణంగా ఈ మహమ్మారి బారిన పడవచ్చు. అలాగే వివాహం కాని మహిళలు,, సంతానం లేని వారు, ధూమపానం, ఆల్కాహాల్ తాగే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. – శిల్ప, సీ్త్ర వైద్య నిపుణులు, చిత్తూరు ప్రత్యేక దృష్టి ఫ్యామిలీ డాక్టర్ కింద కమ్యూనికల్ డిసీజెస్‌పై ప్రత్యేకంగా దష్టి సారించాం. అందులో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి లక్ష ణాలున్న వారిని గుర్తించి స్క్రీనింగ్ చేస్తున్నాం. అలాగే ఆయా వ్యాధులతో చికిత్స పొందుతున్న వారిని సైతం మానిటరింగ్ చేసి మందులు అందిస్తున్నాం. రొమ్ముపై కణితులు, గడ్డలు ఉన్న మహిళలు వస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నాం. ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని పరీక్షలను ఉచితంగానే చేస్తున్నాం. – అమర్నాథ్, ఏసీడీ విభాగం వైద్యాధికారి, చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రి -
‘వారికి మాత్రమే కరోనా టెస్టులు ఉచితం’
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను నిర్ధారించే పరీక్షలను పేదలకు మాత్రమే ఉచితంగా అందుబాటులో ఉంచాలని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. ఈ ప్రయోజనం ఎవరు పొందాలో ప్రభుత్వమే నిర్ణయించాలని పేర్కొంది. కోవిడ్-19 ఉచిత పరీక్షలు అందరికీ చేపట్టాలని గతవారం సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. అందరికీ ఉచిత పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రైవేట్ లేబొరేటరీలు పేర్కొనడంతో సర్వోన్నత న్యాయస్ధానం తన నిర్ణయం మార్చుకుంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద అర్హులైన వారికి, ప్రభుత్వం గుర్తించిన ఇతర ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి కోవిడ్-19 పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని కోర్టు సోమవారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అసంఘటిత కార్మికుల్లో అల్పాదాయ వర్గాల వారు, పత్ర్యక్ష నగదు బదిలీ లబ్ధిదారులు వంటి ఇతరులకూ ఉచిత పరీక్షలను వర్తింపచేయడంపై ప్రభుత్వం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. చదవండి : ఈ పరిస్థితుల్లో అలా ఆదేశించలేం: సుప్రీంకోర్టు -
ఉచితంగా కరోనా పరీక్షలు
న్యూఢిల్లీ: అనుమతి పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ లేబోరేటరీల్లో ప్రజలకు కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. ఈ విషయంలో వెంటనే తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటళ్లు, ల్యాబ్‌ల పాత్ర అత్యంత కీలకమని, ప్రజలకు సేవలందించడంలో దాతృత్వం చూపాలని వ్యాఖ్యానించింది. కరోనా పరీక్షలను ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్‌లు, డబ్ల్యూహెచ్‌వో/ఐసీఎం ఆర్ అనుమతి పొందిన ల్యాబ్‌ల్లోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షల పేరిట విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని, దీన్ని అరికట్టాలని కోరుతూ అడ్వొకేట్ శశాంక్‌దేవ్ సుధీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలకు ప్రజల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దోపిడీని అరికట్టాలని సూచించింది. నిర్దేశించిన దానికంటే అధికంగా వసూలు చేయకుండా చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రైవేట్ ల్యాబ్‌లు తీసుకున్న సొమ్మును ప్రజలకు ప్రభుత్వం రీయింబర్స్ చేయాలని సూచించింది. -
స్వైన్‌ఫ్లూకు ‘ప్రైవేట్’లో ఉచిత సేవలు
* ఉచితంగా పరీక్షలు, మందులు ఇవ్వాలని సర్కారు నిర్ణయం * అనుమానితులకు తక్షణమే చికిత్స అందించాలని ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ, డెంగీ జ్వరాలు నగరవాసులను బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో స్వైన్‌ఫ్లూ చికిత్స కోసం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరే రోగులకు ఉచితంగా పరీక్షలు, మందులు అందజేయాలని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశించింది. స్వైన్‌ఫ్లూ అనుమానితులకు రక్తపరీక్షలు చేసే వరకు ఆగకుండా వెంటనే చికిత్స ప్రారంభించాలని సూచించింది. ‘స్వైన్‌ఫ్లూ పరీక్షలను తప్పనిసరిగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)లోనే చేయించాలి. ఈ పరీక్షలన్నింటినీ ఉచితంగానే నిర్వహిస్తారు. అవసరమైన మందులను ప్రభుత్వమే ఉచితంగా ఇస్తున్నందున కార్పొరేట్ ఆసుపత్రులు ఉచితంగా ఇవ్వాలి’ అని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది స్వైన్‌ఫ్లూ రోగులను ప్రైవేట్ ఆసుపత్రులు నిలువు దోపిడీ చేయడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. స్వైన్ ఫ్లూ పరీక్ష చేయాలంటే రూ. 3,500 ఖర్చు అవుతుండడంతో ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వమే ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తోంది. ఐపీఎంలో పరీక్ష చేసినట్లుగా ఇచ్చిన పత్రాలను కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందజేసి స్వైన్‌ఫ్లూ బాధితులు ఉచిత వైద్యం పొందవచ్చని సూచించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహించే ఇతరత్రా వైద్య చికిత్సలతో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆదివారాలు, సెలవుల్లోనూ ఐపీఎంలో పరీక్షలు ఐపీఎంను ఆదివారాలు, సెలవుల్లోనూ ఒకపూట తెరిచి ఉంచాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. స్వైన్‌ఫ్లూ బాధితులకు హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్, అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. బోధనాసుపత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలలో ఇప్పటివరకు 25 మందికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయిందని, ఇద్దరు చనిపోయారని వివరించారు. స్వైన్‌ఫ్లూ బారిన పడకుండా ప్రజలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. జ్వరపీడితులు జనసమ్మర్థంలోకి రాకూడదని, కరచాలనం చేయొద్దని, తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. రామంతాపూర్‌లోని హోమియో ఆసుపత్రిలోనూ హోమియో మందులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయన్నారు. -
పేదలకు ఉచిత వైద్యపరీక్షలు
బీపీఎల్లకు వర్తింపజేసే యోచనలో కేంద్రం ఉచిత మందులు కూడా పీడీఎస్‌లో సంస్కరణల దిశగా న్యూఢిల్లీ: ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్)లో సంస్కరణలు చేపట్టి, పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రకటించాలని కేంద్రం భావిస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న పేదలకు స్పెషాలిటీ ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత పరీక్షలు, మందులు ఇవ్వాలని యోచిస్తోంది. అలాగే ఆదాయ పన్ను చెల్లించేవారిని, ఉన్నతాధికారులను పీడీఎస్ పరిధి నుంచి మినహాయించే దిశగా ఆలోచనలు చేస్తోంది. ‘సంక్షేమ పథకాలను నిజమైన లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. బీపీఎల్ కేటగిరీలో ఉన్నవారికి రేషన్ కార్డుల ఆధారంగా ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత వైద్య పరీక్షలు, మందులు ఇవ్వాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి’ అని ఆహార మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ పీటీఐకి చెప్పారు. పేదలకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పథకంపై రాష్ట్రాలను సంప్రదిస్తామన్నారు. . ఆహార భద్రత చట్టంపై చిన్నచూపు లేదు గత యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆహార భద్రత చట్టంపై మోదీ ప్రభుత్వం చిన్నచూపు చూపుతోందని వస్తున్న ఆరోపణలను మంత్రి పాశ్వాన్ తోసిపుచ్చారు. ఆ చట్టం అమలుకు తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. ‘ప్రస్తుతం ఈ చట్టాన్ని 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అందులో హర్యానా, రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలు పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నాయి’ అని తెలిపారు.