కల్పన కాదు : తొలి తేలియాడే నగరం రాబోతోంది..!
ఫ్రెంచ్ పాలినేసియా : ఇది కాల్పనికత కాదు. నిజమే. త్వరలోనే ప్రపంచం తొలి తేలియాడే నగరాన్ని చూడబోతోంది. ఫ్రెంచ్ పాలినేసియా సముద్ర తీరంలో తేలియాడే నగరాన్ని నిర్మించేందుకు ఓ స్వచ్చంధ సంస్థ నడుంబిగించింది. ఇందుకోసం ఓ నిపుణుల బృందం ప్రొటోటైప్‌ను తయారు చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది. సముద్ర జలాలు పెరుగుతున్న నేపథ్యంలో తేలియాడే నగర నిర్మాణం మానవ జాతి మనుగడకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
సీస్టెడింగ్ ఇనిస్టిట్యూట్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ తేలియాడే నగర నిర్మణానికి అయ్యే ఖర్చును భరించనుంది. ఫ్రెంచ్ పాలినేసియా ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చింది. 2020 కల్లా 12 నిర్మాణాలతో తేలియాడే నగరాన్ని నిర్మించాలనే వ్యూహాన్ని సీస్టెడింగ సిద్ధం చేసింది. ఇందుకు ఆరో కోట్ల డాలర్లు ఖర్చు చేయనుంది.
నగర నిర్మాణంలో వెదురు, సాధారణ చెక్క, కొబ్బరి పీచు, మెటల్, ప్లాస్టిక్‌లను వినియోగించనున్నారు. 2050 కల్లా ఇలాంటి తేలియాడే నగరాలు వేలల్లో నిర్మితమవుతాయని, వాటికి ఫ్రెంచ్ పాలినేసియా నిర్మిస్తున్న తేలియాడే నగరమే నాంది కాబోతోందని ఆ దేశాధ్యక్షుడు క్విర్క్ అన్నారు.