Fukushima nuclear plant
-
అణుజలం.. ఆందోళన స్వరం
జపాన్‌లో 12 ఏళ్ల క్రితం భూకంపం, సునామీ ధాటికి దెబ్బతిన్న ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రం నుంచి వ్యర్థ జలాలను çపసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేయడం ఆందోళన రేపుతోంది. చైనా, దక్షిణ కొరియాతో పాటు స్వదేశంలో కొన్ని సంస్థల అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ జపాన్ ప్రభుత్వం రేడియో ధార్మిక జలాలను విడుదల చేస్తోంది. ఈ నీటి విడుదల ఎంతవరకు సురక్షితం ? జపాన్ వాదనలేంటి ? నిపుణులు ఏమంటున్నారు ? ఫుకుషిమా ప్లాంట్ నుంచి పసిఫిక్ సముద్రంలోకి వ్యర్థ జలాల విడుదల వివాదాస్పదం 2011, మార్చి 11. జపాన్ను తీవ్ర భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 9.0గా నమోదైన ఈ తీవ్ర భూకంపంతో సునామీ ముంచెత్తింది. చెర్నోబిల్ అణు ప్రమాదం తర్వాత అంతటి విధ్వంసం జరిగింది. ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్‌లోని మూడు అణు రియాక్టర్లలోని కూలింగ్ వ్యవస్థలు దెబ్బ తిన్నాయి. దీంతో అణు రియాక్టర్లను చల్లార్చడం తప్పనిసరి అయింది. అప్పట్నుంచి భారీగా అణు వ్యర్థ జలాలు పేరుకుపోయాయి. ప్రమాదం జరిగిన పన్నెండేళ్లకు ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) అనుమతితో జపాన్‌లోని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) అణు జలాలను శుద్ధి చేసి పసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేసే వివాదాస్పద కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అణుజలాలతో సముద్రంలో జీవజాలం ప్రమాదంలో పడుతుందని, పర్యావరణానికి, మానవాళి ఆరోగ్యానికి ముప్పు ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నా జపాన్ ఆగడం లేదు. జపాన్ నుంచి దిగుమతయ్యే సముద్ర ఉత్పత్తులపై చైనా నిషేధం విధించింది. జపాన్, దక్షిణ కొరియాలో ఈ జలాల విడుదల ఆపాలంటూ నిరసనలు పెరుగుతున్నాయి. అణు జలాల శుద్ధి ఇలా..! ► రేడియో ధార్మికత కలిగిన వ్యర్థ జలాలను దశల వారీగా శుద్ధి చేస్తారు. అడ్వాన్స్డ్ లిక్విడ్ ప్రాసెసింగ్ సిస్టమ్ (ఎల్పీఎస్) ద్వారా తొలి దశలో శుద్ధి చేస్తారు. ► జలాల్లో ఉన్న 62 రకాల రేడియో ధార్మిక మూలకాలను ఎల్పీఎస్ శుద్ధి చేస్తుంది. కానీ ట్రిటియం మూలకాన్ని మాత్రం అది ఫిల్డర్ చేయలేదు. ► అందుకే నీటిలో ఈ ట్రిటియం మూలకాల సాంద్రతను తగ్గించడానికి నీళ్లను మరింతగా డైల్యూట్ చేసే ప్రక్రియ చేపట్టింది టెప్కో. ట్రిటియం సాంద్రతనుæ జాతీయ భద్రతా ప్రమాణాలు నిర్దేశించిన ప్రమాణాల కంటే 40% తక్కువగా నీటిని డైల్యూట్ చేస్తోంది. జపాన్ ఏమంటోంది ? ప్రపంచంలో ఏ అణు ప్లాంట్ అయినా వ్యర్థ జలాలను సముద్రంలోకి వదిలి పెట్టడం సాధారణంగా జరిగేదేనని ఇప్పుడే ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారని జపాన్ ప్రశి్నస్తోంది. సెసియం–137, స్ట్రాంటియం–90 కంటే ట్రిటియం వల్ల ముప్పు తక్కువేనని జపాన్‌లో నిపుణుల అభిప్రాయంగా ఉంది. ‘‘ట్రిటియం మూలకాలున్న నీళ్లని డైల్యూట్ చేసి సముద్రంలోకి విడిచిపెట్టడం వల్ల ప్రజల ఆరోగ్యానికి, పర్యవరణానికి ముప్పేమీ లేదు. అణుబాంబుల్ని పరీక్షించిన తర్వాత విడుదలయ్యే రేడియో ధార్మికత కన్నా శుద్ధి చేసిన అణుజలాల ద్వారా సముద్రంలో కలిసే రేడియో ధార్మికత అతి తక్కువ. ఇది కూడా కాలక్రమంలో క్షీణించిపోతుంది. దీని కోసం ఆందోళనలు అవసరం లేదు’’అని వియన్నా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రేడియాలజిస్టు జార్జ్ స్టెయిన్‌హాజర్ అభిప్రాయపడ్డారు. పొల్యూషన్‌కి సొల్యూషన్ అంటే డైల్యూషన్ అని ఇంగ్లిషులో అంటారని నీటిని శుద్ధి చేస్తూ పోతే హానికరం కాదని స్పష్టం చేశారు. ఆ జలాలు విషతుల్యమేనా ? ప్రపంచంలో ఇతర దేశాలు సముద్రంలోకి అణు జలాలు విడుదల చేసినా వారు తీసుకున్న జాగ్రత్తలు జపాన్ తీసుకోవడం లేదని పర్యావరణ పరిరక్షణ వ్యవస్థ గ్రీన్‌పీస్ ఆరోపిస్తోంది. ఈ వ్యర్థ జలాల్లో అత్యంత ప్రమాదకరమైన స్ట్రాంటియం–90 సహా మూలకాలున్నాయంటోంది. మరో మార్గం లేదా ? జపాన్ ప్రభుత్వం, టెప్కో అత్యంత వేగంగా, తక్కువ ధరకి అయిపోతుందని సముద్రంలోకి అణుజలాలను పంప్ చేస్తున్నారని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. ఈ జలాల నిల్వ కి మరిన్ని ట్యాంకుల్ని ఏర్పాటు చేయాలని, లేదంటే మరిగించి ఆవిరి రూపంలో వదుల్చుకోవాలని సూచిస్తున్నారు. ట్యాంకుల్లో నిల్వ ఉంచడాన్ని జపాన్ వ్యతిరేకించింది. భూకంపాలు అధికంగా వచ్చే ఆ ప్రాంతంలో ట్యాంకుల్లో భద్రపరిస్తే లీకయి భూగర్భంలో కలిస్తే మరింత ప్రమాదకరమని అంటోంది. ఇక నీళ్లను ఆవిరిగా మార్చడం, సముద్రంలోకి విడుదల చేయడం మధ్య పెద్దగా తేడాలేదని వాదిస్తోంది. మొత్తమ్మీద ఈ నీటి విడుదల కార్యక్రమం మున్ముందు ఎలాంటి ఉద్రిక్తతల్ని పెంచుతుందో వేచి చూడాలి. వ్యర్థ జలాలు ఎంత ఉన్నాయి ? ► ఫుకుషిమా–దైచీ అణు విద్యుత్ కేంద్రం ధ్వంసమైనప్పట్నుంచి అణు రియాక్టర్లను నిరంతరం చల్లగా ఉంచడానికి రోజుకి 170 టన్నుల నీటిని వాడాల్సి వస్తోంది. ► 13.4 కోట్ల టన్నుల వ్యర్థ జలాలు ఇప్పటికే పేరుకుపోయాయి. ► 1,046 ట్యాంకుల్లో వ్యర్థజలాలను భద్రపరిచారు. ► ఈ అణు జలాలను శుద్ధి చేసి వాటిలో రేడియో ధార్మికత తగ్గించి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ► విద్యుత్ ప్లాంట్ నుంచి సముద్రంలోకి ఒక కిలోమీటర్ సొరంగం తవ్వి ఆ మార్గం ద్వారా వదులుతున్నారు. ► ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి ఏకంగా 30 ఏళ్లు పడుతుందని ఒక అంచనా ► 2024 మార్చి నాటికి 31వేల టన్నులకు పైగా జలాలను సముద్రంలోకి పంపాలని నిర్వాహక సంస్థ టెప్కో ప్రణాళికలు వేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫ్యుకుషిమా నుంచి అణు జలాల విడుదల
ఒకుమా: జపాన్ను 12 ఏళ్ల క్రితం కుదిపేసిన పెను భూకంపం, సునామీతో దెబ్బ తిన్న ఫ్యుకుషిమా అణు ప్లాంట్ నుంచి వ్యర్థ జలాలను పసిఫిక్ సముద్రంలోకి విడుదల చేసే కార్యక్రమం మొదలైంది. ఇరుగు పొరుగు దేశాల నిరసనల మధ్య గురువారం నాడు తొలి విడతగా శుద్ధి చేసిన వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేసే ప్రక్రియను మొదలు పెట్టినట్టు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) ప్రకటించింది. వివిధ దశల్లో శుద్ధి చేసిన జలాలు అణు ప్లాంట్‌లోని కంట్రోల్ రూమ్ నుంచి విడుదల ప్రారంభానికి సంబంధించిన వీడియో కవరేజ్‌ను జపాన్ మీడియా లైవ్‌లో చూపింది. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు నీటి విడుదల కార్యక్రమం మొదలైనట్టుగా అణుప్లాంట్ ఆపరేటర్ చెప్పారు. ఈ అణు జలాల విడుదలపై సొంత దేశంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. నీటి విడుదలతో సముద్ర జలాలు విషతుల్యంగా మారి మత్స్య సంపదకు అపార నష్టం చేకూరుతుందని జపాన్, చైనా, దక్షిణకొరియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పర్యావరణం, మనుషుల ఆరోగ్యంపై దీని ప్రభావం ఉంటుందని జపాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అయితే జపాన్ ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంది. అణు ప్లాంట్‌ను మూసేయాలంటే జలాలు విడుదల చేయక తప్పదని స్పష్టం చేసింది. 13.4 కోట్ల టన్నుల వ్యర్థ జలాలు వెయ్యి ట్యాంకుల్లో భద్రపరిచామని, ఆ ట్యాంకులకు ప్రమాదమేదైనా జరిగితే మరింత ముప్పు వాటిల్లుతుందని టెప్కో పేర్కొంది. అణు జలాలను శుద్ధి చేసి అవి సురక్షితమని తేలాక విడుదల చేస్తున్నట్టు సెంటర్ ఫర్ రేడియేషన్ రీసెర్చ్ డైరెక్టర్ టోనీ హూకర్ చెప్పారు. జపాన్ సీఫుడ్‌పై నిషేధం: చైనా జపాన్‌ది పూర్తిగా స్వార్థపూరిత, బాధ్యతారహిత చర్య అని చైనా మండిపడింది. జపాన్ నుంచి సీఫుడ్‌పై నిషేధం విధించింది. జపాన్ చేస్తున్న పనితో సముద్రంలో మత్స్య సంపదకి, వాతావరణానికి ఎంత ముప్పు ఉంటుందో ఎవరూ అంచనా వేయలేరని ఒక ప్రకటనలో దుయ్యబట్టింది. జపాన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందంటూ వివిధ దేశాలు జలాల విడుదలను ఖండిస్తున్నాయి. -
Fukushima nuclear disaster: పసిఫిక్‌లో ‘అణు’ అలజడి
టోక్యో: జపాన్‌లో భూకంపంతో దెబ్బతిన్న ఫ్యుకుషిమా అణు రియాక్టర్ నుంచి వ్యర్థ జలాలను గురువారం నుంచి సముద్రంలోకి విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్లాంట్‌ను మూసివేయాలంటే వ్యర్థ జలాలను ఫసిఫిక్ మహా సముద్రంలోకి వదిలేయాక తప్పదని జపాన్ ప్రధాన మంత్రి ఫ్యుమియో కిషిదా మంగళవారం చెప్పారు. కేబినెట్ మంత్రులతో సమావేశమైన ఆయన ఈ వ్యర్థ జలాలను ప్రణాళికా బద్ధంగా సముద్రంలోకి పంపాలని ఇందు కోసం ప్లాంట్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలో పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల 24 నుంచి నీటి విడుదల కార్యక్రమం ప్రారంభమవుతుంది. 2011 మార్చి 11న సంభవించిన తీవ్రమైన భూకంపం అనంతరం ముంచెత్తిన సునామీకి ఈ ప్లాంట్ దెబ్బ తింది. అప్పట్నుంచి ఈ వ్యర్థ జలాలను జపాన్ నిల్వ చేసి ఉంచింది. కానీ ఇప్పుడు వాటిని నిల్వ చేయడానికి చోటు సరిపోక సముద్రంలోకి వదలాలని నిర్ణయించింది. ఈ నీటిని సముద్రంలోకి విడుదల చేయడంపై చుట్టుపక్కల దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. జపాన్ దగ్గర దాదాపుగా 13.4 లక్షల టన్నుల వ్యర్థ జలాలు ఉన్నాయి. వీటిని దశలవారీగా శుద్ధి చేసి సముద్రంలోకి వదులుతారు. ఇలా చెయ్యడానికి కనీసం 30 ఏళ్లు పడుతుందని అంచనా. ఈ నీళ్లను సముద్రంలోకి విడిచి పెట్టడం వల్ల మత్స్య సంపదకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నీటి విడుదలకి ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) ఇప్పటికే అంగీకరించింది. జపాన్ పసిఫిక్ సముద్రాన్ని తన సొంత మురికి కాల్వగా భావిస్తోందని చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు విమర్శిస్తున్నాయి. కార్చిచ్చును కేర్ చేయని ఇల్లు! హవాయి: అమెరికాలోని హవాయి దీవిలో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిలి్చంది. గత వందేళ్లలో ఇది అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తు అని స్థానికులు చెబుతున్నారు. కార్చిచ్చు ధాటికి వందలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. రిసార్ట్ నగరమైన ‘లాహైనా’ బూడిద కుప్పగా మారిపోయింది. ఇక్కడ దాదాపు అన్ని ఇళ్లు మంటల్లో చిక్కుకొని నేలమట్టమయ్యాయి. మంటల తీవ్రతకు వంద మందికిపైగానే మరణించారు. కానీ, ఒక ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా స్థిరంగా నిలిచి ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఇల్లు ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాహైనా సిటీలో రివర్ ఫ్రంట్ వీధిలో ఈ ఇల్లు ఉంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లన్నీ మంటల్లో కాలిపోయాయి. ఇదొక్కటే ఎప్పటిలాగే మెరిసిపోతూ కనిపిస్తోంది. ఇది నిజమేనా? ఫొటోలో ఏదైనా మార్పులు చేశారా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భవన యజమాని ట్రిస్ మిలికిన్ స్పందించారు. అది నిజమైన ఫొటో అని స్పష్టం చేశారు. 100 సంవత్సరాల క్రితం నాటి ఈ చెక్క ఇంటిని రెండేళ్ల క్రితం కొనుగోలు చేశామని, పాత పైకప్పును తొలగించి, లోహపు పైకప్పు వేయిచామని తెలిపారు. చుట్టుపక్కల గడ్డి లేకుండా బండలు పరిచామని వెల్లడించారు. ఈ జాగ్రత్తల వల్లే తమ ఇల్లు మంటల్లో చిక్కుకోలేదని పేర్కొన్నారు. కార్చిచ్చులో నిప్పు రవ్వలు తమ ఇంటిపై పడినా లోహపు పైకప్పు వల్ల ఎలాంటి నష్టం జరగలేదని ట్రిస్ మిలికిన్ వివరించారు. -
అరుదైన పరిశోధన: సైంటిస్టులకు పాముల సాయం
అణు ప్రమాదాలు కలగజేసే నష్టం మామూలుగా ఉండదు. రేడియేషన్ ప్రభావం కొన్ని వందల ఏళ్లపాటు ఆ ప్రాంతాలను పట్టి పీడిస్తుంది కూడా. ఉక్రెయిన్‌లో చెర్నోబిల్, జపాన్ ఫుకుషిమా అణు రియాక్టర్ల ప్రమాదాలు.. ఎంతటి నష్టాన్ని మిగిల్చాయో కళ్లారా చూసి ఉన్నాం. అలాంటప్పుడు ఇంక అక్కడ మనుషులు అడుగుపెట్టేది ఎప్పుడు? ఇది కనిపెట్టేందుకే సైంటిస్టులు పాముల సాయం తీసుకోబోతున్నారు. ఫుకుషిమా సైంటిస్టులు ఈ అరుదైన పరిశోధనలకు సిద్ధపడినట్లు ‘ఇచ్‌థైయోలజీ అండ్ హెర్పెటోలజీ’ అనే జర్నల్ కథనం ప్రచురించింది. అలాగని పాముల్ని హింసించడం లాంటివి చేయరు. సింపుల్‌గా వాటిని బయోఇండికేటర్లుగా ఉపయోగించుకుంటారు. సాధారణంగా మట్టి, గాలి, నీటితో మమేకమై ఉండే వృక్ష, జీవ రాశులన్నింటినీ బయోఇండికేటర్లుగానే గుర్తిస్తారు. వీటి జీవన విధానాన్ని పరిశీలిస్తూ.. అక్కడి పరిస్థితులను అంచనా వేస్తుంటారు. ఉదాహరణకు.. చెట్ల మీద మొలిచే నాచు, గాల్లో ఉండే విషవాయువుల మోతాదును ఇది సూచిస్తుంది. ఎలాగంటారా?.. గాలి నుంచే నాచుకి ఎక్కువ శక్తి లభిస్తుంది కాబట్టి. ఒకవేళ గాల్లో గనుక విష వాయువుల ప్రభావం ఎక్కువగా ఉంటే.. నాచు రంగు మారుతూ నాశనమవుతుంటుంది. చదవండి: వంద గ్రాముల విషంతో.. వంద మంది ఖతం! ఇప్పటిదాకా మొక్కలను, చెట్లను మాత్రమే బయోఇండికేటర్లుగా ఉపయోగించిన సైంటిస్టులు.. ఫస్ట్ టైం పాములపై ఈ ప్రయోగం చేస్తున్నారు. పాములను ప్రత్యేకించి జెర్రి పోతు(గొడ్డు) పాములను ఈ ప్రయోగాలకు వాడుకోబోతున్నారు. ఎందుకంటే.. ఇవి ఎక్కువ దూరం ప్రయాణించవు. మట్టితో బాగా కనెక్ట్ అయ్యి ఉంటాయి. పైగా దగ్గర దగ్గరగా జీవిస్తుంటాయి. అందుకే వీటిని ఎంచుకున్నారు సైంటిస్టులు. ఇక ఈ పరిశోధనలో.. ఫుకుషిమా రేంజ్లో బతుకుతున్న సుమారు 1700 పాముల్ని నిరంతరం పర్యవేకక్షించబోతున్నారు. వాటిపై రేడియేషన్ ప్రభావం, ఫుకుషిమా ప్రాంతంలో వాటి జీవనవిధానం ఆధారంగా రేడియేషన్ లెవల్‌ను లెక్కగడతారు. ఎప్పుడైతే మట్టిలో రేడియేషన్ ప్రభావం తగ్గుతుందో.. అవి అప్పుడు యాక్టివ్‌గా సంచరిస్తుంటాయి. అలా రేడియేషన్ ప్రభావాన్ని లెక్కగట్టబోతున్నట్లు ప్రొఫెసర్ హన్నా గెర్కె వెల్లడించారు. ఇక వీటి ట్రాకింగ్ కోసం జీపీఎస్ వ్యవస్థను ఉపయోగించబోతున్నారు. -
భారీ భూకంపం.. ముంచెత్తిన సునామి
-
భారీ భూకంపం.. ముంచెత్తిన సునామి
టోక్యో: తూర్పుఆసియాలోని ద్వీపదేశం జపాన్ను భారీ భూకంపం కుదిపేసింది. భూకంపానికి కొనసాగింపుగా సునామీ చెలరేగడంతో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 6:38కి జపాన్ ఈశాన్య తీరంలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో కొద్ది నిమిషాల వ్యవధిలోనే మీటరు ఎత్తున్న రాకాసి అలలు ఎగిసి ప్రఖ్యాత పుకుషిమా అణుశక్తి కేంద్రాన్ని ముంచెత్తాయి. పుకుషిమా నగరానికి 37 కిలోమీటర్ల దూరంలో 11.4 కిలోమీటర్ల లోతులో(ఫసిపిక్ సముద్రంలో) భూకంపకేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనలు వచ్చిన వెంటనే సునామీ హెచ్చరికలను జారీచేసిన ప్రభుత్వం.. అణుశక్తి కేంద్రంతోపాటు ఈశాన్య తీరంలోని గ్రామాలను త్వరితగతిన ఖాళీచేయించ ప్రయత్నం చేసింది. దేశ రాజధాని టోక్యోలో సైతం భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. నేటి సునామీతో నీటమునిగిన పుకుషిమా అణుశక్తి కేంద్రం.. 2011లోనూ తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. నాటి భూకంప విలయంలో 20 వేలమందికిపైగా మరణించారు. అణుకేంద్రాన్ని పునరుద్ధరించడానికి ఏళ్లు పట్టింది. కాగా, మంగళవారంనాటి భూకంపం, సునామీల కారణంగా ఎంత మంది చనిపోయారు, ఏ మేరకు నష్టం వాటిల్లిందో తెలియాల్సిఉంది. -
విషం కక్కుతున్న 'పుకుషిమా'
ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ నుంచి విడుదవుతున్న రేడియోధార్మికత వల్ల ఆ ప్లాంట్ ప్రాంగణంలోని నిల్వ చేసిన నీరు విషతుల్యంగా మారిందని జపాన్‌లోని అటామిక్ రెగ్యులేటరీ అండ్ అపరేటర్ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్థానిక పత్రిక మంగళవారం వెల్లడించింది. ట్యాంక్‌లోని ఆ నీరు సోమవారం ఉదయం నుంచి లీక్ అవుతుందని ప్లాంట్ ఉద్యోగులు వెల్లడిచారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ నీటిని డ్రైనేజి వ్యవస్థ ద్వారా పసిఫిక్ సముద్రంలోకి విడుదల చేయాలని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (టీఈపీసీఓ) భావిస్తునట్లు చెప్పింది. ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో రేడియోధార్మికత విడుదల అవుతున్న సందర్భాలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. అదీకాక 2011 మార్చిలో జపాన్‌లో సంభవించిన సునామీ, భూకంపం వల్ల ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్‌లో పేలుళ్లు సంభవించాయి. ఆ ఘటనతో ఆ ప్రాంతం నుంచి ఎంతో మంది స్థానికులు ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. అయితే దీంతో టీఈపీసీఓ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఫుకోషిమా న్యూక్లియర్ ప్లాంట్ నుంచి విడులవుతున్న రేడియోధార్మికత వల్ల ప్లాంట్ ప్రాంగణంలోని నీటి నిల్వలు విష తుల్యంగా మారాయని అటామిక్ రెగ్యులేటరీ అండ్ అపరేటర్ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ నీటిలో 50 సెంటీ మీటర్ల స్థాయి వరకు ఆ రేడియోధార్మితక వ్యాపించి ఉందని తెలిపింది. ఆ ప్లాంట్ నుంచి గంటకు 100 మిల్లిసివర్ట్స్ రేడియోధార్మికత విడుదలవుతోందని పేర్కొంది. దీంతో 120 లీటర్ల నీటి నిల్వలను పసిఫిక్ సముద్రంలోకి వదలాలని టీఈపీసీఓ భావిస్తుంది.